కప్ బోర్డు, సూట్ కేసుల నిండా నోట్ల కట్టలే | Over 13 Crores Seized From South Delhi Law Firm, 2.5 Crores In New Notes | Sakshi
Sakshi News home page

కప్ బోర్డు, సూట్ కేసుల నిండా నోట్ల కట్టలే

Published Sun, Dec 11 2016 12:20 PM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

కప్ బోర్డు, సూట్ కేసుల నిండా నోట్ల కట్టలే - Sakshi

కప్ బోర్డు, సూట్ కేసుల నిండా నోట్ల కట్టలే

న్యూఢిల్లీ: నగరంలోని ఓ న్యాయసంస్ధ కార్యాలయం నుంచి ఐటీ అధికారులు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ కైలాష్-1లో ఉన్న టీ అండ్ టీ న్యాయసంస్ధ కార్యాలయంపై శనివారం రాత్రి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.13.56కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు మొత్తం కార్యాలయంలోని కప్ బోర్డులు, సూట్ కేసుల్లో దాచి ఉంచినట్లు పోలీసులు చెప్పారు.
 
పట్టుబడిన నగదులో రూ.2.5 కోట్లు కొత్త నోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మిగతా రూ.7కోట్లకు పైగా పాత రూ.1000నోట్లు, రూ.3కోట్లు రూ.100 నోట్లు ఉన్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఐటీ శాఖ అధికారులకు చేరవేయడంతో వారు అక్కడకు చేరుకున్నట్లు చెప్పారు. పోలీసులు దాడి నిర్వహించిన సమయంలో కార్యాలయం గదులన్నీ తాళాలు వేసి ఉంచారని, కేవలం కేర్ టేకర్ మాత్రమే అక్కడ ఉన్నట్లు తెలిపారు.
 
కాగా, టీ అండ్ టీ కంపెనీకి ప్రమోటర్ గా పనిచేస్తున్న రోహిత్ టాండన్ అనే వ్యక్తి ఇంటిపై రెండు నెలల క్రితం ఐటీ శాఖ దాడులు చేసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించి దాడులు నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement