
ఆ ముసుగులో కోరికలు తీర్చుకుంటున్నాడు!
ఫేస్బుక్ ఫ్రెండ్ ముసుగులో అమ్మాయిలను లొంగదీసుకుని కోరికలు తీర్చుకుంటున్న కేటుగాడి ఉదంతం బట్టబయలైంది. హైదరాబాద్‌లో శుక్రవారం బట్టబయలైన ఫేస్‌బుక్ క్రిమినల్ మాజీద్ లాంటి కేసే మరొకటి రాజమండ్రిలోనూ వెలుగు చూసింది. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకుని, వారికి దగ్గరై ఆ తరువాత వారిని లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్న బొబ్బా హరిశ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎంతో మంది అమ్మాయిలు వీడిబారిన పడగా ఒకరు మాత్రం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లైంగికంగా వేధించడంతోపాటు... మోసం చేశాడని ఆరోపిస్తూ కేశవరానికి చెందిన ఓ కాలేజీ విద్యార్ధిని తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హరీశ్.. తనతో స్నేహం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడని, ఆ తరువా మోసం చేశాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ మేరకు బొబ్బా హరిష్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు.