పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. రాష్ట్రంలోని జలంధర్, లూథియానాలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జలంధర్‌లో ‘ఢిల్లీ- అమృత్ సర్–కత్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఇంజినీర్లు, సిబ్బందిపై దాడులు, ప్రాజెక్టు క్యాంప్ ఆఫీసు పైనా, లుధియానాలోని స్టాఫ్ మీద దాడులు సంఘటనలపై భగవంత్ మాన్‌కు గడ్కరీ లేఖ రాశారు.
ఒకవేళ పంజాబ్‌లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడకపోతే రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 293 కిలోమీటర్ల పొడవుతో రూ. 14,288 కోట్లతో నిర్మించనున్న ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భారతీయ జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) రద్దు చేయడం గానీ, పూర్తిగా తొలగించడం గానీ చేస్తుందని తన లేఖలో హెచ్చరించారు.
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, సీఎం మన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత నెల 15న జరిగిన సమీక్షా సమావేశంలోనూ భూ సేకరణతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తమకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. కానీ, అందులో చెప్పుకోదగ్గ ప్రగతి కాన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment