ప్రభుత్వ కళాశాలలో బాత్‌రూంలు శుభ్రం చేసే యువకుడు తనను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని కోరుతూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు.
పెద్దపల్లి (కరీంనగర్ జిల్లా): ప్రభుత్వ కళాశాలలో బాత్‌రూంలు శుభ్రం చేసే యువకుడు తనను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని కోరుతూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. పెద్దపల్లిలోని ప్రభుత్వ కళాశాలలో బబ్లూ(25) అనే యువకుడు బాత్‌రూంలు శుభ్రం చేసే పని చేస్తున్నాడు. ఇదే పనిని గతంలో తన తాత, తండ్రి కూడా చేశారు. మూడు తరాలుగా మేం ఈ పని చేస్తున్నామని, నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని బబ్లూ కోరుతున్నాడు. ఇందుకోసం అతను ఒంటిపై కిరోసిన్ పోసుకుని మండల కేంద్రంలోని వాటర్‌ట్యాంక్ ఎక్కాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బబ్లూతో చర్చలు జరిపారు.