భారీగా పాత పెద్ద నోట్ల పట్టివేత | Three persons held for holding demonetised currency in hyderabad | Sakshi
Sakshi News home page

భారీగా పాత పెద్ద నోట్ల పట్టివేత

Published Mon, Mar 20 2017 9:57 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM

భారీగా పాత పెద్ద నోట్ల పట్టివేత - Sakshi

భారీగా పాత పెద్ద నోట్ల పట్టివేత

హైదరాబాద్‌: నగరంలో రద్దైన పెద్ద నోట్లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కొంతకాలం పాటు పెద్ద మొత్తంలో నల్లడబ్బును అక్రమంగా రవాణా చేస్తూ చాలామంది పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. పాత పెద్ద నోట్లు రద్దై నాలుగు నెలలు కావొస్తున్నా ఇంకా దుండగులు పాత పెద్ద నోట్లతో పట్టుబడుతుండటం సంచలనాన్ని రేపుతోంది.

కాగా, సోమవారం పట్టుబడిన రూ.500, రూ.1000 పాత పెద్ద నోట్ల విలువ రూ.కోటి ముప్ఫై ఐదు లక్షల ఎనభై వేలు. ఇంత భారీ మొత్తంలో పాత నోట్లు నిందితులకు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement