inebriated
-
ఘోరం: ఎందుకలా చూస్తున్నారు అని ప్రశ్నించాడని...కొట్టి చంపేశారు
ముంబై: ఒక వ్యక్తి తనను తదేకంగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించాడని ముగ్గురు వ్యక్తుల దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణ ఘటన ముంబైలో మాతుంగ ప్రాంతంలోని రెస్టారెంట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.....కాల్సెంటర్లో పనిచేసే రోనిత్ భలేకర్ తన స్నేహితుడితో మద్యం మత్తులో ఉన్నప్పుడూ ఈ దారుణం జరిగింది. భలేకర్ అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఒకర్నీ తనను ఎందుకు తదేకంగా చూస్తున్నారంటూ గొడవపడ్డాడు. దీంతో వారు కోపంతో అతన్ని బెల్టుతో పదేపదే కొట్టి ఛాతీ, కడుపుపై దారుణంగా తన్నారు. దీంతో సదరు వ్యక్తి భలేకర్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఈ ఘటనతో భయపడిన నిందితులు బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అతను ఆస్పత్రి చేరక మునుపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో షాహు నగర పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. అసలు ఏం జరిగింది?) -
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
కొత్తగూడ: తాగుబోతుల వల్ల జరిగిన ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా ఆదుకుంటామని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ హమీ ఇచ్చారు. గురువారం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పండగ రోజు ఇంట్లో కూర్చున్న వారికి ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రమాదంలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు కొట్టారని బాధిత కుటుంబ సభ్యులు తమ గోడును ఎంపీ సీతారాం నాయక్‌కు వెల్లబోసుకున్నారు. స్పందించిన ఎంపీ గూడూరు సీఐ రమేష్‌నాయక్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఎంపీ వెంట టీఆర్ఎస్ నాయకులు సమ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, దూదిమెట్ల లింగయ్య పాల్గొన్నారు.