బాలుడిపై ఇనుపచువ్వలతో చురకలు పెట్టిన తల్లి | Woman brands minor stepson with iron rods for bed-wetting | Sakshi
Sakshi News home page

బాలుడిపై ఇనుపచువ్వలతో చురకలు పెట్టిన తల్లి

Published Thu, Nov 14 2013 7:24 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

Woman brands minor stepson with iron rods for bed-wetting

పుణే : పక్క తడుపుతున్నాడనే కారణంతో ఇనుపచువ్వలతో ఐదేళ్ల బాలుడికి ఒళ్లంతా చురకలు పెట్టిన ఒక సవతి తల్లి ఉదంతమింది. మంగళవారం వెలుగుచూసిన ఈ దాష్టీకం వివరాలిలా ఉన్నాయి. లోహెగామ్ ఏరియాలో విజయ్, మంజూ దంపతులుంటున్నారు. ఐదేళ్ల గోలుకు మంజూ సవతి తల్లి. కాగా, అతడు రోజూ పక్కమీద మూత్రం పోస్తున్నాడని ఆరోపిస్తూ మూడు రోజుల కిందట ఆమె బాలుడ్ని మంచాన్ని కట్టేసి కాల్చిన ఇనుపకడ్డీతో చురకలు పెట్టింది. దీనికి విజయ్ కూడా సహకరించాడు.

 

కాగా, బాలుడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారి సమాచారం మేరకు స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మంజూను అరెస్టు చేయగా, విజయ్ తప్పించుకున్నాడు. ఒంటినిండా చురకలతో తీవ్రంగా గాయపడిన  బాలుడికి చికిత్స అందిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement