
ముంబై: ఒక వ్యక్తి తనను తదేకంగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించాడని ముగ్గురు వ్యక్తుల దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణ ఘటన ముంబైలో మాతుంగ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.....కాల్‌సెంటర్‌లో పనిచేసే రోనిత్ భలేకర్ తన స్నేహితుడితో మద్యం మత్తులో ఉన్నప్పుడూ ఈ దారుణం జరిగింది. భలేకర్ అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఒకర్నీ తనను ఎందుకు తదేకంగా చూస్తున్నారంటూ గొడవపడ్డాడు.
దీంతో వారు కోపంతో అతన్ని బెల్టుతో పదేపదే కొట్టి ఛాతీ, కడుపుపై దారుణంగా తన్నారు. దీంతో సదరు వ్యక్తి భలేకర్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఈ ఘటనతో భయపడిన నిందితులు బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అతను ఆస్పత్రి చేరక మునుపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో షాహు నగర పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
(చదవండి: డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. అసలు ఏం జరిగింది?)