youngster
-
గదిలోని హీటర్‌లో లోపం.. అమెరికాలో వనపర్తి విద్యార్థి మృతి!
వనపర్తిటౌన్: అమ్మానాన్నలతో మాట్లాడుతూ అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన కొన్ని గంటలకే ఆ కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఒక్కగానొక్క కొడుకును ఉన్నతంగా చదివించేందుకు 15 రోజుల కిందట ఎంఎస్సీ చేసేందుకు అమెరికాకు పంపిన తల్లిదండ్రులకు పండుగ పూట విషాదం నింపింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు గట్టు దినేష్ (22) డిసెంబర్ 28న ఎంఎస్సీ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు. రోజులానే ఆదివారం తల్లిదండ్రులతో మాట్లాడి, తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కొద్ది గంటలకే కన్న కొడుకు చనిపోయాడనే వార్త వినాల్సి వచ్చింది. కొడుకు బాగా చదువుకోవాలని అయ్యప్ప మాలవేసుకొని శబరిమలైకు బయలుదేరేందుకు సిద్ధమైన ఆ తండ్రి కుంగిపోయాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, పట్టణ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుమారుడి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ కుమారుడు నిద్రలోనే మరణించినట్లు అమెరికా పోలీసుల నుంచి సమాచారం అందిందని, రూంలోని హీటర్‌లో వాసనలేని విషవాయువు బహిర్గతం కావడంతోనే చనిపోయినట్లు తెలిసిందని చెప్పారు. -
పది రోజుల్లో ఇంగ్లాండ్ ప్రయాణం ఉంది.. కాని అంతలోనే ఇలా
కోదాడ: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన యువకుడు కారులో సజీవ దహనమయ్యాడు. కోదాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బడుగుల సైదులు పెద్ద కుమారుడు వెంకటేష్(26) సీఏ పూర్తి చేశాడు. పది రోజుల్లో ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే పని నిమిత్తం శనివారం కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు. రాత్రి 11గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు మంటల్లో చిక్కుకోవడంతో వెంకటేష్ సజీవ దహనమయ్యాడు. కారు ఎలా మంటల్లో చిక్కుకుందో అర్థం కావడం లేదని వెంకటేష్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదిబట్ల పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ మృతికి ఈవీరెడ్డి కళా శాల కరస్పాండెంట్ గింజల రమణారెడ్డి, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ అధ్యాపకుల అసోసియేషన్ ప్రగాఢ సానుభూతి తెలియచేసింది. -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఈ ఘటన లో...!
పాన్‌గల్: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వేణు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అన్నారం చెందిన గడ్డం బాలపీరు(29) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారి మాదిరిగానే గురువారం ఇంటి నుంచి విధుల నిమిత్తం బైక్‌పై వనపర్తికి బయలుదేరాడు. అన్నారంతండా సమీపంలో శివారెడ్డి వ్యవసాయ పొలం వద్ద వనపర్తి నుంచి పాన్‌గల్ వైపు వస్తున్నా వనపర్తి డిపో ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి బాలపీరు రోడ్డు పక్కన ఉన్న పెద్ద రాతిపై పడటంతో తలకు బలమైన గాయంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అతివేగంగా, అజాగ్రత్తగా బస్సు నడిపి మృతికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరిగెల కృష్ణయ్యపై తగు చర్యలు తీసుకొవాలని మృతుని భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మందలించారనివిద్యార్థిని ఆత్మహత్య అమరచింత: స్నేహితుల ఎదుట మందలించారని మనస్థాపానికి గురైన విద్యార్థిని ప్రణవి(14) గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీకృష్ణనగర్‌కు చెందిన నరేష్ కుతూరు ప్రణవి 8వ తరగతి చదువుతుంది. గురువారం ప్రణవిని అవ్వ స్నేహితుల ఎదుట తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. ఇది చదవండి: షాక్‌కు గురై ముగ్గురికి గాయాలు.. కారణం ఇదే.! -
తల్లిదండ్రుల మరణంతో.. యువకుడి తీవ్రనిర్ణయం..!
కరీంనగర్: గోదావరిఖనిలోని పరుశరాంనగర్‌కు చెందిన టంగుటూరి గోపాలకృష్ణ (29) గురువారం ఉరేసుకుని మృతిచెందినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం గోపాలకృష్ణ తల్లి, తండ్రి మృతిచెందారు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయి తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి నాయినమ్మ టంగుటూరి రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సౌజన్య తెలిపారు. -
బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ!
Satyajith Mittal: చిన్న పిల్లల బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు మిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గ్రాడ్యుయేట్ సత్యజిత్ మిట్టల్. చిన్నప్పుడు తాను పడిన ఇబ్బంది వేరే పిల్లలు పడకూడదన్న ఉద్దేశంతో వినూత్న షూ రూపొందించి విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న పిల్లల పాదాలకు అనుగుణంగా విస్తరించగలిగే వినూత్న బూట్ల శ్రేణి మ్యాజిక్ షూను అభివృద్ధి చేసింది ఆయన స్థాపించిన షూ కంపెనీ అరెట్టో (Aretto). ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! చిన్నప్పుడు పడిన ఇబ్బందే.. మ్యాజిక్ షూ ఆవిష్కరణ కోసం సత్యజిత్‌కు తన చిన్ననాటి అనుభవం ప్రేరణనిచ్చింది. చిన్నప్పుడు తన అన్నయ వాడిన బూట్లను సత్యజిత్‌కు ఇచ్చేవారు. అయితే ఆ బూట్లు సత్యజిత్‌కు చాలా వదులు అయ్యేవి. దాంతో నడవడానికి ఆయన చాలా ఇబ్బంది పడేవారు. అప్పటి నుంచి మంచి నాణ్యత గల బూట్లు ధరించాలని ఎప్పుడూ కలలు కనేవాడు. ఆ సమయంలో భారతదేశంలో అవి చాలా తక్కువగా ఉండేవి. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ చిన్నతనంలో ఏదో ఒక సమయంలో తమకు సరిపోని సైజు షూ ధరించి ఇబ్బందులు పడినవాళ్లు ఉంటారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి పాదాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని రోజులకే ఎక్కువ జతల బూట్లు కొనాల్సి వస్తోంది. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు సత్యజిత్. పెరుగుతున్న పాదాల సైజ్‌కు అనుగుణంగా విస్తరించే మ్యాజిక్ షూను రూపొందించారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు తల్లిదండ్రులకు మేలు కలిగిస్తోంది. ఇవి కొంటే పదే పదే కొత్త బూట్లు కొనాల్సిన అవసరం ఉండదు. నిరంతర పరిశోధనలు, పోడియాట్రిస్ట్ (పాదాలకు సంబంధించిన వైద్య నిపుణులు)లతో సంప్రదింపుల ద్వారా సత్యజిత్ పిల్లల పాదాల అనాటమీ గురించి లోతైన అవగాహన పొందాడు. వారి పాదాలు పెద్దలకు భిన్నంగా ఉంటాయని, వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బూట్లు అవసరమని గ్రహించాడు. ఈ జ్ఞానంతో రెండేళ్ల పాటు కష్టపడి మ్యాజిక్ షూను రూపొందించాడు. ఈ ఘనతను సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి బ్రాండ్ అరెట్టో. దీనికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ను పొందింది ఆ కంపెనీ. అలాగే యూకే, యూఎస్ఏ, జపాన్‌తో సహా 20 కంటే ఎక్కువ దేశాల్లోనూ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఎనిమిది నెలల్లో రూ.80 లక్షలకుపైగా గతేడాది ఆయన ప్రారంభించిన ఫుట్‌వేర్ బ్రాండ్ అరెట్టో కేవలం ఎనిమిది నెలల్లోనే 6,000 యూనిట్లకు పైగా విక్రయించి రూ.80 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. తమ బ్రాండ్ షూ తయారీకి థర్మోప్లాస్టిక్ రబ్బర్ రీసైకిల్ మెటీరియల్, స్థానికంగా లభించే త్రీడీ అల్లికల మెటీరియల్‌ని ఉపయోగిస్తున్నారు. సత్యజిత్ పుణెలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి చెందిన చిన్ననాటి స్నేహితురాలు, క్లాస్మేట్ అయిన కృతిక లాల్‌ను సహ వ్యవస్థాపకురాలిగా చేర్చుకున్నారు. అరెట్టో 0-2, 5-7, 5-9 సంవత్సరాల వయసు పిల్లలకు బూట్లను అందిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో విక్రయిస్తున్నప్పటికీ, త్వరలో ఆఫ్‌లైన్ స్టోర్లను ప్రారంభించాడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ బ్రాండ్ షూలు తొమ్మిది స్టైల్స్, ఐదు సైజులు, నాలుగు కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్‌ను బట్టి ధరలు రూ.1,699 నుంచి రూ.2,899 వరకు ఉంటాయి. ఈ బ్రాండ్ బూట్లు 18 మిల్లీ మీటర్ల వరకు విస్తరించవచ్చు. వారి అమ్మకాలలో ఎక్కువ భాగం వారి వెబ్సైట్ ద్వారా వస్తాయి. వారు ఇటీవల నైకాలో కూడా అమ్మడం ప్రారంభించారు. ఇవికాక పిల్లల కార్నివాల్‌లు, పిల్లల షూ ప్రదర్శనలు, పాఠశాల, ఇతర పాప్-అప్ ఈవెంట్లలో పాల్గొంటారు. అరెట్టో కంటే ముందు, సత్యజిత్ స్క్వాట్ ఈజ్ అనే బ్రాండ్‌ను స్థాపించారు. ఇది భారతీయ టాయిలెట్లను సులభంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ వెంచర్ అతనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
Hyderabad: సంప్ రాసిన మృత్యు శాసనం.. ముగ్గురు యువకుల మృతి
బంజారాహిల్స్: నీళ్లు తోడేందుకు బకెట్‌ను సంప్‌లోకి వదిలిన ఓ యువకుడు కరెంట్ షాక్‌తో మృతి చెందగా.. కాపాడటానికి వెళ్లిన మరో ఇద్దరు కూడా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే అసువులు బాసిన విషాద ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివసించే మహ్మద్ రిజ్వాన్ (18), మహ్మద్ రజాక్ (16) అన్నదమ్ములు. రిజ్వాన్ ఇంటర్ చదువుతుండగా రజాక్ ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాశాడు. బుధవారం అర్ధరాత్రి తమ ఇంటిపై వాటర్ ట్యాంకర్లో నీళ్లు అయిపోవడంతో నీరు తోడేందుకు రజాక్ సంప్‌లోకి బకెట్ ముంచాడు. అప్పటికే నీళ్లు పైకి ఎక్కించేందుకు కరెంటు మోటార్ ఆన్ చేసి ఉండటంతో రజాక్ విద్యుత్ షాక్‌కు గురై సంప్‌లో పడిపోయాడు. వెంటనే అతని సోదరుడు మహ్మద్ రజాక్ కూడా నీళ్లు తోడేందుకు సంప్‌లో బకెట్ వేయగానే షాక్‌కు గురయ్యాడు. పది నిమిషాలు గడిచినా రజాక్, రిజ్వాన్ రాకపోయేసరికి స్నేహితుడు సయ్యద్ అనసుద్దీన్ హుస్సేన్ (20) సంపు వద్దకు వచ్చి చూడగా ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. ఆందోళన చెందిన అనస్ వారిని పైకి తీసేందుకు యత్నిస్తుండగా అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ముగ్గురూ సంప్లోనే మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటన పారామౌంట్ కాలనీలో స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అన్నదమ్ములు ఇద్దరూ కొద్ది రోజుల క్రితమే ఇంటర్, 10వ తరగతి పరీక్షలు రాసి ఉన్నత చదువుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గురువారం తెల్లవారుజామున మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశీ విద్యకు వెళ్లే వేళ.. కడలి అలలకు బలి
తొండంగి: ఉజ్వల భవిష్యత్తు కోసం మరో నాలుగు రోజుల్లో జర్మనీ వెళ్లాల్సిన ఆ యువకుడు కడలి కెరటాలకు బలైన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుని కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. పైడికొండ పంచాయతీ ఆనూరుకు చెందిన త్రిపరాన కాసులు, నూకరత్నం దంపతులు ఒక్కగానొక్క కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు సుబ్రహ్మణ్యం (26) విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. ఉన్నత చదువులకు జర్మనీ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. సముద్రంలో స్నానం చేద్దామని శుక్రవారం ఉదయం ఐదు గంటలకు స్వగ్రామం నుంచి ఒక్కడే బైక్‌పై దగ్గరలోని వేమవరం పంపాదిపేట తీరానికి వెళ్లాడు. స్నానం చేస్తున్న క్రమంలో కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. స్నానానికి వెళ్లిన సుబ్రహ్మణ్యం ఎంతకూ రాకపోవడంతో బంధువులు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ అతడి సెల్‌ఫోన్, దుస్తులను గమనించారు. సుబ్రహ్మణ్యం కనిపించకపోవడంతో గల్లంతయ్యాడని భావించి, మత్స్యకారుల సాయంతో వెతకడం ప్రారంభించారు. నాలుగు గంటల అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహం అద్దరిపేట తీరానికి చేరింది. ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
రన్నింగ్ బస్సులు ఎక్కి.. యువతులపై వికృత చేష్టలు
ఆడవాళ్లు వేధింపులు ఎదుర్కొని చోటంటూ కనిపించడం లేదు. ఇంటా బయట పని చోట.. అంతటా కామాంధులు చెలరేగిపోతున్నారు. ఒంటరిగా కనిపించడమే ఆలస్యం చూపులతో.. మాటలతో కుంగదీస్తున్నారు. తాజాగా ఓ నీచుడు బుర్ఖా ముసుగులో యువతులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మహ్మద్ సోహైల్.. వయసు 19 ఏళ్లు. ఉండేది ఉత్తర ప్రదేశ్ బిజ్నోర్‌లోని నజీబాబాద్ టౌన్ పతాన్పురా మొహల్లా ఏరియా. చదువుకుంటున్న ఈ టీనేజర్‌కి దుర్భుద్ది పుట్టింది. తన తల్లి బుర్ఖాను దొంగలించి.. ఆ ముసుగులో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఓ కాలేజీ బస్టాప్ దగ్గర ఎదురు చూసేవాడు. ఆపై రన్నింగ్ బస్సులు ఎక్కి.. అమ్మాయిల సీట్లలో కూర్చుని అసభ్యంగా తాకేవాడు. ఎవరైనా గట్టిగా గదమాయిస్తే.. రన్నింగ్‌లోనే దిగిపోయి మరో బస్సును చూసుకునేవాడు. ఈ నీచుడి గురించి పలువురు అమ్మాయిలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బిజ్నోర్ ఎస్పీ ధరమ్వీర్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. మఫ్టీలో లేడీ కానిస్టేబుల్స్‌ను బస్సుల్లో ప్రయాణం చేసేలా ఆదేశించారు. చివరకు సోహైల్‌ను ఓ బస్సులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారంతా. తొలుత బుర్ఖాలో ఉంది అమ్మాయే అని పోలీసులు సైతం భావించారట. తీరా.. ముసుగు తొలగించి చూస్తే అది సోహైల్. ఇదిలా ఉంటే సోహైల్.. ఈ బుర్ఖా ముసుగులోనే అబ్బాయిలకూ గాలం వేసేవాడని పోలీసులు గుర్తించారు. హనీట్రాప్ ద్వారా సోహైల్.. పలువురు యువకుల నుంచి డబ్బులు సైతం లాగేవాడని ఎస్పీ ధరమ్వీర్ తెలిపారు. UP के बिजनौर में बुर्का पहनकर छात्राओं को छेड़ने वाला सुहेल आज पकड़ा गया. वह 3 दिन से कॉलेज और बस में छात्राओं पर अश्लील कमेंट्स करता था. #Bijnor pic.twitter.com/QypMA01XKN — Sachin Gupta (@sachingupta787) March 12, 2022 -
మామూలు కుర్రోడు.. ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ'
సాక్షి, తెనాలి: ఒకప్పుడు అందరిలానే మామూలు కుర్రోడు. రెండేళ్ల తర్వాత సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’.. కేవలం ఒక్క రోజులోనే.. అదికూడా ఓటీటీలో విడుదలైన సినిమాతో!. తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకుని సూపర్ హిట్ కొట్టాడు. అతనే గుంటూరుకు చెందిన యువ దర్శకుడు వినోద్ అనంతోజు. తొలి సినిమాతోనే దర్శకుడవ్వాలనే కలను నెరవేర్చుకోవడమే కాదు.. సక్సెస్‌తో తనను తాను నిరూపించుకున్నాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షక్షుల ఆకట్టుకున్నాడు. సాఫ్ట్వేర్ నుంచి డైరెక్షన్లోకి.. వినోద్ అనంతోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి, సినీదర్శకుడు కావాలన్న కలను కష్టపడి నిజం చేసుకున్నాడు. తనలాంటి మధ్యతరగతి జీవితాలను వినోదాత్మకంగా తెరకెక్కించి, వీక్షకులను మెప్పించాడు. సుప్రసిద్ధ దర్శకుల అభినందనలూ అందుకున్నాడు. గుంటూరు–కొలకలూరులోనే చిత్రీకరణ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, కన్నడ నటి వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ సినిమాకు గుంటూరు కుర్రోడు దర్శకుడవటమే కాదు.. దాదాపు సినిమా మొత్తం గుంటూరు, తెనాలి సమీపంలో కొలకలూరులోనే చిత్రీకరించటం, ఎక్కువశాతం క్యారెక్టర్లకు రంగస్థల నటీనటులనే తీసుకోవటం విశేషం. ఆయా పాత్రల్లో సురభి జమునారాయలు, సురభి ప్రభావతి, గోపరాజు రమణ వంటి కళాకారులు నటించారు. ఆరు నెలల్లో పూర్తి.. గతేడాది జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించగా దాదాపు ఆరు నెలల్లో పూర్తి చేశారు. ‘పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో సినిమా సిద్ధమయ్యేసరికి లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పటికీ తెరుచుకోలేదు. కనీసం ఓటీటీలోనైనా రిలీజ్ చేద్దామని అమెజాన్‌ను సంప్రదించాం. వారికి నచ్చి తీసుకోవటంతో ఇప్పుడు వీక్షకుల ముందుకొచ్చింది’ అని వినోద్ చెప్పారు. ‘సినిమాకు పేరొస్తుందని అనుకున్నాగానీ మరీ ఇంతలా వస్తుందని అనుకోలేదు’అని, దర్శకుడు క్రిష్ ఫోన్ చేసి అభినందించారంటూ ఆనందంతో అనుభవాన్ని సాక్షితో పంచుకున్నారు. కళాశాలలో.. సినిమాపై ఇష్టంతో వినోద్ కాలేజీ రోజుల్లోనే షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. దాదాపు ఎనిమిది లఘుచిత్రాలు తీయగా ‘శూన్యం’ అనే చిత్రానికి మంచి పేరొచ్చింది. ఒక సినిమా తీయాలనుకునేవాడు ఎలాంటి కథను ఎంచుకుంటాడు? అనే ఆలోచనతో చుట్టూ ఉన్న సమాజం నుంచి ఎలాంటి కథ తయారుచేసుకున్నాడు? అనేది ఇతివృత్తం. తన లఘుచిత్రంలోని హీరోలానే తాను కూడా మధ్యతరగతి జీవితాన్ని ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’గా దృశ్యీకరించి పండించాడు. తొలి సినిమాతోనే లక్ష్యాన్ని సాధించి హీరో అనిపించుకున్నాడు. తదుపరి ప్రాజెక్టు కోసం రెండు మూడు కథలపై వర్క్ చేస్తున్నట్టు చెప్పారు. రెండేళ్ల నిరీక్షణ.. వినోద్ అనంతోజు మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి విశాలాంధ్ర బుక్‌హౌస్ మేనేజరు. తల్లి గృహిణి, సోదరి ఉంది. 2011లో బీటెక్ పూర్తి చేశాక ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఏడేళ్లు పనిచేశాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సినిమా దర్శకుడు కావాలనేది సంకల్పంగా తన చుట్టూ ఉండే సమాజంలో నుంచి సినిమాకు సరిపడే కథను సిద్ధం చేసుకుని, అవకాశాల కోసం ప్రయత్నించాడు. రెండేళ్లకు భవ్య క్రియేషన్స్ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావటంతో షూటింగ్ పట్టాలకెక్కింది. -
మిస్టర్ సీతమ్మ
గోవింద మౌర్య అనే యువకుడు గత పదిహేడేళ్లుగా నిష్ఠగా సీతమ్మవారి పాత్రను పోషిస్తున్నాడు. ఇంత నిష్ఠా తన కుటుంబాన్ని పోషించుకోడానికే. మగవారు ఆడ పాత్రలు వేయడం మహాభారత కాలం నాటి నుంచి చూస్తున్నాం. అర్జునుడు వేసిన బృహన్నల పాత్ర అటువంటిదే కదా. ఒకప్పుడు కూచిపూడి నాట్యం మగవారే ఆడవేషంలో చేసేవారు. ఇప్పటికీ ఇటువంటి సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. నెలక్రితం విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో హిందీ నటుడు ఆయుష్మాన్ ఖురానా పోషించిన ఆడ పాత్ర కూడా అమిత ఆదరణ పొందింది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఒక కాల్ సెంటర్లో పనిచేస్తాడు. ఆడ గొంతుతో మాట్లాడుతుంటాడు. అంతేకాదు తను నివసించే ప్రాంతంలో ‘రామ్‌లీల’ నాటకంలో నటుడు కూడా. అందులో సీతాదేవి పాత్ర పోషిస్తుంటాడు. నాటకం అయ్యాక, మామూలు మగ దుస్తుల్లో ఉన్నా కూడా స్థానికులొచ్చి అతడి.. అంటే సీతాదేవి ఆశీస్సులు అందుకుని వెళుతుంటారు. ఇది సినిమా కథ. ఇటువంటిదే నిజ జీవితంలో కూడా ఒక సంఘటన జరుగుతోంది. ముప్పై ఆరు సంవత్సరాల గోవింద మౌర్య అనే కళాకారుడు ఢిల్లీ రామలీలా సన్నివేశంలో, పదిహేడు సంవత్సరాలుగా సీతాదేవి పాత్రను ఎంతో భక్తి, నేర్పుగా ప్రదర్శిస్తున్నాడు. ఆయన మేకప్ తీసేసినప్పుడు కూడా ఎంతోమంది భక్తులు ఆయన (సీతాదేవి) ఆశీర్వాదాల కోసం రావడం అతడికే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘‘నన్ను చూసి చాలామంది అప్పుడప్పుడు, ‘అదిగో సీతను చూడు. మేకప్ లేకపోయినా కూడా అచ్చంగా సీతమ్మ తల్లిలా ఉన్నాడు’ అంటూ నన్ను ఆరాధనగా చూస్తుంటారు’’ అంటారు గురుగ్రామ్‌కి చెందిన ఈ గోవింద మౌర్య. గోవింద మౌర్య బాల్యం నుంచి తన గ్రామంలో జరిగే రామ్‌లీల నాటకాన్ని చూసేవాడు. ‘‘ఓసారి నేను రామ్‌లీలా చూస్తున్నాను. నా గొంతు వారికి నచ్చింది. నన్ను స్టేజీ మీదకు తీసుకువెళ్లి, నాతో మాట్లాడించారు’’ అని బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు గోవింద మౌర్య. ప్రారంభంలో అతడికి సీతాదేవి తల్లి పాత్రను ఇచ్చారు. పదిహేను రోజులవ్వగానే సీతాదేవి పాత్ర ఇచ్చారు. సీతాదేవి పాత్రలో – ‘‘సఖీ, ఒక్కసారి నిలువుము. నాకు కొంచెం బెదురుగా ఉంది’’ అనే డైలాగులు వింటుంటే అమ్మాయే మాట్లాడుతోందేమో అనుకునేలా మాట్లాడతారు గోవింద. సీతాదేవిని కలవడానికి శ్రీరామచంద్రుడు పుష్పవాటికకు వచ్చిన సందర్భంలో ఈ సంభాషణ ఉంటుంది. అయితే సీతాదేవి పాత్రను గోవింద పోషించడం అతని కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ‘‘కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు తప్పదు. గతంలో నేను లెదర్ ఫ్యాక్టరీలో పనిచేశాను. అది మూత పడటంతో ఇంటి ఆర్థిక అవసరాల కోసం ఈ పాత్ర పోషిస్తున్నాను’’ అంటారు గోవింద. అయితే ఈ పాత్ర పోషించినందుకుగాను పారితోషికం ఆయనకు నగదు రూపంలో అందటం లేదు. ఇంటికి పనికివచ్చే వస్తువులు ఇస్తున్నారు. ‘‘నేను సీతాదేవి వేషం వేసుకున్నాక, ఒక్కరు కూడా హేళన చేయరు. పైగా నా పాదాలకు నమస్కరిస్తారు. మేకప్ తీశాక కూడా ఎవ్వరూ నన్ను ఎగతాళి చేయరు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు రామ్‌లీలాలో నటిస్తున్నారు. కాని ఆడపాత్రలను మగవారు పోషించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది’’ అంటారు గోవింద. . – రోహిణి -
మూడు గుణాలు
ఉమర్ బిన్ ఖత్తాబ్ (ర) ఒకసారి కొలువు తీరి ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఒక యువకుడిని బంధించి ఈడ్చుకుంటూ అక్కడకు తీసుకువచ్చి ‘ఓ విశ్వాసుల నాయకా..! వీడు మా తండ్రిని హత్య చేశాడు, మీరు వీడికి మరణశిక్ష విధించాలి..’ అని అన్నారు ఉమర్ (ర) ఆ యువకుడి వైపు చూస్తూ .. ‘ఎందుకు చంపావు వీళ్ల తండ్రిని..?’ అని అడిగాడు. ఆ యువకుడు.. ‘నేనొక ఒంటెల కాపరిని. అనుకోకుండా నా ఒంటె ఒకటి వారి పొలంలో మేసింది. అది చూసి వీళ్ల నాన్న ఒక పెద్ద రాయిని దాని మీదకు విసిరాడు. రాయి కంటికి తగిలి అది బాధతో గిల గిల లాడింది. నేను కోపంతో అదే రాయిని తీసి వాళ్ల నాన్న మీదకు విసిరాను. అది ఆయన తలమీద పడి ఆయన చనిపోయాడు’ అని చెప్పాడు. ‘అలా అయితే నేను నీకు అదే శిక్ష విధిస్తాను’ అన్నారు ఉమర్ (ర). యువకుడు కంగారుగా.. ‘ఓ నాయకా..! దయచేసి నాకు మూడు రోజులు గడువు ఇప్పించండి. మా నాన్న చనిపోతూ నాకు కొంత ఆస్తిని ఇచ్చాడు, ఇంకా నాకు ఒక చెల్లెలు ఉంది. ఆమె బాధ్యత కూడా నా మీద ఉంది. మీరు నన్ను ఇప్పుడే చంపేస్తే నా ఆస్తికి రక్షణ, నా చెల్లెలికి సంరక్షణ ఉండదు. నాకు మూడు రోజులు గడువు ఇవ్వండి. నేను నా చెల్లెలికి సంరక్షణ ఏర్పాటు చేసి వెంటనే తిరిగి వస్తాను’ అన్నాడు. దానికి ఉమర్ (ర).. ‘సరే, నీకు పూచీగా ఎవరు ఉంటారు?’ అని అడిగారు. యువకుడు అక్కడ గుమిగూడి ఉన్న జనంలోకి చూశాడు. అందరూ తలలు వంచుకున్నారు. కానీ ఒక చేయి పైకి లేచింది. అది హజరత్ అబూజర్ గిఫారీ (ర) గారిది.‘ఇతనికి పూచీగా ఉంటావా అబూజర్..?’ అని అడిగారు ఉమర్. ‘ఉంటాను నాయకా...!’ అన్నాడు అబూజర్ (ర). ‘‘అతను తిరిగి రాకపోతే ఆ శిక్ష నీకు పడుతుంది, తెలుసుగా...?’ అన్నారు ఉమర్. ‘ నాకు సమ్మతమే నాయకా! అన్నాడు అబూజర్ (ర). ఆ యువకుడు వెళ్లి పోయాడు.. రెండు రోజులు గడిచిపోయాయి. మూడవ రోజు సాయంత్రం కావస్తుంది. ఆ యువకుడి జాడ లేదు. అతడు తిరిగి రాకపోతే అబూజర్ (ర) కు మరణ శిక్ష పడవచ్చని అందరూ భయపడసాగారు. సూర్యాస్తమయానికి ఇంకా కొంచెం సమయం ఉందనగా.. ఆ యువకుడు వచ్చి సభలో ఉన్న హజరత్ ఉమర్ (ర) ముందు హాజరయ్యాడు. అలసి సొలసినట్లు ఉన్న ముఖంతో అతడు ఇలా అన్నాడు.. ‘..ఓ నాయకా! నా ఆస్తిని, చెల్లెలి సంరక్షణ బాధ్యతను మా మామయ్యకు అప్పచెప్పాను... ఇక మీరు నాకు శిక్ష విధించవచ్చు’ అని!ఉమర్ (ర) ఆశ్చర్యంతో.. ‘శిక్ష నుండి తప్పించుకొనే అవకాశం ఉన్నా సరే ఎందుకు తిరిగి వచ్చావు?’ అని అడిగాడు. ‘ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే సమర్థతను మనుషులు కోల్పోయారని అందరికీ అనిపిస్తుందని భయం వేసింది, అందుకే తిరిగి వచ్చాను’ అన్నాడు యువకుడు. ఉమర్(ర) : (అబూజర్ వైపు చూస్తూ) ‘అసలు నీవెందుకు అతడికి పూచీగా ఉన్నావు? అబూజర్ (ర) : సాటి మనిషి ఆపదలో ఉండి చేయి చాస్తే అతడికి మేలు చేసే ఆకాంక్షను మనుషులం కోల్పోయాం అనిపిస్తుందని భయం వేసింది. అందుకే పూచీగా ఉన్నాను.. అన్నాడు. ఇక హత్యానేరాన్ని మోపిన ఆ వ్యక్తులు ఇదంతా చూసి ఇలా అన్నారు.. ‘ఓ నాయకా! మేము కూడా ఈ యువకుడిని క్షమించి వేస్తున్నాము, దయచేసి అతడిని శిక్షించకండి’ అన్నారు. ఉమర్ (ర) అమితాశ్చర్యంతో.. ‘అదేంటి? ఎందుకు క్షమించి వేస్తున్నారు?’ అన్నారు. క్షమాగుణం మనుషుల హృదయాల నుండి తుడిచి పెట్టుకు పోయినట్లనిపిస్తుందని భయం వేస్తోంది. అందుకే క్షమిస్తున్నాము’ అన్నారు ఆ వ్యక్తులు. – మర్యమ్ -
ఎడారిలో నరకయాతన
సిరిసిల్ల: బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన మరో యువకుడికి కన్నీళ్లు, కష్టాలు ఎదురయ్యాయి. రెక్కల కష్టాన్ని నమ్ముకుని వెళ్లిన యువకుడు ఏజెంట్ మోసం తో నరకయాతన అనుభవిస్తున్న సంఘటన బుధవారం వెలుగు చూసింది. బాధితుడు గల్ఫ్ దేశంలో అనుభవిస్తున్న కష్టాలను వివరిస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనను విడిపించాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తనను స్వదేశానికి రప్పించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావును వేడుకున్నాడు. ఇదీ ఏజెంట్ మోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సమీర్ (21) నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏజెంట్ వాహిద్ సౌదీ అరేబియాలోని సిటీలో ఫామ్‌హౌస్‌లో పని అని, నెలకు రూ.1,200 రియాళ్లు (రూ.22 వేలు) జీతం అని చెప్పాడు. అరబ్బు షేక్‌లకు అసిస్టెంట్‌గా పనిచేయాలని, ఫామ్ హౌస్ పని సులభంగా ఉంటుందని వివరించాడు. అతడి మాటలు నమ్మిన సమీర్.. రూ.83 వేలు చెల్లించి వీసా తీసుకున్నాడు. 2019 ఏప్రిల్ 15 సమీర్ సౌదీ అరేబియా వెళ్లాడు. విమానాశ్రమంలో రిసీవ్ చేసుకున్న కఫిల్ (వీసా ఇచ్చిన యజమాని) నేరుగా సిటీకి 1,200 కిలోమీటర్ల దూరంలోని గొర్రె షెడ్డు వద్దకు తీసుకెళ్లి వదిలేశాడు. 300 గొర్రెలకు కాపలా ఉండాలని చెప్పడంతో సమీర్ కంగుతిన్నాడు. ఎడారిలో ఒంటరిగా.. సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటరిగా గొర్రెలను కాస్తూ సమీర్ ఇబ్బందుల పాలవుతున్నాడు. దయనీయమైన పరిస్థితిలో సమీర్ వద్ద ఫోన్ కూడా లేదు. ఎవరో వస్తే.. వారి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తన పరిస్థితిని వివరించాడు. ఈ విషయమై ఏజెంట్ వాహిద్‌ను కుటుంబ సభ్యులు నిలదీస్తే.. అక్కడ చెప్పిన పని చేయాలి.. లేకుంటే.. రూ.1.20 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తామని ఏజెంట్ వాహిద్ చెప్పాడు. ఇరవై రోజులుగా తిండి సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని సమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు అన్నా నీ కాల్మొక్త.. ఇంటికి తెప్పించుండ్రి.. సమీర్ తన దయనీయ స్థితిని వివరిస్తూ వీడియో పంపించాడు. ‘కేటీఆర్ అన్నా నీ కాల్మొక్త.. జెర ఇంటికి పంపించుండ్రి అన్నా..’అంటూ కన్నీరు పెట్టాడు. ‘బండిలో ఎక్కడికో తీసుకపోయి టార్చర్ చేస్తుండు. బెదిరిస్తుండు’ అంటూ సమీర్ వాపోయాడు. ఇక్కడుంటే తనకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్పత్రి పాలైన తల్లి రఫియా సమీర్ ఇంటికి పెద్దోడు. తండ్రి ఇబ్రహీం బాబు అనారోగ్యంతో ఏడేళ్ల కిందట మరణించాడు. తల్లి రఫియా, తమ్ముడు సుమీర్, చెల్లెలు నౌషియా ఉన్నారు. అప్పుల బాధలతో సిద్దిపేటలో ఇల్లు అమ్ముకుని ఇల్లంతకుంటలో స్థిరపడ్డారు. గతంలో దుబాయి వెళ్లి వచ్చిన సమీర్.. మెరుగైన జీతం కోసం సౌదీ అరేబియా వెళ్లి బందీ అయ్యాడు. కొడుకు పరిస్థితి తెలిసి తల్లి రఫియా హైబీపీ, షుగర్‌తో సిద్దిపేటలోని ఆస్పత్రిలో చేరింది. సమీర్‌ను ఎలాగైనా ఇండియా రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అతడిపైనే కుటుంబం ఆధారపడి ఉందని సమీర్ మేనమామ అబిద్ తెలిపారు. సమీర్‌ను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు: కేటీఆర్ ఏజెంట్ మోసం చేయడంతో సౌదీలో చిక్కుకుని కష్టాలు పడుతున్న మహ్మద్ సమీర్‌ను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు చెందిన 21 ఏళ్ల మహ్మద్ సమీర్ జీవనోపాధి కోసం గత నెలలో సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఫంక్షన్హాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏజెంట్ ఆశ చూపించాడు. ఉద్యోగం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తీరతాయని భావించిన సమీర్... ఏజెంట్‌కు పెద్దమొత్తంలో నగదును ఇచ్చాడు. తీరా అక్కడికి వెళ్లాక తనను గొర్రెల కాపరిగా పెట్టారని కన్నీటి పర్యంతమైన సమీర్, తన ను రక్షించమంటూ వీడియో సందేశాన్ని పంపాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సమీర్‌ను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రియాద్‌లోని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధిని కోరుతూ ట్వీట్ చేశారు. -
యాడ్ చూసి ఎత్తు పెరగాలనుకొంటే..
వనపర్తి: ఈ మందులు వాడితే సులభంగా పొడవు పెరగవచ్చు అంటూ టీవీలో ప్రసారమయ్యే ఓ యాడ్‌ను చూసిన ఆ యువకుడు రూ.2 వేలు వెచ్చించి గ్రోత్‌ఆన్ అనే మందుకొని వాడాడు. వారం రోజుల్లోనే.. శరీరమంతా ఇన్ఫెక్షన్ అయ్యింది. అలా రోజురోజుకు అనారోగ్యం పెరుగుతూనే వస్తోంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు సంస్థలు యువతను ఆకట్టుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేసి సంస్థ ఉత్పత్తులను విక్రయించి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఖాజా నజీర్ అహ్మద్ ప్రస్తుతం అనుభవిస్తున్న నరకయాతనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంతో హుషారుగా ఉండే యువకుడు మూడుకాళ్ల వృద్ధుడిలా మంచానపడటంతో ఆ కుటుంబం పరిస్థితి దిక్కుతోచని సంకట స్థితిలోకి జారిపోయింది. గత రెండు నెలల క్రితం ప్రారంభమైన అనారోగ్యం ప్రస్తుతం తీవ్రరూపం దాల్చింది. శరీరంలోని కండ పూర్తిగా కరిగిపోయి ధృడమైన శరీర సౌస్టంతో ఉండాల్సిన పద్దెనిమిదేళ్ల యువకుడు ఎముకలగూడతో పలికేందుకు సత్తువలేనంత నీరసంగా మారిపోయాడు. అస్వస్థత ప్రారంభంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులకు చూపించగా.. అక్కడి వైద్యులు పదిహేనురోజులపాటు వైద్యం అందించి పాలమూరులోని ఎస్వీఎస్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడ వైద్య పరీక్షలు చేసి మందులు ఉచ్చారు. కానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో హైదరాబాద్‌లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే.. ఆసరా పింఛన్, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునే తల్లి కుమారుడికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేక సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆస్తులు పంచుకున్న బంధువులు ఆపద సమయంలో జాలి చూపించటం లేదు. పెద్ద మనస్సుతో సాయం చేసి నా కుమారుడి వైద్యం చేయించాలని తల్లి గోరీబీ, అక్క అర్షియా కోరుతున్నారు. -
అవమానభారంతో ఆత్మహత్య
సాక్షి, నల్గొండ: ఇక్కడి రైల్వే స్టేషన్లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్రంపోడు మండలం పోచంపల్లికి చెందిన వేముల ప్రసాద్ శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో అతనిపై మోటార్ వైర్ దొంగతనం కేసు నమోదైంది. సకల నేరస్థుల సర్వేలో భాగంగా పోలీసులు గురువారంనాడు అతని ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా, పోలీసులు ఇంటికి వచ్చారన్న అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. అతని వద్ద సూసైడ్ నోట్ లెటర్ దొరికింది. అమ్మానాన్న, సోదరుడు, స్నేహితులను తాను మిస్ అవుతున్నానని అందులో రాసి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తాగిన మైకంలో ఆత్మహత్యాయత్నం
కొవ్వూరు రూరల్ : తాగిన మైకంలో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన తాళ్లపూడిలో శనివారం చోటుచేసుకుంది. బంధువులు, కొవ్వూరు ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లపూడికి చెందిన ఊబా శ్రీనివాస్ అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో శరీరం పూర్తిగా కాలిపోయింది. అతడిని బంధువులు 108లో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధీర్ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమించడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ప్రియురాలిపై చాకుతో దాడి
తాడేపల్లిగూడెం రూరల్ : ప్రియురాలు మాట్లాడటం లేదనే ఆక్రోశంతో ఆమెపై దాడికి తెగబడిన ఓ ప్రేమోన్మాది తెగబడ్డాడు. ఈ ఘటన తాడేపల్లిగూడెం పట్టణం విమానాశ్రయ రన్‌వే ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బూర్గుంపాడుకు చెందిన 28ఏళ్ల మురికి సంజీవ్‌కుమార్ స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్నాడు. అతను ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంటెక్ చదువుతూ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు. సంజీవ్ తన ఇంటికి ఎదురుగా నివాసముంటున్న యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి ఇంటిలో తెలియడంతో మందలించారు. దీంతో సంజీవ్‌కు ఆమె దూరంగా ఉంటోంది. నాలుగు రోజులుగా ఆమె మాట్లాడకపోవడంతో ఆగ్రహించిన సంజీవ్ చాకు కొని ఆమెను ఎయిర్ డ్రమ్ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశాడు. అనంతరం అదే చాకుతో తన కాలిపైనా గాయం చేసుకున్నాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వీరిని స్థానికులు 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఐ.వీర్రాజు ఇద్దరి నుంచి స్టేట్మెంట్లు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్ప స్థితిలో యువకుడు మృతి
భట్టిప్రోలు: భట్టిప్రోలు 9వ వార్డులోని భోగేశ్వరపేటలోని ఓ ఇంటి వరండాలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ ఆర్.రవీంద్రారెడ్డి కథనం ప్రకారం వెల్లటూరుకు చెందిన సజ్జా రాము(22) వివాహాది శుభకార్యాలకు మండపాలు కడుతూ జీవనం కొనసాగించేవాడు. ప్రతి రోజూ వెల్లటూరు నుంచి భట్టిప్రోలు వస్తూ, వెళుతుండేవాడు. ఈ నేప«థ్యంలో స్థానిక భోగేశ్వరపేటలోని కౌతరపుసాంబశివరావు ఇంటి వరండాలో ఇతను అచేతనుడై పడి ఉండడాన్ని సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
రణస్థలం : పైడిభీమవరం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపంలోని చిన్న నడిపిల్లి గ్రామానికి చెందిన జాడ కోటేశ్వరరావు(20) అరబిందో పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం డ్యూటీకి వస్తూ రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోటేశ్వరరావు తల్లిదండ్రులు, భార్య ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రణస్థలం ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రివాల్వర్‌తో సంచరిస్తున్న యువకుడు అరెస్ట్
సూర్యాపేట (నల్లగొండ): రివాల్వర్‌తో సంచరిస్తున్న ఓ యువకుడిని నల్లగొండ జిల్లా సూర్యాపేట పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సూర్యాపేటలోని జనగామ క్రాస్‌రోడ్డులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఆ మార్గంలో వచ్చిన ఒక ఆటోను ఆపగా.. అందులో ప్రయాణిస్తున్న విజయ్ అనే యువకుడు వెంటనే పరుగు లంకించుకున్నాడు. పోలీసులు అప్రమత్తమై అతడిని పట్టుకుని సోదా చేయగా రివాల్వర్ బయటపడింది. అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించి విచారించగా..చోరీలకు సాయంగా ఉంటుందని రూ.20వేలు పెట్టి కొనుగోలు చేసినట్టు అతడు బయటపెట్టాడు. నిందితుడు మిర్యాలగూడ మండలం ఆళ్లగడప గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. -
కరెంట్ షాక్‌తో యువకుని మృతి
మదనపల్లి రూరల్(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలం గుడిసెవారిపల్లిలో మంగళవారం విద్యుదాఘాతంతో ఒక యువకుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన బాలాజీ(30) టాటాఏస్ వాహనంలో పాలు సరఫరాచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడు. ఇంట్లో మంగళవారం సాయంత్రం స్నానంచేసి ఇనుప వైరుపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య సంధ్య ఉంది. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. -
ఉద్యోగం రాదనే బెంగతో యువకుడు ఆత్మహత్య
పేదరికంతో ఎంబీఏ చదువుకు ఆటంకం ఉయ్యాలవాడ: 'తమ్ముడిని పై చదువులు చదివించుకోలేకపోయాం. నా చదువూ మధ్యలోనే ఆగిపోయింది. చిన్న ఉద్యోగం చేద్దామన్నా దొరకడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదమ్మా అని బాధపడేవాడు. ఇలా ప్రాణాలు తీసుకుంటాడనుకోలేదు.' అని పెద్ద సంజీవరాయుడు తల్లి వరాలు గుండెలవిసేలా రోదించింది. ఉద్యోగం రాదనే బెంగతో కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు గ్రామానికి చెందిన సాలె పెద్ద సంజీవరాయుడు (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. సాలె సంజీవరాయుడు, వరాలు దంపతులకు ఇద్దరు కుమారులు. ఆర్థిక స్థోమత సరిగా లేకపోవడంతో చిన్నకుమారుడు 10వ తరగతితో చదువు మానేశాడు. పెద్ద కుమారుడు పెద్ద సంజీవరాయుడు ఆర్థిక పరిస్థితి సహకరించక ఎంబీఏ మధ్యలోనే మానేశాడు. అప్పటి నుంచి ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఇక తనకు ఉద్యోగం రాదనే బెంగతో ఈనెల 19న ఇంటినుంచి వెళ్లిపోయిన అతడు పెద్దయమ్మనూరు, కొండుపల్లె గ్రామాల మధ్య కేసీ కెనాల్ సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మృతదేహాన్ని గుర్తించారు. ఎస్ఐ నాగేంద్రప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ముసుగులో కోరికలు తీర్చుకుంటున్నాడు!
ఫేస్బుక్ ఫ్రెండ్ ముసుగులో అమ్మాయిలను లొంగదీసుకుని కోరికలు తీర్చుకుంటున్న కేటుగాడి ఉదంతం బట్టబయలైంది. హైదరాబాద్‌లో శుక్రవారం బట్టబయలైన ఫేస్బుక్ క్రిమినల్ మాజీద్ లాంటి కేసే మరొకటి రాజమండ్రిలోనూ వెలుగు చూసింది. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకుని, వారికి దగ్గరై ఆ తరువాత వారిని లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్న బొబ్బా హరిశ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంతో మంది అమ్మాయిలు వీడిబారిన పడగా ఒకరు మాత్రం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లైంగికంగా వేధించడంతోపాటు... మోసం చేశాడని ఆరోపిస్తూ కేశవరానికి చెందిన ఓ కాలేజీ విద్యార్ధిని తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హరీశ్.. తనతో స్నేహం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడని, ఆ తరువా మోసం చేశాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ మేరకు బొబ్బా హరిష్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు. -
విద్యార్థినికి లైంగిక వేధింపులు!
-
ప్రేమించకుంటే..చంపేస్తానన్నాడు..
బొమ్మలరామారం: ‘ప్రేమిస్తున్నా... పెళ్లికి ఓకే చెప్పకుంటే చంపేస్తా...’నని బెదిరిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం రాంలిగంపల్లిలో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని రాంలింగంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి తన అమ్మమ్మ గారి ఊరైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో చదువుకునే క్రమంలో గత కొంత కాలంగా అక్కడే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన గుర్రం కర్ణాకర్ బాధితురాలికి ట్యూషన్చేప్పేవాడు. ఆ సమయంలో సాన్నిహిత్యం పెంచుకున్న కర్ణాకర్ ప్రేమ పేరుతో వేధిండం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువతిని స్వగ్రామమైన రాంలింగంపల్లికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో గత నెల 29న రాంలింగంపల్లి గ్రామానికి కర్ణాకర్ వచ్చాడు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్ణాకర్ మద్యం తాగి వచ్చి, తనను పెళ్లి చేసుకోకుంటే చంపుతానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి యువతి శనివారం ఫిర్యాదు చేయడంతో కర్ణాకర్‌పై నిర్భయ కేసు నమోదు చేశారు. కాగా, గత నెల 29న రాంలిగంపల్లిలో టీకొట్టు దగ్గర ఉండగా యువతి బంధువులు తనపై దాడి చేసి గాయపరిచారని కర్ణాకర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రైలు ఢీకొని యువకుడి దుర్మరణం
మహబూబ్‌నగర్: రైలు డీ కొట్టిన ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా మదనాపురం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలిస్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 28 ఏళ్ల వయసు గల ఓ యువకుడిని రైలు డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పింక్ కలర్ షర్టు, బ్లూ కలర్ జీన్స్, కుడి భుజంపై జీకే అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. -
బండరాయితో మోది చంపేశారు
అత్తాపూర్ (హైదరాబాద్) : గుర్తు తెలియని కొందరు దుండగులు ఓ యువకుడిని బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై ఉమేందర్ తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ రాంరెడ్డిబావి వద్ద గల నీటి సంపులో ఓ యువకుడి మృతదేహం స్థానికులకు కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి తలపై బండరాయితో మోది చంపిన ఆనవాళ్లున్నాయి. అపరిచితులు ఈ దారుణానికి ఒడిగట్టారా లేక డబ్బుల విషయమై జరిగిన గొడవలో స్నేహితులే చంపేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
యువకుడు అదృశ్యం
శంషాబాద్ రూరల్ (రంగారెడ్డి) : జీతం డబ్బులు తీసుకొస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువకుడు కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన శంషాబాద్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. హెడ్ కానిస్టేబుల్ ఖాజా మోయినుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గౌలిపురాకు చెందిన బండ నరేష్(22) నాలుగు నెలల క్రితం మండల పరిధిలోని తొండుపల్లిలో ఉండే తన మేనమామ రాజు ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా హైదరాబాద్‌లోని బేగంపేట్ వెళ్లి జీతం డబ్బులు తీసుకువస్తానని చెప్పి జూన్ 18వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. నరేష్ కోసం కుటుంబీకులు గాలించినా ఫలితం లేకుండా పోవడంతో శుక్రవారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్) : ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఉప్పల్ సర్వే కాలనీకి చెందిన కిరణ్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. కాగా గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇబ్బందులు తీవ్రమవడంతో సోమవారం ఇంట్లోనే చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్వారీగుంతలో పడి యువకుడు గల్లంతు
గంగాధర్‌నెల్లూరు (చిత్తూరు జిల్లా) : క్వారీగుంతలో ఈతకెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన సోమవారం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండల కేంద్రానికి చెందిన చంద్ర(21) అనే యువకుడు స్నేహితులతో కలిసి సమీపంలోని క్వారీ గుంతకు ఈతకెళ్లాడు. ఈ క్రమంలోనే క్వారీ గుంతలో దూకిన చంద్ర గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు పోలీసులకు తెలిపారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల నుంచి గాలింపు చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. -
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
నెల్లూరు(కోవూరు): కోవూరు మండలకేంద్రంలోని ఎంఎస్ఆర్ కాలనీకి చెందిన యేకొల్లు కోటేశ్వరరావు(22) అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ నిద్రపోయిన తర్వాత ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోటేశ్వరరావు నుంచి అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు మందలించటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని యువకుడు మృతి
రాజమండ్రి రూరల్ : వేగంగా వెళ్తున్న లారీ.. సైకిల్‌పై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని బొమ్మూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బొమ్మూరు గ్రామానికి చెందిన అరుణ్(18) పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సైకిల్‌పై వెళ్తుండగా సిలిండర్ల లోడ్‌తో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్‌పై నుంచి పడి యువకుడి మృతి
కుంటాల (ఆదిలాబాద్ జిల్లా) : ట్రాక్టర్ నేర్చుకోవడానికి వెళ్లిన ఒక యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం తురాటి గ్రామ శివారులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దిలావర్పూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన దర్శనం శ్రీను(20) గత కొంతకాలంగా ట్రాక్టర్ నేర్చుకునేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ట్రాక్టర్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తనను ప్రేమించడం లేదని...
మిర్యాలగూడ (నల్లగొండ) : ప్రేమ కోసం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగరాజు(25) మిర్యాలగూడలోని కపిల్ చిట్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతితో ఇతడికి ఫోన్లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ యువతి తనను ప్రేమించడం లేదంటూ సోమవారం అవంతిపురం గ్రామంలో నాగరాజు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గుర్తించి 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి ముహూర్తాలు లేవని ఉరేసుకున్నాడు
ధన్వాడ (మహబూబ్‌నగర్) : వివాహ ముహూర్తాలు లేవని, మరో ఏడాది వరకు ఆగాల్సిందేనని పెద్దలు చెప్పటంతో ఓ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రాంకిష్టాయపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు మహేష్(22) గొర్రెల కాపరిగా జీవితం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా కరీంనగర్ జిల్లాలో జీవాలు మేపుకుంటున్నాడు. కాగా కుటుంబసభ్యుల సూచన మేరకు పెళ్లి సంబంధాలు చూసేందుకు ఇటీవలే స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే మహేష్ పేరుతో ఒక ఏడాది వరకు మంచి ముహూర్తం లేదని పెద్దలు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని ఆత్రుత పడిన మహేష్ ఈ విషయం తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని పొలంలో ఉన్న పశువుల పాకలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
యువకుడి దారుణ హత్య
ఆదిలాబాద్ : గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని రాళ్లతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురజాల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లగురజాల గ్రామానికి చెందిన గంగారాం అనే యువకుడిని నడిరోడ్డు మీదే కొంత మంది దుండగులు రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. -
బైక్ పై నుంచి పడి యువకుడు మృతి
నిజామాబాద్: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం గుర్గుల్ గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. పోసానిపేట గ్రామానికి చెందిన పిట్ల రాజు(22) అనే యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గర్గుల్ గ్రామ సమీపానికి చేరుకొగానే బైక్ అదుపుతప్పి కిందపడింది. దీంతో రాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుని దారుణ హత్య
నల్లగొండ: నల్లగొండ జిల్లా చింతపల్లిలో సోమవారం రాత్రి ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన పోలె వెంకటయ్య, రమణమ్మ కుమారుడు ప్రవీణ్(19) స్థానికంగా కూలి పనులు చేస్తుంటాడు. మంగళవారం ఉదయం అతడు కనిపించకపోవటంతో స్థానికులు వచ్చి చూడగా ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యులంతా హైదరాబాద్ వెళ్లిపోగా సోమవారం రాత్రి తన ఇంట్లోనే ప్రవీణ్ స్నేహితులతో కలసి విందు చేసుకున్నట్లు సమాచారం. -
జాబ్ రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి
హైదరాబాద్: హయత్‌నగర్ పరిధిలోని బాటసింగారం మౌంట్ ఓపెరా సమీపంలో తూర్పుగోదావరిజిల్లాకి చెందిన రోహిత్ కుమార్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ రాకపోవటంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
యువకుడి దారుణ హత్య
నిజామాబాద్ : గుర్తుతెలియని దుండగులు ఒక యువకుడిని బండతో తలపై కొట్టి దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన గురవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని సాయినగర్ కాలనీలో వెలుగు చూసింది. వివరాలు.. కాలనీలో ఒక యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉద్యోగం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
పెద్దపల్లి (కరీంనగర్ జిల్లా): ప్రభుత్వ కళాశాలలో బాత్రూంలు శుభ్రం చేసే యువకుడు తనను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని కోరుతూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. పెద్దపల్లిలోని ప్రభుత్వ కళాశాలలో బబ్లూ(25) అనే యువకుడు బాత్రూంలు శుభ్రం చేసే పని చేస్తున్నాడు. ఇదే పనిని గతంలో తన తాత, తండ్రి కూడా చేశారు. మూడు తరాలుగా మేం ఈ పని చేస్తున్నామని, నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని బబ్లూ కోరుతున్నాడు. ఇందుకోసం అతను ఒంటిపై కిరోసిన్ పోసుకుని మండల కేంద్రంలోని వాటర్‌ట్యాంక్ ఎక్కాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బబ్లూతో చర్చలు జరిపారు. -
గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య
హైదరాబాద్(బొల్లారం): బొల్లారంలోని జనప్రియ అపార్ట్మెంటు వద్ద రైల్వే బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం రైల్వే బ్రిడ్జి సమీపంలోని చెట్ల పొదలలో శుక్రవారం శవాన్ని చూసిన స్థానికులు బొల్లారం పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ జాగిలాలు సంఘటనా స్థలం నుంచిగ్ నేరుగా మచ్చ బొల్లారంలోని శృతి వైన్స్ వెనుక భాగంలోగల సిట్టింగ్ రూం వద్దకు వెళ్లాయి. సిట్టంగ్ రూంలో గల సిసి కెమరా పుటేజ్ ఆదారంగా మృతుని వివరాలు సేకరించెందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముఖం బాగంతోపాటు అక్కడక్కడ గాయలుండడంతో హత్యగా నిర్దరణకు వచ్చినట్లు తెలిపారు. అయితే తాగి వచ్చిన తర్వాత హత్య జరిగిందా లేదా హత్య అనంతరం వైన్స్ కు వెళ్ళారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
ధోబి ఘాట్‌లో పడి యువకుడి మృతి
హైదరాబాద్: ధోబిఘాట్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్‌నుమా ఫారూక్నగర్లోని ధోబి ఘాట్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ యువకుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు దానమ్మ జోఫ్డి ప్రాంతంలో తిరిగే నదీం (19) అని కొందరు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
యువకుడిపై దాడి: 2.50 లక్షలతో పరారీ
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగింది. దుండగులు ఓ యువకుడిని కొట్టి అతని నుంచి రూ.2.50 లక్షలు ఎత్తుకుపోయారు. సూళ్లూరుపేటకు చెందిన సిద్దిఖి అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై పట్టణం వైపు వస్తుండగా దారి కాచిన దుండగులు అటకాయించారు. ప్రతిఘటించిన సిద్దిఖిని విచక్షణారహితంగా కొట్టి, అతని వద్ద ఉన్న రూ.2.50 లక్షల నగదును లాక్కుని పరారయ్యారు. -
గోదావరిలో మృతదేహం
బాసర(ఆదిలాబాద్): గోదావరిలో ఓ యువకుడి మృతదేహం ఆదివారం సాయంత్రం కనిపించింది. వివరాలు... మృతుడిని నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోల్కప్పుల గ్రామానికి చెందిన బి.రాజేశ్వర్(29)గా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
సెల్‌ఫోన్ అడిగినందుకు హత్య
- వెదిరలో బాలుడి కిరాతకం - హతుడు బీహార్‌కు చెందిన కూలీ వెదిర(రామడుగు) : తీసుకున్న సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి ఓ యువకుడిని దారుణంగా చంపాడో బాలుడు. స్థానికుడిననే గర్వంతో బీహార్‌కు చెందిన వలస కూలీని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. గురువారం మండలంలోని వెదిరకు చెందిన బాలుడు(17) బీహార్‌కు చెందిన అమర్నాథ్(23)ను మారుకత్తితో నరికి చంపాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్ర కారం.. బీహార్‌కు చెందిన అమర్నాథ్ కొద్దిరోజులుగా వె దిరలో రాళ్లబండి నాగరాజురెడ్డికి చెందిన డెయిరీలో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. ఈ క్రమంలో డెయిరీ సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న బాలుడితో ఆయనకు స్నేహం కుదిరింది. పనుల్లో ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. నాలుగు రోజుల క్రితం ఆ బాలుడు అమర్నాథ్కు చెందిన సెల్‌ఫోన్ తీసుకున్నాడు. వెంటనే ఇస్తానని తన వద్దే ఉంచుకుంటున్నాడు. గురువారం వ్యవసాయ బావి వద్దకు వచ్చిన బాలుడిని అమర్నాథ్ తన బంధువులతో మాట్లాడాలని, తన సెల్‌ఫోన్ ఇవ్వాలని అడిగాడు. ఇందుకు ఆయన నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఒకరినొకరు తోసేసుకున్నారు. తన సెల్‌ఫోన్ లాక్కున్న అమర్నాథ్ గొడవ విషయాన్ని తన యజమాని నాగరాజురెడ్డికి ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో ఆగ్రహం చెందిన బాలుడు అక్కడున్న మారుకత్తి తీసుకుని అమర్నాథ్పై దాడి చేశాడు. దీంతో అతడు భయంతో పారిపోతుండగా వెంటాడి కింద పడేసి గొంతు కోసి చంపాడు. సమీప పంట పొలాల్లో పనిచేసుకుంటున్న కొందరు రైతులకు కేకలు వినిపించడంతో అటువైపు వచ్చారు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న అమర్నాథ్ను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కత్తితో పారిపోతున్న బాలుడిని వెంబడించి పట్టుకున్నారు. అంతలోనే అమర్నాథ్ మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో చొప్పదండి సీఐ సత్యనారాయణ, రామడుగు ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పదేళ్ల బాలికపై లైంగిక దాడి
యానాం టౌన్ : కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పదేళ్ల బాలికపై 25 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్పీ దాట్ల వంశీధరరెడ్డి కథనం ప్రకారం... యానాంలో ఆదివారం మధ్యాహ్నం వినాయక చవితి పందిరి వద్ద ఉన్న బాలికను.. ఎలిపే రాజేష్ అనే యువకుడు గేమ్స్ ఆడడానికి సెల్‌ఫోన్ ఇస్తానని తన ఇంటికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని తల్లికి ఆ బాలిక చెప్పగా.. ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రైవేటు బస్సులో రూ.20 లక్షలతో పట్టుబడ్డ యువకుడు
కోయంబత్తూర్: ఓయువకుడు బస్సులో భారీ మొత్తంలో కరెన్సీని తీసుకువెళ్తూ పట్టుబడిన ఘటన కోయంబత్తూర్ లో సోమవారం చోటు చేసుకుంది. అనుమానస్పదంగా ఓ సిటీ బస్సు ఎక్కిన రాజస్థాన్ కు చెందిన వికాస్ అనే యువకుడ్ని పోలీసులు సోదా చేయగా రూ.20 లక్షలు బయటపడ్డాయి. తొలుత అతని బ్యాగ్ లో లభించిన రూ.15లక్షల భారీ మొత్తాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. అనంతరం ఆ యువకుడు డ్రెస్ లోపలి భాగంలో కూడా తనిఖీ చేయగా మరో రూ.5లక్షలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో బంగారు ఆభరణాలను అమ్మగా వచ్చిన కరెన్సీ తాను తీసుకువెళుతున్నట్లు ఆయువకుడు పోలీసులకు తెలిపాడు. -
గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
-
కత్తితో గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
సికింద్రాబాద్: నగరంలోని తుకారాం గేట్ వద్ద ఓ యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. ఆ యువకుడు ఒక్కసారిగా తన వద్ద నున్న కత్తి తీసుకుని గొంతుకోసుకున్నాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు అతన్నిపట్టుకుని 108కి సమాచారం అందించారు. కాగా అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బందిపై కూడా అతను కత్తితో దాడికి పూనుకున్నాడు. దీంతో వారు చేసేది లేక పోలీసుల సాయంతో యువకుడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని వివరాలు మాత్రం ఇప్పటి వరకూ తెలియరాలేదు. అతను ఒక మానసిక రోగి కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కేసీఆర్‌ను ఫోన్లో బెదిరించిన విద్యార్థి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావును హతమారుస్తామంటూ ఈ నెల 6న ఫోన్ ద్వారా హెచ్చరించిన యువకుడ్ని ఇక్కడి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెంగళూరులో తన పెద్దమ్మ వద్ద ఉంటూ ఇంటర్ చదువుతున్న యువకుని(మైనర్) స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి పట్టణం. ఈ నెల 6న తన మొబైల్ నుంచి కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవరావుకు ఫోన్‌చేసి కేసీఆర్‌ను హత్య చేస్తామని బెదిరించాడు. కేసీఆర్‌ను చంపుతామంటూ ఈ నెల 12న లేఖ కూడా రాశాడు. దీనిపై విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు ఫోన్‌నంబర్ ఆధారంగా యువకుడిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఆవేశంలోనే కేసీఆర్‌కు లేఖ రాశాడు కావలి, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యత కోసం ఆవేశపడే తమ కుమారుడు కేసీఆర్‌కు బెదిరింపు లేఖ పంపాడని, దీంతో కష్టాలు ఎదుర్కోవలసి వస్తోందని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడైన తమ కుమారుడు అలా ప్రవర్తించడం.. పోలీసులు అరెస్టు చేయడంతో వారు కుంగిపోతున్నారు. ఉద్యమంలో పోరాడుతున్న వారు బాసటగా నిలిచి తమ కుమారుడిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయపడాలని కోరుతున్నారు.