remanded for 14 days
-
పేర్ని నానిపై హత్యాయత్నం: నిందితుడికి రిమాండ్
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్యానికి పాల్పడిన నిందితుడికి జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. విచారణలో నిందితుడు మద్యం సేవించలేదని పోలీసులు తేల్చారు. (చదవండి: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం) మంత్రి పేర్ని నాని పై ఆదివారం ఉదయం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. బడుగు నాగేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త పదునైన సన్నపాటి తాపీ (భవన నిర్మాణాల సందర్భంగా మేస్త్రీలు ఉపయోగించే పనిముట్టు)తో మంత్రిని రెండుసార్లు పొడవగా.. ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..) -
అగ్ని ప్రమాదం ఘటన.. నిందితులకు రిమాండ్
సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో అరెస్టయిన ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ముందు పోలీసులు హజరు పరిచారు. ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఇన్చార్జి, ఆస్పత్రి జీఎం డాక్టర్ కె.సుదర్శన్, కోవిడ్ కేర్ సెంటర్ కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లెపోతు వెంకటేశ్‌లకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను మచిలీపట్టణం స్పెషల్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. (నిలువెత్తు నిర్లక్ష్యం) విజయవాడ రమేశ్ ఆస్పత్రి.. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్యం, కనీస భద్రతా చర్యలు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. సోమవారం అధికారులు, పోలీసులతో కూడిన మూడు ప్రత్యేక బృందాలు స్వర్ణ ప్యాలెస్‌తో సహా రమేశ్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించాయి. నగరపాలక సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. భవన నిర్మాణం జరగకపోవడం, అధికంగా పేషెంట్లను చేర్చుకోవడం, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడం, తదితర లోపాలను తనిఖీ బృందాలు గుర్తించాయి. -
కసాయి సవతి తల్లికి 14 రోజుల రిమాండు
కూతురని కూడా చూడకుండా యాసిడ్ పోసి.. సున్నం నీళ్లు తాగించిన కేసులో.. సవతి తల్లి శ్యామలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండు విధించింది. ఎల్బీనగర్ సమీపంలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రమేష్‌కు మొదటి భార్య విడాకులిచ్చింది. దీంతో కూతురు ప్రత్యూషను అనాథాశ్రమంలో చేర్పించి... శ్యామలను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆశ్రమం నుంచి కూతురిని ఇంటికి తెచ్చుకున్నాడు. కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఇంట్లో పనిమనిషిగా చేసేశాడు. రెండో భార్య శ్యామల కూడా ఆ అమ్మాయికి నరకం చూపించింది. ఏదో ఒక కారణంతో అమ్మాయిని గదిలో బంధించి.. కర్కశంగా కర్రలు, వైర్లతో కొట్టి.. సిగరెట్లతో కాల్చేది. అంత చేస్తున్నా.. ఆ కసాయి తండ్రి మాత్రం చూస్తూనే ఉండిపోయేవాడు. కొట్టడంతో మాత్రమే సరిపెట్టకుండా.. సర్ఫ్, సున్నం నీళ్లు తాగించేవారని, బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా వెళ్లనిచ్చేవారు కారని ప్రత్యూష కన్నీటి పర్యంతమైంది. ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించడంతో.. వారు సవతి తల్లిని అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు.