ప్రసన్నరాణి (ఫైల్).. ఇన్‌సెట్‌లో మృతిచెందిన రుచిర, మేదశ్రీ
సాక్షి, నల్లగొండ క్రైం: భర్తపై ద్వేషం.. సవతిపై ఈర్ష్య.. వెరసి ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులను బలి తీసుకున్నాయి. భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో ఎనిమిదేళ్లుగా కుమిలిపోతున్న ఆమె.. తన సవతి ఇద్దరు పిల్లలను హత్యచేసి, ఆపై బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం నల్లగొండ పట్టణంలో కలకలం రేపింది. నల్లగొండకు చెం దిన మేకల ప్రదీప్ యాదాద్రి భువనగిరి జిల్లా శిశు సంక్షేమ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండలోనే నివాసం ఉంటూ రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తుంటాడు. ఈయనకు 1999లో ప్రసన్నరాణి (45)తో వివాహం జరిగిం ది. 2012లో శాంతమ్మతో రెండో వివాహం అయ్యింది. భార్యలిద్దరూ నల్లగొండ ఐసీడీఎస్‌లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారు. మొదటి భార్య ప్రసన్నరాణికి కుమారుడు దీపక్, కుమార్తె రుత్విక ఉన్నారు. దీపక్ ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా, రుత్విక పదో తరగతి చదువుతుంది. ప్రసన్నరాణి కలెక్టరేట్ సమీపంలోని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటుండగా, శాంతమ్మ బీటీఎస్‌లో ఉంటోంది.
కలిసి ఉందామని నమ్మించి...
చిన్న భార్య శాంతమ్మతోనే భర్త ఎక్కువ సమయం గడుపు తున్నాడని ప్రసన్నరాణిలో అనుమానం మొదలైంది. ఇది క్రమంగా ద్వేషంగా మారింది. ఈక్రమంలో 40 రోజుల క్రితం శాంతమ్మతో మాట కలిపింది. ఇకపై అందరం కలిసి ఉందామని నమ్మించింది. ఆమె కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడంతో రెండిళ్ల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. ప్రసన్నరాణి ఎలాంటి అనుమానం రాకుండా శాంతమ్మతోనూ, ఆమె పిల్లలు మేదశ్రీ (7), రుచిర(5)తో నమ్మకంగా మెలగసాగింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రసన్నరాణి.. తన పెళ్లిరోజు కావడంతో శాంతమ్మ ఇంటికి వెళ్లింది. అనంతరం ఆమె కుమార్తెలను తీసుకుని ఇంటికి వచ్చింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇద్దరు చిన్నారులను ఉరివేసి హత్య చేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: (ప్రేమించినోడే వేధించడంతో..)
నన్ను మోసం చేశావ్
ఎన్నో ఆశలతో వచ్చిన తనను భర్త మోసం చేశాడని ప్రసన్నరాణి ఆవేదన వ్యక్తంచేసింది. చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. ‘డియర్ ప్రదీప్, 1999లో ఇదే రోజు రూ.లక్ష కట్నంతో.. కోటి ఆశలతో నీ జీవితంలోకి అడుగు పెట్టిన నాకు నువ్వు ఇచ్చిన గొప్ప బహుమతి ‘సవితి.. ఆమె పిల్లలు. నా మొగుడు నాకే సొంతం అనే భ్రమలో బతుకుతున్నా. గత ఎనిమిదేళ్లుగా నన్ను మోసం చేసి, పిల్లలను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నావ్. నా దగ్గర మాత్రం మంచి భర్తగా నటించావు. నేను రోగిస్టును కాను.. పిల్లలు లేని దాన్ని కాను. నువ్వు తెచ్చి పెడితే కూర్చొని తినడంలేదు. నీతో సమానంగా సంపాదిస్తున్నా. భార్య బతికి ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చని ఏ చట్టంలో ఉంది? నేను మగవాణ్ని ఏమి చేసినా చెల్లుతుందన్న పొగరుతో ఈ పనిచేశావు. అందుకే నీ జీవితంలోకి వచ్చిన రోజే వెళ్లిపోతున్నా. నా పిల్లలను అమ్మలేనివారిని చేస్తున్నా. నా పీఎఫ్ డబ్బులతో అలోక్స్ (కుమారుడు)కు నచ్చిన బైక్ కొనివ్వు. అమ్ములుకు ఫోన్ కొనివ్వు. నన్ను మోసం చేశావు’అని సూసైడ్‌నోట్‌లో రాసి ఉంది. చదవండి: (కూతురు లేని లోకంలో ఉండలేను!)
Comments
Please login to add a commentAdd a comment