వైరల్: ఇంటా.. బయటా.. ఎక్కడ కూడా మనిషికి రక్షణ లేకుండా పోతోంది. అందునా ప్రత్యేకించి మహిళలు పట్టపగలు.. అంతా చూస్తుండగానే వేధింపులకు, దాడులకు గురవుతున్నారు. కఠిన చట్టాలు, త్వరగతిన చర్యలు తీసుకోనంత వరకు పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా..
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన సీసీ ఫుటేజీ ద్వారా బయటకు వచ్చింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. వెనుక నుంచి వెళ్లి ఆమె పట్టుకుని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విడిపించుకునేందుకు బాధితురాలు ప్రతిఘటించినా లాభం లేకపోయింది. వేధించిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు దుండగుడు.
పాక్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ ట్విటర్ ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేశారు. నిందితుడి కఠినంగా శిక్షించి.. ఇలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలని కోరారు. ఒంటరిగా వెళ్తున్న ఆమెను దుండగుడు ఫాలో అవుతున్నట్లు అంతకు ముందు గల్లీలో ఉన్న సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. అయినా సోషల్ మీడియా విమర్శలతో ఫిర్యాదు స్వీకరించామని స్థానిక పోలీసులు వెల్లడించారు.
سیکٹر آئی 10 اسلام آباد میں حوس کے پجاری درندہ صفت شخص کی حرکت دیکھیں ۔
— Zobia Khurshid Raja (@ZobiaKhurshid) July 18, 2022
حکام اس پر پوری نوٹس لے۔
@ICT_Police
By @IslamabadNewz
pic.twitter.com/N2xFbv3MRA
పాక్‌లో గత కొంతకాలంగా మహిళలపై దాష్టికాలు చోటుచేసుకున్నాయి. ఈ మధ్యే ఓ మెట్రో స్టేషన్ బయటకు యువతిని కొందరు కిరాతకంగా వేధించి.. దాడికి పాల్పడిన ఘటన వైరల్ అయ్యింది. కిందటి ఏడాది స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఓ టిక్‌టాకర్‌ను చుట్టుముట్టి వందల మంది ఆమెను లైంగికంగా వేధించారు. ఆమె దుస్తులు చించి వికృత చేష్టలకు పాల్పడుతూ దాడి చేశారు. ఆటోలో వెళ్తున్న ఓ యువతిపైనా అంతా చూస్తుండగానే కొందరు వేధించిన వీడియో సైతం వైరల్ అయ్యింది. మరోవైపు పాక్‌లో పని చేసే చోట 70 శాతం మంది వేధింపులు ఎదుర్కొంటున్నారని సర్వేలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment