ముంబై: భూమి విషయంలో ఓ రైతును గన్‌తో బెదిరించిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లింద్రులపై కేసు నమోదు చేసినట్లు పుణె పోలీసులు తెలిపారు. పూజా ఖేద్కర్ తల్లిదండ్రులతో సహా 7 మందిపై కేసు ఫైల్ చేశామని తెలిపారు. పూజా తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, వారి ఫోన్లు కూడా స్విచ్‌ఆఫ్ వస్తున్నాయని పేర్కొన్నారు.
‘‘నిందితులు పరారీలో ఉన్నారు. వారి కాంటాక్ట్ కోసం ప్రయత్నించాం. కానీ, ఫోన్లను స్విచ్‌ఆఫ్ చేసుకున్నారు. వారి ఇంటి దగ్గరకి వెళ్లినా అక్కడ కూడా వారు లేరు. పోలీసుల బృందాలు పూజా ఖేద్కర్ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నాం. ట్రైనీ ఐఏఎస్ పూజా తల్లిదండ్రుల కోసం పలు పోలీసు టీంలు, లోకల్ క్రైం బ్రాంచ్ అధికారులు పుణెతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు. వారిని పట్టుకున్న తర్వాత విచారించి, చర్యలు తీసుకుంటాం’ అని ’అని పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు.
తనకు ప్రాణహానీ ఉందని స్థానిక రైతు ఫిర్యాదు చేయటంతో పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు మనోరమ, దిలీప్ ఖేద్కర్‌తో సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ముల్షి తాలుకాలోని ఓ గ్రామంలో ఒక రైతుపై గన్‌తో బెదిరింపులకు దిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ఈ ఘటన జూన్, 2023న చోటు చేసుకోగా.. తాజాగా ఆయుధ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూజా తల్లి మనోహర కేవలం ప్రాణరక్షణ కోసమే గన్ పట్టుకున్నారని వారి తరఫున న్యాయవాది తెలిపారు. ఆమె వద్ద ఉన్న గన్‌కు లైసెన్స్ కూడా ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment