
సాక్షి, నల్గొండ: ఇక్కడి రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్రంపోడు మండలం పోచంపల్లికి చెందిన వేముల ప్రసాద్ శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో అతనిపై మోటార్ వైర్ దొంగతనం కేసు నమోదైంది. సకల నేరస్థుల సర్వేలో భాగంగా పోలీసులు గురువారంనాడు అతని ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా, పోలీసులు ఇంటికి వచ్చారన్న అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. అతని వద్ద సూసైడ్ నోట్ లెటర్ దొరికింది. అమ్మానాన్న, సోదరుడు, స్నేహితులను తాను మిస్ అవుతున్నానని అందులో రాసి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment