Unaccounted money
-
రూ.150 కోట్ల ఇల్లు.. రూ.4 లక్షలకే కొన్నారు: ఈడీ
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణానికి సంబంధించి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటంబసభ్యుల నివాసాల్లో ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో అక్రమ నగదు, ఆభరణాలను భారీగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. లాలూ కుటుంబసభ్యుల నివాసాల్లో రూ.కోటి నగదు, విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారు కడ్డీలు, ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు లభించినట్లు వెల్లడించారు. అలాగే ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని తేజస్వీ యాదవ్ బంగళా విలువ ప్రస్తుతం రూ.150 కోట్లని, దీన్ని గతంలో రూ.4లక్షలకే కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నాలుగు అంతస్తుల భవనం ఏబీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై రిజిస్టర్ అయి ఉందని, కానీ తేజస్వీ యాదవ్ దిన్ని నివాసంగా ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ఈ ఆస్తిని కొనుగోలు చేసేందుకు జాబ్ ఫర్ స్కాం ద్వారా వచ్చిన నగదు లేదా రాబడిని ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముంబైకి చెందిన రత్నాలు, ఆభరణాల సంస్థలు అక్రమంగా సంపాదించిన డబ్బును వినియోగించినట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణం ద్వారా వచ్చిన రాబడి విలువ ప్రస్తుతం రూ.600కోట్లు అని ఈడీ అధికారులు చెప్పారు. వీటిలో రూ.350కోట్లు స్థిరాస్థులు కాగా.. బినామీల ద్వారా రూ.250 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని వివరించారు. చదవండి: రబ్రీ..లాలూ అయిపోయారు.. ఇప్పుడు తేజస్వి యాదవ్కు సీబీఐ సమన్లు -
హెరిటేజ్ పాలవ్యాన్లో నగదు పట్టివేత
-
హెరిటేజ్ పాలవ్యాన్లో నగదు పట్టివేత
సాక్షి, అమరావతి: పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇందుకోసం భారీగా డబ్బు పంచడంతో పాటు, మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లకు డబ్బు, మద్యం చేర్చేందుకు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అక్రమ చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బు తరలిస్తున్నట్టు ఎవరికి అనుమానం రాకూడదనీ కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థ పాల వ్యాన్లను వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నేతలకు చెందిన నగదు, మద్యాన్ని ఎనిక్నల అధికారులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా మాకవరపాలెంలో హెరిటేజ్ పాల వ్యాన్లో తరలిస్తున్న 3.95లక్షల రూపాయల నగదును పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. విశాఖలో డబ్బులు పంచేందుకు టీడీపీ నేతలు ఈ డబ్బును తరలిస్తున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో ఎన్నికల తనిఖీల్లో భాగంగా టీడీపీ నాయకుల నుంచి 59,300 రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 35 కవర్లలో వెయ్యి రూపాయల చొప్పున ప్యాక్ చేసి ఉండటంతో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తంతోపాటు, మారుతి బ్రీజా కారును స్వాధీనం చేసుకున్న అధికారులు.. టీడీపీకి చెందిన దాసరి అప్పన్న , మట్టా సత్యనారాయణలను అదుపులోకి తీసుకున్నారు. దాసరి అప్పన్న డీసీసీబీ డైరక్టర్గా,ముదునూర్ సొసైటీ ప్రెసిడెంట్గా పనిచేస్తుండగా.. మట్టా సత్యనారాయణ పెంటపాడు బీసీ సెల్ అధ్యక్షునిగా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలు చేయడం కోసమే ఈ నగదును తరలిస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం వెంకటాపురం వద్ద పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. మండల టీడీపీ నాయకుడికి చెందిన వాటర్ ట్యాంకర్ ద్వారా తరలిస్తున్న వెయ్యి మద్యం సీసాలను స్వాధీనం చేసకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ట్రాక్టర్ డ్రైవర్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, టీడీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి రూప కోసం హైదరాబాద్ నుంచి డబ్బు తరలిస్తున్న జయభేరి ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
లాకర్లలో అక్రమ కోట్లు వెలుగులోకి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అక్రమ సొమ్ము, లెక్కతేలని సొమ్ము బయటపడుతోంది. ఇప్పటి వరకు బడా బాబుల ఇళ్లల్లో ఈ నల్లడబ్బు బయటపడుతుండగా ఇప్పుడు ఏకంగా బ్యాంకుల్లో వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని ఓ బ్యాంకులో లెక్కతేలని కోట్లు బయటపడ్డాయి. అది కూడా ఓ బ్యాంకు లాకర్లో లభించడంతో అధికారులు ఖిన్నులయ్యారు. రాష్ట్రంలోని పుణెలోగల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పార్వతీ బ్రాంచ్లో బుధవారం ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐదు లాకర్లు తెరిచి చూడగా అందులో పది కోట్ల రూపాయలు లెక్కతేలనివి బయటపడ్డాయి. ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఈ డబ్బును చూసి ఐటీ అధికారులు సైతం అవాక్కయ్యారు. కొంత మంది ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి బ్యాంకు అధికారులే ఈ పని చేసి నల్ల డబ్బుకు ఆశ్రయం ఇచ్చి ఉంటారా అనే దిశగా ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ లాకర్ల యజమానుల కోసం ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ నగదునంతా తమ స్వాధీనం చేసుకొని మరిన్ని లాకర్లు తెరిచే పని చేస్తున్నారు. -
కప్ బోర్డు, సూట్ కేసుల నిండా నోట్ల కట్టలే
న్యూఢిల్లీ: నగరంలోని ఓ న్యాయసంస్ధ కార్యాలయం నుంచి ఐటీ అధికారులు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ కైలాష్-1లో ఉన్న టీ అండ్ టీ న్యాయసంస్ధ కార్యాలయంపై శనివారం రాత్రి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.13.56కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు మొత్తం కార్యాలయంలోని కప్ బోర్డులు, సూట్ కేసుల్లో దాచి ఉంచినట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన నగదులో రూ.2.5 కోట్లు కొత్త నోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మిగతా రూ.7కోట్లకు పైగా పాత రూ.1000నోట్లు, రూ.3కోట్లు రూ.100 నోట్లు ఉన్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఐటీ శాఖ అధికారులకు చేరవేయడంతో వారు అక్కడకు చేరుకున్నట్లు చెప్పారు. పోలీసులు దాడి నిర్వహించిన సమయంలో కార్యాలయం గదులన్నీ తాళాలు వేసి ఉంచారని, కేవలం కేర్ టేకర్ మాత్రమే అక్కడ ఉన్నట్లు తెలిపారు. కాగా, టీ అండ్ టీ కంపెనీకి ప్రమోటర్ గా పనిచేస్తున్న రోహిత్ టాండన్ అనే వ్యక్తి ఇంటిపై రెండు నెలల క్రితం ఐటీ శాఖ దాడులు చేసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించి దాడులు నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు. -
బ్యాంకు మేనేజర్లు బుక్కయ్యారు..
ముంబై: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పాత సామెత అయినప్పటికీ దీనికి పక్కాగా ఫాలో అవుతున్నారు కొందరు అక్రమార్కులు. పెద్దనోట్ల రద్దుతో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని డబ్బు ఉన్నవారి పునాదులు కదులుతున్న నేపథ్యంలో.. అవకాశం ఉన్నప్పుడే అందినకాడికి వెనకేసుకోవాలని వారు చూస్తున్నారు. మరి ఈ అక్రమార్కులు ఏకంగా బ్యాంకుల్లో కీలక నిర్ణయాలు తీసుకునేవారైతే ఇక వారికి అడ్డేముంటుంది. ముంబైలో ఇద్దరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్లను మనీ లాండరింగ్ కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బడాబాబుల లెక్కల్లో లేని డబ్బును సెటిల్ చేయడంలో వీరి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇద్దరు బ్యాంకు మేనేజర్లను సస్పెండ్ చేస్తూ యాక్సిస్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దును కొంత మంది బ్యాంకు అధికారులు బాగా క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బ్యాంకు అధికారులపై ప్రత్యేక నిఘా ఉంచారని తెలుస్తోంది. -
'దాగిన డబ్బంతా బయటకు వస్తుంది'
ఇంతవరకు లెక్కలోకి రాకుండా ప్రైవేటు రంగంలో చలామణి అవుతున్న డబ్బు మొత్తం ఇప్పుడు ప్రభుత్వ రంగంలోకి వస్తుందని, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెద్దనోట్లను రద్దచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్న మొత్తాలలో డిపాజిట్లు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, పెద్ద మొత్తాలు డిపాజిట్ చేసేవారిపై మాత్రం ఇప్పటి ఉన్న పన్ను చట్టాల ప్రకారం చర్యలు తప్పవని తెలిపారు. ఆదాయపన్ను పరిమితి లోపల ఉన్న మొత్తాలను డిపాజిట్ చేయడానికి ప్రజలు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు. ఇక మీదట ప్రజల ఖర్చు అలవాట్లు మారుతాయని, కొన్నాళ్ల పాటు తాము ఇబ్బంది పడుతున్నామని అనుకుంటారు గానీ, తర్వాత వాళ్లకు కూడా తెలుస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. చిన్న కొనుగోళ్ల విషయంలో కొన్నాళ్ల పాటు ఇబ్బందులు ఉంటాయి కానీ, కావల్సినంత కరెన్సీ ఉంది కాబట్టి దీర్ఘకాలంలో ఇది ప్రయోజనకరమే అవుతుందన్నారు. బ్యాంకులు వీలైనంత ఎక్కువ సమయం పనిచేసి ప్రజలకు కొత్త నోట్లు అందిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. ఇందుకోసం బ్యాంకింగ్ శాఖ, రిజర్వు బ్యాంకు తగిన చర్యలు తీసుకున్నాయన్నారు. ఏ ప్రభుత్వం పనిచేయాలన్నా ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఆయన చూపిన ఎజెండా ప్రకారమే మంత్రులంతా పనిచేయాలని, విస్తృత జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుందని అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ కేబినెట్లో మంచి వాతావరణం ఉన్నందువల్ల చాలావరకు నిర్ణయాలను తామంతా విస్తృత ఏకాభిప్రాయంతోనే తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థికరంగంలోని పలు అంశాలు అందరికీ అందుబాటులో ఉండాలని, తద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వీలవుతుందని అన్నారు. దానికి తగినట్లుగా చట్టాలలో కావల్సిన మార్పుచేర్పులు చేశామన్నారు. తాము గత ప్రభుత్వ అనుభవాల నుంచి నేర్చుకున్నామని, నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ కాలం ప్రభుత్వం దగ్గరే నానుస్తూ ఉంటే ఫలితాలు బాగోవని, కాంట్రాక్టులు రద్దుచేయాల్సి రావడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయని, అంతా బ్యాక్ ఫైర్ అవుతుందని తెలుసుకున్నామన్నారు. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయని వాటిని కూడా మేం అమలుచేశామని తెలిపారు. -
'దాగిన డబ్బంతా బయటకు వస్తుంది'
-
ప్రైవేటు బస్సులో రూ.20 లక్షలతో పట్టుబడ్డ యువకుడు
కోయంబత్తూర్: ఓయువకుడు బస్సులో భారీ మొత్తంలో కరెన్సీని తీసుకువెళ్తూ పట్టుబడిన ఘటన కోయంబత్తూర్ లో సోమవారం చోటు చేసుకుంది. అనుమానస్పదంగా ఓ సిటీ బస్సు ఎక్కిన రాజస్థాన్ కు చెందిన వికాస్ అనే యువకుడ్ని పోలీసులు సోదా చేయగా రూ.20 లక్షలు బయటపడ్డాయి. తొలుత అతని బ్యాగ్ లో లభించిన రూ.15లక్షల భారీ మొత్తాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. అనంతరం ఆ యువకుడు డ్రెస్ లోపలి భాగంలో కూడా తనిఖీ చేయగా మరో రూ.5లక్షలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో బంగారు ఆభరణాలను అమ్మగా వచ్చిన కరెన్సీ తాను తీసుకువెళుతున్నట్లు ఆయువకుడు పోలీసులకు తెలిపాడు.