సోషల్ ట్రేడ్ మోసం బట్టబయలైంది. రూ.3,700 కోట్ల ఘరానా మోసం బయటపడింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట పలువురు అమాయకులకు కుచ్చుటోపీ పెట్టారు. దాదాపుగా ఒక్కొక్కరి నుంచి రూ.57,500 వసూలు చేశారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో దీని భారిన పడిన బాధితులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన వారు కూడా చాలామంది ఉన్నట్లు దీనివల్ల బలైనవారిలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురుని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఈ బిజినెస్ వ్యవహారం సాగినట్లు పోలీసులు చెప్పారు