Step Daughter
-
బుల్లితెర నటిపై తీవ్ర ఆరోపణలు.. దెబ్బకు వీడియో డిలీట్!
బాలీవుడ్లో బుల్లితెర స్టార్ రూపాలీ గంగూలీ అందరికీ సుపరిచితమే. బుల్లితెర నటుల్లో రిచెస్ట్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె సవతి కూతురు ఇషా నటిపై సంచలన కామెంట్స్ చేసింది. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈషా కామెంట్స్‌పై నటి రూపాలీ గంగూలీ పరువునష్టం దావా వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా ఇషా మాట్లాడిందంటూ రూ.50 కోట్లకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులు అందుకున్న ఇషా వెంటనే అప్రమత్తమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను సైతం డిలీట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్‌స్టా అకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చేసింది. పరువు నష్టం కేసు నోటీసులు రావడంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు)డిలీట్ చేసిన వీడియో ఇషా మాట్లాడుతూ..'ఇప్పుడు నేను నా రౌడీలకు వ్యతిరేకంగా నిలబడ్డా. నా జీవితంలో వాళ్లిద్దరే రౌడీలు. వారు నేను ప్రేమించే నా తల్లిని ఇబ్బంది పెట్టడమే కాదు.. నన్ను బాధపెట్టాలని చూశారు. వారు నన్ను విమర్శించడానికి నా బలహీనతలను ఎంచుకున్నారు. వారు నాకు బహిరంగంగా, వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నన్ను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని" మాట్లాడింది. పరువు నష్టం నోటీసులు రావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. కాగా.. అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. -
సీనియర్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై దాడి!
సీనియర్ నటి, బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్ షకీలాపై దాడి జరిగింది. ఆమె పెంపుడు కుమార్తె శీతల్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో షకీలా పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తడంతో శీతల్ నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయిందని షకీలా తెలిపింది. మాట్లాడేందుకు పిలవగా.. తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చిందని వెల్లడించింది. తాను సర్ది చెప్పందుకు యత్నించగా.. తనపైనే దాడికి పాల్పడిందని షకీలా ఫిర్యాదులో పేర్కొంది. (ఇది చదవండి: అందరికీ కనిపించే షకీలా.. తెర వెనుక కన్నీటి జీవితం తెలుసా?) అంతే కాకుండా గొడవ సమయంలో అక్కడే ఉన్న మహిళా లాయర్‌తో శీతల్ తల్లి అసభ్యకరంగా మాట్లాడిందని షకీలా ఆరోపించింది. మరోవైపు అదే పోలీస్ స్టేషన్లో షకీలాపై కూడా శీతల్ ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువైపులా ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఆమె షకీలా అన్న కుమార్తెనని సమాచారం. -
సవతి కూతురిపై అక్కసుతో..
న్యూయార్క్ : సవతి కూతురిని దారుణంగా హతమార్చిన భారత సంతతికి చెందిన ఓ మహిళను స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. 2016లో చిన్నారిని చంపిన కేసులో ఆమెకు 25 ఏళ్ల శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు జూన్ 3న శిక్షకు సంబంధించిన తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. షామ్‌దాయీ అర్జున్(55) అనే మహిళ భర్త, అతడి తొమ్మిదేళ్ల కూతురితో కలిసి న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నివసిస్తోంది. అయితే సవతి కూతురిపై అక్కసు పెంచుకున్న అర్జున్ ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలో 2016 ఆగస్టులో బాధితురాలి గొంతు నులిమి చంపేసింది. దారుణంగా గాయపరిచి.. విచారణలో భాగంగా ఈ కేసులో సాక్షి అయిన ఓ మహిళ మాట్లాడుతూ..తన మనవలతో కలిసి క్వీన్స్‌లో ఉండే పాత అపార్టుమెంటుకు వెళ్లినట్లు పేర్కొంది. ఆ సమయంలో అర్జున్ను కూతురి గురించి ప్రశ్నించగా.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పిందని తెలిపింది. ఆమెను కలవాలనుకుంటున్నాననగా.. బాత్రూంలో స్నానం చేస్తోందని చెప్పిందని.. అయితే గంటల సమయం గడిచినా బయటికి రాకపోవడంతో తనకు అనుమానం వచ్చిందని పేర్కొంది. దీంతో బాలిక తండ్రిని పిలిచి బాత్రూం తలుపులు పగులగొట్టగా.. బాలిక బాత్‌టాబ్‌లో శరీరంపై ఎటువంటి అచ్చాదన లేకుండా నిర్జీవంగా పడి ఉందని తెలిపింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. కాగా ఈ కేసు గురించి క్వీన్స్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ మాట్లాడుతూ.. అర్జున్ మొదటి నుంచి భర్త కూతురిని హింసించేదని పేర్కొన్నారు. ఎన్నోసార్లు ఆమెను చంపుతానని బెదిరించినట్లు బాధితురాలి బంధువులు వెల్లడించారన్నారు. మృతురాలి తండ్రి స్థానికంగా ఓ రెస్టారెంట్లో పనిచేసేవాడని, అతడు ఇంటి నుంచి బయటికి వెళ్లగానే అర్జున్ కూతురిపై దాష్టీకానికి పాల్పడేదని వివరించారు. ఇందులో భాగంగా 2016 ఆగస్టులో ఓ రోజు బాధితురాలికి స్నానం చేయిస్తానని చెప్పి, అక్కడే దారుణంగా కొట్టి.. గొంతు నులిమి చంపేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పేర్కొన్నారు. -
పెంపుడు కూతిరిపై తండ్రి కత్తితో దాడి
-
కూతురిపై అనుమానం, కత్తితో దాడి
సాక్షి, తూర్పుగోదావరి : కోరుకొండ మండలం కొత్తజంబు పట్నంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పడాల కొండా రెడ్డి అనే వ్యక్తి వరసకు కూతురైన బాలికపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వివరాలు..గ్రామానికి చెందిన పడాల కొండారెడ్డికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగినా మనస్పర్థలతో భార్యను వదిలేశాడు. అదే గ్రామానికి చెందిన లోవమ్మ కూడా 17 ఏళ్ల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిగింది. మనస్పర్థలతో మొదటి భర్తతో విడిగా ఉంటోంది. లోవమ్మకు వీర వెంకట లక్ష్మి(15) అనే కూతురు ఉంది. కొన్నేళ్ల నుంచి కొండారెడ్డి, లోవమ్మలు పెద్దలు, బంధువుల అంగీకారంతో సహజీవనం సాగిస్తున్నారు. అయితే వీరి మధ్య మూడు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే వరసకు కూతురైన లక్ష్మి ఎవరినో ప్రేమిస్తుందని అనుమానం పెంచుకున్నకొండారెడ్డి లక్ష్మితో గొడవపడ్డాడు. కోపంతో తన దగ్గరున్న బ్లేడుతో మెడ కోశాడు. ఛాతీ, చేతిలపై కూడా ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. మెడపై మాత్రం తీవ్రగాయం కావడంతో హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. కొండారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు రాజమండ్రి డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
చిన్నారిపై సవతి తల్లి దాష్టికం.. వైరల్ వీడియో
చండీగడ్: క్యాన్సర్‌తో తల్లి మరణించడంతో అమ్మ ప్రేమకు దూరమైన చిన్నారికి ప్రేమను పంచాల్సిన ఓ సవతి తల్లి దాష్టికంగా ప్రవర్తించి కటకటాలపాలైంది. చండీఘడ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చండీగడ్ సెక్టార్ 29లో నివాసముండే ఓ మహిళ తన సవతి కూతురైన చిన్నారని సంచిలోకుక్కి చితకబాదింది. జుట్టు పట్టి, చెవులు పిండుతూ.. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసింది. అప్పటికే కాలు గాయంతో బాధపడుతున్న చిన్నారిపై కాస్త కనికరం కూడా చూపించలేదు. ఈ తతంగాన్ని ఆ చిన్నారి సోదరుడు సెల్ఫోన్లో చిత్రికరించడంతో విషయం బయటకు వెలుగు చూసింది. రెండు నెలల క్రితం ఆ చిన్నారి తల్లి క్యాన్సర్ మరణించడంతో తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతను ఆ కసాయి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నెటీజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. -
చిన్నారిపై సవతి తల్లి దాష్టికం.. వైరల్ వీడియో
-
సవతి తల్లి రాక్షసత్వానికి పరాకాష్ట ఆమె!
దాదాపు రెండేళ్ల పాటు 12 ఏళ్ల సవతి కూతురిని నానా రకాలుగా చిత్రహింసలకు గురిచేసింది ఆమె. చాలాసార్లు అన్నం పెట్టకుండా కడుపు మాడ్చింది. మెటల్ చిపురుకట్ట హ్యాండిల్‌తో ఓసారి తీవ్రంగా చితకబాదింది. దీంతో ఆ చిన్నారి మణికట్టు ఎముకలోతు వరకు తెగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. చాలాకాలం ఆమె ఆస్పత్రికే పరిమితమైంది. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ మహిళ పాపం పండింది. సవతి కూతురిని దారుణంగా హింసించిన భారత సంతతి మహిళ షీతల్ రానోత్ (35)ను అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. చిన్నారిపై దాడి చేసి.. ఆమె ప్రాణాలను అపాయంలోకి నెట్టినందుకు షీతల్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ క్వీన్స్ సుప్రీంకోర్టు జడ్జి రీచర్డ్ బచర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. చిన్నారి మాయాను దారుణంగా హింసించిన షీతల్ రానోత్ 'సవతి తల్లి రాక్షసత్వానికి పరాకాష్ట' అని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్ రిచర్డ్ బ్రౌన్ కోర్టుకు నివేదించారు. 'చిన్నారి మాయా ఎదిగేందుకు అవసరమైన కనీస మౌలిక అవసరాలు కూడా తీర్చకపోవడమే కాదు.. కావాలని చాలాసార్లు ఆ చిన్నారిని షీతల్ దారుణంగా హింసించింది. ఈనాటికి ఆ చిన్నారి శరీరంపై గాయాలు తాలుకూ మచ్చలు అలాగే ఉన్నాయి. 12 ఏళ్ల వయస్సులో ఆ చిన్నారి కేవలం 58 పౌండ్ల బరువు ఉన్నదంటే తన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ చిన్నారికి కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎదురుకావొద్దు' అని బ్రౌన్ ఆవేదన వ్యక్తం చేశారు. మాయా సొంత తండ్రి రాజేష్ రానోత్‌పై దాడి, అక్రమ నిర్బంధం, చిన్నారి సంరక్షణను పట్టించుకోకపోవడం వంటి అభియోగాలు మోపారు. ఈ అభియోగాలపై త్వరలో విచారణ జరుగనుంది. క్వీన్స్ ప్రాంతానికి చెందిన షీతల్ తరచూ సవతి కూతురిని హింసిస్తూ కొట్టేదని, ఒసారి తనకు చెప్పులు తొడుగుతున్న చిన్నారిని ముఖంపై తన్నిందని, దీంతో కన్ను ఉబ్బి.. ముఖమంతా చిన్నారి నొప్పితో విలవిలలాడిందని బ్రౌన్ తెలిపారు. డిసెంబర్ 2012 నుంచి మే 2014 వరకు చిన్నారిని తన బెడ్ రూమ్‌లో బంధించి హింసిందని, ఈ సమయంలో సరిగ్గా చిన్నారికి ఆహారం కూడా అందించలేదని వివరించారు. ఈ అభియోగాలను ధ్రువీకరించిన కోర్టు దోషిగా తేలిన షీతల్‌కు కఠిన శిక్ష విధించారు. -
సవతి కూతురి పట్ల ఇంత దారుణమా?
ఏడాదిన్నపాటు వేధించిన సవతి తల్లికి 25 ఏళ్ల జైలుశిక్ష వాషింగ్టన్: సవతి కూతురి పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా అమానుషంగా హింసించిందో ఓ మహాతల్లి. అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికకు ఏడాదిన్నరపాటు అన్నం, నీళ్లు ఇవ్వకుండా ఆకలితో మాడ్చివేసింది. అంతేకాకుండా చిన్నారిని చితకబాది.. ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడేలా చేసింది. భారత సంసతికి చెందిన ఆ సవతి తల్లి పాపం పండింది. అమెరికా కోర్టు ఆమెకు ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన సవతి కూతురు మాయా రతన్‌ను తీవ్రంగా చిత్రవధ చేసిన కేసులో షీతల్ రాతన్ను అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. 2014లో షీతల్ చిన్నారి మణికట్టును దారుణంగా కట్‌చేసి.. చిత్రహింసలు పెట్టిందని, దీనివల్ల ఆస్పత్రి పాలైన చిన్నారి దేహంపై ఇప్పటికీ సవతి తల్లి కొట్టిన దెబ్బల గుర్తులు అలాగే ఉన్నాయని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ పేర్కొన్నారు. అమానుషమైన చిత్రహింసలతో చిన్నారి మాయ ప్రాణాలను సవతి తల్లి ప్రమాదంలో పడేసిందని, ఎవ్వరూ కూడా చిన్నారుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించకూడదని, ఏ చిన్నారికి ఇలాంటి అవస్థ రాకూడని జడ్జి తీర్పు వెలువరిస్తూ పేర్కొన్నారు.