సవతి తల్లిపై నటుడి అత్యాచారం! | TV Actor Molested Stepmother, Steals Money In Mumbai | Sakshi
Sakshi News home page

సవతి తల్లిపై నటుడి అత్యాచారం, ఆపై దొంగతనం

Published Fri, Jan 22 2021 8:48 PM | Last Updated on Fri, Jan 22 2021 8:57 PM

TV Actor Molested Stepmother, Steals Money In Mumbai - Sakshi

ముంబై: సవతి తల్లిపై ఓ నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు, ఆపై ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బును ఎత్తుకెళ్లిపోయాడు. ఈ దారుణ దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన నలభై యేళ్ల వ్యక్తి టీవీ సీరియల్స్‌లో నటుడిగా రాణిస్తున్నాడు. అతడి తండ్రి పలు టీవీ సీరియళ్లకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా అతడికి ముగ్గురు భార్యలు ఉన్నారు. ఇందులో ఒక భార్య అంధేరీలోని లోఖండ్‌వాలాలో నివసిస్తోంది. (చదవండి: ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు..)

ఈ క్రమంలో సవతి తల్లిపై కన్నేసిన నటుడు వరుసకు తల్లి అవుతుందన్న ఇంగితం మరిచి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు తీసుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. అయితే నిందితుడికి, బాధితురాలికి మధ్య ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసు గురించి ఓషివారా సీనియర్‌ పోలీస్‌ అధికారి సంజయ్‌ బండలే మాట్లాడుతూ.. ఆరోపణలు రుజువైతేనే నిందితుడిని అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. నటుడి పేరు, తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు. (చదవండి: పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement