![Girl student ends life after mother denies mobile phone](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/5445.jpg.webp?itok=xAVsCYUv)
∙కుమురంభీం జిల్లా కౌటాలలో ఘటన
కౌటాల(సిర్పూర్): తల్లి తనకు సెల్‌ఫోన్ ఇవ్వలేదని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుమురంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్సై మధుకర్ కథనం ప్రకా రం.. కౌటాలలోని ప్రగతి కాల నీకి చెందిన బొమ్మకంటి సదానందం, రమాదేవి దంపతులకు కుమారుడు, కుమార్తె స్ఫూర్తి (16) ఉన్నారు. స్ఫూర్తి స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువు తోంది. శనివారం మధ్యాహ్నం కాగజ్‌నగర్ నవోదయలో నిర్వహించిన ఇంటర్ ప్రవేశ పరీక్ష రాసింది.
పరీక్ష అనంతరం తండ్రి సదానందం స్ఫూర్తిని ఇంటివద్ద దించి బయ టకు వెళ్లాడు. కాగా, పదో తరగతి స్టడీ మెటీరియల్‌ను చూసుకోవడానికి సెల్‌ఫోన్ ఇవ్వాలని స్ఫూర్తి తన తల్లి రమాదేవిని కోరింది. అయితే సెల్‌ఫోన్ ఇస్తే గేమ్స్ ఆడి సమయం వృథా చేస్తావని, మెటీరియల్‌ను జిరాక్స్ తీసుకు వస్తానని ఆమె తెలిపింది. కాసేపటి తర్వాత తల్లి జిరాక్స్ సెంటర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి తనకు సెల్‌ఫోన్ ఇవ్వ లేదని మనస్తాపం చెందిన స్ఫూర్తి.. ఫ్యాన్‌కు ఉరేసుకుంది. జిరాక్స్ పత్రాలతో ఇంటికి వచ్చిన తల్లికి కుమార్తె ఉరి వేసుకుని ఉండడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
వెంటనే ఇంటికి వచ్చిన అతను కుమార్తెను కిందకు దింపి కౌటాల పీహెచ్‌సీకి తరలించాడు. వైద్యులు పరీక్షించి సిర్పూర్(టీ) ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి బాలికను తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో స్ఫూర్తి మృతదేహాన్ని ఎస్సై మధుకర్ పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment