బురఖాలో వచ్చి కాల్పులు | Two injured as burqa clad militant opens fire in Kashmir | Sakshi
Sakshi News home page

బురఖాలో వచ్చి కాల్పులు

Published Fri, Oct 16 2015 3:29 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Two injured as burqa clad militant opens fire in Kashmir

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో  బురఖాలో వచ్చిన  ఓ వ్యక్తి శుక్రవారం సైనిక  ప్రత్యేక దళాలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ  మహిళ సహా ఇద్దరు గాయపడ్డారు.  అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని స్పెషల్ ఆపరేషన్  గ్రూప్   సభ్యులు అడ్డుకున్నపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.  దీంతో  బురఖాలో ఉన్న వ్యక్తి విచక్షణా  రహితంగా తుపాకీతో కాల్పులకు దిగాడు.  

ఈ  కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడింది  వేర్పాటు వాద గెరిల్లా దళ సభ్యులుగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటన శ్రీనగర్ కు కూతవేటు దూరంలోని బస్టాండ్ లో చోటుచేసుకుంది.  గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement