వెంకటేష్ (ఫైల్)
కోదాడ: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన యువకుడు కారులో సజీవ దహనమయ్యాడు. కోదాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బడుగుల సైదులు పెద్ద కుమారుడు వెంకటేష్(26) సీఏ పూర్తి చేశాడు. పది రోజుల్లో ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే పని నిమిత్తం శనివారం కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు.
రాత్రి 11గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు మంటల్లో చిక్కుకోవడంతో వెంకటేష్ సజీవ దహనమయ్యాడు. కారు ఎలా మంటల్లో చిక్కుకుందో అర్థం కావడం లేదని వెంకటేష్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదిబట్ల పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ మృతికి ఈవీరెడ్డి కళా శాల కరస్పాండెంట్ గింజల రమణారెడ్డి, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ అధ్యాపకుల అసోసియేషన్ ప్రగాఢ సానుభూతి తెలియచేసింది.
Comments
Please login to add a commentAdd a comment