నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగింది.
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగింది. దుండగులు ఓ యువకుడిని కొట్టి అతని నుంచి రూ.2.50 లక్షలు ఎత్తుకుపోయారు.
సూళ్లూరుపేటకు చెందిన సిద్దిఖి అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై పట్టణం వైపు వస్తుండగా దారి కాచిన దుండగులు అటకాయించారు. ప్రతిఘటించిన సిద్దిఖిని విచక్షణారహితంగా కొట్టి, అతని వద్ద ఉన్న రూ.2.50 లక్షల నగదును లాక్కుని పరారయ్యారు.