Nalgonda District News
-
రుణమాఫీ.. కాదాయే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తన పంట రుణం రూ.3 లక్షలకు ఉందని.. ప్రభుత్వం తన రుణాన్ని మాఫీ చేయలేదని, రుణమాఫీ చేయించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని శాలిగౌరారం మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన రైతు తోట యాదగిరి శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ మెట్ల వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించి సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి, జిల్లాకలెక్టర్ ద్వారా తన రుణాన్ని మాఫీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. పైగా తమకు ఎలాంటి ఫించన్ రాలేదని, ధాన్యం బోనస్ కూడా రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆవేదన రైతు తోట యాదగిరి ఒక్కరిదే కాదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న దాదాపు లక్ష మంది రైతులదీ అదే పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీని ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. వివిధ కారణాలతో రూ.లక్షలోపు రుణమాఫీ కాని రైతులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 35 వేల మంది వరకు ఉండగా, రూ.2 లక్షలు, ఆపై రుణాలు కలిగిన రైతులు దాదాపు లక్ష మంది వరకు ఉన్నారు. వారందరికి సంబంధించిన రుణాలేవీ ఇంతవరకు మాఫీ కాలేదు. నల్లగొండలోనే అత్యధికం ● ఉమ్మడి జిల్లాలో చూస్తే రుణమాఫీ కాని రైతులు నల్లగొండలోనే అత్యధికంగా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 2024 జూలై 18వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నాలుగు విడతల్లో 2,33,981 మంది రైతులకు సంబంధించిన రూ.2,004 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. అయితే అందులోనూ డాటా నాట్ ఫౌండ్, బ్యాంకుల నుంచి వివరాలు వ్యవసాయ శాఖకు అందక, బ్యాంకుల పేరు మార్పు వంటి కారణాలతో జిల్లాలో రుణమాఫీ కానీ వారు 15 వేల వరకు ఉండొచ్చని ఒక అంచనా. ఇక రూ.2 లక్షలకు పైగా రుణాలు కలిగిన రైతులు మరో 50 వేల మంది వరకు ఉన్నట్లు తెలిసింది. ● సూర్యాపేట జిల్లాలో నాలుగు విడతల్లో 1,10,359 మంది రైతులకు సంబంధించిన రూ.906.07 కోట్లు మాఫీ అయ్యాయి. వివిధ కారణాలతో మరో 14,599 మంది రైతులకు సంబంధించిన రూ.2 లక్షలలోపు రుణాల మాఫీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు 2 లక్షలకు పైబడి రుణాలు ఉన్న రైతులు 30 వేల మంది ఉన్నట్లు అంచనా. ● యాదాద్రి జిల్లాలో రూ.2 లక్షలలోపు రుణాల మాఫీ కోసం దాదాపు 20 వేల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. డాటా నాట్ ఫౌండ్ పేరుతో రుణమాఫీ కాని వారు కూడా ఐదారు వేల మంది ఉండొచ్చని అంచనా. డాటా నాట్ ఫౌండ్, తదితర కారణాలతో.. డీసీసీబీలో రుణాలు తీసుకున్న కొందరు రైతుల వివరాలు వ్యవసాయ శాఖకు అందలేదు. దీంతో వారికి రుణాలు మాఫీ కాలేదు. దానికి తోడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు చెందిన కొన్ని బ్రాంచీల్లో రుణాలు తీసుకున్న వారి డాటా ఇప్పటికీ నాట్ ఫౌండ్ కిందే ఉంది. దీంతో ఆ రైతులకు సంబంధించిన రూ.లక్షలోపు రుణమాఫీ కూడా కాలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఇటీవల తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారడంతోనూ కొంతమంది రుణమాఫీ పెండింగ్‌లో పడిపోయింది. ఇలా పలు రకాల కారణాలతో రుణాలు మాఫీ కాని రైతులు ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. డాటా నాట్ ఫౌండ్, బ్యాంకు పేరు మార్పుతో పెండింగ్‌లో పడిన వారే కాకుండా రూ.2 లక్షలకు పైగా రుణాలకు సంబంధించిన తదుపరి కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించలేదు. ఫ రూ.2 లక్షల వ్యవసాయ రుణ మాఫీ కోసం రైతుల ఎదురుచూపు ఫ వివిధ కారణాలతో ఉమ్మడి జిల్లాలో సుమారు లక్షమంది రైతులకు అందని మాఫీ ఫ ప్రభుత్వం నుంచి వెలువడని ప్రకటన.. ఆందోళనలో రైతులు ఫ హైదరాబాద్‌లోని గాంధీభవన్ మెట్లపై కూర్చొని శాలిగౌరారం రైతు నిరసన టీజీబీ రుణాలు మాఫీ కావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ).. తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారింది. దీంతో సాంకేతిక సమస్య వచ్చింది. ఆ బ్యాంకులో రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ కావాల్సి ఉంది. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. – శ్రావణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
బాలల హక్కులను పరిరక్షించాలి
రామగిరి(నల్లగొండ ): బాలల హక్కులను పరిరక్షించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టులో బాలల హక్కులపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదన్నారు. పనిలో నియమించుకునే వారిపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖ అధికారులు చట్టాలను వినియోగించాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.దీప్తి మాట్లాడుతూ పారా లీగల్ వలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలకు ఈ వర్కషాప్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జడ్జిలు సంపూర్ణ ఆనంద్, రోజారమణి, దుర్గాప్రసాద్, కవిత, కులకర్ణి, సౌందర్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వెంకట్‌రెడ్డి, గిరి లింగయ్య, డిఫెన్స్ న్యాయవాదులు నిమ్మల భీమార్జున్‌రెడ్డి, మిర్యాల లెనిన్‌బాబు, ప్రసాద్, రమణరావు, న్యాయవాదులు వెంకట్‌రెడ్డి, బ్రహ్మచారి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు -
గత ఎమ్మెల్సీలు టీచర్లను విస్మరించారు
నల్లగొండ : గతంలో పనిచేసిన ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వాన్ని ఒప్పించి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో ప్రముఖ పాత్ర పోషించానని.. తానే అసలైన వామపక్షవాదినని పేర్కొన్నారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ ఎమ్మెల్సీ అధికార పార్టీలో చేరి ప్రభుత్వం ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. వామపక్ష బావజాలం పేరుతో వచ్చిన ఎమ్మెల్సీ ప్రశ్నించే గొంతుకనని చెప్పి.. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీఓను సమర్థించారని విమర్శించారు. నియోజకవర్గానికి మూడుసార్లు ఎన్నికలు జరిగితే ప్రధాన సంఘాల వారే గెలిచారని ఆ నాయకులు ప్రస్తుతం అటుఇటు మారి పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్సీలు ఏం చేశారో ఉపాధ్యాయులు గమనించాలన్నారు. గత ఎన్నికలప్పుడు చేసిన వాగ్ధానాలే ప్రస్తుతం చేస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాను పనిచేస్తున్నారని చెప్పారు. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాడి 18కిపైగా పోలీసు కేసుల అనుభవిస్తున్నానని.. ఉద్యోగం, పెన్షన్ లేకున్నా ఉద్యమిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సీపీఎస్ రద్దు, 317 పరిష్కారం, ఉమ్మడి సర్వీస్ రూల్స్, హెల్త్‌కార్డులు, పెండింగ్ డీఏలు, మంచి పీఆర్సీ సాధనే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆలోచించి ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో శంకర్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించాలి
నల్లగొండ : హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఆహార భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రెస్టారెంట్లు, హోటళ్లు, బడ్డీ కోట్లు, తోపుడు బండ్లు వద్ద వాడిన నూనెలను తిరిగి వాడడం, కాలపరిమితి ముగిసిన సరుకుల వాడకం వంటివి జరకుండా చూడాలన్నారు. అలా చేసే హోటళ్లను సీజ్ చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో కేజీబీవీలు, అంగన్వాడీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యార్థులు, పేషెంట్లకు భోజనం సరఫరా అవుతుందని.. అక్కడ కూడా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాలను వినియోగించినందుకు ఇప్పటివరకు జిల్లాలో 16 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో జిల్లా అధికారి స్వాతి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, డీఏఓ శ్రవణ్‌కుమార్, డీఈఓ భిక్షపతి, ఎస్బీ డీఎస్పీ రమేష్, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
‘భగీరథ’ కార్మికులకు వేతన వెతలు
ఏడు నెలలుగా అందని జీతాలు ప్రతినెలా వేతనాలు ఇప్పించాలి నెలల తరబడి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం. మాకు నెలకు రూ.10 పదివేల నుంచి రూ.12,500 వరకే వేతనాలు ఇస్తున్నారు. అవికూడా ప్రతి నెలా రావడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రతినెలా వచ్చే విధంగా చూడాలి. – బత్తుల వెంకటేశం, మిషన్ భగీరథ కార్మికుడు నల్లగొండ: మిషన్ భగీరథ పథకంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనాలు అండడం లేదు. సదరు కాంట్రాక్టర్లు ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో అందులో పనిచేస్తున్న లైన్మెన్లు, ఫిట్టర్లు, ఆపరేటర్లు తమ కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1240 మంది కార్మికులు మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సిబ్బంది నియామకం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసింది. నదీజలాలను శుద్ధిచేసి ఇంటింటికీ తాగునీరు అందించడం వల్ల ఫ్లోరోసిస్ సమస్య లేకుండా చేయాలని అప్పటి ప్రభుత్వం ఉద్దేశం. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నీటిని శుద్ధిచేసేందుకు మిషన్ భగీరథ పథకం కింద ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇందులో పనిచేసే సిబ్బంది నియామకానికి మేగా, జీవీపీఆర్, రాఘవ, మల్లారెడ్డి ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థల పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1240 మంది వరకు లైన్మెన్లు, ఫిట్టర్లు, ఆపరేటర్లు పనులు చేయిస్తున్నారు. వీరికి ప్రతినెలా వేతనాలు అందించాల్సి ఉండగా ఆయా సంస్థలు ఇష్టారీతిగా చెల్లిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నెలల తరబడి వేతనాల్లేక.. మిషన్ భగీరథలో ప్రజలకు తాగునీరు అందించే కార్మికులకు కాంట్రాక్టర్లు నెలల తరబడిగా వేతనాలు ఇవ్వడం లేదు. ఇందులో జీవీపీఆర్ కంపెనీ ఐదు నెలలుగా కార్మికుల వేతనాలు ఇవ్వడం లేదు. మేగా కంపెనీ మాత్రమే ప్రతినెలా వేతనాలు ఇస్తోంది. రాఘవ కంపెనీ మూడు నెలలుగా బకాయి ఉంది. మల్లారెడ్డి ఏజెన్సీ మాత్రం ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని తెలిసింది. గతంలో సీమోనా కన్స్ట్రక్షన్ ఏజెన్సీ కింద పనిచేసేవారిమని, అప్పట్లో ప్రతినెలా వేతనాలు అందేవని కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ కంపెనీ స్థానంలో వచ్చిన మల్లారెడ్డి ఏజెన్సీ మాత్రం ఏడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వేతనాల విషయమై కాంట్రాక్టర్లను అడిగినా పట్టించుకోవడం లేదని, దీంతో ఒకపక్క పిల్లల చదువులు, మరో పక్క కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వేతనాలు ఇప్పించాలంటూ కార్మికులు మిషన్ భగీరథ ఎస్ఈ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదంటున్నారు. ఇచ్చేదే అతి తక్కువ వేతనాలని, వాటిని కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టకుండా ప్రతినెలా ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. ఫ ప్రతినెలా చెల్లించని కాంట్రాక్టర్లు ఫ అప్పుల పాలై ఆందోళన చెందుతున్న కార్మికులు -
27న జాతీయ సైన్స్ పోటీలు
నల్లగొండ : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి భవన్లో పోటీలు జరుగుతున్నట్లు డీఈఓ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 23వ తేదీలోగా rb.nic.in/rbnilayam ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 28న రాష్ట్రపతి భవన్లో బహుమతులు అందజేస్తారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి 9848578845 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
వైభవంగా తిరువీధి సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషే సంప్రోక్ష మహోత్సవంలో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మీ, నృసింహ దేవతా హవనాలు, హోమాలు, మంటప దేవతారాధన, తిరువీధి సేవ, చతుస్థానార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పంచ వింశతి కలశ స్నపనంలో భాగంగా 25 కలశాలల్లో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరకు రసం, కొబ్బరి, ఎర్ర చందనం, కుంకుమ, మారపత్రి నీరు, కదళీ, సర్వ ఔషధి, పుష్పోదకం, ఫలోదకం, గంధోదకం, హోమోదకం, రత్నోదకం, పుణ్యోదకం, సరిత్తోయం తదితర పవిత్ర జలాలను కలశాల్లో నింపి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వీటితో 23వ తేదీన స్వర్ణ విమాన గోపురానికి అభిషేకం చేయనున్నారు. అదే విధంగా మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు జరిపించి, నిత్య పూర్ణాహుతి, నివేదన, నీరాజన, మంత్ర పుష్పం, శాత్తుమరై నిర్వహించి తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం చేపట్టిన కార్యక్రమాలు సాయంత్రం 6గంటలకు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, ద్వారాది కుంభార్చన, చతుస్థానార్చనలు, మూర్తిమంత్ర హోమాలు, ధాన్యాధివాసం నిర్వహించారు. అనంతరం నిత్య పూర్ణాహుతి, నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి చేసి తిరువీధి సేవను ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీవానమామలై మఠం 31వ మధుర కవి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, రుత్వికులు, పారాయణీకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ తిరు, మాడ వీధుల్లో ఊరేగుతూ యాగశాలకు నృసింహుడు ఫ మూడవ రోజూ కొనసాగిన పంచకుండాత్మక యాగం -
నేడు డిండిలో ‘మీట్ యువర్ ఎస్పీ’
నల్లగొండ : సమస్యలను ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరించే దిశగా శనివారం ఉదయం 11 గంటలకు జిల్లాలోని డిండి పోలీస్‌స్టేషన్‌లో మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితుల ఫిర్యాదులను పోలీస్స్టేషన్లలోనే పరిశీలించి సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు వారి సమస్యలపై తనను స్వయంగా కలిసి దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు. పశుసంవర్థక శాఖ జేడీ బాధ్యతలు స్వీకరణనల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా పశువైద్య సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ జీవీ రమేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై నల్లగొండకు వచ్చారు. అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కార్యక్రమంలో ఏడీహెచ్‌లు డాక్టర్ ఖాద్రి, డాక్టర్ వెంకట్‌రెడ్డి, డాక్టర్ విశ్వేశ్వర్రావు ఉన్నారు. 12 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసునల్లగొండ : జిల్లాలోని 12 మంది మండల పంచాయతీ అధికారులకు శుక్రవారం డీపీఓ వెంకయ్య షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతున్నా.. పన్నులు ఎందుకు వసూలు చేయలేకపోయారని నోటీసులో పేర్కొన్నారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి పన్నులు వసూలు చేయించడంలో వెనుకంజలో ఉన్న కారణంగా 12 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వెంటనే పన్ను బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. ఉపకార వేతనాలకు దరఖాస్తులునల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాల మంజూరుకు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల ఉప సంచాలకుడు వి.కోటేశ్వర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ telanganaepass. cgg.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఎన్నికనల్లగొండ టౌన్ : ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీని నల్లగొండలో నిర్వహించి జిల్లా మహాసభలో ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ తెలిపారు. శుక్రవారం నిర్వహించి సమావేశంలో వారు మాట్లాడుతూ 28 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నామన్నారు. ఈ మహాసభల్లో విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ రూపొందించామన్నారు. -
నల్లగొండ
దొంగల బీభత్సం నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు, మిర్యాలగూడలో శుక్రవారం దొంగలు బీభత్సం సృష్టించారు.7ఢీకొట్టిన కంటైనర్ మిర్యాలగూడలోని నందిపాడు రోడ్డులో అతివేగంగా వెళ్తున్న కంటైనర్ వరుసగా వాహనాలను ఢీ కొట్టింది. శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025- 8లోపోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశాంనల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయిందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికలకు జంబో బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నామని తెలిపారు. నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి గోదాం వద్ద ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 518 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. వేతన సవరణ అమలు చేయాలినల్లగొండ టౌన్ : వేతన సవరణ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం నల్లగొండలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయు) జిల్లా కన్వీనర్ కత్తుల ఈశ్వర్‌కుమార్, కార్యదర్శి శ్రామిక్ మాట్లాడుతూ వేతన సవరణ అమలు చేయాలని.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు సుమన్, శ్రవణ్, ప్రవీణ్, వెంకట్రామ్, యాదయ్య, స్వాతి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. రేపే స్వర్ణ గోపురం ఆవిష్కరణ యాదగిరిగుట్ట నృషింహుడి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ఈనెల 23న సీఎం ఆవిష్కరించనున్నారు. - 8లోన్యూస్రీల్ -
తుది దశకు ‘టెన్త్ ఇంటర్నల్’ మూల్యాంకనం
ఫ 400కుపైగా స్కూళ్లలో ప్రత్యేక బృందాల పరిశీలన ఫ నేటితో పూర్తికానున్న ప్రక్రియ ఫ రేపటి నుంచి వెబ్సైట్లో మార్కుల వివరాలు నమోదు మూల్యాంకనం కొనసాగుతోంది జిల్లాలో టెన్త్ విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కుల మూల్యాంకనం కొనసాగుతోంది. ఈ ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుంది. దీని తర్వాత 22 నుంచి మార్కులను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ వెబ్సైట్లో నమోదు చేస్తాం. – భిక్షపతి, డీఈఓ, నల్లగొండ నల్లగొండ: జిల్లాలో పదవ తరగతి ఇంటర్నల్ మార్కుల మూల్యాంకన ప్రక్రియ తుది దశకు చేరింది. ఇంటర్నల్ మార్కుల కోసం ఈ నెల 17 నుంచి మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా 400కు పైగా స్కూళ్లలో మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు ఉండగా అందులో 80 మార్కులకు థియరీ పరీక్షల ద్వారా కేటాయిస్తుండగా మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించి మార్కులు కేటాయిస్తారు. జిల్లాలో మొత్తం 485 ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లు ఉండగా 18,666 మంది విద్యార్థులు టెన్త్ చదువుతున్నారు. మూల్యాంకనానికి 69 టీమ్‌లు జిల్లాలో పదవ తరగతి ఇంటర్నల్ మార్కుల పరిశీలనకు జిల్లాలో 69 మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక హెచ్‌ఎంతోపాటు సబ్జెక్టు టీచర్, బాషా పండింట్ సభ్యులుగా నియమించారు. ఒక్కో బృందం 5 నుంచి 8 స్కూళ్ల వరకు పర్యవేక్షించి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల జాబితాలు పరిశీలిస్తోంది. ఈ బృందాలు ఎఫ్ఏ (ఫార్మటివ్ అసెస్మెంట్)–1 నుంచి ఎఫ్ఏ– 4 వరకు ప్రతి పాఠ్యాంశానికి నిర్వహించిన పరీక్ష, ప్రాజెక్టు వర్క్, రీడింగ్, రైటింగ్ తదితర వాటికి ఐదు మార్కుల చొప్పున కేటాయిస్తాయి. నేటితో మూల్యాంకనం పూర్తి ఈ నెల 17న ప్రారంభమైన ఇంటర్నల్ మార్కుల మూల్యాంకన ప్రక్రియ శుక్రవారం పూర్తి కానుంది. అయితే ఇప్పటికే ఆయా పాఠశాలల క్లాస్ టీచర్ వాటిని పరిశీలించి మార్కులు కేటాయించారు. అయితే ఆయా ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా కేటాయించిన మార్కులు సరిగ్గా ఇచ్చారా లేదా అనేది బృందాలు పరిశీలిస్తున్నాయి. ఒకవేళ ఎక్కువ, తక్కువ ఉన్నా సరిచేయాలని సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత విద్యార్థులకు కేటాయించిన మార్కులను 22 నుంచి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. -
నేత్రపర్వం.. నీరాజన మంత్ర పుష్పం
యాదగిరి క్షేత్రంలో వైభవంగా మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం శ్రీస్వామి, అమ్మవారి తిరువీధి సేవోత్సవం కనుల పండువగా సాగింది. తిరువీధి సేవ యాగశాలకు ప్రవేశించిన అనంతరం ఇతిహాసాది పురాణ స్తోత్ర పారాయణాలు మూలమంత్ర హవనాలు, నిత్య పూర్ణాహుతి, నీరాజన మంత్ర పుష్పం చేపట్టారు. సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, ద్వారాది కుంభార్చన, మూర్తి మంత్ర హోమాలు, వారుణానువాక హోమం నిర్వహించారు. అనంతరం ఛాయాదివాసం, నిత్య పూర్ణాహుతి, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వేడుకలు చేపట్టి స్వామి, అమ్మవారి సేవను ప్రధానాలయంలోకి చేర్చారు. వానమామలై మఠం 31వ మధుర కవి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలి
నల్లగొండ: వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని టీజీ సీపీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నల్లగొండ పట్టణంలోని బీట్మార్కెట్లో జరుగుతున్న సబ్‌స్టేషన్ పనులను పరిశీలించారు. అనంతరం విద్యుత్ సరఫరాకు సంబంధించి వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ఫిబ్రవరి 20 నాటికి జిల్లాలో 66 సబ్ స్టేషన్లపై ఓవర్ లోడ్ ఉండేదని, ఈసారి ఒక్క సబ్‌స్టేషన్ లో కూడా ఓవర్ లోడ్ లేదన్నారు. గత ఫిబ్రవరి చివరి నాటికి జిల్లాలో 966 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఈసారి ఇప్పటికే 1000 మెగావాట్లు దాటిందని, అయినా ఎలాంటి ఓవర్ లోడ్ లేదన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్చి 15 నాటికి 1,000 మెగావాట్లపైన విద్యుత్ అవసరం ఉండే అవకాశం ఉందని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. మార్చి 31 వరకు ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని, విద్యుత్ అధికారులు అనుమతి లేకుండా కార్యస్థానాన్ని విడిచి వెళ్లొదన్నారు. నెట్వర్క్ మీద లోడ్ పెరగకుండా చూడాలని, ఎక్కడైనా బ్రేక్‌డౌన్ అయినా వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఇందుకు విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్న జిల్లా కలెక్టర్ లేదా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. బడ్జెట్‌కు ఎలాంటి సమస్య లేదని లైన్లు, ఫీడర్లు, సబ్స్టేషన్లన్నింటికీ సహకారం అందిస్తామన్నారు. పలు విషయాలను అడిగితెలుసుకున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఇదివరకే విద్యుత్ అధికారులతో సమీక్షించామన్నారు. జిల్లాకు తొమ్మిది క్విక్ రెస్పాన్స్ టీం వెహికల్స్ ఇచ్చినందుకు సీఎండీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, విద్యుత్ శాఖ డైరెక్టర్ ఎం.నరసింహ, సీఈ కమర్షియల్ భిక్షపతి, రూరల్ సీఈ బాలకృష్ణ, జిల్లా ఎస్సీ వెంకటేశ్వర్లు, జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్రమోహన్ పాల్గొన్నారు. ఫ సీపీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ -
పట్టించుకునే వారే లేరు
గ్రామంలో సమస్యలను పట్టించుకునే వారు లేకుండాపోయారు. గతంలో సర్పంచ్ ఉన్న సమయంలో వీధి లైట్లు, పారిశుద్ధ్యం సమస్యలను పరిష్కరించేవారు. ఏదైనా సమస్యను గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళితే, చిన్న పనులకు అప్పు చేసి పెడతామని, పెద్దవాటికి ఎలా అప్పు చేసి పెడతామని గ్రామ కార్యదర్శి చెబుతున్నారు. ప్రధాన రోడ్డు, సెంటర్లలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో మూల మలుపుల వద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయి. – సింగం సత్యనారాయణ, బి.అన్నారం, మిర్యాలగూడ -
24, 25 తేదీల్లో జిల్లాస్థాయి పోటీలు
నల్లగొండ టూటౌన్: ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా పరిధిలోని రెడ్ రిబ్బన్ క్లబ్ కళాశాలల్లో ఈనెల 24, 25 తేదీల్లో జిల్లా స్థాయిలో జాతీయ సేవా పథకం వలంటీర్లకు వ్యాసరచన, ఉపన్యాసం, నాటిక, పాటలు, పోస్టర్ డిజైనింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని జాతీయ సేవా పథకం మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి తెలిపారు. గురువారం ఎంజీ యూనివర్సిటీలో నిర్వహించిన జిల్లాలోని వివిధ కళాశాలల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీలకు సిద్ధం కావాలని వలంటీర్లకు సూచించారు. సమావేశంలో ఎం.వెంకట్‌రెడ్డి, సుల్తానా షేక్, మీనాక్షి, డాక్టర్ ఆనంద్, శేఖర్, బి.విరస్వామి, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సీహెచ్.రాజు, జె.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
తిప్పర్తి: విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి అన్నారు. గురువారం తిప్పర్తి మండలం కేశరాజుపల్లి ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి అనేది శరీరంలో ఏ భాగానికై నా రావచ్చన్నారు. రెండేళ్లకు ఒకసారి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులువు అవుతుందన్నారు. ఈ సదస్సుకు హాజరైన డీఎంహెచ్ఎం పుట్ల శ్రీనివాస్ ముందుగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశిలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. ఈ సదస్సులో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ మమత, ఇన్చార్జి హెచ్ఎం సులోచన, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ అప్పగించాలినల్లగొండ: పెండింగ్ సీఎంఆర్ చెల్లించని మిల్లర్లపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లోని తన చాంబర్లో సీఎంఆర్, బ్యాంకు గ్యారంటీ తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 2023–24 యాసంగికి సంబంధించి 9వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను మిల్లర్లు చెల్లించాల్సి ఉందని, మార్చి 10లోగా చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఎం హరీష్, డీసీఓ పత్యానాయక్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లురామగిరి(నల్లగొండ): దీర్ఘకాలికంగా రీచార్జ్ చేయకుండా ఇన్‌యాక్టివ్ 2, డియాక్టివ్ అయిన వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్లను వినియోగించుకోవాలని సంస్థ జనరల్ మేనేజర్ పి.వెంకటేశ్వర్లు కోరారు. గురువారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. రూ.1,199కే ఏడాది పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, నెలకు 24జీబి డేటాతో పాటు రోజుకు 100 మేసేజ్‌లు లభిస్తాయన్నారు. స్పెషల్ టాప్ ఆఫ్ ఓచర్ రూ.1,39కి 28 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో రోజుకు 1.5 జీబి డేటా లభిస్తుందన్నారు. సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్, ఆన్లైన్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చన్నారు. సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లు పరిశీలనయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 23న నిర్వహించే స్వర్ణ దివ్య విమాన గోపురం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను గురువారం డీసీపీ రాజేశ్చంద్ర పరిశీలించారు. ప్రధానాలయం, మాడ వీధులు, ఘాట్ రోడ్డు, యాగశాల ప్రాంతాలను పరిశీలించారు. భద్రతపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. -
వ్యవసాయాధికారుల పాత్ర కీలకం
త్రిపురారం: వివిధ రకాల పంటల సాగులో రైతులను చైతన్యం చేయడంలో వ్యవసాయ అధికారుల పాత్ర కీలకమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం త్రిపురారం మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులకు అధిక సాంద్రత పత్తి సాగు, వివిధ రకాల పంటల సాగు పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, చీడ పీడల నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. వరి పంట పైనే ఆధారపడకుండా పంట మార్పిడి చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు పంటల సాగులో రసాయన ఎరువులు అధికంగా వాడకుండా చూసుకోవాలన్నారు. అనంతరం కేవీకేలో గొర్రెలు, కోళ్లు, ఆవుల పెంపకం షెడ్లను పరిశీలించారు. వేరుశనగ పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ తోటల పెంచేలా అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆయిల్‌పామ్ తోటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీల గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు, డాక్టర్ లింగయ్య, డాక్టర్ రాజాగౌడ్, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. ఫ నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
పెళ్లింట విషాదం
ఫ పందిరి వేసేందుకు చెట్ల కొమ్మలు కొడుతుండగా జారిపడి వృద్ధుడు మృతిచింతపల్లి: మనవరాలి పెళ్లికి పందిరి వేసేందుకు చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం చింతపల్లి మండలం ధైర్యపురితండాలో జరిగింది. ధైర్యపురితండాకు చెందిన రామావత్ బాలయ్య(65) మనవరాలి వివాహం శుక్రవారం ఉదయం జరగనుండగా.. పందిరి వేసేందుకు గురువారం బాలయ్య తమ పొలానికి సమీపంలో చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. జాతరకు వెళ్లొస్తుండగా..ఫ అదుపుతప్పి వాగులో పడిన బైక్ ఫ ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలుసూర్యాపేటటౌన్: పెద్దగట్టు జాతరకు వెళ్లొస్తుండగా.. బైక్ అదుపుతప్పి వాగులో పడిపోవడంతో ఒకరి మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. సూర్యాపేట మండలం కాసరబాద్ గ్రామానికి చెందిన సుధీర్(21), సంపత్ బైక్‌పై దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో సూర్యాపేట మండలం కేసారం సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట వాగులో పడింది. ఈ ప్రమాదంలో సుధీర్ అక్కడిక్కడే మృతిచెందగా, సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సంపత్‌ను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి
నల్లగొండ: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిరంతరం నిఘా, తనిఖీలు తీవ్రతరం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మైనింగ్, ఇరిగేషన్, పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లలో అనుమతించిన వాహనాలు, అనుమతించిన వారికి మాత్రమే ఇసుకను తీసుకువెళ్లే అధికారం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమించి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద నైట్ విజన్ కెమెరాలతో పాటు, హైరిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన ఇసుక రీచుల వద్ద డ్రోన్ సర్వే సైతం చేయిస్తామన్నారు. పరిమితికి మించి ఇసుకను తవ్వించినా చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 24 రీచ్‌లలో ఇసుకను తీసేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని, వాటిని బలోపేతం చేస్తామన్నారు. నది లోతట్టు ప్రాంతాల్లో ఇసుక తవ్వడానికి వీలులేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా 31 గ్రామాలకు ఇసుకు రవాణాకు అనుమతులు ఇచ్చామని, ఆయా ఇళ్లకే ఇసుకను మంజూరు చేయాలన్నారు. అనుమతించిన ఇసుక రీచ్‌ల వద్ద, ముఖ్యంగా లోడింగ్ పాయింట్ల వద్ద సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తవ్వేందుకు అనుమతి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఎవరైనా లోడింగ్ పాయింట్ల వద్ద ఇసుకను తవ్వితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు నాలుగు నెలల క్రితమే జాయింట్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో దేవరకొండ ఏసీపీ మౌనిక, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా మైన్స్ శాఖ సహాయ సంచాలకుడు జాకబ్, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రావొద్దు అనంతరం తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వేసవి కార్యాచరణ ప్రణాళికపై జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి పైపులు, నల్లాలు తదితర అత్యవసర మరమ్మతులు ఉంటే గ్రామ పంచాయతీ నిధులతో చేయించాలన్నారు. అవసరమున్న గ్రామాల్లో రైతులు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని ప్రజలకు నీరందించాలన్నారు. రానున్న 150 రోజులకు ప్రణాళిక రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ మాట్లాడుతూ తాగునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ వంశీకృష్ణ, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు పాల్గొన్నారు. ఫ నిరంతర నిఘా, తనిఖీలు పెంచాలి ఫ అధికారులను ఆదేశించి -
వెళ్లొస్తాం..లింగమయ్యా
విజయవంతంగా ముగిసిన జాతర భానుపురి (సూర్యాపేట) : ఐదు రోజుల పాటు ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో మార్మోగిన పెద్దగట్టు జాతర గురువారంతో విజయవంతంగా ముగిసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటించారు. శ్రీలింగమంతులస్వామి జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా అధికారులు, ఆలయ పాలకవర్గం సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేశారని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంగా పని చేశాయని, పోలీసు శాఖ అత్యాధునిక సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణను విజయవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పర్యాటక ప్రదేశాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకున్నాయని తెలిపారు. సూర్యాపేట/ చివ్వెంల: ఐదు రోజుల పాటు సాగిన పెద్దగట్టు జాతర గురువారం మకరతోరణాన్ని సూర్యాపేటకు తరలించడంతో ముగిసింది. ప్రతి రెండేళ్లకొకసారి వచ్చే చివ్వెంల మండలం దురాజ్‌పల్లి శ్రీ లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర ఈనెల 16న ప్రారంభమై 20వ తేదీ వరకు వైభవంగా సాగింది. లక్షలాది మంది భక్తులు లింగమయ్యను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తులు, జోగినుల నృత్యాలు, డోలు చప్పుళ్లు, కటారు విన్యాసాలు, బైకాన్ల కథలు, ఓలింగ నామస్మరణతో సంప్రదాయ పద్ధతిలో జాతర నిర్వహించారు. మకర తోరణం ప్రత్యేకత జాతర ప్రారంభానికి ముందు శ్రీ లింగమంతుల స్వామి అలంకరణ కోసం సూర్యాపేట నుంచి కోడి, వల్లపు వంశస్తులు తెచ్చారు. ఈ తోరణాన్ని తిరిగి ఊరేగింపుగా సూర్యాపేటకు తరలించారు. అదేవిధంగా లింగమంతుల స్వామి గుడిపైన ఉంచిన పసిడి కుండను దురాజ్‌పల్లి ఆవాసం ఖాసీంపేటకు చెందిన అలిశెట్టి వంశస్తులు జాతరకు ముందు తీసుకువచ్చి జాతర ముగియడంతో గురువారం తీసుకువెళ్లారు. హుండీ ఆదాయం లెక్కింపు చివ్వెంల(సూర్యాపేట): దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, కానుకలను గురువారం లెక్కించారు. 2023లో జరిగిన జాతరలో రూ.27,71,294 ఆదాయం రాగా.. ప్రస్తుతం రూ.31,29,686 వచ్చినట్లు ఆలయ ఈఓ కుశలయ్య తెలిపారు. గతంలో కంటే రూ.5.58 లక్షలు పెరిగినట్లు పేర్కొన్నారు. అదే విధంగా 425 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, తహసీల్దార్ కృష్ణయ్య, దేవాదాయ శాఖ పరిశీలకురాలు సుమతి, ఈఓ కుశలయ్య, డైరెక్టర్లు వీరబోయిన సైదులు, కుర్ర సైదులు, మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్న మల్లయ్య, పోలెబోయిన నరేష్, సిరపంగి సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఫ ముగిసిన పెద్దగట్టు జాతర ఫ వైభవంగా మకరతోరణం తరలింపు -
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా రోడ్లపైనే బురదనీరు పారుతోంది. దీంతో దోమల బెడద పెరిగి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వీధి ధీపాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో బల్బులు వేయించే పరిస్థితి లేక చీకట్లోనే మగ్గాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని 868 పంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసిపోయింది. అప్పటివరకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధి కారుల పాలనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే అప్పటి నుంచి గ్రా మాల్లో పాలన పడకేసింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సమస్యలు తిష్ట వేశాయి. దీనికి తోడు నిధుల లేమితో అభివృద్ధి పనులు కొనసాగక ప్రజలు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. అక్కడక్కడా కార్యదర్శులు అప్పు చేసి పనులు చేయిస్తున్నా.. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో పరిస్థితి అధ్వానంగా మారడంతో గ్రామ కార్యదర్శులు అప్పులు చేసి పనులను చేయిస్తున్నారు. అయితే గతంలో కార్యదర్శులు చేయించిన పనులకు సంబంధించిన డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో కార్యదర్శి రూ.లక్ష వరకు అప్పు చేసి పనులను చేపట్టినా ఆ డబ్బులు ఇంతవరకు రాలేదని వాపోతున్నారు. వీధిలైట్లు, బోర్లు కాలిపోవడం, ట్రాక్టర్ల మరమ్మతులు, డీజిల్ ఖర్చులు అన్నీ భరించాల్సి వచ్చిందని, ఆ డబ్బులే ఇంకా రానప్పుడు ఎలా పనులు చేయిస్తామని ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యేక అధికారులు అప్పుడప్పుడు వచ్చిపోతూ, సరిగ్గా పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పేరుకుపోతున్న సమస్యలు ● నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. వీధిలైట్లను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అన్నారం గ్రామం నుంచి గద్దగూడుతండాకు వెళ్లే రోడ్డు కంపచెట్లతో నిండిపోయింది. వాటిని తొలగించేందుకు నిధుల్లేవని సిబ్బంది పేర్కొంటున్నారు. గ్రామానికి ప్రత్యేక అధికారి ఉన్నా ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ● అడవిదేవులపల్లిలో మురుగు కాలువల్లో పూడిక తీయించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రత్యేక అధికారిని నియమించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ● త్రిపురారం, కొండమల్లేపల్లి, గుర్రంపోడు మండలాల్లోని పలు గ్రామాలను ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల గ్రామాలకే రావడం లేదు. సర్వేల పేరుతో పట్టించుకోవడం మానేశారు. మురుగు కాలువలు శుభ్రం చేయించడం, వీధి దీపాల నిర్వహణను పట్టించుకోవడం లేదు. వీదుల్లో చెత్తా చెదారం పేరుకు పోయి దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నాయి. ఎవరికి చెప్పుకోవాలే అర్థం కావడం లేదని వాపోతున్నారు. పల్లెల్లో పడకేసిన ‘ప్రత్యేక’ పాలన ఫ అందుబాటులో ఉండని అధికారులు ఫ రోడ్లపైనే పారుతున్న మురుగు నీరు ఫ ఏడాది కాలంగా ప్రజలకు తప్పని ఇబ్బందులు -
స్వర్ణగిరిలో ఘనంగా ధ్వజారోహణం
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు గురువారం ఉదయం వైనతేయహవనం, ధ్వజారో హణం, అగ్నిప్రతిష్ట, మూర్తి కుంభారాధన, పల్లకీ సేవ, చిన్న శేషవాహనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం దేవతాహ్వనం, పెద్ద శేషవాహనసేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో త్రిదండి అహోబిలం రామానుజ జీయర్‌స్వామి, శ్రీరంగం ఆలయ ప్రథమ ఆచార్యులు శ్రీ పరశరలక్ష్మీ నృసింహ భట్టర్ స్వామి పాల్గొన్నారు. శ్రీరంగం నుంచి తెచ్చిన శేష వస్త్రం, మాల అభయహస్తంను ఆలయ వ్యవస్థాపకుడు మానేపల్లి రామారావుకు అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థపక ధర్మకర్తలు మానేపల్లి మురళీకృష్ణ, గోపికృష్ణ, ప్రధాన అర్చకుడు శ్రవణ్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు. -
పొలాల్లో గురుకుల విద్యార్థుల స్నానాలు
చిలుకూరు: చిలుకూరు మండలం నారాయణపురం గుట్టలో గల అక్షర పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో నీటి వసతి సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల చుట్టుపక్కల పొలాల్లోని బావులు, బోర్ల వద్దకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. ఈ గురుకుల పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉండగా.. గత వారం రోజులుగా 300 మందికి పైగా విద్యార్థులు చుట్టుపక్కల రైతుల పొలాల వద్దకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. ఇది గమనించిన రైతులు బావుల వద్ద గల విద్యుత్ మోటార్ల ఫ్యూజులు దాచుకొని వెళ్లినప్పటికీ, విద్యార్థులు స్వయంగా ఫ్యూజులు పెట్టుకొని మోటార్లు ఆన్ చేసుకుని స్నానాలు చేస్తున్నారు. తమ పొలాల వద్ద స్నానాలు చేయొద్దని చెప్పినా విద్యార్థులు వినకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని విద్యార్థులను కర్రలతో వెంబడించడంతో పరారైనట్లు రైతులు తెలిపారు. ఈ విషయాన్ని గురుకుల పాఠశాల సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానాలు చేసే క్రమంలో విద్యార్థులు వరి పొలాలు మొత్తం తొక్కుతున్నారని, పొలాల్లోనే మూత్రవిసర్జన చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు బూర లక్ష్మీనారాయణ, కొండా సైదయ్య, కోటిరెడ్డి, బూర మల్లయ్య పేర్కొన్నారు. ఫ గురుకుల పాఠశాలలో నీటి వసతి సక్రమంగా లేకపోవడంతో బావుల వద్దకు వెళ్తున్న విద్యార్థులు -
భవిష్యత్ తరాలకు ఆరి్థక ఫలాలు అందించాలి
రామగిరి(నల్లగొండ): భవిష్యత్ తరాలకు మంచి ఆర్థిక ఫలాలు అందించాలని కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కె. శివ చితప్ప అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న నేషనల్ సెమినార్ గురువారం ముగిసింది. ఈ ముగింపుకు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారు. కొల్లాపూర్ శివాజీ విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ కాంబ్లీ మాట్లాడుతూ.. మానవాభివృద్ధికి ఆర్థిక ఫలాలు దోహదపడినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రజలందరితో సమ్మిళితమై ఉండాలన్నారు. ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. నేషనల్ సెమినార్‌తో విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం పెరుగుతుందన్నారు. రెండు రోజుల పాటు జరిగిన సెమినార్‌కు దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం సెమినార్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సెమినార్ కన్వీనర్ డాక్టర్ డి. మునిస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఆదె మల్లేశం, డాక్టర్ భట్టు కిరీటం, డాక్టర్ వెల్దండి శ్రీధర్, నర్సింగు కోటయ్య, జ్యోత్స్న, బొజ్జ అనిల్, అనిల్ అబ్రహం, ఎం. సుధాకర్, జాజుల దినేష్, నాగరాజు, హష్రత్, అంకుస్, కవిత, శిరీష, సావిత్రి, శంకరయ్య, నాగరాజు, పుణ్యవతి, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
నల్లగొండ: ఇటీవల నార్కట్‌పల్లి శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవే పక్కన హోటల్ ముందు ఆగిన ట్రావెల్స్ బస్సులో నుంచి చోరీ చేసిన రూ.25 లక్షలను పోలీసులు రికవరీ చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్నో దొంగతనాలను పాల్పడిన గ్యాంగ్‌స్టర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తన కార్యాలయంలో విలేకరుల వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన బోయిన వెంకటేశ్వర్లు మౌరి టెక్ సంస్థ యాజమాని దామోదర్‌డ్డికి సంబంధించిన వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన రూ.25లక్షలను తీసుకుని చైన్నె నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెవెల్స్ బస్సులో బయల్దేరాడు. నార్కట్‌పల్లి శివారులో హైవే పక్కన పూజిత హోటల్ వద్ద అల్పాహరం కోసం బస్సును డ్రైవర్ ఆపాడు. ఆ సమయంలో వెంకటేశ్వర్లు డబ్బులు ఉన్న బ్యాగును బస్సులోనే ఉంచి మూత్రవిసర్జన చేసేందుకు కిందకు దిగాడు. అతడు తిరిగి బస్సులోకి వచ్చేసరికి నగదు ఉన్న బ్యాగు కనిపించలేదు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు సీసీఎస్ బృందాలను ఏర్పాటు చేసి వారిని సమన్వయం చేస్తూ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బ్యాగు దొంగిలించిన వ్యక్తి కారులో వెళ్లినట్లు గుర్తించారు. కారులోని వ్యక్తుల ఫొటోల ఆధారంగా వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం మన్వర్ తాలుకా కేద్వా జాగీర్‌లోని రాళ్లమండల్కు చెందిన ధార్ గ్యాంగ్ లీడర్ మమ్మద్ అష్రఫ్‌ఖాన్ ముల్తానీ షేక్, లైట్ ఖాన్, అక్రం ఖాన్, మహబూబ్‌ఖాన్‌గా గుర్తించారు. దీంతో పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో నిందితుల ఇళ్లపై దాడులు చేయగా అందులో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ప్రధాన నిందితుడిగా ఉన్న మహ్మద్ అష్రఫ్ఖాన్ను పట్టుకున్నారు. అతడి ఇంట్లో బస్సులో నుంచి దొంగిలించిన నగదుతో పాటు కర్ణాటకకు చెందిన కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి ఇక్కడకు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్, సీసీఎస్ ఎస్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ నార్కట్‌పల్లిలో ప్రైవేట్ బస్సులో నుంచి దొంగిలించిన రూ.25లక్షలు రికవరీ ఫ గ్యాంగ్‌స్టర్ మమ్మద్ అష్రఫ్ ఖాన్ అరెస్ట్ ఫ రిమాండ్‌కు తరలింపు -
మెరుగైన వైద్య సేవలతోనే మంచి గుర్తింపు
ఖమ్మం వైద్యవిభాగం: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా ఆస్పత్రులకు మంచి గుర్తింపు లభిస్తుందని పలువురు వైద్యులు అన్నారు. ఖమ్మం నెహ్రూనగర్‌లోని అఖిల కంటి ఆస్పత్రి ఏడో వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించగా డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఓపీ చాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ అఖిల మాట్లాడుతూ.. నెలలు నిండకుండా జన్మించిన పిల్లల్లో రెటీనా సంబంధిత సమస్యలు ఎదురైతే వైద్యం అందించడం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ మాధవి, మేనేజింగ్ డైరెక్టర్ కుతుంబాక మధుతో పాటు డాక్టర్ సమత, శ్రీధర్, సతీష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా క్రిష్ణానాయక్మఠంపల్లి: మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాకు చెందిన హైకోర్టు అడ్వకేట్ భూక్యా క్రిష్ణానాయక్ హైకోర్టులో చేనేత వస్త్ర పరిశ్రమ సంస్థకు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రంఅందుకున్నట్లు గురువారం ఆయన పేర్కొన్నారు. కొంతకాలం సంగారెడ్డిలోని న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా కూడా ఆయన పనిచేశారు. క్రిష్ణానాయక్ను పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు అభినందించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేతసూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి జాతర సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుంచి హైదరాబాద్– విజయవాడ హైవేపై ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు. జాతర గురువారం ముగియడంతో నార్కట్‌పల్లి, కోదాడ, టేకుమట్ల, బీబీగూడెం, రాఘవపురం గ్రామ స్టేజీ వద్ద ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేసి బారికేడ్లు తొలగించారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులు యధాతథంగా వెళ్లవచ్చని సూచించారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా
ఫ ఫిర్యాదు ఇచ్చినా కేసు నమోదు చేయలేదని ఆరోపణ త్రిపురారం: పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతదేహంతో నిడమనూరు పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు గురువారం ధర్నా చేశారు. నిడమనూరు మండలంమగుంతకల్ గ్రామానికి చెందిన గోపిశెట్టి శ్రీనివాస్(50) జనవరి 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరాడు. జనవరి 4న శ్రీనివాస్ కుమార్తె ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై నిడమనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ గురువారం మృతిచెందాడు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ మృతదేహంతో గురువారం నిడమనూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఎస్ఐ గోపాల్‌రావు చెప్పినా ధర్నా విరమించలేదు. హలియా సీఐ జనార్దన్‌గౌడ్ నిడమనూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. బస్సు టైరు కింద పడి వలస కూలీ మృతిసూర్యాపేటటౌన్: ఆర్టీసీ బస్సు టైరు కింద పడి వలస కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగామ క్రాస్ రోడ్డులో గురువారం సాయంత్రం జరిగింది. నకిరేకల్‌లో ఇటుక బట్టీల్లో పనిచేసే ఒడిశా రాష్ట్రం దబాంగ్ నవరంగపూర్ జిల్లా దమనగూడ గ్రామానికి చెందిన హల్దర్ భద్ర(20), అతడి స్నేహితులు నిరంజన్, నర్సింగ్, బోస్ సూర్యాపేటలో ఉంటున్న తమ స్నేహితుడు లచ్చం వద్దకు వచ్చి తిరిగి నకరేకల్కు వెళ్తూ.. జనగామ క్రాస్ రోడ్డు వద్ద సూర్యాపేట నుంచి తుంగతుర్తి వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఎక్కారు. ఆ బస్సు నకిరేకల్‌కు వెళ్లదని తెలిసి భద్ర బస్సు దిగుతూ కింద పడగా టైరు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి స్నేహితుడు నిరంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి
నాగారం: మూడేళ్ల నుంచి తనను ప్రేమించి.. చివరకు మరో యువతిని వివాహం చేసుకోవడంతో ప్రేమించిన యువతి గురువారం ప్రియుడి ఇంటి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగింది. ఈ ఘటన నాగారం మండలం లక్ష్మాపురం గ్రామంలో జరిగింది. బాధిత యువతి, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మాపురం గ్రామానికి చెందిన మల్లేపాక నాగరాజు హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన సుంకరి తిరుమల అనే యువతి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిన స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తోంది. నాగరాజుకు తిరుమల సమీప బంధువు. అంతేకాకుండా నాగరాజు తల్లి అనారోగ్యానికి గురికావడంతో నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించిన సమయంలో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలని తిరుమల పలుమార్లు నాగరాజుపై ఒత్తిడి చేయగా.. తొందర ఎందుకని, సూర్యాపేటలో ఉద్యోగం ఇప్పిస్తాను ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని దాటవేస్తూ వచ్చాడు. నాగరాజు తన బావ మనోజ్‌తో కలిసి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తన వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని తిరుమల ఆరోపించింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా వారు నాగరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడారని, నాగరాజు పెళ్లి విషయం గురించి గురువారం మాట్లాడదామని చెప్పడంతో లక్ష్మాపురం గ్రామానికి వచ్చామని బాధితురాలు తెలిపింది. నాగరాజు ఇంట్లో లేకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని, నాగరాజు మరో అమ్మాయిని వివాహం చేసుకొని ఫొటోలను తనకు వాట్సాప్ చేశాడని పేర్కొంది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ నాగరాజు ఇంటి ఎదుట ధర్నాకు దిగినట్లు తిరుమల తెలిపింది. నాగరాజును కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని యువతికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఫ ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా -
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
మిర్యాలగూడ: దామరచర్ల మండలం వాడపల్లిలోని శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి మహా శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె వాడపల్లిలోగల శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా–మూసీ సంగమం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఆలయానికి మహాశివరాత్రికి వచ్చే భక్తుల కోసం షవర్‌బాత్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు. అనంతరం ఆమె స్థానిక కేజీబీవీ పాఠశాల, మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ పూజిత ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, తహసీల్దార్ జవహర్లాల్, ఆలయ ఏఈ జ్యోతి, అనువంశిక ధర్మకర్త సిద్ధయ్య, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నల్లగొండ
పోలీస్ బందోబస్తు భేష్ దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరలో పోలీస్ బందోబస్తు భేషుగ్గా ఉందని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ అన్నారు.అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని ఐసీఎస్ఎస్ఆర్ హైదరాబాద్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. 7పెద్దగట్టును అభివృద్ధి చేస్తాం పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025- 8లో -
నెలవారం.. జనహారం
చివ్వెంల, సూర్యాపేట టౌన్: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో నాలుగోరోజు కూడా భక్తుల కోలాహలం నెలకొంది. బుధవారం సంప్రదాయం ప్రకారం నెలవారం కార్యక్రమాన్ని యా దవ పెద్దలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లింమంతుల స్వామిని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ తదితరులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం మకరతోరణం తరలింపుతో జాతర ముగియనుంది. దేవరపెట్టె తరలింపుపెద్దగట్టు లింగమంతుల జాతరలో నాలుగోరోజు నెలవారం తంతును నిర్వహించారు. అనంతరం చంద్రపట్నం ఎత్తిపోసి సమీపంలోని నాగులమ్మ పుట్టలో పోశారు. తర్వాత చౌడమ్మ, లింగమంతుల విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను తీసుకొని మెంతనబోయిన, గొర్ల వంశీయులు సూర్యాపేట మండలం కేసారం బాటపట్టారు. దీంతో నెలవారం పండుగ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.నేడు ముగియనున్న జాతర నాలుగు రోజులుగా లక్షలాది భక్తుల పూజలు అందుకున్న పెద్దగట్టు లింగమంతుల జాతర గురువారంతో ముగియనుంది. సూర్యాపేట యాదవ బజార్ నుంచి గట్టుకు తెచ్చిన మకర తోరణం గురువారం స్వస్థలానికి చేరనుంది. మకర తోరణం తీసుకువెళ్లడంతో జాతర ముగుస్తుందని యాదవ పూజారులు తెలిపారు.ఫ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఫ కేసారం చేరిన దేవరపెట్టె ఫ నేడు జాతర ముగింపు -
ఫిర్యాదుల విభాగాలు ఏర్పాటు చేయాలి
నల్లగొండ: రైతు భరోసా ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాల్లో ఫిర్యాదుల విభా గాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె నల్లగొండ కలెక్టరేట్ నుంచి రైతు భరోసాపై జిల్లా, మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతలో భాగంగా సుమారు 12వేల ఎకరాలు వరకు వ్యవసాయ యోగ్యంకాని భూములను గుర్తించామన్నారు. ఈ వివరాలను శనివారంలోగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు స్వీకరించి సోమవారం ప్రజావాణిలోపు పరిష్కరించాలని ఆదేశించారు. యూరియా కోసం రైతుల ఇబ్బందులు పడకుండా సరఫరా చేయాలన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జెజశ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఏఓ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలినల్లగొండ టౌన్: విద్యారంగ సమస్యను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలోని ఎఫ్‌సీఐ కమ్యూనిటీ హాల్లో ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ 45వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరారు. మెస్, కాస్మోటిక్ చార్జిలు, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలన్నారు. ఈ సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.కిరణ్, ప్రతినిధులు లక్ష్మీనారాయణ, సలీం, సత్తయ్య, మల్లం మహేష్, నరేష్, కంబంపాటి శంకర్, సైదానాయక్, కుంచం కావ్య, లక్ష్మణ్, కోరె రమేష్, బుడిగె వెంకటేష్, ముస్కు రవీందర్, స్పందన, సిరి, జగన్, వీరన్న, సంపత్, సైఫ్, కిరణ్, జగదీష్, రవి, రోహిత్ పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానంనల్లగొండ: జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల (అంధ, బదిర, మానసిక, శారీరక దివ్యాంగులు)కు ఉపకార వేతనాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి కేవీ.కృష్ణవేణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 శాతం అంగవైకల్యం కలిగినట్టు డాక్టర్ ధ్రువీకరణ పత్రంతోపాటు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, 2 ఫొటోలు, 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల గత సంవత్సరం మార్కుల జాబితా, పాఠశాల బ్యాంకు ఖాతా నంబర్ మొదటి పేజి జిరాక్స్ జత చేసి దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తులను మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా telanganaepass.cgg.gov.inలో సంబంధిత ప్రధానోధ్యాయుడి నుంచి సిఫారసు చేసిన కాపీతోపాటు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. పశుసంవర్ధక శాఖ జేడీగా రమేష్నల్లగొండ అగ్రికల్చర్: జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ జీవీ రమేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఈయన పదోన్నతిపై జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా రానున్నారు. రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జేడీఏగా ఏడీ ఖదీర్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంక్షేమానికి కృషిచేయాలినల్లగొండ: విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా వసతి గృహ సంక్షేమ అధికారులు కృషిచేయాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి అన్నారు. బుధవారం నల్లగొండలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన వసతి గృహ సంక్షేమ అధికా రుల సంఘం జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ హాస్టళ్లలో అన్నిరకాల సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో మాట్లాడతానని అన్నారు. ఈ సభలో బి.రణధీవే, శేఖర్‌రెడ్డి, ఏ.సత్యనారాయణ, సైదానాయక్, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, గామయ్య, రమ్య సుధా, అలీమ్, బాలకృష్ణ, లింగయ్య, యాదగిరి, జానీమియా, సునీత తదితరులు పాల్గొన్నారు. -
వరి.. తడారి..
అడుగంటిన భూగర్భజలాలు.. ఎండిపోతున్న పొలాలు వరిపొలంలో గేదెను మేపుతున్న ఈయన మునుగోడు మండలంలోని పులిపలుపుల గ్రామానికి చెందిన రైతు సింగం మల్లేష్. తనకున్న 6 ఎకరాల్లో వరిసాగుచేశాడు. నాటేసిన సమయంలో బోరు నుంచి నీరు బాగానే వచ్చింది. ఇటీవల ఎండ తీవ్రత పెరగడంతో బోర్లలో నీరు తగ్గిపోయింది. సరిపడా రాకపోవడంతో దాదాపు 3 ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. చేసేది ఏమిలేక ఎండిన వరి పొలంలో తన పశువులను మేపుతున్నాడు. ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నాడు. 400 ఫీట్లు బోరువేసినా చుక్కనీరు రాలే.. గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామానికి చెందిన మాదగాని అంజయ్య తనకున్న రెండెకరాల్లో వరి వేశాడు. మొదట్లో పంట బాగానే ఉంది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్ల నుంచి నీరు రావడం తగ్గిపోయి, వారం రోజుల నుంచి పంటలు ఎండిపోతున్నాయి. సమీపంలో 400 ఫీట్ల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదని అంజయ్య వాపోయాడు. నల్లగొండ మండంలోనూ భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు సరిగా నీరు పోయకపోవడంతో పంటలకు సరిపడా నీరందడం లేదు. ఓ రైతు నాలుగు బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నాడు. ●నాలుగు బోర్లు వేసినా నీరులేదు నాకున్న రెండెకరాల్లో వరి వేశాను. రెండు బోర్లలో ఒక్కసారిగా నీరు తగ్గిపోయింది. రూ.లక్షన్నర అప్పు చేసి మరో 4 బోర్లు వేశాను. ఒక్క దాంట్లోనూ నీరు రాలేదు. నీరందకపోవడంతో ఎకరం పొలం ఎండిపోయింది. – ఓరుగంటి పాండు, అప్పాజీపేటట్యాంకర్లతో నీరుపెడుతున్నా నాకున్న నాలుగెకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట సాగుచేశాను. ఇప్పుడు బోర్ల నుంచి నీరు రావడం లేదు. పంట ఎండిపోతోంది. దీంతో ట్యాంకర్‌తో నీరు తెచ్చి పొలం పారిస్తున్నా. – ఈరటి వెంకట్ యాదవ్, పెద్దకాపర్తి, చిట్యాలపంటలు సాగుచేసి అప్పులపాలయ్యాం రెండెకరాలలో వరి సాగుచేశాను. చేను పొట్టదశకు వచ్చే సమయానికి రెండు బోర్లలో నీరు తగ్గిపోయింది. దీంతో వరిచేను మొత్తం ఎండిపోయింది. కొత్తగా బోర్లు వేద్దామంటే పడే పరిస్థితి లేదు. చేసేదేమీ లేక వరిచేనును వదిలేశాను. పంట పెట్టుబడి కోసం రూ.60 వేలకు పైగా అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. – జాల ఉపేందర్, వల్లాల, శాలిగౌరారం వరి పంట ఎండిపోతోంది గుర్రప్పగూడె శివారులో నాలుగు ఎకరాల్లో వరి సాగుచేశాను. ప్రస్తుతం బోర్లు సరిగ్గా పోయకపోవడంతో ఎకరంన్నర పొలం ఎండిపోయింది. మిగిలిన పొలానికై నా నీరు సరిపడ వస్తదనే నమ్మకం లేదు. తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. – తగుళ్ల మల్లయ్య, సర్వారం ఫ వట్టిపోతున్న బోర్లు.. అన్నదాతల దిగాలు ఫ పొట్టకొచ్చిన దశలో వందల ఎకరాల్లో ఎండుతున్న వరిచేలు ఫ ప్రత్యామ్నాయం లేక పంటలను వదులుకుంటున్న రైతులు ఫ ట్యాంకర్ల ద్వారా నీరు పోస్తున్నా.. కానరాని ప్రయోజనం జనవరి నెలలో భూగర్భ జలమట్టం ఇలా..(మీటర్లలో) మండలం గతేడాది ఈసారి పడిపోయింది నాంపల్లి 9.44 12.62 3.18 మర్రిగూడ 8.36 9.99 1.63 కొండమల్లేపల్లి 4.82 6.0 1.18 మునుగోడు 7.55 8.51 0.96 కట్టంగూర్ 8.76 9.54 0.78 చింతపల్లి 10.15 10.86 0.71 దేవరకొండ 7,28 7,83 0.55 గుండ్లపల్లి 6.87 6.35 0.48 శాలిగౌరారం 4.20 4.53 0.33 మాడుగులపల్లి 7.94 8.03 0.10సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎండల తీవ్రత పెరుగుతుండటంతో భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. దీంతో బోర్లు వట్టిపోతుండటంతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంట ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో గత ఏడాది యాసంగిలో 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 5.12 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పాతాళానికి భూగర్భ జలాలు నల్లగొండ జిల్లాలో 33 మండలాలు ఉంటే.. పది మండలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నాంపల్లి మండలంలో గతేడాది జనవరి కంటే ఈ జనవరిలో అదనంగా 3.18 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. మర్రిగూడ, కొండమల్లేపల్లి, మునుగోడు, కట్టంగూర్, చింతపల్లి, దేవరకొండ, గుండపల్లి, శాలిగౌరారం, మాడుగులపల్లి మండలాల్లోనూ భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఫిబ్రవరి నెలలో అవి మరింతగా లోతుకు పడిపోయి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. శాలిగౌరారంలో భారీగా నష్టం శాలిగౌరారం మండలంలో సాగునీటి వనరులు సరిగ్గా లేని భైరవునిబండ, తక్కెళ్లపహాడ్, ఆకారం, వల్లాల, పెర్కకొండారం గ్రామాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మండలంలో ఈ సీజన్లో 19 వేల ఎకరాలలో వరి పంట సాగు చేయగా, అందులో దాదాపు 400 ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు వేసినా పడకపోవడంతో రైతులు పంటలను వదిలేయాల్సి వస్తోంది. ట్యాంకర్ల ద్వారా నీరు చిట్యాల మండలంలో 15 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, పలు గ్రామాల్లో నీరందక పంట ఎండిపోతోంది. కొంతమంది రైతులు ట్యాంకర్ల నీటిని పోస్తున్నారు. పెద్దకాపర్తిలో దాదాపు 20 మంది రైతుల బోర్లు వట్టిపోయాయి. దీంతో ఆ గ్రామంలో దాదాపు 50 ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. మునుగోడు మండలంలోనూ పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు పెద్దగా పడక, భూగర్భ జలాలు పెరుగకపోవడం, చెరువులు, కుంటల్లో సరిపడ నీరు లేకపోవడంతో బోర్లు నీరుపోయడం లేదు. 400 ఎకరాల్లో ఎండిన వరి నార్కట్‌పల్లి మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కొండపాకగూడెం, శేరుబావిగూడెం, ఎల్లారెడ్డిగూడెం, చెర్వుగట్టు, నెమ్మని, మాదవఎడవల్లి గ్రామాల్లో బోర్లపై ఆధారపడి వేసిన వరి పంట ఎండిపోయి పొలాలు నెర్రెలుబారుతున్నాయి.పొలాల్లో కొందరు రైతులు గొర్రెలు, మేకలు మేపుతున్నారు. మండల వ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 400 ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తిప్పర్తి మండలంలోనూ భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయి. మండలంలోని సర్వారం గ్రామంలో భూగర్బ జలాలు అడుగు అంటడంతో గుర్రప్పగూడెం ప్రాంతంలో బోర్లు వట్టిపోయాయి. పొలాలు పొట్ట దశకు రావడంతో నీరు అధికంగా అవసరం అవుతుందని, ఈ సమయంలో బోర్లలో నీరు తగ్గిపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
స్వస్తివాచనం.. విష్వక్సేనారాధన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం ప్రధానాలయంలోని ముఖ మండపంలో స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ముఖ మండపంతో పాటు గర్భాలయంలో, ఆలయ పరిసరాల్లో పుణ్యాహ వాచనం జరిపించారు. ప్రధానాలయ ముఖ మండపం నుంచి యాగశాలకు ఊరేగింపుగా శ్రీస్వామి అమ్మవార్లను ప్రత్యేక సేవపై తీసుకువచ్చారు. యాగశాల వద్ద ప్రవేశ పూజను నిర్వహించి యాగశాల మంటపం ఎదుట స్వయంభూ అగ్ని సృష్టించే కార్యక్రమం చేపట్టారు. అనంతరం పంచ కుండాత్మక యాగానికి అగ్ని ప్రతిష్ఠాపన చేసి హోమాధి పూజలు జరిపించారు. అదేవిధంగా రాత్రికి శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, ద్వారాది కుంభార్చన, బింబ, కుంభ, మండల, అగ్ని ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు, వారుణానువాక హోమం చేసి, జలాధివాసం నిర్వహించారు. భక్తులకు సదుపాయాలు కల్పించాలి కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ అధికారులు సదుపాయాలు కల్పించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ఆదేశించారు. సంప్రోక్షణ ఉత్సవాల్లో భాగంగా ఈ సందర్భంగా కొండపైన గల దేవాలయ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్‌రావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 23న మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు అధికంగా వస్తారని, వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అంతకు ముందు కొండ కింద హెలిపాడ్ స్థలం, కొండపైన స్వాగత తోరణానికి ఇరువైపులా వేస్తున్న రంగులు, ఘాట్‌రోడ్డు, ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఏసీపీ రమేష్, ప్రధానార్చకులు, జిల్లా అధికారులు, ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ యాదగిరి క్షేత్రంలో ప్రారంభమైన మహా కుంభాభిషేక సంప్రోక్షణ ఫ పూజల్లో పాల్గొన్న దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ -
పరారీలో కచలాపురం వీఓఏ..?
ఫ మహిళా సంఘాల డబ్బులు బ్యాంకులో చెల్లించకుండా మోసం ఫ రెండు రోజుల క్రితం ఐకేపీ అధికారులతో పాటు వీఓఏను నిర్బంధించగా విడిపించిన పోలీసులుమునుగోడు: మునుగోడు మండలం కచలాపురం గ్రామంలో మహిళా సంఘాల సభ్యుల డబ్బులను బ్యాంకులో జమచేయకుండా సొంతానికి వాడుకున్న ఆ గ్రామ వీఓఏ సుఖేందర్ పరారీలో ఉన్నట్లు సమచారం. మహిళా సంఘాల సభ్యులు శ్రీనిధి రుణాలతో పాటు ఇతర రుణాల వాయిదా డబ్బులను ప్రతి నెలా రూ.90వేల వరకు వీఓఏకు చెల్లించగా.. అతడు కేవలం రూ.40వేల నుంచి రూ.50వేల వరకు మాత్రమే బ్యాంకులో జమచేసి మిగిలిన డబ్బులు తన సొంతానికి వాడుకున్నాడు. ఇది గుర్తించిన ఐకేపీ ఏపీఎంతో పాటు సీసీ సోమవారం కచలాపురంలో సమావేశం ఏర్పాటు చేసి వీఓఏ రూ.11లక్షలు వాడుకున్నట్లు నిర్దారించారు. దీంతో ఆగ్రహించిన మహిళా సంఘాల సభ్యులు అదే రోజు ఐకేపీ అధికారులతో పాటు వీఓఏని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మహిళలకు సర్దిచెప్పి వారిని విడిపించారు. ఐ.పీ. పెట్టేందుకు ప్రయత్నం.. ఐకేపీ అధికారులు వీఓఏ సుఖేందర్పై మునుగోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కచలాపురం గ్రామంలోని కొందరు పెద్దలు, అతడి కుటుంబ సభ్యులు మహిళ సంఘాల సభ్యులకు ఇవ్వాల్సిన డబ్బులు తాము ఇప్పిస్తామని, అప్పటి వరకు కేసు నమోదు చేయొద్దని జమానతుపై తీసుకెళ్లారు. కానీ రెండు రోజుల నుంచి అతడు గ్రామంలో కనిపించడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అతడు మహిళా సంఘాల సభ్యులకు చెల్లించాల్సిన డబ్బులు ఇప్పట్లో చెల్లించకుండా కోర్టు ద్వారా ఐపీ(ఇన్సాల్వెన్సి పిటిషన్) పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. వీఓఏ సుఖేందర్‌కు బయట అప్పులు కూడా అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
మిర్యాలగూడ: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించకుండా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కేంద్ర బడ్జెట్ అనుకూలంగా ఉందని, పేదలకు, రైతులకు, కార్మికులకు, కూలీలకు, మహిళలకు, విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందన్నారు. రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వల్లెపు ఉపేందర్‌రెడ్డి, వస్కుల మట్టయ్య, కుమారస్వామి, వరికుప్పల వెంకన్న, వనం సుధాకర్, పెద్దారపు రమేష్, నజీర్, సైదమ్మ, కాశీ, ప్రతాప్, రాగసుధ, సంధ్య, సావిత్రి, వెంకన్న, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి -
రూ.70కోట్లతో పెద్దగట్టు అభివృద్ధి చేస్తాం
చివ్వెంల: చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలో గల పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయాన్ని రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం పెద్దగట్టు జాతరకు మంత్రి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దగట్టు ఆలయం వద్దకు ఘాట్ రోడ్డుతో పాటు శాశ్వత గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తామని, భక్తుల కోసం గుడి వద్ద వసతి సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ కాలువలు తవ్వించారని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు త్వరలో పూర్తిచేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎప్పుడూ పెద్దగట్టు జాతరకు రాలేదని, ఇప్పుడు వచ్చి పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో ఇరవై ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీ మతంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు గాని సీట్లు గాని వచ్చే పరిస్థితి లేదన్నారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని పేర్కొన్నారు. ఆయన వెంట ఆలేరు, నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, ఆలయ చైర్మన్ నర్సయ్యయాదవ్ పాల్గొన్నారు. ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ లింగమంతుల స్వామికి పూజలు -
రైతును వెంబడించి నగదు చోరీ
అనంతగిరి: ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బుతో ఓ రైతు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా దుండగులు ఆ రైతును వెంబడించి అతడిపై దాడి చేసి రూ.1,77,817 నగదు ఎత్తకెళ్లారు. అనంతగిరి మండలం శాంతినగర్ శివారులో జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన రైతు కొండబాల పుల్లయ్య సోమవారం తాను పండించిన వరి ధాన్యాన్ని ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఓ వ్యాపారికి విక్రయించాడు. మంగళవారం ఉదయం నగదు తీసుకువెళ్లాంటూ సదరు ధాన్యం వ్యాపారి నుంచి ఫోన్ రావడంతో పుల్లయ్య నేలకొండపల్లి వెళ్లి నగదు తీసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో అనంతగిరి మండలం శాంతినగర్ శివారులోని సర్వీస్ రోడ్డులో గల రైస్ మిల్లు వద్దకు చేరుకోగానే స్కూటీపై వచ్చిన గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు పుల్లయ్యను ఆపే ప్రయత్నం చేశారు. వారిపై అనుమానం వచ్చిన పుల్లయ్య ద్విచక్ర వాహనం వేగం పెంచగా.. కొద్దిదూరం వెళ్లాక పుల్లయ్య అడ్డగించారు. దీంతో పుల్లయ్య డబ్బులు ఉన్న ప్లాస్టిక్ కవర్‌తో సహా పారిపోతుండగా.. ముగ్గురు దుండగులు అతడిపై దాడి చేసి నగదు ఉన్న కవరును లాక్కోని పారిపోయారు. పుల్లయ్య విలపిస్తూ అటుగా వస్తున్న ఓ కారుకు ఎదురుగా వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. యూటర్న్ చేసుకుని పారిపోతున్న దుండగులను కారులోని వ్యక్తి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు తప్పించుకుపోయారు. బాధితుడు అనంతగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అనంతగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. నిందింతులను త్వరలోనే పట్టుకుంటామని కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి తెలిపారు. ఫ ధాన్యం అమ్మి డబ్బు తీసుకొస్తుండగా దాడి చేసి అపహరించిన దుండగులు ఫ అనంతగిరి మండలం శాంతినగర్ శివారులో ఘటన -
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తితో పాటు 7 నెలల పసికందు మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సుంకి సాయికుమార్(35), తన భార్య సింధూజ, కుమారుడు విరాంచ్(7 నెలలు)తో కలిసి హైదరాబాద్‌లోని పటాన్చెరులో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సాయికుమార్ బుధవారం సాయంత్రం భార్య, కుమారుడితో పాటు తన తల్లిదండ్రులతో కలిసి పటాన్చెరు నుంచి కారులో సూర్యాపేటకు వెళ్తున్నాడు. అద ఏ సమయంలో నల్ల గొండలోని గోకుల్ బీఈడీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న నల్లగొండకు చెందిన జె. సందీప్‌రెడ్డి, తన భార్య పద్మతో కలిసి నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తున్నాడు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే సందీప్‌రెడ్డి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో వస్తున్న సాయికుమార్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్‌తో పాటు అతడి కుమారుడు విరాంచ్ అక్కడికక్కడే మృతి చెందారు. సాయికుమార్ తండ్రి వెంకన్న, తల్లి విజయ, భార్య సింధూజ తీవ్రంగా గాయపడ్డారు. జె. సందీప్‌రెడ్డి, అతడి భార్య పద్మకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్లను హైవే పక్కకు తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఐదుగురిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చౌటుప్పల్ సీఐ జి. మన్మథకుమార్ తెలిపారు. ఫ అదుపుతప్పి ఢీకొన్న రెండు కార్లు ఫ ఇద్దరు మృతి.. మరో ఐదుగురికి గాయాలు ఫ మృతుల్లో 7 నెలల పసికందు ఫ చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద ఘటన -
అజీంపేటలో కొనసాగుతున్న పోలీస్ పికెట్
అడ్డగూడూరు: మండలంలోని అజీంపేట గ్రామంలో పోలీసు పికెట్ కొనసాగుతోంది. అజీంపేటకు చెందిన పండుగ రాజమల్లు మృతికి అదే గ్రామానికి చెందిన భట్ట లింగయ్యనే కారణమని రాజమల్లు కుమారుడు రామస్వామి కక్ష పెంచుకున్నాడు. 2017 ెదసరా రోజు భట్ట లింగయ్య గ్రామంలో జమ్మి పూజ వద్దకు రాగా.. రామస్వామితో సహా మరో 17 మంది గ్రామస్తులతో కలిసి మూకుమ్మడిగా అతడిపై దాడి చేశారు. చికిత్స నిమిత్తం లింగయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. లింగయ్య కుమారుడు వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రామస్వామితో పాటు 17మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ కేసు తుది విచారణలో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడో అదనపు జడ్జి జడ్జీ రోజారమణి 18మందికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. వీరిలో జక్కుల భిక్షమయ్య గతంలోనే మృతిచెందగా.. మిగతా 17 మందిని నల్లగొండ జైలుకు తరలించారు. అజీంపేటలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బుధవారం కూడా పోలీసు పికెట్ కొనసాగించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్
రామగిరి(నల్లగొండ): సుస్థిర అభివృద్ధి సాధిస్తూ, సమస్యలను అధిమిస్తూ భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్)–హైదరాబాద్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐసీఎస్ఎస్ఆర్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో కళాశాల సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన ‘సుస్థిర అభివృద్ధి–భారతదేశంలో అవకాశాలు మరియు సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన నేషనల్ సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ సెమినార్లు నిర్వహించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మరొక అతిథి ప్రొఫెసర్ మల్లయ్య మాట్లాడుతూ.. ప్రపంచంలో పేదరికం, అసమానతలను అంతంచేసేలా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సుస్థిర అభివృద్ధిపె పలువురు పరిశోధనా పత్రాలను సమర్పించారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఎకనామిక్స్ హెడ్ ప్రొఫెసర్ ఫరీదా బేగం, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఆకుమార్తి నాగేశ్వరరావు, ప్రొఫెసర్ మల్లయ్య, ప్రొఫెసర్ ఎం. రాములు, బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ దయాకర్, సెమినార్ కన్వీనర్ డాక్టర్ బి. మునిస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఆది మల్లేశం, కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ ఐసీఎస్ఎస్ఆర్–హైదరాబాద్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి -
పెద్దగట్టు జాతరలో పోలీస్ బందోబస్తు భేష్
సూర్యాపేటటౌన్: దురాజ్‌పల్లి లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతరలో పోలీసులు బందోబస్తు పకడ్బందీగా నిర్వహిస్తున్నారని మల్టీజోన్–2 ఐజీ వి. సత్యనారాయణ అన్నారు. బుధవారం లింగమంతులస్వామిని ఆయన దర్శంచుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారని కితాబిచ్చారు. సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జాతర పరిసరాలను పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి జాతరలో దొంగతనాలు జరగకుండా నివారించారని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపునకు సహకరించిన వాహనదారులు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐలు రాజశేఖర్, వీరరాఘవులు, స్థానిక ఎస్ఐ మహేశ్వర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఫ మల్టీజోన్–2 ఐజీ వి. సత్యనారాయణ -
బైక్ ట్యాంకు కవర్లో నుంచి రూ.2లక్షలు అపహరణ
హాలియా: బైక్ ట్యాంకు కవర్లో పెట్టిన రూ.2లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన హాలియా పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం తెప్పలమడుగుకు చెందిన కొండల్ బైక్‌పై బుధవారం హాలియాలోని ఎస్బీఐలో నగదు డ్రా చేసేందుకు వచ్చాడు. రూ.2లక్షల నగదు డ్రా చేసి కవర్లో పెట్టి తన బైక్ ట్యాంకు కవర్లో పెట్టాడు. దేవరకొండ రోడ్డులోని వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాపు వద్ద బైక్‌ను నిలిపి షాపులోకి వెళ్లి వచ్చేసరి బైక్ ట్యాంకు కవర్లో పెట్టిన నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి నగదు చోరీ చేసి సాగర్ వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్‌రెడ్డి తెలిపారు. -
యాదగిరిగుట్టలో వైభవంగా గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని బుధవారం భక్తులు, ఆలయాధికారులు, స్థానికులు గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 5గంటలకు కొండ కింద గల వైకుంఠద్వారం వద్ద ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తిలు ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అంతకుముందు కూచిపూడి, భరటనాట్యంతో కళాకారులు భక్తులను ఆకట్టుకున్నారు. ఆలయంలో స్వాతి హోమాన్ని నిర్వహించి, స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అష్టోతర శతఘటాభిషేకం చేపట్టారు. -
మహాకుంభాభిషేక సంప్రోక్షణ వైభవంగా నిర్వహించాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగే బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆలయ ఈఓ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షిస్తూ, ప్రొటోకాల్ ప్రకారంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడపడంతో పాటు రోడ్లపై పార్కింగ్ చేయకుండా చూడాలన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తూ యాదగిరి క్షేత్ర వైభవాన్ని ప్రపంచానికి చాటాలన్నారు. అంతకుముందు మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సమీక్షలో జెడ్పీ సీఈఓ శోభారాణి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్ తహసీల్లార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా రెండు వారాలపాటు నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ సోమవారం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజావాణిలో వ్యక్తిగత సమస్యలు, భూములకు సంబంధించిన విషయాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ పథకాల కింద చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అత్యవసర పనులకు ప్రతిపాదనలు గ్రామాల సందర్శన సందర్భంగా పాఠశాలలు, హాస్టళ్లలో అవసరమైన అత్యవసర పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, గుణాత్మక విద్య అందేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కేరాఫ్ అడ్రస్ మర్రిచెట్టు
జాతరకు వచ్చే భక్తులకు కేరాఫ్ అడ్రస్‌గా మర్రిచెట్టు నిలిచింది. ప్రధాన ద్వారం, గట్టు పైకి వెళ్లే వారు మర్రిచెట్టు నీడలో భక్తులు సేదతీరారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సైతం ఇక్కడి నుంచి జాతరను పర్యవేక్షించారు. తప్పిపోయిన వారిని గుర్తించడం, వివిధ శాఖల అధికారులు సైతం ఇక్కడికే వచ్చి కలుసుకోవడం గమనార్హం. జాతరలో తప్పిపోయిన వారికోసం మర్రిచెట్టు వద్ద మైక్ అనౌన్స్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు తప్పిపోతే మర్రిచెట్టు వద్దకు తీసుకురావాలని మైక్‌లో అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. కొందరు భక్తులు తమకు సంబంధించిన వ్యక్తి కనిపించడం లేదని బండి దగ్గరికి రావాలని.. మర్రిచెట్టు వద్దకు రావాలని... గుట్టపైకి రావాలంటూ వచ్చి అధికారులను విసిగించారు. దీంతో అధికారులు భక్తుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కేవలం చిన్నపిల్లలు తప్పిపోతేనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, ఇలా అధికారులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని పదేపదే సూచించారు. -
మార్మోగిన ఓ లింగా.. నామస్మరణ
సూర్యాపేట, చివ్వెంల, సూర్యాపేటటౌన్, భానుపురి, పెన్‌పహాడ్ : తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరైన దురాజ్‌పల్లి లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతరకు రెండో రోజు సోమవారం భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. తమ ఇష్టదైవం లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి సందడి చేశారు. ● ఎర్రబడ్డ పెద్దగట్టుభక్తులు యాటలను బలి ఇవ్వడంతో పెద్దగట్టు ఎర్రబడింది. యాదవులు స్వామివారికి కొబ్బరికాయలు, బోనాలు చెల్లించి మొక్కులు చెల్లించుకోగా, అమ్మవారికి యాటలను బలి ఇచ్చారు. గతంలో గట్టుకు ఒకవైపు కేటాయించిన ప్రదేశంలో మాత్రమే యాటలను బలి ఇచ్చేవారు. కానీ ఈసారి భక్తులు తమకు నచ్చిన చోట గుట్ట చుట్టూ యాటలను బలి ఇచ్చారు. దీంతో యాటల రక్తంతో గుట్ట ఎర్రబడింది. జాతరలో రెండు రోజుల్లో తప్పిపోయిన 25 మంది చిన్న పిల్లలను శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ● వెలవెలబోయిన కోనేరుగుట్ట పైన కోనేరులో భక్తులు స్థానాలను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు గుట్ట పైన ఉన్న కోనేరు ఏమాత్రం సరిపోవడం లేదని భావించి గుట్ట కింద గతంలోనే కోనేరును నిర్మించారు. అయితే కోనేరులో స్నానాలు చేసే సమయంలో భక్తులకు ఏమైనా జరుగుతుందన్న ముందస్తు చర్యలో భాగంగా ఈ కోనేరుకు తాళాలు వేశారు. దీంతో కోనేరు వెలవెలబోయింది. ● ఆకట్టుకున్న శివసత్తుల నృత్యాలులింగమంతుల జాతరలో శివసత్తులు సందడి చేశారు. లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లికి బోనం సమర్పించేందుకు భక్తులు గంపలతో వచ్చే సమయంలో శివసత్తులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ● పనిచేయని షవర్లు లింగమంతులస్వామి వారిని దర్శించుకునే ముందు భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా గుట్ట పైన ఏర్పాటు చేసిన షవర్లు పనిచేయకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక తాగునీటి కోసం ఏర్పాటు చేసిన కుళాయిల వద్దనే భక్తులు స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. పెద్దగట్టు జాతరలో అంటువ్యాధులు ప్రబలకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చిన భక్తులు వదిలేసిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు సేకరించి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. పెద్దగట్టుకు భారీగా తరలివచ్చిన భక్త జనం -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
నల్లగొండ : రెడ్డీస్ ఫౌండేషన్ గ్రో ప్రోగ్రాం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కంప్యూటర్ ఆపరేటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టైపింగ్, సెక్టార్ రెడీనెస్, ఇంటర్వ్యూ స్కిల్స్ అంశాలపై రెండు నెలల శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు అల్మాస్ ఫర్హీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. అర్హతలు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల నిరుద్యోగులు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తులను గడియారం సెంటర్లో ఉన్న తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 70326 09925, 91777 85983 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఐకేపీ సిబ్బందిని నిర్బంధించిన మహిళలు
మునుగోడు: తాము చెల్లించిన రుణ వాయిదా డబ్బులు బ్యాంక్‌లో జమచేయకుండా సొంతానికి వాడుకున్న వీఓఏతో పాటు ఐకేపీ సిబ్బందిని సోమవారం మునుగోడు మండలం కచలాపురం గ్రామస్తులు నిర్బంధించారు. కచలాపురం గ్రామ వీఓఏగా పనిచేస్తున్న సుఖేందర్ కొంతకాలంగా గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన శ్రీనిధి రుణాల వాయిదా డబ్బులు బ్యాంక్‌లో జమ చేయకుండా సొంతానికి వాడుకుంటునట్లు ఐకేపీ అధికారులు గుర్తించారు. దీంతో విచారణ చేపట్టేందుకు ఏపీఎం మహేశ్వర్‌రావు సోమవారం గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో ఎవరు ఎంత చెల్లించారు, వీఓఏ ఎంత జమచేశాడని సభ్యులకు వివరించారు. దీంతో ఆగ్రహంచిన మహిళా సంఘాల సభ్యులు వీఓఏతో పాటు ఐకేపీ సిబ్బందిని పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలకు సర్దిచెప్పి ఐకేపీ సిబ్బందిని బయటకు తీసుకొచ్చారు. రూ. 11లక్షలకు పైగా వాడుకున్న వీఓఏ..కచలాపురంలోని మహిళా సంఘం సభ్యులు శ్రీనిధి రుణాలు తీసుకుని నెలకు రూ.90వేల వరకు చెల్లిస్తున్నారు. వీఓఏ అందులో ప్రతి నెల రూ.50వేల వరకు మాత్రమే బ్యాంక్‌లో జమచేసి మిగిలిన డబ్బులు సొంతానికి వాడుకున్నాడు. రూ.11 లక్షలకు పైగా వాడుకున్నట్లు ఐకేపీ అధికారులు గుర్తించారు. వీఓఏ నుంచి డబ్బులు రికవరీ చేసి న్యాయం చేస్తామని ఏపీఎం తెలిపారు. తాము రుణ వాయిదాలు చెల్లించినప్పటికీ బ్యాంక్‌లో వీఓఏ జమ చేయలేదని ఆగ్రహం -
నల్లగొండ
వైభవంగా నిర్వహించాలి మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ సూచించారు.7సూర్యాపేటలో యోగా పోటీలు మార్చి 2న సూర్యాపేటలో జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు యోగా గురువు పాపిరెడ్డి తెలిపారు. ఐకేపీ సిబ్బంది నిర్బంధం మునుగోడు మండలం కచలాపురం గ్రామంలో మహిళలు సోమవారంఐకేపీ సిబ్బందిని నిర్బంధించారు. మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025- 8లో -
దారులన్నీ గట్టువైపే..
లింగమంతుల స్వామి జాతరకు పోటెత్తిన భక్తులుసూర్యాపేట, చివ్వెంల,సూర్యాపేటటౌన్, భానుపురి: చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర రెండవ రోజు సోమవారం జనగట్టును తలపించింది. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. రెండవ రోజు చౌడమ్మ బోనాలు సమర్పించారు. మహిళా భక్తులు బోనాలతో వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి చౌడమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. స్వామి వారిని సోమవారం ఒక్కరోజే 6 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు అంచనా. బోనాల సమర్పణ సాగిందిలా.. మున్న (రాజులు) మెంతబోయిన (పూజారులు) తమ ఇళ్ల నుంచి తెచ్చిన బియ్యంతో రెండు బోనాలు వండి స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించడం ఈ జాతరలో ప్రత్యేకత. తొలుత మున్నవారు రాశిబోనం, తర్వాత మెంతబోయినవారు సందవసర బోనం సమర్పించారు. ఇరు బోనాల నుంచి కొంత అన్నం తీసి లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తొలిగొర్రె (మెంతబోయిన వారిది), బద్దెపాల గొర్రె (మున్న వారిది), వరద గొర్రె (గొర్ల వారిది)లను చౌడమ్మ తల్లికి ఎదురుగా బలిచ్చారు. ఆ మాంసాన్ని మున్న, మెంతబోయిన, బైకానివారు వాటాలుగా పంచుకుని వండి చౌడమ్మకు నైవేద్యం సమర్పించారు. లింగమయ్య పూజల్లో ప్రముఖులు లింగమంతుల స్వామిని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్‌రెడ్డి, కలెక్టర్ దంపతులు వేర్వేరుగా దర్శించుకున్నారు. నేడు చంద్రపట్నం ఫ లక్షలాదిగా తరలివచ్చిన జనం ఫ ఓ లింగా నామస్మరణతో మార్మోగిన పెద్దగట్టు ఫ రెండవ రోజు ప్రత్యేకంగా సాగిన బోనాల సమర్పణ ఫ పూజల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ -
సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా స్థాయి యోగా పోటీలు
మిర్యాలగూడ టౌన్: ఉమ్మడి జిల్లా స్థాయి యోగా పోటీలను మార్చి 2వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు యోగా గురువు పాపిరెడ్డి తెలిపారు. ఈ యోగా పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని యోగా క్లబ్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ పోటీలలో 8 ఏళ్ల నుంచి 60 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు పాల్గొనవచ్చని తెలిపారు. 8 నుంచి 12 ఏళ్ల వరకు ఒక గ్రూపు, 13 నుంచి 19 ఏళ్ల వరకు ఒక గ్రూపు, 20 నుంచి 29 ఏళ్లు వరకు ఒక గ్రూపు, 30 నుంచి 39 ఏళ్లు ఒక గ్రూపు, 40 నుంచి 49 ఏళ్ల వరకు ఒక గ్రూపు, 50 నుంచి 59 వరకు ఒక గ్రూపు, 59 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి ఒక గ్రూపుగా విభజించినట్లు పేర్కొన్నారు. 98498 04626 నంబర్‌కు ఫోన్ చేసి ఈ నెల 28వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యోగా గురువు పొలిశెట్టి లక్ష్మయ్య, యోగా సాధకులు సుదర్శన్‌రెడ్డి, సుధాకర్, కిశోర్, చిదళ్ల వెంకటేశ్వర్లు, రాచయ్య, నాగయ్య, నర్సింహ్మరావు, మురళి, సరిత, వనజ, అంజయ్య, రమణ పాల్గొన్నారు. వచ్చే నెల 2న ప్రారంభం -
మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు
మిర్యాలగూడ టౌన్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు నల్లగొండ రీజియన్ పరిధిలోని యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండ డిపోల నుంచి పలు శివాలయాలకు 70 బస్సులను నడిపించనున్నారు. ప్రధానంగా శ్రీశైలం, మేళ్లచెరువు, సత్రశాల, వాడపల్లి, సోమప్ప దేవాలయాలకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక బస్సుల వివరాలు ఇలా..● మిర్యాలగూడ డిపో నుంచి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమప్ప దేవాలయానికి 5, అడవిదేవులపల్లిలోని సత్రశాలకు 5, వాడపల్లికి 5 బస్సులను నడిపించనున్నారు. ● కోదాడ డిపో నుంచి మేళ్లచెర్వుకు 30 బస్సులు నడపనున్నారు. ● దేవరకొండ డిపో నుంచి డిండి మీదుగా శ్రీశైలానికి 25 ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు అన్నీ ఏర్పాట్లను చేపట్టారు. భక్తుల రద్దీని బట్టి ఆయా పుణ్యక్షేత్రాలకు అదనపు బస్సులు నడిపించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
బాధితులకు న్యాయం చేయాలి
నల్లగొండ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. పోలీస్ గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులను ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమానికి పలువురు బాధితులు ఫోన్ చేసి వారి సమస్యను తెలియజేశారు. ప్రతి సోమవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు సైబర్ బాధితుల కొరకు డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. బాధితులు 8712658079 ఫోన్ చేసి తమ సమస్యను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. సదరం సర్టిఫికెట్లకు ‘స్వావలంబన్’ నల్లగొండ : సదరం సరిఫ్టికెట్ల జారీకి స్వావలంబన్ సైట్ అందుబాటులోకి వచ్చిందని డీఆర్డీఓ శేఖర్రెడ్తి తెలిపారు. దివ్యాంగులు htt pr-://w-w-w.rwav am ba nc-ar-d.gov.i n వెబ్‌సెట్ ద్వారా a pp y gor U ఈఐఈలో వారి వివరాలు సొంతంగా లేదా మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వీరికి నల్లగొండ జీజీహెచ్‌లో నిర్ధారణ పరీక్ష వైకల్య ధ్రువీకరణ కార్డులు పోస్టు ద్వారా పంపుతామని తెలి పారు. మీసేవలో నమోదు చేసుకున్న వారికి యూడీఐడీ ద్వారానే సర్టిఫికెట్లు జారీ అవుతాయని పేర్కొన్నారు. వివరాల నమోదులో పేరు, తండ్రి పేరు, నివాసం, పుట్టిన తేదీలు తప్పులు లేకుండా చేసుకోవాలని సూచించారు. బాధ్యతలు స్వీకరించిన బెల్లి యాదయ్య నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ తెలుగు శాఖకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా నియామకమైన డాక్టర్ బెల్లి యాదయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బెల్లి యాదయ్య ప్రస్తుతం నకిరేకల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన యాదయ్యకు ఎంరిజిస్ట్రార్ అల్వాల రవి, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ డీన్ కొప్పుల అంజిరెడ్డి, తెలుగు శాఖ అధ్యక్షురాలు అరుణప్రియ, జి.నర్సింహ, ఎం.సత్యనారాయణరెడ్డి, అనితకుమారి ఉన్నారు. -
తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు ఎవరూ చెరిపేయలేరు
నల్లగొండ టూటౌన్: తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లను చెరిపేయడం ఎవరి తరం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద, బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అక్కడ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. 15 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నల్ల గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, చీర పంకజ్‌యాదవ్, బొర్ర సుధాకర్, మందడి సైదిరెడ్డి, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, కరీంపాషా తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ మిర్యాలగూడ : దశాబ్దాల పాటు వెనుకబాటుకు గురైన తెలంగాణను అన్నివిధాలుగా అభివృద్ధి చేసి మాజీ సీఎం కేసీఆర్ దేశానికి స్పూర్తి ప్రదాత అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డితో కలిసి జగదీష్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, బైరం సంపత్, ఆంగోతు హాతీరాంనాయక్, కుందూరు వీరకోటిరెడ్డి, లావూరి మేగ్యానాయక్, ఎండీ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి -
కులగణన పేరుతో కాంగ్రెస్ డ్రామా
యాదగిరిగుట్ట : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఒక డ్రామా అని, సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణనకు తాము వ్యతిరేకం కాదని, అయితే బీసీలకు సామాజిక న్యాయం చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ, ఇన్నాళ్లూ ఏం చేసిందన్నారు. 70 ఏళ్లలో ఒక్క ఓబీసీ వ్యక్తిని అయినా సీఎం చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ గణనను చట్టబద్ధమైన సంస్థలతో సర్వే చేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తే పార్లమెంట్లో ఆమోదించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తూ రాష్ట్రపతులను చేసిందని, కేబినెట్లో 27మంది ఓబీసీలు ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కాంలు, భూదందాలు, లంచాల పార్టీ అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దలకు డబ్బు సంచులను పంపేందుకే తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్రమోదీపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాలు ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసిస్తుంటే.. కాంగ్రెస్ ముఖం చాటేస్తుందన్నారు. భారతదేశాన్ని 6వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు సంపూర్ణంగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి త్వరలోనే ఎంఎంటీఎస్‌ను యాదగిరిగుట్టకు తీసుకువస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ పడమటి జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు.. ఫ ఎంపీ ఈటల రాజేందర్ -
మహిళా సంఘాలకు అందని కమీషన్
నల్లగొండ: ఽమహిళా సమభావన సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఐకేపీ ద్వారా మహిళా సంఘాలకు అప్పగించింది. ఇందులో భాగంగా మహిళా సంఘాలే డీఆర్డీఏ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. అయితే నాలుగు సీజన్లుగా కోట్ల రూపాయల కమీషన్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా మంజూరు చేయకపోవడంతో ఎదురుచూపుల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగు సీజన్లుగా అందని కమీషన్.. ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీలో మహిళా సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తుంటాయి. వారితో పాటు ప్రాథమిక సహకార సంఘాలు, రైతు పరస్పర సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తూ వస్తున్నారు. నాలుగు సీజన్ల నుంచి కమీషన్ విడుదల చేయకపోవడంతో మహిళా సంఘాలు ఇబ్బందులు పడుతున్నాయి. రూ.35.63 కోట్ల బకాయిలు నాలుగు సీజన్లకు సంబంధించి మహిళా సంఘాలకు రూ.35,63,66,446 కమీషన్ చెల్లించాల్సి ఉంది. ఇందులో 2022–23 రబీకి సంబంధించి రూ. 66,41,0787 చెల్లించాల్సి ఉండగా 2023–24లో ఖరీఫ్‌కు సంబంధించి రూ.10,32,81,254 చెల్లించాల్సి ఉంది. 2023– 24 రబీకి సంబంధించి రూ.9,84,05,849 చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా 2024– 25 ఖరీఫ్‌కు సంబంధించి రూ.8,82,68,556 చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ.35.63 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఫ మంజూరు కాని ధాన్యం కొనుగోళ్ల నిధులు ఫ రూ.35.63 కోట్లు పెండింగ్ నెరవేరని ప్రభుత్వ ఉద్దేశం ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ డబ్బులు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేరడం లేదు. మహిళా సంఘాలు వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం సకాలంలో ప్రభుత్వం నుంచి కమిషన్లు అందక వారు అనుకున్న లక్ష్యాలను అందుకోలేని పరిస్థితి నెలకొంది. -
లింగమయ్యా.. దీవించయా్య..
విద్యుత్ వెలుగుల్లో లింగమంతులస్వామి ఆలయ పరిసరాలు వైభవంగా గొల్లగట్టు జాతర ప్రారంభం ఫ కేసారంలో దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు ఫ అర్ధరాత్రి కాలినడకన పెట్టెను గట్టుకు చేర్చిన భక్తులు ఫ ఆకట్టుకున్న మందగంపల ప్రదక్షిణ చివ్వెంల/సూర్యాపేట టౌన్: గజ్జెల లాగుల గలగలలు, కటార్ల విన్యాసాలు, డప్పు చప్ప్పుళ్లు, భక్తుల పూనకాల నడుమ లింగా.. ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు మార్మోగింది. మేడారం జాతర తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి జాతర (పెద్దగట్టు జాతర) ఆదివారం ప్రారంభమైంది. యాదవులు సంప్రదాయ దుస్తులు ధరించి భేరీల చప్పుళ్లతో సందడి చేశారు. ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలతో పాటు ఇతర వాహనాల్లో యాదవులు, భక్తులు ఆదివారం అర్ధరాత్రికే గట్టుకు చేరుకున్నారు. అర్ధరాత్రి గట్టుకు చేరిన దేవరపెట్టె.. ముందుగా సూర్యాపేట మండలం కేసారంలో ఆదివారం రాత్రి దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గొర్ల గన్నారెడ్డి ఇంటి నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, మెంతబోయిన లింగస్వామి ఇంటి నుంచి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి దేవతామూర్తులకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి పూజలు చేశారు. అనంతరం యాదవులు, ఇతర కులాలవారు కాలినడకన దేవరపెట్టెను ఊరేగింపుగా పెద్దగట్టు వద్దకు చేర్చారు. అనంతరం ఆలయానికి పడమటి వైపుఉన్న మెట్ల ద్వారా గొల్లగట్టుపైకి చేరి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. మెంతబోయిన, మున్న, గొర్ల వంశస్తులు దేవరపెట్టెకు పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ మందగంపల ప్రదక్షిణ మున్న మెంతబోయిన వంశస్తులకు చెందిన ప్రతి ఇంటి నుంచి మహిళలు మందగంపలతో జాతరకు తరలివచ్చారు. ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి సుమారు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.నేడు చౌడమ్మకు బోనాలుజాతరలో రెండో రోజు సోమవారం చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా మెంతబోయిన వంశస్తులు తెల్చిన తొలి గొర్రె (తల్లి గొర్రె), మున్న వంశీయులు తెచ్చిన బద్దెపాల గొర్రె, రెడ్డిగొర్ల వంశీయులు తెచ్చిన వర్ధ గొర్రెను అమ్మవారి ముందు జడత పడుతారు. అనంతరం అమ్మవారికి బలి ఇస్తారు. -
కిక్కిరిసిన చేపల మార్కెట్
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డులో గల చేపల మార్కెట్ ఆదివారం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ షాపుల వద్ద కొనుగోళ్లు జరగక వెలవెలబోగా.. చేపల మార్కెట్ వద్ద ప్రజలు ఎగబడి చేపల కొనుగోళ్లు చేశారు. కేజీ రవ్వ రూ.230 నుంచి రూ.250 వరకు, పాంప్లెట్స్ పెద్ద సైజ్ కేజీ రూ.100, కొర్రమీను కేజీ రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూసీ రోడ్డు చేపల కొనుగోలుదారులతో రద్దీగా కనిపించింది.చేపలు కొనుగోలు చేస్తున్న ప్రజలు -
ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనే సంతృప్తి
నల్లగొండ: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కలిగే సంతృప్తి మరెందులో రాదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న పార్కులో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్న ఎంత బిజీగా ఉన్నప్పటికీ నల్లగొండ నియోజకవర్గ ప్రజల కోసం ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తామని తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రజాదర్బార్‌కు అధికారులను పిలువలేదని పేర్కొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
చికెన్ అమ్మకాలు డౌన్
నల్లగొండ టూటౌన్: ఆదివారం వచ్చిందంటే చాలు దాదాపు ప్రతి ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. కానీ బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ అంటేనే వామ్మో అంటున్నారు. గత పది, పదిహేను రోజుల నుంచి బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోతుండడంతో చికెన్ అంటేనే భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు ప్రతి ఆదివారం సరాసరిగా 1.80 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు సాగిస్తుంటారు. కానీ ఈ ఆదివారం ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆదివారం రోజు కేవలం 50వేల కేజీల వరకు చికెన్ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. గతంతో పోలిస్తే మూడింతల అమ్మకాలు పడిపోయినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో 60వేల కేజీల నుంచి 80 వేల కేజీల వరకు అమ్మకాలు సాగిస్తుంటారు. కానీ అక్కంపల్లి రిజర్వాయర్‌లో చనిపోయిన కోళ్లను పడవేయడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం కావడంతో నల్లగొండ జిల్లాలో చికెన్ అమ్మకాలపై బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ పడింది. దీంతో ఆదివారం రోజున చికెన్ అమ్మకాలు లేక దుకాణాలన్నీ వెలవెలబోయాయి. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదని ప్రకటించినా చనిపోయిన కోళ్లు రిజర్వాయర్‌లో ప్రత్యక్షం కావడంతో ఈ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాలపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. శుభకార్యాల్లో నో చికెన్.. ఏ చిన్న ఫంక్షన్ చేసినా చికెన్ ఉండాల్సిందే. పెద్ద శుభకార్యాల్లో అయితే చికెన్‌తో పలు రకాలుగా వంటలు చేసి పెడుతారు. శనివారం నల్లగొండలో ఫంక్షన్ ఉంటే ఒక అతను 60 కేజీల చికెన్ తీసుకెళ్లాడు. ఫంక్షన్ కు వచ్చిన వారు చికెన్‌కు దూరంగా ఉన్నారు. 60 కిలోల చికెన్‌లో కేవలం 6 కేజీల చికెన్ మాత్రమే తినగా ..మిగతా చికెన్ మిగిలిపోయింది. బర్డ్‌ఫ్లూ ప్రచారంతో ఇటు చికెన్ కొనలేక దాని స్థానంలో మటన్, చేపలు పెట్టాల్సి వస్తుండడంతో ఫంక్షన్లు చేసే వారికి కూడా ఖర్చు భారీగా పెరుగుతోంది. వ్యాపారుల ఉపాధిపై ఎఫెక్ట్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హోల్‌సేల్ వ్యాపారులు ఐదారుగురు వర్కర్లను పెట్టుకొని చికెన్ దుకాణాదారులకు అందిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో చికెన్ అమ్మకాలు లేకపోవడంతో చికెన్ వ్యాపారులతో పాటు, వాటిల్లో పనిచేసే వర్కర్ల ఉపాఽధిపై కూడా ప్రభావం పడింది. వెలవెలబోతున్న చికెన్ దుకాణాలు ఫ గతంలో ఒక్క ఆదివారమే 1.80లక్షల కేజీలకు పైగా అమ్మకాలు ఫ బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కేవలం 50వేల కేజీలు విక్రయించిన వ్యాపారులు 80 శాతం అమ్మకాలు పడిపోయాయి బర్డ్‌ఫ్లూ ప్రచారంతో చికెన్ అమ్మకాలు 80 శాతం వరకు పడిపోయాయి. ఆదివారం రోజు 1600 కిలోల చికెన్ అమ్ముడు పోయేది. ఇప్పుడు 150 కిలోలు మాత్రమే అమ్ముడు పోయింది. నిన్న, మొన్నటి వరకు కొంతమేర అమ్మకాలు సాగగా.. రిజర్వాయర్‌లో కోళ్లు తేలడంతో అమ్మకాలు తగ్గడానికి కారణమైంది. – సలీమొద్దీన్, చికెన్ వ్యాపారి, నల్లగొండ -
ప్రాణాపాయం నుంచి రక్షించేలా..
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.24 కోట్ల వ్యయంతో 80 పడకల సామర్థ్యం గల క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. రెండు బ్లాకులుగా చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను మరో రెండు నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఆసుపత్రి వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ యూనిట్లో ఆధునిక ఐసీయూ, ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసి సేవలు అందించేందుకు జీజీహెచ్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ యూనిట్ ప్రారంభమైతే జిల్లాలోని ప్రాణాపయస్థితిలో మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఆస్పత్రుల నుంచి అత్యవసర వైద్య సేవల కోసం రిఫర్ చేసే రోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రాణాపాయస్థితిలో చికిత్స.. ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 20 పడకలతో ఐసీయూ విభాగం, మరో 20 పడకలతో అత్యవసర విభాగంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే జిల్లాలోని ఏరియా ఆసుపత్రి నుంచి అత్యవసర వైద్య సేవల కోసం రిఫర్ చేస్తున్న రోగులకు మంచాలు సరిపోవడం లేదు. దీంతో వారిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌కు రెఫర్ చేస్తున్నారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఫ జీజీహెచ్‌లో పూర్తికావొస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులు ఫ 80 పడకల సామర్థ్యంతో రెండు బ్లాక్‌ల నిర్మాణం ఫ నెల రోజుల్లో అందుబాటులోకి రానున్న ఒక బ్లాక్ ఒక యూనిట్లో తొలుత ఓపీ సేవలు.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నూతన భవన నిర్మాణం కోసం పాత భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం కూల్చివేశారు. ప్రస్తుతం పాత భవనంలో నిర్వహిస్తున్న ఓపీ సేవలు, బ్లడ్ బ్యాంకు, తెలంగాణ హబ్‌లకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు క్రిటికల్ కేర్ యూనిట్లో ఒక బ్లాక్‌లో అవుట్ పేషెంట్ సేవలను, బ్లడ్ బ్యాంకు, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను నిర్వహించేందుకు ఆసుపత్రి వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. మరో బ్లాక్‌లో రెండు నెలల తర్వాత క్రిటికల్ కేర్ సెంటర్ సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కూల్చివేసిన పాతభవనం స్థానంలో కొత్త భవన నిర్మాణం పూర్తయితే క్రిటికల్ కేర్ యూనిట్లో రెండు బ్లాక్‌లు అందుబాటులోకి వచ్చి 80 పడకల సామర్థ్యంతో అత్యవసర సేవలు అందనున్నాయి. -
నేడు పాఠశాలలకు సెలవు
నల్లగొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దగట్టు (దురాజ్‌పల్లి) జాతర సందర్భంగా లోకల్ హాలీడే ప్రకటించినట్లు పేర్కొన్నారు. టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి మర్రిగూడ: పదో తరగతిలో విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులపై ఆయన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బాలరాజు, యాదయ్య, శ్రీరాములు ఉన్నారు. బుద్ధవనం సందర్శించిన జిల్లా అటవీశాఖ అధికారి నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని ఆదివారం జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, ఆయన మిత్ర బృందం సందర్శించారు. ఈ సందర్బంగా బుద్ధవనంలోని బుద్ధ చరిత వనం, ధ్యానవనం, జాతకవనం, స్థూవనాలను సందర్శించారు. బుద్ధవనంలోని మహాస్థూపం ధ్యానమందిరంలో ధ్యానం చేశారు. నారసింహుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. అనంతరం గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
నేడు మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
నల్లగొండ టూటౌన్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ నెల 17న ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీ ఎదుట మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. -
కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి
అర్వపల్లి: గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 30 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి మెరుగు దేవయ్య తన గొర్రెలను శనివారం రాత్రి ఇంటి సమీపంలోని దొడ్డిలోకి తోలాడు. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు గుంపుగా గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 30 గొర్రెలు మృతిచెందాయి. ఆదివారం ఉదయం దేవయ్య గొర్రెల దొడ్డి వద్దకు వచ్చి చూడగా గొర్రెలు చనిపోయి ఉండడంతో లబోదిబోమంటూ స్థానికులకు విషయం తెలియజేశాడు. సుమారు రూ.3లక్షలకు పైగానే నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. అదృశ్యమైన వృద్ధురాలు మృతినూతనకల్: అదృశ్యమైన వృద్ధురాలు ఆదివారం మృతిచెందింది. ఎస్ఐ మహేంద్రనాఽథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండల కేంద్రంలోని హరిజన కాలనీకి చెందిన ఇరుగు నర్సమ్మ(75)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ నెల 13వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఆదివారం హరిజన కాలనీ పక్కనే బావిలో నర్సమ్మ మృతదేహం తేలిఉండటం స్థానికులు గమనించి వెలికితీశారు. మృతురాలి కుమారుడు సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. బెల్ట్ షాపులు నిర్వహించొద్దుఫ చిట్యాల మండలం ఏపూరులో మరోసారి మహిళల నిరసన చిట్యాల: మండలంలోని ఏపూరులో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయించొద్దని గ్రామ మహిళలు ఈ నెల 13న గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అయినప్పటికీ మద్యం అమ్మకాలు కొనసాగుతుండటంతో ఆదివారం మరోసారి మహిళలంతా కలిసి ర్యాలీ నిర్వహించి, గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామంలో బెల్ట్ దుకాణాల్లో మద్యం విక్రయిస్తే రూ.లక్ష, బెల్ట్ షాపుల్లో మద్యం తాగి పట్టుబడిన వారు రూ.20,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించాలని షాపుల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు, ఎకై ్సజ్ పోలీసులు, ప్రజాప్రతినిధులు సహకరించి ఏపూరులో బెల్ట్ షాపుల నిషేధానికి సహకరించాలని గ్రామ మహిళలు కోరుతున్నారు. -
చేనేత సహకార సంఘాల గడుపు పెంపు
జూలై 20 వరకు గడువు పెంపు చేనేత సహకార సంఘాలకు నియమించిన పర్సన్ ఇన్చార్జిల గడువు మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని చేనేత సహకార సంఘాల పర్సన్ ఇన్చార్జిల పదవీకాలం జనవరి 21కి ముగిసింది. దీంతో జూలై 20 వరకు గడువు పెంచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మగ్గం నేసే ప్రతి చేనేత కార్మికుడికి అందేలా కృషి చేస్తున్నాం. – పద్మ, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ సాధకబాధకాలు చెప్పే అవకాశం లేదు చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చేనేత కార్మికుడే సంఘానికి చైర్మన్‌గా ఉంటే మా సాధకబాధకాలు తెలిసి మాకేం అవసరమో సమకూరుస్తారు. కానీ అధికారులతో అంత చొరవగా మాట్లాడలేం, మా సమస్యలను చెప్పుకోలేం. వెంటనే సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. – దుద్యాల పాపయ్య, చేనేత సహకార సంఘం సభ్యుడు, భూదాన్‌పోచంపల్లి భూదాన్‌పోచంపల్లి: చేనేత సహకార సంఘాలకు పర్సన్ ఇన్చార్జిలనే తిరిగి కొనసాగిస్తూ ప్రభుత్వం మరో 6 నెలల గడువును పొడిగించింది. పర్సన్ ఇన్చార్జిల పదవీకాలం గత నెల 21న ముగిసింది. దీంతో 2025 జూలై 20 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడేళ్లుగా ఎన్నికలు లేవు.. చేనేత సహకార సంఘాలకు గత ఏడేళ్లుగా ఎన్నికలు నిర్వహించలేదు. జిల్లాలో 2013 ఫిబ్రవరిలో చేనేత సహకార సంఘాలకు చివరగా ఎన్నికలు జరిగాయి. 2018 ఫిబ్రవరిలో పాలకవర్గాలకు ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యింది. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్చార్జిలను నియమించి, వారితోనే పాలన నెట్టుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుందని చేనేత వర్గాలంతా ఆశపడ్డారు. చేనేత నాయకులు పలుమార్లు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కానీ ప్రభుత్వం మరోసారి పర్సన్ ఇన్చార్జిలనే కొనసాగిస్తూ గడువు పొడిగించింది. 13 దఫాలుగా గడువు పొడిగిస్తూ... 2018లో చేనేత సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత నియమించిన పర్సన్ ఇన్చార్జిల పదవీకాలాన్ని ప్రతి ఆరు నెలలకొకసారి గడువు పొడిగించుకొంటూ ఈ ఏడేళ్ల కాలంలో 13 దఫాలుగా పొడిగించారు. ఉమ్మడి జిల్లాలో సంఘాలు ఇలా... ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాలు, పవర్‌లూమ్‌లు కలిపి మొత్తం 84 ఉన్నాయి. ఇందులో యాదాద్రి జిల్లాలోనే అత్యధికంగా 43 సంఘాలు ఉండగా 12 క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. వీటిలో మొత్తం 18,882 మంది చేనేత కార్మికులు సంఘం సభ్యులుగా ఉన్నారు. అలాగే నల్లగొండ జిల్లాలో 25 సహాకార సంఘాలు, 5 పవర్లూమ్ సంఘాలు ఉండగా, ఇందులో మొత్తం 6588 మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 3 సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. 330 మంది సంఘ సభ్యులున్నారు. అచేతనంగా సంఘాలు ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్చార్జిలను నియమించడం వల్ల చేనేత సహకార సంఘాలు కార్మికులకు చేతినిండా పనికల్పించలేకపోతున్నాయి. పర్సన్ ఇన్చార్జిలు వెంటనే కార్మికులకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోలేకపోతుండడంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడంలేదని చేనేత కార్మికులు వాపోతున్నారు. ముఖ్యంగా నూలు, రంగులు, రసాయనాలు తదితర ముడిసరుకు సకాలంలో అందించలేకపోతున్నారు. దీంతో చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్ద కూలీ మగ్గాలపై పనిచేస్తున్నారు. చేనేత సహకార సంఘాలలో అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఒక్కో చేనేత సహకార సంఘంలోనే కోటి 10లక్షల విలువైన చేనేత వస్త్రాల స్టాక్ నిల్వ ఉంది. భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, కొయ్యలగూడెం, భువనగిరి తదితర సంఘాలకు ఏడాదికి 2కోట్లకు పైగా వస్త్రాలను తయారు చేయించే సామర్థ్యం ఉంది. కానీ అందుకనుగుణంగా టెస్కో వస్త్రాలను కూడా కొనడంలేదు. ఒకవేళ అరకొర వస్త్రాలను కొనుగోలు చేసినా సకాలంలో బిల్లులు చెల్లించడంలేదు. ఎన్నికలు నిర్వహిస్తే సమస్యలన్నింటికీ చెక్ పడుతుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఎన్నికలు నిర్వహించాలి చేనేత కార్మికులకు చేనేత సహకార సంఘం కన్నతల్లిలాంటిది. గత ప్రభుత్వం దీర్ఘకాలంగా ఎన్నికలు నిర్వహించకుండా సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఈ వ్యవస్థను పటిష్టం చేయాలంటే తక్షణమే ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని నియమించాలి. పాలకవర్గం ఉంటే కార్మికులకు కావల్సిన అవసరాలను తీరుస్తుంది. – కర్నాటి పురుషోత్తంం, తెలంగాణ చేనేత జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఫ మరో 6 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఫ పర్సన్ ఇన్చార్జిలకే బాధ్యతలు ఫ ఏడేళ్లుగా పాలకవర్గాలు లేక కునారిల్లుతున్న చేనేత సహకార సంఘాలు -
కాంగ్రెస్ నాయకుల బాహాబాహీ
చిలుకూరు: చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఆదివారం నిర్వహించిన సీతారామచంద్రస్వామి దేవాలయం పునర్నిర్మాణ శంకుస్థాసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతవోలు గ్రామంలో గల శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం పునర్నిర్మాణానికి ఆదివారం ఆలయ చైర్మన్ పెండ్యాల వీరస్వామి శంకుస్థాపన చేస్తుండగా.. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులైన మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వట్టికూటి చంద్రకళ భర్త నాగయ్య వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వట్టికూటి నాగయ్యను అవతల వర్గం నాయకులు దూషించడంతో గొడవ పెద్దదిగా మారింది. దేవాలయం లోపల జరుగుతున్న ఘర్షణ వ్యవహారం ఆలయం బయట ఉన్న ఇరువర్గాల వారికి తెలియడంతో ఒక్కసారిగా పెద్దఎత్తున ఘర్షణ వాతావరణ నెలకొంది. ఇరు వర్గాల వారు రాళ్లు విసురుకున్నార. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వట్టికూటి నాగయ్య వర్గానికి చెందిన వెంకనర్సుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఇరు వర్గాల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇరువర్గాలను అక్కడి నుంచి తరలించడంతో సమస్య సద్దమణిగింది. కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, చిలుకూరు, కోదాడ టౌన్, కోదాడ రూరల్ ఎస్ఐలు సురభి రాంబాబుగౌడ్, రంజిత్‌రెడ్డి, అనిల్‌రెడ్డి బేతవోలు గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రత్యేక పోలీస్ బలగాలతో పికెట్ నిర్వహించారు. భగ్గుమన్న విభేదాలు బేతవోలు గ్రామంలో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి, వట్టికూటి నాగయ్య వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన మండల పార్టీ సమావేశంలో కూడా వీరు బహిరంగంగానే ఘర్షణ పడ్డారు. గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని పునర్నిర్మించాలని అనుకున్న నాటి నుంచి వివాదాలు ఎక్కువైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయ పరిధిలో సుమారు 22 ఎకరాల భూమి ఉండగా.. ఎకరం అమ్మి నూతన దేవాలయం నిర్మించాలని ఒక వర్గం వారు... గ్రామంలో చందాలు వసూలు చేసి నూతన దేవాలయం నిర్మించాలని మరో వర్గం పట్టుబట్టారు. నూతన దేవాలయం నిర్మాణం పేరుతో పురాతన దేవాలయాన్ని కూల్చి భూమి లోపల గల బంగారు నిక్షేపాలు కాజేయాలని కుట్ర పన్నుతున్నారని గ్రామంలోని మరో వర్గం అంటున్నారు. నాలుగు నెలల క్రితం దసరా పండుగ రోజు సైతం అర్థరాత్రి సమయంలో పెద్దఎత్తున ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేయగా.. ఏడుగురిపై కేసు నమోదు చేశారు. గురు, శుక్ర, శనివారాల్లో గ్రామంలో కనకదర్గమ్మ జాతర జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతర సజావుగా నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారింది. ఫ బేతవోలులో రాళ్లు రువ్వుకున్న రెండు వర్గాలు ఫ పలువురికి గాయాలు ఫ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు -
పెద్దగట్టుకు తరలిన భక్త జనం
బస్సు సర్వీసులను పరిశీలించిన ఆర్ఎం భానుపురి (సూర్యాపేట ): పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్ పాయింట్, బస్ సర్వీసులను ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు సూర్యాపేట డిపో నుంచి 60 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని సర్వీసులు నడుపుతామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎం సురేందర్, అసిస్టెంట్ మేనేజర్ సైదులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చివ్వెంల, సూర్యాపేట టౌన్: ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర ఆదివారం ప్రారంభమైంది. భక్తులు భారీగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. గట్టు పైకి వెళ్లే దారిలో మూడు వైపులా ఉన్న మెట్ల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ పూర్తిస్థాయిలో అందుబాటులో రాకపోవడంతో భక్తులు నిరాశ చెందారు. పార్కింగ్ ఉచితం జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. జాతర పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు భక్తుల వాహనాలకు అక్కడ ఉచితంగా పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ జాతర పరిసరాల్లో ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం నెలకొనకుండా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ద్య సిబ్బందిని నియమించారు. వీరు చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేస్తున్నారు. గుట్టపై పొట్టేళ్లను బలిచ్చే దగ్గర వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లనున్నారు. దాహార్తి తీర్చేందుకు భగీరథ నీరు పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో 12 చోట్ల కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. అందుబాటులో అత్యవసర సేవలు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అరికట్టడానికి జాతర పరిసరాల్లో ఫైరింజన్లను సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా 108, 104 వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. ఎలాంటి ఘటనలు జరిగినా భక్తులకు ప్రథమ చికిత్స అందించేందుకు సూర్యాపేట జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 8 ప్రదేశాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద డాక్టర్లతో పాటు ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఫ వివిధ శాఖల ఆధ్వర్యంలో సౌకర్యాల కల్పన -
హైవేపై వాహనాల దారి మళ్లింపు
సూర్యాపేట టౌన్, కోదాడ రూరల్, నార్కట్‌పల్లి: పెద్దగట్టు జాతర దృష్ట్యా విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు దారిమళ్లిస్తున్నారు. ● నార్కట్‌పల్లి వద్ద: హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద మళ్లించి నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌గర్, కోదాడ మీదుగా విజయవాడకు పంపిస్తున్నారు. ● కోదాడ వద్ద : విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను జాతీయ రహదారి 65పై కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ ఫ్లైఓవర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను కిందికి దింపి హుజూర్నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి బైపాస్ మీదుగా హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఎస్ఐలు, 12 మంది సిబ్బంది షిఫ్టుల ప్రకారం పనిచేస్తున్నారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీసులు రూట్‌మ్యాప్‌ను వివరిస్తున్నారు. ● ఖమ్మం వెళ్లే వాహనాలను..: హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365బీబీ మీదుగా మళ్లిస్తున్నారు. ఇక్కడ షిఫ్ట్‌కు 8 మంది చొప్పున 16 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ● కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుంచి బీబీగూడెం వద్ద నుంచి సూర్యాపేట పట్టణానికి పంపుతున్నారు. ఇక్కడ కూడా షిఫ్ట్‌కు 8 మంది చొప్పున 16 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ● సూర్యాపేట పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రజా రవాణా వాహనాలు కుడకుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవపురం స్టేజీ నుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి 65పై గుంజలూరు స్టేజీ వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపునకు పంపిస్తున్నారు. -
మృతదేహాన్ని తీసుకొస్తున్న ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్
ఫ నలుగురికి తీవ్ర గాయాలు నకిరేకల్: మృతదేహాన్ని తీసుకొస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నకిరేకల్ మండలం మర్రూర్ శివారులో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రూర్ గ్రామానికి చెందిన లింగమ్మ తన పెద్ద కుమార్తె ఊరైన కట్టంగూర్ మండలం అయిటిపాములలో అనారోగ్యంతో శనివారం మృతిచెందింది. లింగమ్మ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అయిటిపాముల నుంచి మర్రూర్‌కు ఆటోలో శనివారం రాత్రి తీసుకొస్తుండగా.. మర్రూర్ గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో తిప్పర్తి నుంచి వస్తున్న ట్రాక్టర్ అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కొత్తపల్లి లచ్చయ్య, బత్తుల సైదులు, రమణ, లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లింగమ్మ మృతదేహాన్ని మర్రూర్ తరలించి ఆదివారం అంత్యక్రియలు జరిపించారు. మృతురాలి మనవడు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు. -
రిజర్వేషన్ల పేరుతో ఎన్నికల వాయిదా సరికాదు
గరిడేపల్లి: రిజర్వేషన్ల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం సరికాదని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలోని ఎంఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల పాలకవర్గాలు రద్ధై ఏడాది దాటుతున్నా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే రీతిలో ఉన్నాయని అన్నారు. వేసవిలో ప్రజాప్రతినిధులు లేకుండా గ్రామాల్లో నీటి ఎద్దడిని ఎలా నివారిస్తారో ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో రాష్ట్రం కుంటు పడే విధంగా ఉందని, వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్ల సమస్యపై సుదీర్ఘ చర్చ జరిపి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలపై కపట ప్రేమ చూపిస్తోందని, మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఇందుకు ఉదాహరణ అన్నారు. పేద, మధ్యతరగతి వాళ్ల మీద అనేక రకాలైన ట్యాక్స్‌లు వేసి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పారేపల్లి శేఖర్‌రావు, మండల కార్యదర్శి ఎస్కే యాకూబ్, జిల్లా కమిటీ సభ్యుడు మేకనబోయిన శేఖర్, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మద్యం మత్తులో కత్తితో దాడిదేవరకొండ: మద్యం మత్తులో ఓ వ్యక్తిపై యువకుడు దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటన శనివారం రాత్రి దేవరకొండ మండలం పాత్లావత్తండా(టి)లో జరిగింది. దేవరకొండ ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాత్లావత్తండా(టి)కు చెందిన కొర్ర శరత్‌కు అదే తండాకు చెందిన పాత్లావత్ సేవా మధ్య శనివారం రాత్రి వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో మద్యం మత్తులో ఉన్న శరత్ కత్తితో సేవాపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సేవాను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
దేవరపెట్టె విశిష్టత
సూర్యాపేటటౌన్: లింగమంతులస్వామి జాతరలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి కీలకమైన దేవరపెట్టె (చౌడమ్మతల్లి పెట్టె) పెద్దగట్టుకు చేరుకుంది. పెద్దగట్టుపై దిష్టిపూజ నిర్వహించేందుకు మహబూబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయపాలెం గ్రామం నుంచి తండ వంశస్తులు గత నెల 21న అందెనపు చౌడమ్మ పెట్టెను సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి తీసుకొచ్చారు. 22న అర్ధరాత్రి మెంతబోయిన, గొర్ల, రెడ్డి, మున్నా వంశస్తుల ఆధ్వర్యంలో దేవర పెట్టెను గట్టు పైకి తీసుకొచ్చి దిష్టిపూజ నిర్వహించారు. మరుసటి రోజు కేసారం గ్రామానికి దేవరపెట్టెను చేర్చారు. ఆదివారం అర్ధరాత్రి అందెనపు చౌడమ్మ పెట్టె గట్టుపైకి చేర్చడంతో జాతర ప్రారంభమైంది. పెట్టెలో ఏముంది.. దేవరపెట్టెలో లింగమంతులస్వామి, 33మంది దేవతలు ఉంటారు. చౌడమ్మ, గంగమ్మ, యలమంచమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యమ్మ, ఐదుగురు చొప్పున రాజులు, చెంచులతో పాటు భూమినేడు, భూమసాని, వినా యకుడు, బ్రహ్మ, వరాహుడు, బొల్లావు, గొల్ల భామ, వసుదేవుడు, శ్రీకృష్ణుడు, పులి, భైరవుడు, పోతరాజు, బ్రాహ్మణుడు, నారథుడు, విశ్వామిత్రుడు, పాపనాక్షి, నాగేంద్రుడు ఉంటారు. -
సమన్వయం చేసుకోవాలి
చివ్వెంల (సూర్యాపేట): పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గించకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. ఆదివారం పెద్దగట్టు వద్ద జాతర ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు జాతర అని, ఎక్కువ మొత్తంలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు సమన్వయం చేసుకుంటూ జాతర విజయవంతమయ్యేలా కృషిచేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు జాతర పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు. ఎవరైనా భక్తులు తప్పిపోతే కంట్రోల్ రూమ్ వద్దకి వచ్చి తెలియజేస్తే మైక్ ద్వారా ప్రకటిస్తామన్నారు. జాతరలో దుకాణాల్లో చిన్న పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్లు శ్యామ్‌సుందర్‌రెడ్డి, కృష్ణయ్య, ఆంజనేయులు, అమీన్‌సింగ్ పాల్గొన్నారు. -
ఉదయ సముద్రంలో ఆవు కళేబరం
● నాలుగు రోజుల క్రితం పడినట్లు అనుమానం ● కుళ్లిపోయి కట్టవరకు కొట్టుకొచ్చిన ఆవు నల్లగొండ టూటౌన్: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ ఉదయం సముద్రంలో శనివారం ఆవు కళేబరం కనిపించడం కలకలం రేపింది. ఉమ్మడి జిల్లాలోని వందలాది గ్రామాలతో పాటు నీలగిరి మున్సిపాలిటీకి ఉదయ సముద్రం నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. ఉదయ సముద్రం వెనుక భాగం నుంచి ఆవు అందులోకి వెళ్లి మృత్యువాత పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయ సముద్రం కట్ట మధ్యలో ఉన్న తూము వరకు ఆవు కళేబరం కొట్టుకొచ్చి ఆగిపోయింది. నాలుగు రోజులు కావస్తుండడంతో ఆవు పూర్తిగా కుళ్లిపోయి కనిపిస్తోంది. ఇప్పటికే అక్కంపల్లి రిజర్వాయర్‌లో చనిపోయిన కోళ్లు వేశారనే వార్త ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మరి ఇక్కడ చనిపోయిన ఆవును అక్కడ పడేస్తే ఇక్కడికి కొట్టుకువచ్చిందా లేక.. ఆవు ప్రమాదవశాత్తు అందులోకి వెళ్లి మరణించిందా అనేది తెలియాల్సి ఉంది. ఆవులంటే నీటిలో కూడా ఈదుకుంటూ వెళ్తుంటాయి. మరి ఈ ఆవు ఏ కారణం చేత చనిపోయిందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార యంత్రాంగం ఆవు కళేబరాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. న్యాయం చేయాలని మహిళ నిరసననకిరేకల్: ఏఆర్ కానిస్టేబుల్ అయిన తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని గత నెల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ తగిన న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఓ మహిళ శుక్రవారం రాత్రి నకిరేకల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రికి చెందిన మొగిలి సైదులుకు చిలుకూరు మండలం ఆచార్యులగూడేనికి చెందిన నాగమణితో 2011లో వివాహం జరిగింది. నల్లగొండలో ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సైదులు ప్రస్తుతం కేతేపల్లి పోలీస్ స్టేషన్లో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సైదులు నకిరేకల్‌లోని పటేల్ నగర్లో ఓ ఇంట్లో మరో మహిళతో కలిసి అద్దెకు ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న అతడి భార్య నాగమణి గత నెల 22న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెల రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి న్యాయం చేయలేదని నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తూ నకిరేకల్ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం రాత్రి నిరసన చేపట్టింది. సీఐ రాజశేఖర్ వచ్చి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె అక్కడి నంచి వెళ్లిపోయింది. -
ప్రజలు అపోహలకు గురి కావొద్దు
పెద్దఅడిశర్లపల్లి : అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మృతి చెందిన కోళ్లను వేసిన ఘటనపై ప్రజలు ఎవరూ అపోహలకు గురికావద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం పెద్దఅడిశర్లపల్లి మండలలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఆమె.. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, జలమండలి, వెటర్నరి అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిజర్వాయర్‌లో కోళ్లు వేసిన సంఘటన తమ దృష్టికి వచ్చిన వెంటనే డిసిప్లీనరీ బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపంచామన్నారు. కోళ్లు వేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు నీరు ఎలాంటి కలుషితం కాలేదని, నీటి ప్రవాహంలో ఎలాంటి కోళ్ల కళేభరాలు లేవన్నారు. భూపాల్‌లోని ల్యాబ్‌కు నీటి నమూనాలు పంపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, ఏఎస్పీ మౌనిక, ఇరిగేషన్ డీఈ నాగయ్య, వెటర్నరి డాక్టర్ మహేందర్‌రెడ్డి, సీఐ ధనుంజయగౌడ్, ఎస్ఐ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఆడ, మగ పిల్లల్ని సమానంగా పెంచాలి
నల్లగొండ : మన ఇంటి నుంచే ఆడ, మగ పిల్లలను సమానంగా పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధిక చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ చట్టంపై ప్రతి మహిళా ఉద్యోగికి అవగాహన ఉండాలని, వారి కార్యాలయ పరిధిలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేధింపులకు గురైతే పిర్యాదు చేసేలా మహిళలకు ధైర్యం కల్పించాలన్నారు. డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ దీప్తి మాట్లాడుతూ ఈ చట్టాన్ని 2013లో పార్లమెంట్ ఆమోదించిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కెవి.కృష్ణవేణి, వివిద శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. -
సేవాలాల్ మార్గంలో నడవాలి
మిర్యాలగూడ : గిరిజన ఆరాధ్య దైవం శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ మార్గంలో ప్రతి గిరిజనుడు నడవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం సంత్‌సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహాబోగ్ బండార్ కార్యక్రంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సంత్‌సేవాలాల్ ఆశయాలను గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ధీరావత్ స్కైలాబ్‌నాయక్, మాలోతు దశరథ్‌నాయక్, భూక్యా లక్ష్మణ్‌నాయక్, బాలాజీనాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రాక్టికల్స్‌కు 111 మంది గైర్హాజరునల్లగొండ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు శనివారం 111 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు మొత్తం 1,661 విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 1,602 మంది హాజరయ్యారు. 59 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,039 మంది హాజరుకావాల్సి ఉండగా.. 987మంది పరీక్ష రాశారు. 52 మంది గైర్హాజరయ్యారు. -
గొల్లగట్టుకు వెళ్లొద్దాం
నేటి నుంచి దురాజ్‌పల్లి శ్రీలింగమంతులస్వామి జాతరసర్వం సిద్ధం చేసిన యంత్రాంగం రాత్రి కేసారం నుంచి పెద్దగట్టుకు రానున్న దేవరపెట్టె గంపల ప్రదక్షిణతో ప్రారంభం పెద్దగట్టు ఆలయంలో ఆర్అండ్ఆర్ కమిషనర్ పూజలు చివ్వెంల(సూర్యాపేట): మండలంలోని దురాజ్‌పల్లిలో గల శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) దేవస్థానాన్ని శనివారం రాష్ట్ర భూసేకరణ, ఆర్అండ్ఆర్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించకున్నారు. ఈ సందదర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. మరకతోరణం ఊరేగింపులో మాజీ ఎంపీ బడుగుల, వేణారెడ్డి తదితరులు చివ్వెంల(సూర్యాపేట): రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ జాతర ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభం కానుంది. రాత్రి సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి దేవరపెట్టెను పెద్దగట్టుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. దేవరపెట్టెలో గొల్ల లు ఆరాధించే శ్రీ లింగమంతుల స్వామితో పాటు 33మంది దేవతల గణం ఉంటుంది. సుమారు 400 ఏళ్లుగా రెండేళ్లకు ఒకసారి జరుగుతున్న ఈ జాతరకు మనరాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ సంప్రోక్షణ పూర్తి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేయించి, సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. మెట్లు, ప్రవేశద్వారానికి రంగుల వేశారు. తలనీలాలు, టెంకాయల వేలంపాటలు పూర్తి చేశారు. భక్తుల రవాణాకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించింది. తాగునీటి వసతితోపాటు, చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. జాతరలో వివిధ రకాల దుకాణాలతోపాటు వినోద శాలలు వెలిశాయి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి జాతరలో పారిశుద్ధ్యపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. జాతరను 8 జోన్లుగా విభజించారు. 7 ప్రాంతాల్లో శాశ్వత మరుగుదొడ్లు, 24 చోట్ల మహిళలకు, 48 చోట్ల పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు మూడు షిఫ్ట్‌ల ప్రకారం ఒక్కో షిఫ్ట్‌కు 130 మంది చొప్పున 390 మంది కార్మికులు పారిశుద్ధ్య విధుల్లో పాల్గొనున్నారు. షిఫ్ట్‌కు నాలుగు ట్రాక్టర్ల ద్వారా చెత్తాచెదారం తొలగించనున్నారు. ఇందుకు 19మంది సూపర్వైజర్లు, 12 మంది జవాన్లను నియమించారు. రాత్రి పూట వెలుగులు విరజిమ్మేలా ఎల్ఈడీ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం నాలుగు జనరేటర్లు అందుబాటులో ఉంచారు. కోనేరులో శివుని విగ్రహం ప్రతిష్టించారు. ఏర్పాట్ల పరిశీలన జాతరలో భక్తుల కోసం కల్పించిన సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణయ్య పర్యవేక్షించారు. ఈ జాతరకు 30 లక్షల మంది వరకు భక్తులు తరలిరానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో దురాజ్‌పల్లి శ్రీలింగమంతుల స్వామి ఆలయంసూర్యాపేట టౌన్: దురాజ్‌పల్లిలో ఆదివారం నుంచి ఐదు రోజులపాటు జరగనున్న శ్రీలింగమంతుల స్వామి జాతర మహోత్సవానికి శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్ల బజార్ నుంచి స్వామివారి మకర తోరణం భారీ ఊరేగింపు నడుమ పెద్దగట్టుకు తరలి వెళ్లింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పెద్దగట్టు జాతరను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. శ్రీలింగమంతుల స్వామి ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దగట్టు చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, కక్కిరేణి శ్రీనివాస్, మద్ది శ్రీనివాస్ యాదవ్, అంజాద్ అలీ, కోడి శివయాదవ్, హరీష్ యాదవ్, బత్తుల సాయి, వల్లపు రఘువీర్ యాదవ్, కోడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇస్మార్ట్ గౌరమ్మ
చిన్నతనంలో విన్న పద్యాలు, పౌరాణిక నాటకాలు చూసిన ఆమెకు తాను అలా పాడాలని.. నాటకాల్లో నటించాలని కోరిక ఉండేది. ‘ఆ బంగారు కాలం ఎటుబాయే’ అని బాధపడే గౌరమ్మకు స్మార్ట్‌ఫోన్ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. తన మనువరాలి సాయంతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ వేల మంది ఫాలోవర్స్‌ను సంపాదించి.. పలువురి చేత ఔరా అనిపించుకుంటోంది. – రాజపేట యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రేణిగుంట గ్రామానికి చెందిన రంగ గౌరమ్మ, ఆమె భర్త భిక్షపతి నిరక్షరాసులు. వ్యవసాయ కూలి పనులే వారికి జీవనాధారం. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు సెల్‌ఫోన్ ప్రపంచంలో తలమునకలవుతూ ఈ ప్రపంచాన్నే మరిచిపోవడాన్ని ఎన్నోసార్లు గమనించింది గౌరమ్మ. సెల్ఫోన్లో ఎన్నో యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూసింది. అవి చూసినప్పుడల్లా తనలోని కళాకారిణి మేల్కొనేది. ‘బావా ఎపుడు వచ్చితీవు’ ‘చెల్లియో చెల్లకో‘ ‘ఎక్కడ నుండి రాక’ ‘జెండాపై కపిరాజు’.. ఇలా ఎన్నో పద్యాలు తన చిన్నప్పటి రోజుల్లో విన్నది. సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానం, శ్రీరామంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, నర్తనశాల.. ఇలా ఎన్నో పౌరాణిక నాటకాలు చూసింది. పద్యాలు విన్నప్పుడల్లా.. తానూ పాడేది. నాటకాలు చూసినప్పుడల్లా తనకు కూడా వేదిక ఎక్కి నటించాలని ఉండేది. కానీ, ఎవరు ఏమంటారో అనే భయంతో నటించాలనే కోరిక తనలోనే ఉండిపోయేది. ప్రశంసలతో మరింత ఉత్సాహం గత కాలాన్ని కళ్ల ముందుకు తీసుకొస్తున్న సెల్‌ఫోన్‌ను కొనాలని గౌరమ్మ నిర్ణయించుకుంది. అక్క మనుమరాలు రీతిక, మేనకోడలు మౌనిక ప్రోత్సాహంతో స్మార్ట్ ఫోన్ కొని వినియోగిస్తుంది. వారి ద్వారా ఫోన్ ఎలా వాడాలో నేర్చుకుంది. చిన్న చిన్న వీడియోలు తీయడం, రీల్స్ తీస్తు.. తాను చేసిన వీడియోలను గత సంవత్సరం నుంచి యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసేంది. ఆ వీడియోలు చూసి మొదట ఊరి వాళ్లు, చుట్టాలు పక్కాలు ‘మన గౌరమ్మేనా!’ అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అభినందించారు. వారి అభినందనలు, ప్రశంసలు తనకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. చుట్టుపక్కల ఊరి వాళ్లు కూడా తనను గుర్తు పట్టి ప్రశంస పూర్వకంగా మాట్లాడేవారు. గౌరమ్మ చేసిన పోస్టులకు లైకులు రావడం, సబ్‌స్కైబర్లు పెరగడం మొదలైంది. క్లీన్ అండ్ గ్రీన్ షార్ట్స్ పద్ధతిగా వీడియోలు చేస్తూ ‘భేష్’ అనిపించుకుంటుంది గౌరమ్మ. జాతరలు, దేవాలయాల దర్శనం, పెళ్లిళ్లు, పేరంటాలు, పిల్లలను తొట్టెల్లో వేయడం, వ్యవసాయ పనులు చేసే కూలీలు, వరి నాట్లు వేయడం, ముగ్గులు వేసే మహిళలు.. ఇలా తనకు తోచినట్టుగా రీల్స్ చేస్తూ వచ్చింది. ఇప్పటివరకు మొత్తం 1500 వరకు పోస్టులు చేయగా 8,831 మంది ఫాలోవర్స్ ఉన్నారు. గౌరమ్మ చేస్తున్న ‘రీల్స్’ ప్రాచుర్యం పొందడంతో ఆమె పేరు కాస్త ‘ఇన్‌స్ట్రాగామ్ గౌరమ్మ’గా మారింది.మెచ్చుకోవడం సంతోషంగా ఉంది యూట్యూబ్ వీడియోలు, ఇన్స్ట్రాగామ్స్ ‘రీల్స్’ చూసిన తరువాత నాకు కూడా ఏదైనా చేయాలనిపించింది. అక్షరం ముక్క రాకపోయినా చాలా బాగా వీడియోలు చేసి ఎంతోమంది చేత ‘శభాష్’ అనిపించుకుంటున్న వారిని యూట్యూబ్‌లో చూసిన తరువాత నాకు కూడా ధైర్యం వచ్చింది. రీల్స్, వీడియోలు చేయడానికి ఎక్కడికీ పోనవసరం లేదు.. మన ఇల్లు, పొలాలే స్టూడియో అనుకొని పనిలోకి దిగాను. ఎంతోమంది మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ఫ ఇన్స్టాగ్రామ్ ‘రీల్స్’ చేస్తూ ఔరా అనిపిస్తున్న రంగ గౌరమ్మ ఫ మనవరాలే గురువుగా డిజిటల్ పాఠాలు నేర్చుకున్న బామ్మ ఫ ఇల్లు, పొలాలే స్టూడియోగా వీడియోలు, రీల్స్ – రంగ గౌరమ్మ -
2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్
ఫ నియామక ఉత్తర్వులు జారీ చేసిన డీఈఓ భిక్షపతి నల్లగొండ : 2008 డీఎస్సీలో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చేందుకు విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంతో డీఈఓ బిక్షపతి శనివారం కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. 2008లో నిర్వహించిన డీఎస్సీలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నష్టపోయారు. దాంతో వారంతా తాము అర్హులమని.. మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల న్యాయస్థాన ఆదేశాలతో రాష్ట్ర విద్యాశాఖ వారిని కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లో తీసుకునేందుకు అంగీకరించింది. దీంతో జిల్లాలో 75 మంది అభ్యర్థులకు శనివారం డీఈఓ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరికి ప్రతి నెల రూ.31,040 వేతనం ఇవ్వనున్నారు. ముగిసిన ఏరియల్ సర్వేమిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలో హెలికాప్టర్ సాయంతో చేపట్టిన నక్ష ఏరియల్ సర్వే శనివారం ముగిసింది. శనివారం పట్టణంలోని శివారు ప్రాంతాల్లో శాటిలైట్ ద్వారా గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను గుర్తించారు. ఈ సర్వే జిల్లా సర్వే విభాగం ఏడీ శ్రీనివాస్ పర్యవేక్షణలో చేపట్టారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో డ్రోన్ సర్వేను చేపట్టనున్నారు. మిర్యాలగూడ పెద్ద మసీదు కమిటీ రద్దుమిర్యాలగూడ : పట్టణంలోని పెద్దబజార్‌లోని పురాతన పెద్ద మసీద్(సారాయే మీరాలం)ను వక్ఫ్‌బోర్డ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న మసీదు కమిటీ పదవీకాలం ముగియడంతో కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు కమిటీ రద్దయినట్లు మసీదులో నోటీసు బోర్డుపై అంటించారు. ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డ్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ మహమ్మద్ ఆసిఫ్‌అలీఖాన్ మాట్లాడుతూ పట్టణంలోని పురాతన పెద్ద మసీదు (సారాయే మీరాలం) కమిటీ పదవీకాలం ముగిసిందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగి కొత్త కమిటీని ఎన్నుకునేంతవరకు మసీదు, దాని ఆధీనంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మసీదు నిర్వహణ బాధ్యత ప్రత్యేకాధికారిగా వక్ఫ్‌బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్ వ్యవహరిస్తారని తెలిపారు. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటి నుంచి మసీదు, షాపింగ్ కాంప్లెక్స్ లావాదేవీలన్నీ వక్ఫ్‌బోర్డ్ యాజమాన్యం నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో లీగల్ అడ్వయిజర్ మహమ్మద్ ఇమ్రాన్, సర్వేయర్ మహమ్మద్ మాజీద్, ఇన్స్పెక్టర్ మహమూద్ పాల్గొన్నారు.