బ్రోకరు రూ. 4 లక్షల వసూలు
నెలలోపే వధువు జంప్
బనశంకరి: వివాహం చేసుకోవడానికి అమ్మాయిల కొరత ఉందనే సాకుతో కొందరు మోసగాళ్లు పురుషులను నిండా ముంచుతున్నారు. ఓ వ్యక్తికి ఉత్తుత్తి పెళ్లి చేసి లక్షలాది రూపాయలను తీసుకుని బ్రోకర్, వధువు ఉడాయించారు. బాగల్‌కోటె జిల్లా ముధోళ్‌వాసి సోమశేఖర్ బాధితుడు. శివమొగ్గ మంజుళ అనే యువతిని పెళ్లి చేసి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఆమెకు 3వ పెళ్లి
ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకున్న శివమొగ్గవాసి మంజుళతో బ్రోకర్ సత్యప్ప మాట్లాడాడు. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి వేటలో ఉన్న సోమశేఖర్‌ను టార్గెట్ చేసుకున్నారు. అమ్మాయిని చూపించి పెళ్లి చేస్తామని రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. ఆడపిల్ల దొరకలేదని బాధలో ఉన్న సోమశేఖర్ ఎగిరి గంతేశాడు. ముధోళ్‌లోని కాళికా దేవి దేవస్థానంలో ఏడాది క్రితం పెళ్లి జరిపించారు. ఆ రోజునే బ్రోకర్ రూ.4 లక్షలు వసూలు చేశాడు.
నెలరోజులు కాపురం సాగిందో లేదో ఓ రోజు మంజుళ ఉడాయించింది. సోమశేఖర్ ఆమె గురించి విచారించగా ఇప్పటికే రెండు పెళ్లిళ్లయినట్లు తెలిసింది. బ్రోకర్ ఇలాంటివారితో కలిసి మోసాలకు పాల్పడుతుంటాడని గుర్తించాడు. దీంతో డబ్బు తిరిగి ఇవ్వాలని బ్రోకర్‌ను కోరాడు. అతడు పట్టించుకోకపోవడంతో 7 మందిపై కేసు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment