అందని సాయం..మానని గాయం | Unpaid compensation..not healed injury | Sakshi
Sakshi News home page

అందని సాయం..మానని గాయం

Published Mon, Mar 5 2018 11:18 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

Unpaid compensation..not healed injury - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

  దాదాపు వంద రోజుల విచారణ, వందలాది మంది పెట్టుబడిదారుల ఆందోళన, ఇద్దరి ప్రాణార్పణ, రూ.187 కోట్ల స్వాహాపై ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇదీ క్లుప్తంగా ట్రేడ్‌ బ్రోకర్‌ కేసు స్వరూపం. మూడు నెలల కిందట జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై పెట్టుబడిదారులు అసంతృప్తిలో ఉన్నారు. సీఐడీ చేతికి కేసు వెళ్లినా విచారణలో పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడికి బెయిల్‌ రావడాన్ని కూడా వారు స్వాగతించలేకపోతున్నారు. ఏ వైపు నుంచీ సాయం అందక, గుండెకు తగిలిన గాయం మానక బాధితులు నరకం చూస్తున్నారు. 

రాజాం: ట్రేడ్‌ బ్రోకర్‌ ఆన్‌లైన్‌ మోసం కేసు నీరుగారుతుందా..? బాధితులతో పాటు ఈ కే సును ఫాలో అవుతున్న వారి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. సం తకవిటి మండలం మందరాడలో షేర్‌ మార్కెట్‌ పేరిట రూ.187 కోట్లకు ప్రజలను ముంచి వం ద రోజులు గడిచిపోయా యి. ఈ కేసు విచారణను మొదటి నుంచీ గమనిస్తు న్న వారిలో ఇప్పు డు జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మూడు నెలల కిందట ఈ ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. అంత పెద్ద మొత్తంలో మోసం జరిగిందా అంటూ ఆశ్చర్యపోయింది.

ఇప్పుడు విచారణ చూసినా అదే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రధా న నిందితునికి బెయిల్‌ రావడం, బాధితులు ఎంత మోసపోయారో ఇంకా గుర్తించకపోవడం, ఎంత రికవరీ చేశారో చెప్పకపోవడం వంటి అంశాలు అనుమానాలకు ఊతమిస్తున్నాయి. 900 మందికి పైగా బాధితులను, పెట్టుబడిదారులను నిలువునా ముంచినా కేసు విచారణ ఇంత నెమ్మదిగా సాగడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

నవంబర్‌ 10న..
2017, నవంబర్‌ 10వ తేదీన తాలాడ గ్రామంలో ట్రేడ్‌ బ్రోకర్‌ సిబ్బంది కార్యాలయానికి తాళా లు వేయడంతో సంచలనం ఏర్పడింది. టం కాల శ్రీరామ్‌ అనే పేరు ఓవర్‌ నైట్‌లో జిల్లా మొత్తం తెలిసిపోయింది. అప్పటి వరకు పెట్టుబడిదారులు అతని వద్ద రెండు మూడు కోట్లు ఉంటాయని మాత్రమే అనుకునేవారు. కానీ మోసం విలువ రూ.187 కోట్లని తెలిసి వారంతా ఆశ్చర్యపోయారు. శ్రీరామ్‌ కార్యాలయానికి తాళం పడడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మొదట సంతకవిటి పోలీ స్‌ స్టేషన్‌లో బ్రోకర్‌ హామీల రూపంలో ఇచ్చిన చెక్‌లతో కేసులు పెట్టగా మొత్తం రూ.36 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది.

అయితే అక్కడితో కథ ముగియలేదు. కొంతమంది కో ర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఆధారాలతో నష్టపోయినవారి నగదు రూ. 50 కోట్లు వరకూ ఉంటుందనేది అంచనా. ఇవి కాకుండా కొంతమంది ఉద్యోగులు భయపడి కేసులు పెట్టలేదు. నవంబర్‌ 10న ట్రేడ్‌ బ్రోకర్‌ కార్యాలయానికి తాళాలు వేసిన అనంతరం చాలా మంది నిరుపేదలు మంచంపట్టారు. రూ. 25 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టిన ఇద్దరు బాధితులు ఈ మోసాన్ని జీర్ణించుకోలేక మృతి చెందారు. 

ఏదీ పురోగతి? 
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీస్‌ యంత్రాంగంతో పాటు పాలకొండ డీఎస్సీ జి. స్వరూప శరవేగంగా కేసును ముందుకు నడిపా రు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నా రు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులు మేరకు బ్రోకర్‌ శ్రీరామ్‌తో పాటు మరో ఐదుగురిని అ రెస్టు చేశారు. దీనిపై కొందరు ఎస్పీ కార్యాల యం ఎదుట గగ్గోలు పెట్టినా పోలీసు అధికారులు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో విచారణలో స్పీడు తగ్గింది. మూడు నెలలుగా కేసులో పురోగతి ఏమీ కనిపించడం లేదు. 


ఇదంతా ఎవరి సొత్తు.. తాలాడ వద్ద హంగులతో నిర్మించిన ట్రేడ్‌ బ్రోకర్‌ కార్యాలయం, పక్కనే 25 ఎకరాల తోట  

సీఐడీ ఏం చేస్తోంది?
నెలరోజుల కిందట విశాఖపట్నంకు చెందిన సీఐడీ అధికారులు కేసును తమ పరిధిలోకి తీసుకున్నారు. పలువురు ట్రేడ్‌ బ్రోకర్‌ ఉద్యోగులపై ఆరా తీశారు. ప్రత్యేక అనుమానితులను పిలు పించుకుని విచారణ చేపట్టారు. ఇదంతా జరిగి నెలరోజులు కావస్తున్నా అసలు విషయం ఇంతవరకూ బయటకు రాలేదు. ఈ మోసానికి ప్రధా న కారకులు ఒక్క శ్రీరామేనా, ఇంకెవరైనా ఉ న్నారా అన్నది ఇంతవరకూ వెల్లడికాలేదు. పె ట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడులకు సంబం ధించి ఎంత రికవరీ అయ్యిందనేది పత్రికా పరంగా కూడా వెల్లడికాలేదు. అసలేం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది తమ పి ల్లలకు వివాహాల కోసం, భవిష్యత్‌ ఉపయోగా ల కోసమే పెట్టుబడులు పెట్టారు. వీరంతా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. కొంతమంది మంచం పట్టారు.

నీరు గారుతోందా?
ప్రధాన నిందితునికి బెయిల్‌ రావడంపై బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులో పు రోగతి ఏమీ లేదని వారంటున్నారు. సీఐడీ కేసును తీసుకోవడంతో పెట్టుబడి వివరాలు తెలిసి, తమకు న్యాయం జరుగుతుందని, ఎం తో కొంత రికవరీ అవుతుందని ఆశ పడిన వా రంతా ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. 

అధికార పార్టీ నేతల హస్తం ఉందా?
ట్రేడ్‌ బ్రోకర్‌ శ్రీరామ్‌ అధికార పార్టీ నేతలను కూడా ముంచినట్లు సమాచారం. పెట్టుబడులు ఎక్కువగా రాబట్టేందుకు అధికార పార్టీకి చెందిన నేతలను వినియోగించుకోవడంతో పాటు పలువురు నాయకుల నుంచి కూడా పెట్టుబడులు తీసుకుని ప్రస్తుతం వారికి కూడా ఎగనామం పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు శ్రీరామ్‌ను బయటకు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసి తాము నష్టపోయిన మొత్తంలో ఎంతో కొంత నగదును రికవరీ చేసుకునేం దుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అంతా గోప్యంగా ఉండి, కేసుపై కదలికలు లేకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆ డబ్బు ఏమైనట్టు? 

బ్రోకర్‌ శ్రీరామ్‌ ఎంత డబ్బును పెట్టుబడి రూపంలో తీసుకున్నాడు? ప్రస్తుతం ఎంత ఉందనేది ఇంకా కొలిక్కిరాలేదు. పోలీసులు, సీఐడీ అధికారులు కూడా ఈ విషయాన్ని వెల్లడించడం లేదు. ప్రస్తుతం శ్రీరామ్‌ కుటుంబ సభ్యులు, బంధువులను, స్నేహితులను విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వివరాలు కూడా గోప్యంగా ఉన్నాయి. ఈ అక్రమ ఆస్తుల వివరాల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు మాత్రం కళ్లు కాయలు కాస్తున్నాయి.

ముమ్మర దర్యాప్తు

ట్రేడ్‌ బ్రోకర్‌ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్లు విశాఖపట్నం సీఐడీ డీఎస్పీ ఎస్‌.నాగభూషణంనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఏ కోణంలో వి చారిస్తున్నామో, ఎవరెవరిని విచారిస్తున్నామన్నది గోప్యంగా ఉంచాల్సి ఉందని అన్నారు. త్వరలోనే బ్రోకర్‌ వద్ద పెట్టిన పెట్టుబడులతో పాటు అక్రమ ఆస్తులు వివరాలు వెల్లడించి ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement