step mother
-
పాకిస్తాన్‌పై పీఓకే కన్నెర్ర
కోట్లి (పీఓకే): పాకిస్తాన్‌పై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) వాసులు కన్నెర్రజేస్తున్నారు. దశాబ్దాలుగా పాక్ తమపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ మండిపడుతున్నారు. చివరికి కరెంటు బిల్లుల మదింపులో కూడా ఈ వివక్ష భరించలేనంత ఎక్కువగా ఉందంటూ వాపోతున్నారు. ‘మా ప్రాంతం నుంచే ఏకంగా 5,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. దాన్నంతటినీ తరలించుకుపోయి దేశమంతటికీ వాడుకుంటున్నారు. బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో వారికి తక్కువగా, మాకు భరించలేనంత ఎక్కువగా వేస్తున్నారు. ఇది మా పట్ల సహించరాని అన్యాయం‘ అంటూ ఆక్రోశిస్తున్నారు. అది కాస్తా కొద్ది రోజులుగా ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. భారీ కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కోట్లి జిల్లాలోనే కేవలం ఒక్క నెలలో రూ.139 కోట్ల బిల్లులు వచ్చాయని ప్రముఖ స్థానిక నేత తౌకీర్ వాపోయారు. ‘అందులో కేవలం రూ.19 కోట్ల బిల్లులు కట్టారు. వచ్చే నెల నుంచి అవి కూడా కట్టేది లేదు‘ అని అన్నారు. తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. -
Crime: ‘పిన్నమ్మా.. నాకు పెళ్లి చెయ్యవా?’
క్రైమ్: అతనొక దివ్యాంగుడు. వైకల్యాన్ని లెక్కచేయకుండా.. బాగా చదువుకున్నాడు. ఎవరి మీదా ఆధారపడకూడదని ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుని.. జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. అయితే వయసు మూడు పదులు దాటడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే అతని పాలిట మరణ శాసనం అయ్యింది. వివాహం చేసుకోవాలని ఉందని చెప్పినందుకు ఓ దివ్యాంగుడిని.. సవతి తల్లి, అతని తండ్రి సాయంతోనే కడతేర్చింది. ఒడిషా నయాగఢ్ జిల్లా పథరాపుంజ గ్రామం దసపల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం చోటు చేసుకుంది. బాధితుడు విజయ్ ప్రధాన్(35).. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో అతని తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం ఉంది. తన పిల్లలను బాగా చూసుకుంటూ.. విజయ్ను రాచిరంపాన పెడుతూ వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. అయినా విజయ్ మాత్రం పట్టించుకోకుండా బాగా చదువుకుని.. స్థానికంగా ఓ చిన్నకంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో వివాహం చేసుకోమని అతని మేనత్త, మేనమామలు సూచించారు. వాళ్ల కోరిక ప్రకారం స్థిరపడాలనుకున్నాడు. అయితే.. పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం విజయ్ లాక్కెళ్లిపోతాడేమోనని ఆ సవతి తల్లి భయపడింది. అతని వివాహానికి ససేమీరా చెప్పింది. అయినా విజయ్ మేనత్త సంబంధాలు చూడసాగింది. ఇది ఆ సవతి తల్లికి కోపం తెప్పించింది. శనివారం ఈ విషయంపై ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలో సవతి తల్లి, విజయ్ తండ్రి, వాళ్ల పిల్లల సాయంతో.. విజయ్ను కర్రలతో కొట్టి చంపారు. ఈ మేరకు విజయ్ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
సవతి తల్లిపై నటుడి అత్యాచారం!
ముంబై: సవతి తల్లిపై ఓ నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు, ఆపై ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బును ఎత్తుకెళ్లిపోయాడు. ఈ దారుణ దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన నలభై యేళ్ల వ్యక్తి టీవీ సీరియల్స్‌లో నటుడిగా రాణిస్తున్నాడు. అతడి తండ్రి పలు టీవీ సీరియళ్లకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా అతడికి ముగ్గురు భార్యలు ఉన్నారు. ఇందులో ఒక భార్య అంధేరీలోని లోఖండ్వాలాలో నివసిస్తోంది. (చదవండి: ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు..) ఈ క్రమంలో సవతి తల్లిపై కన్నేసిన నటుడు వరుసకు తల్లి అవుతుందన్న ఇంగితం మరిచి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు తీసుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. అయితే నిందితుడికి, బాధితురాలికి మధ్య ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసు గురించి ఓషివారా సీనియర్ పోలీస్ అధికారి సంజయ్ బండలే మాట్లాడుతూ.. ఆరోపణలు రుజువైతేనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. నటుడి పేరు, తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు. (చదవండి: పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం..) -
భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..
సాక్షి, నల్లగొండ క్రైం: భర్తపై ద్వేషం.. సవతిపై ఈర్ష్య.. వెరసి ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులను బలి తీసుకున్నాయి. భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో ఎనిమిదేళ్లుగా కుమిలిపోతున్న ఆమె.. తన సవతి ఇద్దరు పిల్లలను హత్యచేసి, ఆపై బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం నల్లగొండ పట్టణంలో కలకలం రేపింది. నల్లగొండకు చెం దిన మేకల ప్రదీప్ యాదాద్రి భువనగిరి జిల్లా శిశు సంక్షేమ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండలోనే నివాసం ఉంటూ రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తుంటాడు. ఈయనకు 1999లో ప్రసన్నరాణి (45)తో వివాహం జరిగిం ది. 2012లో శాంతమ్మతో రెండో వివాహం అయ్యింది. భార్యలిద్దరూ నల్లగొండ ఐసీడీఎస్‌లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారు. మొదటి భార్య ప్రసన్నరాణికి కుమారుడు దీపక్, కుమార్తె రుత్విక ఉన్నారు. దీపక్ ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా, రుత్విక పదో తరగతి చదువుతుంది. ప్రసన్నరాణి కలెక్టరేట్ సమీపంలోని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటుండగా, శాంతమ్మ బీటీఎస్‌లో ఉంటోంది. కలిసి ఉందామని నమ్మించి... చిన్న భార్య శాంతమ్మతోనే భర్త ఎక్కువ సమయం గడుపు తున్నాడని ప్రసన్నరాణిలో అనుమానం మొదలైంది. ఇది క్రమంగా ద్వేషంగా మారింది. ఈక్రమంలో 40 రోజుల క్రితం శాంతమ్మతో మాట కలిపింది. ఇకపై అందరం కలిసి ఉందామని నమ్మించింది. ఆమె కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడంతో రెండిళ్ల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. ప్రసన్నరాణి ఎలాంటి అనుమానం రాకుండా శాంతమ్మతోనూ, ఆమె పిల్లలు మేదశ్రీ (7), రుచిర(5)తో నమ్మకంగా మెలగసాగింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రసన్నరాణి.. తన పెళ్లిరోజు కావడంతో శాంతమ్మ ఇంటికి వెళ్లింది. అనంతరం ఆమె కుమార్తెలను తీసుకుని ఇంటికి వచ్చింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇద్దరు చిన్నారులను ఉరివేసి హత్య చేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: (ప్రేమించినోడే వేధించడంతో..) నన్ను మోసం చేశావ్ ఎన్నో ఆశలతో వచ్చిన తనను భర్త మోసం చేశాడని ప్రసన్నరాణి ఆవేదన వ్యక్తంచేసింది. చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. ‘డియర్ ప్రదీప్, 1999లో ఇదే రోజు రూ.లక్ష కట్నంతో.. కోటి ఆశలతో నీ జీవితంలోకి అడుగు పెట్టిన నాకు నువ్వు ఇచ్చిన గొప్ప బహుమతి ‘సవితి.. ఆమె పిల్లలు. నా మొగుడు నాకే సొంతం అనే భ్రమలో బతుకుతున్నా. గత ఎనిమిదేళ్లుగా నన్ను మోసం చేసి, పిల్లలను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నావ్. నా దగ్గర మాత్రం మంచి భర్తగా నటించావు. నేను రోగిస్టును కాను.. పిల్లలు లేని దాన్ని కాను. నువ్వు తెచ్చి పెడితే కూర్చొని తినడంలేదు. నీతో సమానంగా సంపాదిస్తున్నా. భార్య బతికి ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చని ఏ చట్టంలో ఉంది? నేను మగవాణ్ని ఏమి చేసినా చెల్లుతుందన్న పొగరుతో ఈ పనిచేశావు. అందుకే నీ జీవితంలోకి వచ్చిన రోజే వెళ్లిపోతున్నా. నా పిల్లలను అమ్మలేనివారిని చేస్తున్నా. నా పీఎఫ్ డబ్బులతో అలోక్స్ (కుమారుడు)కు నచ్చిన బైక్ కొనివ్వు. అమ్ములుకు ఫోన్ కొనివ్వు. నన్ను మోసం చేశావు’అని సూసైడ్‌నోట్‌లో రాసి ఉంది. చదవండి: (కూతురు లేని లోకంలో ఉండలేను!) -
అయ్యో... దీప్తిశ్రీ
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అపహరణనకు గురైన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసాని(7)ని ఆమె సవతి తల్లి శాంతికుమారి హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. దీప్తిశ్రీ మృతదేహాన్ని ఉప్పుటేరు కాలువ నుంచి వెలికితీయించారు. గోనె సంచిలో మూటకట్టి పడేసిన చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నయీం అస్మీ విలేకరులతో మాట్లాడుతూ.. శాంతికుమారి ఒంటరిగానే దీప్తిశ్రీని హత్యచేసినట్టు వెల్లడించారు. జగన్నాథపురంలోని పాఠశాల నుంచి దీప్తిశ్రీని సంజయ్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకొచ్చిన శాంతికుమారి.. బాలిక గొంతుకు తువ్వాలు బిగించి కర్కశంగా హతమార్చింది. అనంతరం ఆ మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టుకుని చేత్తో మోసుకుంటూ వెళ్లి షేర్ ఆటో ఎక్కింది. ఇంద్రపాలెం వంతెన వద్ద ఉప్పుటేరులో ఆ మూటను పడేసింది. పట్టపగలు కావడంతో ఎవరూ అనుమానించలేదు. మొదటి భార్య కూతురైన దీప్తిశ్రీ పట్ల తన భర్త ఎక్కువ ప్రేమ చూపడం, ఆమె బాగోగుల కోసం ప్రతి నెలా 8 వేల రూపాయలు ఖర్చుచేస్తుండటంతో శాంతికుమారి ద్వేషం పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే దీప్తిశ్రీని ఆమె హత్య చేసిందని ఎస్పీ తెలిపారు. ఆధారాలు అన్ని సేకరించామని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించామన్నారు. ఇంద్రపాలెం వంతెనకు 15 మీటర్ల సమీపంలోనే ధర్మాడి సత్యం బృందం బాలిక మృతదేహాన్ని గుర్తించి, వెలికి తీసిందని చెప్పారు. ధర్మాడి సత్యం బృందాన్ని ఎస్పీ అభినందించారు. నిందితురాలిపై కిడ్నాప్, హత్యానేరాలు నమోదు చేసినట్టు తెలిపారు. (చదవండి: అసలు ఏం జరిగింది?) -
సవతి తల్లిపై కన్నేసి..
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై లైంగిక వేధింపులకు బ్రేక్ పడటం లేదు. వావి వరసలు మరిచి కామాంధులు చెలరేగుతున్నారు. తాజాగా సవతి తల్లిపై కన్నేసిన ప్రబుద్ధుడు కటకటాలపాలైన ఉదంతం చోటుచేసుకుంది. ముజ్ఫర్నగర్ జిల్లా సెద్పుర గ్రామంలో తాగిన మైకంలో 26 ఏళ్ల యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న సవతి తల్లి (36) గదిలోకి చొరబడి లైంగికంగా వేధించాడని తిత్వాయ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుబే సింగ్ బుధవారం వెల్లడించారు. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
చిన్నారిపై సవతి తల్లి దాష్టికం.. వైరల్ వీడియో
చండీగడ్: క్యాన్సర్‌తో తల్లి మరణించడంతో అమ్మ ప్రేమకు దూరమైన చిన్నారికి ప్రేమను పంచాల్సిన ఓ సవతి తల్లి దాష్టికంగా ప్రవర్తించి కటకటాలపాలైంది. చండీఘడ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చండీగడ్ సెక్టార్ 29లో నివాసముండే ఓ మహిళ తన సవతి కూతురైన చిన్నారని సంచిలోకుక్కి చితకబాదింది. జుట్టు పట్టి, చెవులు పిండుతూ.. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసింది. అప్పటికే కాలు గాయంతో బాధపడుతున్న చిన్నారిపై కాస్త కనికరం కూడా చూపించలేదు. ఈ తతంగాన్ని ఆ చిన్నారి సోదరుడు సెల్ఫోన్లో చిత్రికరించడంతో విషయం బయటకు వెలుగు చూసింది. రెండు నెలల క్రితం ఆ చిన్నారి తల్లి క్యాన్సర్ మరణించడంతో తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతను ఆ కసాయి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నెటీజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. -
చిన్నారిపై సవతి తల్లి దాష్టికం.. వైరల్ వీడియో
-
పసి ప్రాణంపై పైశాచికం
-
చిన్నారిని చిత్రహింసలు పెట్టిన సవతి తల్లి
దర్శి: మాట వినలేదని ఓ బాలుడిని సవతి తల్లి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం శివరాజ్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. శివరాజ్‌నగర్‌కు చెందిన ఆంజనేయులు మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కొడుకు బ్రహ్మయ్య(4)ను పెంచడం ఇష్టం లేని లక్ష్మి అతడిని తరచూ కొడుతూ వేధిస్తుండడంతో ఆంజనేయులు అతడిని హాస్టల్లో ఉంచాడు. బాలుడు ఇటీవలే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ కారణంగా ఆ కోపాన్ని ఆమె బాలుడిపై చూపింది. మాట వినడంలేదంటూ బాలుడికి వాతలు పెట్టి తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. పైగా ఇంట్లో పెట్టి తాళం వేయడంతో బాలుడు రెండు రోజులుగా బయటకు రాలేదు. దీంతో గమనించిన స్థానికులు వారిపై ఒత్తిడి చేయడంతో అసలు విషయం తెలిసింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమందించారు. భార్యాభర్తలు ఇద్దరు పరారయ్యారు. పసివాడిని చిత్రహింసలు పెట్టిన తల్లిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
చిన్నారిని చిత్రహింసలు పెట్టిన సవతి తల్లి
-
పిల్లలను అమ్మేసిన సవతితల్లి
-
కూతురిని వేధిస్తుందని రెండవ భార్యపై ఫిర్యాదు
నాగోలు (హైదరాబాద్) : రెండవ వివాహం చేసుకున్న భార్య తన కూతురిని వేధిస్తోందని ఓ తండ్రి ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం... మన్సూరాబాద్ శ్రీరామాహిల్స్ కాలనీకి చెందిన టి.రమేష్ ప్రైవేటు ఉపాధ్యాయుడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇతనికి మూడు సంవత్సరాల కూతురు ఉంది. కాగా కొన్ని రోజుల తరువాత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన సిహెచ్. పుష్పలతను రెండవ వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా 8 సంవత్సరాల బాబు ఉన్నాడు. అయితే కొన్నాళ్లు పాపను బాగానే చూసుకున్న పుష్పలత గత కొంత కాలంగా పాపను ఇబ్బందులకు గురిచేస్తోంది. అడ్డుకోబోయిన తన తల్లి, చెల్లిని కూడా తిడుతోంది. పైగా చిన్నారి గాయపడే విధంగా కొట్టింది. దీంతో రమేష్ శనివారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు పుష్పలతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధైర్యపడొద్దు... అండగా ఉంటా
-
అధైర్యపడొద్దు... అండగా ఉంటా
* సవతితల్లి చిత్రహింసల్లో గాయపడ్డ ప్రత్యూషకు సీఎం హామీ * భార్య, కూతురుతో కలసి ఆసుపత్రిలో పరామర్శ * హాస్టల్ వసతి కల్పిస్తా, బాగా చదువుకో.. సెలవుల్లో మా ఇంటికి రా.. * ఇల్లు కట్టించి నా సొంత ఖర్చులతో పెళ్లి జరిపిస్తా: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘ఎవరూ లేరని బాధపడొద్దు. జరిగిన దానిని పీడ కలలా మర్చిపో. నీకు నేనున్నాను. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక నా ఇంటికి రా. నీకు మంచి హాస్టల్లో వసతి కల్పించి చదువు చెప్పిస్తా. సెలవుల్లో వచ్చి మా ఇంట్లోనే ఉండు. నీకు నా కూతురు (నిజామాబాద్ ఎంపీ కవిత) తోడుగా ఉంటుంది. సొంత బిడ్డలా చూసుకుంటా. ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది. భవిష్యత్తులో నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నీకు ఇల్లు కట్టించి ఇస్తా. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో నీ పెళ్లి జరిపిస్తా’ అంటూ ప్రత్యూషకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఆస్తి కోసం కన్నతండ్రి రమేశ్, సవతి తల్లి చాముండేశ్వరి పెట్టిన చిత్రహింసల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను కేసీఆర్ శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా పరామర్శించారు. భార్య శోభారాణి, కూతురు కవితతో కలసి ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్...ప్రత్యూషతో మాట్లాడారు. ‘జీవితంలో కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడాలి. జీవితం ఇంకా చాలా వుంది. కొత్త జీవితం ప్రారంభించి నిలదొక్కుకోవాలి. బాగా చదివి పైకిరావాలి. రేపు నీలాగా ఇంకా ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే పరిస్థితిలో నువ్వుండాలి. నీకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నాడనే ధైర్యంతో ఉండు. నీకు పోలీసు కాపలా పెట్టిస్తా. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా నిన్ను చూసుకుంటడు’ అంటూ ప్రత్యూషకు కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రత్యూషకు పండ్ల బుట్టతోపాటు చేతి ఖర్చుల కోసం కొంత నగదు కూడా అందించారు. వాళ్లను బయటకు రానీయొద్దు: ప్రత్యూష ఇంకా ఏమైనా చెప్పదల్చుకున్నావా అని సీఎం అడగ్గా భావోద్వేగానికి గురైన ప్రత్యూష...తనను ఈ స్థితికి తెచ్చిన సవతి తల్లి, తండ్రిని జైల్లోంచి బయటకు రానీయొద్దని కేసీఆర్‌ను వేడుకుంది. ‘వాళ్లిద్దరూ కొడుతున్నట్లు ఇంకా కలలు వస్తూనే ఉన్నాయి. వారంటేనే భయమేస్తోంది’ అని ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి కేసీఆర్ స్పందిస్తూ ‘ఇకపై నీకేమీ కాదు. అన్నింటికీ నేనున్నా’ అని భరోసా ఇచ్చారు. ప్రత్యూషను చిత్ర హింసలు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. డిశ్చార్జి అయ్యాక ఇంటికి తీసుకెళ్తా... ప్రత్యూషను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశాక తన ఇంటికి తీసుకెళ్తానని కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. ఆసుపత్రి నిర్వాహకులు రవీంద్రనాథ్‌తోపాటు ప్రత్యూషకు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడిన సీఎం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ప్రమాదకర పరిస్థితి నుంచి బయట పడినా ఇంకా నీరసంగానే ఉందని వైద్యులు ఈ సందర్భంగా కేసీఆర్‌కు వివరించగా మరో వారంపాటు చికిత్స అందించి పూర్తిగా కోలుకున్నాకే డిశ్చార్జి చేయాలని వైద్యులకు సూచించారు. ప్రత్యూష ఆరోగ్యం, భద్రత వ్యవహారాలను చూడాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు. ఇంట్లో భయంకర పరిస్థితులు ఉండటం వల్ల ప్రత్యూష చదువుకోలేక పోయిందని...ఆమె కోరిక మేరకు బీఎస్సీ నర్సింగ్ చదివిస్తానని సీఎం హామీ ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. సీఎం వెంట ఆస్పత్రికి వెళ్లిన వారిలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ సుమన్ , జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. -
ప్రత్యూష పిన్ని తీరుపై హైకోర్ట్ ఆగ్రహం
-
అందరూ ఉన్నా అనాథలా...
హైదరాబాద్: పెదనాన్న డిప్యూటీ కలెక్టర్, మేనమామ అడ్వకేట్ అయినా ఆమెను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. సవతి తల్లి చేతిలో చిత్రహింసలు అను భవిస్తున్నా ఆమెను ఆదుకున్నవారే లేరు. నరక కూపం నుంచి బయటిపడినా ఆమెను అక్కున చేర్చకునే వారు లేక ఆ అభాగ్యురాలు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతం. ఆమె విషాదగాధ ఉన్నత న్యాయస్థానాన్ని సైతం కదిలించింది. సవతి తల్లి చేతిలో చిత్రహింసలు అనుభవించి కోలుకున్న ప్రత్యూష భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఆమె సంరక్షణకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధ కలిగిస్తోందని హైకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పథకం 'బేటీ బచావో బేటీ పడావో' ఆమెకు వర్తించేలా చూడాలని అధికారులను కోర్టు ఆదేశించింది. పిన్ని చాముండేశ్వరి ముఖం చేసేందుకు ప్రత్యూష ఏమాత్రం ఇష్టపపడడం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇంతజరిగినా పశ్చాత్తాపం లేకపోవడంతో చాముండేశ్వరి తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిశ్చార్జి అనంతరం ప్రత్యూషను చీఫ్ జస్టిస్ ఛాంబర్ లో హాజరుపరచాలని సూచించింది. ప్రత్యూష తండ్రి రమేశ్, మేనమామ అయిన న్యాయవాది సాయిప్రతాప్ ను సోమవారం తమ ఎదుట హాజరుపరచాలని అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యూష పెదనాన్న సతీశ్ చంద్ర శుక్రవారం హైకోర్టులో హాజరయ్యారు. ప్రత్యూష కుటుంబ సభ్యులు, ఆస్తుల వివరాలను ఆయనను అడిగి న్యాయస్థానం తెలుసుకుంది. -
ప్రత్యూష తండ్రి రమేష్ అరెస్టు
* రిమాండ్‌కు తరలింపు * నిర్భయ చట్టం కింద కేసు హైదరాబాద్: కన్న కూతురు తన సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురవుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరించిన ప్రత్యూష తండ్రి చిప్పర రమేష్‌కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలిం చారు. ఆయనపై నిర్భయ కేసు, గృహ నిర్బం ధం, వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో సవతి తల్లి చేతిలో చిత్ర హింసకు గురవుతున్న ప్రత్యూషను ఈ నెల 9న పోలీసులు విముక్తి కలిగించిన విషయం విదితమే. వేధింపులకు గురిచేసిన సవతి తల్లి చాముండేశ్వరిని ఆరోజే అరెస్టుచేసి రిమాండుకు పంపగా , ఈ సంఘటన జరిగినప్పటి నుంచీ పరారీలో ఉన్న ఆమె తండ్రి రమేష్ గురువారం పోలీసులకు చిక్కాడు. అతను బోయిన్పల్లి ఎక్స్‌రోడ్డులో బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కుమార్తె చిత్రహింసలపై అతడిని పోలీసులు ప్రశ్నించగా తన మానసిక పరిస్థితి సరిగా లేదని పేర్కొన్నాడు.ఈ ఘటనలో ప్రత్యూష మేనమామ పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమేష్‌కుమార్‌ను కస్టడీకి తీసుకుని పూర్తి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. నిందితుడిని చూసిన స్థానికులు ఆగ్రహంతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రత్యూషను పరామర్శించిన హైకోర్టు ప్రధాన అధికారి అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను హైకోర్టు ప్రత్యేక అధికారి ఎస్.శరత్‌కుమార్ పరామర్శించారు. ఆమె నుంచి వాంగ్మూలాన్ని సేకరించి రికార్డు చేశారు. ప్రత్యూష స్థితిగతులను స్వయంగా సమీక్షి ంచాలని హైకోర్టు సీజే ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు గురువారం ఉదయం ఆయన ఆస్పత్రికి చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
ప్రత్యూష పెదనాన్నను కోర్టులో హాజరుపరచండి
హైదరాబాద్ : సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురైన ప్రత్యూష కేసుకు సంబంధించిన నివేదికను పోలీసులు గురువారం హైకోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ప్రత్యూష కోలుకుంటుందని, ఆమె శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, పరారైన తండ్రి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో సరైన సమయంలో స్పందించిన ఎల్బీనగర్ పోలీసులు, వైద్యం అందించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యాన్ని హైకోర్టు ఈ సందర్భంగా అభినందించింది. అలాగే ప్రత్యూష ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడుంటుందో తెలుసుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల్లో ఉండేందుకు ప్రత్యూష అంగీకరిస్తే సదుపాయాలు కల్పిస్తామని హైకోర్టు తెలిపింది. ఆమెతో మాట్లాడి నివేదిక సమర్పించాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. అలాగే ప్రత్యూష పెదనాన్నను శుక్రవారం కోర్టులో హాజరు పరచాలని కోర్టు సూచించింది. మరోవైపు ప్రత్యూష తండ్రి రమేష్ ను గతరాత్రి ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. -
కటకటాల్లో కసాయి తండ్రి
-
ప్రత్యూష తండ్రి అరెస్ట్
-
కోలుకుంటున్న ప్రత్యూష
బాగా చదువుకుని నర్సు కావాలని ఉంది బంధువుల ఇంటికి మాత్రం వెళ్లను ఎవరైనా సాయమందించాలని ప్రత్యూష విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష క్రమంగా కోలుకుంటోంది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బుధవారం జనరల్ వార్డుకు తరలించారు. ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆమె ఆరోగ్యపరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాగా, తను ఇప్పటికే నర్సింగ్ పూర్తి చేశానని, నర్సు కావాలని ఉందని, ఎవరైనా సాయమందిస్తే ఉన్నత చదువులు చదువుకుంటానని ప్రత్యూష పేర్కొంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక బంధువుల ఇంటికి వెళ్లనని, స్టేట్‌హోంలో ఉంటానంది. బతికి బయటపడతాననుకోలేదు.. తన పిన్ని వేధింపులకు గురిచేసిన వైనాన్ని ప్రత్యూష ‘సాక్షి’కి వివరించింది. ఆమె చేతిలో నుంచి బతికి బయటపడతాననుకోలేదని ఆమె పేర్కొంది. ‘2010లో అమ్మ చనిపోయినప్పటి నుంచి స్టేట్‌హోంలో ఉంటూ పదోతరగతి, వొకేషనల్ పూర్తి చేశాను. ఆ తర్వాత నాన్న వచ్చి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మా పిన్ని ప్రతి రోజూ చిత్రహింసలు పెట్టేది. రోజూ కళ్లు, నోటిలో ఫినాయిల్, యాసిడ్, హిట్, ఉప్పు కుక్కేది. మింగకపోతే ఇనుప రాడ్లతో కొట్టేది’ అని వాపోయింది. తనకు మతిస్థిమితం లేదని ముద్ర వేసి వేధించేదని చెప్పింది. బంధువులు వస్తే తనను గదిలో బంధించి కాలేజీకి వెళ్లిందని చెప్పేదని పేర్కొంది. ఒకట్రెండు సార్లు తప్పిం చుకునే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు తీసుకెళ్లి ఇంట్లో అప్పగించేవారని, దీంతో తన పిన్ని మరింత చిత్రహింసలకు గురిచేసేదని చెప్పింది. -
కసాయి సవతి తల్లికి 14 రోజుల రిమాండు
కూతురని కూడా చూడకుండా యాసిడ్ పోసి.. సున్నం నీళ్లు తాగించిన కేసులో.. సవతి తల్లి శ్యామలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండు విధించింది. ఎల్బీనగర్ సమీపంలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రమేష్‌కు మొదటి భార్య విడాకులిచ్చింది. దీంతో కూతురు ప్రత్యూషను అనాథాశ్రమంలో చేర్పించి... శ్యామలను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆశ్రమం నుంచి కూతురిని ఇంటికి తెచ్చుకున్నాడు. కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఇంట్లో పనిమనిషిగా చేసేశాడు. రెండో భార్య శ్యామల కూడా ఆ అమ్మాయికి నరకం చూపించింది. ఏదో ఒక కారణంతో అమ్మాయిని గదిలో బంధించి.. కర్కశంగా కర్రలు, వైర్లతో కొట్టి.. సిగరెట్లతో కాల్చేది. అంత చేస్తున్నా.. ఆ కసాయి తండ్రి మాత్రం చూస్తూనే ఉండిపోయేవాడు. కొట్టడంతో మాత్రమే సరిపెట్టకుండా.. సర్ఫ్, సున్నం నీళ్లు తాగించేవారని, బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా వెళ్లనిచ్చేవారు కారని ప్రత్యూష కన్నీటి పర్యంతమైంది. ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించడంతో.. వారు సవతి తల్లిని అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. -
ఆ బాధితురాలి పరిస్థితి అత్యంత దుర్భరం
హైదరాబాద్: సవతి తల్లి చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై ఎల్బీనగర్ అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమెకు కట్టుకునేందుకు దుస్తులు కూడా లేవని చెప్పారు. వైద్య ఖర్చులు, మందులు, ఆహారం, దుస్తులు అవసరమన్నారు. సహాయం చేయదలిచిన దాతలు వస్తు రూపంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు నేరుగా అప్పగించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9866342424 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. -
చిన్నారి పై సవతి తల్లి వేధింపులు
-
సవతి తల్లి అకృత్యం..
ప్రకాశం: పేగు తెంచుకుని పుట్టలేదనేమో ఓ చిన్నారిపై సవితి తల్లి వివక్షను చూపింది. తాను ఒక తల్లిననే విషయం మరిచి బాలిక ఒంటిపై వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. సవతి తల్లి అకృత్యానికి తాళ లేక ఆ చిన్నారి అమ్మ.. అమ్మ.. అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నా ఆమె మనసు కరగలేదు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు శ్రీరాంకాలనీలో సోమవారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ ప్రతినిధులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకవెళ్లారు. బాలికను చిత్రహింసలకు గురిచేస్తున్న సవతి తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిన్నారిని చితక బాదిన సవతి తల్లి
అనంతపురం (గుత్తి): నాలుగేళ్ల చిన్నారిని సవతి తల్లి చితకబాదింది.విషయం తెలుసుకున్న 1098 చైల్డ్‌లైన్ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సంఘటన గుత్తి ఆర్ఎస్లో శుక్రవారం జరిగింది. రాజస్తాన్‌కు చెందిన హీరాలాల్,సంతోషి గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.వీరికి రేణుక జన్మించింది.పాప పుట్టిన తర్వాత సంతోషిని భర్తను వదిలేసింది. దీంతో హీరాలాల్ రాజస్తాన్ నుంచి గుత్తికి మకాం మార్చాడు. చిన్నారి రేణుకను తన వద్దే ఉంచుకున్నాడు.అయితే గత రెండు మాసాల క్రితం హీరాలాల్ రాజస్తాన్‌కు చెందిన కిరణ్రాథోడ్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో సవతి తల్లి కిరణ్ రాథోడ్ చిన్నారి రేణుకను చితకబాదడం మొదలు పెట్టింది. తరుచూ చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసింది. ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు 1098 చైల్డ్‌లైన్ సభ్యులు మురళికి సమాచారం అందింది.దీంతో మురళి తన తోటి సభ్యులు రామకృష్ణ,అశ్వని,అంగన్వాడీ సూపర్వైజర్ శకుంతలతో కలిసి గుత్తి ఆర్ఎస్లోని పత్తికొండ రోడ్డులో ఉన్న హీరాలాల్ ఇంటికి వెళ్లారు.చిన్నారిని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించగా మా బిడ్డ మా ఇష్టమని మొదట దబాయించారు.పోలీసులకు చెబుతామని అనడంతో అసలు చిన్నారిని కొట్టలేదని సవతి తల్లి కిరణ్రాథోడ్ అడ్డం తిరిగింది.ప్రమాదవశాత్తు కింద పడి దెబ్బలు తగిలాయని బుకాయించింది.అయితే పానీ పూరిని తయ్యారు చేసే గరిట(చెలాకి)తో చిన్నారిని కొట్టినట్లు చెంపపై గాయాలున్నాయి.వీపు పై కూడా బలంగా కొట్టిన గుర్తులున్నాయి.చెంబ,వీపుపై దెబ్బలుండటంతో 1098 సభ్యులు వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి చిన్నారి తండ్రి హీరాలాల్,సవతి తల్లి కిరణ్ రాథోడ్‌లపై ఫిర్యాదు చేశారు.పోలీసులు వారిరువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వియ్ ఆర్ ఫ్రెండ్స్..!
ఇది స్టెప్ మదర్‌గా మారిన మరో స్టార్ కథ. అమృతాసింగ్కు దూరమైన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌కు దగ్గరై... ఆపై ఒక్కటైన కరీనా కపూర్ తన సవతి పిల్లలను ఫ్రెండ్స్‌లా చూస్తుందట. సైఫ్- అమృతాల పిల్లలు సారా, ఇబ్రహీంలకు అద్భుతమైన అమ్మ (అమృతా) ఉందని... సో, వారికి మరో తల్లి కంటే చక్కని నేస్తం కావాలని కరీనా చెబుతోంది. ‘కొన్నిసార్లు సారా, నేను షాంపేన్‌తో సందడి చేస్తుంటాం. ఇబ్రహీం కూడా అంతే. సైఫ్ కోరుకొనేది కూడా అదే. అఫ్కోర్స్.. నా ఆకాంక్ష కూడా! వాళ్లిద్దరూ మంచి క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు. ఐ లవ్ దెమ్’ అంటూ ఎమోషనల్‌గా చెప్పింది కరీనా. -
బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సవతి తల్లి
ఈపూర్ మండలం బొగ్గరంలో శనివారం దారుణం చోటు చేసుకుంది. చంద్రమ్మ అనే బాలికపై సవతి తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించింది. దాంతో మంటలను తట్టుకోలేక బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి...ఆమెను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చంద్రమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పోలీసులు బాలిక వద్ద వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తాను ప్రస్తుతం మేనత్త ఇంటిలో ఉంటున్నానని, ఏకాదశ పర్వదినం కావడంతో స్నానం చేసి గుడికి వెళ్లాలని తన ఇంటికి వచ్చానని తెలిపింది. తాను గదిలో బట్టలు తీసుకుంటుండగా తలుపు గడియ పెట్టి... మారుటి తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించిందని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సవతి తల్లి కోసం గాలిస్తున్నారు. చంద్రమ్మ పేరిట అర ఎకరం పొలం ఉందని, అది ఎలాగైనా సొంతం చేసుకోవాలనే సవతి తల్లి ఈ దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు. -
బాలుడిపై ఇనుపచువ్వలతో చురకలు పెట్టిన తల్లి
పుణే : పక్క తడుపుతున్నాడనే కారణంతో ఇనుపచువ్వలతో ఐదేళ్ల బాలుడికి ఒళ్లంతా చురకలు పెట్టిన ఒక సవతి తల్లి ఉదంతమింది. మంగళవారం వెలుగుచూసిన ఈ దాష్టీకం వివరాలిలా ఉన్నాయి. లోహెగామ్ ఏరియాలో విజయ్, మంజూ దంపతులుంటున్నారు. ఐదేళ్ల గోలుకు మంజూ సవతి తల్లి. కాగా, అతడు రోజూ పక్కమీద మూత్రం పోస్తున్నాడని ఆరోపిస్తూ మూడు రోజుల కిందట ఆమె బాలుడ్ని మంచాన్ని కట్టేసి కాల్చిన ఇనుపకడ్డీతో చురకలు పెట్టింది. దీనికి విజయ్ కూడా సహకరించాడు. కాగా, బాలుడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారి సమాచారం మేరకు స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మంజూను అరెస్టు చేయగా, విజయ్ తప్పించుకున్నాడు. ఒంటినిండా చురకలతో తీవ్రంగా గాయపడిన బాలుడికి చికిత్స అందిస్తున్నారు.