నగరంలోని వనస్థలిపురం సచివాలయం నగర్‌లో హత్యకు గురైన లలిత్ కేసులో నలుగురు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : ప్రేమ వివాహం నేపథ్యంలో జరిగిన పరువు హత్య కేసును పోలీసులు చేధించారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సచివాలయనగర్‌లో నిన్న(గురువారం) జరిగిన లలిత్ ఆదిత్య హత్య నగరంలో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి యుశ్వంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సాయి ప్రకాశ్ రెడ్డి అనే ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. సాయి కిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. హత్య అనంతరం వీరంతా కారులో కందుకూరు వెళ్లి అక్కడ కొత్త దుస్తులు కొని కర్తాల్ గ్రామంలో తలదాచుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తమ అక్క సుష్మిత రెడ్డిని హింసించినందుకే హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నారు.