
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్-హర్యానాలోని శంభు సరిహద్దు(Shambhu border) వద్ద 13 నెలలుగా ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రైతులు నిర్మించిన తాత్కాలిక వేదికను, టెంట్లను తొలగించారు. రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, సర్వాన్ సింగ్ పాంధర్ సహా దాదాపు 200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ పోలీసుల చర్యలపై బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | पुलिस ने पंजाब-हरियाणा शंभू बॉर्डर पर किसानों द्वारा बनाए गए अस्थायी मंच से पंखों को हटाया। किसान यहां विभिन्न मांगों को लेकर धरने पर बैठे थे। प्रदर्शनकारी किसानों को मौके से हटाया जा रहा है। pic.twitter.com/tbZw7TDqzA
— ANI_HindiNews (@AHindinews) March 19, 2025
పటియాలా ఎస్ఎస్పీ నానక్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘శంభు సరిహద్దులో రైతులు చాలా కాలంగా నిరసనలు చేపడున్నారు. డ్యూటీ మేజిస్ట్రేట్(Duty Magistrate) సమక్షంలో పోలీసులు రైతులకు ముందస్తుగా హెచ్చరిక జారీచేశాకనే, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశాం. కొంతమంది రైతులను బస్సులలో వారి ఇంటికి పంపించామని అన్నారు. ఇక్కడి నిర్మాణాలు, వాహనాలను కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు. రోడ్డును క్లియర్ చేసి, వాహనాల రాకపోకల కోసం తెరుస్తామన్నారు. రైతుల నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకపోవడంతో తాము ఎటువంటి బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాలేదని, రైతులు తమకు సహకరించారని నానక్ సింగ్ అన్నారు.

#WATCH | पुलिस ने पंजाब-हरियाणा शंभू बॉर्डर से किसानों को हटाया जो विभिन्न मांगों को लेकर धरने पर बैठे थे। pic.twitter.com/UspNUmgY5R
— ANI_HindiNews (@AHindinews) March 19, 2025
ఈ తొలగింపులకు ముందుగా ఇక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. శంభు సరిహద్దు వద్ద రైతులు నిర్మించిన తాత్కాలిక షెల్టర్లను కూల్చివేయడానికి బుల్డోజర్లను ఉపయోగించారు. పంజాబ్ పోలీసులు.. రైతు నాయకులను అదుపులోకి తీసుకోవడంపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ తాను పంజాబ్ ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నానని, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిగ్గుపడాలని, కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన చర్చలకు పరిష్కారం దొరకాలని ఆప్ ప్రభుత్వం కోరుకోవడంలేదని ఆయన విమర్శించారు.
ఇది కూడా చదవండి: సునీత లానే అంతరిక్షంలో చిక్కుకుపోయిన ‘హీరో’
Comments
Please login to add a commentAdd a comment