online fraud
-
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది: ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తే..
ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల పాట్నాకు చెందిన ఒక మహిళ.. కాల్ చేసి వేలాది రూపాయలు పోగొట్టుకుంది. ఇంతకీ ఇదెలా జరిగిందో తెలుసుకుందాం.పాట్నాలోని యారాపూర్ నివాసి అయిన ఒక మహిళ.. ఫిబ్రవరి 6న ఆన్లైన్లో మిక్సర్ మెషీన్‌ను ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ ఫిబ్రవరి 12 నాటికి కావాల్సి ఉంది. కానీ డెలివరీ అవ్వలేదు. దీంతో ఆమె కంపెనీని సంప్రదించాలని నిర్ణయించుకుని.. సెర్చ్ ఇంజిన్‌లో కంపెనీ కాంటాక్ట్ నంబర్ కోసం వెతికి, ఒక నెంబర్ సంపాదించింది.తెలియని నెంబర్‌కు కాల్ చేసి, స్కామర్ల ఉచ్చులో పడింది. ఇంకేముంది.. నిమిషాల్లో రూ. 52,000 పోగొట్టుకుంది. చేసేదేమీ లేక.. ఆ మహిళ పోలీసులను సంప్రదించింది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.ఆన్లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే?➤కస్టమర్ కేర్ నెంబర్ల కోసం.. ఎల్లప్పుడూ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మోసగాళ్ళు తరచుగా సెర్చ్ ఇంజన్లలో నకిలీ నంబర్లను జాబితా చేస్తారు. కాబట్టి ఆన్లైన్లో వెతకడం మానుకోవాలి. ➤తెలియని నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ పట్ల జాగ్రత్త అవసరం. మోసగాళ్ళు ప్రజలను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.➤ఎవరైనా మిమ్మల్ని చెల్లింపు వివరాలను లేదా లావాదేవీ వివరాలను చెప్పమని, లింక్‌పై క్లిక్ చేయమని అడిగితే.. అధికారిక మార్గాల ద్వారా కంపెనీతో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.➤మోసపోతున్నట్లు అనుమానం వస్తే.. వెంటనే మీ బ్యాంకును సంప్రదించి సైబర్ పోలీసులకు నివేదించండి.ఇదీ చదవండి: కొత్త ఐఫోన్ 16ఈ.. ఇలా చేస్తే రూ.4000 డిస్కౌంట్ -
స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలు
స్పామ్, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల్లో స్పామ్ మెసేజ్‌లు, కాల్స్‌తోపాటు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపింది.ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేలా ట్రాయ్ తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్టెల్ పేర్కొంది. ఏకీకృత యాంటీ స్పామ్ ఎకోసిస్టమ్‌ను సృష్టించడానికి ఓటీటీలు, టెలికాం ఆపరేటర్ల మధ్య తప్పనిసరి పాటించాల్సిన నియమాలను అభివృద్ధి చేయాలని సూచించింది. బిజినెస్ వెరిఫికేషన్, డేటా షేరింగ్ వంటి చర్యలతో ఈ మోసాలను కొంతవరకు కట్టడి చేయవచ్చని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పామ్ కాల్స్, మెసేజ్‌ల నివారణకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఇటీవల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికర/ ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ముసాయిదా మార్గదర్శకాలను 2024 జూన్‌లో రూపొందించారు. తుది మార్గదర్శకాలను నోటిఫై చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు ఇటీవల లేఖ రాసింది. -
వణికించిన ఫోన్ కాల్.. రూ. 7.28 లక్షలు దోపిడీ
ఆన్లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా 25 ఏళ్ల ఐఐటీ బాంబే విద్యార్థి అధునాతన మోసంలో రూ. 7.28 లక్షలు కోల్పోయి బాధితుడయ్యాడు.వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. విద్యార్థికి ట్రాయ్ అధికారినంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. విద్యార్థి మొబైల్ నంబర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన 17 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆ వ్యక్తి చెప్పాడు. తమ సూచనలను పాటించకపోతే "డిజిటల్ అరెస్ట్" అయ్యే ప్రమాదం ఉందని బెదిరించాడు.చట్టపరమైన పరిణామాలు, అభియోగాల తీవ్రతకు భయపడిన విద్యార్థి వారి సూచనలను అనుసరించడానికి అంగీకరించాడు. కేసుల నుంచి పేరును తొలగించడానికి, చట్టపరమైన సమస్యలను నివారించడానికి రూపొందించిన ప్రక్రియ పేరుతో స్కామర్లు పలు దఫాలుగా రూ. 7.28 లక్షలను వారి ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. భయంతో అతను వారి సూచనలను అనుసరించిన విద్యార్థి చివరికి bమోసానికి గురయ్యాడు.వణికిపోవద్దు..ఇలాంటి ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇలాంటి మోసాలకు బలి అవుతున్న వ్యక్తుల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ఈ స్కామ్‌లలో చాలా వరకు వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా చట్టబద్ధమైన సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతన్నాయి. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కాలర్ గుర్తింపును ధ్రువీకరించుకోవాలని, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం తీసుకోవాలని, భయంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. -
గూగుల్‌ను గుడ్డిగా నమ్మితే.. మీకూ ఇలాంటి మోసమే జరగొచ్చు!
ప్రస్తుతం ఏది కావాలన్నా గూగుల్లోనే వెతికేస్తున్నాం. అయితే అందులో వచ్చిన ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్తే మోసపోయే అవకాశం ఉంది. ఇలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని ఉడిపిలో క్యాబ్ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఆన్లైన్ మోసానికి గురై రూ.4.1 లక్షలు పోగొట్టుకున్నాడు.మోసం జరిగిందిలా..గూగుల్ సెర్చ్‌లో కనిపించిన మోసపూరిత కార్ రెంటల్ వెబ్‌సైట్‌తో లింక్ అయిన నకిలీ చెల్లింపు పేజీలో తన కార్డ్ వివరాలను నమోదు చేసి బాధితుడు మోసపోయినట్లు తెలుస్తోంది. ఓ వార్తా నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి కార్ రెంటల్ సర్వీస్‌ల కోసం గూగుల్‌లో శోధించాడు. “శక్తి కార్ రెంటల్స్” అని కనిపించిన లింక్‌పై క్లిక్ చేశాడు. కొద్దిసేపటికే కంపెనీ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి అతన్ని సంప్రదించాడు. అతను వెబ్సైట్ ద్వారా టోకెన్‌గా రూ. 150 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించమని సూచించాడు.దీంతో బాధితుడు తన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో ఫీజు చెల్లించడానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా లావాదేవీ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీ రాలేదు. కానీ, కొద్దిసేపటికే అతని ఖాతాల నుండి డబ్బులు కట్ అయినట్లు బ్యాంక్ నుంచి నోటిఫికేషన్లు వచ్చాయి. తన ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి రూ.3.3 లక్షలు, కెనరా బ్యాంక్ డెబిట్ కార్డు నుంచి రూ.80,056 మొత్తం రూ.4.1 లక్షలు కట్ అయ్యాయి.దేనికోసమైనా గూగుల్‌లో వెతికేటప్పుడు అందులో వచ్చే లింక్‌లను ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకుని ముందుకెళ్లాలి. ఆర్థిక విషయాలకు సంబంధించినవైతే మరింత జాగ్రత్త అవసరం. మరోవైపు గూగుల్ కూడా ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఒక కొత్త అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసినట్లు కొన్ని నెలల క్రితం తెలిపింది. -
మీరు కూడా ఆ ఉచ్చులోనే చిక్కుకున్నారా..?
-
ఆన్లైన్ మోసాలకు అంతేలేదు
దేశంలో ఆర్థిక మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. వినియోగదారుల ఆర్థిక డేటా వివరాలు అంగట్లో సరుకులా అమ్ముడవుతున్నాయి. గడిచిన మూడేళ్లలో పట్టణ భారతీయుల్లో అధిక శాతం మంది క్రెడిట్ కార్డు మోసాలకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఆ తర్వాత.. నిత్యం లావాదేవీలకు కోసం వాడే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సరికొత్త చోరీలు తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలోని వేలాది మంది డేటా విక్రేతల ద్వారా దేశీయ వినియోగదారుల క్రెడిట్ కార్డు సమాచారం మార్కెట్లో సులభంగా లభిస్తోందని సోషల్ మీడియా రీసెర్చ్ ఫ్లాట్‌ఫారం సంస్థ లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. సాక్షి, అమరావతిక్రెడిట్ కార్డుల ద్వారా 43శాతం మోసాలు..దేశవ్యాప్తంగా గడిచిన 36 నెలల్లో ఏకంగా 47 శాతం మంది పట్టణ భారతీయులు, వారి కుటుంబ సభ్యులు ఆర్థిక మోసాల బారినపడినట్లు నివేదిక పేర్కొంది. 43 శాతం మంది తమ క్రెడిట్ కార్డు ద్వారా.. 30 శాతం మంది యూపీఐ లావాదేవీల ద్వారా మోసపోయారు. క్రెడిట్ కార్డు ద్వారా జరిగిన మోసాల్లో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు దేశీయ, అంతర్జాతీయ వ్యాపారులు వెబ్సైట్ల ద్వారా అనధికారిక చార్జీల మోతను భరించాల్సి వచి్చంది. బ్యాంకర్ల పేరుతో ఫోన్లుచేసి ఓటీపీలు ద్వారా డెబిట్ కార్డు వివరాలు అప్డేట్ చేయాలంటూ ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ఇక యూపీఐ ద్వారా ఆన్లైన్ దోపిడీ విషయంలో ప్రతి పదిమంది బాధితుల్లో నలుగురు చెల్లింపునకు అంగీకరించడానికి పంపించే లింక్‌ను క్లిక్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డబ్బులను పోగొట్టుకున్నారు. ఇక యూపీఐ, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్బీఐ, యూపీఐ.. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆరి్థక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేల్చిచెప్పింది. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.ఇక యూపీఐ, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్బీఐ, యూపీఐ.. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేలి్చచెప్పింది. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.అమ్మకానికి క్రెడిట్ కార్డు డేటా.. మరోవైపు.. దేశంలోని వినియోగదారుల క్రెడిట్ కార్డు డేటా సులభంగా అమ్మకానికి అందుబాటులో ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. పాన్‌కార్డు, ఆధార్, మొబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారంతో పాటు మొబైల్ నంబర్, ఈమెయిల్, ఇతర చిరునామాతో క్రెడిట్ కార్డుల వివరాలు కూడా అందుబాటులో ఉండటం సమాజానికి శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఒక్క ఏడాదిలో రూ.13,930 కోట్ల దోపిడీ.. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 36వేల కంటే ఎక్కువ ఆర్థిక మోసాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఇది గత ఆరి్థక ఏడాదితో పోలిస్తే 166 శాతం మేర గణనీయంగా పెరిగింది. బ్యాంకింగ్ రంగంలో ఈ మోసాల కేసులు 2022–23లో 13,564 నుంచి 2023–24లో 36,075కి చేరుకున్నాయి. అయితే, ఈ మోసాల విలువ 2023–24లో రూ.13,930 కోట్లకు చేరాయి. అయితే, ఇక్కడ ప్రతి పది మంది బాధితుల్లో ఆరుగురు ఎటువంటి ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. -
‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..
దేశంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు, బ్యాంకులు, ఇతర సంస్థలు మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రజల్లో కొంత మార్పు వచ్చింది. ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్)వివరాలను అపరిచితులతో షేర్ చేసుకోవడం లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు నయా పంథాను ఎంచుకుంటున్నారు. బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల పేర్లు చెప్పకుండా..ఏకంగా పోలీసుల పేర్లతో మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా ‘కార్తీక దీపం ’సీరియల్ నటి ఉషా రాణి సైబర్ నేరగాళ్ల నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ కేటుగాడు డీఎస్పీని అంటూ ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే.. తెలివిగా వ్యవహరించి ఆన్లైన్ మోసానికి చెక్ పెట్టింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ..జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించింది. వీడియోలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది.’నాకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. అందులో మొత్తం రూ.5 లక్షల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. దానిని మా అబ్బాయి బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. వాడు తరచు ప్యాంట్ జేబులో పెట్టి మర్చిపోతుంటాడు. ఈ సారి కూడా ఎక్కడో పెట్టే ఉంటాడులే అనుకొని బ్లాక్ చేయకుండా వదిలేశా. ఆ కార్డు అమోజాన్‌కి లింక్ అయి ఉండడంతో నా షాపింగ్‌కి కూడా ఇబ్బంది కాలేదు. పని జరుగుతుంది కదా అని నేను లైట్ తీసుకున్నాను.కొన్నిరోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ఒక వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో ‘నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని షేర్ చేయండి అని అడిగాడు. అయితే నేను కాసేపు ఆలోచించాను. ఆ వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా.. మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని అడిగాను. నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో.. అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు. అందులో మా ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి. దీంతో నేను వెంటనే అలెర్ట్ అయ్యాను. దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాను. జాగ్రత్తగా ఉండండి.మోసపోకండి’ అని ఉషారాణి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Usha Rani (@usharani_actor) -
రూ. 158 కోట్ల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ స్కామ్
ఆన్లైన్ మోసాలకు అంతం లేకుండా పోతోంది. ముఖ్యంగా నిరుద్యోగులనే మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో రూ.కోటి మోసం వెలుగు చూసిన మరుసటి రోజే మరో భారీ స్కామ్ బయటపడింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటూ అమాయకులను మోసం చేసి రూ.158 కోట్ల స్కామ్‌కి పాల్పడిన ముఠాను బెంగళూరు సిటీ పోలీసులు పట్టుకున్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అమీర్ సోహైల్, ఇనాయత్ ఖాన్, ముంబైకి చెందిన సయ్యద్ అబ్బాస్ అలీ, మిథున్ మనీష్ షా, నైనా రాజ్, సతీష్, మిహిర్ శశికాంత్ షా, హైదరాబాద్‌కు చెందిన నయాజ్, ఆదిల్ పట్టుబడ్డారు. మరో ఇద్దరు అనుమానితులను పట్టుకోవాల్సి ఉంది. ఇలా మోసగించారు.. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌ల ముసుగులో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సందేహాస్పద ఫోన్ నంబర్లతో అమాయకులకు ఈ ముఠా చేరువయ్యారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టడం, యాప్‌ను ఇన్స్టాల్ చేయడం వంటి సులువైన పనులను అప్పగించి పూర్తయ్యాక డబ్బులిస్తామని నమ్మించారు. ఇలా నమ్మినవారితో కొద్దికొద్దిగా డబ్బులు తీసుకున్నారు. బాధితులు తమ డిజిటల్ వాలెట్లు వివిధ దశల్లో క్రెడిట్ అవుతున్నట్లు చూడగలిగినప్పటికీ, ఆ డబ్బు డ్రా చేసుకుకోవడానికి ప్రయత్నించే వరకు మోసం బయటపడలేదు. తమ డిజిటల్ ఖాతాలు నకిలీవని, స్కామ్‌కు గురయ్యారని వారు గ్రహించి బాధితులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ ప్రారంభించారు. రూ. 18.5 లక్షలు పోగొట్టుకున్నట్లు విద్యారణ్యపురకు చెందిన బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీబీ అధికారులు 30 బ్యాంకు ఖాతాల్లో రూ.62.8 లక్షలను స్తంభింపజేశారు. తదుపరి దర్యాప్తులో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సిఆర్‌పి) ద్వారా 28 రాష్ట్రాల్లో నమోదైన 2,143 సైబర్ క్రైమ్ కేసుల్లో దీని వెనుక ఉన్న అనుమానితుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. కర్ణాటకలో నమోదైన మొత్తం 265 కేసుల్లో బెంగళూరు లోని 14 పోలీస్ స్టేషన్లలోనే 135 కేసులు నమోదయ్యాయి. -
ఇదో కొత్తతరహా మోసం.. జాగ్రత్త: సజ్జనార్
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్త నేరాలకు తెరలేపారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్సిళ్ల పేరుతో వారు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాను మొదలెట్టారని... మీ పేరిట ఫెడెక్స్‌లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారని హెచ్చరించారు. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. భయపడినవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పార్శిల్ అనగానే భయపడిపోయి అడిగినంత డబ్బులు సమర్పించుకోవద్దన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. మీ పేరిట ఫెడెక్స్‌లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. భయపడిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి… pic.twitter.com/l30JmmPCeS — V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 2, 2024 -
ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆశపడితే మొదటికే మోసం! బ్యాంక్ మేనేజర్‌కి జరిగింది ఇదే..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్, సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. సామాన్యులే కాకుండా బ్యాంక్ మేనేజర్ వంటి అవగాహన ఉన్న ఉన్నత ఉద్యోగులు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. రూ.లక్షల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. పుణేలో ఓ బ్యాంక్ మేనేజర్ ఇలాగే ఆన్లైన్ టాస్క్‌ల మోసానికి గురయ్యారు. మొదట ఫారమ్‌లను నింపడం, వీడియోలను చూడటం వంటి చిన్న చిన్న టాస్క్‌లను ఇచ్చిన మోసగాళ్లు పూర్తయిన తర్వాత వెంటనే అతని బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేశారు. బాధితుడు వారిని విశ్వసించడం ప్రారంభించిన తర్వాత "టాస్క్ యాక్టివేషన్ ఫీజు" అడగడం ప్రారంభించారు. ఇలా రూ. 15 లక్షలకు పైగా అతని నుంచి రాబట్టారు. బాధితుడు ఆన్లైన్ వారిచ్చిన 27 టాస్క్‌లను పూర్తి చేసినా వాటికి డబ్బు మాత్రం చెల్లించలేదు. పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో ఎర టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో స్కామర్లు బ్యాంక్ మేనేజర్‌కు ఎర వేశారు. ఈ మేరకు బాధితుడి ఫోన్‌కు మెసేజ్ పంపించారు. ఇది నిజమేనని నమ్మిన బ్యాంక్ మేనేజర్ స్కామర్లను సంప్రదించాడు. ఖాళీ సమయంలో ఇంటి నుంచి పని చేయడం ద్వారా అద్భుతమైన రాబడి వస్తుందని వారు ఆయన్ను నమ్మించారు. తర్వాత ఒక గ్రూపులో నమోదు చేసుకోవాలని చెప్పి టాస్క్‌లు ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో కొన్ని టాస్క్‌లు పూర్తి చేసిన కొంత డబ్బు వచ్చింది. ఆ తర్వాత టాస్క్‌లను యాక్టివ్ చేయడానికి బాధితుడి నుంచి డబ్బు తీసుకోవడం ప్రారంభించారు. మొదట్లో వెంటనే డబ్బు అలా ఒక టాస్క్‌లో భాగంగా అతన్ని 27 విమాన టిక్కెట్లు బుక్ చేయమని అడిగారు. ఈ టాస్క్‌ను యాక్టివేట్ చేయడానికి రూ. 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ డబ్బును డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేసిన బాధితుడి బ్యాంకు ఖాతాలో రూ. 16,321 జమయ్యాయి. దీని తరువాత టాస్క్‌ల యాక్టివేషన్ కోసం బ్యాంక్ మేనేజర్ వారికి డబ్బు పంపడం ప్రారంభించాడు. వారిచ్చిన 27 టాస్క్‌లు పూర్తి చేశాడు. వాటి మీద వచ్చిన సొమ్మును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా మరో మూడు టాస్క్‌లు పూర్తి చేయాల్సి ఉంటుందని స్కామర్లు అతనికి చెప్పారు. అంతే కాదు వాటిని యాక్టివేట్ చేసేందుకు మరో రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరారు. దీంతో మోసపోయానని గ్రహించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. -
'క్రెడిట్ కార్డు' కోసం.. ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా.. జర జాగ్రత్త! లేదంటే..
సాక్షి, మహబూబాబాద్: క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోతోంది.. వెంటనే అప్ డేట్ చేసుకోవాలని ఓ వ్యక్తి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీనిని చూసి ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే తనకొచ్చిన మెసేజ్‌లో ఉన్న లింక్ ఓపెన్ చేసి అప్డేట్ చేశాడు. అనంతరం ఫోన్‌కు ఓటీపీ రాగా టైప్ చేశాడు. అప్డేట్ అయిన తర్వాత నిమిషాల వ్యవధిలో రూ.64 వేలు ఖాతా నుంచి మాయమయ్యాయి. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన మానుకోట పట్టణంలో జరిగింది. జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు కేజీఆర్ కాలనీకి చెందిన చీదరి సతీష్ కుమార్ ఫోన్‌కు ఈ నెల 3వ తేదీన క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోతుంది.. వెంటనే అప్ డేట్ చేసుకోవాలని ఓ గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ పంపించాడు. ఇందుకు స్పందించిన సతీష్‌కుమార్ వెంటనే ఆ మెసేజ్‌లో ఉన్న లింక్ ఓపెన్ చేసి యూనియన్ బ్యాంక్ ప్రొఫార్మా రాగానే అప్ డేట్ చేశాడు. ఆ వెంటనే అతడి ఫోన్‌కు ఒటీపీ వచ్చింది. దానిని టైప్ చేసిన తర్వాత అప్ డేట్ అయింది. నిమిషాల వ్యవధిలో బాధితుడి ఖాతా నుంచి రూ.64 వేలు డెబిట్ అయినట్లు సమాచారం వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వై.సతీష్ ఆదివారం తెలిపారు. ఇవి చదవండి: కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం! -
లాభాల వలవేసి.. డబ్బు లాగేసి..
కర్నూలు: ముచ్చటైన ఆఫర్లు.. కళ్లెదుటే లాభాలు.. చుట్టుపక్కల వాళ్లను జతచేస్తే బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు. అకౌంట్లోకి తేరగా వచ్చి పడుతున్న డబ్బును చూసి అందరికీ ఆశ కలిగింది. ఒకరిని చూసి మరొకరుగా చేరుతుండటంతో కొత్త స్కీమ్‌లు తెరపైకి వచ్చాయి. రూ.100 కడితే రూ.2 వేల ఆదాయం వస్తుండటంతో కంపెనీకి విస్తృత ప్రచారం లభించింది. కొత్త అకౌంట్ల సంఖ్య పెరగడంతోపాటు వ్యాపారం రూ.కోట్లకు చేరింది. అంతా సజావుగా సాగుతున్నట్టు అనిపించినా ఒకానొక రాత్రి ఆ కంపెనీ చీకట్లో కలిసిపోయింది. లబోదిబోమంటున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్లేస్టోర్‌లో పుట్టుకొచ్చి .. ప్లేస్టోర్ వేదికగా పుట్టుకొచ్చిన కెనడియన్ సోలార్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఆన్లైన్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఐదు నెలల కాలంలో అందమైన ఆఫర్లతో వేలాది మందిని బుట్టలో వేసుకుంది. కాఫీ తాగుతున్న విదేశీ యువతి ఫొటోను డీపీగా పెట్టుకుని 97904 01505, 44 7467 135 221 నంబర్లతో వాట్సాప్ చాటింగ్ ద్వారా ఖాతాదారులకు కంపెనీ దగ్గరైంది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో ఒకరి తర్వాత ఒకరు లాభాలకు ఆకర్షితులయ్యారు. మొదట్లో డబ్బు చెల్లించడమే తరువాయి.. వెంటవెంటనే డబ్బు వస్తుండటంతో నమ్మకంతోపాటు ఖాతాదారుల సంఖ్య కూడా పెరిగిపోయింది. కొత్త స్కీమ్‌లతో విస్తరణ మొదట 45 రోజుల స్కీమ్‌తో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఆ తర్వాత నెల రోజులు.. 15 రోజులు.. 10 రోజులు.. 3 రోజులు.. చివరగా ఒక్క రోజు కాల వ్యవధితోనూ స్కీమ్‌లు నడిపింది. 45 రోజుల స్కీమ్‌లో డబ్బు డిపాజిట్ చేసిన వాళ్లకు వెనువెంటనే ఖాతాల్లోకి డబ్బు చేరుతుండటం.. ఆ వివరాలను చూసి మరికొందరు ఆ స్కీమ్‌లలో చేరడం జరిగిపోయింది. పది రోజుల స్కీమ్‌లో ఒకసారి రూ.47 వేలు కడితే.. 10 రోజుల వరకు రోజూ రూ.21,374 చొప్పున అకౌంట్లలో జమ చేస్తారు. ఒక్క రోజు స్కీమ్ (ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్)లో రూ.13,500 చెల్లిస్తే అదే రోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత రూ.29,700 చెల్లిస్తామని కంపెనీ నమ్మబలికింది. రెఫర్ చేస్తే బోనస్ ఖాతాదారులను ఆకట్టుకునేందుకు చైన్ లింకును తెరపైకి తెచ్చింది. ఒకరికి లింకు పంపిస్తే బోనస్‌ను నిర్ణయించింది. ఆ లింకు డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తి రూ.13,500 చెల్లిస్తే.. చేర్పించిన వ్యక్తికి రూ.1,800 బోనస్, 700 పాయింట్లు, అదనంగా రూ.600 సబ్సిడీ బోనస్ కలిపి రూ.3,500 చెల్లిస్తుంది. ఇలా జాయిన్ చేసిన వారి వివరాలను వాట్సాప్ చాట్‌లో నమోదు చేస్తే ఒక ప్రోమో కోడ్ వస్తుంది. ఆ కోడ్‌ను తమ వద్దనున్న యాప్‌లో రివార్డు కాలమ్‌లో ఎంటర్ చేయగానే బోనస్ మొత్తం అకౌంట్లో జమ అవుతుంది. చీకట్లో కలిసిపోయింది. నమ్మకమే పెట్టుబడిగా ఏర్పాటైన ఈ కంపెనీ చీకట్లో కలిసిపోయింది. ఎంతగా అంటే.. ప్లే స్టోర్‌లో కూడా సమాచారం లేకుండాపోయింది. చివరకు సెల్ఫోన్ల నుంచి కూడా యాప్ దానంతటదే డిలీట్ అయ్యిందంటే కంపెనీ నిర్వాహకుల తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. స్పందన’లో ఫిర్యాదు కెనడియన్ సోలార్ యాప్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే రెట్టింపు మొత్తం తిరిగి ఇస్తామని చెప్పి మోసం చేశారని కర్నూలు నగరం బుధవారపుపేటకు చెందిన అర్ఫత్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు ఈ నెల 17న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రూ.2.85 లక్షలు ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే రూ.13 లక్షలు చెల్లిస్తామని నమ్మించి మోసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో
ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఖరీదైన కారును పోగొట్టుకున్న వైనం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గుజరాతీ గాయకుడు ,సంగీత దర్శకుడు, బిన్నీ శర్మ రూ. 40 లక్షల విలువైన ఎప్యూవీని పోగొట్టకుని లబోదిబోమంటున్నాడు. ఈ మేరకు తనకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ అవుతోంది. (అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు) తన పాటలు, వాయిస్‌తో గాయకుడిగా పాపులర్ అయిన బిన్నీ గూగుల్‌లో సెర్చ్ చేసి ఫేక్ పోర్ట్ల్ ద్వారా మోసానికి గురయ్యాడు. తాను సాధారణంగా సహాయం కోసం అడగను, కానీ మోసగాడు చేసిన స్కామ్‌కు బలైపోయా.. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను సాయం చేయాలంటూ ఇన్‌స్టా వేదికగా కోరుతున్నాడు. అలాగే మూవ్ మై కార్, జస్ట్ డయల్, గూగుల్ యాడ్స్ తో జాగ్రత్తగా ఉండాలి, మోస పోవద్దంటూ పిలుపునివ్వడం గమనార్హం. రూ.40 లక్షలు విలువ చేసే తన ఎస్‌యూవీని హిమాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ కు తరలించాలంటూ శర్మ మూవ్ మై కార్ అనే పోర్టల్ లో వెండర్‌ను సంప్రదించాడు. ఈ మేరకు సదరు వెండర్‌కు చెందిన ట్రక్ శర్మ కారును తీసుకెళ్లింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. తీసుకెళ్లి కారును మాత్రం గమ్యస్థానానికి చేర్చలేదు. పైగా ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన సొమ్ముకాకుండా అధికంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గమనించిన బిన్నీ పోలీసులను ఆశ్రయించాడు. అగర్వాల్ ఎక్స్ ప్రెస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, మూవ్ మై కార్ పోర్టల్‌పై కూడా సైబర్ పోలీసులు కన్జ్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేశానని బిన్నీ తెలిపారు. అటు పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. (ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం) కాగా రేడియో జాకీగా తొలినాళ్ల నుంచి 'మై వరల్డ్' అనే షోను హోస్ట్ చేస్తూ సునిధి చౌహాన్, శంకర్ ఎహసాన్ లాయ్, అర్జిత్ సింగ్ వంటి పాపులర్ సింగర్స్‌తో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, తన టాలెంట్‌తో అనేక మంది ఫ్యాన్స్‌ని, ఫాలోయర్స్‌ని సంపాదించకున్నాడు బిన్నీ శర్మ. -
బామ్మా జర భద్రం.. ఆ లింక్స్‌పై క్లిక్ చేస్తే అంతే! ఈ టోల్ ఫ్రీ నంబర్ మీకోసమే!
విచారంగా కూర్చొని ఉన్న వర్ధనమ్మను చూసి ఏమైందని అడిగింది మనవరాలు హారిక. ‘బ్యాంకు ఖాతా నుండి డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. నేను ఆ డబ్బులు డ్రా చేయలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. బ్యాంకులో అయితే భద్రంగా ఉంటాయనుకున్నా. ఇప్పుడెలా..’ అంది మనవరాలితో దిగులుగా వర్ధనమ్మ. ‘ఎవరైనా నీకు ఇంతకుముందు ఫోన్ చేశారా..’ అడిగింది హారిక. ‘బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. అత్యవసరం అని చెబితే, వాళ్లు పంపిన లింక్ ఫామ్‌లో వివరాలు ఇచ్చాను. అంత కన్నా ఏమీ చేయలేదు’ అంది వర్ధనమ్మ. బామ్మ సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయిందని అర్ధమై, వెటనే తగిన చర్యలు తీసుకుంది హారిక. ఆ తర్వాత బామ్మకు సైబర్ మోసగాళ్ల గురించి వివరించింది. ఇంట్లో వయసు పైబడిన వారుంటే సైబర్ మోసాగాళ్ల బారిన పడకుండా ఈ విషయాలు తప్పక తెలియజేయాల్సిన అవసరం వారి పిల్లలకు ఉంది. సాధారణంగా జరిగే మోసాల్లో ప్రధానమైంది ఫిషింగ్ సైబర్ నేరగాళ్లు మీ డిజిటల్ సమాచార మొత్తాన్ని పొందడానికి ఆన్లైన్ సేవ లేదా బ్యాంక్ ఏజెంట్ల వంటి విశ్వసనీయ పరిచయాలను పెంచుకుంటారు. కొన్ని ఉదాహరణలు.. సహాయం కోసం రిక్వెస్ట్ అడుగుతారు. మీరు బహుమతిని గెలుచుకున్నారని చూపుతారు. పెన్షన్ ఫండ్ విడుదలకు కెవైసి అవసరం అంటారు. గతంలో తక్కువ ఆదాయపు పన్ను చెల్లించారు, ఇప్పుడు రెట్టింపు ఛార్జ్ పడింది అంటారు. గుర్తింపు చోరీ సైబర్ దాడి చేసే వ్యక్తులు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, చిరునామా, డెబిట్/ క్రెడిట్ కార్డ్ వివరాలు, యుపిఐ, పిన్ నంబర్ మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లాభాలను పొందడానికి ఈ సమాచారం సేకరిస్తారు. దాడుల్లో రకాలు వీటిలో తరచుగా సీనియర్ డేటింగ్, ప్రిస్క్రిప్షన్ మాత్రలు, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు, పెట్టుబడి లేదా ఛారిటీ స్కామ్‌లు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి నకిలీ ఆర్థిక సహాయ అభ్యర్థనలకు సంబంధించిన మోసాలు ఉంటాయి. చాలా మంది సీనియర్లు ఇలాంటి మోసాలకు లోనవడానికి పెద్ద కారణం ఒంటరితనం, జ్ఞానం లేకపోవడమే. భద్రతా చిట్కాలు ►తెలియని వారి నుంచి వచ్చే ఇ–మెయిల్‌లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీకు తెలిసిన వ్యక్తుల నుండి వచ్చినవి అయినప్పటికీ, వింత లేదా ఊహించని సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇ–మెయిల్లు, వాట్సప్ సందేశాలు లేదా ఎసెమ్మెస్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు అన్నీ హానికరమైన ఫైల్స్‌ను కలిగి ఉండే చిన్న లింక్‌లతో ►పంపినవారు మీకు తెలిసినవారే అని దృఢపరుచుకునేవరకు ఏ లింక్‌లను ఓపెన్ చేయవద్దు. స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల నుండి ఆ మెసేజ్ వచ్చినట్లు కనిపిస్తే, వారు మీకు ఏదైనా పంపినట్లు నిర్ధారించుకోవడానికి తిరిగి వారినే సంప్రదించండి. ►అనుమానిత ఫోన్ కాల్స్, రోబోకాల్స్‌ను రిసీవ్ చేసుకోకండి. కాలర్ తాను ‘‘టెక్ సపోర్ట్‘ నుండి మాట్లాడుతున్నట్టు మీతో చెప్పవచ్చు. మీ కంప్యూటర్‌కు వైరస్ సోకిందని, రిపేర్ ఉందని మీకు తప్పుగా చెప్పవచ్చు. మీరు టాక్స్ డిఫాల్టర్ లేదా పెన్షన్ ప్రాసె సింగ్ లేదా కెవైసీ కోసం అడుగుతున్న బ్యాంక్ అధికారి అని కూడా చెప్పవచ్చు. పెన్షన్ ఫండ్ మొదలైన వాటి ప్రాసెసింగ్ అని చెప్పవచ్చు. ►మీ ఫోన్ లేదా కంప్యూటర్లోని పాప్అప్ విండోలకు ప్రతిస్పందించవద్దు లేదా దానిపై క్లిక్ చేయవద్దు. మీ కంప్యూటర్ లేదా ఫోన్లో ‘అత్యవసర‘ పాప్అప్ విండో కనిపిస్తుంది. మీ డిజిటల్ పరికరానికి రిపేర్ అవసరమని లేదా ఒక ఫోన్‌ను ఆఫర్లో ‘మరొక ఫోన్‌ను పొందండి’ అంటూ మీలో ఆశను కలిగిస్తాయి. మీ కంప్యూటర్ సిస్టమ్‌కి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయమని అడగవచ్చు. ►అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని వాటిని డౌన్లోడ్ చేసే సమయంలో సురక్షిత బ్రౌజింగ్ పద్ధతులను అనుసరించండి. మీకు తెలిసిన సీనియర్స్‌కి విశ్వసనీయ వెబ్సైట్లను మాత్రమే సందర్శించమని, వారు సురక్షితమైన సైట్లో ఉన్నారని నిర్ధారించుకోవడానికి httpr://(ప్యాడ్ లాక్ సింబల్) కోసం చూడాలని సలహా ఇవ్వండి. ►రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్లు భద్రతా లోపాలను పరిష్కరించగలవు. వారి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వంటి పరికరాలు, సాఫ్ట్వేర్లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయమని సీనియర్లను ప్రోత్సహించండి. ►యాప్స్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ►ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను (ప్రత్యేక అక్షరాలు, పెద్ద అక్షరాలు, సంఖ్యాపరమైనవి) ఉపయోగించమని వృద్ధులను ప్రోత్సహించండి. వారి పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి సులభంగా ఊహించదగిన సమాచారాన్ని ఉపయోగించవద్దు. ►తెలియని వ్యక్తులతో మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లతో రిమోట్ స్క్రీన్ షేరింగ్ చేయకండి. ►అన్ని ఇ–మెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాల కోసం రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. మోసపోతే ఏం చేయాలంటే.. ఈ టోల్ ఫ్రీ నంబర్ 1930కి వెంటనే (ఒక గంటలోపు) ఫోన్ చేయండి. దీని ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ 1930 సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. దీనికి బదులుగా మీరు మీ స్థానిక సైబర్ క్రైమ్ పోలీసు అధికారుల వద్ద జరిగిన మోసం చెప్పి కంప్లయింట్ ఇవ్వచ్చు. లేదా httpr://www.cybercrime. gov.in లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ నుండి దూరంగా ఉండాలంటే.. ►మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్లను నిలిపి వేయండి. ►మీ పడకగది, భోజనాల గదిని స్మార్ట్‌ఫోన్ రహిత జోన్‌గా మార్చండి. ►మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ నుండి సోషల్ మీడియాను యాక్సెస్ చేయండి. ►ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడం కోసం ఆండ్రాయిడ్‌లో డిజిటల్ వెల్బీయింగ్ యాప్, ఐఓఎస్‌లో స్క్రీన్ టైమ్ యాప్‌ని ఉపయోగించండి. ►ప్రజలు తమ స్క్రీన్ వినియోగ సమయం పెరుగుతోందని భావిస్తే గ్రే స్కేల్ మోడ్ ఫీచర్‌ని ఉపయోగించండి -
సైబర్ క్రైమ్ వలలో ఐసీసీ.. 20 కోట్ల నష్టం
క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషించే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సైబర్ క్రైమ్ చిక్కుకున్నట్లు సమాచారం. గత ఏడాది ఆన్లైన్ మోసం కారణంగా ఐసీసీ 2.5 అమెరికన్ మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 20 కోట్లు) నష్టపోయినట్లు ఒక వెబ్సైట్ కథనం ప్రచురించింది. అమెరికా స్థావరంగా ఫిషింగ్ మెయిల్ స్కామ్ జరిగినట్టు సమాచారం. ఈ విషయంపై ఐసీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సమాచారం ప్రకారం ఐసీసీ ఫిర్యాదు మేరకు ఎఫ్‌బీఐ(FBI) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐసీసీ అకౌంట్ నుంచి నేరగాళ్లకు డబ్బు ఎలా చేరిందనేది కచ్చితంగా తెలియరాలేదు. బిజనెస్ మెయిల్ తరహాలో సందేశాన్ని పంపి.. సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఐసీసీకి చెందిన కన్సల్టెంట్ అంటూ సంస్థకు కుచ్చుటోపీ వేసినట్లు తెలుస్తోంది. సదరు కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఐడీతో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు మెయిల్ చేశారట. ఆ మెయిల్లో 5 లక్షల డాలర్ల విలువైన వోచర్‌ను క్లియర్ చేయాలని కోరారు. ఏ ఖాతాకు ఆ సొమ్మును పంపాలో ఆ అకౌంట్ వివరాలు కూడా పంపించారు. దీంతో ఐసీసీ ఫైనాన్స్ విభాగం ఆ వోచర్‌ను క్లియర్ చేసింది. ఆ తర్వాత మరో రెండు, మూడు సార్లు ఇలాంటి టెక్నిక్‌తోనే సైబర్ నేరగాళ్లు డబ్బును కాజేసినట్లు తెలుస్తోంది. ఈ తరహా మోసాలను బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ (బీఈసీ) ఫిషింగ్ అంటారు. చదవండి: 'మంచి భవిష్యత్తు'.. చహల్‌ను టీజ్ చేసిన రోహిత్ శర్మ Usain Bolt: బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం -
మిస్డ్ కాల్స్ ఇచ్చి రూ.50 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
మొబైల్‌కు వచ్చిన ఓటిపీ చెప్పమని అడిగి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గురించి విన్నాం. కానీ ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో ఆన్లైన్ నేరగాళ్లు ఓటీపీ అవసరం లేకుండానే రూ.50 లక్షలు కొల్లగొట్టారు. కేవలం ఫోన్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చి బ్యాంకు ఖాతా నుంచి పలుమార్లు నగదు బదిలీ చేశారు. దీంతో బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 19న ఢిల్లీలోని ఓ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ ఎండీకి కొత్త నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. అదే నంబర్ నుంచి పదే పదే కాల్ వస్తోంది. కొన్ని సార్లు ఆయన కాల్ లిఫ్ట్ చేసినా అవతలి వ్యక్తి మాట్లాడలేదు. అయితే కాసేపటికే ఆయన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలు మాయమయ్యాయి. రూ.12లక్షలు ఒకసారి, రూ.10 లక్షలు ఒకసారి, రూ.4.6 లక్షలు ఒకసారి.. ఇలా పలుమార్లు ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ ద్వారా అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఇతర అకౌంట్లలలోకి వెళ్లిపోయాయి. దీంతో అతడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 'సిమ్ స్వాపింగ్' టెక్నిక్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. నకిలీ సిమ్ కార్డు సృష్టించి దానితోనే లావాదేవీలు జరిపి ఉంటారని పేర్కొన్నారు. బహూశా జార్ఖండ్ జంతారాకు చెందిన నేరగాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. నగదు బదిలీ అయిన అకౌంట్లు కూడా వాళ్లవి కాదని పేర్కొన్నారు. -
టెలిగ్రామ్ యాప్ వల్ల ఎన్నో ప్రయోజనాలు! కానీ.. ఇలా చేశారంటే మాత్రం!
Cyber Crime Prevention Tips In Telugu: టెలిగ్రామ్ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్రాస్–ప్లాట్‌ఫారమ్ మెసేజింగ్ అప్లికేషన్. ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఇది మెరుగైన గోప్యత, ఎన్క్రిప్షన్ లక్షణాలతో పాటు రెండు లక్షల మంది సామర్థ్యం వరకు పెద్ద గ్రూప్ చాట్ ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. టెలిగ్రామ్ తన వినియోగదారులకు మీడియా పరిమాణాలపై పరిమితులు లేకుండా అనేక ఫీచర్లను అందిస్తుంది. ప్రయోజనాలు (ఎ) వాట్సాప్ గ్రూప్‌లలో 256 మంది సభ్యుల వరకు ఉండచ్చు. అదే, టెలిగ్రామ్ అయితే రెండు లక్షల మంది ఒక గ్రూప్‌గా ఉండవచ్చు. (బి) టెలిగ్రామ్ ప్రాథమికంగా మీరు రహస్యంగా ఎంచుకున్న సంభాషణలను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఇది మీ గోప్యతను మెరుగుపరుస్తుంది. (సి) టెలిగ్రామ్ యాప్ పూర్తిగా ఉచితం. టెలిగ్రామ్‌లో బాధించే ప్రకటనలు ఉండవు (డి) మెసేజ్‌లను పంపిన వారికి, వాటిని స్వీకరించిన వారికి భద్రత ఉంటుంది. స్కామ్‌లు టెలిగ్రామ్ స్కామ్‌లు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో జరుగుతాయి లేదా మెసేజింగ్ అప్లికేషన్ నుండి వినియోగదారులను ప్రమాదకరమైన థర్డ్ పార్టీ సైట్లు, అప్లికేషన్ లలోకి లాగుతాయి. టెలిగ్రామ్‌కు విస్తృతమైన ఆమోదం, వాడుకలో సౌలభ్యం కారణంగా స్కామర్లు జొరబడతారు. చాలా సార్లు, స్కామర్లు తమను తాము చట్టబద్ధమైన ఏజెంట్లుగా లేదా వివిధ కార్పొరేషన్ల ఉద్యోగులుగా చూపించుకోవడం చూస్తుంటాం. స్కామర్లు తరచుగా బాధితులను ఆకర్షించడానికి ప్రముఖ ఛానెల్‌ల నకిలీ/నకిలీ వెర్షన్లను సృష్టిస్తారు. ఈ గ్రూప్‌లు ఒకే విధమైన పేర్లు, ప్రొఫైల్ చిత్రాలను కలిగి ఉంటాయి. అదే పిన్ చేయబడిన సందేశాలను కలిగి ఉంటాయి. దాదాపు చట్టబద్ధమైన వాటితో సరిపోలే వినియోగదారు పేర్లతో ఉంటాయి. ప్రమోషన్లు, ఉచిత బహుమతులు, ఎమ్ఎల్ఎమ్ ఆధారిత పథకాలతో కూడిన స్కామ్‌లకు ప్రజలు బలైపోతుంటారు. స్కామర్లు సమస్యను పరిష్కరించడానికి మీ ల్యాప్‌టాప్ లేదా పరికరం రిమోట్ కంట్రోల్ తీసుకోవాలని తరచూ అడుగుతారు. ఈ ప్రక్రియలో మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తారు. ఎ) బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ స్కామ్‌లు నాణేలు, డబ్బు లేదా ఖాతా లాగిన్ల నుండి బాధితులను స్కామ్ చేయడానికి స్కామర్లు టెలిగ్రామ్‌లో తమను తాము క్రిప్టో నిపుణులుగా చెప్పుకుంటారు. తమను తాము నిపుణులుగా చూపిస్తూ, వారు బాధితుల క్రిప్టో పెట్టుబడులపై హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు. వారి స్కామ్‌లో భాగంగా, వారు తమ పెట్టుబడి పెరుగుతున్నట్లు చూపే బాధితుల చార్ట్‌లు, గ్రాఫ్‌లను చూపుతారు (ఈ సభ్యులలో ఎక్కువ మంది నకిలీ లేదా చెల్లించిన సోషల్ మీడియా నిపుణులు). బాధితుడు వాలెట్ లేదా డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శించిన విధంగా వారి ఆదాయాలను ఉపసంహరించుకోలేరు. ఆ సమయంలో స్కామర్లు అదృశ్యమవుతారు. గ్రూప్‌లలో ఎప్పుడూ స్పందించరు. బి) బాట్లను ఉపయోగించి ఫిషింగ్ టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో బాట్లను నిర్మించే, ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎపిఐ ఉండటం వలన, వారు రియల్ సంభాషణలలో పాల్గొంటారు. దీంతో మీరు స్కామ్‌కి గురవుతున్నారో లేదో చెప్పడం కష్టం. అంటే, ఒక నకిలీ బాట్, బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు అప్లికేషన్ల నుండి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఈ బాట్ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా లాగిన్లు, పాస్వర్డ్లు, క్యూ ఆర్ కోడ్లను కూడా వదులుకోమని వినియోగదారుని కాల్ చేస్తుంది, ఒప్పిస్తుంది. సి) టెక్ సపోర్ట్ స్కామ్‌లు ఈ స్కామ్‌లో స్కామర్లు చట్టబద్ధమైన టెక్ సపోర్ట్ ఏజెంట్లలా నటిస్తుంటారు. స్కామర్లు సమస్యను పరిష్కరించడానికి బాధితుల ల్యాప్‌టాప్ లేదా పరికరాన్ని రిమోట్ కంట్రోల్‌గా తీసుకుంటారు. ఈ ప్రక్రియలో బాధితుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తారు. డి) రొమాన్స్/ సెక్స్టార్షన్ స్కామ్‌లు సోషల్ మీడియా నిషేధించిన సాన్నిహిత్యాలు, నిషేధించిన ప్రవర్తనలలో పాల్గొనడానికి అవకాశాన్ని సృష్టిస్తుంది. స్కామర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆన్లోలైన్లో వినియోగదారుతో నమ్మకాన్ని పొందేందుకు వారితో సంబంధాన్ని ప్రారంభిస్తారు. బాధితులు తమకు సున్నితమైన ఫొటోలు లేదా వీడియోలను పంపమని అడుగుతారు, ఆ పై వారు బ్లాక్మెయిల్ కోసం ఉపయోగిస్తారు. ఇతర రకాల శృంగార మోసాలు (ఎ) ప్రతిపాదనలతో దోపిడి. (బి) అందమైన స్త్రీ లేదా పురుషుడు. (సి) గే మ్యాన్ పే మేకింగ్. టెలిగ్రామ్ యాప్‌లో భద్రతా చిట్కాలు ఎ) మీ అన్ని రకాల పాస్‌వర్డ్‌లకు కనీసం 10 పెద్ద, చిన్న అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాలు, ప్రత్యేకమైనవి, ఊహించడానికి కష్టంగా ఉండేలా నిర్వహణకు ఉపయోగించడాన్ని పరిగణించండి. బి) తెలిసిన మూలాల ద్వారా పంపబడినప్పటికీ, https://www.unshorten.it లేదా https://www.checkshorturl.com ను ఉపయోగించి సంక్షిప్త URLs / Links ధృవీకరించండి సి) తెలియని పరిచయాల ద్వారా పంపబడిన అటాచ్‌మెంట్స్‌ను క్లిక్ చేయడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి ముందు https://www.isitphishing.org or https://www.urlvoid.com వెబ్‌లింక్ ద్వారా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. డి) వినియోగదారు ప్రొఫైల్‌కి వెళ్లి, మీ స్క్రీన్ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, ‘యూజర్ బ్లాక్‘ ని ఎంచుకోండి. ఇ) స్కామ్ ఖాతా స్క్రీన్‌షాట్, ఏదైనా ఇతర సమాచారాన్ని టెలిగ్రామ్‌లోని@notoscam పంపండి. లేదా ప్రత్యామ్నాయంగా ఇమెయిల్:abuse@ telegram.orgకి పంపవచ్చు. చదవండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి -
ఆన్లైన్లో రూ.10 లక్షలు పెట్టుబడి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
సాక్షి, మెదక్: ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఓ సాఫ్ట్వేర్ అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్పూర్ పరిధి కేఎస్ఆర్ కాలనీకి చెందిన సాయిపవన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఇటీవల ఆన్లైన్లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో 14వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన వారిని, బంధువులను విచారించినా అతడి ఆచూకీ లభించలేదు. తమ్ముడి అదృశ్యంపై అన్న మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చెత్తను శుభ్రం చేస్తుండగా కదలికలు.. తీరా చూస్తే! -
కోట్లు వచ్చేలా చేస్తాం.. రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా!
హిమాయత్‌నగర్: షేర్ మార్కెట్‌పై నగర వాసికి ఉన్న మక్కువను క్యాష్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఆయన అకౌంట్‌ను హ్యాక్ చేసి తెలియకుండా అతి తక్కువ ధరకు షేర్స్‌ను అమ్మేశారు. మళ్లీ షేర్ హోల్డర్‌తోనే ఎక్కువ రేట్‌కు షేర్స్‌ను కొనుగోలు చేపించి రూ.లక్షలు నష్టపోయేలా చేయడంతో.. బాధితుడు శుక్రవారం సిటీసైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నల్లకుంటకు చెందిన హరీష్‌చంద్రారెడ్డి కొంతకాలంగా షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నాడు. షేర్స్‌ను కొనుగోలు చేసి ఎల్ఐఎస్బ్లూ ఫైనాన్షియల్ త్రూ అమ్మడం, కొనడం చేస్తుంటాడు. ఈ క్రమంలో పరిచయం అయిన సైబర్ కేటుగాళ్లు హరీష్‌చంద్రారెడ్డి అకౌంట్‌ను హ్యాక్ చేశారు. రూ.700 విలువ గల షేర్స్‌ను కేవలం రూ.100కు ఇతరులకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న హరీష్‌చంద్రారెడ్డి వెబ్సైట్లో ఉన్న వారిని ప్రశ్నించగా.. కోట్లు వచ్చేలా చేస్తామని నమ్మించారు. లాభాలు లేని వాటిని రూ.700–800 చొప్పున కొనుగోలు చేయించారు. ఇలా పలు దఫాలుగా కేవలం రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా చేశారు. మోసపోయినట్లు గుర్తించిన హరీష్‌చంద్రారెడ్డి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. మీ డబ్బంతా ఏజెంట్ తినేశాడంటూ.. వృద్ధుడికి రూ.25లక్షలు టొకరా ఇన్సురెన్స్ ఎక్స్పైరీ అయినా సరే..సైబర్ కేటుగాళ్లు మాత్రం అమాయకుల్ని వదలట్లేదు. మీకు రావాల్సిన దానికంటే తక్కువ డబ్బును పొందారు. మీకేం బాధ అనిపించడం లేదా అంటూ సింపతితో లక్షలు కాజేశారు. కుల్సుంపురాకు చెందిన వృద్ధుడు రెండు సంస్థల్లో ఇన్సురెన్స్ చేశాడు. అది చాలా కాలం క్రితం ఎక్స్పైరీ కూడా అయ్యింది. తాజాగా రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కాల్ చేసి ఆధార్, పాన్, బ్యాంక్ డిటైల్స్ తీసుకున్నాడు. కొంత డబ్బు కట్టాలనడంతో వృద్ధుడు చెల్లించాడు. రూ.3 లక్షలు వస్తాయని నమ్మించి పలు దఫాలుగా అతడి నుంచి రూ.25లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీసైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్ -
Cyber Crime: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ ఉందా?! మీకున్న ఆదరణను బట్టే..
సోషల్ మీడియా వేదికగా బ్లూ టిక్ మేనియా గురించి మనకు తెలిసిందే. దీని ఆధారంగానే మన సందేశం లేదా ఫొటో అవతలి వారు చూశారు అన్నది తెలిసిపోతుంది. మన ఆలోచనలను ప్రదర్శించడానికి, షేర్ చేయడానికి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వేదిక ఇన్స్టాగ్రామ్. ఇది ఒక బిలియన్ కంటే ఎక్కువ ఉన్న వినియోగదారులతో కూడిన భారీ ప్లాట్‌ఫారమ్. అలాగే స్కామ్‌లు కూడా అంతే స్థాయిలో జరుగుతుంటాయి. అందులో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రాబట్టడానికి, గివ్ అవే, రొమాన్స్ వంటి స్కామ్‌లకు పాల్పడటానికి స్కామర్లు రకరకాల మోసాలకు పాల్పడుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ పొందిన ప్రొఫైల్స్ అధికంగా ఉంటాయి. వాటికి ఉన్న ఆదరణను బట్టి సైబర్ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. వారు మిమ్మల్ని ఆపరేట్ చేసేలా మారవచ్చు. మిమ్మల్ని మోసగించడానికి, మీ డబ్బును దొంగిలించడానికి, కొత్త మోసపూరిత మార్గాలను ఆలోచించడానికి అనువైన అవకాశాల కోసం పొంచి ఉంటారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ యూజర్ల ఆసక్తి, ఆశను ఉపయోగించుకుని చేసే ఈ మోసాలను అడ్డుకోవడానికి ఎవరికి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కామర్ల అంతిమ లక్ష్యం మీ ఖాతా నుంచి డబ్బు కోసం మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం లేదా మీ పరువు తీయడం. కొన్ని సాధారణ మోసాలు : (ఎ) మీ పాస్‌వర్డ్‌ను మార్చడం, మీ స్వంత అకౌండ్ నుండి మిమ్మల్ని లాక్ చేయడం (బి) వ్యక్తిగత డేటాను దొంగిలించడం (అనగా, ఫోన్ నంబర్, ఇ–మెయిల్, అనుచరుల వివరాలు మొదలైనవి). (సి) స్కామ్ ప్రకటనలను పోస్ట్ చేయడం (డి) మీలా నటించి, మీ అనుచరులకు మాల్వేర్ ప్రభావిత లింక్‌లను పంపడం (ఇ) మీలా నటించి, డబ్బు కోసం మీ అనుచరులకు సందేశాలు పంపడం. ఇన్స్టాగ్రామ్ మోసాలలో కొన్ని: ఫిషింగ్ స్కామ్‌లు: స్కామర్లు మీకు అనుమానాస్పద లింక్‌లను ఇన్స్టాగ్రామ్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ లేదా ఇ–మెయిల్ ద్వారా పంపుతారు. దీని ద్వారా మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు అనుమతి పొందడానికి ప్రయత్నిస్తారు. అక్కడ బాధితులు నకిలీ ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజీలో యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఇవ్వడం ద్వారా మోసపోతారు. స్కామర్లు మీ లాగిన్ వివరాలను తెలుసుకుని ఉంటే, వారు మీ వ్యక్తిగత సమాచారాన్ని (అంటే ఫోన్, ఇ–మెయిల్ మొదలైనవి) యాక్సెస్ చేయవచ్చు లేదా మార్చవచ్చు. మీ సొంత ఖాతా నుండి మిమ్మల్ని లాక్ చేయడానికి మీ పాస్‌వర్డ్‌ను కూడా మార్చవచ్చు. కొన్ని ఫిషింగ్ వ్యూహాలు: (ఎ) ఇన్స్టాగ్రామ్ నుండి అధికారిక కాపీరైట్ ఉల్లంఘన హెచ్చరికలుగా పేర్కొంటున్న సందేశాలను పంపడం (బి) నకిలీ ఇన్ ఫ్లుయెన్సర్ స్పాన్సర్లు, స్కామర్లు ఒక బ్రాండ్‌గా నటిస్తారు. ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రకటనల ఒప్పందాన్ని అందిస్తారు. (సి) ఇన్స్టాగ్రామ్ నుండి బ్లూ టిక్ నిర్ధారణకు కేవైసీ ఉపయోగిస్తారు. పైన పేర్కొన్న అన్ని సందర్భాల్లో, మీకు చిన్న లింక్‌లు పంపి, మీ వివరాల యాక్సెప్టెన్సీ కోరుతారు. రొమాన్స్ స్కామ్‌లు: స్కామర్లు నకిలీ ఆన్ లైన్ ఖాతా నుంచి మీతో సంభాషణను కొనసాగిస్తారు. కాలక్రమేణా బాధితుడితో నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆపై వారి నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తారు. అనుకున్న లక్ష్యం చేరాక స్కామర్ వీసాలు, విమానాలు, ప్రయాణ ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు.. ఇలా అన్నింటిని కోసం డబ్బు అడగడం ప్రారంభిస్తాడు. బహుమతుల స్కామ్‌లు : ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు తరచుగా బహుమతులను ఇస్తారు. కొంతమంది అదృష్ట విజేతలకు ఉచిత ఉత్పత్తులు లేదా సేవలను అందిస్తారు. ఫాలోవర్లు డిజైనర్ దుస్తులు, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ పాడ్లు మొదలైనవాటిని గెలుచుకునే అవకాశం ఉంది. (బహుమతులను స్వీకరించడానికి, బాధితుడు షిప్పింగ్ రుసుము చెల్లించాలి లేదా చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించగల వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి). నకిలీ అమ్మకాలు: ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ/రెప్లికా వస్తువులను అమ్మడం అనేది ఒక భారీ స్కామ్. ఇది వినియోగదారు ఖాతాలు, ప్రకటనలలో బలంగా ఉంటుంది. కొనుగోలుదారులు త్వరగా పని చేయడానికి వారు అత్యవసరాన్ని (అంటే పరిమిత కాలపు ఆఫర్లు) సృష్టిస్తారు. స్కామర్లు ఎక్కువగా సురక్షితంగా లేని పద్ధతుల ద్వారా చెల్లింపును అభ్యర్థిస్తారు. ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు: కేవలం చిన్న పెట్టుబడికి గొప్ప రాబడిని ఇస్తామని మీకు వాగ్దానం చేస్తారు. డబ్బు చెల్లించేంతవరకూ అందించిన యాక్సెస్ (అంటే, వెబ్సైట్ లేదా యాప్) వాస్తవికంగా కనిపిస్తుంది, బాగా పని చేస్తుంది కూడా. అయితే ఇది పూర్తిగా నకిలీ, మీ పెట్టుబడులు బాగా పని చేస్తున్నాయని, మీరు వదులుకోలేని విధంగా నకిలీ డేటాను ప్రొజెక్ట్ చేస్తుంది. వీటిలో ఎక్కువ భాగం పోంజీ పథకాలు, ఎగ్జిట్ స్కామ్‌లు ఉంటాయి. మన సామాజిక ప్రొఫైల్‌లలో మనకు ఎంత మంది అనుచరులు ఉన్నారు, వారి ఇష్టాలు ఏంటి అనే విషయాలను తరచూ చూస్తుంటాం. దీని ఆధారంగా స్కామర్లు వారి నుంచి ప్రయోజనాన్ని పొందే విధంగా తమ ఉత్పత్తులు లేదా ప్రకటనలను విడుదల చేస్తుంటారు. ఎక్కువ లైక్‌లు, ఫాలోవర్లను పొందేందుకు నామమాత్రపు ధరలకు వస్తువుల్ని, సేవలను ఆఫర్ చేస్తుంటారు. ఈ వాగ్దానాలు చాలా వరకు నిజం కావని నమ్మాలి. స్కామర్‌ని ఇలా గుర్తించండి ►స్కామర్లు నకిలీ ఖాతా ఉన్నవారై, మీ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నట్టు చూపుతారు. ►వీరి లిస్ట్‌లో చాలా తక్కువ మంది అనుచరుల సంఖ్య ఉంటుంది. ►అకౌంట్ లేదా లింక్‌లో సాధారణ వ్యాకరణం లేదా భాషా లోపాలను ఉంటాయి. ►చాలా ప్రొఫైల్‌లు ఇటీవల కొత్తగా క్రియేట్ చేసినవై ఉంటాయి. ►బహుమతిని అందుకోవడానికి డబ్బు (అడ్వాన్స్ ఫీజు లేదా రిజిస్ట్రేషన్ ఫీజు) పంపమని అడుగుతారు. ►ప్రొఫైల్స్ ఫీడ్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ►వారి ఇ–మెయిల్ ఖాతాతో మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. ► కొన్నిసార్లు ఇ–మెయిల్ ఖాతాల నుండి కాకుండా టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా వివరాలను అడుగుతారు. సురక్షితంగా ఉండటానికి... ►బలమైన సంక్లిష్ట పాస్‌వర్డ్‌ను (సంఖ్య , పెద్ద అక్షరాలు, ప్రత్యేక అక్షరాలతో) సెట్ చేయండి. ►∙ధ్రువీకరించబడిన బ్రాండ్ అకౌంట్ల నుండి మాత్రమే షాపింగ్ చేయండి. ►మీ లాగిన్ కార్యకలాపాలను తరచుగా పర్యవేక్షించండి. ►మీరు ఇచ్చిన థర్డ్ పర్సన్ యాక్సెస్‌ను తరచుగా సమీక్షించండి. ►ఇన్ స్టాగ్రామ్‌లో నేరుగా లాగిన్ అవ్వండి. ధ్రువీకరించని థర్డ్ పార్టీ యాప్‌లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. ►వచ్చిన షార్ట్ లింక్స్‌ను https://isitphishing.org/, https://www.urlvoid.com/ లో చెక్ చేయండి. ►మీ గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి. సరిగా లేని కంటెంట్ ఏదైనా ఉంటే దానిని https://help.instagram.com/116024195217477 కి రిపోర్ట్ చేయండి. https://help.instagram.com/192435014247952 తెలియజేయండి. పేజీ హ్యాక్ అయితే, దానికి సంబంధించిన సాయం కోసం https://help.instagram.com/368191326593075 , చదవండి: హైదరాబాద్ ఝాముండ: ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల వీడియోలతో ఆగడాలు -
Online Fraud: ఒక్క క్లిక్‌తో రూ.1.68 లక్షలు మాయం
ముంబై: ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని విధాల ప్రజలకు అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతోంది. రోజుకో కొత్త రూపంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు దుండగులు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. విద్యుత్తు బిల్ గురించి వచ్చిన ఓ ఫేక్ మెసేజ్‌పై ఒక్క క్లిక్‌తో ఓ వ్యక్తి రూ.1.68 లక్షలు పోగొట్టుకున్నారని నాగ్‌పూర్ పోలీసులు శనివారం వెల్లడించారు. మహారాష్ట్ర ఆధ్వర్యంలోని ఓ బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న రాజేశ్ కుమార్ ఆవధియా(46)కు ఆగస్టు 29న మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. విద్యుత్తు బిల్ చెల్లించనందున మీ పవర్ సప్లయ్ నిలిపేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. బిల్ కట్టేందుకు కింది యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని అందులో సూచించారు నేరగాళ్లు. దాంతో ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ‘మెసేజ్‌లో సూచించిన లింక్‌పై క్లిక్ చేయగానే రెండు బ్యాంకు ఖాతాల్లోని రూ.1.68 లక్షలు మాయమయ్యాయి. ఐపీసీలోని చీటింగ్, ఐటీ యాక్ట్‌లు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.’ అని ఖపెర్ఖేడా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: రూ.6 కోట్ల దోపిడీ కేసు.. రూ.100 పేటీఎం బదిలీతో దొరికిపోయారు! -
Hyderabad: కేటుగాళ్ల వలలో హైదరాబాదీ.. రూ.62 లక్షలు గోవిందా!
గచ్చిబౌలి: మార్కెట్ బాక్స్... అదో నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్. ఆ యాప్‌లో రిజిస్టర్ అయి లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ఉసిగొల్పి అందిన కాడికి దండుకొని బిచాణ ఎత్తేశారు. ఇలా మోసాలకు పాల్పడిన నలుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైంలో దేశంలోనే మొదటిసారిగా రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముగల్‌సరాయ్‌కి చెందిన కమోడిటీ ట్రేడర్ అభిషేక్ జైన్ (32) మార్కెట్ బాక్స్ అనే ఫేక్ ట్రేడింగ్ యాప్‌ను రూపొందించాడు. వాట్సాప్, టెలి గ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. దేశవ్యాప్తంగా వేలాది మంది రిజిస్టర్ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి తొలుత రూ.10 లక్షలు ఇందులో పెట్టగా, తిరిగి రూ.14.9 లక్షలు వచ్చా యి. దీంతో ఆయన ఈసారి రూ.62 లక్షలు పెట్టా రు. అయితే, కేవలం రూ.34.7 లక్షలే వచ్చాయి. రూ.27 లక్షలకుపైగా నష్టం వచ్చింది. దీంతో 2021 డిసెంబర్ 4న సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేసి యూపీ, రాజస్తాన్‌కు చెందిన ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. ఇలా వేలాది మందిని మోసగించిన అభిషేక్ జైన్‌తోపాటు కృష్ణ కుమార్ (38), పవన్ కుమార్ ప్రజాపట్ (35), ఆకాశ్‌రాయ్ (39)లను అరెస్ట్‌చేశారు. ఉన్నది లేనట్లుగా చూపించి... మార్కెట్ బాక్స్‌లో మూడువేల మంది రిజిస్టర్ అయ్యారని సీపీ స్టీఫెన్ చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో రిజిస్టర్ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా లాభాల్లో ఉన్నట్లు కనిపించేలా చూపిస్తారన్నారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు ఇచ్చి నమ్మకాన్ని చూరగొంటారని, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన తరువాత డబ్బు లు కాజేస్తారని వివరించారు. వివిధ బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి ఒకచోట ఉంచారని, యూపీ పోలీసుల సహకారంతో రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమావేశంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, ఏడీసీపీ రితురాజ్, ఏసీపీ శ్రీధర్, సీఐలు శ్రీనివాస్, అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. -
టెక్ట్స్ మెసేజ్‌తో వల.. ఆపై..! వాట్సాప్ స్కామ్.. చా(చీ)టింగ్! భద్రతా చిట్కాలు ఇవి!
తెలియని వ్యక్తులతో చేసే చాటింగ్‌లు, సీనియర్ అధికారుల ఫొటోలను ఉపయోగించి డిజిటల్ ప్రొఫైల్స్‌ని సృష్టించడం, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని కోరడం, లింక్స్ ద్వారా వివరాలను రాబట్టడం, స్క్రీన్ షేరింగ్‌లు చేయించడం.. వంటి ఎన్నో మోసాలకు వాట్సాప్ అతి పెద్ద వేదికయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్ ఫేస్బుక్ తర్వాత అందరూ అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్‌లలో రెండవది. అయితే, అన్ని ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌ల మాదిరిగానే మోసగాళ్లు, దొంగల రూపంలో కూడా వాట్సాప్ ద్వారా ప్రమాదం పొంచి ఉంది. వాట్సాప్ ప్రధాన ఫీచర్ టెక్ట్సింగ్ అయితే, వాట్సాప్ మిమ్మల్ని స్టేటస్‌లను క్రియేట్ చేయడానికి, వాయిస్ మెసేజ్‌లను పంపడానికి, మీ లొకేషన్‌ను షేర్ చేయడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌కు ఉన్న ఆదరణ వల్ల మీ ఫోన్ నంబర్ తెలిసిన ఎవ్వరైనా మీకు మెసేజ్ పంపవచ్చు. మోసం చేయడానికి కూడా. తాజా వాట్సాప్ స్కామ్‌ల గురించి తెలుసుకుంటే ఇబ్బందులను నివారించుకోవచ్చు. టెక్ట్స్ మెసేజ్‌తో వల మోసగాళ్లు అధికారిక వెబ్సైట్ నుండి సంస్థ, ఉద్యోగుల గురించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత, ఏదైనా వెబ్సైట్, సోషల్ మీడియా సైట్లు, ఇ–మెయిల్, మెసెంజర్ యాప్ మొదలైన వాటి నుండి సీనియర్స్ ఫొటోలను సేకరిస్తారు. కింది అధికారులను మోసగించడానికి వాటిని ఉపయోగిస్తారు. మోసగాడు మొదట నమ్మదగిన సంభాషణను ప్రారంభిస్తాడు. వారి ఫోన్ పోయిందనో, పాడైపోయిందనో కొత్త ఫోన్ నుండి మెసేజ్ చేస్తున్నట్టు చెబుతారు. చెప్పిన ఖాతాకు డబ్బును బదిలీ చేయమని అడిగే ముందు, తమకు డబ్బు ఇబ్బంది ఉందని, చాలా అర్జంట్ అని చెబుతారు. వాట్సాప్ వెరిఫికేషన్ స్కామ్ యాప్‌ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లేదా తిరిగి లాగిన్ చేస్తున్నప్పుడు, మీరు మీ వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే మీ మొబైల్ ఫోన్ కి ఆరు అంకెల కోడ్‌ని సెట్ చేసుకోవాలి. మీరు ఈ ధృవీకరణను ఓకే చేస్తే మీ ఖాతాను వేరొకరు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు లేదా మీ ఫోన్ యాక్సెస్‌ని కలిగి ఉన్నట్లు ఎరుపు రంగు ఫ్లాగ్ వస్తుంది. మీ ఖాతా సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి వచ్చే మీ ఎసెమ్మెస్ కోడ్‌ను ఎప్పుడూ షేర్ చేయకండి. వాట్సాప్ గోల్డ్ వాట్సాప్ గోల్డ్ మెంబర్షిప్ అనేది కొన్నేళ్లకు ఒకసారి వస్తున్న వాట్సాప్ స్కామ్. దీంట్లో ప్రముఖులు, ఉన్నత ప్రొఫైల్ అకౌంట్స్ కోసం రూపొందించిన మెసేజ్‌లు చూడవచ్చు. మీరు అప్‌గ్రేడ్ చేయకపోతే మీ ఫోన్ హ్యాక్ చేయబడుతుందని స్కామర్లు హెచ్చరించే మెసేజ్‌లను కూడా చూస్తారు. అయితే, వాట్సాప్ నుండి అలాంటివేవీ రిలీజ్ కావని గ్రహించాలి. వారు ఇచ్చిన లింక్ ద్వారా మీ ఫోన్‌ను స్వాధీనం చేసుకునే లేదా మీ సమాచారాన్ని దొంగిలించే మాల్వేర్ అని గుర్తించాలి. వారి లింక్‌పై క్లిక్ చేయడం వలన మీకు, మీకు అనుబంధంగా ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారచ్చు. కూపన్ స్కామ్‌లు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బును పొదుపు చేయాలని కోరుకుంటారు. అయితే, మీకు ఇష్టమైన షాపింగ్ స్థలాలు, సూపర్ మార్కెట్లు, కూపన్లు, ప్రత్యేక ఆఫర్ల కోసం మీరు లింక్‌లపై క్లిక్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వాట్సాప్ గోల్డ్ మాదిరిగానే, లింక్‌లను ఓపెన్ చేయడం వలన సమస్యలకు దారి తీయవచ్చు. వాట్సాప్ స్కామ్‌ల సారాంశం ఈ సైబర్ నేరగాళ్లు పని విధానాన్ని తెలుసుకుంటే వారి ఉచ్చులో పడకుండా ఉండవచ్చు. ►స్కామర్ తన అత్యవసర విషయాన్ని మీకు తెలియజేస్తాడు. మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు లేదా త్వరగా చెల్లించమని ఒత్తిడి చేస్తాడు. ►మీకు తెలియని ఫోన్ నంబర్ నుంచి వాట్సాప్ సందేశాన్ని పంపుతాడు ►స్కామర్ తమ నంబర్ మారిందని మీకు తెలియజేస్తాడు. వెంటనే డబ్బు గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడు. ►మోసగాడి టెక్ట్స్ మెసేజ్‌లో గ్రామర్లేని ఇంగ్లిష్ వాక్యాలు ఉంటాయి. అంటే, మోసగాడి మాతృభాష ఇంగ్లిష్ కాదు. లేదా వారు బాగా చదువుకున్నవారు కాదు. ►ఒక తెలియని ఖాతాకు లేదా యాప్‌కు డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాడు. అకౌంట్ సెట్టింగ్ ►వాట్సాప్‌లో వేరొకరిలాగా నటించడం సులభం. మీరు ఎవరితో టెక్ట్స్ చేస్తున్నారో చెప్పడం కష్టం. ఎందుకంటే మీరు చూడగలిగేది ఫోన్ నంబర్, ప్రొఫైల్ ఫోటో మాత్రమే. అయితే, కొంతమంది వినియోగదారులు ప్రొఫైల్ ఫోటోలను అప్లోడ్ చేయరు లేదా అది నిజమైనది కాకపోవచ్చు. అనుమానంగా ఉన్నప్పుడు, సదరు వ్యక్తిని అడగడం ఉత్తమం. లేదా మీరు ఎప్పుడైనా ముఖాముఖి మాట్లాడేందుకు, వారు ఎవరో నిర్ధారించుకోవడానికి వాట్సాప్ వీడియో చాట్ చేయవచ్చు. ►వాట్సాప్ ప్రైవేట్ అయినప్పటికీ, మీ నంబర్ తెలిస్తే ఎవరైనా మీకు మెసేజ్ చేయవచ్చు. స్కామర్లు వాట్సాప్ సందేశాలతో స్పామ్ చేయడానికి వందల, వేల ఫోన్ నంబర్లను సేకరిస్తుంటారు. మీకు తెలియని సందేశాలు వస్తే, వాటిని ఓపెన్ చేయకపోవడం మంచిది. అలాగే దానిని గుడ్డిగా ఫార్వార్డ్ చేయవద్దు. మీరు మెసేజ్‌ని నొక్కి పట్టి, ‘రిపోర్ట్‘ ఆప్షన్‌ను ద్వారా వారిని బ్లాక్ చేయవచ్చు లేదా వాట్సాప్‌కి రిపోర్ట్ చేయచ్చు. ►మెసేజ్‌లను పూర్తిగా ఆపలేనప్పటికీ, నంబర్లను బ్లాక్ చేయడం, రిపోర్ట్ చేయడం, తొలగించడం ద్వారా మీరు స్పామర్లకు అడ్డుకట్టవేయచ్చు. ►మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తుల నుండి మెసేజ్‌లు వస్తున్నట్లయితే ఆన్లైన్లో ఉన్నప్పుడు మీ అకౌంట్ సెట్టింగ్‌లను సెట్ చేసుకోవచ్చు. భద్రతా చిట్కాలు ►మీ సమాచారాన్ని ఎవరు చూడాలో వారి వరకే మీ వాట్సాప్ సెట్టింగ్ సెట్ చేసుకోవచ్చు. ►సమస్యాత్మక కంటెంట్, పరిచయాలను వాట్సాప్ సహాయ కేంద్రానికి తెలియజేయడం ద్వారా నియంత్రణ సులువు అవుతుంది. మీరు మీడియా వ్యూయర్ నుండి నేరుగా ఈ అకౌంట్‌కు తెలియజేయవచ్చు.https://faq.whatsapp.com/2798237480402991/?locale=fi_FI వాట్సాప్‌కు ఇలా తెలియజేయవచ్చు.. ►ఆండ్రాయిడ్/ఐఫోన్లో వాట్సాప్‌లో మోర్ అనే ఆప్షన్ బటన్‌ను నొక్కండి (బటన్ ఒకదానిపై ఒకటి మూడు చుక్కలు వరుసగా ఉంటాయి). ఆపై సెట్టింగ్ సహాయం ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ►మీకు అనుమానాస్పద, తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చినట్లయితే, మీరు వాటిని చాట్‌లోనే వాట్సాప్‌కి నివేదించవచ్చు. దీన్ని చేయడానికి ... వాట్సాప్‌లో నెంబర్ చాట్‌ను ఓపెన్ చేయండి. వారి ప్రొఫైల్ సమాచారాన్ని ఓపెన్ చేయడానికి నంబర్, గ్రూప్ పేరుపై నొక్కి, దిగువకు స్క్రోల్ చేయాలి. రిపోర్ట్ కాంటాక్ట్ లేదా రిపోర్ట్ గ్రూప్ లింక్‌పై నొక్కాలి. ►మీరు పంపిన మెసేజ్‌లను, నంబర్ లేదా గ్రూప్‌ల నుండి సందేశాలను వాట్సాప్ అందుకుంటుంది. నియంత్రిస్తుంది. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Smart Watches: స్మార్ట్‌వాచ్ వరల్డ్.. లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరుచు కోవడానికి పనికొచ్చేవే! Cyber Crime Prevention Tips: నకిలీలలు.... ముద్ర కాని ముద్ర.. నిర్లక్ష్యం చేశారో ఇక అంతే సంగతులు! -
అడ్వాన్స్.. చెల్లిస్తున్నారా?! అయితే ఇక అంతే సంగతులు!
సాగర్ బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ‘లోను తీసుకోండి, నెలా నెలా ఆ మొత్తాన్ని తీర్చేయండి’ అని ఫోన్లో మెసేజ్ చూసి ఎగిరిగంతేసినంత పని చేశాడు. తండ్రి ఫీజు కోసం ఇచ్చిన డబ్బు ఖర్చు అయిపోయింది. ఎలా అనుకున్న సమయంలో కరెక్ట్‌గా వచ్చింది అనుకున్నాడు. లింక్ ద్వారా తన వివరాలన్నీ ఇచ్చాడు. తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. కాలర్ మాట్లాడుతూ ‘ముందస్తుగా ఫీజు నిమిత్తం కొంత అమౌంట్ కడితే లోన్ మొత్తం మీ అకౌంట్లో చేరుతుంది’ అని చెప్పాడు. దీంతో స్నేహితుల దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఆ తర్వాత ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. ∙∙ రాజీ సొంతంగా డబ్బు సంపాదించి అమ్మనాన్నలకు సాయం చేయాలనుకుంది. అందుకోసం ఇంటర్నెట్లో ఆప్షన్ల కోసం వెతికింది.అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలో ఉన్న ప్రకటనలోని నెంబర్‌కు ఫోన్ చేసింది. ఫోన్ మాట్లాడిన కాలర్ తమ‘యాప్’ను డౌన్లోడ్ చేయమని అడిగాడు. అలాగే, అతను చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేసింది. ఆ యాప్ అకౌంట్ లో రూ.4.50 లక్షలు కమీషన్ ఉంది. చెప్పలేనంత ఆనందం వేసింది రాజీకి. టాస్క్ పూర్తి చేస్తే, రూ.2.50 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు అని ఉంది. కానీ, టాస్క్ ఆప్షన్స్ పూర్తి చేయలేకపోయింది. కంపెనీ మెంబర్షిప్ కార్డ్ కోసం ముందుగా రూ.70 వేలు కడితే రిజిస్టర్ అయిపోవచ్చని, రెండు రోజులే గడువు అని చెప్పడంతో తన స్నేహితుల నుంచి, తల్లి, తండ్రి నుంచి డబ్బు సేకరించి ఆ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత సదరు యాప్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఫోన్ లేదు. మోసపోయానని అర్ధమైంది. ∙∙ ఇటీవల కాలంలో ఆన్లైన్ వేదికగా అడ్వాన్స్ చెల్లించమని ఊరించే రుణాలు, లాటరీలు, గిఫ్ట్‌లు, షాపింగ్ మోసాలు.. అధికంగా ఉన్నాయి. రుణ మోసాలు ►చాలా మందికి డబ్బు అత్యవసరం అయినప్పుడు ఆన్లైన్ లోన్ తక్షణ పరిష్కారంగా కనిపిస్తుంది. అయితే, కొంతమంది మోసగాళ్లు మీ తక్షణ అవసరం నుంచి లాభం పొందడానికి పొంచి ఉంటారు. నాన్–పబ్లిక్ లోన్ స్కామ్‌ల గురించి తెలుసుకుంటే మోసాల బారిన పడే అవకాశం ఉండదు. ►రుణం తీసుకోవడానికి ముందస్తుగా మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రుణం మంజూరు చేయడానికి రుసుమును అడగడం అంటే స్కామ్ అని గుర్తించాలి. మీ క్రెడిట్ లావాదేవీల స్కోర్‌తో పాటు అనేక అంశాలపైన ‘రుణం ఇవ్వడం’ అనేది ఆధారపడి ఉంటుంది. ►బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల అధికారిక వెబ్సైట్లను చాలా రుణ స్కామ్ వెబ్సైట్లు అనుకరిస్తాయి. అందుకని, మీరు ఎల్లప్పుడూ నెట్ అడ్రస్‌ను చెక్‌చేసుకోవాలి. ఆఫర్ పరమిత కాలానికి మాత్రమే, త్వరలో గడువు ముగిసే అవకాశం ఉన్నందున రుణం వెంటనే పొందండి అని ఇ–మెయిల్ లేదా మెసేజ్‌లు, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు కనిపించినా జాగ్రత్త పడండి. బ్యాంకులు ఇటువంటి అత్యవసర మార్గాన్ని సృష్టించి మిమ్మల్ని మోసగించవు. ►మోసగాళ్లు అత్యవసరంగా డబ్బు అవసరమయ్యే వ్యక్తులకు మెసేజ్‌లు, ఇ–మెయిల్లు పంపుతారు, ఫోన్ కాల్స్ చేస్తారు. ఇటువంటివారి ఉద్దేశ్యం మీ వివరాలను సేకరించడం, డబ్బు దొంగిలించడం. లాటరీ మోసాలు ►ఇటీవల జరిగిన లాటరీ స్కామ్‌లలో మోసగాళ్లు అధికంగా ఎరగా వేసేది కౌన్ బనేగా కరోడ్‌పతి లాటరీ. మీ మొబైల్ నెంబర్ గెలిచినట్టు తెలియని నంబర్ల నుండి బాధితులకు వాట్సప్ సందేశాలను పంపుతున్నారు. లాటరీ గురించి చెప్పడానికి వాట్సప్ సందేశంలో ఉన్న నంబర్‌కి ఫోన్ చేయమని ఉంటుంది. ►బాధితుడు ఆశపడి ఆ నెంబర్‌ను సంప్రదించినప్పుడు మోసగాడు లాటరీ ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ చెల్లించాలని చెబుతాడు. బాధితుడు ఆ డబ్బును చెప్పిన అకౌంట్లో డిపాజిట్ చేసిన తర్వాత మరేదో సాకుతో ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తారు. ►బాధితుడి చేత వివిధ బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేయించేలా వారి మాటల ద్వారా ప్రేరేపిస్తారు. మోసం వారాలు, నెలల తరబడి కూడా కొనసాగుతుంది. చివరకు బాధితులు డబ్బు చెల్లించమని పట్టుబడినప్పుడు తమ ఫోన్ నెంబర్లను బ్లాక్ చేస్తారు. గిఫ్ట్ మోసాలు ►సోషల్‌మీడియాలో అప్పటికే ఉన్న అకౌంట్ల్ నుంచి కొన్ని ఆకర్షణీయమైన వాటిని ఎంపిక చేసుకొని, వాటి పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టిస్తాడు. వాటి నుంచి సభ్యుల స్నేహితులకు రిక్వెస్ట్‌లు పంపిస్తూ ఉంటారు. ►ఎవరైతే యాక్సెప్ట్ చేసి, రిప్లై చేస్తున్నారో గమనించి ఆ తర్వాత వారితో మెసేజ్‌లు చేస్తుంటారు. అలా, నెమ్మదిగా వారితో కనెక్ట్ అయ్యేలా చేసుకొని, వ్యక్తిగత విషయాలను రాబట్టి, మోసానికి పాల్పడతారు. ఆన్లైన్ షాపింగ్ మోసాలు ►ఆన్లైన్లో కొనుగోళ్ల కోసం ప్రజలు తరచూ శోధించే ఉత్పత్తులను మోసపూరిత ప్రకటల ద్వారా పోస్ట్ చేస్తుంటారు. ఈ మోసగాళ్ల తాత్కాలిక వెబ్, సోషల్ మీడియా పోస్ట్‌లు చాలా సార్లు నిజమైన వ్యాపార సంస్థలను పోలి ఉంటాయి ►కొన్ని బ్రాండ్ల పేరుతో నకిలీ వెబ్ సైట్లను సృష్టించి, వాటిని అతి చౌకగా అందిస్తామని ప్రకటనల్లో చూపుతారు. ఆన్లైన్లో డబ్బు చెల్లించేలా ప్రేరేపిస్తారు. డబ్బు పూర్తిగా కట్టినా ఆర్డర్ చేసిన ప్రొడక్ట్‌ని మాత్రం పొందలేరు. ►ఆన్లైన్లో .. ఎక్కువ ఖరీదు చేసే వస్తువును కొంటే అంతే విలువైన బహుమతిని ఉచితంగా పొందవచ్చు అనే ఆఫర్లు వస్తుంటాయి. ఎవరైనా ఆ వస్తువుని కొనుగోలు చేస్తే కస్టమర్ సర్వీస్ నుండి కాల్ వస్తుంది. బహుమతిని పొందడానికి ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ వంటి పేర్లు చెప్పి కొంత మొత్తాన్ని చెల్లించమని కోరుతారు. సందేహించని కొనుగోలుదారు నుంచి వివిధ బ్యాంకు ఖాతాలకు వేల రూపాయలను జమ చేసేలా ప్రేరేపిస్తారు. ►చాలా వరకు మోసపోయిన వ్యక్తులు చెప్పే వాటిల్లో.. కోరుకున్న వస్తువు ఆన్లైన్లో కొనుగోలు చేసి, ఆ¯Œ లైన్లోనే డబ్బులు చెల్లించినా పొందే వస్తువు అత్యంత చౌక ధర లేదా ఎందుకూ పనికిరానిది డెలివరీ అవుతుంది. ముందస్తు జాగ్రత్తలు ►మీరు లాటరీ లేదా బహుమతి గెలుచుకున్నారని మెసేజ్ వస్తే అది మోసం కావచ్చు. ►మెసేజ్‌ను పరిశీలిస్తే సరిగా లేని డ్రాఫ్టింగ్, వ్యాకరణ లోపాలు.. వంటివి కనిపిస్తాయి. ►∙ఈ–మోసాలు మీ దురాశను ఉపయోగించుకుంటాయి. ►ఏదైనా నిజమైన లాటరీ లేదా బహుమతి అయితే టాక్స్ లేదా ఇతర ఛార్జీలు వారే కట్ చేసుకొని, మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ, ముందస్తు ఛార్జీలు చెల్లించమని అడగరు. ►ఫోన్లో అవతలి వ్యక్తి వివరాలు చెప్పమని, ముందస్తు చెల్లింపుల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను జాగ్రత్తగా గమనించాలి. మిమ్మల్ని తమ మాటల వలలో వేస్తున్నారా అనే విషయాన్ని సందేహించాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్. చదవండి: ఆన్లైన్ డేటింగ్‌కు బానిసైన డాక్టర్.. పట్టమంటాడు... వదలమంటాడు! ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏమిటి? దీనికెంత డిమాండ్ ఉందో తెలుసా! -
‘నీ అప్పు తీరలేదు.. ఇంకా చెల్లించాలి, లేదంటే మీ అమ్మ ఫోటో మార్ఫింగ్ చేసి’
సాక్షి, ఖమ్మం: ‘నువ్వు తీసుకున్న అప్పు తీరలేదు. ఇంకా చెల్లించాలి. లేకపోతే.. మీ అమ్మ ఫోటోను మార్ఫింగ్ చేసి.. పోర్న్సైట్లో అప్లోడ్ చేస్తాం’.. ఇది లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న ఆరాచకాలు. మంచిర్యాల ఘటన మరవకముందే ఖమ్మం జిల్లా మధిరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తీసుకున్న డబ్బు చెల్లించినా ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకులు ఓ యువకుడిని వేధిస్తుండడంతో పాటు ఆయన తల్లి ఫొటోను మార్ఫింగ్ చేసి ఇతరులకు పంపిస్తున్న ఘటన ఇది. మధిరకు చెందిన ప్రదీప్ ఆన్లైన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఆ సమయాన ప్రదీప్‌తో పాటు ఆయన ఆధార్‌కార్డుతో పాటు తల్లి పాన్‌కార్డును యాప్ నిర్వాహకులు తీసుకున్నారు. అయితే, రుణం తిరిగి చెల్లించేందుకు యత్నించగా, వెబ్సైట్ పనిచేయలేదు. దీంతో నిర్వాహకులకు ఫోన్ చేస్తే యూపీఐ లింక్ పంపడంతో డబ్బు చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా బకాయి ఉందంటూ ప్రదీప్‌ను ఫోన్ చేసి వేధించసాగారు..రాత్రి, పగలు తేడా లేకుండా రకరకాల ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్లు చేస్తు నరకం చూపిస్తున్నారని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన తల్లి పాన్‌కార్డులోని ఫొటోను మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయాడు. అంతేగాక ఆయన ఫోన్లో నంబర్లు ఉన్న వారికి సదరు మహిళ మోసాలకు పాల్పడుతోందంటూ మెసెజ్‌లు పంపడం ప్రారంభించారు. ఈ విషయమై ప్రదీప్ చేసిన ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు మధిర టౌన్ ఎస్సై సంకీర్త్ తెలిపారు. -
సిమ్‌కార్డ్ మార్చుకునే క్రమంలో వచ్చిన మెసేజ్‌కు రిప్లై ఇచ్చిన వర్ధని.. ఆ తర్వాత
Cyber Crime Prevention Tips: వయసు పైబడిన వారిలో చాలావరకు స్మార్ట్ ఫోన్ల వాడకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్నెట్లో ఆన్లైన్ షాపింగ్‌తో పాటు, తమకు కావల్సిన సమాచారం కోసం శోధించడమూ పెరిగింది. అనుకోకుండా తెలియని సైట్స్‌ని లింక్ చేయడం, ఇతర వెబ్సైట్లలో లాగిన్ అవడం వంటివి జరుగుతోంది. దీంతో వారి ఫోన్లకు ఫేక్ మెసేజ్‌లు, అవసరం లేని సమాచారం చేరుతుంది. దీంతోపాటు సీనియర్ సిటిజన్లు తమ వివరాలను తమకు తెలియకుండానే మోసగాళ్ల చేతికి అందించే అవకాశమూ పెరుగుతోంది. ఇటీవల ఓ సీనియర్ సిటిజన్ ఖాతా నుంచి రూ.80 వేల రూపాయలు సైబర్ నేరగాళ్లు దొంగిలించారు. ఫోన్లో సిమ్‌కార్డ్ మార్చుకునే క్రమంలో వచ్చిన మెసేజ్‌కు రిప్లై ఇచ్చింది వర్ధని (పేరు మార్చడమైనది). సందేహం ఉంటే, మరో మెసేజ్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు కాల్ చేయమని వచ్చిన మెసేజ్ చూసింది. ఆ మెసేజ్‌లో ఇచ్చిన నెంబర్‌కు ఫోన్ చేయడంతో ప్రాసెసింగ్ ఛార్జీల కోసం రూ.10 బదిలీ చేయడంతో పాటు, అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేయమని అడిగాడు కాలర్. అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసి, తన డెబిట్ కార్డ్ నుంచి డబ్బు బదిలీ చేసింది. తర్వాత తన ఫోన్లో కాంటాక్ట్ నంబర్లేవీ కనిపించలేదు. అనుమానం వచ్చి, బ్యాంక్‌ను సంప్రదిస్తే రూ.80 వేలు మరో ఖాతాకు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పడంతో షాక్ అయ్యింది. టార్గెట్ గ్యాంగ్స్ రిటైర్ కాబోతున్నవారిని టార్గెట్ చేసే గ్యాంగ్స్ కొన్ని ఉంటాయి. వీళ్లు దాదాపు చదువుకుంటున్నవారే అయి ఉంటారు. పిల్లలు విదేశాల్లో ఉండి, వృద్ధ తల్లిదండ్రులు స్వదేశంలో ఒంటరిగా ఉండే వారి సంఖ్య పెరుగుతోంది. వీరిని టార్గెట్ చేసుకొని మోసం చేసే గ్యాంగ్స్ కొత్తగా పుట్టుకు వస్తుంటాయి. ఒంటరి వృద్ధులకు కావల్సిన సరుకులు తెచ్చివ్వడం, చిన్న చిన్న పనులు చేసి పెట్టడం, సమయం కేటాయించి కబుర్లు చెప్పడం, మేం ఉన్నామనే ధైర్యం ఇస్తూ కన్సర్న్ చూపడం చేస్తారు. ఈ క్రమంలో పెద్దవాళ్లు నమ్మేస్తారు. మీ ఫోన్ మేం సెట్ చేస్తామని తీసుకోవడం, ఆన్లైన్ షాపింగ్ చేసి పెడతామని ముందుకు రావడం, ఓటీపీ, కెవైసీ వివరాలు దొంగిలించడం, క్రిప్టో కరెన్సీ పేరిట వంద రూపాయలు పెడితే 5 ఏళ్లలో పది లక్షల రూపాయలు వస్తాయని ఆశ చూపడం.. వంటి రకరకాల మార్గాల ద్వారా వివరాలు రాబడతారు. దీనిద్వారా డిజిటల్ మార్గాన మోసం చేయడానికి పూనుకుంటారు. చాలామంది వృద్ధులకు తమ ఖాతా నుంచి డబ్బులు పోయాయనే విషయం కూడా కొన్ని రోజుల వరకు తెలియదు. మరేం చేయాలి...? డిజిటల్ ప్రపంచం గురించి అవగాహన పెంచుకోవడంతోపాటు మోసపూరిత అంశాల గురించి కూడా తెలుసుకోవాలి. ఆన్లైన్ వేదికగా జరిగే మోసాలు ఏ తరహాలో ఉంటాయి, వాటి నుంచి తమను తాము రక్షించుకునే విధానాలను తెలుసుకోవాలి. లేదంటే, కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని పెద్దవాళ్లకు సైబర్ ఫ్రాడ్స్‌కు సంబంధించిన విషయాలపట్ల అవగాహన కల్పించాలి. ముందుగా.. ►ముందుగా షార్ట్ లింక్స్ వస్తాయి. రిటైర్డ్ వ్యక్తుల వివరాలు డార్క్‌నెట్‌లో లభిస్తుంటాయి. దీని ద్వారా షార్ట్ లింక్స్ వస్తుంటాయి. మీరు క్లిక్ చేయాలనుకున్న లింక్స్ యుఆర్ఎల్ సరైనదేనా అని ధ్రువీకరించడానికి https://www.unshorten.it/ ద్వారా తెలుసుకోవచ్చు. ►www.isitphishing.org or www.urlvoid.comల ద్వారా అన్ని లింక్‌లను ధ్రువీకరించుకోవచ్చు. ►ఇ–మెయిల్ ద్వారా కొన్ని షార్ట్ లింక్స్ వస్తుంటాయి. వాటిని క్లిక్ చేయడం, తమ వివరాలను, బ్యాంకు వివరాలను పొందుపరచడం వంటివి చేయకూడదు. ►ఆఫర్ వచ్చిందనో, మనీ బ్యాక్ అనో.. మాటల్లో మభ్యపెట్టి ఓటీపీ, యూజర్‌నేమ్, పాస్వర్డ్లు తీసుకునేవారుంటారు. వీటికి ఏ మాత్రం స్పందించ కూడదు. ►ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తులు ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేయమనడం, మీ వ్యక్తిగత వివరాలను రాబట్టడం చేస్తుంటారు. ఫోన్ మాట్లాడే సమయంలో హెడ్‌ఫోన్ పెట్టుకొని స్క్రీన్ చూస్తున్నప్పుడు ఫ్రాడ్ జరిగితే విషయం తెలిసిపోతుంది. ►ఉపయోగించే స్మార్ట్ ఫోన్, ల్యాప్‌ట్యాప్ వంటి పరికరాల్లో ఒరిజనల్ యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేస్తే మోసపూరిత షార్ట్లింక్స్కు అడ్డుకట్ట వేయచ్చు. ►ఆన్లైన్ షాపింగ్, యాప్‌ల ద్వారా డబ్బు బదిలీ చేసే సమయంలో కొన్ని సాంకేతిక అవాంతరాలు వస్తాయి. ఇలాంటప్పుడు గూగుల్ కస్టమర్‌కేర్ నెంబర్లకు అస్సలు ఫోన్ చేయకూడదు. 99 శాతం ఆ నంబర్లు మోసపూరితంగా ఉండే అవకాశం ఉంటుంది. ►ఫోన్ మాట్లాడే సమయంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమనడం, ఓటీపీ, యుపిఐఎన్, బ్యాంక్ కార్డ్ సివివి నంబర్లు ఇవ్వమని అడగడం వంటివి చేస్తుంటే మీ ఖాతా నుంచి డబ్బును బదిలీ చేస్తున్నారని గ్రహించాలి. ►సోషల్ మీడియా, బ్యాంకింగ్, ఇ–మెయిల్ ఖాతాల కోసం రెండు విడి విడి ఫోన్ నంబర్లను ఉపయోగించడం శ్రేయస్కరం. విశ్రాంత జీవనంలో ఉన్న పెద్దలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి కుటుంబ సభ్యులు తగిన సమయం కేటాయించుకోవాలి. ఈ డిజిటల్ యుగం గురించి పెద్దలకు అవగాహన కలిగించడాన్ని కుటుంబంలో ఉన్న నవతరం బాధ్యతగా తీసుకుంటే జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయచ్చు. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
Cyber Crime Prevention Tips: ఫ్యాషన్ జ్యువెల్రీ నచ్చడంతో ఆర్డర్ చేస్తే.. ఆఖరికి..
సాధన (పేరు మార్చడమైనది) బిటెక్ చదివింది. ఉద్యోగిని. ఆన్లైన్లో ఒక ఫ్యాషన్ జ్యువెల్రీని చూసి, నచ్చడంతో ఆర్డర్ బుక్ చేసింది కార్డ్ పేమెంట్ ద్వారా. పది రోజులు దాటాయి. కానీ, ఆ వస్తువు తనను చేరలేదు. ఏమిటీ అని మరోసారి చెక్ చేసింది. తనకు వచ్చిన లింక్‌ను వెరిఫై చేస్తే తప్పుడు యుఆర్ఎల్ అని తేలింది. మోసపోయినట్టు గుర్తించింది. ఆన్లైన్లో ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తను చూసింది సాధన. అప్పటికి ఆ కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న ఆలోచనను విరమించుకుంది. వారం తర్వాత పరిచయమైన వ్యక్తి ద్వారా ‘అలాంటి వార్త నిజం కాదని. కంపెనీ మంచి లాభాలలో ఉందని తెలిసి’ ఆశ్చర్యపోయింది. ఏది నిజం.. ఏది అబద్ధం? అనేవి నిర్ధారించుకోకుండా నిర్ణయాలు ఆన్లైన్ సమాచారం ద్వారా తీసుకోవడం సరికాదని అర్ధం చేసుకుంది. సాధనలాగే ఎంతోమంది డిజిటల్ ప్రపంచం గురించి తెలుసుకోకుండా రకరకాల మోసాలబారిన పడుతున్నారు. ఈ మోసాల గురించి ప్రతి రోజూ మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. గతంలో మనిషి మేధోస్థాయిని వారి తెలివితేటలు, చదువు, వికాసాన్ని బట్టి తెలుసుకునేవారు. అలాగే సమాచారాన్ని పేపర్లలో చదివి, రేడియోలు, టీవీల ద్వారా విని గ్రహించేవారు. ఇప్పుడు సమస్తం డిజిటల్లో చేరింది. అందుకే, ఇప్పుడు మన మేధోస్థాయి కూడా మార్పులు చెందుతోంది. కాలప్రవాహంలో కొట్టుకువచ్చే సమాచారంలో మనమూ మునిగిపోతున్నాం. అందుకే, డిజిటల్ జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను నేటి కాలం పరిచయం చేస్తోంది. ఈ టెక్నాలజీ యుగంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిర్ధారించుకునే వివేకం ఉండాలి. మనకు మనంగా మన మేధాశక్తిని తప్పనిసరి కొలుచుకోవాల్సిన కాలం ఇది. మనిషిని అత్యంత శక్తిమంతుడిగా చూపుతున్న డిజిటల్ ప్రపంచంలో మనమెలా ఉండాలో తెలుసుకోవడం అత్యవసరం. ∙∙∙ ఈ డిజిటల్ యుగంలో నైపుణ్యాలు, ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా మేధావులు గుర్తించిన ఎనిమిది ప్రాథమిక నియమాలు (1) ఆరోగ్యకరమైన ఆన్లైన్ గుర్తింపు (2) స్వీయ పర్యవేక్షణతో స్క్రీన్ టైమ్ వినియోగం (3)వేధింపుల పరిస్థితులను గుర్తించి తమ భద్రతను కాపాడుకోవడం (4) రక్షణ చర్యలు తీసుకోవడం (5) వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, అలాగే తెలివిగా పంచుకోవడం 6) నిజం, అబద్ధాల మధ్య తేడా గుర్తించడం (7) ఆన్లైన్ ఉనికిని బాధ్యతాయుతంగా నిర్వహించడం, దీర్ఘకాలిక పరిణామాలను తెలుసుకోవడం (8)మీ గురించి, మీ భావాలను నైపుణ్యంగా పంచుకోవడం. మన దైనందిన జీవితంలో కుప్పలు తెప్పలుగా వస్తున్న సమాచారానికి లెక్కలేదు. దీంట్లో ప్రతిదీ శోధించాలనుకుంటే కష్టమే. కానీ, మన గుర్తింపును ఎలా కాపాడుకోవాలి, భద్రత పరిస్థితి ఏంటి, వ్యక్తిగతమైన వివరాలను గోప్యంగా ఎందుకుంచాలి.. అనే విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమైనవి. వీటితో పాటు మనలోని భావవ్యక్తీకరణ సోషల్ మీడియాలో ఎలా ఉంది, దీని వల్ల వచ్చే పర్యవసనాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. నీవు ఏవి ఇస్తే, అలాంటివే నీకు తిరిగి వస్తుంటాయి అనేది కూడా గ్రహించాలి. నిన్ను కొడితే ఎలా బాధ కలుగుతుందో, అవతలి వాడికి కూడా అలాగే బాధ కలుగుతుంది అనే విషయాన్ని అర్ధం చేసుకొని హద్దుల్లో ఉండాలి. కొన్ని డిజిటల్ ఇంటెలిజెన్స్ సాధనాలు: ఎక్సోడస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లను విశ్లేషిస్తుంది. ఇది పొందుపరిచిన ట్రాకర్ల కోసం వెతుకుతుంది. దీని విశ్లేషణ సాంకేతికత పూర్తిగా చట్టబద్ధమైనది. https://reports.exodus-privacy.eu.org/en/ మీ ఇ–మెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ లీక్ అయ్యిందా అని నిర్ధారించడానికి https://amibeingpwned.com ద్వారా శోధించవచ్చు. OSINT ద్వారా ఉచితం అని వచ్చే వనరులను కనుక్కోవడంలో ప్రజలకు సహాయపడుతుంది. https://osintframework.com చందాదారులు తమ రిజిస్టర్డ్ నంబర్లను నిర్ధారించడానికి, వారికి తెలియకుండా రిజిస్టర్ చేసిన నంబర్లను తీసివేయడానికి టెలికాంను అనుమతించడం. https://tafcop.dgtelecom.gov.in మీ కంప్యూటర్ లేదా మీ ప్రైవేట్ డేటాకు హాని కలగవచ్చని ఆందోళన ఉంటే.. తనిఖీ చేయడానికి www.unshorten.it ద్వారా ఒక మార్గం ఉంది బెదిరింపులు, వైరస్ల నుండి మీ గుర్తింపు, డేటా, కంప్యూటర్ను రక్షించడంలో మీకు సహాయం చేస్తుంది https://isitphishing.org/ వీడియో అసలైనదా, నకిలీదా అని నిర్ధారించడానికి తగిన ప్లాట్‌ఫారమ్.. https://platform.sensity.ai/ deepfake-detection - అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Priyanka Nanda: బాలీవుడ్లో అడుగుపెట్టాలనుకుంది.. కానీ గ్లామర్ ప్రపంచాన్ని వదిలి గ్రామానికి.. సర్పంచ్‌గా పోటీ! Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? -
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే.. బయటకు చెప్పలేక..
రామన్నపేట: అత్యాశకు పోయి ఆన్లైన్ మోసానికి బలై పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సైబర్ మోసానికి బలైనవారు ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోనే 1500 నుంచి 2వేల మంది వరకు ఉన్నారు. డిసెంబర్ 14న హగ్‌స్లీప్ అనే యాప్ మార్కెట్లోకి వచ్చింది. లింక్ ద్వారా ఒకరి ఫోన్ నుంచి మరొకరికి పంపేలా యాప్‌ను రూపొందించారు. యాప్‌ను డౌన్లోడ్ చేయగానే వివిధ డిస్కౌంట్లతో కూడిన కూపన్లు ప్రత్యక్షమవుతాయి. వాటిని స్క్రాచ్ చేయగానే డిస్కౌంట్ చూపిస్తుంది. ఓకే చేస్తే డిస్కౌంట్ పోనూ మిగిలిన మొత్తం సదరు వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అవుతుంది. డిస్కౌంట్ల పేరిట మస్కా హగ్‌స్లీప్ యాప్‌లో రూ.3 వేలు, రూ.6 వేలు, రూ.9 వేలు, రూ.15 వేలు, రూ.25 వేల విలువైన కూపన్లను పొందుపరిచారు. రూ.3 వేలు డిపాజిట్ (బదిలీ) చేస్తే గంటకు రూ.20.80 చొప్పున కేవలం 45 రోజుల్లో రూ.22 వేలు పొందవచ్చని, రూ.25 వేలు డిపాజిట్ చేస్తే గంటకు రూ.117.90 చొప్పున 60 రోజుల్లో రూ.1,50,000 పొందవచ్చని బంపర్ డిస్కౌంట్లను ఎర వేశారు. యువతను బురిడీ కొట్టించిన హగ్ స్లీప్ యాప్ రూ.6 వేలకు గంటకు రూ.40, రూ.9వేలకు గంటకు రూ.60, రూ.15 వేలకు గంటకు రూ.90 స్క్రాచ్ చేసిన వ్యక్తి ఖాతాలో జమ అవుతాయని, ఖాతాలో పడిన మొత్తాన్ని రోజూ ఉదయం పదకొండు గంటల తరువాత డ్రా చేసుకోవచ్చని ఆశ చూపారు. ఉదాహరణకు రూ.3 వేల విలువైన కూపన్‌ను గనక స్క్రాచ్ చేస్తే డిస్కౌంట్ 20శాతం పోను మిగిలిన రూ.2400 సదరు వ్యక్తి ఖాతా నుంచి యాప్ ఖాతాకు బదిలీ అవుతాయి. డిస్కౌంట్‌కు సంబంధించిన రూ.600 లింక్ పంపిన వ్యక్తి ఖాతాకు వెళ్తాయి. అత్యాశతో ఎగబడిన జనం మొదట్లో చేరిన కొద్దిమంది ఖాతాల్లో గంట గంటకు డబ్బులు జమ అయ్యాయి. వారు తమ స్నేహితులు, బంధువులకు లింక్‌ను పంపి డౌన్లోడ్ చేయించి స్కీంలో చేరేలా ప్రోత్సహించారు. కొందరు తమది గ్యారంటీ అని కూడా ప్రోత్సహించారు. దీంతో యువకులు తమతోపాటు తమ కుటుంబ సభ్యుల ఫోన్లలో లింక్‌ను డౌన్లోడ్ చేసి మరీ డబ్బులు బదిలీ చేశారు. యాప్‌లో చేరిన వారిలో ఎక్కువమంది రూ.20 వేల కూపన్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.కేవలం రామన్నపేట మండలంలోనే రెండు వేలకు మందికి పైగా స్కీంలో చేరి రూ.2 కోట్లు డిపాజిట్ చేశారు. డిసెంబర్ 27 తరువాత స్కీంలో చేరిన వారు గంట గంటకు వచ్చిన డబ్బులను డ్రా చేద్దామని ప్రయత్నించగా యువర్ ట్రాన్స్ఫర్ ఈజ్ ప్రాసెసింగ్ చూపించింది. డిసెంబర్ 31న యాప్ పూర్తిగా మూతపడింది. దీంతో డబ్బులు బదిలీ చేసినవారు బిక్కమొహం వేశారు. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న వారిలో రాజకీయ నేతలు, వ్యాపారులతోపాటు రోజువారీ కూలీలు కూడా ఉన్నారు. తాము ఆన్లైన్ మోసానికి బలయ్యామనే విషయాన్ని బయటికి చెప్పలేక కుమిలిపోతున్నారు. దీనిపై రామన్నపేట ఎస్ఐ వెంకటయ్యను వివరణ కోరగా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
అమ్మాయి ఫోటో చూసి ఇష్టపడ్డాడు.. రిజక్ట్ చేయడంతో కాల్ గర్ల్ అని..
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సృష్టించి దాని ద్వారా ఓ యువతికి, ఆమె తల్లికి అసభ్యకరమైన సందేశాలు, వీడియోలను పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కేవీ విజయ్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన తిరుకోవెల అక్షిత్ కౌండిన్య విద్యార్థి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి ప్రొఫైల్‌ను చూశాడు. ఆమె ఫొటో చూసి ప్రేమను పెంచుకున్నాడు. ఆపై ఆమెకు తరచు మెసేజ్‌లు పంపేవాడు. దీంతో ఆమె కౌండిన్య ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను బ్లాక్ చేసింది. దీనిని తట్టుకోలేకపోయిన నిందితుడు ఆమెపై పగ పెంచుకున్న అతను ఆమె ప్రొఫైల్ ఫొటోతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిచాడు. దీని ద్వారా పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించాడు. ఆమె కాల్ గర్ల్ అని, రకరకాల అసభ్యకర కామెంట్లు పెట్టేవాడు. దీనిని గుర్తించిన బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌కు రిపోర్ట్ చేసి తన పేరుతో ఉన్న నకిలీ ఐడీని బ్లాక్ చేయించింది. దీంతో నిందితుడు మరోసారి ఆమె ఫొటోను వినియోగించి రెండు నకిలీ ఖాతాలను సృష్టించాడు. మరోమారు అసభ్యకరమైన సందేశాలను పోస్ట్ చేశాడు. చదవండి: న్యూఇయర్ టార్గెట్: గ్రాము ‘కొకైన్’ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఈసారి బాధితురాలు, ఆమె తల్లి ఫోన్ నంబర్లను సంపాదించాడు. వర్చువల్ నంబర్లతో వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసి అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలను పంపించాడు. తనకు వీడియో కాల్స్ చేయాలని లేకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు గురువారం నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఆన్లైన్లో పరిచయం.. నీ కష్టాలు తీరుస్తా.. వ్యక్తిగత ఫొటోలు, రూ.5 వేలు పంపు.. -
9 లక్షల పొదుపు మొత్తం.. అంతా ఊడ్చేశారు.. అప్పుడు తెలిసింది!
Cyber Crime: Woman Lost Lakhs Of Money By Invest In Virtual Company: గృహిణిగా ఇంటి బాగోగులు, పిల్లల చదువులను పట్టించుకోవడంలో ఏ చిన్న పొరపాటూ జరగనివ్వదు మంగ (పేరు మార్చడమైనది).. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబం. పిల్లలు డిగ్రీ స్థాయి చదువులకు వచ్చేశారు. మంగ పొదుపరితనాన్ని పాటించే మనిషి కావడంతో డబ్బు బాధ్యతను ఆమెకే అప్పగించేశాడు భర్త. నెలనెలా వేలల్లో చేసిన పొదుపు ఇప్పుడు లక్షలు అయ్యింది. పిల్లల ఫీజుల సమయానికి తను పెట్టుబడి పెట్టిన వాటి లెక్కలు చూసింది. మంచి రిటర్న్స్ కనిపించాయి. చాలా ఆనందంగా అనిపించింది. కొంత మొత్తాన్ని డ్రా చేయాలని ప్రయత్నించింది. కానీ, డబ్బు విత్‌డ్రా అయినట్టు చూపించడం లేదు, అకౌంట్లో డబ్బు జమ కాలేదు. ఆందోళనగా అనిపించింది. తొమ్మిది లక్షల వరకు చేసిన పొదుపు మొత్తంలో నుంచి రూపాయి కూడా విత్‌డ్రా చేసే అవకాశం లేదు. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది ఆందోళనగా. మంగ పొదుపు మొత్తాలను వేటిలో పెట్టుబడిగా పెట్టిందో ఇద్దరూ కలిసి చెక్ చేశారు. మంగ పొదుపు అనుకొని పెట్టుబడులు పెట్టింది ఒక వర్చువల్ సంస్థలో. ఆన్లైన్ వేదికగా జరిగే ఈ నగదు లావాదేవీలో మొదట్లో కొన్ని రోజుల్లోనే లాభాలు వచ్చాయి. దీంతో ఎంత మొత్తం పెట్టుబడిగా పెడితే, అంతకు రెట్టింపు రిటర్న్స్ వస్తాయని తను వివిధ రకాలుగా పొదుపు చేసిన మొత్తాలను ఆ కంపెనీలోనే పెట్టింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంలో విఫలం కావడంతో తాను మోసపోయానని అర్ధమైంది. ∙∙ ‘ప్రతీ నెల ఈ విధంగా వర్చువల్ పెట్టుబడులు పెట్టి, మోసపోతున్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా వేలల్లో ఉంటుందని, వీరిలోనూ ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటున్నార’ని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా ప్రకటనలు ►ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్స్‌లో ‘వెయ్యి రూపాయలు పెట్టండి, లక్షలు సంపాదించండి’ అనే యాప్ లింక్స్ ప్రకటనలు వస్తుంటాయి. యూ ట్యూబ్‌లో ‘ఒక్కరోజులోనే కారు కొనేశా!’‘ఒక్కరోజులోనే విల్లా కొనేశా!’ అనే తరహా ప్రచారాలతో ఊదరగొట్టేవారుంటారు. వాటిని చూసి మోసపోయేవాళ్లు ఒక కోవకు చెందితే, తమ డబ్బు రాబట్టుకోవడం కోసం ఇతరులను మోసపుచ్చేవాళ్లు మరోరకం. ►ఫలానా ‘యాప్’లో పెట్టుబడులు పెడితే మీకు రెట్టింపు లాభం అని చెబుతారు. దీనికి సంబంధించిన వాట్సప్ గ్రూప్ కూడా తయారు చేస్తారు. ఆ గ్రూప్‌లలోనూ ప్రచారం చేస్తారు. పదివేల రూపాయలు పెడితే ఇరవై వేల రూపాయల లాభం వచ్చిందని ప్రచారం చేస్తారు. ఆశ పడి వాటిలో చేరితే మన డబ్బూ ‘హాం ఫట్’ అయిపోతుంది. రిఫర్ చేసినందుకు డబ్బు వస్తుందని.. ఆన్లైన్ పెట్టుబడులకు సంబంధించిన రెండు రకాల ఇన్వెస్ట్ ఫ్రాడ్స్ ఉంటారు. షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టుగా చూపించి డబ్బులు లాగేసుకోవడం. యాప్‌లో డబ్బులు పెట్టమని ప్రోత్సహించి, రాబట్టడం. మనం ఆశపడిన యాప్ లింక్‌ను క్లిక్ చేసి, అందులో కొంత డబ్బు పెట్టి చూద్దాం అనుకున్నవారు ఉంటారు. వారికి ఆ యాప్ వాలెట్లో డబ్బు రోజు రోజుకూ రెట్టింపుగా కనబడుతుంటుంది. దీంట్లో మరో ఇద్దరిని యాడ్ చేయించండి, మరిన్ని లాభాలు పొందండి.. అనే ప్రకటనలు వస్తుంటాయి. దాంతో మరికొందరికి ఈ యాప్ లింక్ షేర్ చేస్తారు. ‘మనకు తెలిసిన వాళ్లే పెట్టుబడి పెట్టారు, మనమూ పెడదాం’ అని.. మిగతా వాళ్లూ తమ డబ్బును సదరు యాప్‌లో పెట్టుబడిగా పెడతారు. ఇది కొన్ని రోజులు జరిగాక, అనుకున్న మొత్తం రాబట్టుకున్నాక వాట్సప్ గ్రూప్ నుంచి నిర్వాహకులు ఎగ్జిట్ అయిపోతారు. ఇంకొన్నాళ్లకు ఆ యాప్ కూడా కనిపించదు. మోసపూరిత యాప్‌లలోని వాలెట్లో మీ నగదు మొత్తాన్ని చూపుతారు. కానీ, ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఇవ్వరు. అందుకు వారు మరికొందరిని చేర్చమని, లేదంటే డబ్బు కట్టాలనే రూల్స్ పెడతారు. లేదంటే ఆదాయపు పన్ను, ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీ.. వంటివి చెల్లించమని కోరుతారు. అవన్నీ చెల్లించిన తర్వాత యాప్ పనిచేయడం మానేస్తుంది. కస్టమర్ సర్వీస్ యాక్సెస్ వంటివి ఏవీ పనిచేయవు. సురక్షితమైనవేనా?! ►పెట్టుబడులు సురక్షితంగా ఉండే వ్యాపార సంస్థలనే ఎంచుకోవాలి. ►ట్రేడింగ్ కంపెనీల నేపథ్యం ధ్రువీకరించుకున్నాకే పెట్టుబడులు పెట్టాలి. ►యాప్‌స్టోర్, ప్లేస్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మోసపూరిత అప్లికేషన్స్ ఆండ్రాయిడ్ ఫైల్స్, డిఎమ్‌జెడ్ ఫైల్స్ ఉంటాయని గమనించుకోవాలి. ►డబ్బుతో పాటు ఈ–కామర్స్ ఉత్పత్తులనూ అత్యంత తక్కువ ధరలో ఇస్తున్నట్టు ఎరగా వేస్తారు. అత్యాశకు లోనుకావద్దు. ►చాలా వరకు రూ.1000 కంటే తక్కువ మొత్తంతో పెట్టుబడి ప్రారంభమవుతుంది. మోసగాళ్లు ఒకట్రెండు సార్లు రాబడులు సకాలంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు. తక్కువ మొత్తం ఉన్నప్పుడు లాభాన్ని ఎరగా చూపి, ఎక్కువ మొత్తాన్ని రాబడతారు. ►నగదు లావాదేవీలన్నీ వర్చువల్ ఖాతాల ద్వారా జరుగుతాయి కాబట్టి బాధితులు మోసపోయినా తిరిగి తమ మొత్తాన్ని రాబట్టుకోలేరు. ►డబ్బు పెట్టుబడిగా పెట్టమని సూచించే లింక్స్‌పై గుడ్డిగా క్లిక్ చేయకూడదు. అన్నింటికీ మించి మీరు పెట్టే పెట్టుబడి సురక్షితంగా, చట్టబద్ధంగా ఉన్నవాటినే ఎంచుకోవడం శ్రేయస్కరం. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
అమెజాన్ మోసం.. పార్సిల్ ఓపెన్ చేయగానే అవాక్కైన కస్టమర్
సాక్షి,గరుగుబిల్లి(విజయనగరం): మండలంలోని నాగూరుకు చెందిన గొట్టాపు భార్గవ నాయుడు ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. షటిల్ కాక్‌లకు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్‌లో ఆర్డర్ ఇస్తే ఆదివారం వచ్చిన పార్శిల్లో పనికిరానివి, కాక్‌లకు డిప్పలు లేనివి ఉండడంతో ఆవాక్కయ్యాడు. ఆన్లైన్ షాపింగ్‌లో మోసం జరిగిందని గ్రహించి వెంటనే ఆ సంస్థ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి తిప్పి పంపించేశాడు. పాముకాటుతో వ్యక్తి మృతి రేగిడి: మండల పరిధిలో ని అంబకండి గ్రామానికి చెందిన లొట్టి అచ్యుతరావు (45) ఆదివారం పాముకాటుతో మృతి చెందారు. గడ్డి కోత కోసం ఆయన సాయంత్రం పొలానికి వెళ్లారు. ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా గట్టుపై అ పస్మారక స్థితిలో పడి ఉన్నా రు. వారు అచ్యుతరావును రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని ఎంపీటీసీ పుర్లి సత్యవతి తెలిపారు. అచ్యుతరావుకు భార్య అన్నపూర్ణ, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తె నీలిమ, కుమారుడు ఉన్నారు. అచ్యుతరావు గీత కార్మికుడు. ఆయన మృతితో కుటుంబానికి ఆధారం పోయింది. అచ్చుతరావు మృతిపై మాజీ సర్పంచ్ లావేటి అప్పలనాయుడు, లావేటి గణపతిరావునాయుడు, పుర్లి గోపాలకృష్ణ మాస్టారు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న.. -
ఫ్రెండ్ అని నమ్మి.. అక్కాచెల్లెళ్లు రూ. 8 లక్షలు ఇచ్చారు.. తీరా చూస్తే
ఇటీవలే బి.టెక్ పూర్తి చేసిన చంద్రిక (పేరు మార్చడమైనది) ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓ రోజు ఫేస్బుక్లో ఆనంద్(పేరుమార్చడమైనది) అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అతని ప్రొఫైల్ నచ్చి చంద్రిక యాక్సెప్ట్ చేసింది. తన పోస్టులకు స్పందించడంతో పాటు, మెసెంజర్ ద్వారా సరైన సూచనలు చేయడం, సంభాషణ నచ్చడంతో కొన్ని రోజుల్లోనే చంద్రికకు ఆనంద్‌తో స్నేహం కుదిరింది. ఆనంద్ ఫోన్లోనూ చంద్రికతో మాట్లాడుతుండేవాడు. ఇద్దరి స్నేహం వ్యక్తిగత విషయాలు పంచుకునేంతగా ఎదిగింది. డబ్బు ఇస్తే సులువా? సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పింది చంద్రిక. ‘నాకు ప్రముఖ కంపెనీలలో స్నేహితులున్నారు. నేను చెబితే నీకు ఉద్యోగం సులువుగా వచ్చేస్తుంది. కాకపోతే కొంత డబ్బు ఖర్చవుతుంది’ అని చెప్పాడు ఆనంద్. అతను చెప్పిన విషయాలు చంద్రికకు బాగా నచ్చాయి. ఆ ఖర్చు భరిస్తానని చెప్పింది. అంతేకాదు, తన అక్క లహరి (పేరు మార్చడమైనది)కి కూడా జాబ్ చూడమని, కరోనా కారణంగా జాబ్ పోయిందని చెప్పింది. ఆనంద్ సరేనన్నాడు. రెండు రోజుల్లో తను ఏయే కంపెనీలవారితో మాట్లాడిందీ చెప్పి, రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంద’న్నాడు. ఆనంద్ చెప్పిన అమౌంట్‌ను అతని అకౌంట్‌కు బదిలీ చేశారు అక్కాచెల్లెళ్లు. ఫోన్ ఇంటర్వ్యూతో బురిడీ రెండు రోజుల తర్వాత ఓ పేరున్న కంపెనీ నుంచి అంటూ చంద్రికకు ఫోన్ వచ్చింది. హెచ్ఆర్గా పరిచయం చేసుకున్న వ్యక్తి వెరిఫికేషన్ అంటూ సర్టిఫికెట్ పేపర్లు ఆన్లైన్ ద్వారా తీసుకున్నాడు. వెరిఫికేషన్, ఇంటర్వ్యూ అంటూ వారం రోజులు ఫోన్లోనే సంభాషణలు జరిగాయి. కంపెనీలో జాబ్ కన్ఫర్మ్ కావాలంటే ఏయే దశల్లో ఎంత మొత్తం చెల్లించాలో కూడా ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో దఫ దఫాలుగా అక్కాచెల్లెల్లిద్దరూ రూ.8 లక్షల వరకు నగదు మొత్తాన్ని బదిలీ చేశారు. అందుకు లహరి తను గతంలో ఉద్యోగం ద్వారా సంపాదించిన మొత్తం, తల్లిదండ్రుల నుంచి తీసుకున్న డబ్బును బదిలీ చేశారు. కరోనా సమయం కాబట్టి, కొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుందని, మెయిల్ ద్వారా కంపెనీ నుంచి జాయినింగ్ లెటర్ వస్తుందని సదరు వ్యక్తి చెప్పాడు. చంద్రిక, లహరి సరే అన్నారు. నెల రోజులైనా కంపెనీ నుంచి ఎలాంటి మెయిల్, ఫోన్ కాల్ రాలేదు. తాము డబ్బు చెల్లించిన వ్యక్తికి ఫోన్ చేస్తే స్విచ్డాఫ్ వస్తోంది. ఫేస్బుక్లో పరిచయమైన ఆనంద్‌కు ఎన్ని మెసేజ్‌లు చేసినా రిప్లై లేదు. ఆ తర్వాత అతని ఫేస్బుక్ అకౌంట్ కూడా కనిపించలేదు. మోసపోయామని గుర్తించేలోపు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయారు. ∙∙ స్కామ్‌లను ఇలా గుర్తించవచ్చు.. సంభాషణల్లోనే ఇంటర్వ్యూ అంటూ, ఆ వెంటనే ఉద్యోగం వస్తుందని త్వరపెడతారు. మెసేజ్‌ల ద్వారా ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తారు. ∙నిజానికి ఏ కంపెనీలు ఉద్యోగం పేరిట డబ్బు అడగవు.సెక్యూరిటీ డిపాజిట్ లేదా సర్వీస్ ఫీజు చెల్లించమని కోరవు. అనేక స్కామ్ ఇ–మెయిల్లు నిజమైన కంపెనీల నుండి వచ్చినట్లు కనిపిస్తాయి. కానీ, అవి వృత్తి పరమైనవి కావు. వారి అధికారిక డొమైన్ ఇ–మెయిల్‌లకు బదులు గూగుల్/యాహూ ఖాతాల నుండి మెయిల్స్ వస్తాయి. ఉదాహరణకు: jobs@bankofamerica.comకు బదులు ఇలా jobs@bankof-america.com ఏదో ఒక లెటర్ తేడాతో ఇ–మెయిల్ ఉంటుంది. విరామచిహ్నాలు, కామాలు, పుల్‌స్టాప్‌లు, పేరాలు, వ్యాకరణ దోషాలు.. వంటివి ఉంటాయి. ఇ–మెయిల్ ఐడీ కూడా నకిలీది ఇవ్వచ్చు. తనిఖీ సాకుతో మన వ్యక్తిగత సమాచారాన్ని (ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ కాపీలు) ఇవ్వమని అడిగితే, చట్టబద్ధమైన ఇ–మెయిల్ ఐడికి మాత్రమే పంపించామా లేదా అనేది నిర్ధారించుకోవాలి. కొన్ని ఆన్లైన్ జాబ్ స్కామ్‌లు అర్హత లేకపోయినా అధికారిక ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారానే ఉద్యోగం పొందవచ్చని చెబుతారు. సులభమైన ఆఫీసు పనిని ఇంటి నుంచే చేయవచ్చని ఆఫర్ చేస్తారు. పెనాల్టీ క్లాజ్ ఉన్న సాధారణ డేటా ఎంట్రీ ఉద్యోగం చేయడానికి ఒప్పంద పత్రంపై సంతకం చేయమని, ఇరకాటంలో పెడతారు. కొన్ని సాధారణ పనుల ద్వారానే (ఫాలో, లైక్, షేర్, కామెంట్..) ఆదాయం పొందవచ్చనే ఆఫర్ ద్వారా ఆకర్షణకు లోనుచేస్తారు. విదేశాలలో విద్య/ఉద్యోగం.. వీసా గ్యారెంటీతో భారీగా ఛార్జీలు వసూలు చేస్తారు. జాబ్ స్కామ్‌లో చిక్కుకోకుండా ఉండాలంటే.. ఫీజు కోసం అంటూ ముందస్తుగా డబ్బు చెల్లించవద్దు. ఇంటి నుంచి ఆన్లైన్ వర్క్ చేయడానికి మీరు డబ్బు చెల్లించని పనిని తీసుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంపించవద్దు. ఒక చిన్న పని కోసం కంపెనీ పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తుందంటే, అస్సలు నమ్మద్దు. ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వద్దు. అలా ఇచ్చే సందర్భాలలో ఆ కంపెనీలలో పని చేసే, మీతో పాటు చదువుకున్న స్నేహితుల సూచనలు తీసుకోవడం మంచిది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime: తల్లికి తన గురించి చెప్పిందని.. పొరుగింటి కుర్రాడే గృహిణిపై -
టీవీ రీచార్జ్ : రూ. 1.18 లక్షలు హాంఫట్
బాలానగర్: బ్యాంకు అకౌంట్ల వివరాలు, పిన్ నెంబర్లు, పాస్వర్డ్స్ ఎవరికీ చెప్పొద్దని ఎంత మొత్తుకుంటున్నా, వినియోగదారులు మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును క్షణాల్లో పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఆన్లైన్ ద్వారా టీవీ రీచార్జ్ చేసిన మహిళ రూ.1.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన సంధ్య గత నెల 30న సన్ డైరెక్ట్ రీచార్జ్ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. దీంతో ఆమె గూగూల్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి కనిపించిన నంబర్‌కు ఫోన్ చేసింది. తమ సన్ డెరెక్ట్ రీచార్జ్ కావడం లేదని తెలుపగా టీమ్‌వీవర్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని చేయాలని అవతలి వ్యక్తి చెప్పడంతో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రయత్నించినా కాలేదు. మళ్లీ రీచార్జ్ కావడం లేదని బాధితురాలు చెప్పగా మీ యూనో యాప్ పిన్ నెంబర్, పాస్వర్ట్ చెప్పండి, ఎలా చేయాలో చెబుతానని కోరగా ఆమె చెప్పడంతో ఐదు దఫాలుగా రూ. 1,18,000 ఆమె అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యాయి. మోసపోయినట్లు గ్రహించిన మహిళ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
Cyber Crime: కేవైసీ పేరుతో మహిళకు మెసేజ్ చేసి.. ఆపై
సాక్షి, అంబర్‌పేట(హైదరాబాద్): కేవైసీని నమోదు చేసుకోవాలంటూ ఓ మహిళకు మెసేజ్ పంపి ఆమె ఖాతా నుంచి రూ.65 వేలు కాజేశారు. ఈ ఘటన శనివారం అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ కథనం ప్రకారం బాగ్ అంబర్‌పేటలో నివసించే ఉషా సుబ్రమణ్యం (62)కు గత నెల జులై 29న బ్యాంక్ ఖాతాలో కేవైసీ నమోదు చేసుకోవాలంటూ మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన ఆమె అందులో ఉన్న లింక్‌ను ఓపెన్ చేసింది. దీంతో ఆమె ఖాతాలో ఉన్న రూ.65 వేలు మాయమయ్యాయి. కంగు తిన్న ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సైబర్‌క్రైం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్లో పరిచయం.. యువతికి పెళ్లి ఆఫర్.. కట్‌చేస్తే
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): ఆన్లైన్లో పరిచయమై పెళ్లి కూడా చేసుకుందామని నమ్మించి వ్యాపారం పేరుతో పెట్టుబడి పెట్టించి యువతిని మోసం చేసాడో కేటుగాడు. వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన ఓ యువతికి ఆన్లైన్లో దుబాయికి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. దుబాయిలో మంచి వ్యాపారినని నమ్మించి తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తానన్నాడు. త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకొని కలసి వ్యాపారం కొనసాగించొచ్చని కూడా నమ్మబలికాడు. నిజమని నమ్మిన యువతి 2017లో రూ.7లక్షలు అతడికి చెల్లించింది. అప్పటి నుంచి పెట్టుబడికి సంబంధించిన లాభాలు ఇవ్వకపోగా.. ఇచ్చిన డబ్బును సైతం తిరిగి ఇవ్వలేదు. ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు శనివారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. -
భారీ మోసం: రూపాయికే సరుకులు! ఎగబడిన కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. బంపర్ ఆఫర్ అని ప్రకటించి సరుకులు ఆర్డర్ పెట్టి డబ్బులు చెల్లించిన అనంతరం డెలివరీ చేయకపోవడంతో వినియోగదారులు భారీగా నష్టపోయారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని హైదరాబాద్ ప్రజలు మోసపోయారు. సైబర్ నేరగాళ్లు ఈ కొత్త పంథాను ఎంచుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. తక్కువ ధరలకు నిత్యావసరాల సరుకులు అందిస్తామంటూ ‘జాప్ నౌ’ అనే వెబ్సైట్ ప్రకటన ఇచ్చింది. కొన్ని వస్తువులు కేవలం ఒక్క రూపాయికే అందిస్తామని వల వేశారు. క్యాష్ అండ్ డెలివరీ కాకుండా ఆన్లైన్ చెల్లింపు మాత్రమే చేయాలని నిబంధన విధించారు. ఆఫర్ బాగా ఉందని భావించిన వినియోగదారులు పెద్ద ఎత్తున ఈ వెబ్సైట్లో ఆర్డర్లు ఇచ్చారు. తీరా డబ్బు చెల్లించి కొన్ని రోజులైనా వస్తువులు డెలివరీ కాలేదు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి కేసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 5 ఫిర్యాదులు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. -
Banjara Hills: కస్టమర్‌కు తెలియకుండా రూ. 11.65 లక్షలు మాయం
సాక్షి, బంజారాహిల్స్: తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 11.65 లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు విత్‌డ్రా చేశారని ఖాతాదారు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని ఇండస్ఇండ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పినిసెప్తి గణపతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకంటే ముందు 2017లో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేసిన విక్రమ్ జయరాజ్ కొలగాని ఈ మోసానికి పాల్పడ్డట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతర్గత విచారణ చేపట్టగా గతంలో పని చేసిన బ్యాంక్‌మేనేజర్ దుర్వినియోగానికి పాల్పడ్డట్లుగా తేలిందన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విక్రమ్ జయరాజ్ కొలగానిపై గురువారం క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలా.. లక్షల్లో మోసపోయారు సాక్షి, సిటీబ్యూరో/బాలానగర్: ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.సైబర్ నేరగాళ్లు సిటీవాసులను టార్గెట్ చేసుకొని రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. తీరామోసపోయిన తరువాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్లో క్యాప్చ ఎంట్రీ ఉద్యోగం పేరుతో వడోదరకు చెందిన వ్యక్తి నిషిద్ధ మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) దందా నిర్వహించి 18 మందినుంచి 22 రూ.లక్షలు స్వాహా చేశాడు. దీంతో బాధితులు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వడోదర ప్రాంతానికి చెందిన విపుల్ సిమ్హ్ చాట్వా డైమండ్ అసోసియేట్స్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో క్యాప్చాలు ఎంట్రీ చేసే జాబ్స్ ఇస్తానంటూ ఆన్లైన్లో పరిచయం చేసుకున్నాడు. రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే రోజూ రూ. 3 వేల క్యాప్చాలు పంపుతానన్నాడు. సూచించిన సైట్లో పొందుపరిస్తే ఒక్కో దానికి రూ.1 చొప్పున చెల్లిస్తానని చెప్పాడు.కొద్దిరోజుల పాటు డబ్బులిచ్చి నమ్మించాడు.ఆ తరువాత ఎక్కువ డబ్బు ఆశచూపి ఎరవేసేవాడు. రూ.లక్ష చెల్లించిన వ్యక్తి తనకు రావాల్సిన డబ్బు పొందాలంటే మరికొంత మందిని చేర్పించాల్సి ఉంటుంది. ఇలా పరోక్షంగా నిషిద్ధ మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం నిర్వహించాడు. ఇలామోసపోయిన 17 మందిలో 16 మంది ఆ ఒక్కడి ద్వారా ఇందులో చేరిన వారే. మోసపోయామని గుర్తించిన బాధితులు గురువారం సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆశకు వెళ్లి రూ.12 లక్షలు పోగొట్టుకుంది తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశకు పోయిన ఓ మహిళ ఏకంగా రూ.12.91 లక్షలు మోసపోయింది.బాలనగర్ సీఐ వాహిద్ తెలిపిన మేరకు.. రాజు కాలనీకి చెందిన సౌభాగ్య లక్ష్మి బ్యూటీషియన్‌గా పనిచేస్తుంది. ఈనెల 26న ఆమెకు తెలిసిన మహిళ ద్వారా లైటింగ్ పవర్ బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పింది. దాంతో లక్ష్మి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మొదట కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. తరువాత డబ్బు వచ్చాయి. అనంతరం యాప్ నిర్వాహకులు ఫోన్‌చేసి ఎక్కువ డబ్బు వస్తుందని ఆశచూపాడు. నమ్మిన ఆమె పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఆతరువాత మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: లైంగికదాడి వీడియో: దొరికిన కామ పిశాచాలు శభాష్ డాక్టర్.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ప్రశంస -
ఆన్‘లైన్లో’ పలకరింపు.. ఆ వెంటే సతాయింపు
మోసాలకు మార్గాలెన్నో...ఆ మార్గాల్లోకి తొంగిచూస్తే చిక్కుల్లో చిక్కుకోవడం ఖాయమంటున్నారు సైబర్ నేర నిరోధక అధికారులు. అప్రమత్తంగా లేకుంటే మనకు తెలియకుండానే సైబర్ కేటుగాళ్ల వలలో పడిపోతాం. సెల్‌ఫోన్ చేతిలో ఉందని, కొత్తగా వచ్చిన లింక్‌లు టచ్ చేస్తే ఇక టార్చర్ తప్పదు...అది ఎలా అంటే... పార్వతీపురం టౌన్: సైబర్ కేటుగాళ్లు మరో కొత్త రకం మోసానికి తెరదీస్తున్నారు. వాట్సాప్ అప్డేట్స్, ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్ల పేరుతో లింక్‌లు పంపిస్తున్నారు. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే ఫోన్లోకి వైరస్ చొచ్చుకుని డేటాను చోరీ చేస్తుంది. ఈ డేటా సాయంతో సైబర్ కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ‘మీ ఫోన్లో వాట్సాప్‌ను అప్డేట్ చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. పింక్ లుక్‌తో కొత్త ఫీచర్లను ఆస్వాదించండి.. అమెజాన్ ప్రైమ్ అద్భుతమైన ఆఫర్..ఉచితంగా పొందాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి..‘సినిమాలు, సిరీస్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లు మీ మొబైల్లోనే హెచ్డీ నాణ్యతతో వీక్షించండి..ఉచితంగా ప్రత్యక్ష ప్రసారాల కోసం ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.’ ప్రస్తుతం ఫోన్లు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్న సంక్షిప్త సందేశాలివీ. వీటితో పాటు వచ్చే లింక్‌ను పొరపాటున క్లిక్ చేస్తే చాలు ఫోన్లోకి వైరస్ ప్రవేశిస్తోంది. వెంటనే సదరు ఫోన్ సైబర్ నేరస్తుల స్వా«దీనంలోకి వెళ్లిపోతోంది. సైబర్ నేరస్తులు ఆయా సంస్థల పేర్లను వినియోగించుకొని లింకుల్ని పంపిస్తున్నారు. పొరపాటున దానిని క్లిక్ చేస్తే స్పామ్ రూపంలో వైరస్లు ఫోన్లోకి చొరబడుతున్నాయి. డేటా చోరీకి గురవుతోంది. ఫోన్లో రహస్య సమాచారమేదైనా ఉంటే వాటిని చూపించి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. లింక్‌ల్ని తెరవగానే ‘ఆన్లైన్ స్ట్రీమ్’కు అనుమతి ఇవ్వాలని నేరగాళ్లు అడుగుతున్నారు. అనుమతి ఇస్తే దాని ఆధారంగా నేరస్తులు బల్‌్కగా లింక్‌ల్ని మనకు ప్రమేయం లేకుండానే మన ఫోన్లోని కాంటాక్టులకు పంపేస్తారు. వారు వాటిని తెరుస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరదీస్తున్నారు. దీనిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్‌లలో వస్తున్న లింక్‌ల జోలికి వెళ్లి అనవసర ఇబ్బందులను కొనితెచ్చుకోవద్దు. లింక్‌లను టచ్ చేస్తే వ్యక్తిగత సమాచారమంతా హ్యాకర్ల జోలికి పోతుంది. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఆన్లైన్ నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పరిచాం. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – సుభాష్, డీఎస్పీ, పార్వతీపురం చదవండి: కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం.. జూదానికి డబ్బు ఇవ్వలేదని ఓ తండ్రి దారుణం.. -
రెచ్చిపోతున్న ఆన్లైన్ మోసగాళ్లు..
శ్రీకాళహస్తిలో ఆన్లైన్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ–కామర్స్ వెబ్‌సైట్స్ పేరుతో బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. స్క్రాచ్ కార్డ్‌లను పంపించి వంచిస్తున్నారు.. అకౌంట్ నగదు జమచేశామని నకిలీ రశీదులతో వలేస్తున్నారు.. నమ్మినవారి సొమ్ము కాజేస్తున్నారు. నమ్మకపోతే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇదెక్కడి ఖర్మరా బాబూ.. అంటూ చాలామంది బాధితులు తలపట్టుకుంటున్నారు. కొందరు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. శ్రీకాళహస్తి: పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన సుజాత అనే మహిళకు స్నాప్‌డీల్ పేరుతో పోస్టులో ఇటీవల ఓ లేఖ, స్క్రాచ్ కార్డ్ వచ్చింది. కార్డ్‌ను రఫ్ చేస్తే అందులో ఉంటే నగదును మీ ఖాతాలో జమచేస్తామని ఉంది. దీంతో ఆమె స్క్రాచ్ కార్డును రఫ్ చేయగా అందులో రూ.6లక్షల అంకె వచ్చింది. కొంతసేపటి తర్వాత సుజాతకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. జీఎస్టీ కింద రూ.7వేలు ఆన్లైన్లో చెల్లిస్తే మీకు రూ.6లక్షలు పంపిస్తామని చెప్పాడు. ఈ విషయాన్ని సుజాత తమ వారికి తెలియజేయగా వారు ఇలాంటివి నమ్మవద్దని సూచించారు. దీంతో ఆమె మిన్నకుండిపోయింది. మళ్లీ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ ఖాతాలో రూ.6లక్షలు వేశామని, కావాలంటే చూసుకోమంటూ బ్యాంకు ఓచరు, ఫోన్ పే ద్వారా నగదు జమ చేసినట్లు ఓ మెసేజీని పంపించాడు. సుజాత స్పందించకపోవడంతో ఫోన్లో తిట్లు లంకించుకున్నాడు. దీనిపై బాధితురాలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పట్టణంలోని భాస్కరపేటకు చెందిన దొర అనే వ్యక్తికి సైతం ఫ్లిప్‌కార్ట్ పేరుతో ఇలాంటి మెసేజీనే వచ్చింది. ఫోన్ పే ద్వారా రూ.7వేలు చెల్లిస్తే రూ.6లక్షలు జమచేస్తామని అందులో ఉంది. తర్వాత దొర ఖాతాలో నగదు వేశామని ఫేక్ మెసేజీలను పంపించారు. అయితే దొర స్పందించకపోవడంతో అసభ్య పదజాలంతో తిట్టడం మొదలుపెట్టారు. ముఖ్యంగా +917430572125, +9184264 89012, +919056098755 హెల్ప్‌లైన్ నంబర్ పేరుతో శ్రీకాళహస్తి వాసులకు తరచుగా ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి. వీటిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆన్లైన్ మోసగాళ్ల ముఠా ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితులు కోరుతున్నారు. చదవండి: హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు కృష్ణా జిల్లా మంటాడలో దారుణం.. -
సోఫా కొంటాను రూపాయి పంపమన్నాడు, నిండా ముంచేశాడు
సాక్షి, చందానగర్: ఓఎల్ఎక్స్లో సోఫా అమ్మకం కోసం పెట్టిన వ్యక్తిని మోసగించి రూ.25 వేలు కాజేసిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా కథనం ప్రకారం.. చందానగర్ అపర్ణ లేక్ బ్రిజ్ అపార్ట్మెంట్లో నివాసముండే జోసెఫ్ అంగర్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. అతను ఓఎల్ఎక్స్లో తన సోఫా విక్రయానికి పెట్టగా, ఫోన్ నం. 9090045860 నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. రూ. 15 వేలకు సోఫా కొనుగోలు చేస్తానని, తనకు ఒక రూపాయి క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాలని ఓ గుర్తు తెలియని వ్యక్తి కోరారు. జోసెఫ్‌కు క్యూ ఆర్ కోడ్ పంపించాడు. ఆ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన జోసెఫ్ ఒక రూపాయి పంపగా, తిరిగి రూ. 2 వచ్చాయి. అలా ఒకటి, రెండు, ఐదు, పది రూపాయల వరకు పంపగా అవి రెట్టింపు అయ్యి జోసెఫ్‌కు వచ్చాయి. ఇది నిజమని నమ్మిన జోసెఫ్ పేటీఎం అకౌంట్ నుంచి రూ.5 వేలు గుర్తు తెలియని వ్యక్తికి పంపగా, సాంకేతిక కారణాలు చెప్పి జోసెఫ్ నుంచి ఆ కేటుగాడు దఫా దఫాలుగా మొత్తం రూ. 25 వేలు రాబట్టాడు. తనకు డబ్బులు తిరిగి రాకపోగా గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ పేరిట టోకరా చందానగర్: కేవైసీ అప్డేట్ పేరుతో రూ.39,999 కాజేసిన ఘటన చందానగర్ ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన ప్రకారం.. డోయన్స్ టౌన్షిప్ కాలనీలో నివాసముండే చల్లా శ్రీనివాస్‌రెడ్డి ఎల్ఐసీ ఏజెంట్. కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నానని ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడికి కాల్ చేశాడు. మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పి లింక్ పంపించాడు. ఆ లింక్‌ను ఓపెన్ చేయగా క్లిక్ సపోర్ట్ అనే యాప్ డౌన్లోడ్ అయ్యింది. మరో లింక్ పంపుతానని గూగుల్ క్రోమ్ ద్వారా దానిని ఓపెన్ చేసి, రీచార్జ్ కోసం ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేయాలని చెప్పాడు. అతడు చెప్పిన విధంగా శ్రీనివాస్‌రెడ్డి చేయగా, అందులో టాప్ హెడ్లైన్ ద్వారా రీఛార్జ్ రూ.32 చేయాలని ఉంది. ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేసిన మరుక్షణమే శ్రీనివాస్‌రెడ్డి అకౌంట్లో ఉన్న మొత్తం రూ.39,999లు డెబిట్ అయినట్లు మెసెజ్ వచ్చింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మేమేం పాపం చేశాం.. మాకెందుకీ కడుపుకోత -
యూకే నుంచి బహుమతి అంటూ... రూ.18 లక్షలు స్వాహా
సాక్షి, నాగోలు: యూకే నుంచి బహుమతి పార్శిల్ వచ్చిందని, దానిని మీకు ఇవ్వాలంటే ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు చార్జీలు చెల్లించాలని నమ్మించి రూ.18 లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను శనివారం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన హెన్రీ చుక్వుని ఒపెరా మెడికల్ వీసాపై భారత్ వచ్చి కర్టాటకకు చెందిన మహిళను వివాహం చేసుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ద నగర్లో నివాసం ఉంటున్నాడు. న్యూఢిల్లీలో ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసే వ్యక్తితో నైజీరియా జాతీయుడి పరిచయం చేసుకున్నాడు. ఆన్లైన్ మోసాలకు అలవాటు పడ్డారు హెన్రీ ఫుట్‌బాల్ ఆడటానికి వచ్చేవాడు. అక్కడే ఉండే మరోక నైజీరియా చెందిన చీమా ఫ్రాంక్ను ఇతర స్నేహితులకు పరిచయం చేశాడు. అందరూ కలసి ఆన్లైన్ బహుమతి మోసాలు, ఉద్యోగ మోసాలు, రుణ మోసాలు పాల్పడి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఆన్లైన్ మోసాలు చేయడం ప్రారంభించారు. బహుమతులు పంపే నెపంతో నగరంలోని ఓ వ్యక్తికి హెన్రీ చుక్వుని ఒపెరా మెసేజ్ పెట్టాడు. యూకే నుంచి కరెన్సీలో పెద్ద మొత్తంలో బహుమతి వచ్చింది.. ఢిల్లీ విమానాశ్రమంలో ఉంది. దానిని మీకు పంపించాలంటే కస్టమ్ అధికారులకు ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని స్థానికంగా ఉండే నోయిడాకు చెందిన ఆటో డ్రైవర్ సూరజ్ బ్యాంకు ఖాతాల్లో రూ. 18 లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. ఆటో డ్రైవర్‌కు రూ. 55 వేలు నగదు అందజేశాడు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో హెన్రీ చుక్వుని ఒపెరా, ఆటో డ్రైవర్ సూరజ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. ( చదవండి: సైబర్ నేరగాళ్ల చేతి వాటం.. రూ.1.2 లక్షలు స్వాహా ) -
సైబర్ నేరగాళ్ల చేతి వాటం.. రూ.1.2 లక్షలు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: వరుస సెలవుల నేపథ్యంలో స్పెషల్ ఆఫర్...వర్కింగ్ డే రోజు డబ్బు డ్రా చేసుకునే అవకాశం... అంటూ నగరవాసికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.1.2 లక్షలు స్వాహా చేశారు. అప్పటి వరకు తన యాప్‌లో కనిపించిన మొత్తం హఠాత్తుగా కనుమరుగు కావడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శ్రీనగర్ కాలనీ ఎక్స్టెన్షన్కు చెందిన ఓ యువకుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇతడికి గతంలో ఇంటర్నెట్ ద్వారా క్లిక్ ప్రొ మీడియా లిమిటెడ్ సంస్థ వివరాలు తెలిశాయి. వీరి వద్ద రూ.10 వేలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా 10 శాతం వడ్డీగా అందిస్తారు. వాళ్లు ఇచ్చే యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా మై క్లిక్ బ్యాంక్ యాప్‌లోకి ఎంటర్ కావాలి. అక్కడ జమ అయ్యే మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు మళ్లించుకుని డ్రా చేసుకోవాలి. కొన్ని నెల క్రితం రూ.10 వేలు కట్టి ఈ స్కీమ్‌లో చేరిన యువకుడికి ఇప్పటి వరకు రూ.5600 వచ్చాయి. దీంతో ఇతడికి ఈ సంస్థపై పూర్తి నమ్మకం వచ్చింది. యువకుడికి శుక్రవారం ఆ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. వారి ప్రతినిధిగా మాట్లాడిన యువతి వరుస హాలిడేస్ నేపథ్యంలో స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామని చెప్పింది. రూ.40 వేలు చెల్లించి వీఐపీ గోల్డ్ కార్డ్ సభ్యుడిగా మారాలని, వీరికి ప్రతి నెలా 20 శాతం రిటర్న్‌తో పాటు ప్రత్యేక బోనస్ వస్తుందని నమ్మబలికింది. ఈ మొత్తం ఏరోజుకారోజు యాప్‌లో జమ చేస్తామని నమ్మబలికింది. దీంతో ఈ యువకుడు శనివారం రూ.40 వేలు చెల్లించాడు. దీంతో ఇతడి యాప్‌లో కొంత మొత్తం జమైనట్లు కనిపించాయి. ఆపై మరోసారి కాల్ చేసిన యువతి మరో రూ.50 వేలు చెల్లిస్తే ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని, ఏప్రిల్ 19తో అవి ముగుస్తాయని చెప్పింది. దీంతో బాధితుడు మరో రూ.50 వేలు చెల్లించాడు. ఆపై కొద్దిసేపటికే తన యాప్‌లో చూడగా బోనస్‌గా మొత్తం రూ.8 వేలు వచ్చినట్లు కనిపించింది. ఆ మొత్తాన్ని సెలవులు ముగిసిన తర్వాత డ్రా చేసుకోవచ్చని అందులో కనిపించింది. ఈలోపు మరోసారి కాల్ చేసిన యువతి ఇంకో రూ.30 వేలు రిన్వెస్ట్ చేసింది. బుధవారం నుంచి ఆ యాప్ పని చేయకపోవడం, సంస్థ నిర్వాహకుల నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని బాధితుడు తెలుసుకున్నాడు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష మంది నుంచి 300 కోట్లు స్వాహా
సాక్షి, చెన్నై : ‘ఎలాంటి ష్యూరిటీ లేకుండా కోరినంత అప్పుకావాలా.. అయితే సంప్రదించండి’ అనే ఆకర్షణీయమైన ప్రచారాలు, ఆన్లైన్ మోసాలు కుటుంబాలను కూలదోస్తున్నాయి. అమాయకుల నుంచి దోచుకున్న రూ. 300 కోట్లను పెట్టుబడులుగా మార్చి దాచుకుంటున్న ముఠా బెంగళూరులో పట్టుబడడంతో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై వేంగైవాసల్‌కు చెందిన గణేశన్ ఆన్లైన్ యాప్ ద్వారా రుణం పొంది బెదిరింపులకు గురవుతున్నట్లు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి బెంగళూరుకు కేంద్రంగా చేసుకుని కాల్‌సెంటర్ నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న జీయోయామావో (38), వ్యూయానులం (23) అనే ఇద్దరు చైనీయులను, వీరి భాగస్వాములైన ప్రమోదా, భవాన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అతి స్పల్పకాలంలో లక్ష మంది నుంచి 36 శాతం వడ్డీపై రుణాలు ఇచ్చి రూ. 300 కోట్ల వరకు చట్ట వ్యతిరేకంగా ఆర్జించినట్లు విచారణలో తేలింది. అధికారులు కథనం.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హాంగ్ అనే వ్యక్తి చైనాలో ఉంటూ భారతదేశమంతా మండలాల వారీగా కాల్ సెంటర్లను ప్రారంభించి స్థానికులను డైరెక్టర్లుగా నియమిస్తాడు. ఇలా ఆన్లైన్ మోసాలతో ఆర్జించిన సొమ్మును భారీ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా బహిర్గతమైంది. అంతేగాక పెట్టుబడులకు ఢోకా లేని అనేక కంపెనీల్లో మదుపు చేశారు. చైనీయులు భారత్‌లో అంత సులభంగా వ్యాపారాలు, కంపెనీలు స్థాపించేందుకు వీలులేదు. వీరి వెనుక నేరచరిత గలిగిన కొందరు భారతీయులు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొద్ది పెట్టుబడులతో భారీ లాభార్జన కోసం చైనీయులతో చేతులు కలిపిన వారెవరని అధికారులు ఆరా తీస్తున్నారు. చైనాలో ఉన్న ప్రధాన నిందితుడు హాంగ్‌ను అరెస్ట్ చేయడంపై న్యాయకోవిదులతో ఈడీ అధికారులు చర్చిస్తున్నారు. -
ముంచిన యాప్: రూ.1.5 కోట్ల మేర కుచ్చుటోపీ!
సాక్షి, కొండపి(ప్రకాశం): మండలంలోని పలువురు యువతకు ఆన్లైన్ మోసకారులు గాలం వేశారు. బీహార్, బెంగళూరు, ముంబాయిల చిరునామాలతో అమాజిన్ ఈ కామర్స్ కంపెనీ లిమిటెడ్ పేరుతో సర్టిఫికెట్ ఆన్లైన్లో పెట్టి యువకులతో చాట్ చేశారు. డబ్బులు డిపాజిట్ చేయించుకుని ఎనిమిది నెలల పాటు ఆటసాగించారు. వారం క్రితం ఒక్కసారిగా యువత డిపాజిట్ చేసిన డబ్బును నొక్కి కుచ్చుటోపి పెట్టిన ఆన్లైన్ మోసం మండలంలోని పెదకండ్లగుంట గ్రామంలోని బాధితుల ద్వారా మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళితే..పెదకండ్లగుంట గ్రామానికి చెందిన యువకులకు తమ గ్రామంలోని ఇతర ప్రాంతాల్లోని యువకుల ద్వారా బర్స్ యాప్ గురించి తెలుసుకుని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విధంగా గ్రామంలో 30 మందికి పైగా ఆకర్షితులు కావటంతో పాటు కొండపిలో సైతం కొంతమంది ఈయాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. సంస్థ ఇచ్చిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా నూతన ఖాతాలు ఆన్లైన్లోనే తెరచుకున్నారు. వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి నేరుగా యాప్‌లో రూ.600 పెట్టుబడి నుండి రూ.30 వేలు, రూ.50 వేల వరకు డిపాజిట్ చేశారు. రూ.600 డిపాజిట్‌కి వచ్చే బబుల్స్ మీద నొక్కితే రూ.2 వరకు కమీషన్ వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. రోజుకు 30 సార్లు అవకాశం ఇస్తారు. అదే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్ చేస్తే 30 సార్లు వచ్చే బబుల్స్‌ని నొక్కితే రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వస్తుంది. కమీషన్ కింద వచ్చే డబ్బుల్లో 18 శాతం జీఎస్టీ కూడా కట్ చేసి వారి అకౌంట్లలో జమచేస్తారు. ఈ విధంగా బబుల్స్ గేమ్స్ మేనెల నుంచి డిసెంబర్ 25 వరకు ఆడారు. అయితే పది రోజుల నుంచి బబుల్స్ వస్తున్నా..కమీషన్ డబ్బులు పడటం ఆగిపోయాయి. రెండు రోజుల నుంచి పూర్తిగా గేమ్‌తో పాటు లావాదేవీలు సైతం నిలిచిపోయాయి. దీంతో సొంత పెట్టుబడితో పాటు గేమ్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును ఒక్క పెదకండ్లగుంట, కొండపి గ్రామాల్లోనే 30 మందికి పైగా రూ.7 లక్షలకు పైగా నగదు పోగొట్టుకున్నారు. దీంతో లబోదిబోమంటూ బయటకు చెప్పుకుంటే సిగ్గుచేటని కిమ్మనకున్నారు. ఒకరు అర బయటకు వచ్చి తమకు జరిగిన మోసం గురించి బయటపెట్టారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని వందల మంది రూ.1.5 కోట్ల వరకు నష్టపోయి ఉంటారని బాధితులు అంటున్నారు. ఈ విషయమై కొండపి ఎస్ఐ రాంబాబును వివరణ కోరగా దీనిపై తనకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు. (చదవండి: పెళ్లి బస్సు బోల్తా: ఏడుగురు మృతి) మోసపోయాం ఆశకు పోయి ఆన్లైన్ మోసానికి గురయ్యాం. నాతో పాటు కొండపిలో 30 మందికి పైగా రూ.7 లక్షల వరకు నష్టపోయాం. నాకు తెలిసిన ఒంగోలులోని మిత్రుడు రూ.1.5 లక్షల వరకు నష్టపోయాడు. ఇంకా చెప్పటానికి వెనుకంజ వేస్తున్న ఎంతో మంది జిల్లా వ్యాప్తంగా వందల్లో ఉన్నారు. అంతా దాదాపు రూ.1.5 కోటికిపైగా నష్టపోయి ఉంటారు. ఎవరూ ఇటువంటి మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకోవద్దు. - నారాయణ, పెదకండ్లగుంట -
నమ్మించి.. రూ.25 కోట్లకు ముంచారు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలలో పెట్టుబడి పెడితే కొన్ని రోజులకు రెట్టింపు చేసిస్తామని నలుగురు వ్యక్తులు జిల్లాలోని పలువురు యువకులను నమ్మించి రూ.25 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. బాధితులు సోమవారం పోలీస్ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశా రు. చైన్ స్కీం, ఈగల్ బిట్ కాయిన్, యాడ్స్ స్టూడియో, వరల్డ్ డిజిటల్ గోల్డ్ కాయిన్ సంస్థల పేరుతో చిట్టోజి రాజేశ్, తాటి గంగయ్య, వెంకటేశ్, పుప్పాల శ్రీనివాస్ జిల్లాలో కొంతమంది యువకులను సంప్రదించారు. ఆన్లైన్ ద్వా రా తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు చేసిస్తామని, సంస్థల్లో ఇంకా కొం తమందిని సభ్యులుగా చేర్చితే కమీషన్ వస్తుందని చెప్పారు. ఈ మాటలను నమ్మిన ఆర్మూర్, నందిపేట్, నిజామాబాద్ నగర ప్రాంతాలకు చెందిన యువకులు ఒక్కొక్కరు రూ.63వేల వరకు నాలుగైదు సార్లు ఆన్లైన్లో చెల్లించారు. వీరు పెట్టుబడి పెట్టినందుకు కొంత లాభం వచ్చిందంటూ రాజేశ్ బృందం ప్రతినెలా రూ.5 వేల వరకు రెండు, మూడు నెలల పాటు ఆ యువకులకు ఇచ్చింది. దీంతో డబ్బులు వస్తున్నాయనే ఆశతో బాధిత యువకులు చాలామందిని సభ్యులుగా చేర్పించి వారితోనూ పెట్టుబడి పెట్టించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 450 మంది సభ్యులుగా చేరగా, రూ.25 కోట్లకు పైగా పెట్టుబడిగా వచ్చింది. ఇటీవల తాటి గంగయ్య, వెంకటేశ్, పుప్పాల శ్రీనివాస్, చిట్టోజి రాజేశ్‌కు పెట్టుబడి పెట్టిన వారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురూ పారిపోయారని, వారిని పట్టుకుని తమ డబ్బులు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కోరారు. -
ఆన్లైన్ మోసం: రూ.16.50 లక్షలు లూటీ!
సాక్షి, చిత్తూరు అర్బన్: ‘‘ హలో సర్! మీరు తీసుకున్న పాలసీల ప్రీమియం మధ్యలో ఆపేశారు. ఇప్పుడు ఓ రూ.60 వేలు కడితే మీకు రూ.3.20 లక్షలు వస్తాయి..’’ అని ఓసారి.. ‘‘మీరు చెల్లించిన రూ.60 వేలతో కలిపి మీ బీమా సొమ్ము రూ.7 లక్షలకు మెచ్యూర్ అయ్యింది. మరో రూ.30 వేలు కడితే జీఎస్టీ క్లియరెన్స్ అవుతుంది. మీకు మొత్తం నగదు ఇచ్చేస్తాం..’’ అంటూ మరోసారి.. ఇలా నాలుగేళ్లుగా ఓ వ్యక్తిని మోసం చేస్తూ రూ.16.50 లక్షలు లూటీ చేశారు. బాధితుడు మంగళవారం చిత్తూరు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల కథనం మేరకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సందీప్ కిషోర్ దుర్గానగర్ కాలనీలో కాపురం ఉంటున్నాడు. 2013లో ఇతను ఓ ప్రైవేటు సంస్థ నుంచి అభయ్ (ఏటా రూ.10 వేల ప్రీమియం), పీఎన్బీ (ఏటా రూ.30 వేల ప్రీమియం) పాలసీలు తీసుకున్నాడు. రెండేళ్లపాటు ప్రీమియం చెల్లించాడు. 2016లో ఇతనికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. తాను ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నట్లు దీపక్ పేరిట పరిచయం చేసుకున్నాడు. ప్రీమియం మధ్యలో చెల్లించి వదిలేయడం వల్ల ఆటో రెన్యువల్ అ య్యిందని, రూ.40 వేలు చెల్లిస్తే రూ.3.20 లక్షలు వస్తా య ని నమ్మించి ఆన్లైన్ ద్వారా డబ్బులు కట్టించుకున్నాడు. తరువాత కూడా వేర్వేరు వ్యక్తులు ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ సందీప్ నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే, నెఫ్ట్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, ఏటీఎంల ద్వారా 32 సార్లు లావాదేవీలు నిర్వహించి రూ.16.50 లక్షలు వసూలు చేశారు. చివరగా ఈనెల 17న సైతం రూ.48,360 చెల్లించా డు. చివరకు పాలసీ డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగేళ్లపాటు అతడు ఇలా మోసపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టూటౌన్ సీఐ యుగంధర్ కేసు నమోదు చేసి సైబర్‌క్రైమ్ విభాగానికి బదిలీ చేయడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రేవ్ పార్టీ : విందులు, అమ్మాయిలతో చిందులు..) -
ఫోన్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ..
సాక్షి, విజయవాడ : అవసరం కోసం అప్పుచేసి మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో చిక్కుకొన్న బాధితులు ఒకరొకరుగా బయటకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. యాభై వేలు లోన్ తీసుకొని 2 లక్షల 80 వేలు కట్టినా వేధింపులు ఆపలేదంటూ నాగరాజు అనే బాధితుడు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ లోన్ యాప్‌ల ఉచ్చులో చిక్కుకొన్న తనను కాపాడి రుణ విముక్తి కలిగించాలని వేడుకున్నాడు. అనంతరం నాగరాజు సాక్షి టీవీతో మాట్లాడాడు. ఫేస్బుక్లో ప్రకటన చూసి తొలుత నాలుగు యాప్‌లలో 20వేల రూపాయల లోన్ తీసుకున్నానని తెలిపాడు. కమిషన్ తీసుకొని తన అకౌంట్లో పదకొండు వేలు వేసినట్లు తెలిపాడు. చదవండి: వారిని ఉపేక్షించేది లేదు: సీఎం జగన్ ‘వారం లోపే లోన్ తిరిగి చెల్లించాలి. రొటేషన్ కోసం చాలా యాప్‌లలో లోన్ తీసుకొని డ్యూలు కట్టాను. 50 వేలకి 2 లక్షల ఎనభై వేలు చెల్లించినా అప్పు తీరలేదని వేధిస్తున్నారు. ఫోన్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ క్షోభ పెడుతున్నారు. ఫోన్ కాంటాక్ట్ నంబర్లకు మెసెజ్‌లు పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తున్నారు. నలభై శాతం వడ్డీ వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. అవసరానికి అప్పుచేసి వాళ్ళ ఉచ్చులో ఇరుక్కున్నాను. ప్రభుత్వ భరోసాతో పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేశాను. నాలాగు చాలామంది మైక్రో ఫైనాన్స్ తీసుకొని మానసిక క్షోభ అనుభవిస్తున్నారు’. అని నాగారాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
కోవిడ్ దెబ్బకు క్రిమినల్ అవతారం
సాక్షి, సిటీబ్యూరో: సాఫ్ట్వేర్ రంగంలో పని చేసే వారి జీవితాల్లో మరో దయనీయ కోణమూ ఉంది. తమ జీతంపై ఆశతో అనేక మంది అప్పులు చేస్తున్నారు. కోవిడ్ వంటి వాటితో పరిస్థితులు తల్లకిందులైతే దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. అలాంటి వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం, నేరగాళ్లుగా మారడం జరుగుతోంది. దీనికి తాజా ఉదాహరణే హేమంత్‌కుమార్ వ్యవహారం. మాట్రిమోనియల్ ఫ్రాడ్స్‌కు పాల్పడుతున్న ఇతగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన హేమంత్‌కుమార్ ఉన్నత విద్యనే అభ్యసించాడు. చాన్నాళ్లు అక్కడి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎథికల్ హ్యాకర్‌గా పని చేశాడు. ఆ సమయంలో ప్రతి నెలా ‘ఐదంకెల’ జీతం అందుకున్న హేమంత్‌కుమార్ దానికి తగ్గట్లే తన లైఫ్‌ను ప్లాన్ చేసుకున్నాడు. ప్రతి నెలా వచ్చే జీతంలో తన ఖర్చులు పోగా.. ఎక్కువ మొత్తమే మిగిలేది. దీంతో దాదాపు ఐదేళ్లు కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు మరికొంత మొత్తం రుణం తీసుకుని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఓ ఫ్లాట్ కొన్నాడు. కొన్నాళ్ల పాటు ఈఎంఐల చెల్లింపు సజావుగానే సాగింది. కోవిడ్ ప్రభావంతో లాక్డౌన్ అమలులోకి రావడంతో అనేక మంది సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారి మాదిరిగానే అతడు సైతం ఇబ్బంది పడ్డాడు. హఠాత్తుగా ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డాడు. కొత్తగా ఖరీదు చేసిన ఫ్లాట్‌కు సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేని స్థితికి చేరాడు. తన కష్టార్జితంతో పాటు రుణం తీసుకుని ఖరీదు చేసిన ఆ ఫ్లాట్ బ్యాంకు వారి పరం అవుతుందని భయపడ్డాడు. దానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించడంతో పాటు పనిలో పనిగా తన ఖర్చుల కోసమూ మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ మొదలెట్టాడు. పలు మాట్రిమోనియల్ సైట్స్‌లో తన పేరు, వివరాలను రిజిస్టర్ చేసుకున్నాడు. అందులో ఉన్న యువతుల ప్రొఫైల్స్‌లో కొన్నింటిని ఎంపిక చేసుకునే వాడు. వారికి సందేశాలు పంపుతూ వివాహం చేసుకోవడానికి సమ్మతమని చెప్పేవాడు. తాను బెంగళూరులో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పరిచయం చేసుకునే వాడు. తన వల్లోపడిన వారితో కొన్నాళ్లు చాటింగ్, ఫోన్ కాల్స్ కొనసాగించేవాడు. ఆపై అసలు కథ మొదలెట్టే హేమంత్‌కుమార్ తనకు అత్యవసరమనో, తల్లిదండ్రులకు ఆనారోగ్యమనో ఆ యువతితో చెప్పేవాడు. ఆ కారణంతో ఆమె నుంచి అందినకాడికి తీసుకుని దండుకుని ఆపై మోసం చేసేవాడు. కొన్నిసార్లు తన ఫోన్ నెంబర్ మార్చేయగా.. మరి కొన్నిసార్లు ఎదుటి వారివి బ్లాక్ చేస్తున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది యువతులు మిన్నకుండిపోయాడు. బెంగళూరుకు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో అక్కడి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన ఇతగాడు నెల కూడా సక్రమంగా ఉండలేదు. మరో పేరులో మరో మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. హుబ్లీ చెందిన యువతిని మోసం చేయడంతో ఆమె అక్కడ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన మరో యువతి నుంచి కూడా హేమంత్‌కుమార్ రూ.2.1 లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో హేమంత్‌కుమార్‌పై నగరంలో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి నిందితుడు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
యాప్ డౌన్లోడ్.. 9 లక్షలు ఫట్
నాగ్‌పూర్ (మహారాష్ట్ర) : సైబర్ మోసాలు నిత్యకృత్యంగా మారాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షలకు లక్షలు పొగొట్టుకుంటున్న ఉదంతాలు దేశవ్యవాప్తంగా ప్రతిరోజు చోటుచేసుకుంటున్నాయి. మీ డబ్బును రెండింతలు పెంచుతామంటూ ఆన్లైన్ మోసానికి పాల్పడిన ఘటన తాజాగా నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కస్ట్మేర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామంటూ ఫోన్లో రిమోట్ డెస్క్‌టాప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా బాధితుడికి కాల్ వచ్చింది. ఆ సమయంలో తండ్రి మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలుడు వెంటనే నిందితులు సూచించిన యాప్‌ను డౌన్లోడ్ చేశాడు. అంతే ఒక్క నిమిషంలోనే బ్యాంకు ఖాతా నుంచి 9 లక్షలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న తండ్రి అశోక్ మాన్వాటే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెక్షన్ 419, 420 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. నిందితులు కాలర్ యాక్సెస్ పొందిన వెంటనే డబ్బును తమ అకౌంట్స్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని పేర్కొన్నారు. చదవండి: మహారాష్ట్రలో జైళ్లు ఫుల్ -
ఆన్లైన్ మోసం.. పోలీసులకే టోకరా..
విజయనగరం క్రైమ్: సైబర్ నేరగాళ్లు పోలీసుశాఖనూ వదిలి పెట్టడం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని సెల్కే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన మెసెజ్‌లకు కనీసం వారికి ఫోన్ చేయకుండా ఏం ఇబ్బందుల్లో ఉన్నాడో అనుకుంటూ కేవలం చాటింగ్ మాత్రమే చేస్తూ డబ్బులు పంపించేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చివరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వారిని కూడా వదల్లేదు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆపదంటే ఆదుకునే మనసున్న వాళ్లు చాలామంది ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్తరకం పంథా మొదలెట్టేశారు. ఫేస్బుక్లో పోలీసులు, లాయర్లు, వైద్యుల పేర్లతో కొత్తగా పేజీలు సృష్టించడం.. అందులో ఉన్న వారికి ఫ్రెండ్స్ రిక్వెస్టులు పెట్టడం.. వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత వారికి మెసెంజర్ ద్వారా అత్యవసరమంటూ రెండు, మూడు వేల రూపాయల సాయం చేయమనడం జరుగుతోంది. దీంతో చాలా మంది ఏదో అవసరం ఉంటుందులే అనుకుని పేటీమ్, ఫోన్‌పే ద్వారా పంపించేస్తున్నారు. ఈ కోవలోనే చాలా మంది పోలీస్ అధికారులు కూడా బలయ్యారు. రూ. లక్షల్లో సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. తాజాగా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై హరి పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా ప్రారంభించారు. అతని మిత్రులందరినీ నకిలీ ఖాతాలో యాడ్ చేసుకుని వారితో మెసెంజర్ ద్వారా చాట్ చేశారు. అర్జెంట్ అవరం ఉందని.. గంటలో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ స్నేహితులకు మెసేజ్‌లు పంపించడంతో చాలా మంది ఫోన్‌పే, పేటీఎంల ద్వారా పంపించారు. అయితే ఫోన్ పేలో పేరు సరిగా లేకపోవడంతో ఒకరికి అనుమానం వచ్చి ఎస్సై హరికే నేరుగా ఫోన్ చేయడంతో ఆయన అవాక్కయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమందించి, ఆ ఖాతాను బ్లాక్ చేయించారు. ఎవ్వరూ డబ్బులు వేయవద్దని వాట్సాప్ ద్వారా మిత్రులందరికీ మెసెజ్‌లు పెట్టారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగాలంటూ..
సాక్షి, కృష్ణా : గన్నవరం విమానాశ్రయంలో ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఆన్లైన్ మోసానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. ఉద్యోగంలో చేరండి అంటూ మోసగాళ్లు ఆన్లైన్లో అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తుండటంతో నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆశతో ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిన యువకులకు మోసం అని తెలియడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ విషయంపై గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ.. ఆన్లైన్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మొద్దని సూచించారు. గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగం ఇస్తామని మోసం చేసినట్లు కొంత మంది ఫోన్ ద్వారా తెలియజేశారని వెల్లడించారు. ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు ఎయిర్ లైన్స్ నిజమైన వెబ్సైట్లో చూసి వెళ్లాలని తెలిపారు. ఎయిర్ లైన్స్‌లో ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ముందస్తుగా నగదు డిపాజిట్ చేయించి అపాయింట్మెంట్ లెటర్ ఆన్లైన్లో పంపిస్తే అది ఫేక్‌గా గుర్తించాలని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిస్తే ఎయిర్ పోర్ట్ అథారిటీ ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగాలు పేరిట మోసపోకుండా ముందస్తుగా తెలుసుకునేందుకు ఓ ఫోన్ నంబర్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గతంలో కూడా మోసపోయిన వారు తమ దృష్టికి తీసుకురావడంతో విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. -
పాపం మందుబాబు.. ఆరుసార్లు ఓటీపీ చెప్పి..
ముంబై : కరోనావైరస్ ప్రపంచమంతా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వల్ల దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భారత్ లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా మొత్తం బంద్ అయింది. నిత్యావసర వస్తువులు తప్ప ఏవి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. ఈ కరోనా ఎఫెక్ట్ మందుబాబులపై కూడా పడింది. లాక్డౌన్ వల్ల మద్యం షాపులన్నీ బంద్ చేశారు. దీంతో తాగడానికి మందులేక లిక్కర్ బాబులు గిలగిల కొట్టుకుంటున్నారు. ఇక లిక్కర్ షాపులన్నీ బంద్ కావడంతో మద్యం ప్రియులు ఆన్ లైన్ అమ్మకాలపై దృష్టి పెట్టారు. ఇదే అదునుగా భావించి.. సైబర్ క్రైమ్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. మద్యం సరఫరా చేస్తామని చెబుతూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఇలా ఆన్లైన్లో మద్యం ఆర్డర్ చేసి లక్ష రూపాయలు పొగొట్టుకుంది ఓ జంట. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ముంబైలోని చెంబూర్‌కు చెందిన ఓ దంపతులు మార్చి 24వ తేదీన ఆన్లైన్లో మద్యం కోనుగోలు చేయాలనుకున్నారు. దాని కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసి ఓ ఫోన్ నెంబర్‌ను తెలుసుకున్నారు. వెంటనే కాల్ చేయగా.. ఆన్లైన్ కొనుగోలు కోసం రూ.3,000 చెల్లించాలని ఓ వ్యక్తి వారిని కోరాడు. దీని కోసం ఓ ఓటీపీ వస్తోందని, అది చెప్పమని అడిగాడు. ఆ వ్యక్తి మాటలను నమ్మిన దంపతులు.. ఓటీపీని వారికి చెప్పారు. దీంతో వెంటనే బాధితుడి ఖాతా నుండి రూ.30,000 కట్ చేసుకున్నాడు. బాధితుడు వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా.. ఆ మొత్తం పొరపాటున కట్ అయ్యాయని.. వెంటనే వాపసు చేస్తామని చెప్పాడు. అలా.. సుమారు ఆరుసార్లు ఓటీపీ కోరుతూ రూ. 1.03 లక్షలు దోపిడి చేశారు. ఆ తర్వాత బాధితుడు కాల్ చేయగా తమకు డబ్బు జమ కాలేదని సరుకుని డెలివరీ చేయలేమని.. మరొక కార్డు ఉపయోగించి చెల్లింపులు జరపాలని తెలిపాడు. దీంతో కంగుతిన్న ఆ దంపతులు మోసం చేశారని భావించి తిలక్ నగర్ పోలీసులకు మార్చి 27వ తేదీన ఫిర్యాదు చేశారు. -
చారిటీ పేరుతో అడ్డంగా బుక్కైన నైజీరియన్ ముఠా
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆన్లైన్ మోసాన్ని సైబర్ క్రైం పోలీసులు అడ్డుకున్నారు. చారిటీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరైస్టైన వారిలో నలుగురు నైజీరియన్లతో పాటు మేఘాలయకి చెందిన ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాలు.. విశాఖపట్నంలో నివసిస్తున్న సంజయ్ సింగ్ అనే వ్యక్తి ఒక నైజీరియన్ సంస్థ నుంచి రూ.39 కోట్ల తమ ఆస్తిని ఇండియాలో చారిటీ కోసం వినియోగించనున్నామంటూ మెయిల్ వచ్చింది. మీరు కూడా మీ వంతు సాయం చేయాలనుకుంటే అకౌంట్‌కు డబ్బు పంపించవచ్చంటూ అందులో పేర్కొంది. దీంతో మెయిల్‌కు స్పందించిన సంజయ్ సింగ్ తన వ్యక్తిగత వివరాలను పంపించాడు. దీంతో కస్టమ్స్,లీగల్ ఫార్మాలిటీస్ పేరుతో సంజయ్ సింగ్ వద్ద నుంచి పెద్ద మొత్తంలో గుంజడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో నైజీరియన్ ముఠా వలలో చిక్కుకున్న సంజయ్ రూ. 6.62 లక్షల రూపాయలను వివిధ అకౌంట్లకు పంపించాడు. తర్వాత వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సంజయ్ సింగ్ విశాఖ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నైజిరీయన్ ముఠాను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. కాగా వీరికి సహకరించిన మేఘాలయ రాష్ర్టానికి చెందిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నైజీరియన్ ముఠా నుంచి 55 వేల నగదు, రెండు లాప్‌టాప్‌లు, ఆరు మొబైల్ ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు, రెండు ఏటీఎం కార్డులు, పాస్‌పోర్టులు, వారి బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.46 లక్షల నగదును సీజ్ చేసనట్లు పోలీసులు వెల్లడించారు. -
ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్.. రూ.4లక్షలు మాయం
లక్నో : ఆన్లైన్లో పుడ్ ఆర్డర్ చేసి ఓ యువకుడు రూ.4లక్షలు మోసపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. పుడ్ క్వాలిటీ సరిగా లేదని ఆర్డన్ను క్యాన్సిల్ చేసుకునే క్రమంలో రూ.4లక్షలు పోగొట్టుకున్నారు. విరరాలు.. లక్నోలోని గొమ్తినగర్ కు చెందిన ఓ యువకుడు బుధవారం ఓ ప్రముఖ పుడ్ డెలివరీ యాప్ ద్వారా పుడ్ ఆర్డర్ చేశాడు. అనంతరం క్వాలిటీ సరిగా లేదనుకొని ఆర్డన్ను క్యాన్సిల్ చేశాడు. ఈ క్రమంలో తను చెల్లించిన డబ్బులను తిరిగి పొందడం కోసం ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్‌ను వెతికి కాల్ చేశాడు. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత సమస్య గురించి ఆడిగాడు. డబ్బులు చెల్లించాలంటే తాము పంపిన లింక్‌ను క్లిక్ చేసి మరో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. దానికి సమ్మతించిన యువకుడు ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో బ్యాంక్ అకౌంట్ వివరాలను పొందుపరిచాడు. ఈ క్రమంలో ఓ ఓటీపీ రాగా, అది ఎంటర్ చేస్తే డబ్బులు రిఫండ్ అవుతాయని నమ్మించాడు. దీంతో ఆ యువకుడు ఓటీపీని ఎంటర్ చేశాడు. వెంటనే అతని అకౌంట్లో ఉన్న రూ.4లక్షలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న యువకుడు మరలా ఆ నెంబర్‌కు కాల్ చేయగా.. ఎటువంది స్పందన రాలేదు. మోసపోయానని తెలుసుకున్న యువకుడు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఓటీపీ లేకుండానే ఓవర్సీస్ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ‘ఎస్బీఐ డెబిట్‌కార్డు xxxxx5005తో 2019 అక్టోబర్ 3న రూ.13,638.52 విలువైన నగదు లావాదేవీ xxxxx1903 ట్రాన్సాక్షన్ నంబర్‌తో ‘డబ్ల్యూపీజీటీఐడీ01’వెండర్ వద్ద చేశారు. ఒక వేళ మీరు ఈ లావాదేవీ చేయకపోతే కార్డును బ్లాక్ చేసేందుకు 9223008333కు ఎస్ఎంఎస్ లేదా 9449112211కు కాల్ చేయండి’అని ఫోన్లో ఎస్ఎంఎస్ అందిన వెంటనే హైదరాబాద్‌కు చెందిన వినయ్‌కుమార్ (పేరుమార్చాం) అవాక్కయ్యాడు. తన డెబిట్ కార్డు తన దగ్గరే ఉన్నా, కార్డు నంబర్లు, వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ), పిన్ వంటి రహస్య సమాచారాన్ని ఎవరితో షేర్ చేసుకోకపోయినా, తనకు కనీస సమాచారం లేకుండా తన కార్డుతో ఎలా ఈ లావాదేవీ జరిగింది? ఎవరు చేశారు? అని ఆశ్చర్యపోయాడు. వెంటనే కార్డును బ్లాక్ చేయించి తన బ్యాంకు బ్రాంచి మేనేజర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుడి డెబిట్‌కార్డు నంబర్, సీవీవీ నంబర్లను వినియోగించి లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆలీబాబా డాట్ కామ్’అనే విదేశీ ఈ–కామర్స్ సంస్థ నుంచి గుర్తుతెలియని దుండగులు ఏదో వస్తువు కొనుగోలు చేశారని, ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ పరిశీలించిన అనంతరం బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇలాంటి కంపెనీలతో జరిపే విదేశీ (ఓవర్సీస్) ట్రాన్సాక్షన్లకు ఓటీపీ అవసరం ఉండదని, డెబిట్/క్రెడిట్‌కార్డు నంబరు, సీవీవీ నంబర్లను సైబర్ నేరస్తులు హ్యాకింగ్/ఫిషింగ్/ఫేక్ ఫోన్‌కాల్స్ తదితర అక్రమ పద్ధతుల ద్వారా సేకరించి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. డెబిట్‌కార్డు/క్రెడిట్‌కార్డుతో ఆన్లైన్లో జరిపే లావాదేవీలకు ఏటీఎం నంబర్, సీవీవీ నంబర్‌తో ఓటీపీ తప్పనిసరి అని, ఓటీపీ లేకుండా ఆన్లైన్ లావాదేవీలను ఎట్టి పరిస్థితిలో అనుమతించరాదని ఇప్పటికే ఆర్బీఐ అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయినా బ్యాంకులు ఓటీపీ లేకుండా కార్డుల ద్వారా ఓవర్సీస్ లావాదేవీలను పలు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఒకవేళ మోసం జరిగితే కొన్ని సందర్భాల్లోనే బ్యాంకులు బాధితులకు పూర్తి మొత్తంలో నగదు రీఫండ్ అవుతుండటంతో పెద్ద సంఖ్యలో బాధితులు నష్టపోతున్నారు. నిబంధనల ప్రకారం డబ్బు కోల్పోయిన 3 రోజుల్లోగా ఫిర్యాదు చేస్తేనే 100% రీఫండ్ చేసే అంశాన్ని బ్యాంకులు పరిశీలిస్తాయి. ఇలాంటి కారణాలతో సగం లేదా అంత కంటే తక్కువ నగదునే రీఫండ్ చేస్తున్నాయి. కార్డు మర్చిపోతే అంతే.. నగదును డ్రా చేసిన తర్వాత కొందరు తమ డెబిట్ కార్డును ఏటీఎం యంత్రం నుంచి తిరిగి తీసుకోకుండా మర్చిపోయి వెళ్తున్నారు. కొన్ని ఏటీఎం యంత్రాల్లో నగదు బయటకు వచ్చిన తర్వాతే కార్డు బయటకు వస్తుంది. దీంతో నగదు తీసుకుని కార్డును అక్కడే మర్చిపోతున్నారు. ఇలా మర్చిపోయిన కార్డులను దుండగులు మిగతా 2వ దొంగిలించి ఓటీపీ లేకుండానే ఓవర్సీస్ లావాదేవీలు జరిపి బాధితుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఓ బ్యాంకు ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఓవర్సీస్ ట్రాన్సాక్షన్ ద్వారా నేరం జరిగితే నిందితులను పట్టుకునే టెక్నాలజీ సైబర్ క్రైం పోలీసులకే ఉందని, వారి వద్దకే వెళ్లాలని పోలీసు స్టేషన్ అధికారులు ఫిర్యాదు తీసుకోకుండా పంపేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దోపిడీకి మార్గాలెన్నో.. సైబర్ క్రైం పోలీస్టేషన్‌కు బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సైబర్ నేరస్తులు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో గుట్టు రట్టు కాకుండా చూసుకుంటున్నారు. డెబిట్, క్రెడిట్‌కార్డులు, ఆన్లైన్బ్యాకింగ్తో పాటు గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ఆన్లైన్ పేమెంట్ యాప్‌ల వినియోగదారులకు టోకరా వేయడం ఇటీవల సర్వసాధరణమై పోయింది. ఇలాంటి వివరాలను ఎవరితో పంచుకోరాదని బ్యాంకులు, పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా చాలామంది మోసపోతూనే ఉన్నారు. నేరుగా వినియోగదారులకు ఫోన్ చేసి గిఫ్టులు, లాటరీలు, డిస్కౌంట్ సేల్స్ పేరుతో ఎరవేసి కార్డులు/పేమెంట్ యాప్‌లకు సంబంధించిన రహస్య వివరాలను సైబర్ నేరస్తుల ముఠాలు సేకరిస్తున్నాయి. ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టే వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకుని.. ‘మీరు పలానా వ్యక్తి.. పలానా బంధువులు/స్నేహితులు మీ నంబర్ ఇచ్చారు.. మీకు ఈ గిఫ్టు ఇవ్వమన్నారు. జీఎస్టీ ట్యాక్సు కడితే మీ అడ్రస్‌కు గిఫ్టు పంపిస్తాం’అని ఫోన్ చేసి చెప్పి నమ్మిస్తున్నారు. బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి డెబిట్‌కార్డు, ఓటీపీ వివరాలు సేకరించడం వంటి మోసాలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల పేరుతో కొందరు సైబర్ నేరస్తులు ఫేక్ వెబ్సైట్లను సృష్టించి ఉద్యోగావకాశాలు, వస్తువులు/సేవల ఆర్డర్ కోసం ఆన్లైన్లో ఫీజులు, డబ్బులు కట్టించుకుంటున్నారు. గొలుసుగట్టుగా వేర్వేరు ఖాతాలకు బాధితుల ఖాతా నుంచి తమ ఖాతాకు డబ్బులు జమ అయిన వెంటనే సైబర్ నేరస్తులు తెలివిగా ఆ డబ్బును మరో ఖాతాకు అక్కడి నుంచి ఇంకో ఖాతాకు.. ఇలా వారం రోజుల్లోనే పది పదిహేను ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తున్నారు. ఒక ఖాతాను బ్లాక్ చేసేలోగా డబ్బు మరో బ్యాంకులు/పేమెంట్ యాప్స్ ఖాతాలోకి వెళ్లిపోతోంది. దీంతో అన్ని బ్యాంకులు/యాప్స్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి నిందితుల ఖాతాలను బ్లాక్ చేయిస్తున్నామని సైబర్ క్రైం అధికారులు పేర్కొన్నారు. బస్సు సీటు పేరుతో మోసం: హఫీజ్ ఖాన్, గాందీనగర్, హైదరాబాద్ హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్లేందుకు కావేరీ ట్రావెల్స్‌కు సంబంధించిన వివరాలు కనిపించాయి. నంబర్‌కు ఫోన్ చేసి సీటు బుక్ చేయాలని కోరాను. ముందుగానే డబ్బులు చెల్లించాలని అడిగారు. బస్సు ఎక్కిన తర్వాత చెల్లిస్తానంటే రూ.10 అయినా బుకింగ్ ఫీజు కింద చెల్లించాలంటూ పేమెంట్ లింక్ ఎస్ఎంఎస్ చేశారు. లింక్ ఓపెన్ చేసి అందులో ఫోన్‌పే ఐడీ, ఎం–పిన్ ఎంటర్ చేశాను. నా మొబైల్ నంబర్‌తో ఎస్బీఐ, ఎస్బీఐ, విజయబ్యాంకు ఖాతాలు అనుసంధానమై ఉన్నాయి. ఫోన్‌పే యాప్‌తో ఎస్బీఐ ఖాతా మాత్రమే అనుసంధానమై ఉంది. కొద్ది క్షణాల్లోనే మూడు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.30 వేలు సైబర్ నేరస్తుడు కాజేశాడు. కావెరీ ట్రావెల్స్‌ను సంప్రదిస్తే ఆ ఫోన్ నంబర్‌తో తమకు సంబంధం లేదన్నారు. రీఫండ్ అంటూ కాజేశారు: సింగరాజు సంతోష్, లాయర్, హైదరాబాద్ కోర్టులో క్లర్కుగా పనిచేసే మహిళ గ్రేట్ ఇండియా శారీ డాట్ కాం అనే వెబ్సైట్ నుంచి చీర ఆర్డర్ చేసింది. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుని డబ్బు రీఫండ్ చేయాలని కోరగా.. గూగుల్ పే నంబర్‌కు రీఫండ్ చేస్తామని వెబ్సైట్ నిర్వాహకులు ఆమెకు చెప్పారని, ఆమె నా దగ్గర గూగుల్ పే ఐడీ తీసుకుంది. వెబ్సైట్ నుంచి ఎవరో నాకు కాల్ చేసి నా ఫోన్‌కి ‘రిఫండ్ ఐడీ’ని పంపించామని, తిరిగి వారి ఫోన్‌కు పంపిస్తేనే రీఫండ్ చేస్తామన్నారు. ఎస్ఎంఎస్ను వారికి ఫార్వర్డ్ చేశాను. తర్వాత నా బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ గూగుల్ పేలో చెక్ చేయగా.. డబ్బులు బాగా తగ్గిపోయాయి. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఖాతా స్తంభింపజేశాను. అప్పటికే రూ.90 వేలు నష్టపోయాను. చిక్కరు దొరకరు.. ఈ తరహా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇలాంటి నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో నేరగాళ్లు చిక్కడం, డబ్బు రికవరీ కావడం అంతే కష్టం. బ్యాకింగ్ సహా ఇతర ఆర్థిక సంస్థలతో ఇబ్బంది వచి్చనా.. సమస్యలు ఎదురైనా నేరుగా వాటినే సంప్రదించాలి. ఇంటర్నెట్లో లభించే కాల్‌సెంటర్ల నంబర్లను సమాచారం కోసమే వాడుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎం–పిన్ను ఎవరి నంబర్‌కూ పంపొద్దు. గూగుల్‌లో కనిపించేవన్నీ నిజమైన కాల్ సెంటర్లని నమ్మితే నష్టపోతారు. – సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పాటించాల్సిన జాగ్రత్తలు స్మార్ట్‌ఫోన్, డేటా కనెక్షన్ అందుబాటులోకి వచ్చాక ఏ సమాచారం కోసమైనా గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరస్తులు దీన్నే అస్త్రంగా వాడుకుంటున్నారు. తమ ఫోన్ నంబర్లను వివిధ కాల్ సెంటర్లకు చెందినవిగా పేర్కొంటూ ఇంటర్నెట్లో పెడుతున్నారు. బ్యాకింగ్ సహా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సంస్థల పేర్లతో ఇవి ఉంటున్నాయి. వీటికి ఫోన్లు చేసిన వారిని నమ్మించి యూపీఐ నంబర్ తీసుకుంటున్నారు. చివరకు వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు స్వాహా చేస్తున్నారు. నకిలీ పేర్లు, చిరునామాలతో వివిధ సర్వీసు ప్రొవైడర్ల నుంచి సిమ్‌కార్డులు తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు వాటిని ఈ నేరాలకు వాడుతున్నారు. బోగస్ వివరాలతో కొన్ని యాప్స్, బ్యాంకు ఖాతాలు సిద్ధం చేసుకుంటున్నారు. మెయిల్ ఐడీలు సృష్టించి గూగుల్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. తమకు చెందిన నంబర్లను ఆయా బ్యాంకులకు చెందిన కాల్ సెంటర్లవిగా పేర్కొంటూ అందులో పొందుపరుస్తున్నారు. ట్రూ కాలర్‌లో సైతం వీటిని ‘బ్యాంక్’, ‘బ్యాంక్ మేనేజర్’పేర్లతోనే రిజిస్టర్ చేసుకుంటున్నారు. గూగుల్ సెర్చ్‌లో పొందుపరిచిన నంబర్లలో వేటికి వ్యూస్ ఎక్కువగా ఉంటే అది పైకి వచ్చి ముందు కనిపిస్తుంది. తమ నంబర్లు కని్పంచేందుకు సైబర్ నేరగాళ్లు తమ అనుచరుల ద్వారా ఆయా నంబర్లకు వ్యూస్ పెరిగేలా చేసి సెర్చ్‌లో పైకి తీసుకొస్తున్నారు. ఇలా కనిపించిన వాటికి ఖాతాదారుడు కాల్ చేస్తే సైబర్ నేరగాడు స్పందిస్తున్నాడు. తాను బ్యాంక్/ఆర్థిక సంస్థ మేనేజర్ని అంటూ పరిచయం చేసుకుంటున్నాడు. పోగొట్టుకున్న డబ్బు తిరిగి రావాలన్నా, మీ సమస్య పరిష్కారం కావాలన్నా తాము మరో నంబర్ నుంచి ఎస్సెమ్మెస్ పంపుతామని, దాన్ని మళ్లీ అదే నంబర్‌కు తిప్పి పంపాలని సూచిస్తుంటారు. ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను నగదు లావాదేవీలు నెరపే వివిధ రకాలైన యాప్స్‌కు అనుసంధానం చేయాలంటే యూపీఐ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టరై ఉన్న సెల్‌ఫోన్ నుంచి యూపీఏకు సంబంధించిన ఎంపిన్‌ను బ్యాంకుకు సంబంధించిన నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. దీన్నే ఈ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ ఫోన్లలోకి అప్పటికే కొన్ని యాప్స్‌ను డౌన్లోడ్ చేసి ఉంచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇలా కాల్ వచి్చనప్పుడు ఎంపిన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని తొలుత తమకు కాల్ చేసిన ఖాతాదారుడికి వేరే నంబర్ నుంచి పంపి తిరిగి పొందుతున్నారు. ఇలా చేయడంతో బాధితుడు తన బ్యాంకు ఖాతాను వారి యాప్‌తో అనుసంధానించడానికి యాక్సెస్ ఇచి్చనట్లు అవుతుంది. -
'ఆఫర్' అని.. అడ్డంగా ముంచారు!
సాక్షి, ధర్మపురి: ‘హలో సర్.. మేము ఫలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ఈ రోజు మా లక్కీడ్రాలో విజేతగా నిలిచారు.ఆరువేల సెల్‌ఫోన్ మూడు వేలకే అందిస్తున్నాం’ అంటూ అవతలి నుంచి ఓ అమ్మాయి ఫోన్ చేయగానే సరే పంపించండి అంటూ సంతోషపడుతున్న అమాయకులు నిం డా మునుగుతున్నారు. చెప్పిన వస్తువులకు బదులు వేరే వస్తువులు వస్తుండడంతో లబోదిబోమంటున్నారు. వెల్గటూరు మండలం ఎండపల్లిలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. బాధితులు వివరాల ప్రకారం.. వెల్గటూరు మండలం ఎండపెల్లికి చెందిన సింహరాజుల సత్యనారాయణకు నాలుగురోజుల క్రితం గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ‘మీ ఫోన్ నంబరుకు జే–7ఫోన్ ఆఫర్ ఉంది. దీని విలువ రూ.6000కాగా ఆఫర్లో మీకు రూ.3150 వస్తోందని’ చెప్పారు. నమ్మిన సత్యనారాయణ పంపిచమన్నాడు. తనకు ఎలాగు సెల్‌ఫోన్ ఉందని తన స్నేహితుడు శివకు లేదని ఆలోచించి అతడిని ఈ ఫోన్‌ను తీసుకొమ్మన్నాడు. శుక్రవారం పార్సిల్ వచ్చింది. శివ రూ.3,150 చెల్లించి పార్సిల్ స్వీకరించాడు. విప్పిచూడగా ఫోన్‌కు బదులు వెజిటేబుల్ కట్టర్ ఉంది. దీంతో సత్యనారాయణ, శివ కంగుతిన్నారు. వెంటనే పార్సిల్‌పైఉన్న నంబరుకు కాల్ చేశారు. 24గంటల తరువాత ఫోన్‌చేస్తే.. వివరాలు తెలియజేస్తామని అవతలి వైపునుంచి నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తల పట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే కంపెనీకి చెందిన ఫోన్‌కాల్ గొడిసెలపేట గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు తంగళ్లపెల్లి చక్రపాణికి వచ్చింది. ఆయన కూడా జే–7ఆఫర్ ఫోన్‌బుక్ చేసుకున్నారు. ఎండపెల్లిలో మోసం జరిగిందని తెలుసుకుని పార్సిల్‌ను విప్పకుండానే వెనక్కి పంపించాడు. -
ఆన్లైన్ మోసం..!
కొణిజర్ల : ఆన్లైన్ ద్వారా ఓ ఉపాధ్యాయుడి ఖాతా నుంచి నగదు డ్రా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు శనివారం బాధిత ఉపాధ్యాయుడు పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన మేకల శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడికి కొణిజర్ల మండల కేంద్రంలోని ఎస్బీహెచ్లో ఎకౌంట్ ఉంది. ఈ నెల 18వ తేదీ రాత్రి 10గంటల నుంచి 19వ తేదీ తెల్లవారు జామున 2గంటల వరకు గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 14 సార్లు ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేశారు. మొత్తం రూ.2,803లు నగదు విత్ డ్రా అయ్యాయి. విషయాన్ని గమనించిన ఎస్బీఐ ఆన్లైన్ అధికారులు ఖాతాను బ్లాక్ చేసి శుక్రవారం ఖాతాదారుడికి సమాచారం అందించారు. శనివారం బ్యాంకుకు వెళ్లిన శ్రీనివాసరావు తన ఖాతాను పరిశీలించుకోగా ఖాతా నుంచి నగదు డ్రా చేసినట్లు ఉంది. డబ్బు పెద్ద మొత్తంలో డ్రా చేయనప్పటికీ తనకు తెలియకుండా ఖాతా నుంచి నగదు పోవడం పట్ల ఉపాధ్యాయుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు నగదు విత్‌డ్రా అయినట్లు సంక్షిప్త సమాచారం వచ్చింది కానీ తక్కువ మొత్తంలో కావడంతో బ్యాంకు వారు ఎకౌంట్ మెయింటినెన్స్ కింద ఏమైనా తీసుకున్నారేమో అనుకున్నానని తెలిపారు. ఇలా 14సార్లు రావడంతో అనుమానంతో బ్యాంకుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. నెలనెలా జీతాలు పడుతుంటాయని ఆ సమయంలో దొం గతనానికి పాల్పడితే తమగతి ఏమి కావాలని సద రు ఉపాధ్యాయుడు వాపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆన్లైన్ మోసం గా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ మోసానికి చిక్కిన యువకుడు
శ్రీకాకుళం, సారవకోట: మండలంలోని చిన్నగుజువాడ గ్రామానికి చెందిన తంప తులసీరావు ఆన్లైన్ మోసంలో చిక్కి రూ.3255 నష్టపోయాడు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక హెర్బల్ కంపెనీకు సంబంధించిన ప్రకటను టీవీలో చూసి ఆయుర్వేద మందుల కోసం 8 నెలల క్రితం రూ.3100 పోస్టల్ పంపించగా తొలి విడతలో మందులు పంపించారు. మళ్లీ 6 నెలల తర్వాత రూ.3500 చెల్లించి మందులు పంపించాలని కోరగా కావల్సిన మందులు కాకుండా వేరే మందులు పంపించారు. దీనిపై సంబంధిత కంపెనీ ప్రతినిధితో మాట్లాడితే తిరిగి సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చి ఫోన్‌కు అందుబాటులో లేకుండా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 20న మరలా అదే కంపెనీ నుంచి తులసీరావుకు ఫోన్ చేసి కంపెనీ లక్కీ డ్రాలో మీరు రూ.40 వేలు చెక్కు, ఒక మొబైల్ ఫోన్ పొందారని దీనికి సంబంధించిన పార్సిల్‌ను పోస్టల్లో డబ్బులు చెల్లించి తీసుకోవాలని సూచించారు. దీంతో సారవకోట పోస్టాఫీసుకు వచ్చిన పార్సిల్‌ను రూ.3255 చెల్లించి గురువారం తీసుకోగా దాంట్లో మట్టిపొడి ప్యాకెట్ మాత్రమే ఉండటంతో బాధితుడు తులసీరావు లబోదిబోమంటున్నాడు. -
సెల్‌కు బదులు ఏటీఎం పౌచ్!
మార్కాపురం టౌన్ (ప్రకాశం): మోసపోయే వాళ్లుంటే మోసగించే వాళ్లకు కొదవ లేదనట్లు ఆన్లైన్లో సెల్ బుక్ చేస్తే ఏటీఎం పౌచ్‌లు వచ్చాయి. వివరాలు.. మార్కాపురానికి చెందిన డి.శ్రీధర్‌రెడ్డి మోటార్ వర్క్స్ షాపులో మోటార్లు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పది రోజుల కిందట ఆయనకు ఫోన్ వచ్చింది. మీ నంబర్‌కు రూ.12 వేల విలువై వివో స్మార్ట్‌ఫోన్ లక్కీ డీప్‌లో తగిలిందని చెప్పారు. కేవలం రూ.4,150లకు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం నగదు లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ విధానంతో పోస్టల్ ద్వారా పార్శిల్ వస్తుందని, నగదు చెల్లించి తీసుకోవచ్చని సెలవిచ్చారు. శ్రీధర్‌రెడ్డి నగదు చెల్లించి పార్శిల్ అందుకున్నాడు. తీరా విప్పి చూస్తే ఏటీఎం కార్డులు పెట్టుకునే రెండు పౌచ్‌లు, బెల్ట్ ఉన్నాయి. మోసపోయానని గ్రహించి తిరిగి తనకు వచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా వచ్చిన పార్శిల్‌ను తిరిగి పంపితే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా నగదు పంపుతామని చెప్పకొచ్చారు. అంతటితో ఆగకుండా ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్ తెలపాలని కోరారు. నగదు రాకపోగా అకౌంట్లో ఉన్న నగదు కూడా పోతాయేమోనని భావించి వారికి నంబర్ చెప్పలేదు. -
మరో ఆన్లైన్ మోసం..
డెంకాడ : మండలంలోని గుణుపూరు గ్రామానికి చెందిన మహంతి లక్ష్మికి చెందిన బ్యాంక్ ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మికి ఏపీజీవీబీ డెంకాడ బ్రాంచిలో ఖాతా ఉంది. కొద్ది రోజుల కిందట ఓ అగంతుకుడు నుంచి లక్ష్మికి ఫోన్ వచ్చింది. తాను బ్యాంక్ మేనేజర్‌నని.. మీ ఏటీఎం బ్లాక్ అయిందని.. ఆధార్ నంబర్ చెబితే పునరుద్ధరిస్తామని చెప్పడంతో బాధితురాలు వివరాలు చెప్పింది. అలాగే మరికొన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పాలని కోరడంతో బాధితులు చెప్పేశారు. ఇలా రెండేసార్లు చెప్పిన తర్వాత అనుమానం వచ్చిన బాధితులు బ్యాంక్‌లో సంప్రదించగా, వచ్చిన ఫోన్ నకిలీదని తేలింది. అయితే అప్పటికే లక్ష్మి ఖాతా నుంచి రూ. 25 వేలను అగంతుకుడు డ్రా చేసేశాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. -
ఆమె అలా చెప్పకూడదని తెలియక...
ముంబై : ఇటీవల ఆన్లైన్ మోసాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో వింటూనే ఉన్నాం. బ్యాంకు అధికారులమంటూ కాల్ చేస్తున్న వారికి, అకౌంట్ వివరాలు, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ వంటి కోడ్లు చెప్పకూడదని పలుమార్లు సైబర్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ముంబైలో ఓ మహిళ తన అమాయకత్వంతో సైబర్ నేరగాడికి 28 సార్లు ఓటీపీ చెప్పి ఏకంగా ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకుంది. అన్నిసార్లు ఓటీపీ ఎలా చెప్పావన్న అని పోలీసులు ప్రశ్నించగా.. అలా చెప్పకూడదన్న విషయం తనకు తెలియదంటూ బిక్కమొహం వేసేసింది. తనకసలు ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి అసలేం తెలియదని చెప్పింది. నావీముంబైలోని నెరూల్‌కు చెందిన తస్నీమ్ ముజకర్ మోడక్ అనే మహిళ తనకున్న జాతీయ బ్యాంకులో ఇటీవలే 7.20 లక్షల రూపాయలు క్రెడిట్‌చేసింది. మే 17న తస్నీమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తను ఎస్బీఐ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్ని సాంకేతిక సమస్యలతో మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిందని చెప్పాడు. అది తిరిగి పనిచేయాలంటే ఏటీఎం కార్డు వివరాలు, మొబైల్‌కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పాలన్నాడు. అతడు చెప్పినట్టే చేసిన తస్నీమ్ అమాయకత్వంతో అతడు ఫోన్ చేసిన ప్రతిసారీ ఓటీపీ చెప్పేసింది. వారం వ్యవధిలో అలా 28 సార్లు ఆ ఆన్లైన్ మోసగాడికి తన ఓటీపీ చెప్పింది. ఇలా ఓటీపీ చెప్పించుకున్న మోసగాడు ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.6.98, 973 కాజేశాడు. పాస్‌బుక్‌లో వివరాలు నమోదు చేసేందుకు ఇటీవల బ్యాంకుకు వెళ్లిన తస్నీమ్‌కు తన అకౌంట్ నుంచి రూ.6.98 లక్షలు మాయమైన విషయం తెలిసింది. దీంతో వెంటనే నెరూల్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆన్లైన్ మోసాలపై ఆమెకు అవగాహన లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆ నేరగాడు మొత్తం మూడు సిమ్ కార్డులతో తస్నీమ్‌కు ఫోన్ చేసి, ఓటీపీ వివరాలు రాబట్టినట్టు తెలిపారు. ముంబై, నోయిడా, గుర్గావ్, కోల్‌కతా, బెంగళూరుల నుంచి ఈ లావాదేవీలు సాగించినట్టు పేర్కొన్నారు. 16 అంకెల డెబిట్ కార్డు నెంబర్, కార్డుపై ప్రింట్ అయిన పేరు, 3 అంకెల సీవీవీ నెంబర్ అన్నీ చాలా రహస్యంగా ఉంచుకోవాలని ఆమెకు పోలీసులు చెప్పారు. తన భర్త కువైట్‌లో ఉంటాడని చెప్పిన ఆమె, కుమారుడి చదువు కోసం ఇటీవలే రూ.10 లక్షల ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నట్టు తెలిపింది. -
మాయమాటలతో పౌండ్లు ఎర.. రూ.లక్షలు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు... మిలియన్ల పౌండ్లకు వారసురాలివని, సుఫారీ గెల్చుకున్నావని చెప్పి ఇద్దరు మహిళలను నిండా ముంచారు. చిరుద్యోగులైన వీరిద్దరిలో ఒకరి నుంచి రూ.3.5 లక్షలు, మరొకరి నుంచి రూ.3 లక్షలు కాజేశారు. చివరకు బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో సోమవారం కేసులు నమోదయ్యాయి. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న రేష్మ అనే యువతికి కొన్ని రోజుల క్రితం డాక్టర్ ఫెడరిక్ పేరుతో ఈ–మెయిల్ వచ్చింది. అందులో భారత్‌కు చెందిన సత్యేంద్ర చంద్రశేఖర్ పేరుతో లండన్‌లోని సెయిన్స్ బెర్రీ బ్యాంక్‌లో 3.1 మిలియన్ పౌండ్ల డిపాజిట్ ఉందని రాశాడు. ఆయన చనిపోయే వరకు నామినీ ఎవరనేది స్పష్టం చేయకపోవడంతో చట్టబద్ధమైన వారసుల వివరాలు బ్యాంకు రికార్డుల్లో లేవని చెప్పాడు. తాను అదే బ్యాంకులో పని చేస్తున్నందున ఈ విషయం తనకు మాత్రమే తెలిసిందని చెప్పాడు. ఆ మొత్తం సొంతం చేసుకునేందుకు ఆమెను వారసురాలిగా మారుస్తానని, అందుకు పూర్తి సహకారం ఇస్తానంటూ ఎరవేశాడు. తాను పంపే సత్యేంద డెత్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా వివరాలను పొందుపరుస్తూ సదరు బ్యాంకునకు దరఖాస్తు చేయాలని సూచించాడు. వాటిని పంపుతూ ఆ బ్యాంకునకు చెందినదే అంటూ ఓ ఈ–మెయిల్ అడ్రస్ కూడా అందులో ఉంచాడు. అతని మాటలు నమ్మిన రేష్మ ఫెడరిక్ పంపిన ఆధారాలను జతచేస్తూ బ్యాంకునకు ఈ–మెయిల్ పంపించింది. మీ దరఖాస్తును పరిశీలిస్తున్నామంటూ బ్యాంకు అధికారులు పంపినట్లు రేష్మకు ఈ–మెయిల్ రూపంలో సమాధానం వచ్చింది. కొన్ని రోజులకు దరఖాస్తు అప్రూవ్ అయిందని, సత్యేంద్ర ఖాతాలోని పౌండ్లను తాత్కాలికంగా ఢిల్లీలోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులోకి బదిలీ చేశామంటూ మరో సందేశం వచ్చింది. ఈ డబ్బు రూపాయల్లోకి మార్చి, సొంత ఖాతాలోకి తెచ్చుకోవడానికి సంప్రదించాలంటూ ఓ వెబ్సైట్ లింకును, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను పంపారు. దీంతో రేష్మ నగదు బదిలీకి ప్రయత్నాలు ప్రారంభించింది. కొంత వరకు బదిలీ అయినట్లు ఈ వెబ్‌పేజ్‌లో కనిపించిన తర్వాత కాస్ట్ ట్రాన్స్ఫర్ కోడ్ ఎంటర్ చేయాలంటూ హఠాత్తుగా బదిలీ ఆగిపోయింది. దీంతో ఆమె గతంలో బ్యాంకు అధికారులుగా తనను సంప్రదించిన వారికి ఫోన్ చేయగా, రూ.86 వేలు డిపాజిట్ చేస్తే ఆ కోడ్ తెలుస్తుందంటూ చెప్పడంతో నగదు డిపాజిట్ చేసింది. ఇలా వివిధ రకాల పేర్లతో రూ.3.5 లక్షలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన రేష్మ సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. వస్త్రాలు కొంటే కారు వచ్చిందంటూ... నగరంలోని ఓ హాస్పిటల్లో నర్సుగా పని చేస్తున్న మున్నీ ఇటీవల స్నాప్‌డిల్ సైట్ ద్వారా వస్త్రాలు ఖరీదు చేశారు. ఆ మరునాడే ఆమె సెల్‌ఫోన్‌కు ఒక ఎస్సెమ్మెస్ వచ్చింది. స్నాప్‌డీల్‌లో ఖరీదు చేసిన నేపథ్యంలో లక్కీ డ్రాలో టాటా సఫారీ కారును గెలుచుకున్నారని, దానికోసం ఫలానా నెంబర్లో సంప్రదించాలని ఉంది. తొలుత ఈ విషయాన్ని ఆమె తేలిగ్గా తీసుకున్నా... పదేపదే సందేశాలు రావడం, టోల్‌ఫ్రీ నెంబర్లు పొందుపరిచి ఉండటంతో సంప్రదించింది. అవతలి వ్యక్తులు మీకు కారు కావాలా? దాని విలువకు సమానమైన నగదు కావాలా? అని కోరడంతో మున్నీ నగదే కావాలని పేర్కొంది. దీంతో మీ పేరుతో ఎస్బీఐ బ్యాంకు ఖాతా ఉంటే అందులోకి నగదు బదిలీ చేస్తామంటూ చెప్పారు. ఖాతా వివరాలు పంపడంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని కోరారు. దీంతో ఆమె ఒడిస్సాలో ఉన్న తన భర్తకు చెందిన ఎస్బీఐ ఖాతా వివరాలను పంపారు. కొన్ని రోజులకు మరోసారి సంప్రదించిన సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ ప్రక్రియ తాత్కాలింకగా ఆగిందని సూచించారు. పూర్తికావాలంటే జీఎస్టీ సహా వివిధ పన్నులు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. అనంతరం వివిధ పేర్లతో మున్నీ నుంచి రూ. 3.06 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బీహార్‌లోని పంచ్ ముఠాలు ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
రష్యన్ ఎంబసీకే టెండర్
సాక్షి, హైదరాబాద్: రష్యన్ ఎంబసీని మోసం చేసిన ఘరానా మోసగాడిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కార్యాలయానికి రాడార్ ఎలక్ట్రానిక్ పరికరాలు కావాలని రష్యన్ ఎంబసీ టెండర్స్ ఆహ్వానించింది. దీంతో గుంటూరుకు చెందిన రంగబాబు పథకం ప్రకారం టెండర్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఎంబసీ అధికారులు ఆన్లైన్ ద్వారా 42,500 యూఎస్ డాలర్లను రంగబాబుకు బదిలీ చేశారు. అయితే డబ్బు తీసుకున్న నిందితుడు పనులు చేయకుండా తప్పించుకుని తిరిగాడు. దీంతో మోసం జరిగిందని తెలుసుకున్న ఎంబసీ అధికారులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన రాచకొండ పోలీసులు రంగబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని పట్టుకున్నందుకు తెలంగాణ, రాచకొండ పోలీసులను అభినందిస్తూ సీపీ మహేష్ భగవత్‌కు రష్యన్ ఎంబసీ వైస్ కౌన్సిల్ లేఖ రాసింది. -
అందని సాయం..మానని గాయం
దాదాపు వంద రోజుల విచారణ, వందలాది మంది పెట్టుబడిదారుల ఆందోళన, ఇద్దరి ప్రాణార్పణ, రూ.187 కోట్ల స్వాహాపై ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇదీ క్లుప్తంగా ట్రేడ్ బ్రోకర్ కేసు స్వరూపం. మూడు నెలల కిందట జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై పెట్టుబడిదారులు అసంతృప్తిలో ఉన్నారు. సీఐడీ చేతికి కేసు వెళ్లినా విచారణలో పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడికి బెయిల్ రావడాన్ని కూడా వారు స్వాగతించలేకపోతున్నారు. ఏ వైపు నుంచీ సాయం అందక, గుండెకు తగిలిన గాయం మానక బాధితులు నరకం చూస్తున్నారు. రాజాం: ట్రేడ్ బ్రోకర్ ఆన్లైన్ మోసం కేసు నీరుగారుతుందా..? బాధితులతో పాటు ఈ కే సును ఫాలో అవుతున్న వారి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. సం తకవిటి మండలం మందరాడలో షేర్ మార్కెట్ పేరిట రూ.187 కోట్లకు ప్రజలను ముంచి వం ద రోజులు గడిచిపోయా యి. ఈ కేసు విచారణను మొదటి నుంచీ గమనిస్తు న్న వారిలో ఇప్పు డు జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మూడు నెలల కిందట ఈ ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. అంత పెద్ద మొత్తంలో మోసం జరిగిందా అంటూ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు విచారణ చూసినా అదే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రధా న నిందితునికి బెయిల్ రావడం, బాధితులు ఎంత మోసపోయారో ఇంకా గుర్తించకపోవడం, ఎంత రికవరీ చేశారో చెప్పకపోవడం వంటి అంశాలు అనుమానాలకు ఊతమిస్తున్నాయి. 900 మందికి పైగా బాధితులను, పెట్టుబడిదారులను నిలువునా ముంచినా కేసు విచారణ ఇంత నెమ్మదిగా సాగడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నవంబర్ 10న.. 2017, నవంబర్ 10వ తేదీన తాలాడ గ్రామంలో ట్రేడ్ బ్రోకర్ సిబ్బంది కార్యాలయానికి తాళా లు వేయడంతో సంచలనం ఏర్పడింది. టం కాల శ్రీరామ్ అనే పేరు ఓవర్ నైట్‌లో జిల్లా మొత్తం తెలిసిపోయింది. అప్పటి వరకు పెట్టుబడిదారులు అతని వద్ద రెండు మూడు కోట్లు ఉంటాయని మాత్రమే అనుకునేవారు. కానీ మోసం విలువ రూ.187 కోట్లని తెలిసి వారంతా ఆశ్చర్యపోయారు. శ్రీరామ్ కార్యాలయానికి తాళం పడడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మొదట సంతకవిటి పోలీ స్ స్టేషన్లో బ్రోకర్ హామీల రూపంలో ఇచ్చిన చెక్‌లతో కేసులు పెట్టగా మొత్తం రూ.36 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. అయితే అక్కడితో కథ ముగియలేదు. కొంతమంది కో ర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఆధారాలతో నష్టపోయినవారి నగదు రూ. 50 కోట్లు వరకూ ఉంటుందనేది అంచనా. ఇవి కాకుండా కొంతమంది ఉద్యోగులు భయపడి కేసులు పెట్టలేదు. నవంబర్ 10న ట్రేడ్ బ్రోకర్ కార్యాలయానికి తాళాలు వేసిన అనంతరం చాలా మంది నిరుపేదలు మంచంపట్టారు. రూ. 25 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టిన ఇద్దరు బాధితులు ఈ మోసాన్ని జీర్ణించుకోలేక మృతి చెందారు. ఏదీ పురోగతి? కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు పాలకొండ డీఎస్సీ జి. స్వరూప శరవేగంగా కేసును ముందుకు నడిపా రు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నా రు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులు మేరకు బ్రోకర్ శ్రీరామ్‌తో పాటు మరో ఐదుగురిని అ రెస్టు చేశారు. దీనిపై కొందరు ఎస్పీ కార్యాల యం ఎదుట గగ్గోలు పెట్టినా పోలీసు అధికారులు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో విచారణలో స్పీడు తగ్గింది. మూడు నెలలుగా కేసులో పురోగతి ఏమీ కనిపించడం లేదు. ఇదంతా ఎవరి సొత్తు.. తాలాడ వద్ద హంగులతో నిర్మించిన ట్రేడ్ బ్రోకర్ కార్యాలయం, పక్కనే 25 ఎకరాల తోట సీఐడీ ఏం చేస్తోంది? నెలరోజుల కిందట విశాఖపట్నంకు చెందిన సీఐడీ అధికారులు కేసును తమ పరిధిలోకి తీసుకున్నారు. పలువురు ట్రేడ్ బ్రోకర్ ఉద్యోగులపై ఆరా తీశారు. ప్రత్యేక అనుమానితులను పిలు పించుకుని విచారణ చేపట్టారు. ఇదంతా జరిగి నెలరోజులు కావస్తున్నా అసలు విషయం ఇంతవరకూ బయటకు రాలేదు. ఈ మోసానికి ప్రధా న కారకులు ఒక్క శ్రీరామేనా, ఇంకెవరైనా ఉ న్నారా అన్నది ఇంతవరకూ వెల్లడికాలేదు. పె ట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడులకు సంబం ధించి ఎంత రికవరీ అయ్యిందనేది పత్రికా పరంగా కూడా వెల్లడికాలేదు. అసలేం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది తమ పి ల్లలకు వివాహాల కోసం, భవిష్యత్ ఉపయోగా ల కోసమే పెట్టుబడులు పెట్టారు. వీరంతా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. కొంతమంది మంచం పట్టారు. నీరు గారుతోందా? ప్రధాన నిందితునికి బెయిల్ రావడంపై బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులో పు రోగతి ఏమీ లేదని వారంటున్నారు. సీఐడీ కేసును తీసుకోవడంతో పెట్టుబడి వివరాలు తెలిసి, తమకు న్యాయం జరుగుతుందని, ఎం తో కొంత రికవరీ అవుతుందని ఆశ పడిన వా రంతా ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. అధికార పార్టీ నేతల హస్తం ఉందా? ట్రేడ్ బ్రోకర్ శ్రీరామ్ అధికార పార్టీ నేతలను కూడా ముంచినట్లు సమాచారం. పెట్టుబడులు ఎక్కువగా రాబట్టేందుకు అధికార పార్టీకి చెందిన నేతలను వినియోగించుకోవడంతో పాటు పలువురు నాయకుల నుంచి కూడా పెట్టుబడులు తీసుకుని ప్రస్తుతం వారికి కూడా ఎగనామం పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు శ్రీరామ్‌ను బయటకు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసి తాము నష్టపోయిన మొత్తంలో ఎంతో కొంత నగదును రికవరీ చేసుకునేం దుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అంతా గోప్యంగా ఉండి, కేసుపై కదలికలు లేకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ డబ్బు ఏమైనట్టు? బ్రోకర్ శ్రీరామ్ ఎంత డబ్బును పెట్టుబడి రూపంలో తీసుకున్నాడు? ప్రస్తుతం ఎంత ఉందనేది ఇంకా కొలిక్కిరాలేదు. పోలీసులు, సీఐడీ అధికారులు కూడా ఈ విషయాన్ని వెల్లడించడం లేదు. ప్రస్తుతం శ్రీరామ్ కుటుంబ సభ్యులు, బంధువులను, స్నేహితులను విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వివరాలు కూడా గోప్యంగా ఉన్నాయి. ఈ అక్రమ ఆస్తుల వివరాల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు మాత్రం కళ్లు కాయలు కాస్తున్నాయి. ముమ్మర దర్యాప్తు ట్రేడ్ బ్రోకర్ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్లు విశాఖపట్నం సీఐడీ డీఎస్పీ ఎస్.నాగభూషణంనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఏ కోణంలో వి చారిస్తున్నామో, ఎవరెవరిని విచారిస్తున్నామన్నది గోప్యంగా ఉంచాల్సి ఉందని అన్నారు. త్వరలోనే బ్రోకర్ వద్ద పెట్టిన పెట్టుబడులతో పాటు అక్రమ ఆస్తులు వివరాలు వెల్లడించి ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
దొంగను పట్టిచ్చిన.. ‘ఆన్లైన్’
సాక్షి, సిటీబ్యూరో: ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి నకిలీ ఎల్ఆర్ఎస్ వ్యవహారాన్ని హెచ్ఎండీఏ ఆన్లైన్ వ్యవస్థ బట్టబయలు చేసింది. అధికారుల ఫోర్జరీ సంతకాలతో ఆ ఉద్యోగి డబ్బు మరిగి ఈ అవినీతికి తెర తీశాడు. చివరకు దొంగ బయటపడ్డాడు. అసలేం జరిగిందంటే... సంగారెడ్డి కల్వకుంట్ల గ్రామం సర్వే నంబర్ 199లోని 272 గజాలస్థలాన్ని ఎల్ఆర్ఎస్ చేయాలంటూ వంటేర్ హేమలత 2016లో హెచ్ఎండీఏకు దరఖాస్తు చేశారు. అయితే అధికారులు మరికొన్ని పత్రాలు సమర్పించాలని 114122 నెంబర్ కేటాయిస్తూ ఆన్లైన్లో షార్ట్‌ఫాల్ పంపారు. అయితే హేమలత వాటిని ఆప్‌లోడ్ చేయకపోవడంతో దరఖాస్తును తిరస్కరించారు. అక్కడితో ఆ కథ అలా ఆగిపోయింది. అయితే వారం క్రితం హత్నూర మండల్ బొరపాట్ల గ్రామానికి చెందిన ఎస్.శంకరయ్య.. హేమలతకు చెందని స్థలాన్ని పరిశీలించాలని హెచ్ఎండీఏ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాడు. శంకరయ్య ఎందుకు కోరాడంటే... 199లోని 272 గజాల స్థలాన్ని శంకరయ్య కొనుగోలు చేశాడు. అందుకే హెచ్ఎండీఏను సంప్రదించి ఆ స్థలం వ్యవహారం పరిశీలించాలని కోరాడు. అయితే 2016లోనే దరఖాస్తు తిరస్కరణకు గురైందని అధికారులు తేల్చేశారు. దీంతో శంకరయ్య ఖంగుతిని అధికారులకు ఫిర్యాదు చేయడంతో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు విచారణకు ఆదేశించారు. ఇదీ జరిగింది.. వంటేర్ హేమలత ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న తరువాత 2016 మార్చిలో బీహెచ్ఈఎల్కు చెందిన కె.అంజనేయులు గౌడ్‌కు విక్రయించింది. తరువాత ఆయన ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించామని హెచ్ఎండీఏ నుంచి ఆంజనేయులుకు ఎస్ఎంఎస్ వచ్చింది. ఈ విషయంపై రియల్ ఎస్టేట్ ఏజెంట్ గాజుల రాజేశంను సంప్రదించాడు. రూ.30 వేలు ఇవ్వడంతోపాటు రూ.59.278 డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నాడు. తరువాత నకిలీ డ్రాఫ్ట్ అందజేశాడు. విషయం తెలియని అంజనేయులు గౌడ్ గత సెప్టెంబర్‌లో ఈ ప్లాట్‌ను శంకరయ్యకు విక్రయించాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పనే... శంకరయ్య హెచ్ఎండీఏ కార్యాలయాన్ని సంప్రదించడంతో రాజేశం బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రొసిడింగ్స్‌లో జేపీవో డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసినట్టు తెలిసింది. దీంతో హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగ అధికారులు రాజేశంను తీసుకొచ్చి విచారించగా హెచ్ఎండీఉఏలో జూనియర్ ప్లానింగ్ పర్సన్(ఔట్ సోర్సింగ్) ఉద్యోగి సైదులు డబ్బులు తీసుకొని నకిలీ ఎల్ఆర్ఎస్ ప్రోసిడింగ్స్ చేతికి అందించాడని తెలిపాడు. దీనిపై హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారి బి.బీమ్‌రావు ఓయూ పోలీసు స్టేషన్ గురువారం ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏతో పాటు ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించే దిశగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే 040–27018115/6/7/8 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. -
ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు కుచ్చుటోపి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విధానమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ రామచందర్ రావుకు ఆన్లైన్ మోసగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఆయనకు చెందిన రెండు బ్యాంకుల ఖాతాల నుంచి సైబర్ నేరస్తులు రూ. 35 వేలు దోచేశారు. ఈ నెల 1వ తేదీన సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో రెండు అకౌంట్ల(ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లు) నుంచి రూ. 35 వేలు కట్ అయినట్లు రామచందర్ రావుకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో షాక్‌కు గురైన ఎమ్మెల్సీ ఈ నెల 3వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. కేసు వివరాలను తెలుసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెజాన్‌లో టీవీ ఆర్డర్ చేస్తే..
ముంబై: ఆన్లైన్ డెలివరీలో మోసాలు అధికమయ్యాయి. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో 50 అంగుళాల టెలివిజన్ కోసం ఆర్డర్ ఇవ్వగా నీట్‌గా ప్యాక్ చేసి పగిలిన పాత 13 ఇంచ్‌ల మానిటర్‌ను పంపడంతో ఆయన అవాక్కయ్యారు. దీనికి సంబంధించి తన డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా ఐటీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న మహ్మద్ సర్వార్ అనే బాధితుడు మూడు నెలలుగా అమెజాన్‌తో పోరాడుతున్నారు. కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మహ్మద్ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫోరం వెబ్సైట్లో ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ఈ ఏడాది మేలో 50 అంగుళాల మితాషి ఎల్ఈడీ టీవీ అమెజాన్ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉండటంతో దాన్ని పిల్లలకు రంజాన్ కానుకగా అందించాలని నిర్ణయం తీసుకున్న సర్వార్ వెంటనే క్రెడిట్ కార్డు ద్వారా రూ 33,000 చెల్లించారు. మే 19న ప్యాకేజ్‌ను అందుకున్న సర్వార్ దాన్ని తెరిచి చూడగా అందులో టీవీకి బదులు 13 అంగుళాల పాత ఏసర్ మానిటర్ కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అప్పటినుంచి తన డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ చేసిన అభ్యర్థనలకు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన వాపోయారు. మరోవైపు కస్టమర్ సమస్యను తాము అర్థం చేసుకున్నామని, త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని అమెజాన్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. -
హెచ్1బీ వీసాలు ఇప్పిస్తానని..
హైదరాబాద్: హెచ్1బీ వీసాలు ఇప్పిస్తానని ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్ సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన యాదవ్రెడ్డి ఆన్లైన్ ద్వారా వీసాలు ఇప్పిస్తానని చెప్పి అమాయకుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన రవీందర్ అనే యువకుడి నుంచి రూ. 2 లక్షలు తీసుకొని వీసా ఇప్పించకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి యాదవ్రెడ్డిని అరెస్ట్ చేశారు. -
బాహుబలి టిక్కెట్ల పేరుతో మోసం
హైదరాబాద్: బాహుబలి–2 సినిమా టిక్కెట్ల ఆన్లైన్ విక్రయం పేరుతో ఇంటర్నెట్లో ఏర్పాటు చేసిన ఓ వెబ్‌సైట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. తమతో ఎలాంటి ఒప్పందం లేకపోయినా సదరు వెబ్సైట్ తమ పేరుతోనూ టిక్కెట్లు విక్రయిస్తోందని ఏషియన్ సినిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని నమోదు చేశారు. బాహుబలి–2కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఓ ముఠా పగడ్భందీ పథకంతో రంగంలోకి దిగింది. తమిళనాడులోని కోయంబత్తూరు చిరునామాతో ఈ నెల 7న (www. newticketr.in) పేరుతో వెబ్సైట్ రిజిస్టర్ చేయించింది. ఏడాది పాటు నిర్వహించేందుకు సర్వర్‌ను సైతం లీజుకు తీసుకుంది. ఆర్థిక లావాదేవీల కోసం ‘పేయూమనీ’తో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌తో పాటు కొన్ని ఇతర దేశాల్లోనూ ఉన్న సినిమా «థియేటర్ల పేర్లు పొందుపరిచింది. సాధారణ ఆన్లైన్ వెబ్సైట్ మాదిరిగానే దీనిలోకీ ప్రవేశిస్తే థియేటర్లు, వాటిలోని సీట్ల వరుసలు అన్నీ కనిపిస్తుండటంతో పాటు బుక్ చేసుకున్న వారికి కన్ఫర్మేషన్ సందేశాలు సైతం వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ రకంగా అనేక మందిని మోసం చేసిన ఈ ముఠా మూలాలపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి దుబాయ్ కేంద్రంగా వీరు వ్యవహారాలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. -
రాంగ్‌కాల్‌తో మోసం
అమడగూరు : అమడగూరు మండలం ఎ.పుట్లవాండ్లపల్లికి చెందిన కేశవ అనే వ్యక్తి తనకొచ్చిన ఓ రాంగ్‌కాల్‌తో నిలువునా మోసపోయాడు. ఇరవై రోజుల కిందట వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో సెల్: 7065635979 నంబర్‌తో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మీ ఫోన్ నంబరుకు శ్యామ్‌సంగ్ జే7, ఫోన్ ఆఫర్‌గా వచ్చిందని’ అవతలి వ్యక్తి చెప్పాడు. మార్కెట్లో ఆ ఫోన్ ధర రూ.16 వేలు, ఉండగా మీకు ఆఫర్ కింద కేవలం రూ.4 వేలకే ఇస్తున్నట్లు తెలిపాడని, అడ్రస్ చెప్తే పోస్ట్‌కు పంపిస్తామని, డబ్బులు చెల్లించి మీఫోన్‌ను తీసుకోవచ్చని తెలిపాడన్నారు. అతను చెప్పిన ప్రకారం బుధవారం ఉదయం సెల్: 8510995234 నంబర్‌తో మరో కాల్ రాగా, ‘మీ సెల్‌ఫోన్ పోస్టులో ఉందని, వెళ్లి తీసుకోవాల్సిందిగా తెలిపాడన్నారు. పోస్టాఫీసుకు వెళ్లి రూ.4 వేలు చెల్లించగా, శ్రీసాయి ఎంటర్ ప్రైజస్-ఢిల్లీ పేరుతో వచ్చిన పార్శిల్‌ను తనకు అందిచారని, వాటిని తెరచి చూస్తే.. సెల్‌ఫోన్‌కు బదులు లక్ష్మీబొమ్మ, రెండు బిల్లలు, ఒక యంత్రం ఉన్నాయని బాధితుడు లబోదిబోమన్నారు. ఏం చేయాలో తోచక బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. -
ఆన్లైన్ మోసంపై ఫిర్యాదు
శ్రీకాకుళం సిటీ : నగరంలో మరో ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం నగరంలోని చిన్నబజారుకు చెందిన సతివాడ లక్ష్మికి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో అకౌంట్ ఉంది. గురువారం గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికి ఖాతా, పిన్ నంబర్లను సేకరించారు. కొంత సేపటి తర్వాత తన బ్యాంకు అకౌంట్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.46,490 నగదు విత్‌డ్రా చేశారని సతివాడ లక్ష్మి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.త్రినేత్రి తెలిపారు. -
రూ. 2 కోట్లకు ఆన్‌లైనేశాడు
ఖాతాదారుల సొమ్ము సొంత అకౌంట్లోకి తరలింపు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పేరిట బ్యాంక్ ఆఫ్ బరోడాలో మోసం ఆరు లక్షలతో కారు కొనుగోలు.. రూ.25 లక్షలు స్వాహా పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు షాద్‌నగర్ క్రైం: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు.. ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన వారిని పక్కదారి పట్టించింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అంటూ ఏకంగా బ్యాంకులోనే కౌంటర్ తెరిచారు. ఖాతాదారుల నుంచి నగదు తీసుకున్న వారు ఖాతాదారుల అకౌంట్లో జమ చేయకుండా తమ అకౌంట్లో వేసుకున్నారు. ఖాతాదారుల సొమ్ముతో ఖరీదైన కారు కొనుగోలు చేసిన ప్రబుద్ధులు చివరకు అడ్డంగా దొరికిపోయి పోలీసు విచారణలో ఉన్నారు.. వివరాల్లోకి వెళితే... ఫరూఖ్‌నగర్ మండల కేంద్రానికి చెందిన బుడ్డోల్ల శ్రీకాంత్ గౌడ్ పట్టణంలో గాంధీనగర్ కాలనీలో ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న కొందుర్గు మండలం రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన బుడ్డోళ్ల శ్రీకాంత్‌ను పనిలో పెట్టుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల్లో రద్దీ బాగా పెరగడంతో పట్టణానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు తమ బ్యాంకులోనే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు చాలామంది గంటల తరబడి క్యూలో నిలబడలేక తమ వద్ద ఉన్న నగదును కౌంటర్లో ఉన్న బుడ్డోళ్ల శ్రీకాంత్‌కు ఇచ్చి కౌంటర్ ఫైల్ తీసుకుని వెనుదిరిగేవారు. ఈ తరహాలో నవంబరు 10 నుండి డిసెంబరు 21 వరకు 127 మంది ఖాతాదారులు మొత్తం రూ. 2 కోట్ల మేర ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కోసం శ్రీకాంత్‌కు ముట్టజెప్పారు. ఇదిలా ఉండగా ఎంతకీ తమ డబ్బులు సంబంధిత అకౌంట్లలో జమకాకపోవడంతో ఖాతాదారులు బ్యాంకు మేనేజరును సంప్రదించి విషయం ఏంటని వాకబు చేయగా అసలు విషయం బయట పడింది. ఖాతాదారుల నుండి తీసుకున్న నగదును వారి అకౌంట్లలో వేయకుండా శ్రీకాంత్ తమ సొంత సేవింగ్ ఖాతాలో జమచేసిన విషయాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు. వెంటనే అకౌంట్ ఫ్రీజ్ చేసి ఖాతాదారుల ఖాతాలకు డబ్బులు మార్పిడి చేశారు. ఖాతాదారుల నుంచి తీసుకున్న నగదులో రూ. 6 లక్షలను మహబూబ్‌నగర్‌కు చెందిన జై రామా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కారు కొనుగోలు కోసం ఆర్టీజీఎస్ ద్వారా నగదును ట్రాన్ఫ్‌ర్ చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. శ్రీకాంత్ సేవింగ్ ఖాతాలో ఉన్న నగదును బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకోగా ఇంకా రూ. 25,91,694 లక్షల నగదు ఖాతాదారుల నుంచి తీసుకుని శ్రీకాంత్ తన సొంత అవసరాలకు వాడుకున్నాడని గుర్తించారు. ఈ మేరకు షాద్‌నగర్ పోలీసులకు బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. -
సోషల్ ట్రేడ్: రూ.3,700 కోట్ల ఘరానా మోసం
-
బయటపడ్డ ఆన్లైన్ మోసం
ఇల్లందు: ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలో ఓ ఆన్ లైన్ మోసం బయటపడింది. 24 ఏరియాకు చెందిన నరేష్(25) అనే యువకుడు ఆన్లైన్ మోసానికి బలయ్యాడు. నరేష్ గత నెల 19న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 389 పెట్టి ఒక మెమొరీ కార్డు కొన్నాడు. సరిగ్గా నెల తర్వాత డిసెంబర్ 19న రెండు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ టాన్సాక్షన్స్ ద్వారా రూ. 45,988, రూ.11,999 ల డబ్బు అమెజాన్‌కు బదిలీ అయింది. డబ్బులు తన అకౌంట్ నుంచి బదిలీ అయినట్లు నరేష్ రెండు రోజుల తర్వాత తెలుసుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడు అమెజాన్ కస్టమర్ కేర్‌కు, బ్యాంకుకు తెలియజేయగా.. వారు పోలీసులను ఆశ్రయించడని తెలిపారు. ఈ మేరకు బాధితుడు ఇల్లందు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మొబైల్ ఫోన్ పేరుతో మోసం
– రూ.16వేలు విలువ చేసే మొబైల్ ఫోన్ రూ. 4500కే మీ సొంతం అంటూ మెసేజ్ - పార్సిల్ విప్పి చూస్తే అందులో రూ.50 విలువ చేసే బొమ్మలు బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో హెచ్ఆర్ఏగా పనిచేస్తున్న ఎస్.గౌస్‌పీర్ తన మొబైల్ ఫోన్లో కొత్తగా వొడాఫోన్ సిమ్‌ను వేసుకొన్నాడు. వేసుకొన్న మరుక్షణమే ఆయన ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో రూ.16వేలు విలువ చేసే స్యామ్సంగ్ మొబైల్ ఫోన్ కేవలం రూ.4500కే వస్తుందని ఉండటంతో ఆశపడిన గౌస్‌పీర్ కుటుంబ సభ్యులు ఆన్లైన్లో బుక్ చేశారు. గురువారం స్థానికంగా ఉన్న పోస్టల్ ఉద్యోగి పార్సిల్‌ను తీసుకొని వచ్చి ఇచ్చి రూ.4500 డబ్బు తీసుకున్నాడు. సెల్ ఫోన్ వచ్చిందనే ఆశతో ఆ పార్సిల్‌ను తెరచి చూడగా అందులో రెండు చిన్న బొమ్మలు ఉన్నాయి. వాటి విలువ రూ.50 ఉంటుంది. బిత్తర పోయిన గౌస్‌పీర్ కుటుంబ సభ్యులు రూ.4500 డబ్బులు తిరిగి ఇస్తారా అని పోస్టుమాస్టర్‌ను అడిగారు. పార్సిల్ ఇవ్వడమే తమ డ్యూటీ అని తిరిగి డబ్బులు వెనక్కు ఇవ్వలేమని చెప్పడంతో లబోదిబోమన్నారు. కాగా, ఆ పార్సిల్ దిల్లీ నుంచి శివ ఎంటర్ ప్రైజస్ పేరుతో వచ్చింది. -
అడ్డం తిరిగిన కిడ్నాప్ కథ
ట్రేడ్ ఇండియా ఫర్ యూ పేరిట మోసం కటకటాల్లోకి నిందితుడు హుస్నాబాద్ : ట్రేడ్ యూనియన్ ఫర్యూ డాట్‌కమ్ పేరిట మోసాలకు పాల్పడడమే కాకుండా.. కిడ్నాప్ కథ అల్లిన ఓ సైబర్ నేరస్తున్ని కోహెడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సదరు నిందితుడికి సంబంధించిన వివరాలను హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ దాసరి భూమయ్య విలేకరులకు వెల్లడించారు. బెజ్జంకి మండలం మాదాపూర్‌కు చెందిన గూడూరు శ్రీనివాసాచారి కరీంనగర్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ట్రేడ్ యూనియన్ ఫర్యూ డాట్ కమ్ పేరిట వెబ్సైట్ ప్రారంభించాడు. రూ.20వేలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.వెయ్యి చొప్పున నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తానని నమ్మించాడు. ఇందుకు గొలుసుకట్టు విధానాన్ని ఎంచుకున్నాడు. ఇలా హుస్నాబాద్, కోహెడ, మెదక్ జిల్లా సిద్దిపేటలో కొందరిని ఏజెంట్లుగా పెట్టుకుని వారికి 20శాతం కమీషన్ ఇచ్చేవాడు. వారిద్వారా 50 మంది నుంచి దాదాపు రూ.కోటి వరకు వసూలు చేశాడు. అడ్డం తిరిగిన కిడ్నాప్ కథ డబ్బులు వసూలు చేసిన శ్రీనివాసాచారి రూ.వెయ్యి మాత్రం చెల్లించలేదు. దీంతో బాధితులు పలుమార్లు ఫోన్ చేసినా.. స్పందన లేదు. ఇటీవల కోహెడ మండలం పెద్దసముద్రాలకు రాగా.. బాధితులు నిలదీశారు. ఆ సమయంలో వారికి రూ. నాలుగు లక్షలు చెల్లించనున్నట్లు ప్రామిసరి నోట్ రాసిచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకున్న శ్రీనివాసాచారి తనను కొందరు కిడ్నాప్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను అశ్రయించాడు. అతడి ఫిర్యాదుపై లోతుగా విచారణచేపట్టగా.. కిడ్నాప్ కథ ఒట్టిదేనని, అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని గుర్తించారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఐ వివరించారు. నిందితుడిని పట్టుకున్న కోహెడ ఎస్సై తిరుపతి, సిబ్బందిని అభినందించారు. హుస్నాబాద్ ఎస్సైలు సంజయ్, పాపయ్యనాయక్ తదితరులున్నారు. -
ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ఈ తప్పులు చేయొద్దు
అనంతపురం: ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు లావాదేవీలు ఖాతాదారుల ఇళ్ల వద్ద నుంచే అతి సునాయసంగా జరిగిపోతున్నాయి. అయితే నెట్ బ్యాంకింగ్‌లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహిస్తే అసలుకే మోసం వస్తుంది. మీకు తెలియకుండానే మీ ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొట్టే ముఠాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ఇలా డబ్బులు పోగొట్టుకున్న బాధితులను వార్తలు నిత్యం చూస్తుంటాం. లాగిన్ అయ్యే సమయంలో ఏమరపాటు అస్సలు పనికిరాదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించే ఖాతాదారులు ముఖ్యంగా ఈ 7 అంశాలు గుర్తుంచుకోవాలి. 1. ముఖ్యంగా ఆకర్షణీయ హెడ్లైన్ పెట్టగానే క్లిక్ చేస్తుంటాం. అది పెద్ద ప్రమాదానికే దారి తీస్తుంది. ఈ విషయం మనకు తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇక్కడ కొన్ని లింక్‌లు ఉంటాయి. ఒక లింక్‌తో మరో లింక్ అంటిపెట్టుకుని ఉండటం వల్ల వైరస్ వ్యాపిస్తుంది. అది మీ వ్యక్తిగత విషయాలను సంఘ విద్రోహక శక్తులకు చేర వేస్తుంది. ముఖ్యంగా మీ పాస్‌వర్డ్‌ను ఇతరులకు తెలియనివ్వకూడదు. 2. సిమ్ స్వాప్ అనేది ఆధునాతన పద్ధతి. ఈ సాంకేతికత వల్ల మీ పేరు, సంప్రదించాల్సిన నంబరు వివరాలు మీకు సంబంధించిన అన్ని బ్యాంకుల్లో నమోదు చేయిస్తే ఏదేని మోసం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. మొబైల్‌కు వెంటనే మెసేజ్ వస్తుంది. 3. ప్రస్తుతం వైఫై సేవలు ఎక్కడ చూసినా సౌలభ్యంగా లభిస్తున్నాయి. మీ వివరాలు మరొకరు తెలుసుకోకుండా ఉండాలంటే తరచూ పాస్వర్డ్ మార్చాలి. అప్పుడు మోసం జరగడానికి వీలుండదు. 4. సోషల్‌మీడియాలో సమాచారాన్ని షేర్ చేసుకోకూడదు. ఫేస్బుక్ ద్వారా హాకర్స్ సమాచారాన్ని సేకరిస్తుంటారు. తర్వాత మోసానికి పాల్పడుతారు. అందువల్ల పూర్తి పేరు, ఫోన్ నంబరు, పుట్టినతేదీ తదితర వివరాలను రహస్యంగా ఉంచడం మంచిది. ఈ సమాచారమే మోసగాళ్లకు ఆయువుపట్టు. 5. చాలావరకూ యాంటీవైరస్‌ను ఎవరూ అప్డేట్ చేయరు. దీనివలన సాఫ్ట్వేర్ వైరస్‌కు గురవుతుంది. యాంటీ వైరస్లు సాఫ్ట్వేర్లు కుండా అడ్డుకుంటాయి. 6. చాలామంది పాస్‌వర్డ్‌ను మర్చిపోకుండా ఉంటామని తమ పుట్టిన తేదీనో, సెల్ నంబరునో పెట్టుకుంటారు. అందువలన మోసగాళ్లు ఇలాంటి సమాచారంతో డబ్బులు డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అలాంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోక పోవడం మంచిది. 7. హాకర్స్‌కి సమాచారం ఇచ్చే నెట్ వ్యవస్థతో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా కంప్యూటర్ లాగవుట్ చేసుకునే అలవాటు చేసుకోవాలి. -
'ఆన్ లైన్ మోసాల్లో చిక్కుకోవద్దు'
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఆయన కొన్ని విషయాలను వెల్లడించారు. తన పేరు చెప్పి, పీఎం సంతకం అని చెబుతూ కొందరు అడ్డదార్లలో డబ్బు సంపాదించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఆ సంతకాలేవీ తనవి కాదని ఈ విధంగా తన పేరు చెప్పి ఆన్ లైన్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ఆన్ లైన్ మోసాలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పీఎం సంతకం నకిలీదని పేర్కొంటూ పీఎంవో కూడా ఈ విషయాలపై ట్వీట్ చేసింది. మోదీ ఫొటోలను మార్ఫింగ్ చేశాడన్న కారణంగా గత మేలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారత్ లో అత్యధిక ట్విట్టర్ ఫాలోయర్స్ జాబితాలో పీఎం మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. -
వీడు మామూలోడు కాదు!..
► సర్వర్ మైనింగ్ పేరిట రూ.కోట్లలో కుచ్చుటోపీ ► సొంత కరెన్సీ, కాయిన్స్ పేరుతో బురిడీ ► పోలీసు కస్టడీలో నిందితుడు సాక్షి, సిటీబ్యూరో: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఎంతో మంది అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకున్న ఘరానా ఆన్లైన్ మోసగాడు... బెంగళూరుకు చెందిన బీఎం జగదీశా లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై నిందితుడిని బెంగళూరు నుంచి నగరానికి తీసుకువచ్చారు. మియాపూర్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీలోకి తీసుకొని నిందితుడి మోసాలపై ఆరా తీస్తున్నారు. జర్మనీ కేంద్రంగా పని చేస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్.ఈయూ, ఇంగ్లండ్ చిరునామాతో 3జీ మైనింగ్ టెక్ లిమిటెడ్‌ల మార్కెటింగ్‌కు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్.గోల్డ్ పేరుతో మరో వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. తన గర్ల్ ఫ్రెండ్ భర్త, తమిళనాడుకు చెందిన కె.నాగరాజన్ పేరుతో ఈ వెబ్సైట్లను ప్రారంభించాడు. మరో ట్విస్ట్ ఏంటంటే కె.నాగరాజన్ గత ఏడాది జనవరిలో చనిపోయాడు. దీంతో అతడి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డు నంబర్లను వినియోగించి సర్వర్ మైనింగ్‌కు తెరలేపాడు. దీని ద్వారా వచ్చే డేటాను గిగా బైట్స్‌గా మార్చి ఇస్తే మీకు ఒక గ్రాము క్రిష్ణో కరెన్సీ వస్తుందని... దీని విలువ నాలుగు యూరోలని వెబ్సైట్లో ప్రకటన ఇచ్చాడు. కుషాయిగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నెలవారీ రిటర్న్స్ ఆ కంపెనీ ఇవ్వకపోవడంతో వెబ్‌సైట్‌లోని చిరునామా ఆధారంగా బెంగళూరు కార్యాలయాన్ని సంప్రదించాడు. ఎంతకీ సమాధానం రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరు వెళ్లి జగదీశాను అరెస్టు చేశారు. మోసం చేసేదిలా... ‘మా సంస్థ నిర్వహిస్తున్న సర్వర్ మైనింగ్ డేటా ప్రాజెక్టులను తీసుకుంటే... రెండేళ్లలో మీ పెట్టుబడికి 180 శాతం అధిక ఆదాయం వస్తుంద’ని నమ్మిస్తాడు. దీని కోసం కంపెనీ ఇచ్చే సర్వర్ మైనింగ్ డేటాను అల్గారిథమ్ ప్రక్రియలో క్రిష్ణోగ్రఫీ, బార్‌కోడ్‌లను కిలోబైట్స్, మెగాబైట్స్, గిగా బైట్స్లుగా మార్చి డేటాను రూపొందించాలి. ఒక గిగాబైట్ డేటాను తయారు చేస్తే ఒక గ్రాము క్రిష్ణో కరెన్సీని ఇస్తామని చెబుతాడు. దీని విలువ నాలుగు మూరోలకు సమానమని చెబుతాడు. దీని కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్.గోల్డ్‌లో 3జీ కాయిన్ ఖాతా తెరవాలంటే తొమ్మిది స్టెప్పుల్లో వివరాలు నింపాలి. బ్యాంక్ ఖాతా, పాన్ నంబర్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు పూర్తి చేయాలి. వెబ్సైట్లో ఇవన్నీ తనిఖీ చేసిన తర్వాత దరఖాస్తుదారుడి అడ్మినిస్ట్రేటర్ ఈ–మెయిల్‌కి ఓ ఐడీ నంబర్ పంపించేవాడు. రిజిస్ట్రేషన్ చార్జీల కింద 30 యూరోలకు సమానమైన భారత కరెన్సీని 3జీ కాయిన్ఐఎన్సీ పేరిట రూ.2,250 డిపాజిట్ చేయమనే వాడు. ఇలా ఒక్కో క్రిష్ణో కాయిన్‌పై 30 యూరోలను డిపాజిట్ చేసి సర్వర్ మైనింగ్ పొందితే రెండేళ్లలో 128 క్రిష్టో కాయిన్స్ పొందవచ్చని చెప్పేవాడు. -
పెళ్లి పేరుతో ఆన్లైన్ మోసం
పెనమలూరు: పెళ్లి చేసుకోవాలని ఓ యువతి తన వివరాలు ఓ వెబ్సైట్లో ఉంచింది. దీనిని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు తాను ఆస్ట్రేలియాలో ఉంటానని, పెళ్లి చేసుకుంటానని ఆన్‌లైన్‌లోకి వెళ్లి నమ్మించాడు. అనంతరం ఆమె నుంచి సుమారు రూ. 15 లక్షలు స్వాహా చేశాడు. పెనమలూరు సీఐ దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం కానూరుకు చెందిన ఓ యువతి వివాహం చేసుకోవాలని గత ఏప్రిల్‌లో భారతి మేట్రోమోని వెబ్సైట్లో తన వివరాలు ఉంచింది. డామ్నిక్ సంజయ్ అనే వ్యక్తి ఆన్లైన్లో ఆమె వివరాలు తెలుసుకుని ఆమెతో మాట్లాడాడు. తాను ఆస్ట్రేలియాలో ఉంటానని, మంచి ఉద్యోగం చేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. పెళ్లికి అయ్యే ఖర్చు భరించే స్థోమత తన వద్ద లేదని యువతి తెలుపగా తాను రూ. 50 వేల డాలర్లు పంపుతానని, పెళ్లి ఏర్పాట్లు చేయాలని కోరాడు. సొమ్ము బార్సిలీ బ్యాంకు ద్వారా పంపుతానని నమ్మించాడు. కొద్ది రోజులకు బార్సిలీ బ్యాంకు ఢిల్లీ శాఖ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. రూ. 50 వేల డాలర్లు మీ పేరున వచ్చాయని, మనీ ట్రాన్సఫర్ ఫీజు చెల్లించాలని చెప్పారు. దీంతో ఆమె రూ 1,26,300లను బ్యాంకు ఎకౌంట్‌కు జమ చేసింది. మరలా బ్యాంకు నుంచి కొద్ది రోజులకు ఫోన్ వచ్చింది. ఇన్‌కంట్యాక్స్ కింద రూ.1,65,500, బ్యాంక్ అప్రూవల్‌కు రూ. 5,10,820, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్‌కు రూ. 2.50 లక్షలు, మరో డిపాజిట్ కింద రూ. 2,99,100, ఇతర ఖర్చులకు మిగిలినవి కలిపి మొత్తం రూ. 15లక్షలను ఆమె జమ చేసింది. ఆ తరువాత బ్యాంకు నుంచి కాని, డామినిక్ సంజయ్ నుంచి కాని ఎటువంటి ఫోన్ రాకపోవడంతో యువతికి అనుమానం వచ్చి సంజయ్‌కు ఫోన్ చేయగా ఫోన్ పలకలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ దామోదర్ దర్యాప్తు చేపట్టారు.