detained
-
జార్జ్ ఫ్లాయిడ్ తరహాలో మరో ఘటన.. ఊపిరాడటం లేదని వేడుకున్నా
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాడీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను ఒహియో స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఈ ఘటన ఏప్రిల్ 18న చోటు చేసుకుంది. వివరాలు ప్రకారం.. ఫ్రాంక్ టైసన్ ( 53) అనే వ్యక్తిని హిట్ అండ్ రన్ కేసులో అనుమానితుడిగా భావించిన ఒహియో స్టేట్ పోలీసులు ఓ బార్లో బలవంతగా పట్టుకున్నారు. బార్లో ఉన్న ఫ్రాంక్ టైసన్‌ను లాక్కేళ్లుతూ.. మెడపై మోకాలు పెట్టి బలవంతంగా ఇద్దరు పోలీసులు బేడీలు వేసి ఊపరాడకుండా చేశారు. ఈ సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదు.. తనను వదిలేయాలని ఎంత వేడుకున్నా ఆ ఇద్దరు పోలీసులు అస్సలు వినకుండా అతనిపై మోకాలు పెట్టి బేడీలు వేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక..ఇప్పటికే ఓ కిడ్నాప్ కేసులో 24 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఫ్రాంక్ టైసన్ ఏప్రిల్ 6న విడుదలయ్యారు. అయితే అతను తన పెరోల్‌కు సంబంధించి ఉన్నతాధికారికి రిపోర్టు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. 2020లో మినియాపొలిస్ పోలీసుల చేతిలో ఇదే జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మృతి మృతి అప్పట్లో తీవ్రం దుమారం రేపింది. అనతంరం జార్జ్ మరణానికి కారణమైన డెరిక్ చౌవిక్ను కోర్టు కఠిన శిక్ష విధించిన సంగతి విదితమే.NEW: 53-year-old man dies after getting taken to the ground by police and telling them that he couldn’t breathe. As Ohio man Frank Tyson was motionless on the ground, one officer could be heard bragging about the “bar fight.” Tyson had just gotten out of prison according to… pic.twitter.com/vGUTHfLHI6— Collin Rugg (@CollinRugg) April 26, 2024 -
ఖతార్‌లో ఎనిమిదిమంది భారతీయుల మరణశిక్ష రద్దు!
భారత్ దౌత్యపరంగా మరో విజయం సాధించింది. ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులు విడుదలయ్యారు. దీనిపై భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఎనిమిది మంది భారతీయుల్లో ఏడుగురు భారత్‌కు తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లు దోహాకు చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్‌లో పనిచేశారు. గూఢచర్యం ఆరోపణలపై 2022, ఆగస్టులో వీరు అరెస్టయ్యారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ ఖతార్ సైనిక దళాలకు, ఇతర భద్రతా సంస్థలకు శిక్షణ, ఇతర సేవలను అందిస్తుంది. ఏడాదికి పైగా జైలు జీవితం గడిపిన అనంతరం ఈ మాజీ మెరైన్లకు ఖతార్‌లోని దిగువ కోర్టు గత ఏడాది అక్టోబర్‌లో మరణశిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం భారత్‌కు ఇవ్వలేదు. దీంతో ఈ నిర్ణయంపై భారత్ అప్పీల్ చేసింది. #WATCH | Delhi: Qatar released the eight Indian ex-Navy veterans who were in its custody; seven of them have returned to India. pic.twitter.com/yuYVx5N8zR — ANI (@ANI) February 12, 2024 దీనిపై విచారణ జరిగిన నేపధ్యంలో ఆ ఎనిమిది మంది అధికారుల మరణశిక్షను ఖతార్ రద్దు చేసింది. ఈ విధంగా భారతదేశం దౌత్యపరంగా మరో విజయం సాధించింది. దుబాయ్‌లో జరిగిన కాప్-28 కాన్ఫరెన్స్‌లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల గురించి అమీర్‌తో మాట్లాడారు. #WATCH | Delhi: One of the Navy veterans who returned from Qatar says, "We are very happy that we are back in India, safely. Definitely, we would like to thank PM Modi, as this was only possible because of his personal intervention..." pic.twitter.com/iICC1p7YZr — ANI (@ANI) February 12, 2024 ఖతార్ అదుపులో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్‌పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ విశాఖ వాసి. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ డిసెంబర్ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న భారత్ వారి విడుదలకు విశేష కృషి చేసింది. అవన్నీ ఫలించి ఈరోజు వారు స్వదేశానికి చేరుకోవటంతో భారత్‌కు దౌత్యపరంగా గొప్ప విజయం లభించినట్లయింది. -
మహాదేవ్ యాప్ ‘రవి’ అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్ (43)ను దుబాయ్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. అతడిని భారత్ ర్రప్పించి విచారిస్తామని తెలిపారు. -
బైడెన్ డ్రైవర్ నిర్బంధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: జీ20 సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కారు డ్రైవర్‌ను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేసినందుకు బైడెన్ కాన్వాయ్ నుంచి అతన్ని తొలగించారు. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కారును నడిపినందుకు సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అధ్యక్షుడు బైడెన్ కాన్వాయ్‌లో ఓ కారు డ్రైవర్ తన కారును యూఏఈ అధ్యక్షుడు నివాసముండే తాజ్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ విభాగం అధికారులకు సమాచారం అందించారు. ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఉదయం 9:30కి బైడెన్ నివాసముండే మౌర్య హోటల్‌కు వెళ్లాల్సి ఉందని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో లోధి ఎస్టేట్ వద్ద నుంచి ఓ బిజినెస్ మ్యాన్‌ను తాజ్ వద్ద దించాల్సి వచ్చిందని చెప్పాడు. తనకు ప్రోటోకాల్స్ గురించి తెలియదని చెప్పాడు. దీంతో ఆ డ్రైవర్‌ను వదిలేశారు. జీ20 మీటింగ్‌కు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం ఢిల్లీ వచ్చారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం శనివారం రాత్రి డిన్నర్ మీటింగ్‌కి హజరయ్యారు. ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కొద్ది క్షణాల ముందే ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. ఇటు నుంచి నేరుగా వియత్నాంకు బయలుదేరారు. ఇదీ చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ వెనక షేర్పాల కఠోర శ్రమ -
కొత్త పార్లమెంట్ భవనం వద్ద రెజ్లర్లు నిరసనకు ప్లాన్..కానీ అనూహ్యంగా..
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ని అరెస్టే చేయాల్సిందే అంటూ జంతర్‌మంతర్ వద్ద భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగుతున్నందున్న ఒలింపియన్లు, కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్లతో సహా భారత అగ్రశ్రేణి రెజ్లర్లంతా అక్కడే నిరసనలు చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని, నిరసనను ఆపించేశారు. ఈ నేపథ్యంలో కొందరు రెజ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు నిర్వహిస్తున్న మహిళా మహా పంచాయత్ కోసం వేలాదిగా భద్రతా సిబ్బంది మోహరించారు. అదీగాక పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం కోసం అదనపు పోలీసులు ఢిల్లీ సరిహద్దుల వెంబడి మెహరింపు తోపాటు బహుళ బారికేడ్లు, కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేసేలా డిల్లీ మెట్రోలోని సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ భవన్ స్టేషన్లలోని అన్ని ప్రవేశ మార్గాలను అదికారులు మూసేశారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they try to march towards the new Parliament from their site of protest at Jantar Mantar. Wrestlers are trying to march towards the new Parliament as they want to hold a women's Maha Panchayat in front of… pic.twitter.com/3vfTNi0rXl — ANI (@ANI) May 28, 2023 ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ దేవేంద్ర పాఠక్ మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసనకు అనుమతి నిరాకరించినప్పటికీ..వారంతా కొత్త భవనం సమీపంలో మహిళా మహా పంచాయత్‌ను నిర్వహించాలని పట్టుబట్టారు. ఐతే తాము అథ్లెట్లను గౌరవిస్తాం. కానీ లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించే పనులకు అనుమతివ్వం. అలాగే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ఎలాంటి ఆటంకాలు రానివ్వం అని చెప్పారు. మరోవైపు రెజ్లర్లకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద వేలాది మంది రైతులు తరలివస్తారని ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికైత్ ప్రకటించారు. ఈ రైతులు వివిధ సరిహద్దు ప్రాంతాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో భద్రత బలగాలు ఢిల్లీ సరిహద్దుల వెంబడి నిఘా ఉంచడమే గాక తనిఖీలు నిర్వహించకుండా ఎవ్వరినీ అనుమతించకుండా గట్టి పహారా నిర్వహించారు. (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి!
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా దేశ రాజధానిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు అదుపులోకి తీసుకుంది యాంటీ డ్రగ్స్ ఫోర్స్. దీంతో దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమవారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసి సుమారు 100 మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టు ముట్టారు. నైజీరియన్లను వారి నుంచి విడిపించేందుకు పోలీసులకు చుక్కులు చూపించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశం పంపించేందుకు నెబ్‌సరాయ్‌లోని రాజుపార్క్‌కు శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్కొటిక్స్ సెల్ బృందం వెళ్లింది. వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే పోలీసులను 100 మంది ఆఫ్రికన్లు చుట్టుముట్టారు. వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ముగ్గురిలో ఇద్దరు పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. 22 ఏళ్ల పిలిప్ అనే వ్యక్తి దొరికిపోయాడు. పోలీసులపై మూకదాడి సమాచారం అందుకున్న నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్ బృందం, నార్కొటిక్స్ స్క్వాడ్ సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌పార్క్‌కు చేరుకుంది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. మళ్లీ సుమారు 150-200 మంది ఆఫ్రికన్ దేశాల ప్రజలు పోలీసులను చుట్టుముట్టారు. పోలీసుల చెరలో ఉన్న వారు తప్పించుకునేందుకు సాయం చేశారు. వారిని చెదరగొట్టిన పోలీసులు నిందితులను నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వారిని స్వదేశాలకు పంపించనున్నారు. Delhi Cops Arrest 3 On Drug Charge, Foreigners' Mob Brings Them Back https://t.co/Ggnt34m0rC pic.twitter.com/tFJLQBcF1L — NDTV (@ndtv) January 8, 2023 ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
చైనాకు ఎదురు తిరిగితే అంతే...ఆ యువతి ఇంకా నిర్బంధంలోనే..
చైనా అనుసరిస్తున్న కఠినమైన జీరో కోవిడ్ పాలసీని ప్రజలు వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున బహిరంగంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నిరసకారులను అరెస్టు చేసి నిసనలను కట్టడి చేసేలా ఉక్కుపాదం మోపాలనుకుంది. సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత ఎక్కువ అవ్వడంతో చైనా ప్రభుత్వం ఇక గత్యంతరం లేని స్థితిలో వెనక్కి తగ్గి ఆంక్షలు సడలించింది. ఆ తర్వాత నాటి నిరసనలు కారణంగా అరెస్టు అయినా ఆందోళకారులను ఒక్కోక్కరిని నెమ్మదిగా విడుదల చేసింది. ఐతే యాంగ్ జింగ్ అనే 25 ఏళ్ల మహిళ డిసెంబర్ 4న నిరసనల్లో పాల్గొనడంతో అరెస్టయ్యింది. కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఆమె నిర్బంధించబడి సుమారు 9 రోజుల అయ్యిందని ఆమె తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. ఆ యువతి జైలులో ఎలా ఉందోనని ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అంతేగాదు సదరు యువతి రూమ్మేట్ని ఆమె మాత్రమే ఎందుకు నిర్బంధంలో ఉందని యువతి తల్లి ప్రశ్నించగా...ఆమె నిరసనలో పాల్గొన్నప్పుడూ తన ఐడింటిటీని చూపించలేదని తెలిపింది. దీంతో పోలీసుల బృందం తన రూమ్ వద్దకు వచ్చి ఫోన్, ల్యాప్‌టాప్‌ని తీసుకువెళ్లారని ఆ యువతి స్నేహితురాలు ఆమె తల్లితో చెప్పింది. ఆ యువతి తల్లి ఆమె కూతురు కోసం డిసెంబర్ 8న ఒక లాయర్ వెంట బెట్టుకుని ఆమె కేసును టేకప్ చేసిన పోలీస్ అధికారిని కలిసేందుకు అవకాశం లేదని ఆమె వాపోయింది. కనీసం ఆమె గురించి సమాచారం కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతమైంది. (చదవండి: ఆంక్షలను ఎత్తివేశాక..చైనాలో ఘోరంగా పెరుగుతున్న కరోనా కేసులు) -
ఫాంహౌజ్ కేసు: బెయిల్‌పై విడుదల, వెంటనే మళ్లీ అదుపులోకి..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్ చంచల్ గూడ జైల్ నుండి విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి బయటకి రాగానే ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి, నందకుమార్ లను పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే సింహయాజీ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతో పాటు సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది. -
జగిత్యాల : బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు..!
‘నైజీరియన్ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి సందేశం కావొచ్చు. మీరంతా నాకు సాయం చేస్తారని భావిస్తున్నా..’ అంటూ ఇక్వెటోరియల్ గినీలో బందీగా మారిన ఓ భారత నావికుడి వీడియో సందేశం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆఫ్రికా దేశమైన ఇక్వెటోరియల్ గినీలో గత ఆగస్టు నెలలో ‘హీరోయిక్ ఇడున్’ అనే నౌకను అక్కడి నౌకాదళం బందించింది. అందులోని 16 మంది భారత నావికులు సహా సిబ్బంది బందీలుగా ఉన్నారు. ఆగస్టు 13న హీరోయిక్ ఇడున్ నౌకపై ఇక్వెటోరియల్ గినియా జెండా లేదనే కారణంగా నిలిపేశారు. గత 80 రోజులుగా నావికులు బందీలుగా ఉన్నారని, వారిని నైజీరియా నేవీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హీరోయిక్ ఇడున్ నౌక చీఫ్ ఆఫీసర్, భారత నావికుడు సాను జోష్ తనను అదుపులోకి తీసుకునేందుకు కొన్ని క్షణాల ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ‘నైజీరియాన్ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు. మీరంతా నన్ను చూస్తున్నారని, నాకు సాయం చేస్తారని భావిస్తున్నా. ఈ సందేశాన్ని దేశంలోని ప్రతిఒక్కరికి చేరేలా చేస్తారని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నారు సాను జోష్. బందీలుగా మారిన భారత నావికులను విడిపించేందుకు భారత అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది సురక్షితంగా స్వదేశం చేరేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు.. గత ఆగస్టు నెల మధ్యలోనే హీరోయిక్ ఇడున్ అనే నౌకకు చెందిన భారత నావికులు సహా సిబ్బంది అంతా బందీలుగా పట్టుబడ్డారని విదేశాంగ శాఖకు తెలియజేశారు రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీం. మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బందీలను త్వరగా విడుదల చేయడానికి గినీ, నైజీరియా దేశాలకు చెందిన అధికారులతో చర్చిస్తున్నామని ఇక్వెటోరియల్ గినీలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం? -
తమిళనాడు: అన్నాడీఎంకేలో డిప్యూటీ చిచ్చు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నేత ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్), అన్నాడీఎంకేలో ఆయన అనుకూల వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్లను రాజారత్నం మైదానంలో నిర్బంధించారు. నల్ల చొక్కాలతో అసెంబ్లీ ఎదుట నిహారదీక్షకు ఆయన సిద్ధపడిన క్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎకేం వర్గపోరులో డిప్యూటీ చిచ్చు రాజుకుంది. అన్నాడీఎంకేలోని ఒక వర్గ నేత అయిన పళని స్వామి.. పార్టీ తరపున డిప్యూటీ నేతగా తాజాగా ఆర్బీ ఉదయకుమార్‌ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్)ను డిప్యూటీ లీడర్‌గా తొలగించాలని, అసెంబ్లీలో ఓపీఎస్ సీటును తన పక్క నుంచి వేరే చోటుకి మార్చాలని స్పీకర్‌కు లేఖలు రాశారు పళనిస్వామి. అయినా చర్యలు లేకపోవడంతో.. స్పీకర్ చర్యను నిరసిస్తూ పళనిస్వామి నిరహార దీక్షకు దిగారు. దీంతో ఈపీఎస్ వర్గీయుల నినాదాల హోరుతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తతకు తెర లేపింది. ఈ క్రమంలోనే శాంతి భద్రతల పరిరక్షణకు పళనిని, ఆయన వర్గీయులను పోలీసులు అదుపులోకి ప్రత్యేక వాహనంలో తీసుకున్నారు. పళనిస్వామి వర్గంలోని ఉదయ్‌కుమార్‌ను తాజాగా అన్నాడీఎంకే ఉప నేతగా కార్యవర్గం ఎన్నుకుంది. మరోవైపు అసెంబ్లీలో తన పక్కన సీటులో పన్నీర్ సెల్వంను కూర్చోనివ్వొద్దంటూ స్పీకర్‌కు లేఖలు రాశారు పళనిస్వామి. ఈ విషయమై మంగళవారం అసెంబ్లీలో వాగ్వాదం చెలరేగగా.. మార్షల్స్ సాయంతో ఈపీఎస్‌ను ఆయన ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి స్పీకర్ బయటకు పంపించేశారు. ఇక సీటింగ్ విషయమై తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని.. ఆ అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ అప్పావు చెప్తున్నారు. అయితే పళనిస్వామి మాత్రం అధికార పార్టీ ఆదేశాలతోనే పన్నీర్ సెల్వం వర్గానికి స్పీకర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు మంగళవారం అసెంబ్లీలో గొడవ జరిగినప్పుడు.. పన్నీర్‌సెల్వం ప్రశాంతంగా పళనిస్వామి పక్క సీటులోనే కూర్చోవడం గమనార్హం. விடியா அரசின் அராஜகத்தை எதிர்த்து உண்ணாவிரத போராட்டம் நடத்திய எதிர்கட்சித் தலைவர் அண்ணண் திரு.@EPSTamilNadu அவர்கள் மற்றும் சட்டமன்ற உறுப்பினர்கள் கைது!! திராணியற்ற #திமுக அரசை வண்மையாக கண்டிக்கின்றேன்..#DMKFailsTN #TNAssembly #AIADMK #ValluvarKottam pic.twitter.com/a1FMffDzBD — Thiruverkadu S UDHAYA KUMAR (@tssudhayakumar) October 19, 2022 -
ఇండియన్ ఆర్మీపై దాడులకు పాక్ ఆర్మీ స్కెచ్
శ్రీనగర్: భారత గడ్డపై దాడులకు పాక్ సైన్యం కుటిల యత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో.. భారత్‌లో దాడులకు సుపారీ తీసుకున్న ఓ ఉగ్రవాదిని భారత సైన్యం నిలువరించగలిగింది. జమ్ము కశ్మీర్ రాజౌరి వద్ద గత రెండురోజులుగా భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీవోకే సమీపంలోని అటవీ ప్రాంతంలో భారత సైన్యం అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. ఆగస్టు 21న నౌషేరా ప్రాంతంలోని ఝంగర్ సెక్టార్ నుంచి భారత్‌లోకి ఆయుధాలతో అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని గాయపరిచి అదుపులోకి తీసుకుంది భారత సైన్యం. సరిహద్దు ప్రాంతంలోని ఫెన్సింగ్‌ను కట్ చేసి చొరబడేందుకు ప్రయత్నించారు. గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపి.. అతన్ని గాయపరిచి పట్టుకున్నారు. గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడడమే కాకుండా.. అతని నుంచి కీలక సమాచారం సేకరించింది భారత సైన్యం. అతన్ని పీవోకే కొట్లి జిల్లా సబ్జ్‌కోట్‌కు చెందిన తబరాక్ హుస్సేన్‌గా గుర్తించింది. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి చెందిన కల్నల్ యూనస్ చౌద్రీ తనను పంపించాడని, భారత ఆర్మీపై దాడులకు పాల్పడాలంటూ తనకు రూ.30వేల పాక్ రూపాయలను ఇచ్చాడని వెల్లడించాడు. ఆయుధాలతో పాటు పాక్ కరెన్సీని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. విశేషం ఏంటంటే.. 2016లో తబరాక్ నియంత్రణ రేఖ వెంబడి తన సోదరుడితో సహా చొరబడేందుక యత్నించగా.. ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే మానవతా ధృక్పదంతో ఏడాది జైలుశిక్ష తర్వాత అతన్ని మళ్లీ వెనక్కి పంపించేసింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ఈసారి ఏకంగా దాడులకే సిద్ధపడడం గమనార్హం. #WATCH | Tabarak Hussain, a fidayeen suicide attacker from PoK, captured by the Indian Army on 21 August at LOC in Jhangar sector of Naushera, Rajouri, says he was tasked by Pakistan Army's Col. Yunus to attack the Indian Army for around Rs 30,000 pic.twitter.com/UWsz5tdh2L — ANI (@ANI) August 24, 2022 ఇదీ చదవండి: మరో జలియన్ వాలాబాగ్.. 80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం -
యుద్ధంపై విమర్శ... రష్యాన్ రాజకీయవేత్తపై వేటు..
మాస్కో: ఉక్రెయిన్ పై యుద్ధం చేయడం గురించి రష్యన్ రాజకీయవేత్త ఒకరు విమర్శించారు. ఇలా ఉక్రెయిన్ పై అమానుషంగా యుద్ధం చేసి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకోవడం తప్పు అంటూ పలు విమర్శలు చేశారు. అంతే సదరు రాజకీయవేత్త, మాజీ మేయర్ యెవ్జెనీ రోయిజ్ మాన్ పై రష్యాన్ అధికారులు సీరియస్ అవ్వడమే కాకుండా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి చర్యలు రష్యా బలగాలను అప్రతిష్టపాలు చేసేలా చేయడమేనంటూ మండిపడ్డారు. అతను ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశాడని కూలంకషంగా రష్యా అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అతను రష్యాలో ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థి, పైగా పలు మేయర్ పదువులను అలంకరించిన ప్రముఖ వ్యక్తి. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటోంది. ఈ తరుణంలో ఎవరైన క్రెమ్లిన్‌ని తప్పుపట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కన్నెరజేస్తోంది రష్యా. ఆయా వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. గతంలో ఒక యాంకర్ కూడా ఇలానే యుద్ధం వద్దంటూ ప్లకార్డులు పట్టుకున్నందుకు ఆమెను రష్యా భధ్రతా బలగాలు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉక్రెయిన్ దళాలు కూడా ఈ దాడిని ప్రతిఘటించడమే కాకుండా రష్యా తన బలగాలను ఉపసంహరించుకునేలా పశ్చిమ దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధించాయి కూడా. ఆఖరికి ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తిని తోసిపుచ్చి తనదైన శైలిలో ఉక్రెయిన్ పట్ల దురుసుగా వ్యవహరిస్తోంది. (చదవండి: ఉక్రెయిన్‌ని విడిచిపెట్టి వచ్చేయండి!... హెచ్చరించిన యూఎస్) -
దీక్ష భగ్నం.. బండి సంజయ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/జనగామ: కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ పాంమ్నూరు వద్ద బండి సంజయ్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. కార్యకర్తల తోపులాట మధ్యే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై తెలంగాణ ప్రభుత్వం-పోలీసుల దాడి నేపథ్యంతో ఆయన దీక్షకు ఉపక్రమించగా.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సహా కేంద్ర పెద్దల బండి సంజయ్‌ను ఫోన్లో పరామర్శించారు. ఇక దాడి నేపథ్యంలో భద్రత పెంచేందుకు పోలీసులు సిద్ధం కాగా, ఆ భద్రతను తిరస్కరించారు బండి సంజయ్.‘నా భద్రత సంగతి కార్యకర్తలే చూసుకుంటారు’ అని ఆయన పోలీసులతో తేల్చి చెప్పినట్లు సమాచారం. కార్యకర్తలకు ఏదైనా జరిగితే సర్కార్ అంతు చూస్తామని హెచ్చరించిన బండి సంజయ్.. పాదయాత్ర శిబిరం వద్ద ‘‘కేసీఆర్ కుటుంబ దమన నీతిపై ధర్మదీక్ష’’కు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్ర శిబిరం వద్ద ముందుగానే మోహరించిన పోలీసులు.. ఆయన భద్రతా కారణాల దృష్ట్యే అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం పాత్రను తేల్చేంతవరకు తాము నిరసనలు కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇదీ చదవండి: చావడానికైనా రెడీ: రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ -
పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ.. ‘మోదీ కింగ్’ అంటూ నినాదాలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ విచారించటం సహా.. ధరల పెరుగుదల, జీఎస్టీ అంశాలపై ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆందోళనకు దిగింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీని చుట్టుముట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రంజీత్ రంజన్, కేసీ వేణుగోపాల్, మానికం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కే సురేశ్‌లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈడీ విచారణ నేపథ్యంలో ముందుగానే విజయ్ చౌక్, ఈడీ కార్యాలయాల ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసి 144 సెక్షన్ విధించారు అధికారులు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు ర్యాలీ చేపట్టారు. సోనియా గాంధీతో ఈడీ కార్యాలయానికి వచ్చిన రాహుల్.. వారితో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. పోలీసులు అడ్డుకోవటంతో రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా కేంద్రం, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు రాహుల్. ‘భారత్ ఒక పోలీసు రాజ్యంగా మారింది. ఆ రాజ్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కింగ్’ అని ఆరోపించారు రాహుల్. రాహుల్ గాంధీని పోలీసులు చుట్టుముట్టిన క్రమంలో సుమారు 30 నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అనంతరం రాహుల్ గాంధీని ఎత్తుకెళ్లి బస్సు ఎక్కించారు. అప్పటికే ఆయనతో ఉన్న పలువురు ఎంపీలను బస్సు ఎక్కించారు. ‘పోలీసుల సూచనల మేరకే నిరసనల్లో పాల్గొన్నాం. విపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టటం, మా గొంతులను నొక్కేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు చేస్తున్న కుట్ర. దానికి మేము భయపడం. మా పోరాటం కొనసాగుతుంది. ’ అని తెలిపారు కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే. ఇదీ చదవండి: National Herald Case: రెండో రోజు ఈడీ ముందుకు సోనియా గాంధీ -
Telangana: రేవంత్ రెడ్డి అరెస్ట్
సాక్షి, నిర్మల్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బాసర పోలీసులు అరెస్ట్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో.. శుక్రవారం బాసరకు చేరుకున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోలీసుల వలయాన్ని ఛేదించి రహస్యంగా గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆపై ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. అక్రమ అరెస్టుపై ఆయన మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. -
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ అరెస్ట్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ వద్ద విద్యార్థుల నిరసనలలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం విద్యార్థులకు మద్ధతు ప్రకటించడానికి బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చిన సీపీఐ నేత నారాయణను, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా సీపీఐ నాయకులు నినాదాలు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలోకి ఎస్ ఎఫ్ఐ నేతలు దూసుకెళ్లగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. సమస్యలు పరిష్కరించాల్సిన సర్కారు అణచివేస్తుండడంపై విద్యార్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యార్థుల నిరసనలకు సంబంధించి విరుద్ధ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఒకవైపు ఐటీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సతీష్ కుమార్‌ను నియమించింది ప్రభుత్వం. మరోవైపు విద్యార్థులతో చర్చలు ఫలించాయని కలెక్టర్ ప్రకటించారు. అయితే విద్యార్థులు మాత్రం కలెక్టర్‌తో చర్చలు విఫలం అయ్యాయనే అంటున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద వరుసగా మూడో రోజుల విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ నియామకంతో సమస్యలు పరిష్కారం కావని విద్యార్థులు అంటున్నారు. సీఎం కేసీఆర్ వస్తే తప్పా.. ఆందోళన విరమించమని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పన్నెండు ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ బాసర ఆర్జీయూకేటీ స్టూడెంట్స్ మూడు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర విద్యాశాఖ, మరోవైపు స్థానిక అధికార యంత్రాంగం కల్పించుకుంటున్న చర్చలు ఓ కొలిక్కిరావడం లేదు. -
Digital Rape: డిజిటల్ రేప్ కింద వృద్ధుడి అరెస్ట్
నోయిడా: తన కూతురికి చదువు చెప్పిస్తాడేమో అనే ఉద్దేశంతో అతని దగ్గరికి పంపిస్తే.. ఆ వృద్ధుడు మాత్రం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు.. అలా ఏడేళ్లపాటు అసాధారణ రీతిలో సాగింది ఆ వ్యవహారం. చివరికి బాధితురాలు ధైర్యం చేయడంతో ఈ వేధింపుల పర్వం వెలుగు చూసింది. నిందితుడి మౌరైస్ రైడర్ వయసు 81 ఏళ్లు. వృత్తి రిత్యా పెయింటింగ్ ఆర్టిస్ట్, టీచర్ కూడా. హిమాచల్ ప్రదేశ్‌లో అతనికొ ఒక ఆఫీస్ ఉంది. ఏడేళ్ల కిందట అతని దగ్గర పని చేసే ఓ వ్యక్తి.. తన కూతురిని ఆ వృద్ధుడి దగ్గరకు సాయంగా పంపించాడు. బదులుగా ఆమెకు చదువు చెప్పిస్తానని హామీ ఇచ్చాడు ఆ వృద్ధుడు. అయితే ఆనాటి నుంచి వృద్ధుడు ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. తండ్రికి చెబితే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె భరిస్తూ వచ్చింది. చివరికి.. ఆ వృద్ధుడి ఆగడాలు తట్టుకోలేక ఆ టీనేజర్ ధైర్యం తెచ్చుకుంది. గత నెల రోజులుగా మౌరైస్ బాగోతాలను రికార్డు చేస్తూ వచ్చింది. అందులో చాలావరకు ఆడియో ఫైల్స్ ఉన్నాయి. చివరకు వాటిని ఓ మహిళకు అప్పగించి, ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. దీంతో గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు(నోయిడా, యూపీ).. ఆదివారం డిజిటల్ రేప్ నేరం కింద మౌరైస్‌ను అరెస్ట్ చేశారు. డిజిటల్ రేప్ అంటే.. చాలామంది ఆన్లైన్ సంబంధిత నేరం అనుకుంటారు. కానీ, డిజిటల్ రేప్ మర్మాంగం కాకుండా ఏదేని వస్తువు, ఆయుధాలను, చేతి వేళ్లను ఉపయోగించి అసహజరీతిలో లైంగిక దాడులకు పాల్పడడం. ఇంగ్లీష్ డిక్షనరీలో డిజిటల్ అనే పదానికి అర్థంతో ఈ నేరానికి ఆ పేరొచ్చింది. గతంలో ఇది అత్యాచారం కిందకు వచ్చేది కాదు. కానీ, 2012 నిర్భయ ఘటన తర్వాత డిజిటల్ రేప్‌ను అమలులోకి తీసుకొచ్చారు. డిజిటల్ రేప్ కింద.. ఒక వ్యక్తికి కనీసం ఐదేళ్లు, గరిష్టంగా పదేళ్లు.. ఒక్కోసారి జీవిత ఖైదు విధిస్తారు. ఈ తరహా ఘటనల్లో 70 శాతం దగ్గరి వాళ్ల వల్లనే జరుగుతున్నాయి. కాబట్టే.. చాలా చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. చదవండి: పెదాలపై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు -
‘ఫ్రీడం 251’ మోహిత్ గోయల్ మళ్లీ అరెస్ట్
నాలుగేళ్ల క్రితం డెడ్ చీప్‌గా స్మార్ట్‌ఫోన్ అందిస్తానంటూ ప్రకటన చేసిన మోహిత్ గోయల్ గుర్తున్నాడా? దేశం మొత్తం కుదిపేసిన ‘ఫ్రీడం 251 ఫోన్’ స్కాం ప్రధాన నిందితుడైన ఈ మోహిత్‌ను ఇప్పుడు పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని 41 లక్షలకు ముంచడంతో పాటు చంపేందుకు ప్రయత్నించిన నేరారోపణలపై గ్రేటర్ నోయిడా పోలీసులు మోహిత్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గోయల్‌తో పాటు మరో ఐదుగురిపైనా 41 లక్షల రూపాయలకు సంబంధించిన లావాదేవీల మోసంపై ఇందిరాపురం చెందిన వికాస్ మిట్టల్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం గ్రేటర్ నోయిడాలోని గోయోల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రై ఫ్రూట్స్ అమ్మకాలకు సంబంధించిన వ్యహారంలో మోసం చేయడమే కాకుండా.. డబ్బుల గురించి నిలదీస్తే చంపేస్తానని వికాస్‌ను చెదిరించాడు గోయల్. అంతేకాదు కారుతో ఢీ కొట్టి చంపేందుకు ప్రయత్నించాడని వికాస్ ఆరోపిస్తున్నాడు. దీంతో వికాస్ ఫిర్యాదు మేరకు మోహిత్ గోయల్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మోసం, దోపిడీ, చంపేస్తానని బెదిరించడం, గాయపర్చడం.. ఇలా పలు నేరాలకుగానూ ఐపీసీ సెక్షన్లతో మోహిత్‌పై కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే 2017లో రింగింగ్ బెల్ అనే కంపెనీ ద్వారా ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్ల అమ్మకం ప్రకటన ద్వారా సంచలనానికి తెరలేపిన మోహిత్.. భారీ స్కామ్‌తో వార్తల్లోకి ఎక్కి అరెస్టైన విషయం తెలిసిందే. ఆపై దుబాయ్ డ్రై ఫఫ్రూట్స్ అండ్ స్పైసిస్ పేరుతో ఓ ఆఫీస్ తెరిచి.. సుమారు 200 కోట్ల స్కాంకు పాల్పడ్డాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ డ్రై ఫ్రూట్స్ వ్యవహారంలో పలు రాష్ట్రాల నుంచి అతనిపై 35 కేసులు నమోదు అయ్యాయి. చదవండి: సిండికేట్ బ్యాంక్‌లో మోసం కేసులో సీబీఐ చార్జ్‌షీట్ -
మరో పోర్నోగ్రఫీ రాకెట్.. వర్ధమాన నటి అరెస్ట్
హిందీ సినిమా ఫైనాన్షియర్, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారం వార్తల్లో కొనసాగుతుండగానే.. మరో పోర్న్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో గుట్టుచప్పుడు కాకుండా అశ్లీల చిత్రాల వ్యవహారం నడిపిస్తున్న ఓ మోడల్ కమ్ నటిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా దొరకబట్టి.. అరెస్ట్ చేశారు పోలీసులు. వర్ధమాన నటి నందితా దత్తా(30) ఒకప్పుడు బిజీ మోడల్. చాలాకాలంగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఛాన్స్‌లు దొరక్క బీ గ్రేడ్, చివరికి సెమీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట నటిస్తూ వస్తోంది. అయితే తనకున్న పరిచయాలతో యంగ్ మోడల్స్‌కు వెబ్ సిరీస్ అవకాశాలను ఎరగా చూపెట్టింది. చివరికి వాళ్లు వలలో చిక్కాక.. నీలి చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఈ మేరకు ఇద్దరు బాధితురాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు డమ్ డమ్, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపారు. నక్‌టాలాలో తన ఇంట్లో ఓ మోడల్ నగ్నంగా మారాలని బెదిరిస్తున్న టైంలో పోలీసులు నందితాను అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. మరోవైపు డమ్ డమ్లోని మరో ఇంట్లో ఆమె అనుచరుడు మైనక్ నేతృత్వంలో పోర్న్ షూటింగ్ జరుపుతున్న టైంలో పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అవకాశాల ఆశజూపి తమను ఇందులోకి దింపిందని.. మాట వినకుంటే తన మనుషులతో చంపిస్తానని బెదిరించిందని నందితపై ఆ ఇద్దరు మోడల్స్ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు బాలీగుంజేలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో తనపై అఘాయిత్యం జరిగిందని పేర్కొంటూ ఈ మేరకు జులై 26న న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఇక ఈ కేసులో నందితతో పాటు మైనక్ ఘోష్ కీలక వ్యక్తులుగా భావిస్తున్నారు. ఇది భారీ సెక్స్ రాకెట్ అనే అనుమానం ఉందని, రాజ్‌కుంద్రాతో లింక్‌లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేపడతామని ఓ సీనియర్ అధికారి చెప్తున్నాడు. అయితే నందితను పూర్తిస్థాయిలో ప్రశ్నించాకే ఏ విషయం అనేదానిపై స్పష్టత వస్తుందని ఆయన అంటున్నాడు. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. రష్యా ప్లేయర్ అరెస్టు
పారిస్: గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యా క్రీడాకారిణి యానా సిజికోవాను శుక్రవారం ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 2020 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్ పోటీల్లో(సెప్టెంబర్ 30) సిజికోవా.. తన అమెరికన్ పార్ట్నర్ మాడిసన్ బ్రెంగ్లీలో కలిసి ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ ఓడినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో సిజాకోవా జోడీ.. రొమేనియా జంట ఆండ్రియా మీటు, పాట్రిసియా మారియా చేతిలో 6-7, 4-6 తేడాతో ఓటమిపాలైంది. రెండో సెట్ అయిదో పాయింట్ వద్ద సిజికోవా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతేడాది అక్టోబర్‌లో విచారణ ప్రారంభించిన పోలీసులు, తాజాగా ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా సిజికోవా తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. నిన్న (గురువారం) సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో రష్యా భామ ఎకాటరీనా అలెక్సాండ్రోవాతో తొలిసారి జతకట్టిన సిజికోవా.. 1-6, 1-6తో ఆస్ట్రేలియా జోడీ స్టార్మ్ సాండర్స్, అజ్లా టామ్లజనోవిక్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 101 స్థానంలో కొనసాగుతున్న సిజికోవా.. ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు పార్ట్నర్లను మార్చి వరుస పరాజయాలను మూటకట్టుకుంది. చదవండి: ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు -
ఏడేడు లోకాల ఎచటనుంటివో రాకుమారీ..!
మూడేళ్లుగా రాజుగారి కుమార్తె కనిపించడం లేదు. ఎక్కడుందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ఏ శత్రుదేశ సైనికులు ఆమెను అపహరించుకుని వెళ్లి ఉంటారు? శత్రుదేశ సైనికులు కాదు. ఏడు రాజ్యాల మహా సామ్రాజ్యాధీశుడే ఆమెను ఏడు లోకాల్లో ఎక్కడో నిర్బంధించాడు. ఆ రాకుమారి షేఖా లతీఫా. ఆ మహా సామ్రాజ్యాధీశుడు మొహమ్మద్ రషీద్. లతీఫా అతడి కుమార్తే. నిర్బంధించించి ఆ తండ్రే! ఇంతకీ ఆమె సజీవంగానే ఉందా? ఆ సంగతిని మొహమ్మద్ రషీదే చెప్పాలని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషల్’ అంటోంది! ‘పనోరమా’ అని.. బి.బి.సి. ఒక పరిశోధనాత్మక నిజ ఘటనల టీవీ సీరీస్‌ను ప్రసారం చేస్తుంటుంది. మొన్న మంగళవారం ఆ సీరీస్‌లో షేఖా లతీఫా తనే విడుదల చేసిన ఒక చిన్న వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ కనిపించారు! ‘ఓ మై గాడ్’ అనుకుంది ప్రపంచం ఒక్కసారిగా ఆమె తెరపై కనిపించగానే. వెంటనే ‘థ్యాంక్ గాడ్’ అని కూడా. ‘ఓ మై గాడ్’ అనుకోవడం ఎందుకంటే.. మూడేళ్ల క్రితం దుబాయ్‌లోని తన అంతఃపురం నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమై, తండ్రి చేతికి చిక్కాక తిరిగి మళ్లీ ఆమె లోకానికి కనిపించలేదు. మనిషీ లేదు. మాటా లేదు. ఆ మనిషి గురించిన మాట కూడా రాజసౌధం నుంచి చిన్న శబ్దంగానైనా లేదు. ఇప్పుడు ఆకస్మాత్తుగా బి.బి.సి.లో కనిపించినందుకే ఆ ఆశ్చర్యం. అయితే ఆ క్లిప్‌లో లతీఫా హాయిగా లేదు. నవ్వుతూ లేదు. ప్రశాంతంగా లేదు. బిక్కుబిక్కుమంటూ.. ఎవరూ వినకుండా మాట్లాడినట్లుగా ఉంది. అలసిపోయినట్లుగా ఉంది. అచేతనత్వానికి ప్రారంభ దశలో ఉన్నట్లుగా ఉంది. మొత్తానికి ప్రాణాలతోనైతే ఉందన్న భావనే ప్రేక్షకులు ‘థ్యాంక్ గాడ్’ అనుకోడానికి కారణం. అయితే ఆ క్లిప్ 2019 నాటిదని బి.బి.సి. ప్రకటించగనే అనుమానాలు. లతీఫా బతికే ఉందా?! క్లిప్‌లో ఆమె బాత్రూమ్లోంచి మాట్లాడినట్లుగా ఉంది. ఆ బాత్రూమ్ ఒక ఆకాÔ¶ హర్మ్యంలో ఉన్నట్లుగా ఉంది. ఆ ఆకాశహర్మ్యం ఏ రాజ్యంలో ఉన్నదో తెలియడం లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యు.ఎ.ఇ.) ఏడు రాజ్యాల మహాసామ్రాజ్యం. వాటిల్లో ఒకటి దుబాయ్. ఆ దుబాయ్ పాలకుడే లతీఫా తండ్రి మొహమ్మద్ రషీద్. యు.ఎ.ఇ.కి ప్రధాని, ఉపాధ్యక్షుడు కూడా కనుక కూతుర్ని ఆయన ఈ ఏడు లోకాలలో ఎక్కడైనా నిర్బంధించి ఉంచవచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషల్ సంస్థ అనుమానిస్తోంది. ‘ఒక జైలు లాంటి విల్లాలో ఆమె రెక్కలు తెగిన పక్షిలా పడివున్నారన్నది మాత్రం నిజం’ అని మేరీ రాబిన్సన్ అంటున్నారు. లతీఫా నుంచి తను సంపాదించిన ఆ బాత్రూమ్ క్లిప్‌తో పాటు, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు, యు.ఎన్.హ్యూమన్ రైట్స్ మాజీ హై కమిషనర్ అయిన రాబిన్సన్ ఇంటర్వ్యూని కూడా తన షోలో ప్రసారం చేసింది బి.బి.సి. ‘‘ఈ స్థితిలో ఆమె ఎంతకాలం జీవించి ఉండగలరో తెలియడం లేదు’’ అని ఆ ఇంటర్వ్యూలో రాబిన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ∙∙ ‘‘బయటికి వెళ్లి ఇంత స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి కూడా లేకుండా పోయింది’’ అని బి.బి.సి.కి అందిన క్లిప్‌లో ఆవేదన చెందుతూ కనిపించారు లతీఫా. ఆ ఎపిసోడ్ ప్రసారం అవగానే.. ‘రాకుమారి ఎలా ఉందో చెప్పండి’ అని ప్రపంచ మీడియా నుంచి దుబాయ్ ప్రభుత్వ మీడియాకు వెళ్లిన ఏ విజ్ఞప్తికీ జవాబు లేదు! ‘‘ఈ నిర్బంధం నుంచి నేను ఎప్పటికి బయటపడతానో, ఏ నిబంధనలను అంగీకరిస్తే నన్ను విడుదల చేస్తారో నాకు తెలియడం లేదు. నా భద్రత గురించి, నా జీవితం గురించీ రోజు రోజుకూ నాలో భయం పెరిగిపోతోంది’’ అని కూడా ఆ వీడియో ద్వారా తెలియజెప్పడంతో లతీఫా ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారన్న దానిపై సందేహాలు మొదలయ్యాయి. మొహమ్మద్ రషీద్‌కు ఆరుగురు భార్యలు, ముప్పైమంది పిల్లలు. వారందరి సమాచారం ఎంతోకొంత బయటి ప్రపంచం వరకూ వస్తున్నా, గత మూడేళ్లుగా ఏ ఒక్కరి నోటి నుంచీ లతీఫా మాటే రాలేదు! 2018 ముందువరకు ఆమె గురించి తెలిసింది ఒక్కటే.. స్కై డైవింగ్ అంటే ఆమెకు ప్రాణమని! ∙∙ లతీఫా అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కారణం, కుటుంబ ఆంక్షల నుంచి స్వేచ్ఛను పొందేందుకు బయట పడాలని 2018లో ఆమె చేసిన ప్రయత్నమే. తన ఫిన్లాండ్ స్నేహితురాలు టీనా జౌహానియస్, దుబాయ్ పాలకుడి తరఫున పని చేస్తుండే అరవై ఏళ్ల ఫ్రెంచి నిఘా అధికారి హెర్వ్ జాబెర్ట్, మరో ముగ్గురి సహాయంతో రాజప్రాసాదం నుంచి తప్పించుకుని లండన్ పారిపోయే ప్రయత్నంలో వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి 20న గోవాలో భారత తీరప్రాంత గస్తీ దళాలకు చిక్కింది. ఆశ్రయం పొందాలని వచ్చామని ఎంత చెప్పినా వినకుండా మన కమాండోలు భారత ప్రభుత్వ ఆదేశాలపై లతీఫాను తిరిగి దుబాయ్‌కి అప్పగించారు. ఇలా తప్పించుకునిపోడానికి ముందు కూడా మూడేళ్లపాటు వెలుతురే లేని గదిలో ఆమె బందీగా ఉన్నారు. అందుకే స్వేచ్ఛ కోసం అంతగా అలమటించిపోయారు. ఇక లతీఫాను తిరిగి దుబాయ్‌కి అప్పగించడం వెనుక భారత్ ఆశించిన ప్రయోజనమూ ఉంది. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక నిందితుడైన క్రిస్టియన్ మిషెల్‌ను యు.ఎ.ఇ. ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తుందన్నదే ఆ ప్రయోజనం. అప్పటికి పందొమ్మిది నెలలుగా మిషెల్‌ను అప్పగించాలని భారత్ కోరుతున్నా స్పందించని దుబాయ్ ప్రభుత్వం, లతీఫాను వెనక్కి పంపించడంతో ప్రతిఫలంగా అతడిని భారత్ చేతుల్లో పెట్టింది! ఇలా ఏదో ఒక ‘దౌత్య’ కారణంతో ఈనాటికీ లతీఫా నిర్బంధాన్ని ఓ ఇంటి వ్యవహారంలా మాత్రమే దేశాలన్నీ చూస్తున్నాయి. కొన్ని దేశాలు అసలే పట్టనట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి. ఘటనల కాలక్రమం రాకుమారి ‘ఎస్కేప్’కి ముందు, తర్వాత ► జూన్–2002 : లతీఫా 16 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయేందుకు తొలి ప్రయత్నం చేశారు. మధ్యలోనే పట్టుకుని మూడేళ్ల, నాలుగు నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ► 2010: లతీఫా 24 ఏళ్ల వయసులో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ టీనాతో సన్నిహితంగా ఉండటం చూసి ఆమె ద్వారా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుందేమోనన్న అనుమానంతో లతీఫాకు పాస్‌పోర్ట్ రాకుండా, డ్రైవింగ్ నేర్చుకోకుండా ఆ కుటుంబం జాగ్రత్తపడింది. ► 2018 ఫిబ్రవరి ప్రారంభం : లతీఫా తన 32 ఏళ్ల వయసులో ‘జస్ట్ ఇన్ కేస్’ అని తనపై ఒక వీడియో తీయించుకుని తన నమ్మకస్తులకు మెయిల్ చేశారు. ‘నేను అమెరికా పారిపోతున్నాను. మధ్యలో పట్టుపడితే కనుక ఈ వీడియోను మీడియాకు అందించండి..’ అని అందులో విజ్ఞప్తి చేశారు. ► 24 ఫిబ్రవరి 2018: రాజప్రాసాదం నుంచి తప్పించుకుని, ఇన్ఫ్లేటబుల్ బోట్ (గాలి నింపిన తేలికపాటి పడవ)లో, తర్వాత జెట్ స్కీ లో 24 మైళ్లు అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించి, ఫ్రెంచి అధికారి జాబెర్ట్ సిద్ధంగా ఉంచిన అమెరికన్ యాట్‌లో ఇండియా చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో అమెరికా వెళ్లి ఆశ్రయం పొందాలని పథకం. అయితే గోవాలో భారత తీర ప్రాంత కమాండోలకు చిక్కడంతో ఆ ప్రయత్నం విఫలం అయింది. ► 5 డిసెంబర్ 2018: లతీఫా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు బి.బి.సి. ప్రత్యేక కథనాన్ని ఇవ్వబోతున్నట్లు తెలియగానే లతీఫా తన ఇంట్లోనే సురక్షితంగా ఉందని దుబాయ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ► 24 డిసెంబర్ 2018 : యు.ఎన్. మానవ హక్కుల కమిషనర్ మేరీ రాబిన్సన్ కలిసి డిసెంబర్ 15న లంచ్ చేస్తున్న లతీఫా ఫొటోను యూఏఈ విదేశాంగ శాఖ వ్యూహాత్మకంగా విడుదల చేసింది. నాటి నుంచి నేటి వరకు లతీఫా ఆచూకీకి సంబంధించిన ఒక్క వివరమూ లేదు! ► 16 ఫిబ్రవరి 2021: బి.బి.సి. ప్రసారం చేసిన ‘పనోరమా’ షో ఇంటర్వ్యూలో మాట్లాడిన మేరీ రాబిన్సన్.. ‘లతీఫా నాతో కలిసి లంచ్ చేస్తున్న ఫొటోను ప్రపంచానికి చూపి దుబాయ్ పాలకులు తమ గోప్యతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు’ అని వ్యాఖ్యానించారు. స్కై డైవింగ్ ప్రాణం, చిన్న పిల్ల మనసు బి.బి.సి. మంగళవారం ప్రసారం చేసిన వీడియో క్లిప్‌లో లతీఫా మేరీ రాబిన్సన్తో లతీఫా లంచ్ -
మయన్మార్‌లో ఎమర్జెన్సీ: బందీగా ఆంగ్ సాన్ సూకీ
సాక్షి,న్యూఢిల్లీ: మయన్మార్‌లో అనూహ్య పరిణామాలు ప్రకంపనలు పుట్టించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఒక సంవత్సరం పాటు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేశ సైన్యం తన సొంత టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రకటించింది. గత 50 ఏళ్లుగా సైన్యం చేతిలోనే మగ్గి తేరుకున్న ఆ దేశంలో తిరిగి సైనిక తిరుగుబాటుతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించిన సైన్యం నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ నేత ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాదు దేశమంతటా ఇంటర్నెట్ సేవలను ఆర్మీ నిలిపివేసింది. దీంతో అనేక మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయడంలేదు. సోమవారం సైనిక చర్య అనంతరం అంగ్ సాన్ సూకీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేశం తమ పాలనలోకి వచ్చేసిందని ఆర్మీ ప్రకటించింది. ఎన్నికల అనంతరం అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మిలటరీకి మధ్య ఉద్రిక్తతల రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున సైనికులు దాడి జరిపి అంగ్ సాన్ సూకీతో పాటు ఆ పార్టీ కి చెందిన ఇతర సీనియర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధి వెల్లడించారు.. గత నవంబర్‌లో నిర్వహించిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇప్పటికే సూకీ ప్రభుత్వం ఖండించింది. మరోవైపు అయితే మిలటరీ చర్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా జరిగిన ప్రయత్నాలను అడ్డుకుంటే సహించేది లేదని ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని, ఎన్నికల ఫలితాలను గౌరవించాలని మయన్మార్ సైన్యాన్ని కోరింది. దేశంపై నియంత్రణ కోసం మిలటరీ మరోసారి ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నుకున్న నేత అంగ్ సాన్ సూకీ సహా ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
అర్నాబ్ అరెస్టు; స్పందించిన కేంద్రమంత్రి
సాక్షి,న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పందించారు. ఇది ‘‘పత్రికా స్వేచ్ఛపై దాడి" గా అభివర్ణించారు. ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందంటూ మహారాష్ట్ర పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్న ఆయన మీడియా పట్ల ఈ వైఖరి సరైంది కాదంటూ ట్వీట్ చేశారు. (రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) కాగా డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణలతో నమోదైన కేసును సాక్ష్యాలు లేవంటూ పోలీసులు దర్యాప్తును నిలిపివేశారు. అయితే రెండేళ్లనాటి కేసును తిరిగి ప్రారంభించాలన్న కుటుంబ సభ్యుల విజ్ఞప్తి నేపథ్యంలో అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్, సాయుధులైన పోలీసులతో అర్నాబ్‌ను నిర్బంధించారని రిపబ్లిక్ టీవీ ఆరోపించింది. ఎడిటర్స్ గిల్డ్ ఖండన మరోవైపు అర్నాబ్ అరెస్ట్‌పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఆకస్మిక అరెస్టును ఖండించింది. అర్నాబ్ గోస్వామి అరెస్టు విషయం తెలిసి షాక్ అయ్యామంటూ విచారం వ్యక్తం చేసింది. గోస్వామిని న్యాయపరంగా విచారణ జరగాలని, మీడియా విమర్శనాత్మక రిపోర్టింగ్‌పై అధికార దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించింది. We condemn the attack on press freedom in #Maharashtra. This is not the way to treat the Press. This reminds us of the emergency days when the press was treated like this.@PIB_India @DDNewslive @republic — Prakash Javadekar (@PrakashJavdekar) November 4, 2020 -
ముఫ్తీని ఎంతకాలం నిర్భంధంలో ఉంచుతారు?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఏ ఆదేశం ప్రకారం, ఏ ఉద్దేశంతో ఆమెను నిర్బంధంలో ఉంచుతున్నారని కోర్టు జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని నిలదీసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. మెహబూబా ముఫ్తీని ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఇందుకు కొంత సమయం ఇవ్వాలని.. ఒక వారంలోపు దీనిపై వివరణ ఇస్తామని ఆయన కోర్టుకు తెలిపారు. దాంతో రెండు వారాలు గడువు ఇచ్చింది. మెహబూబా ముఫ్తీ కుమార్తె, కుమారుడు ఆమెను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 15కు వాయిదా వేసింది. మెహబూబా ముఫ్తీ విడుదల కోసం ఆమె కుమార్తె ఇల్టిజా ముఫ్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన తల్లిని నిర్బంధించడం అక్రమమని ఆరోపించారు. దీనిపై తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జమ్ముకశ్మీర్ అధికారులు కోర్టుకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని.. ఇది కోర్టు పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. అధికారులు తన తల్లిని కలిసేందుకు అనుమతించడంలేదని ఫిర్యాదు చేశారు. ముఫ్తీని కోర్టులో ప్రవేశపెట్టేందుకు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కోసం కోర్టు అనుమతి కోరారు. (చదవండి: ఆ తీర్పుపై స్పష్టత అవసరం: సుప్రీంకోర్టు) జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరుగకుండా మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు రాజకీయ పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది. ప్రజా రక్షణ చట్టం కింద ఫరూక్ అబ్దుల్లాను సుమారు ఏడాది వరకు గృహ నిర్బంధంలో ఉంచి రెండు నెలల కిందట విడుదల చేసింది. ఆయనకు ముందు ఒమర్ అబ్దుల్లా కూడా విడుదల అయ్యారు. అయితే ప్రజా రక్షణ చట్టం కింద మెహబూబా నిర్బంధాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. దీంతో తన తల్లిని ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉంచడంపై ఆమె కుమార్తె ఇల్టిజా ముఫ్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
లాక్డౌన్ : బిలియనీర్ల విందు, ఉన్నతాధికారిపై వేటు
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు బిలియనీర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా -19 లాక్డౌన్ నిబంధలను ఉల్లంఘించి, మహారాష్ట్ర హిల్ రిసార్ట్‌లోని వారి ఫామ్‌హౌస్ లో విందు చేసుకుంటున్న వీరిని అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చిన ఐఎఎస్ అధికారిపై వేటు వేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ భౌతికదూరాన్నిపాటిస్తోంటే, వీరు మాత్రం కుటుంబ సభ్యులతో మహాబలేశ్వర్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఆరు హై-ఎండ్ వాహనాలను గుర్తించిన స్థానికులు వెంటనే మునిసిపల్ అధికారులకు తహశీల్దార్ కు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇద్దరు డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లతో సహా మొత్తం 23 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అత్యవసరం పరిస్థితి పేరుతో పాస్‌లు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమితాబ్ గుప్తాను బలవంతపు సెలవుపై పంపారు. వీరు తన కుటుంబ స్నేహితులనీ, కుటుంబ అత్యవసర పరిస్థితుల నిమిత్తం ఖండాలా నుండి మహాబలేశ్వర్ వరకు వెళ్లేందుకు అనుమతించాలంటూ అమితాబ్ గుప్తా పాసులు జారీ చేశారు. దీంతో వీరంతా బుధవారం రాత్రి ఐదు కార్లలో ముంబైకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నఫామ్‌హౌస్ తరలివెళ్లారు. వాధ్వాన్ల వంటవారు, సేవకులు ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభంలో అత్యంత ప్రభావితమైన దేశం ఇటలీకి చెందిన వాధ్వాన్ బాడీగార్డ్ ఇందులో వుండటం గమనార్హం. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు వీరందరిపైనా కేసు నమోదు చేశారు. వీరిని క్వారంటైనకు తరలించామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) మరోవైపు పీఎంసీ బ్యాంకు కుంభకోణం సహా, పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు, కపిల్, ధీరజ్ వాధ్వాన్ మీద సీబీఐ లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. గత నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా, మూడుస్లారు నిందితులు తప్పించుకున్నారు. అయితే క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకోవాలని సీబీఐ భావిస్తోంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. -
కరోనా : నిర్బంధంలో 200 మంది భారతీయులు
టోక్యో/బీజింగ్/జెనీవా: కరోనా భయంతో జపాన్ ప్రభుత్వం యెకోహోమా తీరంలో నిలిపివేసిన నౌకలోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే ఆ నౌకలో నిర్బంధంలో ఉన్న బినయ్ కుమార్ సర్కార్ అనే భారతీయుడు తమను కాపాడాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. 200 మంది భారతీయులతో పాటు నౌకలో అంతా కలిపి 3,700 మంది ఉన్నారనీ, వీరిలో 62 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ కాగా తమ నౌకను అధికారులు దిగ్బంధించినట్లు బినయ్ పేర్కొన్నాడు. మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో తమను కాపాడాలంటూ బినయ్ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఓ వీడియోను ఫేస్బుక్లో పెట్టారు. ‘మేం కోరుకుంటోంది ఒక్కటే, దయచేసి మమ్మల్ని ఈ నౌక నుంచీ, ఈ నిర్బంధం నుంచీ వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచండి. మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. మాకు భయంగా ఉంది. దయచేసి సాయం చేయండి’అని అందులో ఉంది. వైరస్ ఇంకా మరింత మందికి వ్యాపించకుండా ఉంటే, ఫిబ్రవరి 19 వరకు వీరందరినీ వేరుగా ఉంచాల్సి ఉంటుందని నౌకలోని జపాన్ అధికారులు శుక్రవారం చెప్పారు. ‘జపాన్ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 7 గంటల వరకు భారతీయులెవ్వరికీ కరోనా సోకలేదు. ప్రస్తుతం నౌకలోని చివరి బృందానికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’అని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. 723కు చేరిన కరోనా మృతులు చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 723కు చేరింది. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన కేసులు 34,598కు చేరాయి. తాజాగా, 1,280 మంది వ్యాధిగ్రస్తుల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు చైనా నేషనల్ హెల్త్క మిషన్ ప్రకటించింది. చైనాలో కరోనా వైరస్ బారిన పడి అమెరికాకు చెందిన ఓ మహిళ, జపనీయుడొకరు మృతి చెందారు. కరోనాతో చైనాలో విదేశీయులు మరణించిన తొలి ఘటన ఇదే. కరోనాకు శాశ్వత పేరుపై తర్జనభర్జన ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త రకం వైరస్ కరోనాకు శాశ్వతంగా ఏం పేరు పెట్టాలనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తర్జనభర్జన పడుతోంది. కరోనా వైరస్ ప్రారంభమైన వుహాన్ నగరం పేరు గానీ, అటు చైనా ప్రజల మనోభావాలు గానీ దెబ్బతినకుండా ఉండేలా పేరు పెట్టాలని జాగ్రత్త వహిస్తోంది. ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పేర్కొన్న ఈ వ్యాధికి ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ అధికారికంగా తాత్కాలిక పేరు ‘2019–ఎన్కోవ్ అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్’అని పెట్టింది. ‘ఎన్కోవ్’అంటే ‘నావల్ కరోనావైరస్’అని అర్థం అని తెలిపింది. ‘పేరుతో ప్రదేశానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉండేలా ఓ పేరును పెట్టడం చాలా ముఖ్యమని మేం భావించాం’అని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వ్యాధుల విభాగం అధిపతి మరియా తెలిపారు. శాశ్వత పేరు పెట్టడంపై నిర్ణయం కొద్దిరోజుల్లోనే తీసుకుంటామని, డబ్ల్యూహెచ్‌వోతో పాటు ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ (ఐసీటీవీ) కరోనా నిపుణుల నిర్ణయం మేరకు ఉంటుందని ఆమె వెల్లడించారు. ఎయిర్ హగ్ ! కరోనా బాధితులకు సేవలు అందించేందుకు ఆస్పత్రిలో చేరిన నర్స్ లియు హైయాన్ తన కూతురు చెంగ్‌ను 10 రోజుల నుంచి కలవలేదు. శనివారం చెంగ్ ఆస్పత్రి వద్దకు వచ్చింది. అయితే కరోనా కారణంగా ఇద్దరు కలవడం కుదరకపోవడంతో దూరం నుంచే కౌగిలింత ఇచ్చినట్లుగా ఏడుస్తూ చేతులు చాచి భావోద్వేగానికి గురయ్యారు. ‘మమ్మీ వైరస్‌తో పోరాడుతోంది.. తగ్గగానే ఇంటికి వస్తుంది’ అని చెబుతూ.. చక్కగా, మంచిగా ఉండాలని కుమార్తెకు సూచించారు. కరోనా కారణంగా తల్లీకూతుళ్లు కన్నీళ్ల నడుమ జరిగిన ఈ ఎయిర్ హగ్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. తల్లి, కూతుళ్ల ఎయిర్ హగ్ -
ఆర్టికల్ 370 రద్దు, మాజీ సీఎంలు అరెస్ట్
జమ్ము కశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదించిన వెనువెంటనే జమ్ముకశ్మీర్‌లో కీలక పరిణామాలు చకాచకా చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర కీలక నేతలను అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది. ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉంచిన మాజీ ముఖ్యమంత్రి , పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను శ్రీనగర్‌లోని ప్రభుత్వ గెస్ట్‌హౌస్ హరినివాస్కు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా ముఫ్తీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరో మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఒమర్ అరెస్ట్‌పై అధికారిక నిర్ధారణ రావాల్సి వుంది. జమ్మూకశ్మీర్‌కు భారీగా బలగాలను తరలించిన రోజు దగ్గరినుంచీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్ విధించారు. అలాగే రాష్ట్రంలోని ముగ్గురు ప్రధాన నేతలు పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజాద్‌లోన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను హౌజ్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా ముఫ్తీ అభివర్ణించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమనీ, ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ఆమె ట్వీట్ చేశారు. ఇది ఇలా వుంటే ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘమైన చర్చ అనంతరం 370 ఆర్టికల్ రద్దు బిల్లు మూజువాణి ఓటుతో నెగ్గింది. అయితే, జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుకు సవరణలుకోరిన నేపథ్యంలో బిల్లుపై ఓటింగ్ జరగగా.. అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు రాగా ఒకరు తటస్థంగా ఉన్నారు. -
మగువ ఆశ చూపి.. హత్య
కల్వకుర్తి టౌన్: మగువపై మోజు ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకునేలా చేసింది. గతేడాది నవంబర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం సుద్దకల్ బ్రిడ్జి కింద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను సీఐ సురేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివసించే పత్తి రామదాసు(76) కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య గతేడాది జనవరిలో కన్నుమూసింది. అయితే, రామదాసుకు ఆడవారిపై మోజు ఉండగా వృద్ధాప్యంలో ఆలనాపాలనా, ఇంటి పనులు చూసుకునేందుకు ఓ మహిళను ఎంచుకోవాలని ఆలోచించాడు. తన ఇంట్లో వడ్రంగి పనులు చేసిన కపిలవాయి శ్రీరాములుతో మనసులో మాట చెప్పాడు. దుర్బుద్ధితో ఆలోచించిన శ్రీరాములు వద్ద నుంచి డబ్బు కొట్టేయాలని పథకం పన్నాడు. కల్వకుర్తిలో ఓ మహిళ ఉందని చెప్పాడు. అబిడ్స్‌లో ఉన్న జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రామదాసుతో రూ.2 లక్షలు డ్రా చేయించాడు. అనంతరం ఎంజీబీఎస్‌లో బస్సు ఎక్కి కల్వకుర్తికి చేరుకున్నారు. ఆటోలో నాగర్‌కర్నూల్ రోడ్డులో ఉన్న సుద్దకల్ గ్రామంలోని బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. కొద్దిసేపటి తర్వాత వెనుక నుంచి వచ్చి రామదాసు తల, ముఖంపై గట్టిగా కొట్టడంతో చనిపోయాడు. రూ.2 లక్షలు తీసుకున్న శ్రీరాములు హైదరాబాద్ వెళ్లిపోయాడు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రామదాసు సెల్‌ఫోన్ కాల్ డేటా కోసం ఆరా తీయగా శ్రీరాములు పేరు తెరపైకి వచ్చింది. కానీ అప్పటికే శ్రీరాములు సెల్‌ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. తాజాగా శ్రీరాములు తన కూతురు వివాహ పత్రికలు పంచడానికి కల్వకుర్తికి రావటం.. సెల్‌ఫోన్ ఆన్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. రామదాసును హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. -
‘మీ సరదా కోసం చిన్నారిని హింసిస్తారా?’
కౌలాలంపూర్ : ప్రపంచ పర్యటనకై డబ్బులు సేకరించేందుకు ఓ రష్యన్ జంట తమ చిన్నారి పట్ల క్రూరంగా ప్రవర్తించింది. వీధుల్లో నాలుగు నెలల పసికందుతో విన్యాసాలు చేస్తూ తమాషా చేసింది. దీంతో ఆగ్రహించిన మలేషియా పోలీసులు సోమవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రష్యాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రపంచ పర్యటన చేయాలని భావించాడు. ఇందులో భాగంగా సోమవారం కౌలాలంపూర్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో పర్యటన ఖర్చుల నిమిత్తం డబ్బు సేకరించేందుకు సదరు వ్యక్తి తన కూతురిని గాల్లోకి ఎగురవేస్తూ వివిధ రకాల విన్యాసాలు చేశాడు. ఆమె ఏడుస్తున్నా పట్టించుకోకుండా తలకిందులుగా వేలాడదీస్తూ తన ఆటను కొనసాగించాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న చిన్నారి తల్లి.. ‘ మేము ప్రపంచ పర్యటన చేస్తున్నాం’ అనే ప్లకార్డు పట్టుకుని కూర్చుని ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోపై మండిపడిన నెటిజన్లు.. ‘ స్టుపిడ్.. మీ సరదా కోసం చిన్నారిని ఇలా హింసిస్తారా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
హువావేకు షాక్ : కీలక అధికారి అరెస్టు
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ హువావే టెక్నాలజీస్ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో)ను కెనడా అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికా అభ్యర్ధన మేరకు కెనడియన్ అధికారులు హువావే డిప్యూటీ చైర్మన్‌ను అరెస్ట్ చేసిందన్న షాకింగ్ న్యూస్ పరిశ్రమ వర్గాలను విస్మయ పర్చింది. అంతేకాదు సీఎఫ్‌వోను త్వరగా అమెరికాకు రప్పించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా విధించే వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ అరెస్టు చోటు చేసుకుంది. హువావే బోర్డు డిప్యూటీ చైర్, కంపెనీ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫే కుమార్తె మెంగ్ వాంగ్జోను వాంకోవర్‌లో డిసెంబరు1, శనివారం అరెస్టు చేశామని అధికారులు బుధవారం ప్రకటించారు. ఆమె బెయిల్ పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరగనుందని న్యాయశాఖ ప్రతినిధి ఇయాన్ మెక్లాయిడ్ వెల్లడించారు. ఇంతకుమించి తాము ఎటువంటి వివరాలను అందించలేమని పేర్కొన్నారు. మరోవైపు ఈ పరిణామాన్ని హువావే, చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది మానవహక్కులకు తీవ్ర హానికరమైన చర్య అని పేర్కొంది. మెంగ్ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, తక్షణమే ఆమెను విడుదల చేయాలని ఒట్టావాలోని చైనీస్ రాయబార కార్యాలయం డిమాండ్ చేసింది. తాము చట్టపరమైన అన్ని నిబంధనలను విధిగా పాటిస్తున్నామని హువావే ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్లో ఒక ప్రకటన జారీ చేసింది. మరోవైపు ఇది అమెరికా చైనా మధ్య నెలకొన్న ట్రేడ్వార్కు సంబంధించి తీవ్రమైన పరిణామంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించింది. pic.twitter.com/GRs75WRx6L — Huawei Technologies (@Huawei) December 6, 2018 -
ఇథియోపియాలో భారతీయుల నిర్బంధం
ముంబై: ఇథియోపియాలోని వివిధ ప్రాజెక్టుల్లో తమ సిబ్బందిని స్థానికులు నిర్బంధించారని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు చెందిన ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్స్ లిమిటెడ్(ఐటీఎన్‌ఎల్) తెలిపింది. అక్కడ నిర్వహిస్తున్న పనులకు సంబంధించి స్థానికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు ఏడుగురు భారతీయ ఉద్యోగులను నిర్బంధించినట్లు పేర్కొంది. నీరజ్ రఘువంశి అనే ఉద్యోగి తనతోపాటు ఏడుగురిని స్థానిక సిబ్బంది నిర్బంధించినట్లు గత నెలలో బయటపెట్టడం తెల్సిందే. దీంతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ వెంటనే అక్కడి భారత దౌత్య కార్యాలయానికి, విదేశాంగ శాఖకు ఈ సమాచారం అందించి, సాయం కోరింది. వీరి ప్రయత్నాలు ఫలించి శనివారం ఇద్దరిని విడుదల చేశారు. ఇతర దేశాల్లో బకాయిల చెల్లింపులకు అనుమతి కోరుతూ అక్కడి బ్యాంకులకు ఐటీఎన్‌ఎల్ లేఖలు రాసింది. అయితే, అనుమతుల్లో జాప్యం కారణంగా చెల్లింపులు ఆలస్యమయ్యాయని, ఇథియోపియాలోని పనివారికి వెంటనే వేతనాలు చెల్లిస్తామని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ పేర్కొంది. ఐటీఎన్‌ఎల్ తన సబ్సిడరీ అయిన ఎల్సమెక్స్ ఎస్ఏ అనే కంపెనీ ద్వారా ఇథియోపియాలో రోడ్లు, భవనాలు, పెట్రోల్, గ్యాస్ స్టేషన్ల నిర్మాణ పనులు చేపడుతోంది. -
పోలీసు దాడులు: ఎమర్జెన్సీకి చేరువలో ఉన్నాం
సాక్షి, న్యూఢిల్లీ: మంగళవారం తెల్లవారు జామునుంచే ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర పోలీసులు విరుచుకుపడ్డారు. ముంబై, ఢిల్లీ, గోవా, జార్ఖండ్, తెలంగాణ(హైదరాబాద్)లో దళిత, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, లాయర్లు, ఆదివాసీ హక్కుల కార్యకర్తల ఇళ్లు, వారి బంధువుల నివాసాల్లో ఏకకాలంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసుల సహాయంతో పుణేకు చెందిన పోలీసు బృందం ఈ సోదాలు నిర్వహించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టడం తీవ్ర ఆందోళన రేపింది. హైదరాబాద్‌కు చెందిన విప్లవ కవి, విరసం నేత వరవరరావును అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. అలాగే జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల ఇళ్లపై పోలీసులు ఏకకాలంలో దాడులకు దిగడం కలకలం రేపింది. ముంబైలోని అరుణ్ ఫెరీరా, సుసాన్ అబ్రహాం, వెర్నాన్ గోన్సల్వేజ్, ఆనంద్ తెల్తూంద్డే, జార్ఖండ్ లోని ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్‌స్వామి, ఢిల్లీలో గౌతమ్ నవ్లాఖా, ఛత్తీస్‌గఢ్, ఫరీదాబాద్ మానవ హక్కుల న్యాయవాది సుధా భరద్వాజ్ గృహాలను తనిఖీ చేశారు. అనంతరం వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, మొబైల్, పెన్‌డ్రైవ్‌తోపాటు, డైరీలు, కొన్ని ఆడియో సీడీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలు, భీమా-కోరేగావ్ నిరసన సందర్భంగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. చట్టవిరుద్ధ చర్యలు(నివారణ) చట్టం ఐపీసీ సెక్షన్ 153ఏ, 505, 117, 120 కింద అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇవి అక్రమ అరెస్టులంటూ వివిధ ప్రజా సంఘాల నేతలు, హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. ఉద్యమానికి సన్నద్ధమవుతునన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల సహాయంతో ప్రజాస్వామ్య గొంతులను అణచివేయడానికి కేంద్రం పన్నిన కుట్రలో భాగమే ఈ అరెస్టులని విరసం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్ ఆరోపించారు. అత్యవసర పరిస్థితికి దగ్గరగా ఉన్నాం: అరుంధతీ రాయ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు తదితరుల ఇళ్లపై పుణే పోలీసుల దాడులపై ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ స్పందించారు. దేశంలో గతంలో ముందెన్నడూ చూడని అత్యవసర పరిస్థితికి చాలా దగ్గరగా ఉన్నామని ఆమె తీవ్రంగా విమర్శించారు. -
ట్రంప్ జీరో టాలరెన్స్‌కి భారతీయులూ బలి
పసిపిల్లల ఆక్రందనల్ని కూడా పట్టించుకోకుండా అమెరికాలో ట్రంప్ సర్కార్ కఠినంగా అమలు చేస్తున్న వలస విధానానికి భారతీయులూ బలైపోతున్నారు. కేవలం ఒక్క నెలలోనే 50 మందికి పైగా భారతీయులను అదుపులోనికి తీసుకొని ఒరెగాన్‌లో షెరిడాన్ ఫెడరల్ జైలుకి తరలించినట్టు స్థానిక పత్రిక ది ఒరెగోనియన్ ఒక కథనంలో వెల్లడించింది. కొంత మంది భారతీయుల పిల్లల్ని కూడా తల్లిదండ్రుల నుంచి వేరు చేసినట్టు కూడా తెలుస్తోంది. గతనెలలో 123 మంది దక్షిణాసియా నుంచి ఆశ్రయం కోరి వస్తే, వారిని నిర్బంధించి జైలుకి తరలించారు. వారిలో 52 మంది భారతీయులని వారంతా పంజాబీ, హిందీ మాట్లాడుతున్నారని , మిగిలిన వారు చైనా, మెక్సికో, నేపాల్, పాకిస్థాన్, ఉక్రెయిన్ తదితర దేశాల నుంచి వచ్చారని ఆ కథనం పేర్కొంది. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల బృందం ఈ జైళ్లను సందర్శించినప్పుడు అక్రమ వలసల పేరుతో భారతీయుల్ని కూడా నిర్బంధిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. శరణార్థులందరినీ ఏకాకిలను చేసి, ఎవరితోనూ మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు. కనీసం లాయర్ని సంప్రదించే అవకాశం కూడా వారికి ఉండడం లేదు. అలా నిర్బంధించిన భారతీయుల్లో సిక్కులు, క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నారు. భారత్‌లో మతపరమైన వేధింపులు తట్టుకోలేక తాము దేశం విడిచి వచ్చినట్టు వారు చెబుతున్నారు. ‘ రోజుకి 22 నుంచి 23 గంటల పాటు నాలుగ్గోడల మధ్యే ఉంచుతున్నారు. ఒక సెల్లో ముగ్గురేసి చొప్పున ఉన్నాము. భార్యలు ఎక్కడున్నారో తెలీదు. పిల్లల్ని ఏం చేశారో ఆందోళనగా ఉంది. కనీసం లాయర్‌తో మాట్లాడే అవకాశం కూడా మాకు ఇవ్వడం లేదు. ఏం చేయాలో తెలీక బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాం‘ అంటూ వారంతా డెమొక్రాటిక్ పార్టీ నేతలతో మొర పెట్టుకున్నారు. 7 వేలకు పైగా భారతీయుల దరఖాస్తులు : యూఎన్ అమెరికాని ఆశ్రయం కోరి వస్తున్న వారి సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. 2017లో 7 వేలకు మందికి పైగా భారతీయులు అమెరికాలో ఆశ్రయం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నట్టుగా ఐక్యరాజ్య సమితికి చెందిన శరణార్థి సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2017 చివరినాటికి 6.85 కోట్ల మంది నిరాశ్రయులుగా మారారని, వారిలో కేవలం గత ఏడాది 1.62 కోట్ల మంది నిరాశ్రయులు ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. ప్రతీ రోజూ సగటున 44 వేల 500 మంది నిరాశ్రయులుగా మారుతున్నట్టు యూఎన్ అంచనా వేసింది. యుద్ధాలు, హింసాత్మక ఘటనలు, రాజకీయ అనిశ్చితి కారణంగా నిరాశ్రయులవుతున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. కాంగో సంక్షోభం, దక్షిణ సూడాన్ యుద్ధం, మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు ఇలా వివిధ దేశాల నుంచి వలసలు ఇటీవల కాలంలో పెరిగిపోవడంతో గత ఏడాది అత్యధికంగా 49,500 మంది అమెరికాకు శరణార్థులుగా వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారు. వెనిజులా నుంచి 63 శాతం వరకు శరణార్థుల సంఖ్య పెరిగిపోవడం చూస్తే ఆ దేశంలో ఎంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతోంది. మెక్సికో నుంచి 26,100, చైనా (17,400), హైతి (8,600), భారత్ (7,400) మంది పొట్ట చేత పట్టుకొని దేశం విడిచి వెళ్లిపోవడానికి సిద్ధమైనట్టు ఆ నివేదిక వెల్లడించింది. 2017 చివరి నాటికి భారత్‌లో లక్షా 97వేల 146 మంది దేశం విడిచి వెళ్లడానికి సిద్ధమయ్యారు. వీరిలో 10,519 మంది శరణార్థుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక 2013 సంవత్సరం నుంచి సిరియా నుంచి అత్యధికంగా వలస వెళ్లిపోతున్నారని ఆ నివేదిక వివరించింది. -
తల్లి కొడుకులే దొంగలు
హైదరాబాద్ : ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే ముఠా సభ్యులను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి కొడుకులు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ మహమ్మద్, సయ్యద్ సలీమ్, సోనా బేగం ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గ్రేటర్ కమ్యూనిటీలోని తాళం వేసిన ఇళ్లను ఈ ముఠా టార్గెట్ చేస్తుందని, ఇంటి నిర్మాణాన్ని, పరిసరాలపై నిఘా వేస్తుందని పేర్కొన్నారు. స్కూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, గ్రిల్ కట్టర్ల సాయంతో ఇంటి వెనక నుంచి, ఎవరికి అనుమానం రాకుండా లోపలికి చొరబడి దొంగతనానికి పాల్పడుతున్నారని అంజనీ కుమార్ చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని దాదాపు 35 ఇళ్లలో ఈ ముఠా దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దొంగిలించిన సొమ్ముతో 2016లో దాదాపు 5 లక్షలు ఖర్చు పెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశారని విచారణలో తేలింది. ఈ ముఠా సభ్యుల నుంచి 1.65 కిలోల బంగారం, 80 తులాల వెండి, 5 ల్యాప్‌టాప్‌లు, హోండా కారు, బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 70 లక్షలకు పైగానే ఉంటుందని సీపీ అంజనీ కుమార్ చెప్పారు. -
వాడ్యాల్లో రెవెన్యూ అధికారుల నిర్బంధం
మిడ్జిల్ (జడ్చర్ల): మండలంలోని వాడ్యాల్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామ రైతులు రెవెన్యూ అధికారులను నిర్బంధించారు. భూ పక్షాళణలో జరిగిన తప్పులను సరిచేయడానికి సోమవారం రెవెన్యూ అధికారుల బృందం గ్రామానికి చేరుకుని పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రా మంలో ప్రభుత్వ భూమి సర్వే నం.0లో దాదాపు 60 మంది రైతులు సాగులో ఉండగా, వారికి రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందలేదు. అలాగే సర్వే నం.229లో ఉన్న అసైన్డ్ భూమిలో పట్టా ఉన్న రైతులకు కూడా రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అరుణ చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. తహసీల్దార్ పాండునాయక్ అక్కడికి చేరుకుని పరిస్థితిని ఆర్డీఓకు ఫోన్లో వివరించగా వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి అధికారులను వదిలిపెట్టారు. సాగులో ఉన్న ప్రతి రైతుకు పట్టాదారు పా సు పుస్తకంతోపాటు చెక్కులను అందజేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు. -
మహిళతో పట్టుబడ్డ సైనికాధికారి..
సాక్షి, శ్రీనగర్ : సైనిక అధికారి మహిళతో కలిసి ఓ హోటల్లో జమ్మూ కశ్మీర్ పోలీసులకు పట్టుబడ్డారు. గత ఏడాది కశ్మీర్లో రాళ్ల దాడి ఘటనల నేపథ్యంలో ఓ యువకుడిని తన వాహన బానెట్‌పై లాక్కెళ్లిన సైనిక అధికారిగా ఆయనను గుర్తించారు. శ్రీనగర్‌లోని హోటల్ గ్రాండ్ మమతా నిర్వాహకుల నుంచి అందిన సమాచారం మేరకు సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. హోటల్ ప్రతినిధులు అందించిన వివరాలతో పోలీసు బృందం హోటల్‌కు చేరుకుని సైనికాధికారిని అదుపులోకి తీసుకుంది. సైనికాధికారిని కలుసుకునేందుకు మహిళ హోటల్‌కు వచ్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది. వారి స్టేట్మెంట్లను నమోదు చేసుకున్న అనంతరం సైనికాధికారిని ఆయన యూనిట్‌కు అప్పగించామని, మహిళ స్టేట్మెంట్ను నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కాగా శ్రీనగర్ ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంచే ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఐజీ ఎస్పీ పాణి తెలిపారు. -
సీబీఐ అదుపులో బీజేపీ ఎమ్మెల్యే
-
ఉన్నావ్ కేసు : సీబీఐ అదుపులో బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, లక్నో : లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను సీబీఐ శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. ఉన్నావ్‌లో 16 ఏళ్ల యువతిపై లైంగిక దాడి కేసులో ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సెంగార్‌పై కిడ్నాపింగ్, లైంగికదాడి, నేరపూరిత కుట్ర, పోస్కో చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు సెంగార్‌ను అరెస్ట్ చేయకపోవడంపై అలహాబాద్ హైకోర్టు సైతం యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యేను ఇంతవరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలినట్టు కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే బాధితులెవరైనా ఇక ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారా అని నిలదీసింది. గత ఏడాది జూన్‌లో ఎమ్మెల్యే ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మరోవైపు తనపై లైంగిక దాడి ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ పేర్కొన్నారు. -
సీబీఐ అదుపులో గీతాంజలి కీలక అధికారి
సాక్షి ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు మరో కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గీతాంజలి గ్రూప్‌లో బ్యాంకింగ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ చితాలియాను మంగళవారం సీబీఐ ప్రశ్నిస్తోంది. పీఎన్బీ మెగా స్కాంకు సంబంధించి బ్యాంకాక్‌నుంచి ముంబై విమానాశ్రయం చేరుకున్న విపుల్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు నేరుగా సీబీఐ ఆఫీసుకు వెళ్లి అక్కడ ప్రశ్నిస్తున్నారు. దాదాపు రూ.13వేల కోట్ల భారీ మోసంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో పాటు అతడి మామ గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మోదీ, మెహెల్ విదేశాలకుచెక్కేశారు.దీంతో రెండు కంపెనీలకు చెందిన కీలక ఉద్యోగులతో , పీఎన్బీ బ్యాంకు పలువురు సీనియర్ అధికారులను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇది ఇలా ఉంటే ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు ఎండీ శిఖా శర్మకు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. -
జిగ్నేష్‌పై జులుం.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అహ్మదాబాద్ : దళిత యువ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీపై గుజరాత్ పోలీసులు జులుం ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్తున్న ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళిత ఉద్యమ కార్యకర్త భానుభాయ్ వాంకర్ బలిదానానికి సంతాపంగా సారంగపూర్‌లోని అంబేద్కర్ విగ్రహాం వద్ద సంస్మరణ ర్యాలీ, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు వాంకర్ కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఇందులో పాల్గొనేందుకు తన అనుచరులతో కలిసి జిగ్నేష్ ర్యాలీగా బయలుదేరారు. అయితే ప్రారంభంలోనే ఆయన్ని అడ్డుకున్న పోలీసులు కారులోంచి లాగేశారు. ఆపై కారు తాళాలను బద్ధలు కొట్టి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్న విషయం తెలియరావటం లేదు. దీంతో జిగ్నేష్ అనుచరులు ధర్నాకు దిగారు. ఈ మేరకు యువ నేత సెహ్లా రషీద్ తన ట్విట్టర్లో సందేశాలను, ఆ వీడియోను పోస్ట్ చేశారు. తనకు న్యాయంగా దక్కాల్సిన భూమి కోసం ఏళ్ల తరబడి పోరాటం జరిపిన భానుభాయ్ వాంకర్ గురువారం పటన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మాహుతికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన మృతి చెందారు. ఈ నేపథ్యంలో దళిత వ్యతిరేక బీజేపీ దారుణ హత్యకు పాల్పడిందంటూ జిగ్నేష్ ఆరోపణలకు దిగాడు. యువ నేతలు హర్దిక్ పటేల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్లతో కలిసి జిగ్నేష్ అహ్మదాబాద్-గాంధీనగర్హైవేపై నిరసన ప్రదర్శనలో శనివారం పాల్గొన్నారు. భానుభాయ్ వాంకర్ -
జోష్ ఆపుకోలేక రోడ్డుపై డ్యాన్స్ వేశాడని..
-
పోలీసుల అదుపులో ఇద్దరు విదేశీయులు
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన రహదారిపై అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఇద్దరు సుడాన్ దేశీయులను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఎయిర్‌పోర్టు రక్షణ సిబ్బంది ఒడిశా రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారును గమనించారు. కారును తనిఖీ చేయగా.. అందులో ఇద్దరు సూడాన్ దేశీయులు కనిపించారు. వారి వద్ద కారుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు, పాస్‌పోర్టు, వీసాలు కానీ లేకపోవడంతో వెంటనే ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు కారుతో పాటు విదేశీయులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వరంగల్ లోని ఓ యూనివర్సిటీలో మూడేళ్ళ కోర్సు చదివేందుకు ఆరు నెలల క్రితం హైదరాబాద్ వచ్చామని చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల అదుపులో ఢిల్లీ డిప్యూటీ సీఎం
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆయన కేబినెట్ మంత్రి కపిల్ మిశ్రాలను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపుగా ర్యాలీతో వెళుతున్న వారిని మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. వెనుదిరిగి వెళ్లాలనని చెప్పినా వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతోపాటు పార్లమెంటువైపుగా దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతవారం కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ వీధుల్లో పెద్ద నోట్ల రద్దు నిరసిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ఏదో ఒక రూపంలో ప్రతిరోజు తన ఆందోళన ఇప్పటికే తెలియజేస్తున్న విషయం తెలిసిందే. మరో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా తాజాగా తీసిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో ఉన్నప్పటికీ ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. -
చిక్కుల్లో రష్యా ఆర్థికమంత్రి.. భారీ లంచం
-
చిక్కుల్లో రష్యా ఆర్థికమంత్రి.. భారీ లంచం
మాస్కో: రష్యా ఆర్థిక మంత్రి చిక్కుల్లో పడ్డాడు. ఓ ఆయిల్ కంపెనీ కొనుగోళ్లకు సంబంధించి అవినీతికి పాల్పడ్డాడని తేల్చిన విచారణ కమిటీ అదుపులోకి తీసుకుంది. రష్యా ఆర్థికమంత్రిగా అలెక్సీ ఉల్యుకేవ్ పనిచేస్తున్నారు. ఆయన ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీ రాస్నెట్ మరో కంపెనీ బాష్ నెట్ ను కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చేందుకు రెండు మిలియన్ డాలర్లను లంచంగా తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై రష్యా విచారణ సంస్థ దర్యాప్తు చేసి ఆయనను ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుంది. ’ఉన్నత స్థాయి కేసులను పరిశీలన చేసే రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ అలెక్సీపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది’ అని రష్యా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 14న (సోమవారం) ఆయన ఈ లంచం తీసుకున్నట్లు తెలిసిందని వెల్లడించారు. ఆర్థికమంత్రి చేసిన ఈ చర్యను తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని క్రెమ్లిన్ అధికారిక ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. -
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ములుగు : జనశక్తి పార్టీ పేరుతో ములుగు ప్రాంతంలో పాటలు పాడుకుంటూ చందాలు వసూలు చేసేందుకు వచ్చిన ముగ్గురిని శనివా రం ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్సై సమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండ లం గురిజాలకు చెందిన వెంపాటి కుమారస్వామి గతంలో జనశక్తి పార్టీలో పనిచేసి జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్‌గా ఉన్నాడు. గతంలో ఉప్పల్‌లో జరిగిన ఓ మర్డ ర్ కేసులో సైతం అతడు ప్రధాన నిందితుడు. కుమారస్వామితో పాటు దేవరుప్పుల మండ లం సింగరాజుపల్లికి చెందిన మేడ సురేశ్, తొర్రూరుకు చెందిన ఆంబోతు సోమన్నలు గ్రూపుగా ఏర్పడి ఇది వరకు దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో జనశక్తి పార్టీ పేరుతో చందాలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ములుగు మండలంలోనూ చందాలు వసూలు చే యాలని పథకం పన్నారు. శనివారం ఉద యం మండలకేంద్రంలోని బండారుపల్లి క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో ఏఎస్సై సమ్మిరెడ్డి, కానిస్టేబుల్స్ శ్రీను, సునీల్ వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో జనశక్తి పేరుతో చందాల వసూళ్లకు వచ్చినట్లు తెలిపారు. వారిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సురేశ్, సోమన్నలు అరుణోదయ కళా బృందంలోనూ పనిచేస్తున్నారు. -
'బలి చేశారు.. నేనేంటో నిరూపించుకుంటా'
పాట్నా: తానేంటో నిరూపించుకుంటానని మాస్ కాపీయింగ్‌కు పాల్పడి స్టేట్ టాపర్ గా వచ్చి అనంతరం అరెస్టయినబిహార్ స్కూల్ బోర్డు ఆర్ట్స్ టాపర్ రూబీ రాయ్ చెప్పింది. తాను న్యాయవాదిని అవుతానని, లేదంటే ఒక అధికారిగా మారతానని చెప్పింది. బిహార్ స్కూల్ బోర్డు పరీక్షల్లో ఆర్ట్స్ విభాగంలో పరీక్షలు రాసిన రూబీ టాపర్ గా వచ్చింది. అయితే, ఓ మీడియా చేసిన ఇంటర్వ్యూలో పొలిటికల్ సైన్స్ వంటల గురించి చెబుతుందని చెప్పి అవాక్కయ్యేలా చేసింది. అనంతరం చేసిన విచారణలో రూబీతో సహా కొందరు విద్యార్థులు భారీ ఎత్తున మాస్ కాపీయింగ్ పాల్పడ్డారని తెలిసింది. దీంతో ఆ విద్యార్థినిని మరికొందరిని అరెస్టు చేసిన అధికారులు ఏడు వారాలపాటు జైలులో ఉంచారు. రిమాండ్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చిన సందర్భంగా రూబీ మీడియాతో మాట్లాడుతూ 'నా జీవితంలో జరిగిన ఈ సంఘటన నా ఆలోచన విధానాన్ని మార్చింది. నేను ఇక చదువులపై శ్రద్ధపెడతాను. న్యాయవాదిగానో అధికారిగానో మారతాను. ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా ముగిసిన గతం. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నన్ను నేను నిరూపించుకునేందుకు బాగా కష్టపడాలనుకుంటున్నాను. నీ జీవితంలో ఇప్పుడు ఏం జరిగిందో అది మర్చిపోతాను. నేను అమాయకురాలిని. ఎవరో చేసిన కుట్రకు నేను బలయ్యాను. నన్ను ఎందుకు డిటెండ్ చేశారో.. రిమాండ్ కు ఎందుకు పంపించారో నాకు తెలియదు. స్కాంకు పాల్పడినవారికి నాకు ఏం సంబంధం లేదు' అని ఆ విద్యార్థిని చెప్పింది. -
బాలకార్మికులను అదుపులోకి తీసుకున్న అధికారులు
రామాయంపేట : ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాలల సంరక్షణ అధికారులు బుధవారం రామాయంపేట పట్టణంలో తొమ్మిది మంది బాలకార్మికులను గుర్తించి పట్టుకున్నారు. బాలల సంరక్షణ జిల్లా అధికారి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో షీం టీం హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుళ్లు మధు, సోమలత పట్టణంలోని పలు దుకాణాలు, మెకానిక్ షెడ్డులు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పలు దుకాణాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను మరోచోటుకు తరలించారు. పట్టుబడ్డ వారిలో విద్యార్థులు నిసాక్, ప్రవీణ్, నవీన్, ఇమ్రాన్‌ఖాన్, నరేశ్, భానుప్రసాద్, ఇలియాస్, ఫారూఖ్, ప్రశాంత్ ఉన్నారు. వీరిని దొంతి గ్రామంలో ఉన్న బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని భాస్కర్‌రావు పేర్కొన్నారు. -
కశ్మీరీ యువతికి చేదు అనుభవం
న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఓ మెడికల్ విద్యార్థినికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఆమెకు అకారణంగా చుక్కలు చూపించారు. ఆమె లగేజీలో బాంబు ఉందని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. ఢాకా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఆమెకు ఢాకా, కోల్‌కతా విమానాశ్రయాల్లో లగేజ్ చెకింగ్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఢిల్లీలో మాత్రం బాంబు ఉందంటూ అదుపులోకి తీసుకోవటంతో ఆమె షాక్‌కు గురైంది. ఆమెతో ఉన్న ముగ్గురు మిత్రులు సైతం దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ ఫ్రెండ్‌ను వదిలేసిన తరువాతే మేమూ వెళ్తామంటూ విమానాశ్రయంలో భీష్మించుకు కూర్చున్నారు. కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తరువాత అధికారులు ఆమెను వదిలేశారు. అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలుపకపోవటంతో ఆమె తండ్రి ఎయిర్ పోర్ట్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో వారు ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్‌ను మిస్సయ్యారు. -
ఉత్తర కొరియా అదుపులో బీబీసీ రిపోర్టర్
సియోల్: ప్రతిష్టాత్మక బ్రిటన్ బ్రాడ్ కాస్టర్ బీబీసీ రిపోర్టర్‌ను ఉత్తర కొరియా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా తమ దేశంలో జరుగుతున్న పార్టీ సమావేశ కార్యక్రమం కవరేజికి వెళ్లిన అతడిని ఎయిర్ పోర్ట్ లోనే బంధించారు. అతడిని అక్కడి నుంచి బహిష్కరిస్తారని కూడా సమాచారం. దాదాపు 36 ఏళ్ల తర్వాత తొలిసారి ఉత్తర కొరియా పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీని కవరేజీకి ఏ మీడియాను ఆ దేశం అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే బీబీసీకి చెందిన రూపర్ట్ వింగ్ ఫీల్డ్ హేస్ అనే రిపోర్టర్ ను ప్యాంగ్ యాంగ్ విమానాశ్రయంలోనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. -
ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా వీడియో తీస్తూ..
ముంబయి: ముంబయి ఎయిర్ పోర్ట్ లో నలుగురు ప్రయాణీకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఎయిర్ హోస్టెస్‌తో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా వారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వీడియో తీసే ప్రయత్నం చేశారు. దీంతో వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు. కోల్ కతా నుంచి ముంబయి మధ్య ప్రయాణించే ఇండిగో విమానానికి చెందిన ఎయిర్ హోస్టేస్ తో వారు ఇలా ప్రవర్తించారు. -
చెన్నైలో రగిలిన సెగ
చెన్నై: హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య ఉదంతం, ముగ్గురు మహిళా వైద్య విదార్థినుల ఆత్మహత్యలపై తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఘటనలపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు దిగారు. రెండు ఉదంతాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వందలమంది విద్యార్థులు నగరంలో కదంతొక్కారు. దీంతో సుమారు 60 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న విశ్వవిద్యాలయాల బంద్ తమిళనాడులోనూ కొనసాగుతోంది. అటు హైదరాబాద్ లో రోహిత్ ఆత్మహత్య, అటు ముగ్గురు మెడికోలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నిరనస జ్వాలలు ఎగిసి పడ్డాయి. కేంద్ర మంత్రుల వ్యవహారంపై విద్యార్థిలోకం మండిపడుతోంది. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరాని తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీంతో ఉద్రిక్తత రాజుకుంది. కాగా హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ దేశవ్యాప్తంగా వర్సిటీల బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ పిలుపునిచ్చింది. నేడు, రేపు రెండురోజులపాటు కూడా ర్యాలీలు, ఆందోళనలు చేసేందుకు విద్యార్ధులు సిద్ధమవుతున్నారు. అటు విల్లుపురంలో ముగ్గురు మెడికోల ఆత్మహత్య ఉదంతం కూడా తమిళనాడును కుదిపేసింది. దీంతో నిరసనల సెగ చెన్నైను మరింత తీవ్రంగా తాకింది. -
పాశ్చాత్యుల్ని వీడని రంగు జబ్బు
చర్మం రంగు కారణంగా భారత మూలాలున్న బ్రిటన్ వ్యక్తిని నిర్బంధించిన అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు లండన్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా వస్తున్న మార్పులతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయినా పాశ్చాత్యుల్లో గూడు కట్టుకున్న వర్ణ వివక్ష మాత్రం ఇంకా తుడిచి పెట్టుకుపోలేదు. తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటన్ వ్యక్తికి అమెరికాలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. చర్మం రంగు కారణంగా అమ్రీత్ సురానా అనే వ్యక్తిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 13 గంటల పాటు నిర్బంధించి అనంతరం తిప్పి పంపేశారు. యూకే సెక్యూరిటీ కంపెనీలో ఇంటర్నేషనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల సురానా అరిజోనాలోని బ్రాంచ్ పరిశీలన నిమిత్తం లండన్ నుంచి అమెరికా వచ్చారు. డెట్రాయిట్లో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ‘అమెరికాలో వీసా లేకుండా ప్రయాణించడానికి అనుమతించిన 38 దేశాల్లో ఒక దేశానికి చెందిన వ్యక్తినని ఆధారాలు చూపినా నా చర్మం రంగు కారణంగా వారు దాన్ని నమ్మలేదు’ అని సురానా పేర్కొన్నారు. సురానాను తిప్పి పంపడంపై యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 20 నిమిషాల వ్యవధిలోనే వారు నన్ను అమెరికాలో ఉద్యోగం కోసం వచ్చిన అక్రమ వలసదారుగా నిర్ధారించారని సురానా వాపోయారు. -
నిర్భయ తల్లిదండ్రుల అరెస్ట్
ఢిల్లీ: బాల నేరస్తుడిని విడుదల చేయరాదంటూ ఇండియా గేట్ వద్ద నిరసన తెలుపుతున్న నిర్భయ తల్లిదండ్రులతో పాటు ఇతర నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాల నేరస్తుడు సమాజంలోకి వస్తే నిర్భయకు న్యాయం జరగనట్లే అని ఆరోపిస్తూ చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అక్కడి నుండి తరలించారు. మరోవైపు బాలనేరస్తుడి శిక్ష నేటితో పూర్తవడంతో అధికారులు అతన్ని విడుదల చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో అతను ఉండనున్నాడు. దేశ వ్యాప్త నిరసనలతో బాలనేరస్తుడిని జువైనల్ హోం నుండి ముందుగానే రహస్య ప్రాంతానికి తరలించిన అధికారులు అతడిని విడుదల చేసినట్టు ఆదివారం సాయంత్రం ప్రకటించారు. -
8 మంది ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్
కౌలాలంపూర్: మలేసియాలో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం. నిందితులంతా 22 నుండి 36 సంవత్సరాల వయసు గల వారిగా మలేసియా పోలీసు అధికారి తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ఆరుగురిని 'టాండ్జిమ్ అల్ ఖైదా' ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరికి ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆగస్టులో కూడా ఇద్దరు సివిల్ సర్వెంట్లకు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం గుర్తించిన ఇద్దరు సివిల్ సర్వెంట్లు అదే వింగ్‌కు చెందినవారుగా అనుమానిస్తున్నారు. -
పోలీసుల అదుపులో హార్థిక్ పటేల్
రాజ్‌కోట్: పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్ధిక్ పటేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌కోట్-జామ్ నగర్ జాతీయ రహదారిపై అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాజ్‌కోట్‌లో 1.30 గంటలకు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మూడో వన్డే జరుగుతున్న విషయం తెలిసింది. ఈ మ్యాచ్‌ను అడ్డుకుంటామని ముందుగానే పటేల్ ఉద్యమకారులు హెచ్చరించారు. అందులో భాగంగా హార్థిక్ పటేల్ ఆందోళనకారుల సమూహంతో స్టేడియంవైపు బయలు దేరినట్లు సమాచారం. అందుకే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాజ్ కోట్ లో జరగనున్న భారత్- దక్షిణాఫ్రికా మూడో వన్ డే మ్చాచ్ కు కనీవినీ ఎరుగని రీతిలో భద్రత కల్పించారు. -
హార్దిక్ పటేల్ సహా 78మంది అరెస్ట్
సూరత్ : తమకు రిజర్వేషన్లు కావాలంటూ అటు కేంద్రాన్ని... ఇటు గుజరాత్ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్న పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కన్వీనర్ హార్దిక్ పటేల్‌ను శుక్రవారం సూరత్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని వారచ్చా పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న పటేల్ వర్గీయులు శనివారం ఏక్తాయాత్రకు సిద్ధమయ్యారు. సూరత్‌లో ఈ యాత్ర ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా హార్దిక్ పటేల్ సహా కొంతమంది పటేల్ వర్గీయులు సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత యాత్రకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏక్తాయాత్రకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు హార్దిక్ పటేల్‌తో పాటు 78మందిని అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసుల అదుపులో మాజీ సీఎం కుమారుడు
జెహ్నాబాద్: బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ కుమారుడు ప్రవీణ్ భారీ నగదుతో పట్టుబడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ పోలీసులు జెహ్నాబాద్ ఏయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా అతని నుంచి దాదాపు రూ. 4.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ శాసనసభకు అక్టోబర్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్ దగ్గర దొరికిన డబ్బుకు సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తన ఇంటి నిర్మాణపనుల కోసం కుటుంబసభ్యుల నుంచి ఆ డబ్బు తీసుకెళుతున్నానని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఆదివారం సాయంత్రం సొంత పూచి కత్తు పై ప్రవీణ్ ను విడుదల చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న డబ్బును మాత్రం తిరిగి ఇవ్వలేదు. జితన్ రాం మంఝీ జెహ్నాబాద్ జిల్లాలోని మక్దుంపుర్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహించారు. జెడీ(యూ) పార్టీ తరఫున శాసన సభకు 6 సార్లు ఎన్నికయ్యారు. మాంజీ ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేసిన అనంతరం జేడీ(యూ) నుంచి బయటకు వచ్చి హిందుస్థానీ అవమ్ మోర్చా పార్టీ(హెచ్ఎమ్)ని స్థాపించారు. ప్రస్తుతం బిహార్‌కు జరగనున్న శాసన సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో మంఝీ దగ్గరయ్యారు. -
మోదీకి నల్లజెండాలు చూపించారని..
చండీగఢ్: పదిమంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత శుక్రవారం చండీగఢ్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చిన సందర్భంగా వారంతా నల్ల జెండాలు ప్రదర్శించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారని, ప్రధాని వ్యతిరేక నినాదాలు చేశారని తెలిసింది. ఈ శుక్రవారం మోదీ చండీగఢ్ పర్యనకు వెళుతున్న నేపథ్యంలో తిరిగి వారు అలాంటి ఆందోళనే చేస్తారేమోనని పోలీసులు వారిని ముందుగానే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఈరోజు ప్రధాని ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం రిషికేశ్ లోని స్వామి దయానంద సరస్వతీ ఆశ్రమాన్ని కూడా సందర్శించనున్నారు. -
'వీడియో క్లిప్' తో అడ్డంగా దొరికిపోయిన సైనికులు
గ్వాటెమలా సిటీ: ఇద్దరు మైనర్ ను హింసాయుతంగా వేధిస్తున్నట్లు దృశ్యాలు నమోదయిన వీడియో క్లిప్ ఐదుగురు సైనికుల తొలగింపునకు కారణమైంది. గ్వాటెమలా సైన్యానికి చెందిన ఐదుగురు జవాన్లు ఇద్దరు కుర్రాళ్లను తుపాకి మడమలతో కొట్టడం, చెంపదెబ్బలు, కిక్‌లు, పంచ్‌లు విసరడం, గోడకుర్చీ వేయించడం లాంటి దృశ్యాలన్నీ ఆ విడయోలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గ్వాటెమలా సైన్యాధికారులు సదరు సైనికుల్ని గురువారం సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. జులై 26న సాన్ పెర్డో యెపోకాప అనే ప్రాంతలో అతిగా మద్యం సేవించిన టీనేజర్లు.. సమీపంలో ఉండే ఓ కాలనీ వాసులతో గలాటాకు దిగి రచ్చ చేశారని, వారిని నివారించే క్రమంలో సైనికులు కాస్త కటవుగా వ్యవహరించాల్సి వచ్చిందని ఆర్మీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మైనర్లను కొట్టడం అభ్యంతరకరమే కనుక వారిపై తప్పలేదనీ పేర్కొన్నారు. -
బంగారంతో పట్టుబడ్డ విమాన సిబ్బంది
సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది ఒకరు అడ్డంగా దొరికిపోయిన ఘటన సంచలనం రేపింది. తనిఖీల అనంతరం ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న సౌదీ పోలసులు.. శుక్రవారం కూడా విచారిస్తున్నారు. ఈ అరెస్టుతో కేవలం 11 మంది సిబ్బందితో మాత్రమే కొచి- జెడ్డా విమాన సర్వీసును నడిపించారు. నిబంధనల ప్రకారం విమానంలో 12 మంది సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారలు ఆలస్యంగా స్పందించారు. క్యాబిన్ క్రూలో ఒకరిని జెడ్డా ఎయిర్ పోర్టు అధికారులు అరెస్టుచేసింది నిజమేనని, అందుకు గల సహేతుక కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం మీడియాకు చెప్పారు. ఉద్యోగి తప్పుచేసినట్లు తేలితే విధుల నుంచి తొలిగిస్తామని పేర్కొన్నారు. -
ఒబామా బస చేసిన హోటల్ వద్ద ఇద్దరి అరెస్ట్!
బ్రిస్బేన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బస చేసిన హోటల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు రెండు సూట్ కేసులతో బ్రిస్బేన్ లోని మారియట్ హోటల్ వద్ద అనుమానస్పందంగా తిరగడం పోలీసుల దృష్టిలో పడింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందించలేదు. జీ20 సమావేశాల్లో పాల్టొంటున్న ఒబామా ప్రస్తుతం మారియట్ హోటల్ లో బస చేశారు. -
యువతిని నిర్బంధించి చిత్రహింసలు
నెల్లూరు(నవాబుపేట) : ఓ యువతిని నిర్బంధించిన వ్యక్తి ఆమెను చిత్రహింసలు పెట్టి బుజబుజనెల్లూరు సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లికి చెందిన ఓ యువతి(17)కి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. ఆమె తన పెదనాన్న వద్ద ఉంటూ ఆత్మకూరులోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన షేక్ బాషా, మస్తానమ్మ కుమారుడు షఫీ వివాహితుడు. అయితే కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీ నుంచి ఆమె అదృశ్యమైంది. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ రోజు నుంచి ఆమెను షఫీ తన ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టసాగాడు. ఈ క్రమంలోనే ఆమె బుజబుజనెల్లూరు సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పురుగుల మందు తాగి పడిపోయింది. అయితే షఫీ నెల్లూరులోని తన స్నేహితుడికి ఈ విషయం చెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్పించాలని సూచిం చాడు. షఫీ స్నేహితుడు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చిన అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు నెల్లూరుకు చేరుకుని ఆమె పరిస్థితి చూసి కన్నీరుమున్నీరయ్యారు. షఫీతో పాటు అతడి తల్లిదండ్రులు, అన్నా, వదిన తమ బిడ్డను చిత్రహింసలు పెట్టారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. జుట్టును కొంత భాగం కత్తిరించడంతో పాటు చిత్రహింసలు పెట్టి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.