కూతురని కూడా చూడకుండా యాసిడ్ పోసి.. సున్నం నీళ్లు తాగించిన కేసులో.. సవతి తల్లి శ్యామలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండు విధించింది.
ఎల్బీనగర్ సమీపంలోని బండ్లగూడ ఆనంద్నగర్‌కు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి రమేష్‌కు మొదటి భార్య విడాకులిచ్చింది. దీంతో కూతురు ప్రత్యూషను అనాథాశ్రమంలో చేర్పించి... శ్యామలను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆశ్రమం నుంచి కూతురిని ఇంటికి తెచ్చుకున్నాడు. కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఇంట్లో పనిమనిషిగా చేసేశాడు. రెండో భార్య శ్యామల కూడా ఆ అమ్మాయికి నరకం చూపించింది. ఏదో ఒక కారణంతో అమ్మాయిని గదిలో బంధించి.. కర్కశంగా కర్రలు, వైర్లతో కొట్టి.. సిగరెట్లతో కాల్చేది. అంత చేస్తున్నా.. ఆ కసాయి తండ్రి మాత్రం చూస్తూనే ఉండిపోయేవాడు. కొట్టడంతో మాత్రమే సరిపెట్టకుండా.. సర్ఫ్, సున్నం నీళ్లు తాగించేవారని, బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా వెళ్లనిచ్చేవారు కారని ప్రత్యూష కన్నీటి పర్యంతమైంది. ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించడంతో.. వారు సవతి తల్లిని అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
కసాయి సవతి తల్లికి 14 రోజుల రిమాండు
Published Thu, Jul 9 2015 5:06 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement