చండీగడ్: క్యాన్సర్‌తో తల్లి మరణించడంతో అమ్మ ప్రేమకు దూరమైన చిన్నారికి ప్రేమను పంచాల్సిన ఓ సవతి తల్లి దాష్టికంగా ప్రవర్తించి కటకటాలపాలైంది. చండీఘడ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చండీగడ్ సెక్టార్ 29లో నివాసముండే ఓ మహిళ తన సవతి కూతురైన చిన్నారని సంచిలోకుక్కి చితకబాదింది.
జుట్టు పట్టి, చెవులు పిండుతూ.. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసింది. అప్పటికే కాలు గాయంతో బాధపడుతున్న చిన్నారిపై కాస్త కనికరం కూడా చూపించలేదు. ఈ తతంగాన్ని ఆ చిన్నారి సోదరుడు సెల్‌ఫోన్‌లో చిత్రికరించడంతో విషయం బయటకు వెలుగు చూసింది.
రెండు నెలల క్రితం ఆ చిన్నారి తల్లి క్యాన్సర్ మరణించడంతో తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతను ఆ కసాయి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నెటీజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment