burqa clad
-
బుర్ఖా ధరించి బాయ్స్ డ్యాన్స్.. కాలేజీ ఈవెంట్‌పై దుమారం!
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. మంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బుర్ఖా ధరించి నలుగురు విద్యార్థులు బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. బుర్ఖా ధరించి నలుగురు బాయ్స్ నృత్యం చేస్తున్న వీడియో వైరల్‌గా మారిన క్రమంలో వారిని సస్పెండ్ చేసింది కాలేజీ యాజమాన్యం. ప్రస్తుతం ఈ సంఘటన కర్ణాటకలో వివాదాస్పదంగా మారింది. సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నలుగురు బాయ్స్ బుర్ఖా ధరించి నృత్యం చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారిన క్రమంలో కళాశాల యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మతపరమైన సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఇలాంటి డ్యాన్సులకు అనుమతి ఇవ్వటమేంటని పలువురు ప్రశ్నించారు. మరోవైపు.. బాలీవుడ్ సాంగ్‌కు తాము అనుమతించలేదని, విద్యార్థులు తమకు తెలియకుండా స్టేజ్ పైకి వెళ్లారని కాలేజీ అధికారులు తెలిపారు. తమ కళాశాల మార్గదర్శకాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ‘కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం వర్గానికి చెందిన విద్యార్థులు స్టేజ్‌పైకి వెళ్లి డ్యాన్స్ చేశారు. అప్పుడు తీసిన వీడియో వైరల్‌గా మారింది. అది కళాశాల ఆమోదించిన కార్యక్రమంలో భాగం కాదు. వేదికపైకి వెళ్లి డ్యాన్స్ చేసిన నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేశాం. దర్యాప్తు జరుగుతోంది.’ అని కళాశాల ప్రిన్సిపాల్ ఓ ప్రకటన చేశారు. మతసామరస్యాలను దెబ్బతీసే కార్యక్రమాలను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. This is from #Mangaluru, #Karnataka. In an Event at St.Joseph Engineering College, Mangaluru students seen wearing #Burkha and performing obscene steps for a item song mocking #Burqa & #Hijab.#DakshinKannada #Mangalore #StJosephEngineeringCollege pic.twitter.com/Q6jmN5p77F — Hate Detector 🔍 (@HateDetectors) December 7, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా? -
నడిరోడ్డుపై కామాంధుడి వికృత చేష్టలు
వైరల్: ఇంటా.. బయటా.. ఎక్కడ కూడా మనిషికి రక్షణ లేకుండా పోతోంది. అందునా ప్రత్యేకించి మహిళలు పట్టపగలు.. అంతా చూస్తుండగానే వేధింపులకు, దాడులకు గురవుతున్నారు. కఠిన చట్టాలు, త్వరగతిన చర్యలు తీసుకోనంత వరకు పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా.. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన సీసీ ఫుటేజీ ద్వారా బయటకు వచ్చింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. వెనుక నుంచి వెళ్లి ఆమె పట్టుకుని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విడిపించుకునేందుకు బాధితురాలు ప్రతిఘటించినా లాభం లేకపోయింది. వేధించిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు దుండగుడు. పాక్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ ట్విటర్ ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేశారు. నిందితుడి కఠినంగా శిక్షించి.. ఇలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలని కోరారు. ఒంటరిగా వెళ్తున్న ఆమెను దుండగుడు ఫాలో అవుతున్నట్లు అంతకు ముందు గల్లీలో ఉన్న సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. అయినా సోషల్ మీడియా విమర్శలతో ఫిర్యాదు స్వీకరించామని స్థానిక పోలీసులు వెల్లడించారు. سیکٹر آئی 10 اسلام آباد میں حوس کے پجاری درندہ صفت شخص کی حرکت دیکھیں ۔ حکام اس پر پوری نوٹس لے۔ @ICT_Police By @IslamabadNewz pic.twitter.com/N2xFbv3MRA — Zobia Khurshid Raja (@ZobiaKhurshid) July 18, 2022 పాక్‌లో గత కొంతకాలంగా మహిళలపై దాష్టికాలు చోటుచేసుకున్నాయి. ఈ మధ్యే ఓ మెట్రో స్టేషన్ బయటకు యువతిని కొందరు కిరాతకంగా వేధించి.. దాడికి పాల్పడిన ఘటన వైరల్ అయ్యింది. కిందటి ఏడాది స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఓ టిక్‌టాకర్‌ను చుట్టుముట్టి వందల మంది ఆమెను లైంగికంగా వేధించారు. ఆమె దుస్తులు చించి వికృత చేష్టలకు పాల్పడుతూ దాడి చేశారు. ఆటోలో వెళ్తున్న ఓ యువతిపైనా అంతా చూస్తుండగానే కొందరు వేధించిన వీడియో సైతం వైరల్ అయ్యింది. మరోవైపు పాక్‌లో పని చేసే చోట 70 శాతం మంది వేధింపులు ఎదుర్కొంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. -
రన్నింగ్ బస్సులు ఎక్కి.. యువతులపై వికృత చేష్టలు
ఆడవాళ్లు వేధింపులు ఎదుర్కొని చోటంటూ కనిపించడం లేదు. ఇంటా బయట పని చోట.. అంతటా కామాంధులు చెలరేగిపోతున్నారు. ఒంటరిగా కనిపించడమే ఆలస్యం చూపులతో.. మాటలతో కుంగదీస్తున్నారు. తాజాగా ఓ నీచుడు బుర్ఖా ముసుగులో యువతులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మహ్మద్ సోహైల్.. వయసు 19 ఏళ్లు. ఉండేది ఉత్తర ప్రదేశ్ బిజ్నోర్‌లోని నజీబాబాద్ టౌన్ పతాన్పురా మొహల్లా ఏరియా. చదువుకుంటున్న ఈ టీనేజర్‌కి దుర్భుద్ది పుట్టింది. తన తల్లి బుర్ఖాను దొంగలించి.. ఆ ముసుగులో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఓ కాలేజీ బస్టాప్ దగ్గర ఎదురు చూసేవాడు. ఆపై రన్నింగ్ బస్సులు ఎక్కి.. అమ్మాయిల సీట్లలో కూర్చుని అసభ్యంగా తాకేవాడు. ఎవరైనా గట్టిగా గదమాయిస్తే.. రన్నింగ్‌లోనే దిగిపోయి మరో బస్సును చూసుకునేవాడు. ఈ నీచుడి గురించి పలువురు అమ్మాయిలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బిజ్నోర్ ఎస్పీ ధరమ్వీర్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. మఫ్టీలో లేడీ కానిస్టేబుల్స్‌ను బస్సుల్లో ప్రయాణం చేసేలా ఆదేశించారు. చివరకు సోహైల్‌ను ఓ బస్సులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారంతా. తొలుత బుర్ఖాలో ఉంది అమ్మాయే అని పోలీసులు సైతం భావించారట. తీరా.. ముసుగు తొలగించి చూస్తే అది సోహైల్. ఇదిలా ఉంటే సోహైల్.. ఈ బుర్ఖా ముసుగులోనే అబ్బాయిలకూ గాలం వేసేవాడని పోలీసులు గుర్తించారు. హనీట్రాప్ ద్వారా సోహైల్.. పలువురు యువకుల నుంచి డబ్బులు సైతం లాగేవాడని ఎస్పీ ధరమ్వీర్ తెలిపారు. UP के बिजनौर में बुर्का पहनकर छात्राओं को छेड़ने वाला सुहेल आज पकड़ा गया. वह 3 दिन से कॉलेज और बस में छात्राओं पर अश्लील कमेंट्स करता था. #Bijnor pic.twitter.com/QypMA01XKN — Sachin Gupta (@sachingupta787) March 12, 2022 -
బురఖాలో వచ్చి కాల్పులు
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో బురఖాలో వచ్చిన ఓ వ్యక్తి శుక్రవారం సైనిక ప్రత్యేక దళాలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు గాయపడ్డారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సభ్యులు అడ్డుకున్నపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో బురఖాలో ఉన్న వ్యక్తి విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడింది వేర్పాటు వాద గెరిల్లా దళ సభ్యులుగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటన శ్రీనగర్ కు కూతవేటు దూరంలోని బస్టాండ్ లో చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.