ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Published Sun, Aug 7 2016 12:01 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
ములుగు : జనశక్తి పార్టీ పేరుతో ములుగు ప్రాంతంలో పాటలు పాడుకుంటూ చందాలు వసూలు చేసేందుకు వచ్చిన ముగ్గురిని శనివా రం ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏఎస్సై సమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండ లం గురిజాలకు చెందిన వెంపాటి కుమారస్వామి గతంలో జనశక్తి పార్టీలో పనిచేసి జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్‌గా ఉన్నాడు. గతంలో ఉప్పల్‌లో జరిగిన ఓ మర్డ ర్ కేసులో సైతం అతడు ప్రధాన నిందితుడు. కుమారస్వామితో పాటు దేవరుప్పుల మండ లం సింగరాజుపల్లికి చెందిన మేడ సురేశ్, తొర్రూరుకు చెందిన ఆంబోతు సోమన్నలు గ్రూపుగా ఏర్పడి ఇది వరకు దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో జనశక్తి పార్టీ పేరుతో చందాలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ములుగు మండలంలోనూ చందాలు వసూలు చే యాలని పథకం పన్నారు. శనివారం ఉద యం మండలకేంద్రంలోని బండారుపల్లి క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో ఏఎస్సై సమ్మిరెడ్డి, కానిస్టేబుల్స్ శ్రీను, సునీల్ వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో జనశక్తి పేరుతో చందాల వసూళ్లకు వచ్చినట్లు తెలిపారు. వారిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సురేశ్, సోమన్నలు అరుణోదయ కళా బృందంలోనూ పనిచేస్తున్నారు.
Advertisement