
ప్రతీకాత్మక చిత్రం
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై లైంగిక వేధింపులకు బ్రేక్ పడటం లేదు. వావి వరసలు మరిచి కామాంధులు చెలరేగుతున్నారు. తాజాగా సవతి తల్లిపై కన్నేసిన ప్రబుద్ధుడు కటకటాలపాలైన ఉదంతం చోటుచేసుకుంది.
ముజ్‌ఫర్‌నగర్ జిల్లా సెద్‌పుర గ్రామంలో తాగిన మైకంలో 26 ఏళ్ల యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న సవతి తల్లి (36) గదిలోకి చొరబడి లైంగికంగా వేధించాడని తిత్వాయ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుబే సింగ్ బుధవారం వెల్లడించారు. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment