families
-
కుక్క మీద ప్రేమ.. పీఎస్‌కు పంచాయతీ
బంజారాహిల్స్: పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమ రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే చాంద్ షేక్ ఒక విదేశీ కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పక్క ప్లాట్‌లో నివసించే రుచిక అగర్వాల్ అనే యువతికి సైతం ఈ కుక్క అంటే ఎనలేని ప్రేమ. ఈ కుక్కతో ఆమె అనుబంధాన్ని మరింతగా పెంచుకుంది. అంతేకాకుండా కుక్కను తన ఇంటికి తీసుకెళ్తూ ఆహారం కూడా అందించేది. తరచూ ప్రయాణాలు చేసే ఈ పెంపుడు కుక్క యజమాని చాంద్ షేక్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి రుచిక అగర్వాల్ కు అప్పగించేవాడు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాంద్ షేక్ విదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్కను చూసుకోవాల్సిందిగా రుచిక అగర్వాల్ కు అప్పగించి వెళ్లాడు. అయితే ఈ కుక్క అంటే చాంద్ షేక్ తండ్రి షేక్ సుభానికి కూడా మహా ప్రాణం. తాను అల్లారు ముద్దుగా చూసుకునే కుక్క పక్కింట్లో ఉండటాన్ని జీరి్ణంచుకోలేక షేక్ సుభాని రుచిక ఇంటికి వెళ్లి కుక్కను తనతో పాటు తీసుకొని వచ్చాడు. దీంతో రుచిక కోపం పట్టలేక కుక్క మీద ఉన్న ప్రేమతో సుభానితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుక్క కోసం రుచిక తో పాటు ఆమె సోదరుడు ఆమె వద్ద పనిచేసే వికాస్, జేమ్స్, ఆమె వదిన గొడవ పడ్డారు. కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా సుభాని అడ్డుకున్నాడు. ఈ గొడవలో సుభానికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహం పట్టలేక రుచికాపై విరుచుకుపడ్డాడు. దీంతో తనను తిట్టాడంటూ రుచిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సుభాని కొడుకు చాంద్ షేక్ కూడా తన తండ్రిని కొట్టారంటూ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు సెక్షన్ 329(4), 115(2), 351(2), రెడ్ విత్ 3(5) బీఎన్ ఎస్ కింద ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగ వేళ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: దీపావళి పండుగ వేళ కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం సెలపాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. బత్తుల కుటుంబీకులపై పొట్లకాయ ఫ్యామిలీ కత్తులతో దాడి చేశారు. దీంతో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందారు.మృతులు బత్తుల రమేష్, రాజు, చిన్నిగా గుర్తించారు. దాడి తర్వాత నిందితులు పరారయ్యారు. గాయపడ్డ నాలుగో వ్యక్తిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ విచారిస్తున్నారు. సెలపాక గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. -
జనగాంలో భారీ అగ్ని ప్రమాదం.. 20 కోట్ల ఆస్తి నష్టం (ఫొటోలు)
-
ఎక్కువ పొదుపు చేస్తుంది.. వ్యవసాయ కుటుంబాలే
దేశంలోని గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాలే అత్యధికంగా పొదుపు చేస్తున్నాయి. మొత్తం పొదుపు చేస్తున్న కుటుంబాల్లో... 71% వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి. వ్యవసాయేతర కుటుంబాల్లో 58% మాత్రమే పొదుపు చేస్తున్నాయి. ఈ విషయాన్ని నాబార్డు వెల్లడించింది. 2021 జూలై నుంచి 2022 జూన్ (వ్యవసాయ సంవత్సరం) వరకు ఆల్–ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వేను నాబార్డుకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. భారత్‌లోని గ్రామీణ జనాభా ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థపై నాబార్డు చేసిన ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధిక శాతం గ్రామీణ కుటుంబాలు వాణిజ్య బ్యాంకుల్లోనే పొదుపు చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి -
లక్షల మందిని తరలించలేం
సాక్షి, అమరావతి: ‘వరదల్లో వంద, రెండు వంద కుటుంబాలు చిక్కుకుంటే వెంటనే తరలించగలం.. ఏకంగా 2.76 లక్షల మందిని వెంటనే తరలించలేం. సమయం పడుతుంది. కేంద్ర సాయం కోరాం. వారి నుంచి సాయం అందగానే చర్యలకు ఉపక్రమిస్తాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. లక్షల మందికి సహాయం చేయాల్సిన పరిస్థితులున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలు ఉపయోగిస్తామన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బస చేసిన బస్సు వద్ద మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో బుడమేరు, మున్నేరు నుంచి వరద వచ్చిందన్నారు.దీంతో ఇబ్రహీంపట్నం, విజయవాడలోని సింగ్‌నగర్, కృష్ణలంకతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఉందన్నారు. సింగ్‌నగర్‌లో 16 వార్డుల్లో 2.76 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారన్నారు. చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. వరద తీవ్రతను కేంద్ర మంత్రి అమిత్‌షాకు వివరించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపుతున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి నాలుగు బృందాలు, సోమవారానికి మిగిలిన ఆరు బృందాలు చేరుకుంటాయన్నారు. అదే విధంగా 40 బోట్లు, ఆరు హెలికాప్టర్లు కూడా వస్తాయన్నారు. సీనియర్ ఐఏఎస్‌లను విజయవాడకు రప్పించాప్రభుత్వ పిలుపుతో పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం సరఫరాకు ముందుకు వచ్చాయని సీఎం చెప్పారు. సింగ్‌నగర్ 16 డివిజన్లలో 77 సచివాలయాలు ఉండగా, ప్రతి వార్డుకు ఒక సీనియర్, సచివాలయానికి జూనియర్ అధికారిని పర్యవేక్షకులుగా నియమించి సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులను విజయవాడకు రప్పించానన్నారు. వరద ఎప్పటిలోగా తగ్గుతుందో చెప్పలేమన్నారు. జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోవాలని కేంద్ర పభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఇంత వర్షం.. అసాధారణంరాష్ట్రంలో భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రాణ, పశు నష్టం పెద్దగా జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ కార్యాలయంలో భారీ వర్షాలు, సహాయక చర్యలపై అధికారులతో ఆదివారం సమీక్షించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. 1,11,259 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 7,360 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు.వరద బాధిత కుటుంబాలకు 25 కేజీలు చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ఇస్తున్నామన్నారు. మత్స్యకారులకు అదనంగా మరో 25 కేజీలు బియ్యం ఇస్తామన్నారు. అమరావతి రాజధాని శ్మశానం కావాలనుకునే వారే మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రధాని ఫోన్సీఎం చంద్రబాబుకు ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు.వర్షాల్లో ప్రాణ నష్టం బాధాకరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి జనసేన శ్రేణులు సాయం అందజేయాలని ఆయన కోరారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో పార్టీ డాక్టర్స్ సెల్‌తో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. -
ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. చాలాచోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అంటూ బొత్స ప్రశ్నించారు.బాత్రూమ్లో కెమెరాలు కోసం ఎన్ని రోజులు విచారణ చేస్తారు. కెమెరాలు బాత్ రూమ్‌లో లేకపోతే విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు.. వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్ అక్కడ ఏమి జరగలేదని చెప్పగలరా?. వైఎస్సార్సీపీ పాలనలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగలేదు. విశాఖలో లోకేష్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. 47 వేల క్లాస్ రూమ్‌లను గత ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసింది. 20 వేల క్లాస్ రూమ్‌ల్లో టీవీలు ఏర్పాటు చేశాం’’ అని బొత్స తెలిపారు.‘‘విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. అన్ని వసతులను చూసి లోకేష్ మెచ్చుకున్నారు. ఇది గత ప్రభుత్వ ఘనత. విద్యార్థుల చదువు కోసం వైఎస్ జగన్ సర్కార్ అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు వేశారు. ఈ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క విద్యార్థికి ప్రభుత్వం డబ్బులు వేయలేదు.’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
ఉత్తరం కలిపింది వారిని...!
బ్రిటన్‌లో పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరిన ఓ పోస్టు కార్డు ఎప్పుడో వందేళ్ల కింద విడిపోయిన రెండు కుటుంబాలను కలిపింది. 1903లో ఎవార్ట్ అనే బాలుడు తన సోదరి లిడియాకు పంపిన పోస్టు కార్డు ఇటీవలే స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ క్రాడాక్ స్ట్రీట్ బ్రాంచ్‌కు చేరడం, ఈ సంఘటన విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. వారి కుటుంబాలను వెదికేందుకు సొసైటీ పూనుకుంది. కార్డు గురించి పత్రికల్లో వచి్చన కథనాలతో ఎవార్ట్, లిడియాల మనవడు నిక్ డేవిస్, మనవరాళ్లు హెలెన్ రాబర్ట్, మార్గరెట్ స్పూనర్, ముని మనవరాలు ఫెయిత్ రేనాల్డ్స్ తమ బంధాన్ని గుర్తించారు. వారంతా బుధవారం స్వాన్సీలోని వెస్ట్ గ్లామోర్గాన్ ఆరై్కవ్స్లో కలుసుకున్నారు. ఎవరు ఎవరికి ఏమవుతారంటే..? ఎవార్ట్, లిడియా కుటుంబం 121 ఏళ్ల కిందట స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో నివసించేది. ఆరుగురు తోబుట్టువుల్లో లిడియా పెద్దది. తమ్ముడైన ఎవార్ట్ ఆమెకు పోస్టు కార్డు రాశాడు. వీరికి స్టాన్లీ అనే సోదరుడున్నాడు. అతని మనవరాళ్లే హెలెన్ రాబర్ట్ (58), మార్గరెట్ స్పూనర్ (61). వెస్ట్ ససెక్స్‌కు చెందిన నిక్ డేవిస్ (65) ఎవార్ట్ మనవడు. డెవాన్‌కు చెందిన ఫెయిత్ రేనాల్డ్స్ (47) లిడియా ముని మనవరాలు. తామంతా కలిసినందుకు లిడియా, ఎవార్ట్, స్టాన్లీ పైనుంచి చూసి సంతోíÙస్తూ ఉంటారని వారంటున్నారు. రెండు కుటుంబాలను ఏకం చేసిన వందేళ్ల నాటి పోస్టును తిరిగి ఆర్కైవ్స్లోనే ఉంచాలని నిర్ణయించారు. తాత ఇంటి నుంచి లేఖ.. ‘‘పోస్టు కార్డు రాసినప్పుడు ఎవార్ట్కు 13 ఏళ్లుండి ఉంటాయి. వేసవి సెలవుల్లో ఫిష్ గార్డ్‌లోని తన తాత ఇంట్లో గడిపేవాడు. పెద్ద సోదరి లిడియాకు పోస్టు కార్డులు సేకరించే అభిరుచి ఉంది. అద్భుతంగా కనిపించిన ఓ పోస్టు కార్డును తన సోదరికి పంపించాడు’’ అంటూ ఎవార్ట్ మనవడు నిక్ డేవిస్ అప్పటి విషయాలను పంచుకున్నాడు. కార్డు కారణంగా ఇలా బంధువులను కలవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడు. ఆశ్చర్యపోయా.. ‘‘పోస్టుకార్డు మా కుటుంబానికి చెందినదని భావించిన వారెవరో మమ్మల్ని సంప్రదించారు. దాంతో ఆశ్చర్యపోయా. మా బామ్మకు సోదరులున్నారని తెలియడం, వారి పిల్లలను కలవడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం గురించి ఇంకా ఏమేం తెలుస్తాయోనన్న ఎగ్జైట్మెంట్ ఉంది’’ అని లిడియా ముని మనవరాలు ఫెయిత్ రేన్లాడ్స్ చెప్పుకొచి్చంది. బంధువులను కలవడం బాగుంది... ‘‘ఆరేళ్లుగా మా కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తున్నా. ఇలాంటి కుటుంబ సభ్యులున్నారని ఇన్నాళ్లూ తెలియకపోవడం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. వారిని కలుసుకోవడం బాగుంది. అప్పుడు వాళ్లున్న ఇంట్లోని వస్తువులను వేలానికి పంపినప్పుడు ఆ పోస్టు కార్డు బహుశా బైబిల్ లోంచి పడిపోయి ఉంటుంది. తరవాత ఎవరో దాన్ని తిరిగి పోస్టాఫీసుకు పంపి ఉంటారు’’ అని స్టాన్లీ మనవరాళ్లు హెలెన్, స్పూనర్ చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సినిమాను తలపించేలా.. చిన్న ‘పార్కింగ్’ గొడవ.. పెద్ద రచ్చ.. వీడియో వైరల్
ఢిల్లీ: నోయిడాలో కారు పార్కింగ్ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదా హింసాత్మకంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరుగుపొరుగు ఇళ్ల వారు రోడ్డుపైనే కొట్టుకున్నారు. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లోని బి-బ్లాక్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్ లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం జరగ్గా.. నితిన్ తరపు వ్యక్తులు తొలుత రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు రోడ్డుపై పార్కింగ్ చేసిన నితిన్ కారును ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళల మధ్యకూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. Kalesh b/w Two parties over car parking in Sector 72's B Block in Noida's Sector 113 police station area, there was a lot of ruckus on the road, the car was broken with a cricket bat, Noida UPpic.twitter.com/ysMagNpWuW— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024 -
వర్ణ వివక్షపై పోరాడిన నేలలో లింగ వివక్ష..!
వర్ణవివక్షపై పోరాడిన దక్షిణాఫ్రికా నేలపై.. లింగ వివక్ష ఇంకా వేళ్లూనుకుని ఉంది. శ్వేతజాతి పాలన అంతమైన 30 ఏళ్ల తరువాత కూడా మహిళలకు సర్వ హక్కులు రాలేదు. జాతి రక్షణ కోసం చేసిన భూ చట్టం నల్లజాతి మహిళలకు మాత్రం అభద్రతను మిగులుస్తోంది. భర్త చనిపోయిన భార్యలు, తండ్రిని కోల్పోయిన పిల్లలు తమ సొంత ఇంటినుంచే గెంటివేతకు గురవుతున్నారు. నిరాశ్రయులుగా మారుతున్నారు. దక్షిణాఫ్రికా పట్టణాల్లోని టౌన్‌షిప్‌లలో లక్షలాది నల్లజాతి కుటుంబాలు ఇదే అభద్రతలో జీవిస్తున్నాయి. శాశ్వతమైన వివక్ష.. జొహన్నెస్‌బర్గ్‌లోని 74 ఏళ్ల వృద్ధురాలు జొహనా మోత్లమ్మ. 1977లో ఆమెకు 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. సొవెటోలో ఒక చిన్న ఇంటికి మారారు. 1991లో విడాకులు తీసుకునే వరకు ఇక్కడి టౌన్íÙప్లోని ఇంట్లో నివసించారు. 2000 సంవత్సరంలో ఆమె మాజీ భర్త ఆ ఇంటిని రిజిస్టర్ చేసినప్పుడు, పూర్తి యాజమాన్యం అతనికే వెళ్లింది. మూడేళ్ళ తర్వాత అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంటి యాజమాన్య హక్కుల గురించి అతడిని ఆమె ఎప్పుడూ అడగలేదు. 2013లో అతను చనిపోయిన తర్వాత అంతా మారిపోయింది. అతని రెండో భార్య ఆ ఇంటిని అమ్మేసింది. ఎందుకంటే ఇంటిలో మోత్లమ్మకు 50 శాతం హక్కున్నా... అప్‌గ్రేడ్ అయిన చట్టం విడాకుల తరువాత ఆమెకు ఆస్తి హక్కును అనుమతించలేదు. ఆస్తికి ఆమె కూడా యజమానిగా భర్త రికార్డుల్లో పేర్కొనలేదు. దీంతో ఇంటి అమ్మకాన్ని ఆమె ఆపలేకపోయింది. అప్‌గ్రేడింగ్ చట్టం మహిళల పట్ల వివక్షను శాశ్వతం చేసింది. కోర్టుల చుట్టూ తిరిగి, విసిగి.. 39 తొమ్మిదేళ్ల లెబో బలోయి కూడా దశాబ్దం కిందట తన ఇంటిని కోల్పోయింది. సోవెటోలో ప్రభుత్వం జారీ చేసిన రెండు పడక గదుల ఇల్లు ఆమె తండ్రి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆ తరువాత తనకు, తన తల్లికి ఆ ఇంటి వారసత్వం వస్తుందని బలోయి ఆశించింది. అందుకే ఆమె, ఆమె భర్త పాల్ కలిసి ఇంటిని పునరుద్ధరించారు. ఇంటికి మరో రెండు గదులు అదనంగా కట్టారు. 2009లో ఆమె తల్లి చనిపోయిన తరువాత ఆ ఇంటిపై హక్కు తన సవతి తల్లి కూతురుకు వెళ్లిపోయింది. చట్టబద్ధంగా ఆ ఆస్తి ఎవరికి దక్కుతుందనే దానిపై స్పష్టత లేదు. కోర్టుకు తిరిగి తిరిగి విసిగిపోయిన ఆమె.. తన సవతి సోదరితో పోరాడటానికి బదులుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) దూరంలోని జొహన్నెస్‌బర్గ్ శివారు మెలి్వల్లేలో నివసిస్తోంది.మోత్లమ్మ, బలోయిలే కాదు.. సొవెటోలో లక్షలాది మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంటి గురించి కుటుంబ సభ్యులు గొడవపడానికి ఈ వ్యవస్థ కారణమైందని వారు వాపోతున్నారు. 1994లో ప్రభుత్వం భూమి హక్కుల పునరుద్ధరణ చట్టం–1994 ప్రవేశపెట్టింది. 1991 యొక్క భూ కాలపరిమితి హక్కుల చట్టంలోని నల్లజాతి దీర్ఘకాలిక లీజుదారుల ఆస్తి హక్కులను అప్ గ్రేడ్ చేసింది. చివరికి వారి ఇళ్లను సొంతం చేసుకోవడానికి అనుమతించింది. కానీ ఇందులో ఒక చిక్కుముడి ఉంది. చట్ట నిబంధనల ప్రకారం, కుటుంబ పెద్దగా పరిగణించబడే వ్యక్తి మాత్రమే ఆస్తిపై హక్కును కలిగి ఉంటాడు. అతను బతికున్న కాలంలో విల్లు రాస్తే ఆ జాబితాలో ఉన్నవారికి చెందుతుంది. పితృస్వామ్య సంప్రదాయ వారసత్వ నిబంధనల్లో పాతుకుపోయిన ఈ కొత్త చట్టం భార్యలు, సోదరీమణులు, తల్లులు, కూతుళ్లను వారసత్వానికి దూరం చేస్తోంది. సవరణలకు సుప్రీం ఆదేశం... ఇది మహిళలను చట్టానికి దూరంగా ఉంచడమేనని 2018లో దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు పేర్కొంది. టౌన్íÙప్లో మహిళల భూ హక్కులకు సంబంధించిన ప్రత్యేక కేసుపై తీర్పు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. లింగ, ఆస్తి వారసత్వానికి సంబంధించిన అప్ గ్రేడింగ్ చట్టంలోని సెక్షన్ 2(1) రాజ్యాంగపరంగా చెల్లదని కూడా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇది మహిళల హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది. ప్రాపర్టీ పర్మిట్ లేదా టైటిల్ డీడ్‌లో పేర్లు లేకపోయినా బాధిత మహిళలు లేదా ఇప్పటికే ఒక ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమరి్పస్తే హక్కులు వర్తింపజేయాలని సుప్రీంకోర్టు పార్లమెంటును ఆదేశించింది. ఫలితంగా ఈ ఏడాది మేలో దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రభుత్వం భూమి హక్కుల సవరణ చట్టం–2021ను గెజిట్ చేసింది. ఇది ఎన్నికలు ముగిసిన వారం తర్వాత అమల్లోకి వచి్చంది. దీంతో ఇళ్లు కోల్పోయిన ప్రజలు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ‘’నాట్ ఫర్ సేల్’... దీంతో ఇళ్ల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలతో జొహన్నెస్‌బర్గ్‌లోని స్వచ్ఛంద సంస్థలు కిటకిటలాడుతున్నాయి. ఈ వివాదాలు సర్వసాధారణమయ్యాయని, మహిళలు కోర్టు ల్లో దీర్ఘకాలికంగా పోరాడుతున్నారని విట్‌వాటర్స్ ర్యాండ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ డీన్ బుసిసివే ఎన్కాలా డ్లామిని చెప్పారు. ఇలాంటి చట్టం ఒకటుందని, జీవితకాలం వారు నివసించిన ఇంటిపై హక్కు లేదని... సడన్‌గా ఇల్లు ఖాళీ చేయాల్సి వచి్చనప్పుడే మహిళలకు తెలుస్తోందని హక్కుల సంఘాలు వాపోతున్నాయి. ఈ చట్టం వల్ల మహిళలు, పిల్లలు తమ జీవితకాల భద్రతను కోల్పోయే ప్రమాదం ఉందని, నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని ‘ఎ జెండర్డ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యామిలీ హోమ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా’ అధ్యయనం వెల్లడించింది. పట్టాల సమస్యల కారణంగా ‘నాట్ ఫర్ సేల్’ అని రాసిన ఇళ్లు సోవెటోలో అనేకం కనిపిస్తాయి. ’మాకు మా చిన్ననాటి ఇల్లు కావాలి’ చర్చలతో ప్రభుత్వం, కోర్టులు చేస్తున్న జాప్యానికి ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు అసహనానికి గురవుతున్నాయి. తమ ఇంటిపై యాజమాన్యం విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మోత్లమ్మ కొడుకు మైమానే కోర్టును కోరుతున్నాడు. ‘మా నాన్నకు అన్ని అనుమతులు ఇచ్చి, మా అమ్మను మినహాయించిన ఈ వ్యవస్థ సరైంది కాదు’ అంటున్నాడు. ఇద్దరికీ సమానహక్కులుంటే ఈ సమస్య ఉండేది కాదని, తమ చిన్ననాటి ఇంటిని తిరిగి పొందాలనుకుంటున్నామని చెబుతున్నాడు. -
అచ్యుతాపురం ఘటన: మళ్లీ మొదటికొచ్చిన రూ.కోటి పరిహారం వ్యవహారం
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్నుసూపరింటెండెంట్ మృతుల బంధువులు నిలదీశారు. నష్టపరిహారం ఇచ్చేవరకు మృతదేహాలను తీసుకువెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరీ వీడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఇదిలా ఉంటే.. కోటి రూపాయల పరిహారం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే రూ. కోటి చెక్కు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. అయితే, చంద్రబాబు వెళ్లిన తర్వాత అధికారులు మాట మర్చారు. డెడ్‌బాడీలను ఇంటికి తీసుకెళ్లే సమయంలో దారి ఖర్చులకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తామని అధికారులు అంటున్నారు. రూ కోటి పరిహారం ఇస్తేనేగాని ఇంటికి తీసుకెళ్లమంటున్న బంధువులు.. రూ.10 వేల కోసం కుక్కర్తి పడేవాళ్లలా కనిపిస్తున్నామా అంటూ నిలదీశారు.మరీ ఇంత నిర్లక్ష్యమా!?కాగా, ఎక్కడో మదనపల్లిలో ఓ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్ని ఫైళ్లు దగ్ధమైతేనే ఏదో భారీ ఉపద్రవం ముంచుకొచ్చినట్లు హడావిడి చేసి, ఆగమేఘాల మీద హెలికాఫ్టర్‌లో డీజీపీని పంపి సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. విశాఖలో ఇంత పెద్ద ప్రమాదం సంభవిస్తే, ఇంత మంది ప్రాణాలు పోతే స్పందించకుండా తాపీగా ప్రభుత్వ శాఖలపై సమీక్ష చేస్తూ కూర్చోవడం విమర్శలకు తావిస్తోంది.40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ, తనను మించిన విజనరీ, సమర్థుడు ఈ దేశంలోనే లేడని తనకు తానే డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. రియాక్టర్ ప్రమాద ఘటనలో మాత్రం చతికిలబడ్డారు. చంద్రబాబు పరిపాలనలో బేలతనం ఈ దుర్ఘటనతో స్పష్టంగా బయటపడింది.మధ్యాహ్నం 2 గంటల సమయంలో రియాక్టర్ పేలింది. అదే సమయంలో హోం శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలోనే హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసి కూడా సహాయక చర్యలపై వారితో సీఎం చంద్రబాబు సమీక్షించలేదని తెలిసింది. చంద్రబాబు సీఎం సమీక్ష అనంతరం కూడా సచివాలయంలోనే ఉన్న హోం మంత్రి అనిత.. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు.అచ్యుతాపురం ఘటనపై ఆమె కనీసం స్పందించ లేదు. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ ప్రెస్ మీట్ పెట్టి ప్రమాదంలో మృతుల వివరాలు కూడా పూర్తిగా చెప్పలేకపోయారు. అంతెందుకు రాత్రి 7 గంటల వరకు అనకాపల్లి కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడలేదు. సచివాలయంలోనే ఉన్నా, హోం మంత్రి, డీజీపీలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అర్ధరాత్రయినా ప్రమాద స్థలానికి మంత్రులుగానీ, ఉన్నతాధికారులుగానీ చేరుకోలేదు. ప్రెస్ నోట్లు, మీడియాలో దిగ్భ్రాంతులకే పాలనా యంత్రాంగం పరిమితమైంది. -
కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్.. చేనేత కుటుంబాలకు సాయం
సాక్షి,హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మరో మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గడిచిన ఏడు నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు స్టేట్ హోమ్‌లో ఉన్న వందమంది అనాథ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కేటీఆర్ బుధవారం(జులై 24) తన పుట్టినరోజు జరుపుకున్నారు. -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలివే.. అంబానీ ప్లేస్? (ఫోటోలు)
-
అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా?
మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కార్ల్‌మార్క్స్ చాలాకాలం క్రితమే తేల్చేశాడు కానీ.. ఈ సూత్రానికి మినహాయింపులూ చాలానే ఉన్నాయి. సమాజం మాట కాకపోయినా.. తల్లిదండ్రులు.. దగ్గరి బంధువులతో సంబంధాలను, డబ్బుతో ముడి పెట్టకుండా చూసుకునేవారు చాలామందే కనిపిస్తారిప్పుడు. అయితే.. కెనెడాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. దహన సంస్కారాలకు ఎక్కువ ఖర్చు అవుతోందన్న కారణంగా చాలామంది శవాలను మార్చురీల్లో కుళ్లిపోయేలా చేస్తున్నారని చెబుతున్న ఈ వార్తలు అయ్యో అనిపించేవి.అంత్యక్రియలు అనేది మరణించిన వారి గౌరవార్థం నిర్వహించే కర్మ. ఎవరి ఆచారానికి తగ్గట్టు, ఎవరి ఆర్థిక స్థోమతకు తగ్గట్టు అంత్యక్రియలు నిర్వహించడం పరిపాటి. కానీ కెనడాలోదారుణ పరిస్థితులునెలకొన్నాయి. ఒక్కో మృత దేహానికి నిర్వహించే అంత్యక్రియలు ఖర్చు రూ. 27 నుంచి 30లక్షల దాటి పోతుండటంతో ఏం ఏయాలో తోచక అయోమయంలో పడిపోతున్నారు జనం.ఒకవైపు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న దుఃఖం, మరోవైపు పరలోకానికి చేరిన తమ ఆత్మీయులకు కూడా అంత్యక్రియలు నిర్వహించలేక అనాథ శవాల్లా వదిలివేస్తున్న వైనం ఆందోళన కరంగా మారింది. ఎందుకంటే అక్కడ ఏరియాను బట్టి, అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలకుపై మాటే.. అంతసొమ్ము భరించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పేరుకు పోతోందిట.దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కెనడాలో, స్థానాన్ని బట్టి శ్మశానవాటిక ప్లాట్ల ధరలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. కెనడాలో అంత్యక్రియలకు సగటున 3 వేల డాలర్లకు పైనే అవుతోంది. మిడ్‌టౌన్ టొరంటోలో భారీగా ధర (రూ. 27 లక్షలు.) చెల్లించాల్సి వస్తోంది. ఇతర ఖర్చులు కలిపి మొత్తం వ్యయం రూ. 30 లక్షలు దాటేస్తోంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023 ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. క్యూబెక్‌లో, 2013లో 66గా ఉన్న క్లెయిమ్ చేయని మృతదేహాల సంఖ్య 2023లో 183కి పెరిగింది. అల్బెర్టాలో, 2016లో 80 ఉన్న మృతదేహాల సంఖ్య 2023లో 200కి పెరిగింది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై ప్రతి పక్షాలు విచారం వ్యక్తం చేశాయి. -
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
-
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 15న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని కారణంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993, మే 15ని అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రకటించి వేడుకగా జరపడం ప్రారంభించింది. ఈ రోజున కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేస్తారు అధికారులు. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏడాది ఒక అంశం థీమ్‌గా ప్రకటించి ఆ దిశగా ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ "వాతారణ మార్పులు కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుంది" అనే అంశాన్ని హైలెట్ చేశారు. ఈ థీమ్ ఉద్దేశ్యం..వాతావరణ మార్పు, కాలుష్యం కారణంగా కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సుపై ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీన్ని ప్రకటించారు. అంటే తుపానులు, కరువులు, అనే వాతావరణ మార్పులు కారణంగా కుటుంబంలోని వ్యక్తులు జీవనోపాధిని కోల్పోతారు. తద్వారా ఆర్థిక పరిస్థితి వారి బాంధవ్యాలపై తీవ్ర ప్రభావం స్తుంది. కార్లమర్క్స్ చెప్పినట్లు ప్రతి బంధం ఆర్థిక సంబంధమే అన్న పదం అందరికీ స్ఫురణకు వచ్చేలా చేస్తుంది. ఈ ఒక్క వాతావరణ మార్పు మనిషి జీవన మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి ఒంటిరిని చేస్తుంది. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ వాతావరణ మార్పలు కోసం తమ వంతుగా బాధ్యత తీసుకుని వ్యర్థాలను తగ్గించి మంచి అలవాట్లతో వాతావరణాన్ని కాపాడుకునే యత్నం చేయాలి. ప్రతి కుటుంబం విద్యతోనే బలోపేతం కాగలదని గ్రహించాలి. సహజ వనురులను పునరుత్పత్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. వాతావరణాన్ని ఎంత ఆహ్లాదభరితంగా ఉంచుకుంటే అంతలా మను కుంటుంబాలు, గృహాలు పచ్చగా పదికాలాలు ఉంటాయని చెప్పడమే ఈ ఏడాది థీమ్ ముఖ్యోద్దేశం. అంతేగాదు ఈ ఏడాది 30వ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, కుటుంబ విలువలను హైలెట్ చేసేలా ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేలా చాల చక్కగా థీమ్‌ని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. అంతేగాదు ఈ రోజు కుటుంబ (చదవండి: నాసా ఏరో స్పేస్ ఇంజనీర్‌గా తొలి భారతీయ యువతి!) -
గుంటూరు పర్యటనలో గొప్పమనసు చాటుకున్న సీఎం జగన్
-
పార్లమెంట్లో నెతన్యాహుకి చేదు అనుభవం!
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూకి పార్లమెంట్ సాక్షిగా చేదు అనుభవం ఎదురైంది. నెతన్యాహూ ప్రసంగిస్తున్న వేళ.. గాజాలో హమాస్ బందీలుగా ఉన్న వాళ్ల కుటుంబీకులు తమ నిరసన గళాలతో పార్లమెంట్‌ను హోరెత్తించారు. తమ వాళ్లను భద్రంగా తీసుకొస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమైందని నిలదీశారు వాళ్లు. సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రధాని నెతన్యాహు ప్రసంగం జరుగుతున్న టైంలో.. కుటుంబ సభ్యులు ఫ్లకార్డులపై బందీల ఫొటోలు, పేర్లను చూపిస్తూ నినాదాలు చేశారు. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి రప్పించిన నెతన్యాహూ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు వాళ్లు. నెతన్యాహు ప్రసంగిస్తూ సమయంలో నెస్సెట్ గ్యాలరీలో కూర్చున్న బందీల కుటుంబీకులు లేని నిలబడ్డారు .. ‘‘ సమయం లేదు.. ఇప్పుడే, ఇప్పుడే.. అంటూ గట్టిగా గట్టిగా నినాదాలు చేశారు. అయితే నెతన్యాహూ వాళ్లకు సున్నితంగా సర్దిచెప్పే యత్నం చేశారు. మన బిడ్డలు ఊరికనే చనిపోవడం లేదు. మన దేశ నాశనం కోరుకుంటున్న శత్రువులపై విజయం సాధించేంతవరకు ఈ ప్రయత్నం ఆపకూడదంటూ వ్యాఖ్యానించారు. الأمور مولعة خالص داخل كيان العدو الصهيوني.. - عائلات الأسرى الإسرائيليين تقاطع نتنياهو خلال جلسة الكنيست صارخة "لا وقت.. الآن الآن" - إقالة قائد الكتيبة 51 من لواء غولاني بعد تعريضه جنودا للخطر في الشجاعية. - وأخر شي وأسخن شي.. نتنياهو يمنع غالانت من إجراء مباحثات فردية مع… pic.twitter.com/MeQoH3d8Xt — أجيج (@1b2_r) December 25, 2023 అయితే అప్పటికీ బందీల కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఇంకా గట్టిగా నినాదాలు చేశారు. మా వాళ్లను సురక్షితంగా వెనక్కి మీరు తీసుకొస్తారని నమ్మాం. 80 రోజులు.. ప్రతీ క్షణం నరకంగా గడిపాం. ఇదే మీ కూతురో, కొడుకుకో అయి ఉంటే ఇలాగే ఉంటారా? అంటూ ప్రశ్నించారు. దానికి ప్రధాని నెతన్యాహూ స్పందిస్తూ.. బందీల విడుదల కోసమంటూ చేయని ప్రయత్నమేదీ లేదని వివరించే యత్నం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి బందీల కుటుంబాలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడనంటూ గుర్తు చేశారాయన. అందరినీ సురక్షితంగా విడిపించేంతవరకు సంయమనం పాటించాలని కోరారాయన. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గాజాలో హమాస్ చెరలో 129 మంది బందీలుగా ఉన్నారు. ఇందులో 22 మంది మరణించగా.. వాళ్ల మృతదేహాలు కూడా బంధువుల్ని చేరలేదు. అక్టోబర్ 7వ తేదీన ఇరు దేశాల మధ్య మొదలైన యుద్ధం.. వేల మందిని బలి తీసుకుంది. ఇజ్రాయెల్ తరఫున 1,200 మంది మరణించగా, హమాస్ ఆధీనంలో ఉన్న గాజాలో 20 వేల మంది దాకా మరణించినట్లు తెలుస్తోంది. -
కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు
ఢిల్లీ: ఢిల్లీలో నివసిస్తున్న కశ్మీరీ వలస కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని రూ.10,000 నుంచి రూ. 27,000లకు పెంచుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త కశ్మీరీ మైగ్రెంట్ కార్డులు జారీ చేయడానికి కూడా ఎల్జీ అనుమతినిచ్చారు. ఇప్పటికే ఉన్న కార్డులలో కొత్త పేర్లను జత చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెద్దైన పిల్లలు, కొత్తగా వివాహమైన వారికి కొత్తగా కార్డులను ఇవ్వనున్నారు. వలసదారు కాని యువతి, వలసదారుల కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే.. అలాంటివారికి కూడా అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా వలస వచ్చిన వారికి ఢిల్లీలో చాలాకాలం క్రితం పునరావాసం కల్పించిన విషయం తెలిసిందే. ఇలాంటి వారికి 1989-90లలోనే ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం మొదలుపెట్టంది. 2007లో ఈ ఆర్ధిక సహాయాన్ని రూ.5000 నుంచి రూ.10,000లకు పెంచారు. ఆ తరువాత సాయాన్ని మరింత పెంచింది ఇప్పుడే. పెంపుతో ఇప్పుడు వలసదారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.27,000లకు చేరింది. కశ్మీర్‌లోయ ఉగ్రవాదం చెలరేగడంతో 1989-90లలో హిందువులతో పాటు వివిధ మతాల ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడారు. దాదాపు 60,000 వేల కుటుంబాలు కశ్మీర్‌లోయను వీడి జమ్మూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. అందులో సుమారు 23,000 కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డాయి. ఢిల్లీలో ప్రస్తుతం 2000 కశ్మీరీ వలస కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 70 శాతం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రక్షణ సంబంధిత నిధుల నుంచి వీరికి ఆర్ధిక సహాయం అందుతోంది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
నిరుపేద కుటుంబాలకు సీఎం ఆపన్న హస్తం
కాకినాడ సిటీ: సీఎం వైఎస్ జగన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. నిరుపేదలు పడుతోన్న కష్టాలను విని స్పందించి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం సీఎంను హెలిప్యాడ్ వద్ద పలువురు కలిసి తమ గోడు విన్నవించారు. వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సాయం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టరేట్లో 17 మంది బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను కలెక్టర్ కృతికా శుక్లా అందజేశారు. ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ జిల్లా పర్యటనలో భాగంగా పలువురు బాధితుల సమస్యలు విని తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలిచ్చారన్నారు. శస్త్ర చికిత్సల కోసం కొందరు, ఇతర ఆరోగ్య సేవల కోసం మరికొందరు తమకు సహాయం చేయాలని సీఎంను అడగ్గా ఆ వెంటనే తదనుగుణంగా సీఎం ఆదేశాలిచ్చారని, దీంతో తమను ఆదుకున్నందుకు సీఎం జగన్‌కు లబి్ధదారులు ధన్యవాదాలు తెలిపినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ ఆర్థిక సహాయం పొందిన వారిలో ఈ సత్య సుబ్రహ్మణ్యం (పెద్దాపురం), టీ.ఆనంద్‌కుమార్ (కిర్లంపూడి), కృష్ణకాంత్ (పెద్దాపురం), బుర్రా రాజు (పెద్దాపురం), లక్ష్మి ఆకాంక్ష (పెద్దాపురం), సింగం శ్యామల భాను (కాకినాడ), ఐ సాయి వెంకట్ (పెద్దాపురం), డి నవీన్ (పెద్దాపురం) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పి.మాధురి నవ్య, ఐ.నైనిక, జె.వీరవెంకట సాయి, సిహెచ్ హర్షిత, వి.శశిశ్రీనేత్ర, జి.సుజాత, ఎన్.సతీష్, పి.ప్రేమ్ చంద్, కె.మార్తమ్మ (నంద్యాల)ఉన్నారు. -
మీ ఆనందమే నాకు సంతృప్తి - విజయ్ దేవరకొండ
‘‘నేను చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా విహార యాత్రకు వెళ్తే నేను ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక అలాగే ఉండిపొయేవాడిని. ఆ విహార యాత్రలో నా స్నేహితులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. తమ్ముడి (ఆనంద్ దేవరకొండ) ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కొంత సహాయం చేస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. ఇవాళ మీకు (అభిమానులు) హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా వ్యక్తిగత ఆకాంక్ష. నేను అందించే ఈ లక్ష రూపాయలతో మీకు ఒత్తిడి తగ్గి ఆనందం కలిగితే అది నాకు సంతృప్తిగా ఉంటుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 1న విడుదలైంది. ‘ఖుషి’ సినిమా హ్యాపీనెస్‌ను షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష చొప్పున చెక్స్ అందించారు విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మాకు ఇప్పటివరకూ 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ఏడాది వంద మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఏడాది కొంతమందికి సహాయం చేస్తూనే ఉంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నంతవరకూ, సినిమాలు చేస్తున్నంతవరకూ నేను సహాయం చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. సౌత్‌లో అన్ని ప్లేసెస్ నుంచి మా సినిమాకు మంచి స్పందన లభించింది’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘వంద మందికి సహాయం చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు నవీన్, రవిశంకర్. -
అటవీ అమరవీరుల కుటుంబాలకు అండ
బహదూర్‌ఫురా: విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ హామీనిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కు స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ హీరమత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శ్రద్ధాంజలి ఘటించారు. -
వరద బాధితులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
-
వరద మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.లక్ష అదనంగా ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని వెల్లడించింది. రాష్ట్రంలో సంభవించిన వరద నష్టాలపై శాసనసభలో గురువారం జరిగిన లఘు చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బదులిచ్చారు. మృతుల్లో రైతులు ఉంటే రూ.4 లక్షల పరిహారంతో పాటు, తక్షణమే రూ.5 లక్షల రైతు బీమా అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో 139 గ్రామాల్లో వర్షాల వల్ల నష్టం జరిగిందని మంత్రి వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 7,870 ఇళ్లకు చెందిన 27 వేల మందిని 157 పునరావాస కేంద్రాలకు తరలించిన ట్టు తెలిపారు. 419 ఇళ్లు కూలిపోయాయని, 7,505 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. పూర్తిగా కూలిన ఇళ్లను గృహలక్ష్మి పథకంలో చేర్చి కట్టించాలని సీఎం కేసీ ఆర్ ఆదేశించినట్టు చెప్పారు. పంటల నష్టాలపై అంచనాలు వేస్తున్నామని, వివరాలు వచ్చాక ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వేముల హామీనిచ్చారు. వరద సాయం చేయమని కోరితే కేంద్రం ప్రతిసారీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల వాకౌట్ వరదల నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో అలక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చర్చలో పాల్గొన్న ఆ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తాము లేవనెత్తిన సందేహాలకు, ప్రజలను ఆదుకోమని చేసిన విజ్ఞప్తికి మంత్రి సరైన సమాధానం చెప్పలేదని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. -
నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య
నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం.ఈ సందర్భంగా ఎన్నో జంటలను వేధించే వంధ్యత్వ సమస్య గురించి తెలుసుకుందాం. వంధ్యత్వం అనేది పిల్లలు కనలేని స్థితి. కొన్ని జంటలు ఈ సమస్య కారణంగా శారీరకంగా మానసికంగా చాలా క్షోభని అనుభవిస్తారు. ఈ సమస్య ఎందువల్ల వస్తుంది. దీని నుంచి ఎలా బయపడొచ్చో చూద్దాం. నిజానికి నూటికి 50 శాతం జంటలు ఈ సమస్యను అనుభవిస్తున్నావారే. దీనికి ఇద్దరిలో ఒకరి వల్ల కావచ్చు లేదా ఇద్దరిలోనూ సమస్య ఉండవచ్చు. ముందుగా మగవారిలో ఎందుకు ఈ సమస్య వస్తుందో చూద్దాం. మగవారిలో ఈ సమస్య ఎలా తలెత్తుతుందంటే.. వారిలో స్పెర్మ కౌంట్ సరిగా లేకపోవడం. వృషణాలలో సమస్య గవదబిళ్లలు వంటి ఇన్ఫెక్షన్లు అకాల స్ఖలనం సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యుపరమైన రుగ్మత పునరుత్పత్త అవయవాలకుగాయలు ఎక్కువగా ఆవిరి పట్టడం, వేడి నీటి స్నానాలు కారణంగా స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం ఏర్పడుతుంది స్మోకింగ్, మద్యపానం, డ్రగ్స్ వంటివి వాడినా క్యాన్సర్‌కి సంబంధించిన చికిత్స రేడియోషన్ లేదా కీమోథెరఫీ వంటి వాటివల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇక స్త్రీలలో ఎలా ఎదురవుతందంటే.. పీసీఓఎస్, హైపర్ప్రోలాక్టినిమియా లేదా హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల అసమతుల్యత గర్భాశయ అసాధారణతలు, గర్భాశయ పాలిప్స్, ఫైబ్రాయిడ్లు తదితర కారణాలు ఫెలోపియన్ ట్యూబ్ దెబ్బతినడం, అండాలు ప్రయాణానికి ఆటంకం కలిగంచే సంశ్లేషణలు ఎండోమెట్రియోసిస్, టర్నర్ సిండ్రోమ్, పెల్విక్ సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు సంతానోత్సత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇగ మగవారిలోనూ, స్త్రీలలోనూ కామన్‌గా ఎదురయ్యే సమస్యలు ⇒30వ దశకం దాటిని స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది ⇒అలాగే పురుషులలో 40 ఏళ్లు పైబడిన వారికి సంతాన సామర్థ్యం తగ్గుతుంది ⇒పురుషులకు మద్యం, సిగరెట్ తాగే అలవాటు ఉంటే గర్భస్రావం అయ్యే సమస్య ఎక్కువగా ఉంటుంది. ⇒ఇద్దరిలో ఎవరు అధిక బరువు ఉన్నా ఈ సమస్య ఎదురవుతుంది. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం స్త్రీ, పురుషులకు దీనిపై అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే దీన్ని జరుపుకుంటున్నాం. ఒకవేళ్ల ఇరువురికి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగి ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఒక చక్కని మార్గంలా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా జంటలు ఒకరినొకరు నిందించుకోకుండా సమస్యను సానుకూల దృష్టితో చూసే అవకాశం, అవగాహన ఏర్పడుతుంది. ఇక చక్కటి కుటుంబం కోసం ఆరాటపడే జంటలు పైన చెప్పిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టడమేగాక ఆనందమయ జీవితాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. (చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగాలరా?.. ఇది సాధ్యమేనా!) -
కుటుంబాలు కూలిపోయి.. బంధాలు కాలిపోయి! అమ్మా నాన్న మీకోసం.......
నేను బాగుంటే చాలు అనుకోవడంతోనే రోజు మొదలవుతోంది. తోడబుట్టిన వాళ్లు.. బంధువులు కూడా డబ్బు ముందు కానివారవుతున్నారు. ఆస్తులు అంతస్తులు.. పిల్లలు సాధించిన విజయాలు.. గడుపుతున్న విలాసవంతమైన జీవితం.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. వ్యక్తిత్వం ఎక్కడో ఒక మూలన మాత్రమే కనిపిస్తుంది. ఆప్యాయత కరువవుతోంది. బంధాలు పలుచన కాగా.. అసూయ పెరిగిపోతుంది. తనకు కష్టం వచ్చినా, ఇతరులు బాధపడినా కన్నీళ్లే వస్తాయనే విషయం బోధపడితే కానీ తెలియని పరిస్థితి. పెద్దగా ఆస్తులు లేకపోయినా.. ఆదాయ వనరులు అంతంత మాత్రమే ఉన్నా.. అప్పట్లో ఉమ్మడి కుటుంబం కష్టసుఖాల్లో తోడు నిలిచింది. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండటం.. అరమరికలు లేని జీవనం ఉన్నంతలో సంతృప్తి నిచ్చింది. కానీ ఆధునిక ప్రపంచం గుండెలో గోడలు కట్టుకోవడం బంధాలను పలుచన చేస్తోంది. – సాక్షి, కర్నూలు డెస్క్ 29.05.2023 మెడికల్ షాపు నిర్వహణతో భార్యాభర్తలు ఏ లోటు లేకుండా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాగా చదివించారు.. ఉద్యోగం రావడం.. పెళ్లి చేయడంతో రెక్కలొచ్చి ఎవరి దారిని వాళ్లు ఎగిరిపోయారు. కుటుంబ యజమాని మంచం పట్టడంతో ఆయన బాగోగులు చూసుకోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. చివరకు భర్త మరణం ఆమెను కలచివేసింది. ఇంట్లో ఓదార్చే దిక్కులోదు.. ధైర్యం చెప్పే మనుషుల్లేరు. కొడుకులు వస్తారంటే ఒకరు సప్త సముద్రాల ఆవల.. మరొకరు వందల కిలోమీటర్ల దూరం.. ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లోనే దహన సంస్కారాలు పూర్తి చేసింది. .. పత్తికొండలో చోటు చేసుకున్న ఈ ఘటన మాయమవుతున్న బంధాలకు అద్దం పట్టింది. చిన్నటేకూరుకు చెందిన రంగయ్య విశ్రాంత ఆర్టీసీ మెకానిక్. భార్య, కుమార్తెలు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా అనాథాశ్రమంలో కడుపు నింపుకుంటున్నాడు. చివరకు తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కేందుకు ఆరోగ్యం కూడా సహకరించక నీరసించాడు. కర్నూలులోని అశోక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి ఆస్తిని దాన విక్రయంగా పొంది తల్లి, సోదరిని ఇంటి నుంచి గెంటేశాడు. కనీసం చట్ట ప్రకారం ఆస్తి ఇవ్వాలని కోరినా దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు. కోర్టును ఆశ్రయించినా న్యాయం జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో బతికేందుకు ఆర్థిక వనరులు లేక దిక్కులు చూస్తున్నారు. ప్రపంచం వేగంగా అడుగులు వేస్తుండటంతో ఎవరికి వారు జీవితంలో స్థిరపడాలనే ఉరుకులు పరుగుల జీవనానికి అలవాటుపడ్డారు. చదువు.. ఉద్యోగం.. ఈ రెండింటికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఆ తర్వాత ఇల్లు, పిల్లలు వీటితోనే జీవితం గడిచిపోతుంది. డబ్బు.. డబ్బు.. ఈ కరెన్సీ నోట్ల మధ్య సమయం నలిగిపోతుంది. మానవత్వం ఎప్పుడో కానీ ఉనికి చాటుకోలేకపోతుంది. సౌకర్యాలు.. విలాసాలు పెరిగిపోవడంతో వీటి ముందు వ్యక్తిత్వం చిన్నబోతుంది. కుటుంబం అన్న మాటే కానీ.. ఎవరికి వారుగా జీవిస్తున్నారు. చాలా కుటుంబాలు ఇప్పటికే బాగా పలుచబడ్డాయి. విద్య.. ఉద్యోగం.. ఉపాధి.. కారణం ఏదైనా ఇంటికి దూరంగా బతకడం అలవాటైపోయింది. ఇక అక్కడో ఇక్కడో కొంతమంది కలసిమెలసి ఉంటున్నా.. అరమరికలతో తుమ్మితే ఊడిపోయే బంధంగా మారుతోంది. పెద్దల పట్ల గౌరవం తగ్గిపోతుండటంతో ఒకే ఇంట్లో జీవిస్తున్నా ఆత్మీయతలు కనుమరుగవుతున్నాయి. రాక, పోక ఇష్టానుసారం కాగా.. విలువలు గాలికి కొట్టుకుపోయి బంధాలు ఒంటరిగా మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎవరికి వారే భోజనం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో అందరూ కలసి భోజనం చేయడం పరిపాటి. ఆ తర్వాత సంఖ్య కాస్త పలుచబడినా రోజులో ఏదో ఒక పూట భోజనం చేయనిదే తృప్తి కలగని పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఏ సమయంలో తింటారో తెలియదు, ఏం తింటున్నారో కూడా అడిగేందుకు సమయం ఉండకపోవడం కుటుంబంలో అనారోగ్య వాతావరణానికి కారణమవుతోంది. అందరూ కలసి కూర్చొని భోజనం చేయడం ద్వారా కష్టసుఖాలు పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఉద్దేశం మారిపోయి.. ఆకలి అయినప్పుడు తింటామనో, బయట తిని వచ్చామనే మాటలు వినిపించడం సర్వసాధారణమైంది. హాస్టళ్లలో చదువు ఇది పోటీ ప్రపంచం. మా పిల్లాడు అందరికంటే ముందుండాలనే భావన ప్రతి ఒక్క తల్లిదండ్రిలో కనిపిస్తుంది. ఈ కారణంగా పిల్లలను ఇంట్లో ఉంచుకోకుండా కార్పొరేట్ హాస్టళ్లలో ఉంచి చదివించడం ఫ్యాషన్ అయిపోయింది. అగ్గి పెట్టెల్లాంటి రూముల్లో.. మంచీచెడు తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయి. అమ్మానాన్నల ఆప్యాయతకు దూరమవుతూ.. బంధాల విలువ తెలియకుండా ర్యాంకుల వెంట పరుగులు తీయడంతోనే బాల్యం దాటిపోతుంది, యవ్వనం చేజారిపోతుంది. ఆ తర్వాత కూడా ఇంటికి చుట్టపుచూపుగానే వస్తుండటంతో విలువలు వీధిపాలవుతున్నాయి. పండగలూ పబ్బాలకే.. గతంలో శుభకార్యమైనా, చావుకైనా పది మంది కలిసేవాళ్లు. మంచీచెడు చెప్పి వెళ్లేవాళ్లు. రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకొని పొద్దుపోయే దాకా కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకునేవాళ్లు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే కనీసం ఖర్మకాండలు ఎలా చేయాలనే విషయం కూడా తెలియక తికమకపడుతున్నారు. పెళ్లిళ్లు.. శుభకార్యాలంటే ప్రతి ఒక్కరి అడుగు ‘బ్రాహ్మణుల’ ఇంటి వైపునకే పడుతోంది తప్పితే ఒక్కటంటే ఒక్కటీ సొంతంగా చేసుకోలేకపోవడం ఆధునికత ఏ పరిస్థితికి దారితీస్తుందో అర్థమవుతోంది. ఆహా్వనాలు, హాజరు కూడా మొక్కుబడిగానే ఉండటం చూస్తే మనిషికి, బంధాలకు మధ్య దూరం ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుస్తోంది. సెల్ఫోన్లతో సరి.. సర్దుబాటు ధోరణి మచ్చుకైనా కనిపించడం లేదు. పక్కోడి నీడను కూడా సహించలేని పరిస్థితి. వయస్సు పెరిగే కొద్దీ సహనం, ఓర్పు కనిపించాల్సి ఉండగా.. అసూయ ద్వేషాలకు పెద్దపీట వేస్తున్నారు. చిన్న చిన్న మాటలకు పట్టింపులకు పోయి బంధాలనే వదులుకోవడం, అసలు వాళ్లతో ఏమి అవసరం ఉందనే భావన అధికమైంది. ఇందుకు సెల్ఫోన్లతో కాలం గడపటం, గంటల కొద్దీ వాటితోనే సావాసం చేయడం ప్రధాన కారణం. ఇంట్లోనే ఉంటున్నా ఎవరూ మాట్లాడుకోకుండా సెల్‌ఫోన్‌పై చేతులు కదుపుతున్నారు. ఫ్రెండ్స్ కలిశామన్న మాటే కానీ చూపంతా సెల్‌ఫోన్ పైనే ఉంటోంది. ఒక్కరు మరణించినా.. పిల్లలు మంచి హోదాలో ఉండాలని తల్లిదండ్రులు ఎంతగానో తపిస్తున్నారు. ఇందుకోసం తమ జీవితాలను ఫణంగా పెడుతున్నారు. పైసాపైసా కూడబెట్టి మరీ భవితకు బాటలు వేస్తున్నారు. తీరా లక్ష్యం చేరుకోగానే.. పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు. పిల్లోడు బాగుపడితే చాలనుకొని కొంత కాలం దంపతులు ఇద్దరూ నెట్టుకొస్తున్నా.. వృద్ధాప్యంలో మనోవేదనతో మంచం పడుతున్నారు. ఈ సమయంలో ఇద్దరిలో ఒకరు మరణించిన మరొకరి జీవనం దుర్భరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా భార్య మరణిస్తే.. ఆ వెంటనే భర్త కన్నుమూయడం చూస్తే.. పిల్లలు దూరమైతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థమవుతుంది. పిల్లలకు సమయం కేటాయించాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలి. మరీ ముఖ్యంగా వారితో గడిపేందుకు సమయం కేటాయించాలి. ప్రతి ఒక్కరూ ఐదు టీలు(టైం, టాక్, ట్రీట్, టచ్, ట్రస్ట్) పాటించాలి. అప్పుడే పిల్లలతో బంధం బలపడుతుంది. తల్లిదండ్రుల స్పర్శ పిల్లలకు సరికొత్త అనుభూతితో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. నమ్మకం పెంపొందింనప్పుడే కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. – సి.జ్యోతిర్మయి, ఫ్యామిలీ కౌన్సిలర్, బిహేవియర్ థెరపిస్ట్, కర్నూలు