Jalandhar
-
Punjab: హిందూ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి
జలంధర్: పంజాబ్(Punjab)లో ఇటీవలి కాలంలో గ్రనేడ్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జలంధర్‌లో హిందూనేత, యూట్యూబర్ రోజర్ సంఘూ ఇంటిపై గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్‌కు చెందిన డాన్ షహజాద్ ప్రకటన చేశారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నందున రోజర్ సంఘూ ఇంటిపై దాడి చేసినట్లు డాన్ షహజాద్ తెలిపాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హిందూవాదంపై ప్రచారం సాగించే రోజర్ సంఘూ ఒక వర్గాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నానే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే అతని ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో జలంధర్ పోలీసులు ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటనకు ముందు పంజాబ్‌లోని అమృత్సర్(Amritsar_ జిల్లాలోని ఖండ్వాలా ప్రాంతంలో శనివారం రాత్రి ఠాకుర్ద్వార్ ఆలయంపై గ్రనేడ్ దాడి జరిగింది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలయం వెలుపల ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది.సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 12:35 గంటలకు మోటార్ సైకిల్ ఇద్దరు యువకులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారి చేతుల్లో జండాలు ఉన్నాయి. కొద్దసేపు వారు ఆలయం ముందు అటుఇటు తిరిగాక, ఆలయంపైకి గ్రనేడ్లు విసిరారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలోనే ఆలయంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. ఈ సమయంలో ఆలయంలో పూజారి నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే పేలుడు కారణంగా ఆలయంలోని కొంత భాగం ధ్వంసం అయ్యింది. ఇది కూడా చదవండి: ర్యాపిడ్ రైలు కారిడార్‌పై వర్క్ స్పేస్.. ప్రయోజనమిదే.. -
వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్‌జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్జిత్కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్‌జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్‌జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది. जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025 VIDEO Credits: VeerArjunDainik -
తాతయ్య చివరి కోరిక కోసం..
‘అమ్మా... ఆ చెట్టును నువ్వొకసారి తాకి రావాలి’ అని కోరాడు ఆమె తాత చనిపోయే ముందు. అమ్మమ్మలు, తాతయ్యల మాటల్ని చాదస్తంగా తీసి పారేసేవారు ఉన్న ఈరోజుల్లో ఆ మనవరాలు తాత చివరి కోరిక నెరవేర్చడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది. దేశ విభజనకు ముందు తన తాత ఏ చెట్టునైతే పొలంలో తన నీడగా చేసుకున్నాడో ఆ చెట్టును తాకింది.తన పూర్వీకుల స్వగ్రామంలోని మట్టిని మూట గట్టుకుంది. ఇంకా అక్కడే ఉన్న తన వాళ్లను చూసి ఆనందబాష్పాలు రాల్చింది. పెద్దవాళ్ల గుండెల్లో గాఢంగా కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని వారు జీవించి ఉండగానే నెరవేరిస్తే ఆనందం. మరణించాక నెరవేరిస్తే మనశ్శాంతి.‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చి, ఇంత పేరు గడించినా సినీ కవి గుల్జార్‌కి గుండెలో ఒక కోరిక ఉండిపోయింది. అది పాకిస్తాన్‌లోని తన పూర్వీకుల సొంత ఊరిని చూసి రావాలనేది. ఒకటి రెండుసార్లు ప్రయత్నించినా అతనికి అనుమతి దొరకలేదు. చనిపోయేలోపు చూస్తానో లేదో అంటాడాయన. దేశ విభజన వల్ల రాత్రికి రాత్రి కుటుంబాలు చెదిరిపోయి కొందరు ఇండియా చేరారు... కొందరు పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. ఇరు దేశాలలో సెటిల్ అయిన వారి తలపోతల గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. రాకపోకలు జటిలం అయ్యాక ఇక బంధాలు ఫోన్లకు పరిమితం అయ్యాయి. పంజాబీలు అధికంగా ఈ ఎడబాటును భరించారు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల వయసున్న రీనా చిబ్బేర్ అనే ఆమె ‘రావల్పిండిలో మా పూర్వీకుల ఇల్లు చూసి రావడానికి అనుమతి ఇవ్వండి’ అని వేడుకుంటే ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆమె ఎంతో సంబరంగా వెళ్లడం ప్రధాన వార్తాంశం అయ్యింది. అయితే దేశ విభజన సమయంలో జలంధర్‌కు వచ్చి స్థిరపడిన బహదూర్ సింగ్‌కి మాత్రం అలాంటి కోరిక నెరవేరలేదు. 1947లో అతను తన చిన్న తమ్ముణ్ణి తీసుకుని ఇండియా వచ్చేశాడు. నడిమి తమ్ముడు అక్కడే ఉండిపోయాడు. ‘మా తాత చనిపోయే వరకూ కూడా పాకిస్తాన్లో ఉన్న తమ్ముణ్ణి గుర్తు చేసుకుని ఏడ్చేవాడు. ఆ అన్నదమ్ములు మళ్లీ జీవితంలో కలవకుండానే కన్ను మూశారు’ అని తెలిపింది కరమ్‌జిత్ కౌర్. ఆమె ఇటీవలే తాత కోరిక నెరవేర్చడానికి పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్‌కు దగ్గరగా ఉన్న తమ పల్లెను దర్శించింది.ఆ ఇల్లు... ఆ చెట్టు‘మా తాతది సియోల్‌కోట్ దగ్గర ఉన్న పల్లెటూరు. ఆయన పొలంలో పెద్ద రావిచెట్టు ఉంది. ఆ ఇంటిని, చెట్టును ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. వాటి గురించి కథలు కథలు చెప్పేవారు. ఆ చెట్టును ఒకసారి తాకి రావాలి. తల్లీ అనేవారు నాతో. జలంధర్ వచ్చేశాక ఆయన తన తమ్ముడికి ఎన్నో ఉత్తరాలు రాశారు. కానీ 1986లో గాని వాటికి జవాబు రాలేదు. అప్పటికే మా తాత నడిమి తమ్ముడు ఇస్లాంలోకి మారాడు. అయితే మా ఇంటి పేరును ‘గుమర్’ని వదలకుండా తన పేరు గులామ్ ముహమ్మద్ గుమర్ అని పెట్టుకున్నాడు. ఆ ఇంటిని ఆ చెట్టును అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయాక ఆయన కొడుకు కుటుంబం మా జ్ఞాపకాలను పదిలంగా ఉంచిందని అర్థమయ్యాక ఎలాగైనా వెళ్లాలని తాతయ్య కోరిక నెరవేర్చాలని నిశ్చయించుకున్నాను’ అంది కరమ్‌జిత్ కౌర్.ఘన స్వాగతం‘నేను పాకిస్తాన్ వెళుతున్నానంటే మా అత్తగారి కుటుంబం వద్దంటే వద్దంది. నాక్కూడా చాలా భయాలు కలిగాయి. కాని అక్కడ నేను అడుగు పెట్టగానే మా నడిమి తాత కుమారుడు నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. నా పెళ్లి కార్డు జాగ్రత్తగా దాచుకుని ఉన్నారు. మా తాత రాసిన ఉత్తరాలు ఉన్నాయి. అప్పట్లో మా ఇంట్లో వాడిన తిరగలి అలాగే ఉంది. మా పొలంలో రావిచెట్టు సంగతి చెప్పనక్కర్లేదు. కళకళలాడుతోంది. మా బంధువులు, రక్త సంబంధీకులు అందరూ కన్నీటి పర్యంతం అయ్యి మర్యాదలు చేశారు. మా వూరి మట్టి తీసుకుని తిరిగి వస్తున్నాను’ అని తెలిపింది కరమ్‌జిత్ కౌర్.కష్టసాధ్యమైన తాత కోరికను కొద్దిగా అయినా తీర్చిందీ మనవరాలు. ‘ఒరేయ్... కాశీ చూపించరా’, ‘మా ఊరు చూపించరా’, ‘ఫలానా బంధువు ఇంటికి తీసుకెళ్లరా’ అని పెద్దవాళ్లు కోరితే కాదనవద్దు. ఆ కోరిక లోతు మనకు తెలియదు. చెప్పినా అర్థం కాదు. చేయవలసిందల్లా కోరింది తీర్చడమే.కుటుంబాలు కలిపే సంస్థతాత మరణించాక లండన్‌లో స్థిరపడిన కరమ్‌జిత్‌కు... కఠినమైన వీసా నియమాల వల్ల పాకిస్తాన్‌కు వెళ్లడం అంత సులువు కాలేదు. అయితే దేశ విభజన సమయంలో విడిపోయిన పంజాబీ కుటుంబాలను తిరిగి కలిపేందుకు ‘జీవే సంఝా పంజాబ్’ పేరుతో ఒక సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ ప్రయత్నంతో వాఘా బోర్డర్ మీదుగా పాకిస్తాన్లోకి అడుగు పెట్టేందుకు కరమ్‌జిత్ కౌర్‌కు అనుమతి లభించింది. ‘నేను పాకిస్తాన్‌కు వెళుతున్నానని తెలిసి మా చిన్నతాత కుమారుడు తనని కూడా తీసుకెళ్లమని ఎంతో ఏడ్చారు. కాని ఆయన వయసు రీత్యా వీల్‌చైర్‌లో ఉన్నారు. నీ కోసం మన ఊరి మట్టి తీసుకొస్తానులే పెదనాన్నా అని చెప్పి వచ్చాను’ అంటుందామె భావోద్వేగంతో. -
సీఎం భగవంత్ మాన్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరిక
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. రాష్ట్రంలోని జలంధర్, లూథియానాలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జలంధర్‌లో ‘ఢిల్లీ- అమృత్ సర్–కత్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఇంజినీర్లు, సిబ్బందిపై దాడులు, ప్రాజెక్టు క్యాంప్ ఆఫీసు పైనా, లుధియానాలోని స్టాఫ్ మీద దాడులు సంఘటనలపై భగవంత్ మాన్కు గడ్కరీ లేఖ రాశారు.ఒకవేళ పంజాబ్‌లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడకపోతే రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 293 కిలోమీటర్ల పొడవుతో రూ. 14,288 కోట్లతో నిర్మించనున్న ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భారతీయ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) రద్దు చేయడం గానీ, పూర్తిగా తొలగించడం గానీ చేస్తుందని తన లేఖలో హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, సీఎం మన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిందితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గత నెల 15న జరిగిన సమీక్షా సమావేశంలోనూ భూ సేకరణతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తమకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. కానీ, అందులో చెప్పుకోదగ్గ ప్రగతి కాన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు. -
ఆప్ ఖాతాలో పంజాబ్ అసెంబ్లీ సీటు
ఇటీవల పంజాబ్‌లోని ఒక శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితం వెలువడింది. జలంధర్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 13 దశల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మొహిందర్ భగత్ బీజేపీ అభ్యర్థి శీతల్ అంగురాల్‌పై విజయం సాధించారు.మొహిందర్ భగత్ 37325 ఓట్లతో విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శీతల్ అంగురాల్ రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థి సురీందర్ కౌర్ మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం జలంధర్‌లోని మొహిందర్ భగత్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి మొహిందర్ భగత్ ముందంజలో ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సూర్జిత్ కౌర్ నాలుగో స్థానంలో ఉండగా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి బిందర్ కుమార్ ఐదో స్థానంలో నిలిచారు.ఆప్ ఎమ్మెల్యే అంగురల్ రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ అయ్యింది.ఈ నేపధ్యంలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. జలంధర్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జూలై 10న పోలింగ్ జరగగా, 54.98 శాతం ఓటింగ్ నమోదైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో 67 శాతం ఓటింగ్ నమోదయ్యింది. -
ఎలాగైనా ఆ సీటు మళ్లీ గెలవాల్సిందే: సీఎం
జలంధర్: లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదివారం జలంధర్‌లోని స్థానిక హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రి బల్కర్ సింగ్, నకోదర్ ఎమ్మెల్యే ఇంద్రజిత్ కౌర్, జలంధర్ సెంట్రల్ ఎమ్మెల్యే రమణ్ అరోరా, జలంధర్ లోక్‌సభ సీటు పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల ముగ్గురు ఇన్ఛార్జ్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ మార్చి 14న జలంధర్ అభ్యర్థిగా తమ సిట్టింగ్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూను ప్రకటించింది. అయితే, రింకూ మార్చి 27న పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. రింకూతో పాటు ఆప్ జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్ కూడా రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరారు. గత ఏడాది జరిగిన జలంధర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో రింకు 58,691 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆయన దోబా ప్రాంతంలో కీలక దళిత నాయకుడిగా ఎదిగారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా భావించే దళితుల ప్రాబల్యం ఉన్న జలంధర్ పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి సమిష్టి కృషి చేయాలని సీఎం భగవంత్ మాన్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. "జలంధర్ లోక్‌సభ స్థానంపై దృష్టి అంతా ఉంది. పార్టీ ఎలాగైనా ఈ సీటును మళ్లీ గెలవాలనుకుంటోంది" అని సీఎం మాన్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. -
ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్!
దేశమంతా సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైపోయింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలి దశ పోలింగ్‌కు అప్పుడే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 72 రోజులు ఉన్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జలంధర్‌లోని ఒక హోటల్లో రోజంతా గడిపినట్లు తెలిసింది. ‘ది ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు హోటల్ రాడిసన్‌కు వచ్చిన సీఎం దాదాపు 24 గంటల తర్వాత బుధవారం వెళ్లిపోయారు. జలంధర్ ఎంపీ సుశీల్ రింకూను ఆయన మంగళవారం కలిశారు. ఇక బుధవారం ఆయన ఎంపీ బల్బీర్ ఎస్ సీచెవాల్, స్థానిక సంస్థల మంత్రి బల్కర్ సింగ్‌ను మాత్రమే కలిశారు. అది కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో. ఆ తర్వాత ఆయన వెంటనే వెళ్లిపోయారు. “సీఎం విశ్రాంతి మోడ్‌లో ఉన్నారని, ఎన్నికల వాతావరణం వేడెక్కడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులతో సమావేశానికి, మా అభిప్రాయాన్ని తీసుకోవడానికి, ఎన్నికల వ్యూహానికి సంబంధించి సూచనలు ఇవ్వడానికి ఆయన ఒక గంట లేదా రెండు గంటలు కేటాయించి ఉంటారు” అని సీనియర్ నాయకుడొకరు చెప్పినట్లుగా కథనంలో పేర్కన్నారు. -
చిన్న వివాదం.. ఆ డీఎస్పీ ప్రాణం తీసింది!
ఛండీగఢ్: చిన్న వివాదం పంజాబ్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఓ ఆటోడ్రైవర్‌తో గొడవ కారణంగానే ఆయన ప్రాణం పోయింది. అయితే.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు జలంధర్ పోలీసులు. అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారి(డీఎస్పీ స్థాయి) దల్బీర్ సింగ్ డియోల్ (54)హత్యకు గురికావడం పంజాబ్‌లో అలజడి రేపింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓ ఆటో డ్రైవర్ అని, అతనితో దల్బీర్ వాగ్వాదానికి దిగడమే హత్యకు కారణమైందని చివరకు పోలీసులు నిర్ధారించారు. ఏం జరిగిందంటే.. దల్బీర్ సింగ్ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ బయటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో తనను ఇంటి దగ్గర దింపాలని సదరు ఆటో డ్రైవర్‌ను కోరారు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణగా మారే క్రమంలో.. దల్బీర్ దగ్గర ఉన్న సర్వీస్ తుపాకీని లాక్కుని ఆ డ్రైవర్ కాల్పులు జరిపాడు. దాంతో దల్బీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆపై జలంధర్ నగర శివారులో ఓ కాలువ సమీపంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు జుగల్ కిషోర్ అనే పోలీసాధికారి ఆ మృతదేహాన్ని మొదటగా గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు మొదలైంది. ఛేదించారిలా.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. ఓ ఆటోను గుర్తించారు. దాని నెంబర్ ప్లేట్ ఆధారంగా.. అక్కడి నుంచి ఉన్న మూడు దారుల్లో ట్రేస్ చేసే యత్నం చేశారు. అదే సమయంలో ఆ కాలువకు దగ్గర్లోని టవర్‌కు వచ్చిన మొబైల్ సిగ్నల్స్ ఆధారంగానూ సమాంతరంగా దర్యాప్తు కొనసాగించారు. చివరకు నిందితుడిని ఆటో డ్రైవర్ విజయ్ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఆసియా క్రీడల్లో దల్బీర్ వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని సాధించారు. అందుకే 2000లో ఆయనను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. అనంతరం ఆయన పోలీసుశాఖలో చేరారు. -
పంజాబ్‌లో విషాద ఘటన.. ఇంటిల్లిపాదీ సరదాగా క్రికెట్ మ్యాచ్ చూస్తూండగా.. అకస్మాత్తుగా..
-
రోడ్డుకు అడ్డంగా పడుకుని పోలీసు వినూత్న నిరసన.. ఏం జరిగిందంటే?
ఛండీఘర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల అవినీతిని భరించలేక.. ఓ హోంగార్డ్ వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసనకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ హోంగార్డ్.. తోటి పోలీసులు అవినీతి చూసి తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో హైవేకు అడ్డుగా ఓ తాడు కట్టి వాహనాలను నిలిపివేశాడు. అనంతరం.. రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. ‘నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు’ అంటూ భోగ్పూర్ ప్రాంతంలో పఠాన్‌కోట్ హైవేపై నిరసనకు దిగాడు. ఇది చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో అక్కడే మరో పోలీసు అధికారి.. నిరసనకు దిగిన హోంగార్డ్ను పైకిలేపే ప్రయత్నం చేశాడు. హోంగార్డ్ వినకపోవడంతో అతడిని కాలితో తన్నాడు. దీంతో, ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఇక, ఈ ఘటనపై భోగ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి సుఖ్జిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక గొడవకు సంబంధించి ఓ యువకుడిని హోంగార్డు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. అది మంజూరు చేయబడింది. దీని తర్వాత అతను విడుదలయ్యాడు. హోంగార్డు జవాన్‌ను తన్నలేదని సుఖ్జిత్ సింగ్ పేర్కొన్నారు. ‘Jehra mai chor fad ke liauna oh Thane Wale paise laike chadi jande’ रिश्वतखोरी से दुखी हो कर पुलिस मुलाजिम ने #jalandhar के भोगपुर में रोड जाम कर विरोध प्रदर्शन किया। #PunjabPolice pic.twitter.com/QyajO37Cvd — Harpinder Singh (@HarpinderTohra) July 22, 2023 ఇది కూడా చదవండి: బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్ అరెస్ట్ -
ByPolls: ఉప ఎన్నికల్లో ప్రభావం చూపని బీజేపీ
ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ వెలువడ్డాయి. అయితే.. ఈ ఫలితాల్లోనూ కమలం పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. పంజాబ్ లోని జలంధర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ విజయం సాధించారు. కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింగ్ మరణంతో జలంధర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిపారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌కు పెద్దదెబ్బ పడినట్లయ్యింది. ఇక ఒడిశాలోని జార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేడీ (బిజూ జనతాదళ్) విజయం సాధించింది. బీజేడీ అభ్యర్థి దీపాలీ దాస్ గెలిచారు. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని బిజూ జనతాదళ్ నిలబెట్టుకుంది. ఇక, ఉత్తరప్రదేశ్‌లో సువార్, ఛన్బే అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించారు. రెండు చోట్లా అప్నాదళ్ (సోనేలాల్)నే విజయం వరించింది. అప్నాదళ్.. అక్కడ అధికార బీజేపీకి భాగస్వామిగా ఉంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్ తనయుడు అబ్దుల్లా అజామ్ ఖాన్ కు కోర్టు 15 ఏళ్ల నాటి కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో సువార్ లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఛన్బే నియోజకవర్గంలో రింకీ కోలే గెలిచారు. -
పప్పాల్‌ప్రీత్ సింగ్ అరెస్ట్.. ఇక అమృత్‌పాల్ దొరికినట్టేనా?
ఛండీఘర్: ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు సహా భద్రతా బలగాలు గాలిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే అమృత్‌పాల్ సిక్కులతో సమావేశమవుతారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, అమృత్‌పాల్ సింగ్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పప్పాల్‌ప్రీత్ సింగ్‌ను పంజాబ్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కాగా, గత నెలలో వీరిద్దరూ పారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్ పోలీసులు పప్పాల్ సింగ్‌ను హోషియార్‌పూర్‌లో పట్టుకున్నారు. ఇక, అమృత్‌పాల్‌తో పాటు పప్పాల్‌సింగ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అతను చిక్కినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. అమృత్‌పాల్ సింగ్, పప్పాల్ సింగ్ కలిసి జలంధర్, హోషియార్పూర్, అమృత్సర్ జిల్లాల్లో ఆశ్రయం పొందారు. వీరిద్దరూ ఫగ్వారా పట్టణం, నాద్లోన్, బీబీ గ్రామంలోని మూడు వేర్వేరు డేరాలలో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం.. మార్చి 18వ తేదీ నుంచి అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. Source: Fugitive Amritpal's close aide Papalpreet Singh arrested from Hoshiarpur in a joint operation by Punjab Police and Punjab Counter Intelligence. pic.twitter.com/sBvQKqM8mI — Nikhil Choudhary (@NikhilCh_) April 10, 2023 -
పంజాబ్‌లో హైటెన్షన్.. అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్
ఛండీఘర్: పంజాబ్‌లో హైటెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్ పోలీసులు ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని పలు జిల్లాల్లో పోలీసులు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. వివరాల ప్రకారం.. ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు జలంధర్‌లో శనివారం అరెస్ట్ చేశాడు. దాదాపు 50 పోలీసులు వాహనాలు అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ సింగ్ అనుచరులు దాడులకు, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాల్లో పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే, భద్రతను పటిష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్ సింగ్ ‘వారిస్ పంజాబ్ దే’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ద్వారా పంజాబ్‌లో ఖలిస్తాన్ అనుకూల భావజాలాన్ని పోత్సహిస్తున్నాడు. దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో పోలీసులు అతడిపై నిఘా వేశారు. ఈ క్రమంలో అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఇటీవలే అమృత్‌పాల్ సింగ్ దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని పోలీసులకే సవాల్ విసిరాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌తో సహా అతడి అనచరులు ఆరుగురిని జలంధర్‌లో అరెస్ట్ చేశారు. అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో అలర్ట్ అయిన పంజాబ్ పోలీసులు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా చదవండి: అస్సాంలోని మదర్సాలన్నిటినీ మూసేస్తాం -
Crime: ఆ అమ్మాయిలు నన్ను గ్యాంగ్‌రేప్ చేశారు!
క్రైమ్: దేశవ్యాప్తంగా వరుసగా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక నేరం జరిగిన తీరు.. సంఘంలోని పరిస్థితులపై తీవ్రస్థాయి చర్చకు దారి తీస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌లో జరిగిన ఓ వివాహితుడి గ్యాంగ్ రేప్ ఘటన పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి.. తనను నలుగురు అమ్మాయిలు గ్యాంగ్ రేప్ చేశారంటూ మీడియాకు ఎక్కాడు. కారులో వచ్చిన నలుగురు అమ్మాయిలు.. తనపై మత్తు మందు చల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారని వాపోయాడతను. వాళ్లంతా పెద్దింటి అమ్మాయిల్లాగా ఉన్నారని, ఇంగ్లీష్‌తో పాటు పంజాబీలో మాట్లాడారని చెప్పాడతను. తనను అపస్మారక స్థితికి తీసుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయాడు. ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీయడంతో.. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడి కథనం ప్రకారం.. సదరు వ్యక్తి కూలీ పనులు చేసుకుంటున్నాడు. సోమవారం పని ముగిశాక కపుర్తలా రోడ్లో ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో తెల్ల కారు ఒకటి వచ్చి ఆగింది. అడ్రస్ చెప్పమంటూ ఓ చీటి చూపించారు కారులో ఉన్న అమ్మాయిలు. వెంటనే అతని కళ్లలో ఏదో కెమికల్ చల్లగా.. అతను స్పృహ కోల్పోయాడు. ఆపై కారులో అతని కాళ్లు చేతులు కట్టేసి.. కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. ఆపై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ప్రతిఘటించేందుకు వీళ్లు లేకుండా అతనికి ఏవో ఇంజెక్షన్లు ఇచ్చి.. బలవంతంగా మందు తాగించారు. ఆపై ఆ నలుగురు అమ్మాయిలు ఆ వ్యక్తిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘాతుకం తర్వాత అర్ధరాత్రి సమయంలో తిరిగి అతన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న అతను.. భార్యకు జరిగిన విషయం చెప్పాడు. భార్యాబిడ్డలు ఉండడంతో పరువు పోతుందనే భయంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే భార్య బలవంతం మేరకు స్థానిక మీడియా ముందుకు వచ్చి తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ కథనాలు సంచలనం సృష్టించడంతో పంజాబ్ పోలీసు నిఘా విభాగం సుమోటోగా కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించింది. ఇదీ చదవండి: ప్రతి 11 నిమిషాలకు.. ఒక యువతి బలి! -
Varinder Singh: భారత హాకీ దిగ్గజం కన్నుమూత
ఒలంపిక్ పతక విజేత, వరల్డ్‌కప్ సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడైన వారీందర్ సింగ్(75) కన్నుమూశారు. స్వస్థలం జలంధర్‌లో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వారీందర్ సింగ్ మరణం పట్ల హాకీ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ఈ సందర్భంగా వారీందర్ సింగ్ లేని లోటు పూడ్చలేనిదంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. పాకిస్తాన్‌పై విజయంలో భాగస్వామిగా.. 1947లో పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన వారీందర్ సింగ్ హాకీపై మక్కువ పెంచుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత హాకీ జట్టులో చోటు సంపాదించారు. హాకీ వరల్డ్‌కప్-1975 టోర్నీలో పాకిస్తాన్‌ను 2-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు. అదే విధంగా... 1972 నాటి మ్యూనిచ్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అంతేగాక 1973లో ప్రపంచకప్‌లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు. ఇక 1974, 1978 ఏసియన్ గేమ్స్‌లో రజతం గెలిచిన భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. కాగా హాకీ ఆటగాడిగా క్రీడా రంగానికి చేసిన సేవకు గానూ 2007లో ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్ జీవన సాఫల్య పురస్కారాన్ని వారీందర్ సింగ్ అందుకున్నారు. చదవండి: India T20 Captain: అలా అయితే రోహిత్ స్థానంలో ఇకపై అతడే టీ20 కెప్టెన్! In light of the tragic passing of the great Hockey player Shri Varinder Singh, we pray to the Almighty to grant the departed person's soul eternal rest and to provide the family members the fortitude to endure this irreparable loss. 🙏🏻 pic.twitter.com/s7Jb5xH0e3 — Hockey India (@TheHockeyIndia) June 28, 2022 -
పంజాబ్ పర్యటనలో చేదు అనుభవం.. మరోసారి గుర్తు చేసుకున్న మోదీ
జలంధర్: పంజాబ్ గత పర్యటనలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మరోమారు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. స్థానిక అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో గతంలో తాను జలంధర్ ఆలయాన్ని దర్శించుకోలేకపోయానని చెప్పారు. కాంగ్రెస్ పాలనలోని పంజాబ్‌లో పరిస్థితులు ఇలా తయారయ్యాయని ఆయన విమర్శలు గుప్పించారు. త్వరలో తాను మరలా జలంధర్ వచ్చి దేవీ తాలబ్ మందిర్‌ను తప్పక దర్శించుకుంటానన్నారు. ఎన్నికల సందర్భంగా నగరంలో ఆయన ర్యాలీ నిర్వహించారు. జనవరి 5న పంజాబ్ వచ్చిన పీఎం కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్‌పై చాలాసేపు నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని పంజాబ్ రావడం ఇదే తొలిసారి. జనవరిలో తాను గుడికి వెళ్లాలని చెప్పగా అధికారులు తనను వెంటనే హెలికాప్టర్లో వెనక్కుపొమ్మన్నారని, పంజాబ్‌లో ప్రభుత్వ పనితీరు ఇలా ఉందని ఆయన ర్యాలీలో దుయ్యబట్టారు. పంజాబ్‌లో కాంగ్రెస్ క్షీణిస్తోందని, ఆ పార్టీ నాయకులే పార్టీ బలహీనతలు బయటపెడుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. చదవండి: (Punjab Assembly Election 2022:సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు) ట్రిపుల్ తలాక్ రద్దుతో వేలాదిమందికి రక్షణ తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడంతో వేలాది మంది ముస్లిం మహిళలకు రక్షణ లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. యూపీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల ముస్లిం యువత నిర్భయంగా తిరగగలుగుతున్నారని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన దుయ్యబట్టారు. హిందూ ఓట్లను విడగొట్టేందుకే తాము గోవాలో పోటీ చేస్తున్నామన్న టీఎంసీ నేత ప్రకటనను ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని యూపీ ప్రజలు గర్తు పెట్టుకోవాలన్నారు. -
Punjab Election 2022: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన
-
ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు.. చదువు, చావు!
ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి చదువు, రెండవది చావు. చదువుకన్నా ముందు ‘చావు’కు సంబంధించిన ఆలోచనలు పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన నేహాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ‘ఇక ఈలోకంలో నేను ఉండలేను’ అనుకుంది ఆమె గట్టిగా. అదే సమయంలో తన బాల్యంలోని కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి. ‘మీ అమ్మాయి తెలివైనది. బాగా చదివించండి’ అని టీచర్లు తన తల్లిదండ్రులతో చెప్పేవాళ్లు. లాయర్ కావాలనేది తన కల. అయితే చిన్న వయసులోనే నేహకు పెళ్లి కావడంతో ఆ కల చెదిరిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత భర్త వేరే అమ్మాయితో సహజీవనం చేస్తూ తనను ఒంటరి చేశాడు. అత్తవారి నుంచి కూడా తనకు మద్దతు కరువైంది. పైగా సూటిపోటి మాటలు. పుట్టింటికి వెళదామా అంటే... పాపం వారి పరిస్థితి అంతంత మాత్రమే. వారికి తాను భారంగా ఉండదల్చుకోలేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల్లోకి వెళ్లింది. అయితే ఈ ప్రతికూల ఆలోచనలు కొద్దిసేపే. ‘నాకో కల ఉంది. ఆ కలను నెరవేర్చుకోవడానికి బతకాలి’ అని గట్టిగా అనుకుంది నేహ చిన్నాచితకా పనులు చేస్తూ ఆగిపోయిన చదువును కొనసాగించింది. దూరవిద్యా విధానంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత... ఎల్ఎల్బీలో అడ్మిషన్ పొందింది. ఆరోజు తన జీవితంలో మరిచిపోలేని రోజు. ఎంత సంతోషించిందో! అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒక కంపెనీలో ఉద్యోగం చేసేది నేహ. అయితే కోవిడ్ వేవ్‌లో ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. వేరే కంపెనీలో ఉద్యోగం వెదుక్కోవడానికి కాలికి బలపం కట్టుకొని తిరిగింది. (క్లిక్: జీవితాన్ని మలుపు తిప్పిన కెమెరా: మాయ ముక్తై) ‘ఉన్న ఉద్యోగులనే వద్దంటున్నాం. కొత్త ఉద్యోగాలు ఎక్కడివి’ అనే మాటలు వినిపించాయి. ఒకవైపు తాను చదువుకోవాలి, దానికి ముందు తాను బతకాలి! ఒకరోజు తనకు ఒక మార్గం తోచింది. బజ్జీ, దోసె, పరోటా... ఇలా రకరకాల టిఫిన్లు తయారుచేసి అమ్మాలని నిర్ణయించుకుంది. నిజానికి వాటి తయారీ, రుచుల గురించి తనకు పెద్దగా తెలియదు. తెలిసిన వారి దగ్గరకు వెళ్లి ఓపిగ్గా నేర్చుకుంది. జలంధర్‌లోని ఒక ఆస్పత్రికి సమీపంలో చిన్నగా టిఫిన్ స్టాల్ మొదలుపెట్టింది. ఉల్లిగడ్డలు తరగడం నుంచి పాత్రలు తోమడం వరకు అన్నీ తానే చేసేది. కొద్దిరోజులలోనే టిఫిన్ సెంటర్ పాపులర్ అయింది. ఇప్పుడు తాను ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగంతో వచ్చే జీతం కంటే ఇప్పుడే ఆదాయం ఎక్కువగా వస్తుంది. ‘లా’ పూర్తి చేసి మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకోవాలనేది నేహ ఆశయం. ‘స్త్రీలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి లాయర్‌గా అండగా నిలవాలనుకుంటున్నాను’ అంటుంది నేహ. -
హ్యాట్సాఫ్: మన రోడ్లకు తగ్గట్లు సెల్ఫ్ డ్రైవింగ్ బండి!
సెల్ఫ్ డ్రైవింగ్ బండ్లు.. ఈ పేరు వినగానే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు ఎలన్ మస్క్. అమెరికన్ కంపెనీ టెస్లా ద్వారా ఎలక్ట్రికల్ బండ్లను అందిస్తూ.. సెల్ఫ్ డ్రైవింగ్ సాంకేతికతపై చర్చతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడాయన. అమెరికాలో వరకైతే ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ ఓకే. కానీ, ట్రాఫిక్ రద్దీ, ఇతరత్రా సమస్యలుండే మన దేశంలో అది కుదిరే పనేనా?. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది మైనస్ జీరో. ఛండీగఢ్: ఒకదాని వెనుక ఒక వాహనం, గుంతలతో వికారంగా మారిన రోడ్లు, అడ్డదిడ్డంగా దూసుకొచ్చే వాహనాలు.. మన రోడ్ల స్థితికి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కష్టతరం అనేది నిపుణుల మాట. కానీ, సాంకేతికతో పని లేకుండా.. కామన్సెన్స్ను ఉపయోగించి వెహికిల్స్‌ను రూపొందించే పనిలో పడింది మైనస్ జీరో స్టార్టప్. జలంధర్(పంజాబ్)కు చెందిన ఈ స్టార్టప్ గత రెండేళ్లుగా మన రోడ్లకు సరిపోయే రీతిలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్ టెక్నాలజీని రూపొందించే పనిలో మునిగింది. అంతేకాదు ప్రయోగాత్మకంగా ఓ ఆటోను డెవలప్ చేసి రోడ్ల మీదకు వదిలింది కూడా. ఎలా పని చేస్తుందంటే.. మైనస్ జీరో తయారు చేసిన బండి ఏఐ టెక్నాలజీపై తక్కువ ఆధారపడుతూ పూర్తి ఆటానమస్ సిస్టమ్‌తో నడుస్తుంది. తద్వారా భద్రతా పరమైన సమస్యలు ఉండవని, ట్రాఫిక్‌కు తగ్గట్లు ప్రయాణం సాఫీగా సాగుతుందని, రోడ్లకు తగ్గట్లు ప్రయాణాన్ని మలుచుకోవచ్చని మైనస్ జీరో సీఈవో, సహ వ్యవస్థాపకుడు గగన్‌దీప్ రీహల్ వెల్లడించాడు. కంట్రోల్ యూనిట్స్‌తో పనిచేసే ఈ ‘ఈ-వెహికిల్ ఆటోరిక్షా’ను గగన్‌దీప్ టీం నెలలు శ్రమించి రూపొందించింది. ‘బిలియన్ల ఖర్చుతో, అత్యాధునిక సాంకేతికతతో వాళ్లు వాహనాలు రూపొందిస్తున్నారు. కానీ, ప్రాక్టీకల్‌గా మన రోడ్లకు ఆ టెక్నాలజీ సరిపోతుందా? అనే ప్రశ్న అందరిలో ఉంది. అయితే హంగుల కన్నా భద్రత, తక్కువ ఖర్చులో పని జరగడం మనకు ముఖ్యం. అందుకే లో-టెక్నాలజీతో ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్‌ను రూపొందించింది మా బృందం’ అని గగన్‌దీప్ వెల్లడించాడు. నిజానికి చాలా కాలం క్రితమే వీళ్ల ఆవిష్కరణ వెలుగులోకి వచ్చినప్పటికీ.. లాక్డౌన్ కారణంగా పూర్తిస్థాయి డెవలప్మెంట్ ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఆటోను పవర్ఫుల్ మోటర్ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు రెంటెడ్ బేస్ మీద కొంత మంది ఆటోవాలాలాకు అప్పగించి.. పరిశీలిస్తోంది. తన సోదరుడు గురుసిమ్రన్ సలహా మేరకు పూర్తిస్థాయి పరీక్షల తర్వాతే వీటిని మార్కెట్లోకి తీసుకొస్తామని గగన్‌దీప్ స్పష్టం చేశాడు కూడా. మైనస్ జీరో ఫౌండర్లు గురుసిమ్రన్, గగన్‌దీప్ -
కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు
జలంధర్: కపిల్ శర్మ షోతో పాపులరైన హాస్య నటికి పంజాబ్ పోలీసులు షాకిచ్చారు. పెళ్లయిన 9 రోజులకు పోలీసులు ఆ నవ దంపతులపై కేసు నమోదు చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విధించిన నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారిపై కేసు నమోదు చేశారు. మాస్క్ ధరించకపోవడం.. పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు వివాహ వేడుకకు వచ్చారని పోలీసులు గుర్తించారు. హాస్యనటుడు, గాయకుడు సంకేత్ భోస్లేకు సుగంధ మిశ్రాను వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లి సమయంలో కరోనా జాగ్రత్తలు పాటించలేదు. దీన్ని ఓ వీడియో ద్వారా గుర్తించిన అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం 188 సెక్షన్ కింద వారిపై కేసు బుక్ చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన గాయని సుగంధ మిశ్రాను అదే ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏప్రిల్ 26వ తేదీన వివాహం జరిగింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం వివాహాలు, శుభకార్యాలపై నిబంధనలు విధించింది. 10 మంది కన్నా అధికంగా ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాహ వేడుకలో పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు పాల్గొన్నారని ఓ వీడియోలో పోలీసులు గుర్తించారు. ఆ వీడియో ఆధారంగా ఆ నవ దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సరబ్జిత్ సింగ్ బహియా తెలిపారు. పగ్వారా పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. చదవండి: కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు View this post on Instagram A post shared by 𝐒𝐔𝐆𝐀𝐍𝐃𝐇𝐀 𝐌𝐈𝐒𝐇𝐑𝐀 (@sugandhamishra23) -
13 ఏళ్ల బాలుడిని పెళ్లాడిన ట్యూషన్ టీచర్.. చివరికి
జాతకంలో ఏదైనా దోషం ఉంటే నివారణకు పూజలు, హోమాలు జరిపించడం పరిపాటి. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఏర్పడిన దోషాన్ని తొలగించేందుకు నానా హంగామా చేస్తుంటారు. అయితే పంజాబ్‌లో జరిగిన ఓ పెళ్లి అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. జాతకంలో మాంగళ్య దోషం ఉందని 13 ఏళ్ల వయసున్న స్టూడెంట్ను వివాహం చేసుకుంది ఓ ట్యూషన్ టీచర్. ఈ విచిత్ర సంఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో వెలుగు చూసింది. బస్తీ బావా ఖేల్ ప్రాంతంలోని ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతికి కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఎంతకీ వివాహం కుదరకపోవడంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు పూజారిని సంప్రదించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో సంబంధిత యువతి పుట్టిన జాతకం ప్రకారం ఆమెకు మాంగళ్య దోషం ఉందని పూజారి పేర్కొన్నాడు. దీని నివారణకు ఆమెకు మైనర్ బాలుడితో ముందుగా పెళ్లి చేయాలని సూచించాడు. ఈ క్రమంలో మహిళా తన వద్దకు ట్యూషన్ కోసం వచ్చే ఓ విద్యార్థుల్లోని 13 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసేందుకు సిద్ధపడింది. ట్యూషన్ క్లాసుల కోసం బాలుడు తన వద్దే వారం పాటు ఉండాలని విద్యార్థి తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ఒప్పించింది. 7 రోజులపాటు విద్యార్థిని టీచర్ తన ఇంట్లో పెట్టుకొని పెళ్లి వేడుకలు నిర్వహించారు. అనంతరం తన గాజులు పగలగొట్టి తనకు తాను వితంతువుగా మారిపోయి బాలుడిని ఇంటికి పంపించేసింది. వారం తర్వాత ఇంటికొచ్చిన బాలుడు తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు బస్తీ బావా ఖేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కొడుకుని నిర్భందించి బలవంతంగా హల్దీ వేడుక, మొదటి రాత్రి వంటి ఆచారాలను నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే మహిళ ఒత్తిడి మేరకు బాధితుడి కుటుంబం ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అయితే ఈ విషయం చివరికి సీనియర్ పోలీసు అధికారుల వరకు చేరడంతో దీనిని తీవ్రంగా పరిగణించిన డీఎస్పీ గుర్మీత్ సింగ్ పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు. బాలుడు మైనర్ కావడంతో లోతుగా దర్యాప్తు చేయాలని, అతన్ని నిర్భంధంలో ఉంచడం చట్టవిరుద్దమని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ సదరు టీచర్‌పై, ఆమె తల్లిదండ్రులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
సింగర్‌ను వివాహమాడిన నటుడు
చండీగఢ్: ‘‘మంచి తరుణం మించిన దొరకదు’’ అన్న చందంగా సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, సాండల్‌వుడ్ అన్న తేడా లేకుండా ఇప్పటికే చాలా మంది హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి.. లాక్డౌన్ ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కమెడియన్, రియాలిటీ షో ఖత్రోంకీ ఖిలాడీ 10 ఫేం బాల్‌రాజ్ సియల్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. బాలీవుడ్ సింగర్ దీప్తి తులిని అతడు వివాహమాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ జలంధర్‌లో ఆగష్టు 7న తనను మెచ్చిన నిచ్చెలి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇన్నాళ్లు పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచిన బాల్‌రాజ్ భార్య దీప్తితో కలిసి ఉన్న ఇన్‌స్టాలో షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: పెళ్లి పీటలెక్కనున్న లేడీ కమెడియన్) ఇక తమ ప్రేమ- పెళ్లికి సంబంధించిన విషయాల గురించి బాల్‌రాజ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘జూలై 2019.. చండీఘడ్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో తొలిసారి దీప్తిని కలిశాను. నేను హోస్ట్ చేస్తున్న షోలో ఆమె తన మ్యూజిక్ బ్యాండ్‌తో కలిసి పాటలు పాడుతోంది. తొలి చూపులోనే తను నాకు నచ్చేసింది. కానీ ఎందుకో తనకు నేను నచ్చనేమో అనిపించింది. తర్వాత ఖత్రోంకీ ఖిలాడీ షో చేసే సమయంలో తనకు మెసేజ్ చేశాను. నాకు కావాల్సిన రిప్లై లభించలేదు. అయినా నేను వదల్లేదు. టర్కీ, గ్రీస్ టూర్‌కి వెళ్లినపుడు తనతో సంభాషణ జరిపే అవకాశం వచ్చింది. (చదవండి: హీరోయిన్‌తో బిగ్‌బాస్ విన్నర్ పెళ్లి!) అలా మా స్నేహం కొనసాగుతున్న సమయంలో నా బర్త్‌డే రోజు (జనవరి 26) గోవాలో తనకు ప్రపోజ్ చేశాను. ముందు తను ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అంగీకరించింది. పెద్దలకు విషయం చెప్పాం. మా జాతకాలు కలిశాయి. ఇంతలో లాక్డౌన్ డౌన్ వచ్చిపడింది. అయితే పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. మా ఇంటి నుంచి దీప్తి ఇంటికి కేవలం 15 నిమిషాల దూరంలోనే ఉంటుంది. కానీ తను నా జీవితంలోకి రావడానికి ఇదిగో ఇంత సమయం పట్టింది’’అంటూ నవ్వులు చిందించాడు. -
ఆమె పట్టుతో దొంగ చిక్కక తప్పలేదు
చండీగఢ్: మొబైల్ ఫోన్ స్నాచింగ్‌ను సమర్థంగా అడ్డుకుని, ఓ దొంగను కటకటాల్లోకి నెట్టిన పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన కుసుమ్ కుమారి (15) పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కుసుమ్ కుమారి ధైర్యం ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను సాహస బాలికగా పేర్కొన్న జలంధర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ ఆమె పేరును జాతీయ, రాష్ట్రస్థాయి సాహస అవార్డులకు పంపిస్తామని చెప్పారు. ఇక కుసుమ్ కుమారి సాహసానికి మెచ్చిన సిటీ డిప్యూటీ కమిషనర్ ఘన్‌శ్యామ్ తోరీ ఆమెకు రూ.51 వేల నజరానా ప్రకటించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద ఈ సాయం చేస్తున్నానని తెలిపారు. ‘బేటీ బచావో- బేటీ పడావో’ కార్యక్రమానికి సంబంధించి కుసుమ్ కుమారి ఫొటోను వాడుకుంటామని చెప్పారు. దొంగకు మూడు రోజుల రిమాండ్ కాగా, కుసుమ్ కుమారి చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా దొంగలు అవినాష్ కుమార్ (22) అలియాస్ అషు, వినోద్ కుమార్ బైక్‌పై ఆమెను వెంబడించారు. చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కుని పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన కుసుమ్ కుమారి వారిపై సివంగిలా దూకి.. దొంగలకు చుక్కలు చూపించింది. ఫోన్ లాక్కుని బైక్‌పై కూర్చున్న అవినాష్ కుమార్‌ను అమాంతం పట్టేసుకుంది. ఈక్రమంలో ఆ దొంగ కుసుమ్ కుమారి చేతిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అయినా, ఆమె వెనకడుగు వేయలేదు. అంతలోనే దారినపోయేవారు అక్కడకు చేరుకుని దొంగను పట్టుకున్నారు. మరో దొంగ బైక్‌పై ఉడాయించాడు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇక నిందితుడు అవినాష్ కుమార్‌కు న్యాయస్థానం మూడు రోజుల రిమాండ్ విధించిందని జలంధర్ డివిజన్ నెంబర్-2 ఎస్ఐ జితేంతర్ పాల్ సింగ్ చెప్పారు. రెండోవాడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం, దొంగతనం కేసులు పెట్టామని తెలిపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇదిలాఉండగా.. గాయాలపాలైన సాహస బాలికకు జోషి ఆస్పత్రి ఉచితంగా చికిత్స అందిస్తుండటం అభినందనీయం. #Punjab: 15-year-old girl fights snatchers to save her mobile phone in #Jalandhar pic.twitter.com/MTqYvwiXPr — The Tribune (@thetribunechd) September 1, 2020 -
అమ్మ కన్నా నానమ్మే ఎక్కువైందని..
చండీగఢ్: ప్రేమ ప్రాణం పోస్తుందంటారు. కానీ అదే ప్రేమ ప్రాణం తీస్తుందనడానికి ఓ ఘటన ఉదాహరణగా నిలిచింది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన కుల్వీందర్ కౌర్ అనే మహిళకు అరష్ ప్రీత్ అనే ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. ఆమె భర్త ఉపాధి నిమిత్తం ఇటలీకి వెళ్లగా.. కొడుకుతో కలిసి అత్తగారింట్లోనే నివసిస్తోంది. అయితే ఆమెకు అత్తకు పొసిగేది కాదు. కానీ ఆమె పంచప్రాణాలైన కొడుకు మాత్రం తన నానమ్మతో బాగా చనువుగా ఉండేవాడు. ఇది కుల్వీందర్‌కు ఎంతమాత్రమూ నచ్చేది కాదు. (పైలట్ కోసం సిక్కుల ఔదార్యం) తనకన్నా నానమ్మపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని ఆమె లోలోపలే రగిలిపోయింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య గొడవ కూడా జరిగింది. దీంతో కుల్వీందర్ తన కొడుకును చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకుంది. కన్నకొడుకును కత్తితో పొడిచి అనంతరం భవనంలోని రెండో అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లవాడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అతడి గదిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో అతడు శవమై కనిపించాడు. సదరు మహిళ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. హత్యానేరం కింద పోలీసులు కుల్వీందర్ కౌర్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియాల్సి ఉంది. (కన్న కూతురిని హతమార్చిన తల్లి.. ఆపై) -
లాక్డౌన్: అడ్డుకున్న పోలీసుపై కారుతో అటాక్!
చండీగఢ్: లాక్డౌన్ పటిష్ట అమలుకు పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతుంటే కొందరు వారిపట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసు చేయి నరికేసిన ఉదంతం మరువకముందే పంజాబ్‌లో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అడ్డుకున్న పోలీసుపై ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ ఘటన జలంధర్‌లోని మిల్క్ చౌక్ చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. ఏఎస్ఐ ముల్క్‌రాజ్ మరికొందరు పోలీసులు మిల్క్ చౌక్ వద్ద విధుల్లో ఉన్నారు. అటువైపుగా వచ్చిన ఓ కారును ముల్క్‌రాజ్ అడ్డుకుని, కర్ఫ్యూ పాస్ చూపించాలని కోరాడు. దాంతో ఆ వ్యక్తి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. అప్పటికే వాహనానికి అడ్డుగా ఉన్న ముల్క్‌రాజ్ ప్రమాదాన్ని గ్రహించి కారు బానెట్‌పైకి దుమికి పట్టుకున్నాడు. ఏఎస్ఐ కారుపై ఉండగానే.. ఆ వ్యక్తి దాదాపు 200 మీటర్ల దూరం వాహనాన్ని పోనిచ్చాడు. అక్కడే ఉన్న ఇతర పోలీసులు పరుగెత్తుకెళ్లి కారును అడ్డుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సుర్జీత్ సింగ్ తెలిపారు. కాగా, లాక్డౌన్ విధుల్లో ఉన్న ఏఎస్ఐ చేయిను నరికిన ఘటన పటియాలాలో ఏప్రిల్ 12 జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: వలస కూలీల్లో కరోనా కలకలం) -
316 కాటన్ల అక్రమ మద్యం సీజ్
చంఢీఘర్ : పంజాబ్‌లోని జలంధర్‌లో భారీగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లాక్డౌన్ సమయంలో అక్రమంగా తరలిస్తున్న మొత్తం 316 కాటన్ల మద్యాన్ని సీజ్ చేశారు. అరెస్టైన వారిలో అమిత్ కుమార్, అంకిత్, రామ్ సేవక్‌లు ఉన్నారు. -
కరోనా వార్డులో పేషెంట్ల డ్యాన్స్..
-
కరోనా వార్డులో పేషెంట్ల డ్యాన్స్..
చండీగఢ్ : కరోనా పేరు వింటేనే జనాలు వణికిపోతున్నారు. అలాంటిది ఆ వైరస్ బారిన పడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? అసలే సరైన మందు కూడా అందుబాటులో లేని ఈ మాయదారి రోగం సోకినందుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు వెల్లదీస్తున్నారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో కరోనా పేషెంట్లు ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తూ మనసు తేలిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ ఆసుపత్రిలో సుమారు 12 మంది కరోనా పేషెంట్లు టీవీ చూస్తున్నారు. అందులో హుషారైన పంజాబీ పాట రావడంతోనే వీరి నరాల్లో ఉత్తేజం ఉప్పొంగింది. (వైరల్ : మీరిచ్చిన బహుమతి ఎప్పటికి గుర్తుంటుంది) వారికొచ్చిన కష్టాన్ని కాసేపు పక్కనపెట్టి చేతులూపుతూ, తలలాడిస్తూ కూర్చున్నచోటే ముఖానికి మాస్కులతో డ్యాన్సులు చేశారు. ఈ సంతోషకర సమయాన్ని జ్ఞాపకంగా మల్చుకునేందుకు అందులోని ఓ పేషెంట్ వీడియో చిత్రీకరించాడు. ఇది చూసిన నెటిజన్లు వారి సంతోషాన్ని చూసి ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇక ఈ వార్డులో ఉన్న అందరు పేషెంట్లు సామాజిక ఎడబాటును పాటించారే తప్ప గుంపులుగా గుమిగూడి చిందులు వేయకపోవడం చెప్పుకోదగ్గ విషయం. వారికి సాధారణ చికిత్సతోపాటు మానసిక ధైర్యాన్ని అందించేందుకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వీళ్లంతా త్వరలోనే ఆ మహమ్మారిని జయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. (కోవిడ్ బాధితుల కోసం వార్డ్‌బోట్!) -
బురిడీ కొట్టించి ‘దృశ్యం’ చూపిస్తాడు
భోపాల్: కొన్ని సినిమాలు నేరగాళ్లకు ప్రేరణగా నిలుస్తున్నాయి. తప్పు చేసి తప్పించుకోవడమెలా అనేవాటిని కేటుగాళ్లకు సులువుగా నేర్పిస్తున్నాయి. తాజాగా భోపాల్‌లో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం..! వివరాలు.. భోపాల్‌లోని జలంధర్‌కు చెందిన సిమ్రన్ సింగ్ నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. పైకి హుందాగా కనిపిస్తూ అలవోకగా ఇంగ్లిష్ మాట్లాడుతూ నిరుద్యోగులను బుట్టలో పడేశాడు. స్వదేశంలోనైనా, విదేశంలోనైనా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదంటూ మాయమాటలు చెప్పేవాడు. ఇంటర్వ్యూల పేరిట హోటల్‌కు పిలిచి మత్తుమందు కలిపిన టీ, కాఫీ ఇచ్చి స్పృహ తప్పిపోగానే తన అసలు స్వరూపం చూపిస్తాడు. నగదు, నగలు ఇలా అందినకాడికి దోచుకుంటాడు. దేశంలోని ఎనిమిది నగరాల్లో 30కి పైగా అతని బాధితులు ఉన్నారు. ముంబైకి చెందిన రాజేంద్ర గుణేకర్కు ‘యూరోపియన్ వర్క్ వీసా’ ఇప్పిస్తానని భోపాల్‌కు రప్పించి బురిగడీ కొట్టించాడు. అతనికి మత్తుమందు ఇచ్చి రూ.2 లక్షల నగదు, గోల్డ్ రింగ్‌తో ఉడాయించాడు. అదే నగరానికి చెందిన పెట్రోకెమికల్ ఇంజనీర్, అతని మిత్రడికి కూడా మత్తుపదార్థాలు ఇచ్చి వారి ఏటీఎమ్‌లను దొంగిలించి రూ.2 లక్షలు విత్‌డ్రా చేసుకున్నాడు. భోపాల్‌లోని ఓ కల్నల్ దగ్గరనుంచి రూ.7 లక్షలకు పైగా దోచుకున్నాడు. ఇక అతని బాధితుల లిస్టులో మహిళల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ముంబైకు చెందిన ఓ మహిళను మధ్యప్రదేశ్‌కు రప్పించి ఆమె దగ్గర రూ.2 లక్షలు దొంగిలించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసులకు దొరక్కుండా దృశ్యం సినిమాను తలెదన్నేలా ఎత్తులు వేశాడు. ఎప్పటికప్పుడు సిమ్‌కార్డులు మార్చుతూ, నేరం చేసిన తర్వాత బాధితుల ఫోన్లను దొంగిలించి ట్రైన్లు, బస్సుల నుంచి విసిరేసి ఆధారాలు లేకుండా చేసేవాడు. అయితే ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం బయటపడింది. రంగంలోకి దిగిన భోపాల్ పోలీసులు అతని నుంచి ఫేక్ ఆధార్ కార్డులను, నిద్రమాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కొసమెరుపు ఏంటంటే.. సిమ్రన్ సింగ్ కూడా గతంలో ఈ విధంగానే మోసపోయాడు. అతన్ని కెనడాకు పంపిస్తానని చెప్పి ఓ వ్యక్తి రూ.2.25 లక్షలు తీసుకొని మోసగించాడు. ఆ తర్వాత సిమ్రన్ సింగ్ ‘పోయిన చోటే వెతుక్కోవాలి’అనే తీరుగా ఈ మోసాలకు తెరతీశాడు. -
ఎల్పీయూలో 3 లక్షలదాకా స్కాలర్షిప్
జలంధర్: పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి, ఉపకార వేతనానికి ఎల్‌పీయూనెస్ట్ అనే అర్హత పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎల్పీయూ ఓ ప్రకటనలో తెలిపింది. 58 దేశాల్లో ఈ పరీక్ష ఉంటుందనీ, విద్యార్థులు తాము ఎంచుకునే కోర్సును బట్టి రూ. 3 లక్షల వరకు ఉపకార వేతనం పొందొచ్చని ఎల్పీయూ వెల్లడించింది. విద్యార్థులు జూన్ 30లోపు ఎల్పీయూనెస్ట్కు దరఖాస్తు చేసుకోవాలనీ, ఈ ఎల్పీయూనెస్ట్తోపాటు బోర్డు పరీక్షలు, ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లోనూ సాధించిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని ఉపకార వేతనాలకు విద్యార్థులను ఎంపిక చేస్తామంది. -
తాగిన మైకంలో లైంగిక దాడి : చితకబాదిన స్ధానికులు
చండీగఢ్ : తాగిన మైకంలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 39 ఏళ్ల వ్యక్తిని స్ధానికులు కొట్టిచంపారు. జలంధర్‌లోని రామ మండి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగుచూసింది. బాలిక తల్లితండ్రులు కూలి పనులకు వెళ్లడంతో పొరుగునే ఉన్న ఇంట్లోకి చొరబడిన నిందితుడు 11 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. బాలిక కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు నిందితుడిని చితకబాదారు. లైంగికదాడి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని స్ధానికులు తీవ్రంగా కొట్టడంతో ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మరణించాడని చెప్పారు. ఆధార్ కార్డు ద్వారా మృతుడిని గుర్తించిన పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. కాగా నిందితుడి మూక హత్యపై ఇంతవరకూ ఎవరిపై కేసు నమోదు చేయలేదని ఏసీపీ హర్సిమ్రత్ సింగ్ తెలిపారు. -
ఈయన కథ వింటే కన్నీళ్లే..!
-
ఈయన కథ వింటే కన్నీళ్లే..!
ఛండీగడ్ : వెన్నుపోటు ఈ మాట రాజకీయాల్లో తరచుగా వినిపించే మాట. నమ్మిన నాయకులకు, పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసి వారిని దొంగచాటుగా పడగొట్టడమే వెన్నుపోటు. అయితే, సొంత కుటుంబంలోని వారే వెన్నుపోటు పొడిస్తే.. వారి బాధ వర్ణనాతీతం.17వ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని జలంధర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నీతు సుతేరన్ వాలా కూడా అదే బాధ పడుతున్నాడు. కుటుంబంలో ఉన్న 9మంది ఓటర్లలో ఐదుగురు మాత్రమే అతనికి ఓటు వేశారు. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సొంతవాళ్లే తనకు ఓటువేయలేదని మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ఘటన సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున (మే 23) జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, తొలిసారి ఎన్నికల్లో పోటీచేసే సుతేరన్‌కు కౌంటింగ్‌పై కనీస అవగాహన లేనట్టు తేలింది. తొలిరౌండ్లో అతనికి 5 ఓట్లు వచ్చాయని, అయితే తనకు పడిన మొత్తం అవే అని సుతేరన్ భ్రమపడినట్టు తెలిసింది. జలంధర్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో 19వ స్థానంలో నిలిచిన సుతేరన్ 856 ఓట్లు సాధించినట్టు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ వెల్లడించింది. ఇక ఈసారి కూడా దేశమంతా నరేంద్ర మోదీ గాలి వీచింది. ఎన్డీయే 349 సీట్ల అఖండ మెజారిటీ సాధించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పోలీసుల అదుపులో ఐఎస్ఐ ఏజెంట్
సాక్షి, న్యూఢిల్లీ : సైనికులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని జలంధర్‌లో పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని ఫజాలికా ప్రాంతానికి చెందిన రామ్ కుమార్‌గా గుర్తించారు. కుమార్ నుంచి రెండు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాను డబ్బుకు ఆశపడి పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉంటున్నానని నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఇండో-పాక్ సరిహద్దులో భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ ఏజెంట్లతో పంచుకుంటానని చెప్పాడని వెల్లడించారు. సరిహద్దుల్లో భారత జవాన్ల కదలికలపైనా నిందితుడు నిఘా వేసేవాడని చెప్పారు. జమ్మూ కశ్మీర్ సైనిక ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి అందిన సమాచారం మేరకు అతడి కదలికలను పసిగట్టి స్ధానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం తదుపరి విచారణ కోసం నిందితుడిని పోలీసులు చండీగఢ్‌కు తరలించారు. -
చండీగఢ్‌లో చిరుత దాడి.. పరుగులు తీసిన జనం
-
చిరుత ఆకస్మిక దాడి.. పరుగులు తీసిన జనం
చండీగఢ్ : పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో చిరుత బీభత్సం సృష్టించింది. జనావాసాలపై విరుచుకుపడి ప్రజలను గాయపరిచింది. చివరకు అటవీ అధికారులు ట్రాంక్విలైజర్ గన్ను ఉపయోగించి చిరుతను అదుపు చేయడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా హిమాచల్ ప్రదేశ్ నుంచి పారిపోయిన ఈ చిరుత అటవీ మార్గం గుండా జలంధర్ చేరుకుని ఉంటుందని పంజాబ్ అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. వల వేసి పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదని.. అందుకే మత్తులో దించి దానిని బంధించినట్లు తెలిపారు. అనంతరం చాట్‌బిర్ జూకు తరలించినట్లు పేర్కొన్నారు. -
నేటి నుంచే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్దదైన సైన్స్ పండగ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ)కు రంగం సిద్ధమైంది. పంజాబ్‌లోని జలంధర్‌లో గురువారం ప్రధాని చేతుల మీదుగా ఈ వేడుక ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. ‘ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ’ఇతివృత్తంగా ఐదు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వేదిక కానుంది. దేశ విదేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఐఎస్సీలో పాల్గొంటారని, ఇందులో పలుదేశాల నోబెల్ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, భూవిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానీలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం పెంపునకు.. ఏటా జనవరి 3వ తేదీన ప్రారంభమయ్యే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడమే. గత ఏడాది ఐఎస్సీ వేడుకలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా చివరి నిముషంలో రద్దయింది. దీంతో రెండు నెలల తరువాత మణిపూర్‌లో నిర్వహించారు. ఈ ఏడాది జలంధర్‌లో జరగనున్న 106వ సైన్స్ కాంగ్రెస్‌లో పలు వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారని సదస్సు జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు సిద్ధం చేసిన సౌరశక్తి బస్సులో ప్రధాని మోదీ సమావేశ కేంద్రానికి విచ్చేస్తారని ఎల్పీయూ ఉపకులపతి అశోక్ మిట్టల్ తెలిపారు. ఐఎస్సీలో ఏర్పాటు చేసిన ఆరు ప్రత్యేక ప్రదర్శనశాలల్లో సీఎస్ఐఆర్, డీఆర్డీవో, డీఏఈ, ఐసీఎంఆర్ వంటి ప్రభుత్వ సంస్థల ప్రదర్శన ఉంటుందని, ఇందులో ప్రైడ్ ఆఫ్ ఇండియా అన్నది దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేదని ఆయన వివరించారు. యువ ప్రతిభకు వేదిక.. ఐఎస్సీ – 2019 రెండోరోజున జరిగే చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ యువ ప్రతిభకు వేదికగా నిలవనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపిక చేసిన దాదాపు 150 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. పది నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులు రూపొందించిన ఈ ప్రాజెక్టులు దేశంలో సైన్స్ ప్రాచుర్యానికి తోడ్పడతాయని అంచనా. మూడోరోజున సైన్స్ కమ్యూనికేటర్స్ మీట్ జరగనుంది. అదేరోజున విమెన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం కానుంది. దీంతోపాటు మొత్తం 14 ప్లీనరీ సెషన్స్ ఐఎస్సీలో భాగంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నోబెల్ గ్రహీతలతో ప్రధాని ‘ఛాయ్ పే చర్చ’ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోబెల్ గ్రహీతలైన ముగ్గురు శాస్త్రవేత్తలతో ఛాయ్ పే చర్చా పేరిట ఇష్టాగోష్టిగా మాట్లాడనున్నారు. ప్రొఫెసర్ థామస్ సి.సుడాఫ్ (2013 వైద్య శాస్త్ర నోబెల్ గ్రహీత), ప్రొఫెసర్ అవ్రామ్ హెర్ష్కో (2004 కెమిస్ట్రీ నోబెల్ గ్రహీత), ప్రొఫెసర్ ఎఫ్.డంకన్ ఎం.హల్డానే (2016 ఫిజిక్స్ నోబెల్ గ్రహీత) ఈ చర్చలో పాల్గొంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి ప్రధాని సలహాలు, సూచనలు తీసుకుంటారని సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. -
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ కమెడియన్
స్టార్ కమెడియన్, నటుడు, నిర్మాత కపిల్ శర్మ పెళ్లి తేదిని ప్రకటించాడు. ఈ ఏడాది డిసెంబర్ 12న తన ప్రేయసి గిన్నీ ఛత్రాత్‌ను వివాహం చేసుకొబోతున్నట్లు వెల్లడించాడు. అనంతరం డిసెంబర్ 14న ముంబైలో బాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. వివాహ వేడుక మాత్రం గిన్ని స్వంత ఊరైన జలంధర్‌లో జరగనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయం గురించి కపిల్ ‘పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకోవాలని భావించాను. కానీ నా వివాహాన్ని చాలా ఘనంగా చేయాలని మా అమ్మ కోరిక. ఎందుకంటే నా సోదరుడు, సోదరి వివాహ సమయంలో మా ఆర్థిక పరిస్థితులు ఇప్పటిలా లేవు. దాంతో వారి వివాహాన్ని చాలా సింపుల్‌గా చేశాము. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దాంతో నా పెళ్లైనా ఘనంగా చేయాలని మా అమ్మ ముచ్చటపడుతోంది. ఆమె సంతోషం కోసం నేను కూడా ఇందుకు అంగీకరించాను’ అని తెలిపారు. అంతేకాక ‘గిన్ని కూడా తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. వారు కూడా తమ కుమార్తె వివాహాం గురించి ఎన్నో కలలు కన్నారు. వారి సంతోషాన్ని కాదనడం సరికాదనిపించింది. అందుకే నా వివాహ వేడుక చాలా ఘనంగా జరుగుతుంది’ అని తెలిపారు. ఇన్ని రోజులు కపిల్ తాను తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన పంజాబీ చిత్రం ‘సన్నాఫ్ మన్జీత్ సింగ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెల 12 విడుదలయ్యింది. -
ఎల్పీయూలో సైన్స్ కాంగ్రెస్
జలంధర్: వచ్చే ఏడాది జరిగే 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) ఆతిథ్యమివ్వనుంది. 2019, జనవరి 3–7 మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 300 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలు సహా సుమారు 15 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైద్యం, పర్యావరణం, రసాయన శాస్త్రం తదితరాలపై సుమారు 18 ప్లీనరీ సెషన్లు జరుగుతాయి. జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు ఆతిథ్యమిచ్చే గౌరవం దక్కడంపై ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు. -
ఆ పది చేతుల వల్లే
రాబోయే పుట్‌బాల్ వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని జలంధర్‌లోని స్త్రీ కార్మికులు ఇప్పటి నుంచే ఫుట్‌బాల్స్ తయారీలో బిజీగా ఉంటున్నారు. ఇవాళ గ్రౌండ్లో మనం కిక్ కొట్టిన ఫుట్‌బాల్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసా? తెలుసుకుంటే బాగుంటుంది. అసలు ఫుట్‌బాల్ అనేది యంత్ర ఆధారిత పరిశ్రమ కాదని చేతి ఆధారిత పరిశ్రమ అని తెలుసుకుంటే కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ చేతులు ఎక్కువగా స్త్రీలవి కావడం.ఇవాళ భారతదేశంలో అందుబాటులో ఉన్న ఎనభై శాతం ఫుట్బాళ్లు పంజాబ్– జలంధర్లోకాని, ఉత్తరప్రదేశ్– మీరట్‌లో కాని తయారవుతాయి. ఈ ప్రాంతాల్లో సుమారు నూట యాభైకి పైగా కుటీర పరిశ్రమలు ఫుట్‌బాల్స్‌ను తయారు చేయడమే కాకుండా స్త్రీలకు ఉపాధి కూడా కలిపిస్తున్నాయి. ఒక ఫుట్‌బాల్ తయారు కావడానికి పది దశల్లో పని జరుగుతుంది. అంటే పది మంది స్త్రీల చేతులు పని చేయడం వల్లే ఒక ఫుట్‌బాల్ తయారవుతుందన్నమాట. ఫుట్‌బాల్ పరిశ్రమ ఇంతకు ముందు రోజుల్ల ఇళ్ల దగ్గర నుంచి మొదలయ్యేది. అంటే కట్ అయిన ఫుట్‌బాల్ తునకలను ఇళ్ల దగ్గర కుట్టి తర్వాత పరిశ్రమకు పంపేవారు. ఈ విధానంలో ఇళ్లల్లో ఉన్న పిల్లలు పని చేసేవారు. బాల కార్మిక వ్యవస్థ ఎటువంటి పరిస్థితిలోను ప్రోత్సాహకరం కాదు కనుక ప్రభుత్వం ఇళ్లలో జరిగే పనిని నిరుత్సాహ పరిచి చిన్నస్థాయి పరిశ్రమలను ప్రోత్సహించింది.దీని వల్ల ఇళ్లల్లో అసంఘటితంగా పని చేస్తూ ఉండిన స్త్రీలు ఇళ్ల నుంచి కదిలి కార్మికులయ్యారు. ఉద్యోగులు అయ్యారు. వీరి పని పరిస్థితులు మెరుగయ్యాయి. సంస్థలు కార్మిక సంక్షేమ నిధులను ఏర్పరచి వీరి బాగోగులు చూస్తున్నారు కూడా. ఒక స్త్రీ రోజులో నాలుగు నుంచి ఐదు ఫుట్‌బాల్స్‌ను కుట్టగలదు. లేని పక్షంలో పది నుంచి పన్నెండు రగ్బీ బాల్స్ కుట్టగలదు. ఈ పనికి నైపుణ్యం కావాలి. అంతేకాక ఓపిక కూడా అవసరం. స్త్రీలకు కుట్టడంలో కూర్చడంలో మెరుగ్గా పని చేసే శక్తి ఉండటం వల్ల ఈ రంగంలో రాణిస్తున్నారు. అన్నట్టు ఫుట్‌బాల్స్ తయారీలో మెరుగ్గా ఉన్న దేశం ఏదో తెలుసా? పాకిస్తాన్. విభజనకు ముందు సియోల్‌కోట్ ఫుట్‌బాల్స్ తయారీ కేంద్రంగా ఉండేది. విభజన తర్వాత నైపుణ్యం ఉన్న కార్మికులు అక్కడే ఉండిపోయారు. ఆ పరంపర అక్కడ కొనసాగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఉంది.వరల్డ్ కప్ సమయంలో దేశానికి ఫుట్‌బాల్ జ్వరం పట్టుకుంటుంది.ఆ సమయంలో అందరూ ఫుట్‌బాల్స్ కొనడానికి ఆసక్తి చూపుతారు. ఆ డిమాండ్ తట్టుకోవడానికి ఇదిగో ఈ ఫొటోల్లో చూపించినట్టు ఇప్పుడు వేగంగా పని జరుగుతోంది. ఒక స్త్రీ రోజులో నాలుగు నుంచి ఐదు ఫుట్‌బాల్స్‌ను కుట్టగలదు. లేని పక్షంలో పది నుంచి పన్నెండు రగ్బీ బాల్స్ కుట్టగలదు. ఈ పనికి నైపుణ్యం కావాలి. అంతేకాక ఓపిక కూడా అవసరం. స్త్రీలకు కుట్టడంలో కూర్చడంలో మెరుగ్గా పని చేసే శక్తి ఉండటం వల్ల ఈ రంగంలో రాణిస్తున్నారు. -
భర్త వివాహేతర సంబంధం ; కోసిపారేసింది!
జలంధర్ : పెళ్లినాటి ప్రమాణాలను మర్చిపోయి పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను దారుణంగా శిక్షించిందో ఇల్లాలు. అతని సున్నిత భాగాన్ని కోసి, టాయిలెట్ బేసిన్లో పారేసింది. పంజాబ్‌లోని జలంధర్ పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంరేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగీందర్ నగర్లో నివసించే ఆజాద్ సింగ్, అతని భార్య సుఖ్వంత్ కౌర్‌లు తరచూ గొడవపడేవారు. అతను వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య అనుమానం. ఎన్నిసార్లు చెప్పినా అతనిలో మార్పురాకపోవడంతో కౌర్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్త నిద్రపోతున్న సమయంలో రాడ్డుతో తలపై బలంగా మోదింది. ఆ దెబ్బకే అతను స్పృహకోల్పోయాడు. తర్వాత కత్తితో అతని సున్నిత భాగాలను కోసేసి, టాయిలెట్ బేసిన్లో పారేసి నీళ్లు పోసింది. కొడుకు పరిస్థితిని గుర్తించిన ఆజాద్ తండ్రి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆజాద్ పరిస్థితి విషమంగా ఉందని, మరికొద్ది గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు సుఖ్వంత్ కౌర్‌ను అరెస్టు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. -
నటికి అరెస్ట్ వారెంట్
చండీగఢ్: మోడల్, నటి ఆర్షి ఖాన్ మరోసారి చిక్కుల్లో పడింది. హిందీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్ 11’లో పోటీ పడుతున్న ఆమెకు పంజాబ్‌లోని జలంధర్ జ్యుడీషియల్ కోర్టు నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఆమెను అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. గత మూడు నెలలుగా తమ ఎదుట న్యాయ విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. భారత్-పాకిస్తాన్ దేశాల జెండాలను తన దేహంపై పెయింటింగ్ వేయించుకుని అర్ధనగ్నంగా ఫోజులివ్వడంతో ఆమెపై కేసు నమోదైంది. ఆర్షి ఖాన్ చట్టాన్ని ఉల్లంఘించారని, తమ మనోభావాలను దెబ్బతీశారని జలంధర్‌కు చెందిన న్యాయవాది ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమెకు పలుమార్లు వారెంట్ జారీచేసినా కోర్టుకు హాజరుకాలేదు. అక్టోబర్ 1 నుంచి బిగ్‌బాస్‌లో ఉండటం వల్ల ఆర్షి ఖాన్ రాలేకపోయారని ఆమె తరపు న్యాయవాది తెలిపడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్‌హౌస్ బద్దలుకొట్టి ఆర్షి ఖాన్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే కోర్టు జారీ చేసిన వారెంట్‌పై జనవరి 15 వరకు స్టే తెచ్చుకున్నామని ఆర్షి ఖాన్ తరపు ప్రతినిధి వెల్లడించారు. జనవరి 11న బిగ్‌బాస్ ఫైనల్ జరగనుంది. ఈ వ్యవహారంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని జలంధర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. -
పంజాబ్‌లో భారీ అగ్నిప్రమాదం
చంఢీగఢ్: పంజాబ్‌లోని జలంధర్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 25 దుస్తుల దుకాణాలు అగ్నిఆహుతికావటంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. జలంధర్‌లోని జ్యోతిచౌక్‌లో ఉన్న సుదామ క్లాత్ మార్కెట్లో ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, శకటాలు అక్కడికి చేరుకున్నా మంటలను అదుపులోకి చేయలేకపోయారు. ఈ ఘటనలో మొత్తం 25 దుకాణాలు బుగ్గి అయ్యాయి. భారీగా నష్టం సంభవించిందని దుకాణాలు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అయితే, కావాలనే ఎవరో నిప్పుపెట్టి ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గంటల తర్వాత ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
నిజంగా వీరికి భూమ్మీద నూకలున్నాయి
-
నిజంగా వీరికి భూమ్మీద నూకలున్నాయి
జలంధర్: వాడికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి.. ఇది సాధరణంగా పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో భయటపడిన వారిని ఉద్దేశించి చెప్పే మాట. ఈ సంఘటనకు ఈ మాట సరిగ్గా అతుక్కుపోతుందేమో.. అవును పంజాబ్‌లో ఓ ఇద్దరు వ్యక్తులు దూసుకొచ్చిన ప్రమాదం నుంచి రెప్పపాటుకాలంలో బయటపడ్డారు. ప్లై ఓవర్‌పై నుంచి పడుతున్న ఓ ట్రక్కు ప్రమాదం నుంచి మరో ట్రక్కు వారిని కాపాడింది. లేదంటే ఆ ఇద్దరు ట్రక్కు కిందపడి నుజ్జునుజ్జయ్యేవారేమో. పంజాబ్‌లోని జలందర్‌లో ప్లై ఓవర్‌పై ఓ హవానం వెళుతోంది. దానికింద పక్కనే మరో ట్రక్కు వస్తుంది. అదే సమయంలో రోడ్డు పక్కనే మరో ట్రక్కు ఆపి ఉండగా దానికి ఎదురుగా ఓ వ్యక్తి సైకిల్‌పై వస్తుండగా మరో వ్యక్తి అక్కడే ఉన్నాడు. అంతలోగా కింద నుంచి వస్తున్న ట్రక్కు అతడికి ఎదురుగా దూసుకురావడంతో అతడు ఒక్కసారిగా పక్కకు తప్పుకునే ప్రయత్నంలోకి జారుకున్నాడు. అంతలోగే పెద్ద ట్రక్కు ప్లై ఓవర్ మీద నుంచి పెద్ద శబ్దంతో పడిపోయింది. అది చూసి వారి గుండెలు అదిరిపడ్డాయి. ఎదురుగా వచ్చిన ట్రక్కు వారి ప్రాణాలు కాపాడి వెళ్లిపోయింది. ప్లైఓవర్‌పై నుంచి కిందపడిన ట్రక్కులో ఒక డ్రైవర్, మరో రిక్షా కార్మికుడు గాయపడ్డారు. జలందర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. -
మహిళను పెళ్లాడిన మహిళ!
జలంధర్: ఓ మహిళను మరో మహిళ పెళ్లాడిన ఘటన పంజాబ్‌లో జరిగింది. ప్రభుత్వ అధికారిని అయిన మంజీత్ కౌర్ సంధూ గత శనివారం 27 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జలంధర్ నగరంలోని ఓ దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లి వేడుకలో సమీప బంధుమిత్రులు పాల్గొన్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న మంజీత్ కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా తన 'భార్య'ను ఇంటికి తెచ్చుకున్నారు. వీరి పెళ్లి జరిగిన కాసేపటికే వివాహం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో స్థానికంగా హల్చల్ చేశాయి. వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో మిశ్రమస్పందన వ్యక్తమవుతున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్వలింగ వివాహాలు నేరం కింద వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. -
పోలింగ్ బూత్‌లో క్రికెటర్‌తో సెల్ఫీ.. దుమారం
జలంధర్: ఓటేసేందుకు వచ్చిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో ఎన్నికల అధికారులు, సిబ్బంది సెల్ఫీలు దిగడంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్, గోవా రాష్ట్రాల్లో శనివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. క్రికెటర్ హర్భజన్ తన తల్లి అవతార్ కౌర్, కుటుంబసభ్యులతో కలిసి జలంధర్ నగరంలోని 23వ నంబర్ పోలింగ్ బూత్‌కు ఓటేయడానికి వచ్చాడు. అందరిలాగే క్యూ లైన్లో నడుస్తూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన భజ్జీని చూసి ఎన్నికల అధికారులు ఒకింత ఉత్సాహానికి లోనయ్యారు. భజ్జీతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ దృశ్యాలుకాస్తా మీడియాలో ప్రసారం కావడంతో సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటువేసిన అనంతరం హర్భజన్ మీడియాతో మాట్లాడాడు. ‘ఇంతకముందు రాష్ట్రంలో రెండే రెండు కూటములు(కాంగ్రెస్, అకాలీ-బీజేపీ) తలపడేవి. ఇప్పుడు బరిలోకి మూడో పార్టీ(ఆప్)కూడా నిలిచింది. దీంతో ఓట్లు భారీగా చీలిపోతాయని అనుకుంటున్నా. ఈ పోరులో ఎవరు గెలిచినా, వారు తమ పార్టీకి కాకుండా పంజాబ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని హర్భజన్ అన్నాడు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఒకే విడతలో(నేడు) పోలింగ్ జరుగుతున్నది. మార్చి 11న ఫలితాలు వెలువడతాయి. -
సాఫ్ట్‌బాల్ జట్టు కెప్టెన్లుగా జలంధర్, యశశ్రీ
సాక్షి, హైదరాబాద్: నేటి (మంగళవారం) నుంచి జరుగనున్న మినీ జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్లకు జలంధర్, యశశ్రీ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం వరకు ఈ టోర్నీ జరుగుతుంది. అండర్-12 బాలుర జట్టుకు జలంధర్, బాలికల జట్టుకు యశశ్రీ ... అండర్-10 బాలుర జట్టుకు టి. గంగా చరణ్, బాలికల జట్టుకు కౌసర్ భాను కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. జట్ల వివరాలు అండర్-12 బాలురు: బి. జలంధర్, బి. సంజీవ్, ఆర్. కార్తీక్, ఎ. చరణ్, జి. ప్రవీణ్ సారుు, జి. మల్లేశ్, జి. శివ కుమార్, బి.భువిన్ సాయి, ఎ. హర్షిత్‌గౌడ్, ఎం. వరుణ్, పి. దేవదాస్, రాహుల్, ఎల్. సురేశ్, కె. మహేశ్, గౌతమ్, డి. శ్రీకాంత్, సమీరుద్దీన్, జి. మహేశ్. బాలికలు: పి. యశశ్రీ, జి. మమత, బి. కవిత, టి. నందిని, జి. జాస్య రెడ్డి, జె. రెబిక, ఎ. శ్రుతి, నిత్య, హర్షవర్థిని, ప్రియాంక, ఎన్. సృజన, గీత, సునీత, వంశీప్రియ, కృష్ణప్రియ, వైశాలి, కె. తేజ. అండర్-10 బాలురు: కె. స్వరూప్ అక్షయ్, జి.ప్రతాప్ రెడ్డి, కె. యశ్వంత్, బి. వికాస్, జి. విష్ణు సాయి, పి. ఉల్లాస్ రాజ్, సి. ప్రణవ్ చందర్, ఎ. సాయికృష్ణ, వంశీప్రకాశ్, ఎ. కీర్తన్ రెడ్డి, ఎస్కే శుభన్, టి. సంజయ్, పి.నవనీత్, సాయి మహేశ్, డి. ధనుశ్ కుమార్, పి. విఘ్నేశ్. బాలికలు: కౌసర్ భాను, జె. స్వప్న, వైష్ణవి, జె. పూజ, కె. శైలజ, నిత్య, టి. తానియా, జునైరా, టి.నేహ, తెహసీన్ ఫాతిమా, కె. వైష్ణవి, ఎ. మణికీర్తి, ఎల్. రాణి, ఎ. నందిని, ఎ. ఇందు, కె. హారిక, పి. శ్రావ్య. -
యువ ఇంజినీర్ దుర్మరణం
పంజాబ్‌లో ఆత్మకూరు యువకుడి విషాదం శోకసముద్రంలో కుటుంబ సభ్యులు ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు జేఆర్‌పేటకు చెందిన పోతల శ్రీకాంత్ (22) అనే యువ ఇంజనీరు సర్టిఫికెట్ల కోసం తాను చదివిన పంజాబ్‌లోని కళాశాలకు వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పట్టణంలోని జేఆర్‌పేటకు చెందిన పోతల శీనయ్య తన ఇద్దరు కుమారులను ఇంజనీరింగ్ చదివించాడు. రెండో కుమారుడు శ్రీకాంత్ పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాలోని లవ్లీ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ కళాశాలలో గతేడాది ఇంజినీరింగ్ çపూర్తి చేశాడు. ఇటీవల బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉద్యోగం కోసం సర్టిఫికెట్లు కోసం నాలుగు రోజుల క్రితం జలంధర్‌కు వెళ్లాడు. అయితే మంగళవారం ఉదయం అతని తండ్రికి శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఫోన్ వచ్చింది. శ్రీకాంత్, అతని మిత్రులు కలసి సోమవారం పిక్నెక్కు వెళ్లగా, అక్కడ జరిగిన కారు ప్రమాదంలో శ్రీకాంత్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే కారులో ప్రయాణించిన మరెవ్వరికి గాయాలు లేకపోవడం, మృతి చెందిన శ్రీకాంత్ తల వెనుక భాగంలో బలమైన గాయం మాత్రమే తగిలి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చేతికి అందివచ్చిన శ్రీకాంత్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. గతేడాది శ్రీకాంత్ తల్లి సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. శ్రీకాంత్ మృతదేహాన్ని గురువారం ఆత్మకూరుకు తీసుకురానున్నారు. -
జలంధర్‌లో ఉద్రిక్తత
జలంధర్: సిక్కు,హిందూ మత పవిత్ర గ్రంథాలను గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేయడంతో పంజాబ్ లోని జలంధర్ లో సిక్కు, హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. గురుసాహిబ్ గ్రంథ్‌లోని 200 పేజీలు, భగవద్గీతలోని పేజీలను జలంధర్ కపుర్తలా చౌక్‌లోని కాలువలో పడేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిక్కులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అసాంఘీక సంఘటనలు జరుగకుండా చూస్తున్నారు. ఘటను పంజాబ్ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్రంగా ఖండించారు. -
ఓ ఇంటి వాడైన హర్భజన్
జలంధర్: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటి వాడయ్యాడు. స్నేహితురాలు గీతా బాస్రాను అతడు పెళ్లాడాడు. పంజాబ్‌లోని ఫగ్వారాలోని గురుద్వారాలో గురువారం వీరి వివాహం జరిగింది. తెలుపు రంగు షెర్వానీ, ఎరుపు టోపీ ధరించి భజ్జీ మెరిశాడు. పెళ్లికూతురు సంప్రదాయ ఎరుపు రంగు చీర ధరించింది. వీరి వివాహానికి దగ్గరి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, అతడి సతీమణి అంజలి విచ్చేసి భజ్జీ-బాస్రా దంపతులను ఆశీర్వదించారు. అంతకుముందు హర్భజన్ నివాసంలో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 1న ఢిల్లీలో భజ్జీ-బాస్రా వివాహ రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశముంది. క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా తదితర ప్రముఖులు రిసెప్షన్ కు రానున్నారు -
ఓ ఇంటి వాడైన హర్భజన్
-
37 కేజీల వ్యక్తిలో 55 కేజీల కణితి
న్యూఢిల్లీ: ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ చేసి ఢిల్లీ వైద్యులు అవాక్కయ్యారు. అతడి కుడి పిరుదు భాగంలో 55 కేజీల కణితిని తీసి విస్మయం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం గత రెండేళ్లుగా జలందర్ కు చెందిన గుర్మీత్ సింగ్ అనే వ్యక్తి ఓ కణితి ద్వారా తీవ్రంగా బాధపడుతున్నాడు. వాస్తవానికి అతడికి ఆ కణితి ఏర్పడి ఏడేళ్లకు పైగా అయింది. అయితే, గత రెండేళ్లలోనే దాని ప్రభావం ఎక్కువగా పడి ప్రాణం మీదకు వచ్చింది. దీంతో అతడు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాక్స్ ఆస్పత్రి(సాకేత్)లో చేర్పించారు. దీంతో పరీక్షలు చేసిన వైద్యులు అనంతరం శస్త్ర చికిత్స చేయగా 55 కేజీల కణితి బయటపడింది. ఈ కణితి బరువుకంటే తక్కువగా 37కేజీల బరువు మాత్రమే గుర్మీత్ ఉండటం మరో ఆశ్చర్య కరమైన విషయం. -
స్కూల్లో ప్రిన్సిపల్ vs పేరెంట్
-
చనిపోయి 11నెలలైంది..ఆయన బతికొస్తారా?
ప్రపంచం ఓవైపు సాంకేతికపరంగా దూసుకెళుతుంటే...మరోవైపు ప్రజలు మాత్రం మూఢనమ్మకాలతో సహ జీవనం చేస్తూనే ఉన్నారు. హర్యానాలో వివాదాస్పద గురువు రాంపాల్ ఘటన మరవక ముందే...పంజాబ్‌లోని జలంధర్‌లో మరో సంఘటన చోటుచేసుకుంది. 'స్వామి' భక్తి తారాస్థాయికి చేరటంతో ..చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే జలంధర్‌లో అశుతోష్ మహారాజ్ అనే స్వామీజీ మరణిస్తే ..భక్తులు మాత్రం ఆయనకి అంత్యక్రియలు చేసేందుకు ఇప్పటికీ ఒప్పుకోవటం లేదు. అది కూడా ఒకరోజు...రెండు రోజులు కాదు ఏకంగా...11నెలలుగా స్వామిజీకి అంతిమ సంస్కారాలు నిర్వహించటం లేదు. స్వామీజీ బతికొస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది జనవరి 29 తేదీన అశుతోష్ మహారాజ్ మరణించగా అప్పటి నుంచి ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపరిచారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో హైకోర్టు జ్యోకం చేసుకుని అశుతోష్ మహారాజ్ ..వైద్యపరంగా మరణించినట్లు ప్రకటించినా భక్తులు మాత్రం తమ పట్టు వీడటం లేదు. ఎక్కడ స్వామీజీకి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహిస్తారో అనే భయంతో... ఆయన భౌతికకాయానికి కాపలా కాస్తున్నారు. దాంతో అశుతోష్ మహారాజ్ అంత్యక్రియలు డిసెంబర్ 15లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గత 48 గంటలుగా దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు భారీగా మోహరించారు. కాగా న్యాయస్థానం తీర్పుపై అసంతృప్తిగా ఉన్న కొంతమంది భక్తులు పైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నారు. -
సమీక్షణం : మానసిక సంస్కారం నేర్పే నవల
పుస్తకం : పున్నాగపూలు (నవల) రచన : జలంధర విషయం: సామాజిక జీవితంలో నెలకొని ఉన్న అనేక అంతరాలను సమర్థంగా పూడ్చుకోగల పరిష్కారాలు తెల్సిన రచయిత్రి జలంధర. లోకం పోకడ తెలీని ‘రాధ’ చుట్టూ విస్తరించిన వేర్వేరు హోదాలకు, స్థోమతలకు చెందిన జీవితాల వెనకటి గోత్రాలను విప్పిచెప్పిన నవల ఈ ‘పున్నాగపూలు’. ఎంతోమంది ప్రముఖ ఆంగ్ల, తెలుగు రచయితల, తాత్వికుల, వేదాంతుల మాటలను ఉదాహరిస్తూ మనిషిని ఉన్నతవంతం చేయాలనే తపన నవలంతా అండర్ కరెంట్‌గా కనబడుతుంది. విక్టిమైజ్డ్ రోల్ రాధ నుంచి, డ్రగ్ ఎడిక్ట్ స్వప్న, జీవితాన్ని చేజార్చుకున్న రాణి, అన్నీ ఉండీ, ఏమీ లేనిదానిగా అయిపోతున్న మంత్రి భిక్షపతి భార్య లక్ష్మీకాంతం, జీవితాన్ని కక్షతో ఎంజాయ్ చేేన రాధ తల్లి లావణ్య, కమలిని, శ్రీదేవి, ఆరాధన, కళ్యాణి, నర్సులు పరిమళ, గౌరి వంటి ఎందరో స్త్రీల మానసిక లోకాన్ని పరిచితం చేయటం ద్వారా పఠిత మనోలోకాల తలుపులు తెరచుకుంటాయి. అపురూప ఓ స్టన్నింగ్ క్యారెక్టర్. వ్యసనపరుడు రాజారావు, వికాసవంతుడు రఘు, జర్నలిస్టు విరించి, తనకన్నీ తెలుసుననుకునే రామకృష్ణ. వీళ్లందరి సమస్యలనూ ఓపికగా పరిష్కరిస్తూ ‘వైద్యం మనస్సు’ తెలుసుకున్న డాక్టర్ కృష్ణ, షీలా మేడం, డాక్టర్ పిళ్లై. ఆంధ్ర దేశంలోని కొద్దిమంది డాక్టర్లైనా ఈ నవల చదివితే వైద్యవృత్తికి మరింత పేరువచ్చే అవకాశాలున్నాయి. సన్నటి పూలతీగల సువాసనలతో, పుష్ప బంధాలతో కట్టి పడేస్తూ మానసిక సంస్కారం నేర్పే నవలిది. - డాక్టర్ నూకతోటి రవికుమార్ చర్చకు తావిచ్చే ఆలోచనలు పుస్తకం : ఆలోచనలు-అనుభూతులు (వ్యాసాలు) రచన : }పతి పండితారాధ్యుల పార్వతీశం విషయం : పార్వతీశం పద్య, వచన కవిత్వపు లోతులెరిగిన పండిత కవి. సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంతో పరిశీలించడం పొరపాటు, తాత్వికంగా అనేక కోణాల నుండి పరిశీలించాలనేది వీరి ఉద్దేశం. కవిత్వం రసాత్మకమైనదిగా ఉండాలే గాని, రభసాత్మకంగా ఉండకూడదంటారు. సాహిత్యం సందేశాత్మకంగా, చైతన్యవంతంగా చలుపరించే గాయాల్ని మాన్పించే అద్వితీయమైన అమూర్త ఔషదంగా ఉండాలనేది వీరి భావన. ఆత్మానందంగా జీవికలోంచి తొంగిచూసే ఓ కొత్త వెలుగులాగ కవిత్వం ఉండాలంటారు. వీరు రాసిన ‘ఆలోచనలు - అనుభూతులు’ సంకలనాన్ని ఆరు ప్రధాన శీర్షికలుగా విభజించి, ప్రాచీన, ఆధునిక, ఆధునికానంతర వాదాల వరకు సూచన ప్రాయంగా, విమర్శనాత్మకంగా విశ్లేషించారు. వచన కవిత్వంలో చోటుచేసుకున్న ఆధునిక, ఆధునికానంతర ధోరణులు పాఠకులకు అర్థం కాకుండా పోవడాన్ని ‘ఆధునిక కవిత్వ అసంతృప్తి కారకాలు’ శీర్షికలో వ్యంగ్యంగా వ్యక్తీకరించారు. ఇటువంటి భావన ఛందోబద్దంగా రాసే కవులకు కూడా వర్తిస్తుందనేది ఈ రచయిత గమనించాల్సి ఉంది. ఛందస్సులో నింపినంత మాత్రాన పద్యం భావయుక్తంగా భాషాపటిమతో విరాజిల్లుతుందనుకోవడం పక్షపాతమే అవుతుంది. ఏ ప్రక్రియలో రాసినా కవిత్వంలో కవిత్వం ఉండాలి. ప్రాచీన ఆధునిక కవితారీతుల నిర్మొహమాటమైన విశ్లేషణలు తెలియాలంటే ఈ పుస్తకం చదవాలి. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి జ్ఞాపకాల కన్నీటి వెల్తురు పుస్తకం : శతాబ్ది వెన్నెల (కవిత్వం) రచన : కె.గీత విషయం: మంచు తెరలు, పుట్టినూరు, అభిరుచులు, అమెరికా జీవితం, డాలర్ దాడి, కంప్యూటర్లు... వెరసి ‘గీత’ కవితా సారాంశం. ద్రవభాష, శీతసుమాలు తర్వాత ఆమె తెరిచిన మూడో కవితానేత్రం ‘శతాబ్ది వెన్నెల’. ఈ కవిత్వం నిండా తాను కోల్పోయిన, కోల్పోతున్న జ్ఞాపకాలు ఉడుతల్లా పరిగెడుతుంటాయి. కవితలన్నీ ‘గలగలా గాలి రాల్చి’ సాదరంగా ఆహ్వానిస్తాయి. ఏనుగంత గడ్డిలో ఏనుగెక్కి సవారీ చేస్తూ, నిశ్శబ్ద కుంజర గమనాన్ని స్వప్నిస్తుంటాయి. అక్షరాల మధ్య ప్రేమ ప్రవాహమయ్యే నిశ్శబ్దం వినిపిస్తుంది. గీత కవిత్వం నిండా ‘కంట్లో గుచ్చుకునే అయిదు పైసల పుల్లయిసు’లుంటాయి. ‘వంటింటి నుంచి మొదలై వంటింట్లో అంతమయ్యే రోజు’లుంటాయి. ‘ఎటు ఒత్తిగిలినా గుచ్చుకునే వాస్తవా’లుంటాయి. వీటన్నిటికీ గీత ‘బయటి లోకపు ద్వారపాలకురాలు’. కవయిత్రి తన అమెరికా జీవితాన్ని ఆవిష్కరించారు. వెన్నెల వెనక విషాద ఛాయల్నీ అక్షరీకరించారు. ప్రతి కవితలోనూ తనదైన కవితాసామగ్రిని సమకూర్చుకోవడంలో కృషి కనిపిస్తుంది. ‘బడివాన’, ‘ఇంటూ నలభై’, ‘ఎగిరొచ్చిన ఇల్లు’, ‘గోడకివతల’ వంటి శీర్షికలు పెట్టడం; జలశరాలు, వణుకు కెరటాలు, కన్నీటి వెల్తురు, ఇంటర్వ్యూల పాములు, కన్నీళ్ల పిడిగుద్దులు, అపజయాల దిగుడుబావి, లోహపు దంతాలు వంటి పద బంధాలు సృష్టించడమే అందుకు నిదర్శనం. - ఎమ్వీ రామిరెడ్డి