టీ.నగర్: పిల్లల కిడ్నాపర్ అని వృద్ధురాలి హత్య కేసుకు భయపడి పోలూరు, పరిసర ప్రాంతాల్లో మూడు వేల కుటుంబాలు ఇళ్లను విడిచి పరారయ్యాయి. వీరంతా చెన్నై బెంగళూరు ప్రాంతాల్లో బసచేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయంటూ వాట్సాప్‌లో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. ఉత్తర జిల్లాల నుంచి వచ్చిన ఈ సమాచారం ప్రజల్లో భీతి పుట్టించింది. ఈ క్రమంలో తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపం కిడ్నాప్ ముఠా భీతి కారణంగా రుక్మిణి అమ్మాళ్ అనే 65 ఏళ్ల వృద్ధురాలి హత్యా సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ విషయం తెలియగానే తిరువణ్ణామలై ఎస్పీ సంఘటన స్థలానికి నేరుగా వచ్చి విచారణ జరిపారు. రుక్ష్మిణి అమ్మాళ్‌పై దాడి దృశ్యాలు సామాజిక మా«ధ్యమాల్లో ప్రసారం కావడంతో సంచలనం ఏర్పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి 42 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.
పిల్లల కిడ్నాప్ భీతి కారణంగా కలియం, ఆత్తిమూరు గ్రామాల్లో ఉదయాన్నే కనిపించే కొబ్బరిబొండాల వ్యాపారులు కనిపించడం లేదు. ఈ ప్రాంతాల్లో పోలీసులు రహస్య పర్యవేక్షణ జరుపుతున్నారు.
మానసిక రోగి హత్య కేసులో 15 మంది అరెస్టు: కిడ్నాపర్‌గా భావించి మానసిక రోగిని హత్య చేసిన కేసులో పోలీసులు 15 మందిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పళవేర్కాడు ప్రాంతంలో పిల్లల కిడ్నాప్ ముఠాకు చెందిన వ్యక్తిగా భావించి ఒక మానసిక రోగిని ప్రజలు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment