Broker
-
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడి.. ఈటల స్ట్రాంగ్ రియాక్షన్
-
రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై చేయి చేసుకున్న ఈటల రాజేందర్
-
నా భార్యకు నేను మూడో భర్తను!
బనశంకరి: వివాహం చేసుకోవడానికి అమ్మాయిల కొరత ఉందనే సాకుతో కొందరు మోసగాళ్లు పురుషులను నిండా ముంచుతున్నారు. ఓ వ్యక్తికి ఉత్తుత్తి పెళ్లి చేసి లక్షలాది రూపాయలను తీసుకుని బ్రోకర్, వధువు ఉడాయించారు. బాగల్కోటె జిల్లా ముధోళ్వాసి సోమశేఖర్ బాధితుడు. శివమొగ్గ మంజుళ అనే యువతిని పెళ్లి చేసి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమెకు 3వ పెళ్లి ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకున్న శివమొగ్గవాసి మంజుళతో బ్రోకర్ సత్యప్ప మాట్లాడాడు. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి వేటలో ఉన్న సోమశేఖర్‌ను టార్గెట్ చేసుకున్నారు. అమ్మాయిని చూపించి పెళ్లి చేస్తామని రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. ఆడపిల్ల దొరకలేదని బాధలో ఉన్న సోమశేఖర్ ఎగిరి గంతేశాడు. ముధోళ్లోని కాళికా దేవి దేవస్థానంలో ఏడాది క్రితం పెళ్లి జరిపించారు. ఆ రోజునే బ్రోకర్ రూ.4 లక్షలు వసూలు చేశాడు. నెలరోజులు కాపురం సాగిందో లేదో ఓ రోజు మంజుళ ఉడాయించింది. సోమశేఖర్ ఆమె గురించి విచారించగా ఇప్పటికే రెండు పెళ్లిళ్లయినట్లు తెలిసింది. బ్రోకర్ ఇలాంటివారితో కలిసి మోసాలకు పాల్పడుతుంటాడని గుర్తించాడు. దీంతో డబ్బు తిరిగి ఇవ్వాలని బ్రోకర్‌ను కోరాడు. అతడు పట్టించుకోకపోవడంతో 7 మందిపై కేసు పెట్టాడు. -
రియల్ ఏస్టేట్ బ్రోకర్ చంద్రబాబుతో పోరాటం.. పేదలదే విజయం
-
విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో సీసీఎస్ పోలీసులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్
-
వధువు కావాలా.. నాయనా?
హిందూ వివాహాల్లో పెళ్లి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు, వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది. ఇదివరకు బంధువులు, పరిచయస్తులు మధ్యవర్తిగా ఉండి ఇరు కుటుంబాల వారికీ అమ్మాయి, అబ్బాయిని చూపించి.. పెళ్లి సంబంధాలు కుదుర్చేవారు. అయితే చదువు పూర్తిచేసి.. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో వయసు దాటిన తర్వాత పెళ్లికి సిద్ధమైతే వధువు దొరకడం లేదు. ఇటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని రాజమండ్రికి చెందిన కొంతమంది మ్యారేజ్ బ్యూరో పేరుతో రంగంలోకి దిగుతున్నారు. ఫొటో ఒకరిది చూపి.. డబ్బు రాబట్టుకుని.. పెళ్లి మరొకరితో చేయడానికి ప్రయత్నిస్తూ.. వరుడి తరఫు కుటుంబాలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సాక్షి, అనంతపురం: జిల్లాలో ఎంతోమంది యవకులు వయసు మీదపడుతున్నా కల్యాణ గడియలు కలసిరావడం లేదు. అమ్మాయిలు తమకు కాబోయే జీవిత భాగస్వామి ఎంపికలోనూ మార్పు వచ్చింది. ఉన్నత చదువు.. మంచి ఉద్యోగం.. మెరుగైన వేతనం.. ఆస్తిపాస్తులు.. కుటుంబ నేపథ్యం బాగుండాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కుమార్తెల అభిప్రాయానికి విలువనిచ్చి.. అలాంటి వారిని ఎంపిక చేసుకోవడంపై దృష్టిసారిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పలు వ్యాపారాలు, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, వ్యవసాయ రంగాల యువకులకు అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. ఎంతలా అంటే కన్యాశుల్కం అంటే.. అమ్మాయికే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఇలాంటివి జిల్లాలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అమ్మాయిలు దొరక్క విసిగివేసారిపోయిన యువకులు, వారి తల్లిదండ్రులు మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నారు. కొందరు బ్యూరో నిర్వాహకులు డబ్బు కోసం మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిలువునా మోసపోక తప్పదని పలు ఘటనలు హెచ్చరిస్తున్నాయి. మ్యారేజ్ బ్యూరో మోసాల్లో మచ్చుకు... అనంతపురంలో నివాసం ఉంటున్న రాముడు (పేరుమార్చాం) సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. రాముడు తన సోదరుడికి పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి రాజమండ్రికి చెందిన మహిళా పెళ్లిళ్ల పేరయ్య (బ్రోకర్)ను సంప్రదించారు. మొదట ఒక అమ్మాయి ఫొటో చూపించారు. పెళ్లికొడుకు సమ్మతి తెలపడంతో.. రూ.5 లక్షల నగదును పెళ్లికూతురు తండ్రికి ఇవ్వాలని.. పెళ్లి నిర్వహణ పెళ్లికొడుకు వారే బాధ్యత తీసుకోవాలని బ్రోకర్ చెప్పారు. వారు ఒప్పుకుని నగదు చెల్లించారు. తర్వాత 15 రోజులకు పెళ్లికొడుకు కుటుంబ సభ్యులతో కలిసి 20 మంది దాకా పెళ్లి అనుకున్న సమయానికి రెండు రోజుల ముందే రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడ పెళ్లి కూతురు మారిపోయింది. తొలుత తమకు ఫొటోలో చూపించిన అమ్మాయి కాదు కదా అని పెళ్లి కుమారుడి వారు ప్రశి్నస్తే.. ‘ఆ అమ్మాయి తండ్రికి ఆరోగ్యం బాగోలేదు. పెళ్లి చేయడం ఇప్పుడు కుదరదు. కావున ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి’ అని మహిళా బ్రోకర్ తాపీగా సమాధానమిచ్చారు. చేసేది లేక పెళ్లి కొడుకు కుటుంబం వెనక్కు వచ్చేసింది. ఇలా పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకుని మోసగించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పెళ్లి సంబంధాలు కుదుర్చుతామంటూ వల వేసి భారీగా నగదు, బంగారు నగలు గుంజుతున్నారు. చివర్లో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. జిల్లాలో యువకుల గణాంకాలు 20 నుంచి 29 సంవత్సరాల్లోపు వారి సంఖ్య 3,25,218 30 నుంచి 39 సంవత్సరాల్లోపు వారి సంఖ్య 5,86,395 బ్రోకర్ల మాట నమ్మొద్దు అమ్మాయిల కొరతను ఆసరాగా చేసుకుని పెళ్లిళ్ల పేరుతో కొందరు బ్రోకర్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. బ్రోకర్ల వలకు చిక్కకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి. రెండు కుటుంబాలు ఒక అభిప్రాయానికి వచ్చాక మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మాట్లాడుకోవాలి. బ్రోకర్లను ఒక పరిధి వరకే పరిమితం చేయాలి. –మేడా రామలక్ష్మీ, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్, అనంతపురం (చదవండి: విధివంచితులు) -
Etela Rajender: రియల్ ఎస్టేట్ బ్రోకర్ కేసీఆర్.. ఈటల ఫైర్..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘నాటి ప్రభుత్వాలు పేదల కు ఉచితంగా భూములను పంచితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన పేరుతో ఆయా రైతుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకుంటోంది. ప్రభుత్వ అధినేత సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారారు. బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.ఐదు కోట్లకు పైగా పలుకుతుంటే..ప్రభుత్వం మాత్రం రైతుల సమ్మతి, సంబంధం లేకుండా రూ.10 లక్షలు చెల్లించి, బలవంతంగా భూములను స్వాధీనం చేసుకుంటోంది. ఆయా భూములను ఐటీ సంస్థలకు, బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టి బ్యాక్‌డోర్ నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇలా వచ్చిన డబ్బులనే ఎన్నికల్లో వెదజల్లుతున్నారు’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. శుక్రవారం మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌లో నిర్వహించిన ‘భారతీయ జనతా యువమోర్చా– రంగారెడ్డి జిల్లా’ శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. కంపెనీలకు, ప్రభుత్వానికి, ఫాంహౌస్‌లకు భూములు ఇచ్చిన రైతులు నేడు అదే కంపెనీలు, ఫౌంహౌస్‌ల్లో వాచ్మన్లుగా పని చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ అంశాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుని పని చేయడం ద్వారా ప్రజల మద్దతు పొందొచ్చని సూచించారు. ఇందుకు ప్రతి ఒక్క బీజేవైఎం కార్యకర్త సిద్ధంంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఫార్మాసిటీ పేరుతో అమాయక రైతుల నుంచి 19వేలకుపైగా ఎకరాల భూమి సేకరిస్తోందని, ఈ ఫార్మాకంపెనీల వల్ల ఆయా గ్రామాల రైతులంతా తమ భూమిని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో తీవ్రమైన కాలుష్యం బారి నపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవడబ్బ సొమ్మని పంచుతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలకు, పేదల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ డబ్బును వేల కోట్లున్న రియల్టర్లకు, ఫౌంహౌస్ యజమానులకు, వ్యవసాయేతర భూములకు రైతుబంధు పేరుతో పంచిపెడుతుండటాన్ని ఎలా సమర్థిస్తామని, నెలకు రూ.1.40 లక్షల జీతం పొందే ఉద్యోగులకు దళిత బంధు పేరుతో కార్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. చదవండి: తెలంగాణ ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారు: తరుణ్ చుగ్ -
తిరుమలలో దళారీల దండయాత్ర
సాక్షి, తిరుమల: తిరుమలలో దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి టీటీడీ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విజిలెన్స్ అధికారులకు మరో బడా దళారీ చిక్కారు. తిరుమలలో మూడు సిఫార్సు లేఖలపై 18 మంది భక్తులను దర్శనానికి పంపించిన దళారీ.. ఒక్కో వ్యక్తి నుంచి రూ.5,500 వసూళ్లు చేశారు. ఇతడు బెంగుళూరు,చెన్నైకు చెందిన భక్తులకు దర్శనం చేయించినట్లు తెలుస్తోంది. దళారీపై భక్తులే ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ సంఘటనపై విజిలెన్స్ అధికారులు గోప్యంగా విచారిస్తున్నారు. గత వారం భక్తుల నుంచి నగదు వసూలు చేసి కల్యాణోత్సవ టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నించిన దళారీని తిరుమల టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమలలో దళారుల అరెస్ట్ తిరుమల : శ్రీవారి దర్శనం కలి్పంచేందుకు భక్తుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న దళారులను తిరుమల వన్‌టౌన్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. నగరంలో నివాసముంటున్న వెంకటరమణ, శ్రీనివాసులు, శశికుమార్, ప్రేమ్కుమార్లు కొంతకాలంగా దళారుల అవతారమెత్తి భక్తుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. శనివారం రాత్రి రాంబగీచా సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అందని సాయం..మానని గాయం
దాదాపు వంద రోజుల విచారణ, వందలాది మంది పెట్టుబడిదారుల ఆందోళన, ఇద్దరి ప్రాణార్పణ, రూ.187 కోట్ల స్వాహాపై ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇదీ క్లుప్తంగా ట్రేడ్ బ్రోకర్ కేసు స్వరూపం. మూడు నెలల కిందట జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై పెట్టుబడిదారులు అసంతృప్తిలో ఉన్నారు. సీఐడీ చేతికి కేసు వెళ్లినా విచారణలో పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడికి బెయిల్ రావడాన్ని కూడా వారు స్వాగతించలేకపోతున్నారు. ఏ వైపు నుంచీ సాయం అందక, గుండెకు తగిలిన గాయం మానక బాధితులు నరకం చూస్తున్నారు. రాజాం: ట్రేడ్ బ్రోకర్ ఆన్లైన్ మోసం కేసు నీరుగారుతుందా..? బాధితులతో పాటు ఈ కే సును ఫాలో అవుతున్న వారి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. సం తకవిటి మండలం మందరాడలో షేర్ మార్కెట్ పేరిట రూ.187 కోట్లకు ప్రజలను ముంచి వం ద రోజులు గడిచిపోయా యి. ఈ కేసు విచారణను మొదటి నుంచీ గమనిస్తు న్న వారిలో ఇప్పు డు జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మూడు నెలల కిందట ఈ ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. అంత పెద్ద మొత్తంలో మోసం జరిగిందా అంటూ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు విచారణ చూసినా అదే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రధా న నిందితునికి బెయిల్ రావడం, బాధితులు ఎంత మోసపోయారో ఇంకా గుర్తించకపోవడం, ఎంత రికవరీ చేశారో చెప్పకపోవడం వంటి అంశాలు అనుమానాలకు ఊతమిస్తున్నాయి. 900 మందికి పైగా బాధితులను, పెట్టుబడిదారులను నిలువునా ముంచినా కేసు విచారణ ఇంత నెమ్మదిగా సాగడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నవంబర్ 10న.. 2017, నవంబర్ 10వ తేదీన తాలాడ గ్రామంలో ట్రేడ్ బ్రోకర్ సిబ్బంది కార్యాలయానికి తాళా లు వేయడంతో సంచలనం ఏర్పడింది. టం కాల శ్రీరామ్ అనే పేరు ఓవర్ నైట్‌లో జిల్లా మొత్తం తెలిసిపోయింది. అప్పటి వరకు పెట్టుబడిదారులు అతని వద్ద రెండు మూడు కోట్లు ఉంటాయని మాత్రమే అనుకునేవారు. కానీ మోసం విలువ రూ.187 కోట్లని తెలిసి వారంతా ఆశ్చర్యపోయారు. శ్రీరామ్ కార్యాలయానికి తాళం పడడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మొదట సంతకవిటి పోలీ స్ స్టేషన్లో బ్రోకర్ హామీల రూపంలో ఇచ్చిన చెక్‌లతో కేసులు పెట్టగా మొత్తం రూ.36 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. అయితే అక్కడితో కథ ముగియలేదు. కొంతమంది కో ర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఆధారాలతో నష్టపోయినవారి నగదు రూ. 50 కోట్లు వరకూ ఉంటుందనేది అంచనా. ఇవి కాకుండా కొంతమంది ఉద్యోగులు భయపడి కేసులు పెట్టలేదు. నవంబర్ 10న ట్రేడ్ బ్రోకర్ కార్యాలయానికి తాళాలు వేసిన అనంతరం చాలా మంది నిరుపేదలు మంచంపట్టారు. రూ. 25 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టిన ఇద్దరు బాధితులు ఈ మోసాన్ని జీర్ణించుకోలేక మృతి చెందారు. ఏదీ పురోగతి? కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు పాలకొండ డీఎస్సీ జి. స్వరూప శరవేగంగా కేసును ముందుకు నడిపా రు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నా రు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులు మేరకు బ్రోకర్ శ్రీరామ్‌తో పాటు మరో ఐదుగురిని అ రెస్టు చేశారు. దీనిపై కొందరు ఎస్పీ కార్యాల యం ఎదుట గగ్గోలు పెట్టినా పోలీసు అధికారులు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో విచారణలో స్పీడు తగ్గింది. మూడు నెలలుగా కేసులో పురోగతి ఏమీ కనిపించడం లేదు. ఇదంతా ఎవరి సొత్తు.. తాలాడ వద్ద హంగులతో నిర్మించిన ట్రేడ్ బ్రోకర్ కార్యాలయం, పక్కనే 25 ఎకరాల తోట సీఐడీ ఏం చేస్తోంది? నెలరోజుల కిందట విశాఖపట్నంకు చెందిన సీఐడీ అధికారులు కేసును తమ పరిధిలోకి తీసుకున్నారు. పలువురు ట్రేడ్ బ్రోకర్ ఉద్యోగులపై ఆరా తీశారు. ప్రత్యేక అనుమానితులను పిలు పించుకుని విచారణ చేపట్టారు. ఇదంతా జరిగి నెలరోజులు కావస్తున్నా అసలు విషయం ఇంతవరకూ బయటకు రాలేదు. ఈ మోసానికి ప్రధా న కారకులు ఒక్క శ్రీరామేనా, ఇంకెవరైనా ఉ న్నారా అన్నది ఇంతవరకూ వెల్లడికాలేదు. పె ట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడులకు సంబం ధించి ఎంత రికవరీ అయ్యిందనేది పత్రికా పరంగా కూడా వెల్లడికాలేదు. అసలేం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది తమ పి ల్లలకు వివాహాల కోసం, భవిష్యత్ ఉపయోగా ల కోసమే పెట్టుబడులు పెట్టారు. వీరంతా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. కొంతమంది మంచం పట్టారు. నీరు గారుతోందా? ప్రధాన నిందితునికి బెయిల్ రావడంపై బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులో పు రోగతి ఏమీ లేదని వారంటున్నారు. సీఐడీ కేసును తీసుకోవడంతో పెట్టుబడి వివరాలు తెలిసి, తమకు న్యాయం జరుగుతుందని, ఎం తో కొంత రికవరీ అవుతుందని ఆశ పడిన వా రంతా ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. అధికార పార్టీ నేతల హస్తం ఉందా? ట్రేడ్ బ్రోకర్ శ్రీరామ్ అధికార పార్టీ నేతలను కూడా ముంచినట్లు సమాచారం. పెట్టుబడులు ఎక్కువగా రాబట్టేందుకు అధికార పార్టీకి చెందిన నేతలను వినియోగించుకోవడంతో పాటు పలువురు నాయకుల నుంచి కూడా పెట్టుబడులు తీసుకుని ప్రస్తుతం వారికి కూడా ఎగనామం పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు శ్రీరామ్‌ను బయటకు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసి తాము నష్టపోయిన మొత్తంలో ఎంతో కొంత నగదును రికవరీ చేసుకునేం దుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అంతా గోప్యంగా ఉండి, కేసుపై కదలికలు లేకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ డబ్బు ఏమైనట్టు? బ్రోకర్ శ్రీరామ్ ఎంత డబ్బును పెట్టుబడి రూపంలో తీసుకున్నాడు? ప్రస్తుతం ఎంత ఉందనేది ఇంకా కొలిక్కిరాలేదు. పోలీసులు, సీఐడీ అధికారులు కూడా ఈ విషయాన్ని వెల్లడించడం లేదు. ప్రస్తుతం శ్రీరామ్ కుటుంబ సభ్యులు, బంధువులను, స్నేహితులను విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వివరాలు కూడా గోప్యంగా ఉన్నాయి. ఈ అక్రమ ఆస్తుల వివరాల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు మాత్రం కళ్లు కాయలు కాస్తున్నాయి. ముమ్మర దర్యాప్తు ట్రేడ్ బ్రోకర్ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్లు విశాఖపట్నం సీఐడీ డీఎస్పీ ఎస్.నాగభూషణంనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఏ కోణంలో వి చారిస్తున్నామో, ఎవరెవరిని విచారిస్తున్నామన్నది గోప్యంగా ఉంచాల్సి ఉందని అన్నారు. త్వరలోనే బ్రోకర్ వద్ద పెట్టిన పెట్టుబడులతో పాటు అక్రమ ఆస్తులు వివరాలు వెల్లడించి ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
'చిల్లర బిజినెస్'.. దళారీ అరెస్ట్
హైదరాబాద్: ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దళారీలకు వరంగా మారింది. నోట్ల రద్దుతో చిల్లర దొరక్క తాత్కాలికంగా ఏర్పడిన సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవడానికి దళారీలు రంగ ప్రవేశం చేశారు. బ్యాంకులు కిక్కిరిసి ఉండటం, ఏటీఎంలలో డబ్బులు పెట్టిన వెంటనే ఖాళీ అవుతుండటం, ఒకవేళ కొత్త 2000 నోటు చేతికందినా.. చిల్లర కొరత ఉండటంతో మార్కెట్లో కొనుగోళ్లు, అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే అదునుగా భావించిన దళారీలు 2000 రూపాయలకు చిల్లర కావాలంటే ఇస్తాం అంటూ బయలుదేరారు. రూ. 2000 ఇచ్చిన వారికి 1500 చిల్లర ఇస్తూ 'చిల్లర బిజినెస్' స్టార్ట్ చేశారు. కనీస అవసరాలకు కూడా చేతిలో బొత్తిగా చిల్లరలేని వాళ్లు ఈ దళారీలను ఆశ్రయించక తప్పడం లేదు. ఇలా రూ. 2000 కు 1500 చిల్లర ఇస్తున్న ఓ వ్యాపారిని లంగర్‌హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 2,15,000 స్వాధీనం చేసుకున్నారు. -
రవాణాశాఖలో దళారులదే హవా..!
–ప్రతి పనికి పైసలిచ్చుకోవాల్సిందే.. –అమర్యాదగా ప్రవర్తిస్తున్న మహిళా ఉద్యోగులు – చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు పాత శ్రీకాకుళం: జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో దళారుల రాజ్యం సాగుతోంది. ఇటీవల డీటీసీగా బాధ్యతలు చేపట్టిన అధికారి దళారులను కార్యాలయం దరిదాపులకు రాకుండా చూశారు. ఇది కొద్దిరోజులపాటు అమలైంది. ఇప్పుడు మళ్లీ హవా సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల రణస్థలానికి చెందిన ఓ వ్యక్తి తన వాహనాన్ని అమ్మకానికి పెట్టాడు. వాహనానికి సంబంధించిన అన్ని కాగితాలు ఉన్నప్పటికీ దానిని వేరే వ్యక్తి పేరిట ట్రాన్ఫర్ చేసేందుకు తీసుకోవాల్సిన పర్మిట్ కాగితాల కోసం పైసలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉండే ఓ దళారీని ఆశ్రయించాడు. వెంటనే ఆయన రవాణాశాఖ అధికారిని సంప్రదించడంతో భారీ మోతాదుల్లో పైకం తీసుకుంటూ రెండు రోజుల్లో చేయాల్సిన పనిని గంటలోనే పూర్తిచేసి పంపేసినట్టు సమాచారం. ప్రతి పనికీ పైస లిచ్చుకోవాల్సిందే... జిల్లా ఉప రవాణాశాఖ కార్యాలయంలో ప్రతి పనికి లంచం ఇచ్చుకోవాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వం ద్విచక్ర వాహనాలతో పాటు కార్లుకు ఆయా షోరూంలలో రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ పనులకు తప్ప మిగతా పనులన్నీంటికీ అదనంగా పైకం (లంచం) చెల్లించుకోవాల్సిందే. మర్యాద అనే పదం తెలియని మహిళా ఉద్యోగులు... ఇదిలావుండగా కార్యాలయంలో వివిధ కౌంటర్లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు అమర్యాదగా మాట్లాడుతున్నారని కార్యాలయానికి వివిధ పనులపై వచ్చిన వారు వాపోతున్నారు. రెండు రోజుల కిందట 9,10 కౌంటర్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినికి ఎల్‌ఎల్‌ఆర్‌కు సంబంధించి కౌంటర్ స్లిప్‌లో తప్పు పడడంతో దానిని మార్చాలని ఓ వ్యక్తి కోరాడు. దీంతో ఆయనపై అమర్యాదగా ఎన్నో మాటలు విసిరేసింది. ఆయన ఏమి చేయలేక మిన్నకుండిపోయారు. నాదృష్టికి రాలేదు.. సరిచేస్తాం కార్యాలయంలో దళారులను పూర్తిస్తాయిలో నియంత్రించాం. మళ్లీ ఇలా జరుగుతుందంటే కార్యాలయ సిబ్బందితో మరోసారి సమావేశమవుతాం. మహిళా ఉద్యోగులందరూ కార్యాలయానికి వచ్చేవారితో మర్యాదగా మాట్లాడాలి. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటాం. –శ్రీదేవి, డీటీసీ -
రుణాల కోసం దళారీలను ఆశ్రయించవద్దు
సీతంపేట: ట్రైబుల్ సబ్‌ప్లాన్‌లో రూ.12 కోట్లతో గిరిజనులకు రుణాలు మంజూరు చేయనున్నట్టు ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. బుధవారం సీతంపేటలో ట్రైకార్ ద్వారా మంజూరైన కంప్యూటర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు తిరుగుతున్నారని వారిని ఆశ్రయించవద్దన్నారు. పంచాయతీకి 40 చొప్పున అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయనున్నామన్నారు. గ్రామాల్లో నిరుద్యోగ యువత ఖాళీగా ఉండకుండా వారి కాళ్లపై వారు నిలబడేలా రుణాలు ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇతర కోర్సులు చేసిన వారిని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు చైతన్యం చేయాలన్నారు. మేకలు, గొర్రెలు వంటి యూనిట్లు కూడా పెట్టుకోవడానికి ముందుకు రావాలని సూచించారు. రూ.50 వేల వరకు ఒక్కొక్కరికి రుణాలు ఇప్పిస్తామని, వ్యాపారాలు పెట్టుకోవచ్చని తెలిపారు. తీసుకున్న రుణాలు సైతం తిరిగి సకాలంలో బ్యాంకులకు చెల్లించాలని చెప్పారు. ట్రైకార్, మహిళా సంఘాల పేరుతో కూడా రుణాలు ఇవ్వనున్నామన్నారు. కొంతమంది యువతీ, యువకులకు పోలీస్కానిస్టేబుల్ శిక్షణకు కూడా పంపిస్తామని చెప్పారు. అలాగే, గ్రూప్స్‌కు కూడా కోచింగ్ ఇవ్వనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రాజబాబు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సవరతోట ముఖలింగం, ఎంపీటీసీ బి.దమయంతి, మాజీ ఎంపీపీ ఎస్.మాలయ్య, బి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
మనలో ఒక్కడు ఏం చేస్తాడు?
‘శీను వాసంతి లక్ష్మి’, ‘బ్రోకర్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి, దర్శకత్వం వహించిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. ఆర్పీ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునిక్రాఫ్ట్ మూవీస్ పతాకంపై జీసీ జగన్మోహన్ నిర్మిస్తున్నారు. ఆర్పీ మాట్లాడుతూ- ‘‘సుమారు 50 కథలు విన్నా ఒక్క కథ కూడా జగన్మోహన్గారికి నచ్చలేదు. నేను చెప్పిన కథ నచ్చి వెంటనే, సినిమా మొదలు పెట్టమన్నారు. సిల్లీగా అనిపించే విషయాలే చాలా సీరియస్‌గా మారిపోతుంటాయనే లైన్‌తో తీస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘సమాజానికి ఉపయోగపడే చిత్రం నిర్మించాలనే ఆశయంతో ఈ చిత్రం చేస్తున్నా’’ అని నిర్మాత చెప్పారు. ఆర్పీకి జోడీగా ‘నువ్వు నేను’ ఫేం అనిత నటిస్తున్నారు. సాయికుమార్, నాజర్, తనికెళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల్ నాగ్, కెమేరా: ఎస్‌జె సిద్ధార్థ్, సహ నిర్మాతలు: హెచ్ఏ ఉమేష్ గౌడ, పి. బాల సుబ్రహ్మణ్యం, కథ-స్క్రీన్‌ప్లే-సంగీతం-దర్శకత్వం: ఆర్పీ పట్నాయక్. -
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
యాకుత్‌పురా: విదేశాల్లో అధిక మొత్తంలో సంపాదించే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఓ మధ్యవర్తి (బ్రోకర్)ని రెయిన్‌బజార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ జి.రమేశ్ కథనం ప్రకారం... యాకుత్‌పురా గంగానగర్ నాలా ప్రాంతానికి చెందిన దిల్దార్ ఖాన్, షాహీన్ బేగం (40)లు దంపతులు. షాహీన్ బేగంకు దుబాయ్‌లో ఎక్కువ మొత్తంలో వేతనం చెల్లించే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమన్‌నగర్‌కు చెందిన మధ్యవర్తి ఆబేద్ హుస్సేన్ (45) నమ్మించి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. అనంతరం ముంబాయిలో ఉండే ఓ కన్సల్టెన్సీ సాయంతో గత ఏడాది డిసెంబర్లో షాహీన్ బేగంను దుబాయ్‌కి పంపించాడు. దుబాయ్‌లో పని ఎక్కువ చేయించుకుంటూ తక్కువ మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారని షాహీన్ బేగం భర్త దిల్దార్ ఖాన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీనిపై దిల్దార్ ఖాన్ మధ్యవర్తి ఆబేద్ హుస్సేన్‌ను ఆరా తీయగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో మోసం జరిగిందని భావించిన బాధితురాలి భర్త దిల్దార్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా పోలీసులు ఆబేద్ హుస్సేన్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆబేద్‌కు సహకరించిన మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పనికి తీసుకెళ్లి నరకం చూపించారు..
పార్వతీపురం: పని ఇస్తామని చెప్పి తీసుకెళ్లి తమకు నరకం చూపించారని పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని గుమ్మలక్ష్మీపురం మండలం, మంత్రజోలకు చెందిన పు వ్వల కృష్ణారావు, విశాఖ జిల్లా జీకే వీధి మండలం తడకపల్లికి చెందిన జర్దా చిట్టిబాబులు వాపోయారు. అధిక జీతం, అన్ని వసతులు కల్పిస్తామని తమకు మాయమాటలు చెప్పి... విశాఖపట్నం నుంచి కర్ణాటక తీసుకెళ్లి తమను ఓ దీవిలో చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సుందరయ్య భవనంలో మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, కొల్లి సాంబమూర్తిల వద్ద తమ బాధలు చెప్పుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... తాము విశాఖలో పనిచేసుకునేందుకు వెళ్లామని, అక్కడ పని బాగాలేక ఇంటికి వచ్చే సమయంలో రైల్వేస్టేషన్లో ఓ బ్రోకర్ కనిపించి కొవ్వూరులో చేపల చెరువులో రొయ్యల పెంపకం పని ఇప్పిస్తామని, నెలకు రూ.10,000 జీతంతోపాటు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ఒప్పించాడన్నారు. అనంతరం అక్కడే బొందు నాగరాజు అనే కాంట్రాక్టర్‌కు తమను అప్పగించారన్నారు. ఆతను కొవ్వూరు తీసుకెళ్లి అక్కడ పని ఇవ్వకుండా కర్ణాటకలోని ఆయినొడిగెల్లా తాలూ కా, అంకెల గ్రామానికి ఎదురుగా ఉన్న తుంగభద్ర నదిలోని పాముల దిబ్బ అనే ఓ దీవిలో రాత్రి 8 గంటల నుంచి తెల్లవార్లూ పని చేయించేవారన్నారు. చలిలో నదిలో దిగి బోటు నుంచి విసిరిన వలను నదిలో దిగి నడిపే పని చేయమనేవారన్నారు. ఉదయం, రాత్రి భోజనం పెట్టి, జ్వరమంటే...కర్రలతో కొట్టి, చంపేస్తామని భయపెట్టి చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు. తమతోపాటు అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నారని చెప్పారు. ఓ మారు అక్కడ నుంచి కొంతమంది తప్పించుకోవడానికి యత్నిస్తే...రౌడీలను పెట్టి కొట్టించారన్నారు. అందులో ఓ ఆరుగురుం తప్పించుకుని హంసనంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా కాంట్రాక్టర్ తమ్ముడు రాజు కొంతమంది రౌడీలతో వచ్చి పోలీసుల ముందే తమను చితకబాదారన్నారు. దీనిపై పోలీసులు కూడా పట్టించుకోకుండా వారి దగ్గరకే వెళ్లమ న్నారన్నారు. దీంతో తామంతా భయపడి, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామనగా విడిచిపెట్టారన్నారు. అక్కడ నుంచి తమ ఇద్దరితో పాటు కృష్ణ, రమణ, లక్ష్మణ తదితరులు తప్పించుకోగా, కొర్ర కామేశ్వర్రావు ఎటు వెళ్లిపోయాడో తెలియదన్నారు. చేత పైసా లేక అక్కడక్కడ కనిపించిన వాహనాలు ఎక్కి చివరకు పార్వతీపురం చేరుకున్నామని వాపోయారు. ఈ విషయమై తాము ఏఎస్పీ, ఐటీడీఏ పీఓ, సబ్-కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నామని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, సీపీఎం నాయకులు తెలిపారు. -
'మా మధ్య బ్రోకర్ అవసరం లేదు'
ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్‌ల స్నేహం 'జయ' కారణంగానే చెడిందట. జయ అంటే జయప్రద అనుకునేరు. ఎంతమాత్రం కాదు. అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ కారణంగానే చిరకాల మిత్రుడికి దూరం అయ్యాయని అమర్ సింగ్ స్వయంగా వెల్లడించారు. తమిద్దరి మధ్య జయ చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ములాయంకు అత్యంత సన్నిహితంగా మెలగిన అమర్ సింగ్ అనూహ్యంగా 2010లో సమాజ్‌వాది పార్టీ నుంచి బహిష్కరణకు గురైయ్యారు. తర్వాత వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. ఇక సమాజ్‌వాది పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్‌తో వైరంగా కారణంగా అమర్ సింగ్ స్నేహితురాలు జయప్రద కూడా ములాయంకు దూరయ్యారు. తర్వాత రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలో చేరారు. ఇదిలావుంచితే తాజాగా జయబచ్చన్ పై అమర్ సింగ్ విరుచుకుపడ్డారు. ములాయంతో సంబంధాలు పునరుద్దరించుకోవడానికి తనకు బ్రోకర్ అవసరం లేదంటూ ధ్వజమెత్తారు. అసలు తన పాత్ర మిత్రుడితో సంబంధాలు దెబ్బతినడానికి జయా బచ్చనే కారణమని వెల్లడించారు. తనకు, ములాయంకు మధ్య జయ మధ్యవర్తిగా వచ్చినప్పటి నుంచే తమ మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పారు. తమ మధ్య సంబంధాలు మళ్లీ చిగురించడానికి ఏ మధ్యవర్తి, బ్రోకర్ అక్కర్లేదని ఘాటుగా విమర్శించారు. అయితే ములాయంకు మళ్లీ దగ్గరయ్యేందుకే అమర్ సింగ్ ఈ పల్లవి అందుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
తెలుగుతల్లిని ముక్కలు చేసిన వారిని జనం విడిచిపెట్టరు
బ్రోకర్, జోకర్ల గురించి త్వరలోనే బహిరంగంగా మాట్లాడతా కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తెలుగుతల్లిని ముక్కలు చేసిన ఏ ఒక్కరినీ జనం విడిచిపెట్టరని, సరైన సమయం కోసమే ఎదురుచూస్తున్న ప్రజలు ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని కేంద్ర మాజీమంత్రి, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అన్నారు. సాక్షి ప్రతినిధి గరికిపాటి ఉమాకాంత్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... యాభై ఏళ్ల నుంచి తెలుగువారి మనస్తత్వాన్ని పూర్తిగా స్టడీచేశా.. తెలుగుజాతికి అవమానం జరిగినప్పుడు వాళ్లు వెంటనే రియాక్ట్ కారు.. ఆ బాధను గుండెల్లో దాచుకుంటారు.. ఇప్పుడు కూడా అంతే.. కట్టలు తెంచుకునే ఆక్రోశాన్ని, ఆత్మగౌరవాన్ని అలాగే దాచుకున్నారు. తెలుగుతల్లిని తమ కళ్ల ముందే ఆపరేషన్ పేరుతో పొట్ట కోసి బిడ్డని తీసి తిరిగి పొట్ట కుట్టకుండా తల్లి చావుకి కారణమైన ఏ ఒక్కరినీ జనం విడిచిపెట్టరు. సరైన బుద్ధి చెబుతారు... ఎవరైతే తెలుగుతల్లి కోసం నిజాయితీగా పోరాడారో ఆ తల్లికి మనశ్శాంతినివ్వడం కోసమైనా వారిని గెలిపిస్తారు.. ఇక ఎన్నికల్లో డబ్బుకు, మందుకి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఎవరు ఔనన్నా కాదన్నా సత్యం. ఈ ఎన్నికల్లో కూడా జనం డబ్బు తీసుకుంటారు. డబ్బే కాదు ఇంకేమిచ్చినా తీసుకుంటారు. కానీ ఓటు మాత్రం తీసుకున్న వాళ్లకి వేయరు. తెలుగుతల్లి కోసం పోరాడిన వారినే ఎన్నుకుంటారు. వాళ్ల బండారం త్వరలోనే బయటపెడతా... పూర్వం బ్రోకర్ అనే పదానికి అర్థం అసహ్యంగా ఉండేది. బ్రోకర్ అంటే ఏహ్యభావంతో చూసేవారు. ఇప్పుడు బ్రోకర్‌కి స్టేటస్ వచ్చింది. ప్రతి కుంభకోణం వెనుక బ్రోకర్ ఉంటున్నాడు. రాజకీయపార్టీలు మారేందుకు, టికెట్లు ఇప్పించేందుకు, రాజకీయపార్టీల మధ్య పొత్తులు కుదిర్చేందుకు బ్రోకర్లు ఉంటున్నారు. చివరికి రాష్ట్రాన్ని ముక్కులు చేయడంలోనూ ఓ బ్రోకర్ పాత్ర ఉంది. ఇటీవల నేను ఈ వ్యాఖ్య చేసినప్పటి నుంచి ఎవరి గురించి చెబుతానో అని జనం ఎదురుచూస్తున్నారు.. ఆ బ్రోకర్, రాజకీయాల్లోకి వస్తున్న జోకర్ల గురించి నేను త్వరలోనే మాట్లాడతా. బహిరంగంగా ప్రజల సమక్షంలోనే ప్రకటిస్తా. ఇందుకు టైమ్ కోసం ఎదురుచూస్తున్నా. ఇంకా దాసరి గర్జించలేదేమిటని చాలామంది అడుగుతున్నారు. నేను గర్జించేవాడిని కాదు ఎదిరించేవాడిని. వాస్తవాలను మాట్లాడేవాడిని.. నేనేమిటో.. నా శక్తి సామర్థ్యాలేమిటో ప్రజలకు తెలుసు. -
రాష్ట్ర విభజనకు ఓ బ్రోకరే కారణం : దాసరి
-
రాష్ట్ర విభజనకు ఓ బ్రోకరే కారణం... అతనెవరో త్వరలో వెల్లడిస్తా: దాసరి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఓ బ్రోకరే కారణమని మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అతనెవరో త్వరలోనే వెల్లడిస్తాననీ ఆయన పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళి నటించిన ‘బ్రోకర్-2’ సినీ గీతాల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమలో దాసరి మాట్లాడుతూ.. ‘‘నేను చదువుకునే రోజుల్లో బ్రోకర్ అనే మాట చాలా చౌకబారు పదం. కానీ, ఇప్పుడు అది పవిత్రమైన పదంలా తయారైంది. రాజకీయ పార్టీలు మొదలు రాష్ట్రాలను విడగొట్టడం వరకూ బ్రోకర్లు పని చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి గురించి కూడా దాసరి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘తెలుగునాట సినిమా హాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలున్నాయి. దాదాపు 200 దాకా సినిమాలు తొలి కాపీలు వచ్చి, రిలీజుకు నోచుకోకుండా పడి ఉన్నాయి. అసమర్థ ప్రభుత్వాలు, మంత్రుల వల్లే చిన్న సినిమాలకు హాళ్ళు దొరకని దుస్థితి తలెత్తింది. రేపు రానున్న రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.