Up police
-
బహ్రెయిచ్ నిందితుల అరెస్టు
బహ్రెయిచ్: దుర్గాదేవి విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన కాల్పులు, అల్లర్ల ఘటనలో నిందితులైన ఐదుగురిని యూపీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచగా కాళ్లపై షూట్‌చేసి వారిని నిలువరించారు. తొలుత పోలీసులపైకి నిందితులు కాల్పులు జరపడంతో కొద్దిసేపు పరస్పర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బహ్రెయిచ్– నేపాల్ సరిహద్దులోఈ ఘటన జరిగిందని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ అమితాబ్ యష్ చెప్పారు. మొహమ్మద్ ఫహీన్, మొహమ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మొహమ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ, మొహమ్మద్ అఫ్జల్‌లను అరెస్ట్చేశామని డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. తొలుత ఫహీన్, తలీమ్‌లను అరెస్ట్‌చేసి కాల్పులకు వాడిన ఆయుధాన్ని స్వా«దీనం చేసుకునేందుకు పోలీసులు గురువారం మధ్యాహ్నం నేపాల్ సరిహద్దు సమీపంలోని హడా బసేహరీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి చేరుకోగానే హమీద్, సర్ఫరాజ్, అఫ్జల్ పోలీసులపైకి కాల్పులు మొదలెట్టారు. ఈ క్రమంలో సర్ఫరాజ్, తలీమ్ పోలీసుల నుంచి తప్పించుకుని నేపాల్‌కి పారిపోబోయారు. ఈ క్రమంలో పోలీసులు జరిపి ఎదురుకాల్పుల్లో సర్ఫరాజ్, తలీమ్ గాయపడ్డారు. ఒకరి కుడి కాలికి, ఇంకొకరి ఎడమ కాలికి బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. మహ్సీ తాహసిల్ పరిధిలోని మన్సూర్ గ్రామంలో అక్టోబర్ 13న దుర్గామాత విగ్రహం ఊరేగింపులో మరో మతానికి చెందిన ప్రార్థనాస్థలం ఎదురుగా భారీ శబ్ధంతో ‘మళ్లీ యోగీజీ వస్తారు’ అంటూ పాటలు, డీజే మోగించడంతో వివాదం మొదలైంది. ఈ సందర్భంగా ఒక ఇంటి పైనుంచి గుర్తు తెలియని వ్యక్తి ఊరేగింపుపై కాల్పులు జరిపాడు. దీంతో 22 ఏళ్ల రాంగోపాల్ మిశ్రా చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. వ్యక్తి మృతికి నిరసనగా 14వ తేదీన అల్లరి మూకలు ఇళ్లు, దుకాణాలు, షోరూమ్‌లు, ఆస్పత్రులు, వాహనాలను దగ్ధంచేయడం తెల్సిందే. పరిస్థితి గురువారినికి అదుపులోకి రావడంతో ప్రభుత్వం 4 రోజుల తర్వాత బహ్రెయిచ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించింది. పరిపాలనలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జిల్లా, రాష్ట్ర యంత్రాలు పూర్తిగా విఫలమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ దుయ్యబట్టారు. -
మీరు జీవితకాల ప్రేమ పొందారు: యూపీ పోలీసు వినూత్న ట్వీట్
లక్నో: భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 7 ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడిచింది. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టీ20 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలో రెండో టీ20 ప్రపంచ కప్‌ను అందుకుంది. భారత్ టీ 20 ప్రపంచం కప్ సాధించటంతో ప్రధాని మోదీ నుంచి మొదలు.. సెలబ్రిటీలు అంతా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా భారత జట్టుకు అభినందనలు తెలిపారు. యూపీ పోలీసులు.. తమ ‘ఎక్స్’అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు.‘బ్రేకింగ్ న్యూస్.. భారత జట్టు బౌలర్లు దక్షిణాఫ్రికా హృదయాలను బద్దలు కొట్టడంలో దోషులుగా మిగిలారు. అలాగే భారత్‌లోని బిలియన్ క్రికెట్ అభిమానుల నుంచి జీవితకాల ప్రేమను పొందారు!’ అని పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సరిగా చెప్పారు. భారత జట్టు బిలయన్ అభిమాను జీవితం కాలం పొందారు’అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 𝑩𝒓𝒆𝒂𝒌𝒊𝒏𝒈 𝑵𝒆𝒘𝒔: Indian bowlers found guilty of breaking South African hearts.𝑺𝒆𝒏𝒕𝒆𝒏𝒄𝒆: Lifelong love from a billion fans! ❤️🏏 #INDvSAFinal#T20WorldCupFinal pic.twitter.com/UPaCzgf6vm— UP POLICE (@Uppolice) June 29, 2024 -
యూపీ బోర్డు పేపర్ లీక్ ప్రధాన నిందితుడు అరెస్ట్!
ఉత్తరప్రదేశ్ బోర్డు 12వ తరగతి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ల ఫోటోలను నిందితుడు వినయ్ వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 29న యూపీ బోర్డు సెకండ్ షిఫ్ట్ పరీక్షలో 12వ తరగతికి చెందిన రెండు పేపర్లు లీక్ అయ్యాయి. ఆగ్రాలోని శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వినయ్ చౌదరి 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ ఫొటోలను ‘ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. 12వ తరగతి పేపర్ లీక్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పేపర్ లీక్ అయిన ఆగ్రాలోని సదరు కళాశాల గుర్తింపును రద్దు చేశారు. యూపీ బోర్డు సమావేశంలో శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ రోజౌలీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరి, స్కూల్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రాజేంద్ర సింగ్, అదనపు సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గంభీర్ సింగ్, స్టాటిక్ మేజిస్ట్రేట్ గజేంద్ర సింగ్‌లపై ఫిబ్రవరి 29 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే సెంటర్ నిర్వాహకుడు రాజేంద్ర సింగ్‌తో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేసి, జైలుకు తరలించారు. -
మేనకోడలిపై మోహంతో భార్యపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
లక్నో: యూపీలోని బుడౌన్ బుడౌన్‌లో ఓ మహిళా దారుణానికి ఒడిగటింది. తాగొచ్చి తన మేనకోడలిని లొంగదీసుకునే ప్రయత్నిస్తూ తనని తరచూ వేదిస్తున్నందుకు అతడి భార్య మిథ్లేశ్ దేవి(40) భర్త గొంతు కోసి చంపేసింది. కేసు దర్యాప్తు చేసిన యూపీ పోలీసులు చాకచక్యంగా అసలు నిజాన్ని రాబట్టారు. బుడౌన్‌లో ఆట వస్తువులను తయారు చేసే తేజేంద్ర సింగ్(43) ఆగస్టు 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బిల్సి పట్టణంలోని తన ఇంటి ప్రాంగణంలో నిద్రిస్తున్న తేజేంద్ర సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి నుంచి తేజేంద్ర సింగ్ భార్య తడబడుతూ ఒకదానితో ఒకటి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానమొచ్చిందని తర్వాత ఆమెను విడిగా విచారణ చేయగా హత్య తానే చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. తన మేనకోడలిని లొంగదీసుకోవడానికి తేజేంద్ర ప్రయత్నించేవాడని తనని ఒప్పించమని తరచూ వేధించేవాడని భర్త వేధింపుల నుండి విముక్తి పొందాలని ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఓ రోజు అతడు బాగా మద్యం సేవించి రావడంతో నిద్రిస్తున్న సమయంలో కొడవలితో గొంతు కోసి చంపినట్లు మిథ్లేశ్ దేవి నేరాన్ని అంగీకరించిందని వివరించారు బుడౌన్ ఎస్పీ ఓపీ సింగ్. ఇది కూడా చదవండి: HYD: మద్యం మత్తులో సీఐ కారు బీభత్సం.. -
అతీక్, అతని సోదరుడిపై ఉన్న 152 కేసులు క్లోస్!
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఖాలిద్ అజీమ్(అశ్రఫ్) ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరూ మరణించడంతో వీరిపై ఉన్న 152 పెండింగ్ కేసులను క్లోస్ చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు. ఈ ఇద్దరి డెత్ రిపోర్టును కోర్టుకు సమర్పించి కేసులన్నీ మూసివేయనున్నారు. 152 కేసుల్లో అతీక్పైనే 102 కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈకేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఒక్క కేసులో మినహా అతీక్ ఎందులోనూ దోషిగా తేలలేదు. బెదిరింపులు, ప్రలోభాలతో శిక్ష పడకుండా చూసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా అతీక్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతనితో పాటు అనుచరులపైనా యూపీలోని యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. రౌడీ షీటర్లను ఎన్కౌంటర్లలో కాల్చిపడేసింది. వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసింది. అతీక్‌పై 1979లోనే తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పుడు అతని వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. అలాగే అతని సోదరుడు అశ్రఫ్పై 1992లో తొలి కేసు నమోదైంది. వీరిద్దరిపై చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించిన కేసు నమోదైంది. కాగా.. అతీక్, అతని సోదరుడిపై ఉన్న కేసులు క్లోస్ చేస్తున్నప్పటికీ వీటిలో ఇతర నిందితులపై అభియోగాలు అలాగే ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. న్యాయపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చదవండి: బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు.. 14 మంది దుర్మరణం.. 20 మందికి గాయాలు -
ఊరేగింపుగా ఎందుకు తీసుకెళ్లారు ?
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ కస్టడీలో ఉండగా పోలీసుల కళ్లెదుటే హత్యకు గురైన ఘటనపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు, యూపీ సర్కారుకు పలు ప్రశ్నలు సంధించింది. ‘ అతీక్‌ను ఆస్పత్రికి తీసుకొస్తారని నిందితులకు ముందే ఎలా తెలుసు ? మేం కూడా టీవీలో చూశాం. ఆస్పత్రి గేటు నుంచి వారిని లోపలికి అంబులెన్స్‌లో ఎందుకు తీసుకెళ్లలేదు. మీడియా సమక్షంలో వారిని ఎందుకు ఊరేగింపుగా నడిపిస్తూ తీసుకెళ్లారు?. అతీక్ పోలీసు కస్టడీలో ఉండగా మీడియా చూస్తుండగా షూటర్లు హత్యకు ఎలా తెగించగలిగారు?’ అని యూపీ సర్కార్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదుచేయండి న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యానికి తీవ్ర భంగం వాటిల్లేలా విద్వేష ప్రసంగాలు చేసే వారిపై సుమోటో కేసులు నమోదుచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కార చర్య తప్పదని డీజీపీలను హెచ్చరించింది. -
యూపీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాపియా, క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే యూపీ పోలీసులు తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాలో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందినవారు. హత్య, బెదిరింపులు, భూ కబ్జాలు వంటి తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ లిస్టులో టాప్‌లో ఉన్న వారిలో డాన్ నుంచి పొలిటీషియన్‌గా మారిన ముఖ్తర్ అన్సారీ, విజయ్ మిశ్రా, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే హాజి యాకూబ్ ఖురేషి, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ హాజి ఇక్బాల్, మాజీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్, ఎస్పీ మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ ద్వివేది, సుధీర్ సింగ్, దిలీప్ విశ్రా ఉన్నారు. కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా నేర చరిత్ర ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న 66 మంది నేరగాళ్లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. వీరిపై ఉన్న కేసులు త్వరగా విచారణ పూర్తయ్యేలా చూసి కోర్టులో శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ 66 మందిలో అతీక్ అహ్మద్, అదిత్య రాణా ఇప్పటికే చనిపోయారని, 27 మంది జైలులో ఉన్నారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కొందరిపై రూ.లక్షకుపైగా రివార్డు కూడా ఉన్నట్లు వివరించారు. చదవండి: మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట.. -
అతీక్ హత్య కేసులో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్
ప్రయాగ్‌రాజ్: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ పోలీసు వలయం మధ్యే హత్యకు గురవడాన్ని యూపీ పోలీస్ విభాగం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ సిఫార్సు మేరకు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో షాగంజ్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ అశ్వనీకుమార్ సింగ్, ఒక సబ్ఇన్స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గత శనివారం ప్రయాగ్‌రాజ్‌లో రాత్రివేళ మెడికల్ చెకప్ కోసం అతీక్, అతని సోదరుడు ఆష్రాఫ్‌లను పోలీసులు వైద్యకళాశాలకు తీసుకెళ్తుండగా మీడియా సమక్షంలోనే ముగ్గురు నేరగాళ్లు పాయింట్‌బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపి హత్యచేయడం తెల్సిందే. -
తండ్రి పోలీసు, భర్త కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్.. అతీక్ భార్య పర్వీన్ ఎక్కడున్నారు?
లక్నో: పోలీసు కస్టడీలో ఉండగా దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్(51)కోసం ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే పర్వీన్‌ను పట్టిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని యూపీ పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే అతిక్, అష్రఫ్ అంత్యక్రియల సమయంలో పర్వీన్ లొంగిపోతారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆమె హాజరుకాలేదు. అతిక్ హత్య నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో పోలీసులు ఆమె కోసం జల్లెడపడుతున్నారు. కాగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే షైస్తా తన కొడుకు అసద్, భర్త అతిక్ ఇద్దరిని కోల్పోయింది. అసద్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించిన రెండు రోజుల తర్వాత, అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో మీడియా ముసుగులో వచ్చిన ముగ్గురు వక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేరానికి పాల్పడ్డ లవ్లేష్ తివారి(22), అరుణ్ మౌర్య(18), మోహిత్ అలియాస్ సన్నీ(23)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలపై దర్యాప్తునకు యూపీ సీఎం యోగి ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీని, సిట్‌ను నియమించారు. భర్తను హత్య చేశారని తెలియగానే షాయిస్తా పర్వీన్ వెక్కివెక్కి ఏడ్చారని, అనంతరం ఆమె కళ్లు తిరిగి పడిపోయారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: గ్యాంగ్‌స్టర్ అతిక్ హత్య.. తొలిసారి స్పందించిన యూపీ సీఎం ఎవరీ షాయిస్తా పర్వీన్? షాయిస్తా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. 1996లో అతిక్‌ని పెళ్లి చేసుకునే ముందు షాయిస్తా ప్రపంచం కూడా పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇంటర్ పూర్తి చేసిన ఆమెకు అంతకుముందు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం లేదు. అయితే 2009 నుంచి షాయిస్తా పేరు మీద ప్రయాగ్‌రాజ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు చీటింగ్ కేసులు కాగా ఒకటి హత్య కేసు. మొదటి మూడు కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో నమోదవ్వగా నాలుగోది ఉమేష్ పాల్ హత్య కేసు. ఫిబ్రవరి 24న హత్యకు గురైన ఉమేష్ కేసులో ప్రధాన నిందితుల్లో షాయిస్తా ఒకరు. ఈమెతోపాటు భర్త అతిక్ అహ్మద్, ఇద్దరు కుమారులు, సోదరుడు అష్రఫ్ కూడా ఈ కేసులో నిందితుగా ఉన్నారు. 2021లో షైస్టా AIMIMలో చేరారు. అనంతరం 2023 జనవరిలో బీఎస్పీలో చేరారు. ఈ సమయంలో తన భర్త అతిక్ ఎస్పీ అగ్రనేతతో స్నేహం కారణంగా క్రమశిక్షణ నేర్చుకోలేకపోయాడని తెలిపింది. అతిక్ ఎప్పుడూ బీఎస్పీని ఇష్టపడేవాడని.. ఆ పార్టీ అగ్రనేతలకు కూడా సహాయం చేశాడని చెప్పుకొచ్చారు. అయితే తరువాత జరిగిన మేయర్ ఎన్నికలో శాయస్తాను పోటీ చేయకూడదని మాయావతి నిర్ణయించుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రణాళిక రచించడం, దాన్ని అమలు చేయడంతో షాయిస్తా కీలకంగా వ్యహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉండగా అతీక్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో పర్వీన్ కీలకంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని తేలింది. సీఎం యోగికి షైస్తా లేఖ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పర్వీన్ రాసిన లేఖ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్‌లను తప్పుగా ఇరికిస్తున్నారని లేఖలో ఆమె పేర్కొంది. ఉమేష్ పాల్ హత్యకు మంత్రి నంద్ గోపాల్ గుప్తా కీలక సూత్రధారి అని ఆరోపించారు. అయితే పర్వీన్ ఫిబ్రవరి 27న లేఖ రాయగా.. అతిక్ మరణానంతరం వెలుగులోకి వచ్చింది. సీఎం ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోకపోతే నా భర్త, బావమరిది, కొడుకులను చంపేస్తామని లేఖలో రాసింది. చదవండి: క్రిమినల్ కథా చిత్రమ్.. అతీక్ అహ్మద్‌కు వ్యవస్థ మొత్తం దాసోహమైందా? -
షాకింగ్ ఘటన: కాళ్లు తెగిపడి పట్టాలపై దీనంగా రోదిస్తూ..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో హేయనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. వీధి వ్యాపారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. ఆ కంగారులో ఆ యువకుడు రైలు పట్టాల మీదకు పరిగెత్తాడు. అయితే వేగంగా దూసుకొచ్చే రైలు అతన్ని చిధిమేయడంతో రెండు కాళ్లు పొగొట్టుకుని పట్టాలపై పడి ఆ బాధతో విలపించాడు. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాకు చేరింది. యూపీ కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాహిబ్ నగర్‌కు చెందిన అర్సలాన్ అనే 18 ఏళ్ల యువకుడు.. కళ్యాణ్పూర్ ప్రాంతంలోని జీడీ రోడ్ దగ్గర కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు.. చిరువ్యాపారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే యత్నం చేశారు. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ కూరగాయల దుకాణం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. Shocker from Kanpur ! Policemen threw away a street vendor Irfan's articles on railway tracks in Kalyanpur. He was hit by Memu train while picking them back. He has lost both his legs. Police were clearing sides of GT Road of vendors selling vegetables, and other goods. pic.twitter.com/gbzY71rLg2 — Haidar Naqvi🇮🇳 (@haidarpur) December 2, 2022 ఆపై అర్‌సలాన్‌పై హెడ్ కానిస్టేబుల్ రాకేష్ చెయ్యి చేసుకుని.. అతని కూరగాయల తూకం రాయిని దూరంగా విసిరేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. అది రైలు పట్టాలపై పడడంతో దానిని తెచ్చుకునేందుకు పరిగెత్తాడు ఆ యువకుడు. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. అతని కాళ్లను ఛిద్రం చేసేసింది. అక్కడికక్కడే కాళ్లను పొగొట్టుకున్న ఆ యువకుడు బాధతో పట్టాల మధ్యలో పడి విలపిస్తూ సాయం కోసం చేతులు చాచాడు. అక్కడే ఉన్న కొందరు అతన్ని రోదన పట్టించుకోకుండా వీడియో తీస్తూ ఉండిపోయారు. ఇంతలో జనం తిరగబడతారనే భయంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ను పట్టాల మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో.. రాకేశ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అక్కడ కొందరు తీసిన వీడియోల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకునే యత్నం చేస్తున్నట్లు ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. ఇదీ చదవండి: పాముకి స్నానం.. ఇలాంటి వీడియోను చూశారా? -
క్రిమినల్ కోసం వెళ్లిన పోలీసులపై మర్డర్ కేసు!
దెహ్రాదూన్: నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తారు పోలీసులు. అయితే, నేరస్థులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే మర్డర్ కేసు నమోదైన అరుదైన సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. మైనింగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత భార్య మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేశారు. వారిపై హత్య కేసు సైతం నమోదు చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే? ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన ఐదుగురు పోలీసులు మైనింగ్ మాఫియాను పట్టుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని జాస్పూర్కు వెళ్లారు. రూ.50,000 రివార్డ్ ఉన్న వాంటెడ్ క్రిమినల్ జాఫర్.. జాస్పూర్‌లోని భుల్లార్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్నట్లు తెలిసి.. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, మైనింగ్ ముఠా మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. ఈ ఎదురుకాల్పుల్లో స్థానిక బీజేపీ నేత గుర్తాజ్ భుల్లార్ భార్య గుర్ప్రీత్ కౌర్ ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పోలీసులకు సైతం తూటాలు తగిలాయి. బీజేపీ నేత భార్య మృతితో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ వెళ్లిన ఐదుగురు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులపై హత్య కేసు సైతం నమోదైంది. ‘రూ.50వేల రివార్డ్ ప్రకటించిన వాంటెడ్ క్రిమినల్ కోసం వెతుకుతున్నాం. భరత్‌పుర్ గ్రామం నుంచి తప్పించుకుని పోయాడు. మా పోలీసు బృందం అక్కడికి వెళ్లిన క్రమంలో వారిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. ప్రస్తుతం ఐదుగురు పోలీసులు చికిత్స పొందుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం వేట కొనసాగుతుంది.’ అని మొరదాబాద్ సీనియ్ పోలీసు అధికారి షలాబ్ మథూర్ తెలిపారు. ఇదీ చదవండి: హిజాబ్ తీర్పు: సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం -
రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో న్యూస్ యాంకర్ అరెస్టు!
