రాంగ్‌కాల్‌తో మోసం | cyber crime in putlavandlapalli | Sakshi
Sakshi News home page

రాంగ్‌కాల్‌తో మోసం

Published Wed, Mar 22 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

cyber crime in putlavandlapalli

అమడగూరు : అమడగూరు మండలం ఎ.పుట్లవాండ్లపల్లికి చెందిన కేశవ అనే వ్యక్తి తనకొచ్చిన ఓ రాంగ్‌కాల్‌తో నిలువునా మోసపోయాడు. ఇరవై రోజుల కిందట వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో సెల్‌: 7065635979 నంబర్‌తో ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘మీ ఫోన్‌ నంబరుకు శ్యామ్‌సంగ్‌ జే7, ఫోన్‌ ఆఫర్‌గా వచ్చిందని’ అవతలి వ్యక్తి చెప్పాడు. మార్కెట్‌లో ఆ ఫోన్‌ ధర రూ.16 వేలు, ఉండగా మీకు ఆఫర్‌ కింద కేవలం రూ.4 వేలకే ఇస్తున్నట్లు తెలిపాడని, అడ్రస్‌ చెప్తే పోస్ట్‌కు పంపిస్తామని, డబ్బులు చెల్లించి మీఫోన్‌ను తీసుకోవచ్చని  తెలిపాడన్నారు.

అతను చెప్పిన ప్రకారం బుధవారం ఉదయం సెల్‌: 8510995234 నంబర్‌తో మరో కాల్‌ రాగా, ‘మీ సెల్‌ఫోన్‌ పోస్టులో ఉందని, వెళ్లి తీసుకోవాల్సిందిగా తెలిపాడన్నారు. పోస్టాఫీసుకు వెళ్లి రూ.4 వేలు చెల్లించగా, శ్రీసాయి ఎంటర్‌ ప్రైజస్‌-ఢిల్లీ పేరుతో వచ్చిన పార్శిల్‌ను తనకు అందిచారని, వాటిని తెరచి చూస్తే.. సెల్‌ఫోన్‌కు బదులు లక్ష్మీబొమ్మ, రెండు బిల్లలు, ఒక యంత్రం ఉన్నాయని బాధితుడు లబోదిబోమన్నారు. ఏం చేయాలో తోచక బాధితుడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement