బండరాయితో మోది చంపేశారు | Man brutally murdered | Sakshi
Sakshi News home page

బండరాయితో మోది చంపేశారు

Published Sat, Jul 11 2015 6:27 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

Man brutally murdered

అత్తాపూర్ (హైదరాబాద్) : గుర్తు తెలియని కొందరు దుండగులు ఓ యువకుడిని బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై ఉమేందర్ తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ రాంరెడ్డిబావి వద్ద గల నీటి సంపులో ఓ యువకుడి మృతదేహం స్థానికులకు కనిపించింది.

దీనిపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి తలపై బండరాయితో మోది చంపిన ఆనవాళ్లున్నాయి. అపరిచితులు ఈ దారుణానికి ఒడిగట్టారా లేక డబ్బుల విషయమై జరిగిన  గొడవలో స్నేహితులే చంపేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement