బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరి యువతుల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. కనీసం అమ్మాయిలన్న విషయం గుర్తించకుండా మగ పోలీసులే వారిని జుట్టు పట్టి మరి ఈడ్చిపడేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ పర్యటనలో భాగంగా అమిత్ షా అలహాబాద్‌లో చేపట్టిన ర్యాలీని ఇద్దరు యువతులు నల్ల జెండాలతో అమిత్ షా గో బ్యాక్ అంటూ పోలీస్ వాహానాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని ఈడ్చిపడేశారు. అంతేకాకుండా వారిపై లాఠితో దాడి చేసి బలవంతంగా జీపు ఎక్కించారు. అయితే మగ పోలీసులే యువతులను లాగేయడం ఏమిటని, మహిళా పోలీసులు ఎమయ్యారని, కీలక నేత పర్యటిస్తున్నప్పుడు మహిళా పోలీసులు లేకుండా ఎలా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అసలు యూపీలో మహిళా పోలీసులే లేరా? అని సెటైర్లు కూడా వస్తున్నాయి.
మగ పోలీసులే యువతులను లాగేయడం ఏంటి?
Published Sat, Jul 28 2018 2:04 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM
Advertisement
Advertisement
Advertisement