ఆన్‌లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా 25 ఏళ్ల ఐఐటీ బాంబే విద్యార్థి అధునాతన మోసంలో రూ. 7.28 లక్షలు కోల్పోయి బాధితుడయ్యాడు.
వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. విద్యార్థికి ట్రాయ్ అధికారినంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. విద్యార్థి మొబైల్ నంబర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన 17 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆ వ్యక్తి చెప్పాడు. తమ సూచనలను పాటించకపోతే "డిజిటల్ అరెస్ట్" అయ్యే ప్రమాదం ఉందని బెదిరించాడు.
చట్టపరమైన పరిణామాలు, అభియోగాల తీవ్రతకు భయపడిన విద్యార్థి వారి సూచనలను అనుసరించడానికి అంగీకరించాడు. కేసుల నుంచి పేరును తొలగించడానికి, చట్టపరమైన సమస్యలను నివారించడానికి రూపొందించిన ప్రక్రియ పేరుతో స్కామర్లు పలు దఫాలుగా రూ. 7.28 లక్షలను వారి ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. భయంతో అతను వారి సూచనలను అనుసరించిన విద్యార్థి చివరికి bమోసానికి గురయ్యాడు.
వణికిపోవద్దు..
ఇలాంటి ఆన్‌లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇలాంటి మోసాలకు బలి అవుతున్న వ్యక్తుల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ఈ స్కామ్‌లలో చాలా వరకు వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా చట్టబద్ధమైన సంస్థల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా జరుగుతన్నాయి. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కాలర్ గుర్తింపును ధ్రువీకరించుకోవాలని, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం తీసుకోవాలని, భయంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment