నగరంలోని తుకారాం గేట్ వద్ద ఓ యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. ఆ యువకుడు ఒక్కసారిగా తన వద్ద నున్న కత్తి తీసుకుని గొంతుకోసుకున్నాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు అతన్నిపట్టుకుని 108కి సమాచారం అందించారు. కాగా అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బందిపై కూడా అతను కత్తితో దాడికి పూనుకున్నాడు. దీంతో వారు చేసేది లేక పోలీసుల సాయంతో యువకుడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని వివరాలు మాత్రం ఇప్పటి వరకూ తెలియరాలేదు. అతను ఒక మానసిక రోగి కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.