రన్నింగ్‌ బస్సులు ఎక్కి.. యువతులపై వికృత చేష్టలు | UP Bijnor Youngster Wearing Burqa Molest Girls Caught | Sakshi
Sakshi News home page

Burqa-Clad Man: బుర్ఖాలో రన్నింగ్‌ బస్సులు ఎక్కి.. యువతులపై వికృత చేష్టలు!

Published Mon, Mar 14 2022 6:14 PM | Last Updated on Mon, Mar 14 2022 6:15 PM

UP Bijnor Youngster Wearing Burqa Molest Girls Caught - Sakshi

ఆడవాళ్లు వేధింపులు ఎదుర్కొని చోటంటూ కనిపించడం లేదు. ఇంటా బయట పని చోట.. అంతటా కామాంధులు చెలరేగిపోతున్నారు. ఒంటరిగా కనిపించడమే ఆలస్యం చూపులతో.. మాటలతో కుంగదీస్తున్నారు. తాజాగా ఓ నీచుడు బుర్ఖా ముసుగులో యువతులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. 

మహ్మద్‌ సోహైల్‌.. వయసు 19 ఏళ్లు. ఉండేది ఉత్తర ప్రదేశ్‌ బిజ్‌నోర్‌లోని నజీబాబాద్ టౌన్‌‌ పతాన్‌పురా మొహల్లా ఏరియా. చదువుకుంటున్న ఈ టీనేజర్‌కి దుర్భుద్ది పుట్టింది. తన తల్లి బుర్ఖాను దొంగలించి.. ఆ ముసుగులో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఓ కాలేజీ బస్టాప్‌ దగ్గర ఎదురు చూసేవాడు. ఆపై రన్నింగ్‌ బస్సులు ఎక్కి.. అమ్మాయిల సీట్లలో కూర్చుని అసభ్యంగా తాకేవాడు. ఎవరైనా గట్టిగా గదమాయిస్తే.. రన్నింగ్‌లోనే దిగిపోయి మరో బస్సును చూసుకునేవాడు. 

ఈ నీచుడి గురించి పలువురు అమ్మాయిలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బిజ్‌నోర్‌ ఎస్పీ ధరమ్‌వీర్‌ సింగ్‌ స్వయంగా రంగంలోకి దిగారు. మఫ్టీలో లేడీ కానిస్టేబుల్స్‌ను బస్సుల్లో ప్రయాణం చేసేలా ఆదేశించారు. చివరకు సోహైల్‌ను ఓ బస్సులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారంతా. తొలుత బుర్ఖాలో ఉంది అమ్మాయే అని పోలీసులు సైతం భావించారట. తీరా.. ముసుగు తొలగించి చూస్తే అది సోహైల్‌.  

ఇదిలా ఉంటే సోహైల్‌.. ఈ బుర్ఖా ముసుగులోనే అబ్బాయిలకూ గాలం వేసేవాడని పోలీసులు గుర్తించారు. హనీట్రాప్‌ ద్వారా సోహైల్‌.. పలువురు యువకుల నుంచి డబ్బులు సైతం లాగేవాడని ఎస్పీ ధరమ్‌వీర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement