బాధిత కుటుంబాలను ఆదుకుంటాం | MP Sitaram Naik vows to help deprived families | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

Published Sat, Oct 15 2016 8:09 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

MP Sitaram Naik vows to help deprived families

కొత్తగూడ: తాగుబోతుల వల్ల జరిగిన ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా ఆదుకుంటామని మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ హమీ ఇచ్చారు. గురువారం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పండగ రోజు ఇంట్లో కూర్చున్న వారికి ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

ప్రమాదంలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు కొట్టారని బాధిత కుటుంబ సభ్యులు తమ గోడును ఎంపీ సీతారాం నాయక్‌కు వెల్లబోసుకున్నారు. స్పందించిన ఎంపీ గూడూరు సీఐ రమేష్‌నాయక్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఎంపీ వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు సమ్మయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, స్వామి, దూదిమెట్ల లింగయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement