కోయంబత్తూర్: ఓయువకుడు బస్సులో భారీ మొత్తంలో కరెన్సీని తీసుకువెళ్తూ పట్టుబడిన ఘటన కోయంబత్తూర్ లో సోమవారం చోటు చేసుకుంది. అనుమానస్పదంగా ఓ సిటీ బస్సు ఎక్కిన రాజస్థాన్ కు చెందిన వికాస్ అనే యువకుడ్ని పోలీసులు సోదా చేయగా రూ.20 లక్షలు బయటపడ్డాయి. తొలుత అతని బ్యాగ్ లో లభించిన రూ.15లక్షల భారీ మొత్తాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. అనంతరం ఆ యువకుడు డ్రెస్ లోపలి భాగంలో కూడా తనిఖీ చేయగా మరో రూ.5లక్షలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.
ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో బంగారు ఆభరణాలను అమ్మగా వచ్చిన కరెన్సీ తాను తీసుకువెళుతున్నట్లు ఆయువకుడు పోలీసులకు తెలిపాడు.