న్యూఢిల్లీ: జీ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ని అతని నివాసంలోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి చత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఘజియాబాద్ పోలీసులు జోక్యం చేసుకుని రంజన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అయితే యాంకర్ రంజన్‌ను అరెస్టు చేస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నాటకీయ పరిణామాల మధ్య అతను అరెస్టు కావల్సి వచ్చింది. ప్రస్తుతం అతను యూపీ పోలీసుల అధీనంలో ఉన్నాడు. అసలేం జరిగిందంటే...రోహిత్ జీ టీవీ ఛానెల్లో పేరుగాంచిన డీఎన్ఏ షోకి వ్యాఖ్యతగా చేస్తున్నాడు. రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వీడియో న్యూస్‌ని తప్పుగా అందించారు. ఆ తర్వాత ఛానెల్ వెంటనే సరిచేసుకుని క్షమాపణల చెప్పింది. ఐతే ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడారంటే.."రాహుల్ గాంధీ తన వయనాడ్ కార్యాలయంపై దాడిని ప్రస్తావిస్తూ...ఇలా చేసిన యువకులు చాలా బాధ్యతారహితం ప్రవర్తించారు. అయినా వారు చిన్న పిల్లలు క్షమించండి. అని అన్నారు." అయితే జీ ఛానెల్ ఉదయపూర్‌లో కన్హయ్య లాల్‌ను చంపిన ఘటనతో లింక్ చేస్తూ... వారు చిన్నపిల్లలని, వారిని క్షమించాలంటూ చెబుతున్నట్లుగా వక్రీకరించి సమాచారాన్ని ఇచ్చింది. దీంతో ఆ యాంకర్‌పై చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఆ ఛానల్ జర్నలిస్ట్ ట్విట్టర్లో..చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా తనని ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసం నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఎలా తీసుకువెళ్లారని రంజన్ ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ...సమాచారం ఇవ్వాలనే నియమం లేదు. అయినా ఇప్పడూ మీకు తెలిసింది కాబట్టి తమకు సహకరించాలని రంజన్కి చెప్పారు. దీంతో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ..బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. జర్నలిస్టుల పై దాడులు నిర్వహించేందుకు చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను నిర్మోహమాటంగా కాంగ్రెస్ వినియోగించేస్తుందంటూ.. విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాటి అధికార జ్ఞాపకాల మత్తులో కూరుకుపోయి ఇలాంటి ఘటనలకు పాల్పడతోందని అన్నారు. बिना लोकल पुलिस को जानकारी दिए छत्तीसगढ़ पुलिस मेरे घर के बाहर मुझे अरेस्ट करने के लिए खड़ी है,क्या ये क़ानूनन सही है @myogiadityanath @SspGhaziabad @adgzonelucknow — Rohit Ranjan (@irohitr) July 5, 2022 (చదవండి: శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు?) -
అందుకే ఒవైసీపై దాడి చేశారట!
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో ఇద్దరిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూపీ పోలీసుల ఛార్జీషీట్లో ఆసక్తికర విషయాల్ని పొందుపరిచారు. లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో సచిన్, శుభమ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీని ఓ జాతీయ మీడియా సంస్థ సంపాదించింది. అందులో ఆసక్తికరమైన విషయాలు ఉన్నట్లు వెల్లడించింది. ఒవైసీపై దాడిని అంగీకరించిన ఇద్దరు నిందితులు.. వారి దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటో వివరించారు. మరొక వర్గానికి చెందిన ఒక పెద్ద రాజకీయ నాయకుడిని చంపడం ద్వారా ‘హిందుత్వ నేతలు’గా పేరు సంపాదించుకోవాలనే, ఎదగాలనే ఉద్దేశంతోనే ఆ పని చేశారట!. ‘‘పూర్తి సన్నద్ధతతో గౌరవ ఎంపీని లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేశారు. దాడిలో ఎవరైనా గాయపడినా.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి ఉండేవి. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు పరిస్థితిని మరింత దిగజార్చేవి’’ అని ఛార్జిషీట్లో పోలీసులు పొందుపరిచారు. ఆధారాలు సమర్పణ యూపీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ఛార్జ్‌షీట్‌లో ఆధారంగా పేర్కొన్నారు. కారు ఫోరెన్సిక్ పరీక్షల ఫలితంతో పాటు ఇద్దరు నిందితుల స్టేట్మెంట్, వాళ్లకు ఆయుధాలు సరఫరా చేసిన వాళ్ల స్టేట్మెంట్లను సైతం పొందుపరిచారు. ఒవైసీతో పాటు మొత్తం 61 మంది నుంచి తీసుకున్న స్టేట్మెంట్ను పొందుపరిచారట. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన.. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి పయనమైన ఆయన వాహనంపై.. హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. చదవండి: దయచేసి జడ్ కేటగిరిని అంగీకరించండి: అమిత్ షా -
రన్నింగ్ బస్సులు ఎక్కి.. యువతులపై వికృత చేష్టలు
ఆడవాళ్లు వేధింపులు ఎదుర్కొని చోటంటూ కనిపించడం లేదు. ఇంటా బయట పని చోట.. అంతటా కామాంధులు చెలరేగిపోతున్నారు. ఒంటరిగా కనిపించడమే ఆలస్యం చూపులతో.. మాటలతో కుంగదీస్తున్నారు. తాజాగా ఓ నీచుడు బుర్ఖా ముసుగులో యువతులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మహ్మద్ సోహైల్.. వయసు 19 ఏళ్లు. ఉండేది ఉత్తర ప్రదేశ్ బిజ్నోర్‌లోని నజీబాబాద్ టౌన్ పతాన్పురా మొహల్లా ఏరియా. చదువుకుంటున్న ఈ టీనేజర్‌కి దుర్భుద్ది పుట్టింది. తన తల్లి బుర్ఖాను దొంగలించి.. ఆ ముసుగులో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఓ కాలేజీ బస్టాప్ దగ్గర ఎదురు చూసేవాడు. ఆపై రన్నింగ్ బస్సులు ఎక్కి.. అమ్మాయిల సీట్లలో కూర్చుని అసభ్యంగా తాకేవాడు. ఎవరైనా గట్టిగా గదమాయిస్తే.. రన్నింగ్‌లోనే దిగిపోయి మరో బస్సును చూసుకునేవాడు. ఈ నీచుడి గురించి పలువురు అమ్మాయిలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బిజ్నోర్ ఎస్పీ ధరమ్వీర్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. మఫ్టీలో లేడీ కానిస్టేబుల్స్‌ను బస్సుల్లో ప్రయాణం చేసేలా ఆదేశించారు. చివరకు సోహైల్‌ను ఓ బస్సులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారంతా. తొలుత బుర్ఖాలో ఉంది అమ్మాయే అని పోలీసులు సైతం భావించారట. తీరా.. ముసుగు తొలగించి చూస్తే అది సోహైల్. ఇదిలా ఉంటే సోహైల్.. ఈ బుర్ఖా ముసుగులోనే అబ్బాయిలకూ గాలం వేసేవాడని పోలీసులు గుర్తించారు. హనీట్రాప్ ద్వారా సోహైల్.. పలువురు యువకుల నుంచి డబ్బులు సైతం లాగేవాడని ఎస్పీ ధరమ్వీర్ తెలిపారు. UP के बिजनौर में बुर्का पहनकर छात्राओं को छेड़ने वाला सुहेल आज पकड़ा गया. वह 3 दिन से कॉलेज और बस में छात्राओं पर अश्लील कमेंट्स करता था. #Bijnor pic.twitter.com/QypMA01XKN — Sachin Gupta (@sachingupta787) March 12, 2022 -
రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో రైతు మరణాలపై రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మరో 10 మందిపై శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్లు 144, 151, 107, 116ల కింద కేసులు నమోదు చేసినట్టు మంగళవారం మీడియాకి వెల్లడించారు. ప్రియాంకతో పాటు ఎంపీ దీపేందర్ హుడా, యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌కుమార్ లల్లూ, సందీప్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. అయితే ప్రియాంకా గాంధీని అదుపులోకి తీసుకొని దాదాపుగా రెండు రోజులవుతున్నా ఆమెను కోర్టు ఎదుట హాజరుపరచడం కానీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడంగానీ చేయలేదని కాంగ్రెస్ చెబుతోంది. అక్రమంగా నిర్బంధించారు: ప్రియాంక తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ప్రియాంకగాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘38 గంటలు గడిచినా నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. మాపై బలప్రయోగం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు కనీసం లాయర్‌ను కలవనివ్వలేదు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు’ అని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరణించిన రైతు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా ప్రియాంక మాట్లాడారు. లవ్ ప్రీత్ సింగ్, నక్షత్ర సింగ్ బంధువులతో మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వ్యక్తిగతంగా వారిని కలుసుకుంటానని ప్రియాంక రైతు కుటుంబాలకు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ నాయకుడు లలన్‌కుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రియాంకా గాంధీని కలవడానికి వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను లక్నో ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను విమానాశ్రయం వెలుపలికి రాకుండా నిరోధించారు. దీంతో ఆయన విమనాశ్రయంలోపల నేలపైనే కూర్చొని తన నిరసన తెలిపారు. ‘నన్ను ఎందుకు ఇక్కడ ఆపారు. నేను నిషేధాజ్ఞలు ఉన్న లఖీమ్‌పూర్ ఖేరికి వెళ్లడం లేదు. యూపీలో కాంగ్రెస్ కార్యాలయానికి వెళుతున్నాను’ అని బఘేల్ అన్నారు. లఖీమ్‌పూర్ ఖేరిని ముట్టడిస్తాం: సిద్ధూ రైతుల మరణాలకు కారణమైన మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను అరెస్ట్ చేసి ప్రియాంక గాంధీని విడుదల చేయాలని పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. బుధవారంలోగా ప్రభుత్వం ఆ పని చెయ్యకపోతే పంజాబ్ కాంగ్రెస్ లఖీమ్‌పూర్ ఖేరిని ముట్టడిస్తుందని హెచ్చరించారు. అసలు సిసలు కాంగ్రెస్‌వాది ప్రియాంక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన సోదరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక గాంధీ ఎప్పటికీ ఓటమిని అంగీకరించరని, ఆమె అసలు సిసలు కాంగ్రెస్‌వాది అని కొనియాడారు. తాము చేస్తున్న సత్యాగ్రహం ఆగదని అన్నారు. రాహుల్ బుధవారం లఖీమ్‌పూర్ ఖేరి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముగ్గురు రైతులకు అంతిమ సంస్కారం ఈ ఘటనలో మరణించిన నలుగురు రైతుల్లో ముగ్గురు లవ్‌ప్రీత్ సింగ్, నక్షత్ర సింగ్, దల్జీత్ సింగ్‌ల అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే మొహారియా గ్రామానికి చెందిన గుర్వీందర్ సింగ్ అనే రైతు కుటుంబం తమకు ఇచ్చిన పోస్టుమార్టమ్ రిపోర్టుపై నమ్మకం లేదని, తిరిగి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. గుర్వీందర్‌ను కాల్చి చంపినట్టుగా తమకు అనుమానాలున్నాయని వారు చెప్పారు. దీంతో రెండోసారి పోస్టుమార్టమ్ చేయడానికి ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. లఖీమ్‌పూర్ ఘటనపై న్యాయ విచారణ జరపండి లఖీమ్‌పూర్ ఘటనపై సీబీఐ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగాలని కోరుతూ సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయవాదులు మంగళవారం ఒక లేఖ రాశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగాలని, అత్యున్నత స్థాయిలో న్యాయ విచారణ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు వారు విన్నవించుకున్నారు. ఈ మేరకు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. తమ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించి ఈ విషయంలో సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకోవాలని లాయర్లు కోరారు. నిర్దాక్షిణ్యంగా తొక్కించారు లఖీమ్‌పూర్ ఖేరికి ప్రదర్శనగా వెళుతున్న రైతులపై ఎస్యూవీ దూసుకుపోయి నలుగురు అన్నదాతలను బలిగొన్న ఘటనకు సంబంధించిన వీడియో బయటకి వచ్చింది. నినాదాలు చేస్తున్న రైతులు మీదుగా అత్యంత వేగంగా వాహనం దూసుకుపోయిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. రైతులను నిర్దయగా వాహనంతో తొక్కిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. రైతులు ఎస్‌యూవీపై పడటం, బలంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో పక్కకు ఎగిరిపడటం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఈ వీడియోని షేర్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనుద్దేశించి పోస్టు పెట్టారు. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన మంత్రి కుమారుడిని వదిలేసి, తనను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. తనలాంటి వారిని కాకుండా నేరం చేసిన వారిని అదుపులోనికి తీసుకోవాలన్నారు. బీజేపీ నాయకుడు వరుణ్ గాంధీ, మరి కొందరు బీజేపీ నేతలు కూడా ఈ వీడియోని షేర్ చేశారు. అయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఎవరో ఆ విజువల్స్‌లో స్పష్టంగా తెలియడం లేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాయే కారుని నడుపుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తుంటే, ఆ సమయంలో ఆ ప్రాంతంలో తన కుమారుడు లేడని మంత్రి వాదిస్తున్నారు. అందులో ఆశిష్ మిశ్రా ఉన్నాడు లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల పైనుంచి దూసుకెళ్లిన ఎస్యూవీ (మహీంద్రా థార్)లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అలియాస్ మోనూ ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. జగ్జీత్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ను పోలీసులు నమోదు చేశారు. ‘రైతుల పైనుంచి నిర్దాక్షిణ్యంగా కాన్వాయ్‌లోని వాహనాలను తీసుకెళ్లిన ఘటన పక్కా వ్యూహం ప్రకారమే జరిగింది. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే రైతులు నిరసన ప్రదర్శనలకు దిగారు. బన్బీర్పూర్ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అజయ్ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా నిరసన తెలుపడానికి రైతులు ఆదివారం స్థానిక కాలేజీ మైదానం సమీపంలో గుమిగూడారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆశిష్ మిశ్రా 15 నుంచి 20 మంది సాయుధులతో మూడు వాహనాల్లో అక్కడికి చేరుకున్నాడు. మహీంద్రా థార్‌లో డ్రైవర్ పక్కసీట్లో కూర్చున్నాడు. ఈ ఎస్‌యూవీయే తొలుత వేగంగా రైతుల పైనుంచి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆశిష్ కాల్పులు జరిపాడు. నాన్పరాకు చెందిన రైతు గుర్విందర్ సింగ్ ఈ కాల్పుల్లో చనిపోయాడు. రైతుల పైనుంచి దూసుకెళ్లిన వాహనాల నెంబర్లు యూపీ 31 ఏఎస్ 1000, యూపీ 32 కేఎం 0036 కాగా... మూడో వాహనం మహీంద్రా స్కార్పియో (నెంబరు తెలియదు)’ అని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. రైతులను తొక్కించుకుంటూ ముందుకెళ్లిన ఆశిష్ వాహనం రోడ్డుకు ఓవైపునకు వెళ్లి బోల్తాపడింది. ఆశిష్ వాహనంలో నుంచి బయటపడి తిరిగి కాల్పులు ప్రారంభించాడు. చెరుకు తోటలోకి వెళ్లి దాక్కున్నారు’ అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రాపై పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం, అల్లర్లకు కారణం అవడం... తదితర కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేరులేదు. -
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ ఆటకట్టించిన పోలీసులు..
పట్నా: గత కొంత కాలంగా బిహర్ పోలీసులకు కంటిమీదకునుకు లేకుండా చేసిన గ్యాంగ్‌స్టర్ మున్న మిశ్రాను బిహర్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీకి చెందిన మిశ్రాను దేవోరియా ప్రాంతంలో యూపీ, బిహర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడిపై ఇప్పటికే అనేక హత్యలకు సంబంధించిన కేసులు, కిడ్నాప్‌లు, లూటీ కేసులు ఉన్నాయని తెలిపారు. మున్న మిశ్రా ఆచూకీని తెలియజేస్తే యాభైవేలు ఇస్తామని గతంలోనే యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు.. యూపీలోని దియోవరియా ప్రాంతంలోని ఒక ఇంట్లో మున్న మిశ్రా ఉన్నట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దాడిచేసి అతడిని అదుపులోని తీసుకున్నామని యూపీ పోలీసులు పేర్కొన్నారు. నిందితుని దగ్గర నుంచి ఏకే 47 రైఫిల్ గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, యూపీలోనే మరొక గ్యాంగ్‌స్టర్ బదన్ సింగ్‌కు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగిన మరుసటి రోజే మిశ్రాను పట్టుకున్నామని అధికారులు పేర్కొన్నారు. బదన్ సింగ్‌పై కూడా ఒక లక్ష రూపాలయల రివార్డు ఉందని తెలిపారు. కాగా, పోలీసులు ఆగ్రా, రాజస్థాన్ బార్డర్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానస్పదంగా ఉండటాన్ని గమనించారు. వారి వద్దకు చేరుకునేలోపే.. పోలీసులుపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు కాల్పులలో నిందితులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో వారిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారని అధికారులు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. -
అమానుషం: మహిళను ఈడ్చి కొట్టి మీద కూర్చున్న ఎస్సై
ఒక మహిళపై అమానుషంగా దాడి చేశారనే విమర్శలు ఉత్తర ప్రదేశ్ పోలీసుల్ని చుట్టుముట్టాయి. కాన్పూర్ డెహత్ జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి.. ఓ వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు అతని భార్యపై దాడి చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాన్పూర్ డెహత్(దెహత్) జిల్లా దుర్గాదాస్‌పూర్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తన భర్త అక్రమంగా అరెస్ట్ చేశారని, వదిలిపెట్టాలంటే డబ్బు ఇవ్వాలని భోగిన్‌పూర్ ఎస్సై మహేంద్ర పటేల్ డిమాండ్ చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇవ్వనని చెప్పడంతో తనను లాగేసి నేల మీద పడేసి కొట్టాడని, మీద కూర్చుని ముఖం మీద దాడి చేశాడని, గ్రామస్తుల జోక్యం చేసుకోవడంతో తను వదిలేశాడని వాపోయిందామె. అయితే ఆ సమయంలో స్నేహితులతో శివం యాదవ్ జూదం ఆడుతున్నాడని. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించారని, ఈ క్రమంలో వాళ్లే తన బృందంపై దాడి చేశారని ఎస్సై పటేల్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాన్పూర్ ఎస్పీ చౌదరి స్పందిస్తూ.. శివం పారిపోయేందుకు సాయం చేసేందుకే అతని భార్య తనను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారని పటేల్ భావించాడని, అందుకే అలా ప్రవర్తించాడని తెలిపారు. పటేల్‌ను భోగిన్‌పూర్ విధుల నుంచి తప్పించామని, ఘటనపై దర్యాప్తు చేయించి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాన్పూర్ ఎస్పీ చౌదరి తెలిపారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ ఈ ఘటనపై రాజకీయ విమర్శలు చేస్తోంది. -
ఘజియాబాద్ వీడియో: ట్విటర్ ఎండీకి లీగల్ నోటీసులు.. వారం గడువు
న్యూఢిల్లీ: యూపీ ఘజియాబాద్‌లో వృద్ధుడిపై దాడి ఘటన కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆ వృద్ధుడి ఫిర్యాదుపై భిన్న వాదనలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ వీడియోకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండీకి నోటీసులు జారీచేశారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లోగా లోని పోలీస్ స్టేషన్‌కొచ్చి.. వివరణ ఇచ్చుకోవాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కాగా, మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ఆ వీడియోను వైరల్ చేసిందంటూ ట్విటర్‌పై అభియోగాల్ని యూపీ పోలీసులు నమోదుచేశారు. ‘‘ట్విటర్ మాధ్యమాన్ని ఉపయోగించి కొందరు ఆ వీడియోల్ని వైరల్ చేశారు. కానీ, ట్విటర్ మాత్రం ఆ అకౌంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సంఘ విద్రోహ శక్తుల సందేశాల్ని అలా ఎలా జనాలకు చేరవేస్తారు? అంటూ ఆనోటీసుల్లో పోలీసులు ట్విటర్ ఎండీని ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు జర్నలిస్టులకు, కాంగ్రెస్ లీడర్ల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయగా, నటి స్వరభాస్కర్‌పై కూడా ఫిర్యాదు అందింది. మరోవైపు తాయెత్తులు అమ్మే సూఫీ అబ్దుల్ సమద్‌పై ఆ వ్యవహారంలోనే కక్షకట్టి దాడి చేశారని, ఇందులో మత కోణం లేదని పోలీసులు చెప్తుండగా.. మరోవైపు సమద్ కుటుంబం మాత్రం అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన దాడేనని చెబుతోంది. Ghaziabad Police sent legal notice to Managing Director of Twitter India over viral video of an elderly man in Loni being assaulted with the intent of "provoking communal unrest" The MD has been asked to come to the Police Station Loni Border & record the statement within 7 days pic.twitter.com/u5Ct8Omq6l — ANI UP (@ANINewsUP) June 18, 2021 టైం కావాలి ఇక కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఇవాళ ట్విట్టర్ ప్రతినిధులు హాజరయ్యారు. సామాజిక మాధ్యమ వేదికలు దుర్వినియోగం కాకుండా, పౌరహక్కులకు భంగం కలగకుండా.. ప్రత్యేకంగా మహిళల భద్రతపరంగా ఏవిధమైన నివారణ చర్యలు తీసుకోవాలనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ట్విటర్ ఉన్నతాధికారులను కమిటీ ఇదివరకే ఆదేశించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ట్విటర్ అధికారుల అభిప్రాయాల్ని తీసుకుంది. కొవిడ్ కారణంగా పూర్తి చర్యలు చేపట్టేందుకు కొంచెం సమయం కావాలని ట్విటర్ కోరినట్లు తెలుస్తోంది. చదవండి: ఏం రాహుల్.. విషం నింపుతున్నావా? -
నా కొడుకు చచ్చి నెలైనా స్పందించరా? ఎమ్మెల్యే ఫైర్
లక్నో: ఆక్సిజన్ అందక తన కుమారుడు మృతి చెందాడని.. దానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులైనా చర్యలు తీసుకోలేరా అని అధికార పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కనీసం పోలీసులు ఆస్పత్రిపై కేసు కూడా నమోదు చేయడం లేదని ఎమ్మెల్యే వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దియో జిల్లాలోని శాండిల్య నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ అగర్వాల్ కుమారుడు అశిశ్ (35) ఏప్రిల్ 26వ తేదీన మృతి చెందారు. కకోరిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆశిశ్‌ను చేర్చగా ఉదయం ఆక్సిజన్ 94 ఉండగా సాయంత్రానికి ఆక్సిజన్ స్థాయి తగ్గిందని వైద్యులు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బయటి నుంచి ఆక్సిజన్ తీసుకొచ్చి అందిస్తున్నట్లు చెప్పారని ఆ కొద్దిసేపటికి తన కుమారుడు మరణించాడని ఎమ్మెల్యే రాజ్‌కుమార్ వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మరణించాడని ఎమ్మెల్యే రాజ్‌కుమార్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు ముఖ్యమంత్రి, కలెక్టర్, డీజీపీ, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలించి తన కుమారుడి మరణానికి సంబంధించి కేసు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నా బిడ్డ మరణానికి ఆస్పత్రిదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. -
'నాకు పెళ్లి కావాలి'.. పిల్ల దొరికేసిందిగా..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కైరానాకు చెందిన అజీమ్ మన్సూరి.. వయసు 26. పెళ్లీడొచ్చిన అతడికి పిల్ల దొరకడం లేదట. కారణం అతడు 30 ఇంచుల పొడవు మాత్రమే ఉండటం. దీంతో కాబోయే భార్య కోసం ఐదేళ్లుగా కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలిసిపోయాడు. ఇలా కాదని గత నెలలో ఏకంగా పోలీసులనే సాయం కోరాడు. తనకో మంచి వధువును వెతికిపెట్టమని అభ్యర్థించాడు. ఇంకేముందీ.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతడికిప్పుడు రెండు పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. అందులో ఒకటి ఘజియాబాద్‌కు చెందిన రెహనా అన్సారిది. అతడి హైటే ఉన్న ఈ యువతి అజీమ్‌ను పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నానంటోంది. అంతేకాదు, తనను అర్ధాంగిగా స్వీకరిస్తే.. చేదోడువాదోడుగా ఉంటానంటోంది. ఆమె తండ్రి కూడా ఎలాగైనా ఈ పెళ్లి ఖాయమయ్యేందుకు అబ్బాయి కుటుంబంతో మంతనాలు జరుపుతున్నాడు. ఈ వివాహానికి అబ్బాయి తరపువాళ్లు అంగీకారం తెలుపుతారని ఆశిస్తున్నాడు. ఇక ఢిల్లీకి చెందిన మరో మహిళ అజీమ్‌తో జీవించేందుకు తహతహలాడుతోంది. "నేను అతడితో ఓ మాట చెప్పాలనుకుంటున్నా. అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ నేనూ ఒంటరిదాన్నే. నేను అతడిని పెళ్లాడాలనుకుంటున్నాను" అని ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో అజీమ్ వరకు చేరింది. తనకు రెండు సంబంధాలు రావడంతో సంతోషం వ్యక్తం చేసిన అజీమ్ ఈ ప్రపంచంలో తనకంటూ ఒకరున్నారని ఆ దేవుడు రుజువు చేశాడని చెప్పుకొచ్చాడు. ఈ రెండు మాత్రమే కాదు పలు చోట్ల నుంచి కూడా అమ్మాయి ఉంది చేసుకుంటారా? అంటూ ఎన్నో సంబంధాలు వస్తున్నాయట. అయితే అజీమ్ ఫ్యామిలీ మాత్రం హాపూర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా చేయనున్నారట. ఈ లెక్కన వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లోనో, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనో జరిగే అవకాశాలున్నాయి. చదవండి: రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం! జనం పరుగో పరుగు.. ఇండియన్ ఏనుగు అంతే! -
గుడిలో పూజారి దారుణ హత్య
లక్నో: ఆలయంలో పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. తనకు తానే కాళికామాత అవతారంగా ప్రకటించుకున్న ఆ పూజారిని ఓ దుండగుడు కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఢాక్‌నగ్ల గ్రామంలోని ఆలయంలో పూజారి జై సింగ్ యాదవ్ (75) ఆలయ ఆవరణలో ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. 20 ఏళ్లుగా పూజా కార్యక్రమాలు చేస్తూ జీవిస్తున్నాడు. అయితే జై సింగ్ యాదవ్ తనకు తాను కాళికామాత అవతారంగా ప్రకటించుకుని ఆ మేరకు చీర, గాజులు ధరించి కనిపించేవాడు. స్థానికంగా ఆయన సఖీ బాబాగా పేరు పొందాడు. సఖీబాబాను కలిసేందుకు శనివారం రాంవీర్ యాదవ్ వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఓ విషయమై సఖీబాబాకు, రాంవీర్‌కు మధ్య వివాదం పెరిగింది. ఈ సమయంలో మాటామాట పెరగడంతో రాంవీర్ క్షణికావేశంలో సఖీ బాబాను కత్తీతో పొడిచి హత్య చేశాడు. కేకలు విన్న స్థానికులు రాంవీర్‌ను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోనే సఖీబాబా ఉండేవాడు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం నిందితుడిపై హత్య కేసును నమోదు చేశామని ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే ఎందుకు హత మార్చాడనే విషయం ఇంకా తెలియలేదని చెప్పారు. -
మోదీతో పాటు నిన్ను చంపేస్తాం: ఎమ్మెల్యేకు పాక్ నుంచి బెదిరింపులు
లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు నిన్ను చంపేస్తామని తనకు బెదిరింపులు వచ్చాయని ఓ బీజేపీ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించింది. తనకు ప్రాణాపాయం పొంచి ఉందని.. భద్రత కల్పించాలని ఆ మహిళా ఎమ్మెల్యే పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఆమె ఎటావా సదర్ నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి జాయింట్ కమిటీ ఎటావా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె కుటుంబంతో పాటు ఆమెను చంపేస్తామని బెదిరింపులతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీనియర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను చంపేస్తామని తనకు వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు వచ్చాయని ఎమ్మెల్యే సరితా భదౌరియా సోమవారం తెలిపారు. పాక్ గూఢచార సంస్థ ఎస్ఐఎస్ లోగోతో వాట్సాప్‌లో సందేశాలు వచ్చాయని పోలీసులకు వివరించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తొలి సందేశం రాగా ఆ తర్వాత వరుస పెట్టి సందేశాలు వచ్చాయని వెల్లడించింది. ఆదివారం ఉదయం వరకు ఎమ్మెల్యేతో పాటు ప్రధాని, బీజేపీ సీనియర్, ఆర్ఎస్ఎస్ నేతలను చంపేస్తామంటూ 8 సందేశాలు వచ్చాయని పోలీసులకు ఆమె తెలిపింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఎటావా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆకాశ్ తోమర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేకు వాట్సాప్‌లో వచ్చిన బెదిరింపు మెసేజ్‌లు పరిశీలించినట్లు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన +92 సిరీస్‌తో ప్రారంభమైన మొబైల్ నంబర్ నుంచి సందేశాలు వచ్చాయని, వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సరితా భదౌరియా 1999లో భర్త అభయ్ వీర్ సింగ్ భదౌరియా హత్యానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. -
హథ్రాస్ రేప్ కేసులో అనుమానాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ దళిత యువతి దారుణ హత్యా, అత్యాచారం కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఠాకూర్ కుటుంబానికి చెందిన నలుగురు యువకులు దారుణంగా దాడి చేయడం వల్ల దళిత యువతి మరణించినట్లు తెలుస్తోంది గానీ, వారి వల్ల అత్యాచారానికి గురైనట్లు ఆధారాలు లేవని, ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత కుమార్ గత గురువారం మీడియాకు వెల్లడించడం పలు అనుమానాలకు దారి తీసింది. పోలీసులే ఈ కేసును మసిపూసి మారేడు కాయను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు పోలీసులే తగులబెట్టడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం రేప్ కేసుల్లో బాధితుల మృతదేహాలను తప్పనిసరిగా కుటుంబసభ్యులకే అప్పగించాలి. అలా చేయకపోగా కూతురు మృతదేహాన్ని కోరడానికి వెళితే పోలీసులు తమను నిర్బంధించి వేధించారని బాధితురాలి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన దుండగుల దాడికి, అత్యాచారానికి గురైన దళిత యువతి ఆలీగఢ్ ఆస్పత్రిలో చేరిన ప్పుడు మీడియా ముఖంగా ఆమె తనపై అత్యాచారం జరిగినట్లు ఆరోపించారు. బాధితురాలిని రేప్ చేశారని చెప్పడానికి ఆ ఆస్పత్రి వైద్య నిపుణులు ‘కంప్లీట్ పెనట్రేషన్ ఆఫ్ వజీనా’ అంటూ తమ ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. సెప్టెంబర్ 29వ తేదీన ఢిల్లీ ఆస్పత్రిలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మరణించిన తర్వాత నిర్వహించిన ‘ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్’ నివేదికలో ‘వీర్యం’ ఆనవాళ్లు కనిపించలేదని ఇచ్చారు. ఇదే విషయాన్ని యూపీ అదనపు డీజీపీ మీడియా ముఖంగా వెల్లడించారు. (చదవండి : హథ్రాస్ ఘటన: న్యాయం చేసే ఉద్దేశముందా?) బాధితురాలపై సెప్టెంబర్ 14వ తేదీన అత్యాచారం జరిగినందున వాటి ఆనవాళ్లు సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఉండే అవకాశం లేదని అలీగఢ్ ఆస్పత్రి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అత్యాచారం జరిగిన చాలా రోజుల వరకు పోలీసులు కేసు దాఖలు చేయక పోవడం, కనీసం నిందితులను అదుపులోకి తీసుకోక పోవడం కూడా పలు అనుమానాలకు దారితీసింది. ఈ కేసు విచారణను మొదట సిట్ దర్యాప్తునకు అప్పగించిన ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఒత్తిడి మేరకు సీబీఐకి అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీబీఐ వల్ల న్యాయం జరగక పోవచ్చని కాంగ్రెస్, దళిత పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్కౌంటర్లకు పెట్టింది పేరైన యూపీ పోలీసులు హైదరాబాద్‌లోని ప్రియాంక రెడ్డి హత్యా, అత్యాచారం కేసులో లాగా ఈ కేసులో నేరస్థులను ఎందుకు ఎన్కౌంటర్ చేయరని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. (చదవండి : దళిత యువతి వీడియో క్లిప్‌పై హల్చల్) -
రాహుల్ గాంధీ అరెస్ట్
నోయిడా: హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు కాలినడకన వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను గురువారం గ్రేటర్ నోయిడాలోని యమున ఎక్స్‌ప్రెస్ వే పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని దగ్గర్లోని ఒక గెస్ట్‌హౌజ్‌కు తీసుకువెళ్లి, కాసేపైన తరువాత విడిచిపెట్టారు. హాథ్రస్‌కు శాంతియుతంగా, కాలినడకన వెళ్తున్న రాహుల్, ప్రియాంకను, పలువురు ఇతర నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ప్రకటించింది. అంతకుముందు, హాథ్రస్‌కు వెళ్లేందుకు బయల్దేరిన రాహుల్, ప్రియాంకల వాహన శ్రేణిని యూపీ పోలీసులు పరి చౌక్ వద్ద అడ్డుకున్నారు. దాంతో, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలి నడకన 150 కిమీల దూరంలోని హాథ్రస్‌కు వెళ్లాలని రాహుల్, ప్రియాంక నిర్ణయించారు. పాదయాత్రగా వెళ్తున్న రాహుల్‌ను పోలీసులు అడ్డుకుంటున్న క్రమంలో.. ఆయన కిందపడ్డారు. ‘మీరు హిందూ మత రక్షకులమని చెప్పుకుంటారు. ఒక తండ్రి తన కూతురి చితికి నిప్పంటించనివ్వకూడదని, అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులను పాల్గొననివ్వకూడదని ఏ గ్రంథంలో రాసి ఉంది?’ అని యోగి ఆదిత్యనాథ్‌పై ప్రియాంకగాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల పర్యటన నేపథ్యంలో హాథ్రస్ జిల్లాలో అధికారులు 144 సెక్షన్ విధించారు. జిల్లా సరిహద్దులను మూసేశారు. రాహుల్, ప్రియాంకలతో పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన తీరును ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఖండించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందువల్లనే రాహుల్, ప్రియాంకలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, దాంతో ఐపీసీ సెక్షన్ కింద వారిపై కేసు నమోదు చేశామని గౌతమబుద్ధ నగర్ కమిషనర్ లవ్ కుమార్ వెల్లడించారు. తర్వాత రాహుల్‌తో మాట్లాడుతున్న ప్రియాంక -
అత్యాచారం జరగలేదు
లక్నో: హాథ్రస్ బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని యూపీ పోలీసులు ప్రకటించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో కూడా అదే విషయం స్పష్టమైందని గురువారం యూపీ ఏడీజీ(శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. మెడపై అయిన తీవ్రస్థాయి గాయం కారణంగా ఆమె చనిపోయిందన్నారు. ‘ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అత్యాచారం కానీ, గ్యాంగ్ రేప్ కానీ జరగలేదని అందులో స్పష్టంగా ఉంది’ అన్నారు. ‘చనిపోకముందు, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ.. నిందితులు తనను కొట్టారనే బాధితురాలు చెప్పింది కానీ, అత్యాచారం చేసినట్లు చెప్పలేదు’ అని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే, నలుగురు నిందితులు సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనను గ్యాంగ్ రేప్ చేశారని బాధిత యువతి వాంగ్మూలం ఇచ్చినట్లు గతంలో ఎస్పీ విక్రాంత్ వీర్ వెల్లడించడం గమనార్హం. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో తన మెడను గట్టిగా నులిమారని, ఆ సమయంలో తన నాలుక తెగిపోయిందని ఆమె వివరించినట్లు ఎస్పీ చెప్పారు. కలెక్టర్ బెదిరింపు బాధితురాలి తండ్రిని హాథ్రస్ జిల్లా కలెక్టర్ బెదిరిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ‘మీడియా వాళ్లలో సగం మంది ఈరోజు వెళ్లి పోయారు. మిగతా సగం రేపు వెళ్లిపోతారు. ఇక్కడ స్థానికంగా మీతో ఉండేది మేమే. నీ స్టేట్మెంట్ను మారుస్తావా?లేదా? అనేది నువ్వే ఆలోచించుకుని నిర్ణయించుకో’ అంటూ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బాధితురాలి తండ్రితో బెదిరింపు స్వరంతో చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రవీణ్ కుమార్ బదులివ్వలేదు. ఈ ఘటన విషయంలో అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారులు చెప్పినట్లు వినకపోతే, సమస్యలు ఎదుర్కొంటారని జాయింట్ కలెక్టర్ కూడా బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించినట్లు స్థానికులు వెల్లడించారు. ఒత్తిడి చేస్తున్నారు తన స్టేట్మెంట్ను మార్చుకోవాలని అధికారులు, పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకువెళ్లి, తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. తన కూతురి హత్యాచారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. యూపీలో మరో కిరాతకం బలరాంపూర్: యూపీలోని బలరాంపూర్ జిల్లాలో 22 ఏళ్ల మరో దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా, బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. యువతిపై అత్యాచారం ఘటనలో షాహిద్, సాహిల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. దుండగుల దాడిలో తన కుమార్తె కాళ్లు, వెన్నెముక విరిగిపోయాయని బాధితురాలి తల్లి తెలిపారు. మంగళవారం కాలేజీలో ప్రవేశం కోసం వెళ్లివస్తున్న తన బిడ్డను నలుగురు వ్యక్తులు అపహరించారని, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, దురాగతానికి పాల్పడ్డారని, తర్వాత రిక్షాలో తీసుకొచ్చి, తమ ఇంటి ముందు పడేశారని పేర్కొన్నారు. బాధితురాలి కాళ్లు, వెన్నుముక విరిగినట్లు పోస్టుమార్టంలో బయట పడలేదని జిల్లా ఎస్పీ దేవ్‌రంజన్ అన్నారు.