నల్లగొండ జిల్లా చింతపల్లిలో సోమవారం రాత్రి ఒక యువకుడు హత్యకు గురయ్యాడు.
నల్లగొండ: నల్లగొండ జిల్లా చింతపల్లిలో సోమవారం రాత్రి ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన పోలె వెంకటయ్య, రమణమ్మ కుమారుడు ప్రవీణ్(19) స్థానికంగా కూలి పనులు చేస్తుంటాడు. మంగళవారం ఉదయం అతడు కనిపించకపోవటంతో స్థానికులు వచ్చి చూడగా ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబసభ్యులంతా హైదరాబాద్ వెళ్లిపోగా సోమవారం రాత్రి తన ఇంట్లోనే ప్రవీణ్ స్నేహితులతో కలసి విందు చేసుకున్నట్లు సమాచారం.