ఛండీఘర్: ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు సహా భద్రతా బలగాలు గాలిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే అమృత్‌పాల్ సిక్కులతో సమావేశమవుతారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
ఇదిలా ఉండగా, అమృత్‌పాల్ సింగ్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పప్పాల్‌ప్రీత్ సింగ్‌ను పంజాబ్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కాగా, గత నెలలో వీరిద్దరూ పారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్ పోలీసులు పప్పాల్ సింగ్‌ను హోషియార్‌పూర్‌లో పట్టుకున్నారు. ఇక, అమృత్‌పాల్‌తో పాటు పప్పాల్‌సింగ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అతను చిక్కినట్టు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు.. అమృత్‌పాల్ సింగ్, పప్పాల్ సింగ్ కలిసి జలంధర్, హోషియార్‌పూర్, అమృత్‌సర్ జిల్లాల్లో ఆశ్రయం పొందారు. వీరిద్దరూ ఫగ్వారా పట్టణం, నాద్లోన్, బీబీ గ్రామంలోని మూడు వేర్వేరు డేరాలలో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం.. మార్చి 18వ తేదీ నుంచి అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Source: Fugitive Amritpal's close aide Papalpreet Singh arrested from Hoshiarpur in a joint operation by Punjab Police and Punjab Counter Intelligence. pic.twitter.com/sBvQKqM8mI
— Nikhil Choudhary (@NikhilCh_) April 10, 2023
Comments
Please login to add a commentAdd a comment